Pages

🙏🌹బ్రాహ్మణులు లో లోపాలను దిద్దుకొని అందరూ ఐక్యం గా ఉండాలని చెప్పే వ్యాసం🙏🌹

🌷🌷🙏 ఓం నమో నారాయణా య 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏ఓం నమః శివా య🌷🌷🌷🌷

వైష్ణవులు వారిమనస్సుల్లోఇంకో దేవుడు ఉండడు ,వాళ్ళు ఇంకో గుల్లోకి వెళ్ళడం ఒప్పుకోరు ఇలాంటి  వ్యాఖ్యలు ఒక పురాణ 0 చెప్పే ఒక పండితుడు పదే పదే ఆ0టూ ఉన్న వ్యాఖ్యలపై  పై చిన్న మాట    అస్సలు వారి  మతం పేరు శ్రీ వైష్ణవ0 ..వారు శ్రీ మహా విష్ణువు ఆరాధకులు ..అస్సలు ఒక కులం వారు ఇంకోరి కుల సభకు వెళ్తారా అని ముందు ఆలోచించాలి ..కదా .....ఇక శంకరాచార్యులవారి అవతారం వచ్చి వెళ్లిపోయునతరువాత కొంతకాలానికి ఈ ఆరు మతాల వారు కూడా  కొట్టు కోవడం ,నాది గొప్ప అంటే నాది గొప్ప అని వాదనలు చేస్తూ దూషించుకోవడం మొదలుపెట్టారు ..ఎక్కువగా కొట్లాటకు దిగినవారు శైవులు ..వైష్ణవులు ...విష్ణువు అనువాడు ఒకడు ఉండెను ..స్థితికారకుడు ..ఆయనే లక్ష్మీపతి ..వారు కూడా ఆదిదంపతులే.అని చెప్పడం ..ఆ బొట్టుపెట్టుకొని తిరగడం ముందుగా నచ్చని వాళ్ళు శైవులు .లేదా ఆ ఆబొట్టు పెట్టుకొని తిరిగిన కొంతమంది మహానుభావులు ..మా వాడు తప్ప ఇంకెవరూ ఆయనకు సమానమైనవారు అస్సలు లేరు ..అని వాదించేవారు ..చివరికి అదిహింసా మార్గంలోకి వెళ్ళిపోయింది... వీరభద్రస్వామి కి వుండే ఒక పీఠం లాంటి పళ్ళెం తీసుకొని దానిని వీరభద్ర పళ్ళెం అంటారు ..దానికి అన్నీ ముళ్ళు ఉంటాయి ..దానిని బెట్టి వైష్ణవుల తల పై వేసే వాళ్ళు అలా చాలామంది వైష్ణవు లను ఘోరంగా చంపేశారు ...మరి వీళ్ళు ఎదురు దాడి చేయలేదా అనే సందేహం రావచ్చు .కానీ వీళ్లకు రాజ్యాలలో రాజుల తోడ్పాటు లేదు ఎక్కువ శైవులే రాజులు ..కొంతమంది వైష్ణవ స్వాములను పట్టి రాజులు. అధికారగ ర్వం తో ..చాలామంది కి శిరచ్ఛేదం, కనుగ్రుడ్లు పెకిలించిన సందర్భాలు చాలవున్నాయి .అలా జరుగుతున్న తరుణములో ..పోతన్న గారి లాంటి కవులు ఆ దారుణాలు చూడలేక ,సహించలేక ..శ్రీమద్భాగవతమ్ లాంటి సంస్కృత గ్రంధాలను ప్రచారం లోకి తేవాలని కంకణం కట్టుకొని స్వయానా ఆయన వైష్ణవ భాగవోతోత్తముడి గా మారారు అని ప్రాచీన గ్రంధాలు చెబుతూవున్నాయి ...మనం ఈ మధ్య కాలంలో కమలహాసన్ తీసిన విశ్వరూప్0  లో కూడా ఒక  ఆళ్వార్ ని శ్రీమహావిష్ణువు విగ్రహానికి కట్టి నీళ్ళ లో వేసిన ఘట్టం ఒకటి చూపబడినది ...అలాంటి వి ఎన్నో రాజుల పక్కన ఉండి వైష్ణవు ల పై జరిగాయి ...ఆళ్వారులు కొంతమంది అజ్ఞాతంలో అడవుల్లో దాక్కు0డిపోయారు ఇలా శైవులు అరాచకం విపరీతంగా పెరిగిపోయింది.చాలా మంది రాజులు వారికి వత్తాసు పలికేవారు .కొంతమంది అయితే శంకరాచార్యులవారిని ...సంకరాచార్యులు అని కూడా విమర్శలు చేసేవారు ...ఎందుకు స్వామి అని అడిగితే ఆయన అన్నీ కలిపేశాడని .అయ్యవారు ఒక్కరే కాదు అమ్మవారు కూడా ఉంది ..ఇంకా వారి పరివారం ఉంది ఇదంతా వివరించి ఆరాధనక్రమ0 ..సరిచేయడం వాళ్ళకు నచ్చలేదు .ఇక అలా కొంతకాలానికి మళ్ళీ కొన్ని అవైదిక మతాలు మళ్ళీ చిగురులు పెట్టాయి శైవులు తో విసిగి కోపం పెంచుకొని ...