** ** ** **
Part13పెళ్ళి సంబరాలు ...పెళ్ళి యాత్రలు పూర్తి అయి ఇక కుటుంబం అంతా క్లినిక్ తెరిచారు ..లోపల డాక్టర్ రమణ ..తన రూ0 అంతా శుభ్రం చేయుంచుకుంటున్నారు ..బయట హాలు లో డాక్టర్ కిరణ్ ..వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ తో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ..ఇంతలో డాక్టర్ గారు ఉన్నారా ..సార్ అని పిలుపు వినబడి ..బైటకు వచ్చింది నర్సు ..ఉన్నారండీ ..అని క్రింద రెసిప్స్ న్ కూర్చో బెట్టి ..వివరాలు వ్రాసుకొంటూ ఉంది ...డాక్టర్ గారి రూమ్ లో తెల్ల కోటు పై స్టెత్ వేసుకొని కూర్చొని ఉన్న గీత ..ఆమె భర్త డాక్టర్ కిరణ్ ..మామ గారు డాక్టర్ రమణ కూర్చొని మాట్లాడుకొంటున్నారు ..డెంటల్ విభాగం క్రింద పెట్టేద్దాం నాన్న గారు ..మొత్తం ఒక వారం లో ఎస్టా బ్లిష్ చేసేస్తాం ..మీరు ఏమంటారు చెప్పండి
కొంచం బాబిడి హెయిర్ పైకి లాగుకొంటూ అడిగింది గీత ..చూడమ్మా ..నువ్వు ..అల్లుడు గారు చూసుకోండి ..నాకు ఫైనల్ గా చెప్పండి చాలు ..ప్లానింగ్ మీదే నమ్మా ..అని నవ్వుతూ చెప్పాడు డాక్టర్ రమణ ఇంత లో సార్ ..సార్ ..క్రింద పేషెంట్ వచ్చారు ..పైకి తీసుకు వస్తాను ..పైకి వచ్చి చెప్పింది ..నర్సు ..తీసుకురామ్మా ...క్లీనింగ్ ..అయిపోయుంది గా ..మరి ఒక పని చేయు నువ్వు కిరణ్ రూం లో కి తీసుకురా ...నేను కిరణ్ గారిని పిలుస్తాను ..అంటూ పక్కనే ఉన్న కిరణ్ కొత్త రూమ్ ని చూపించాడు ..పేషంట్ ను తీసుకొని తల్లిదండ్రులు డాక్టర్ కిరణ్ రూ0 లోకి వచ్చారు ...నమస్కారం డాక్టర్ గారు ...తల ఎత్తి చూశాడు .కిరణ్ ...రండి ..రండి ..లేచి నిలబడ్డాడు ....లోపలికి వస్తూ నే ఏమయ్యా .బాబూ నువ్వు ఇక్కడ ....? కొంచెము ఆశ్చర్యం గా అడిగాడు సుధ తండ్రి గారు ..నేను డాక్టరేట్ పూర్తి చేసుకోవడం ....వారి అమ్మాయిని ఇచ్చి వారి అల్లుడు గా చేసుకోవడం ..అంతా మా మామగారు డాక్టర్ రమణ గారి దయే ..ఆయనగారి చలువే..అలా కొద్దిసేపుఅన్ని విషయాలు మాట్లాడుకున్నారు ...ఇదంతా నిజమా ...కల కాదు కదా ఆలోచనల్లో పడింది సుధ తల్లి ..సరే ముందు నేను కేస్ స్టడీ రాసి డాక్టర్ గారి దగ్గరకు తీసుకొని వెళతాను ...అలా మొత్తం...వాళ్ళను అడగటం మొదలు పెట్టాడు వాళ్ళు అమెరికా సంభంధం. రావడం పెళ్ళి ..వాళ్ళు పెట్టిన కష్టాలు . ..ఆ తరువాత ఎన్నో సాధించాలి అనుకొని ..ఏమి చేయలేక ..చాలా కాలం వృధా చేసుకొని ...మాకు ..ఎవరికి ఏమి చెప్పుకోలేక ...అలా ఆలోచించి ..ఆలోచించి ..బాధపడి ..భయం భయం ప్రతిదానికి భయం అంటుంది ..ఒక్కతే వంటరిగా కూర్చొని అన్నీ ఆలోచిస్తూ అదే అదే ధ్యాస లో ఉండిపోతుంది ..తరువాత జీవితం లోకి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు రావడం లేదు తెచ్చుకోదు ..ఎంతో చెప్పిచూశాము ..అలా సుధ తల్లి చెబుతుంటే వివరాలు మొత్తం వ్రాసుకున్నాడు ..మరి నిద్ర ఎలా పోతుంది ..మంచిగా పడుకొంటుందా ..అడిగాడు డాక్టర్ కిరణ్ ..అది కూడా అంతంత మాత్రమే ..చెప్పింది సుధ తల్లి ..నువ్వే మొత్తం చెబుతున్నావు ..సుధ ఏం మాట్లాడవేం ..కొంచెము నవ్వుతూ అడిగాడు కిరణ్ ..తల వంచేసుకొంది సుధ