శైవులు శివుని ఆరాధిస్తారు ...వాళ్ళలో రాక్షసులు ఎక్కువ ఆ బొట్టే వాళ్లే చాలా మంది రాక్షసులు వాళ్ళను చూడరాదు ,వాళ్ళతో భోజనం చేయరాదు ఇలా. వైష్ణవు లు..కోపం ప్రద ర్శించే వారు ...ఇటువంటి సమయంలో ..వచ్చారు ఆదిశేషుని అవతారం శ్రీరామానుజా చార్యులవారు ...ఆయన.. వంద సంవత్సరాలు పైగా జీవించారు ...ఆయన ..మాట కు కూడా ఎవరూ పెద్దగా మొదట్లో విలువ ను ఇవ్వలేదు ....ఆయన కూడా చాలా సార్లు కొన్నిరాజ్యాల నుంచి మారువేష ము లో ..వేరొక చోటికి తప్పించుకొని దాక్కొనేవారు....ఒకరాజ్యములో రాజు కూతురికి ..పిశాచి బాధ పట్టుకొంది ..చాలామంది పండితులు శైవులు వల్ల అది కంట్రోల్ కాలేదు ...అప్పుడు రామనుజలవారు నేను వచ్చి తగ్గిస్తాను అని వర్తమానం పంపి 0చాడు ..అప్పుడు రాజుఆయనను ఆహ్వానించడం  నారాయణ కవచ స్తోత్రం.  తో  .......ఆ రోగం తగ్గిపోవడం అలా రాజు ఆదరణ లభించడం ...అక్కడినుంచి రామనుజలవారి సెకం ప్రారంభం అయ్యింది అని చెప్పవచ్చు. విష్ణు దేవాలయాలు ఇన్ని రావడం ..ఇంతమంది శ్రీవైష్ణవ పండితులకు ..పురోహితులు కు దేవాలయాలు ఏర్పడి ..వాళ్ళ భక్తి తత్వ0 కి..వాళ్ళ ఆగమాలకు  ప్రచారం రావడం ..వాళ్ళకి ఉదర పోషణార్థం ...కూడా లాభం జరగడం ..ఈ పుణ్యం అంతా రామనుజుల వారిదే అన్ని నిస్సందేహముగా చెప్పవచ్చు ..అయితే ..వైఖానుసు లు .ఈ శ్రీ వైష్ణవు లను హీనంగా చూస్తారు ..తిరుపతి  మార్గ దర్సకాలలో అతి పూర్వకాలంలో శ్రీమద్ భగవత్ రామనుజులవారు శ్రీ వైష్ణవ తెంగల్ శా ఖకు చెందిన వారు అయినా కూడా వారు చాలా ని స్వార్థం గా శ్రీవేంకటేశ్వర స్వామి వారి వద్ద విఖనస మహర్షి వారి ఆగమ పూజా విధానాన్నే అవలభించేలా ఏర్పాటు చేశారు అంతే ..కానీ వారి పెత్తనం ఉంది కదా అని పాంచరాత్రాగమము పెట్టలేదు ..అది వారి అవతార వైశిష్ట్యం ..ఏది ఏమైనా శ్రీవిష్ణు మతం లో ఉన్న ఏ అర్చక స్వామి వారు అయునా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహానికిముందుగా  తీర్ద్ పు పాత్ర ..శఠారి పెట్టుకొని కూర్చున్న వారు..నేనే గొప్ప అనే అహ0కారంఉండకూడదు కదా ..అది వదిలిపెట్టన్నప్పుడు ..ఎన్ని శాస్త్రాలు చదివినా ..ఎన్ని చోట్ల బొట్లు పెట్టుకున్నా స్వామివారు మాత్రం క్షమించడు ..గరుడుడు నేనే మహా బలవంతుడను అనే అబిప్రాయం చెప్పినప్పుడు ..స్వామివారు వారి ఒక చేతిని గరుడుడు పై పెట్టాడు ..ఇక కదలలేక ..బలం చాలక తప్పు తెలుసుకున్నాడు ..నీ బలం కు కారణం నేను ..అనే జ్ఞానం తెలియ చేసి కళ్ళు తెరిపించాడు ..కాబట్టి వైఖానుసులైన..శ్రీ వైష్టనవులైనా  ఇంకెవరైనా స్వామివారి ముందుకూర్చొని  వారి ప్రతినిధి గా వున్నప్పుడు అహ0కారంపనికిరాదు...శ్రీమద్.గురు రాఘవేంద్ర స్వామి గారి కి ఒక విషయం అనుకొనేవారట .బ్రాహ్మణులలో.ఇతరుల శాఖలు వారి వారి సిద్ధాంతాలు తో మీతో కలిసినా ..కలవకపోయినా..కనీసం. మీ ముగ్గురు అయినా...వైఖనసా.. శ్రీ వైష్ణవ మధ్వ శా ఖలు వారైనా  ఐక్యమత్య0 గా..ఉంటే బాగుంటుంది ..అని వారి అభిప్రాయం అట ...