అబ్బా సుధా ...నీకు ఏమి పెద్ద జబ్బు ఏం కాదు ..మంచిగా తిను మంచిగా నిద్రపో కొద్ధి రోజుల తరువాత అంతా సర్దుకొంటుంది ...ఓ.కె చేయు పట్టుకొని ఊపాడు ..కిరణ్ ...సరే రండి ..డాక్టర్ గారి దగ్గరకు పోదాం ..అంతా కలిసి డాక్టర్ రమణ గారి రూమ్ లోకి వెళ్లారు ...పరిచయ కార్యక్రమాలు అన్ని పూర్తి అయిపోయాయి చూడండి అమ్మా ..ఒక టాబ్లెట్ రాత్రి పడుకొనే టప్పుడు.. ఒకటి ఉదయం వేయండి చాలు ...మొక్కలు పెంచడం ..సాయంత్రం షూ వేసుకొని వాకి0గ్ చేయడం ...ప్రశాంతమైన ఒక దేవాలయానికి వెళ్ళండి అక్కడ కాసేపు ధ్యానం గా స్వామిని చూస్తూ కూర్చోండి ..ఉదయం యోగా సాధన చేయు0చండి ..అలా కొన్ని సూచనలు ఇవ్వడం పూర్తి కాగానే అంతా బైటకు వచ్చారు ..మళ్ళీ డాక్టర్ సుధ తల్లిని పిలిచి వ0టరిగా మాట్లాడాడు ..మీరు కొద్ది రోజులు ఆమెను జాగ్రత్తగా కాపాడుకోండి వంటరిగా ఉంచొద్దు ..పైగా ఆమె అమెరికా ఫోటోలు ఇంకా ఏమైనా ఉంటే కళ్ళ ఎదురుగా ఉంచకండి ..ఇలా చెప్పి పంపించేశాడు..ఆ తరువాత .కిరణ్ ..తన భార్య ని పిలిచి పరిచయం చేశాడు ..అంతా కలిసి టీ తీసుకున్నారు .కొద్దీ రోజులు ఇక్కడ కు తీసుకు రండి నేను కౌ న్సిలింగ్ ఇస్తాను ..ఇక్కడ ఒక రెండు గంటలు మాతో గడుపుతుంది ....మీకు తెలుసు ఒకరి బాధ ని నేను అర్ధం చేసుకుని సహాయం చేసే వాడ్ని కానీ ..ఎక సఖ్యా లు ఆడే వాడ్ని కాదు ..మీ కు నా వంతు సహాయం చేసి సుధని బైట ప్రపంచం లో పడేయగలను ..మీరు నన్ను ఇదివరలో లా తీసి పడేయకండి ..నేను చెప్పేది వినండి అలా అంతా సర్ది చెప్పి అక్కడనుంచి పంపించేశాడు కిరణ్ ...
** ** ** ** **
సుధ ఇంట్లో పెద్దగా వినిపిస్తున్నాయి మాటలు ..యుద్ధం జరుగుతుంది ..చూడండి కిరణ్ ఎంత మంచిగా సెటిల్ అయ్యాడు ..అందివచ్చిన అవకాశం వదులుకున్నాము ..ఇద్దరిలో ఒక దాన్నివాడికి అంటగడితే ఒక విషయం లో ఆయునా జీవితం ప్రశాంతంగా చక్కగా ఉండేది ...అని సుధ తల్లి విసుగ్గా అరిచేస్తుంది ...ఏం చేయమంటావు ..నేను మంచిగ చదువుకోమని చెప్పా ఖర్చు అనుకోకుండా చదివిస్తాను అని చెప్పా ...వాళ్ళు ఆ పని చేస్తారని కల కనలేదుగా
విసుగ్గా చెప్పాడు సుధ తండ్రి ..అందుకే అండి.. పెళ్లివయస్సు రాగానే పెళ్ళి చేసిపారేసే వాళ్ళు పూర్వకాలంలో ..ఇలాంటి తల నొప్పులు ఉండవని ....ఆ ఇక చాల్లే నువ్వు చెప్పింది ...చేసిన తరువాత మాత్రం మంచిగా లేని కేసులు ఎన్ని లేవు ..మన పిల్లకి చేశాము గా పెళ్లి చేసి ఇదిగో ఇలాడిప్రెషన్ పడేశాము ..గా పెద్దగా మాట్లాడుతున్నాడు సుధ తండ్రి ...ఇక చాలు ..ఆపండి ..అది విని మరీ బాధ పడుతుంది ...కొద్దీ సేపట్లో మేము బయలు దేరి కిరణ్ దగ్గరకే వెళతాము రమ్మ నాడుగా....ఎం చేస్తాము వాడు వచ్చినప్పుడు అందరికి ఇగో తో పోజు లు కొట్టాము వాడు పల్లెటూరు వాడు అని ఇప్పుడు ..వాడే గతి...అదే దైవ లీల ..అలా ఇద్దరు భీకరంగా వాదించుకొని కిరణ్ క్లీనిక్కు కి బయలు దేరారు ....................(ఇంకా ఉంది ....to be continued................)
0 comments:
Post a Comment