ఇక ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాము

బ్రాహ్మణులు లో దేశమంతా 116 శా ఖలు ఉన్నాయి .ఎవరి ఇష్ట దైవం వారు ఆరాధించుకుంటున్నారు. కొంతమంది శంకరాచార్యులవారు చెప్పిన పంచాయతనం .పెట్టుకొని ఆరాధించుకుంటున్నారు .ఇలా రక రకాల గా దైవా రాధన నడుస్తోంది .ఇక్కడ మనం చూడవల్సినది ..వైష్ణవులు ...వీరవైష్ణవు లు అని రెండు రకాలు శైవులు ..వీరశైవులు లాగా వైష్ణవులు లోకూడా శ్రీవైష్ణవులు ..వైష్ణవులు అని మళ్ళి రెండు రకాలు .శైవులు లాగానే వైష్ణవులు ..కూడా కేవలం అయ్యవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు ..అమ్మవారిని ..పరివారం ను వాళ్ళు ఒప్పుకోరు ..తలచుకోరు ..వారిలో ఒకరు మధ్వ లు ..వారు కేవలం విష్ణువు ని మాత్రమే ఆరాధిస్తారు ..ఆయన పైననే అందరూ ఆధారపడతారు ...కాబట్టి ఆ స్వామిని తలుచుకుంటే ..చాలు.అని వారి సిద్దాంతం ఇంకా శ్యాక్తేయులు వారు శక్తి సంబంధించి ఆరాధన మాత్రమే ఉంటుంది ..కొండ గుహల్లో అమ్మవారిని మాత్రమే ఆరాధిస్తూవున్న రోజుల్లో శంకరాచార్యులవారు ...పక్కన శివలింగాలు కూడా పెట్టమని ఆజ్ఞాపించారు ....ఇద్దరు లేనిదే. సృష్టి ఎలా వచ్చింది ?అని వాళ్లకు నచ్చచెప్పారని కూడా చరిత్రగ్రంధాలలో ఉంది ...ఇక వైదికులు అనే వారు ఒక ప్రధానమైన శాఖ ఉంది ...వీరు వైదికసంభ0ధ మైన కార్యక్రమాలు నిర్వహిస్తూ పౌరోహిత్య0 చేస్తూఉంటారు ...అన్ని దేవుళ్ళని ఆరాధిస్తారు ...అందరి దేవుళ్ళ పూజలను చేస్తారు ...చేయిస్తారు ..వైదికులు.. వైదిక త్త్వం ..వేదం ప్రకారము నడుచుకునే వారు ..అని కదా ..శంకరాచార్యులవారు కూడా ..అలాంటి వారు అని నాఅభిప్రాయం ...జగద్గురువు లు అయి ఒక వైదికపూజ,లేక అర్చన విధానాన్ని ఒక రూపం లో కి శా స్త్రీయం గా తెచ్చిపెట్టారు ..అందుకే వైదికులు కాని ......వారి కి సంభందించిన పూజ్య పీఠాధిపతులు, లేక పీఠాలు కాని అన్ని దేవతా మూర్తుల దేవతలను ..దేవాలయాలు నిర్మిస్తున్నారు.. ఇది చాలా పవిత్రమైన అంశము ..గొప్పవిషయమే కదా .కాబట్టి వారిపేరు లొనే ఉంది వైదికులుఅని కాకపోతే అందరూ శైవం కు సంబంధించి న విభూది పుండ్రములు ధరిస్తారు  ....కాకపోతే ఈ విషయాన్ని కూడా విమర్శించే వాళ్ళు వున్నారు ...అన్నీ...వాళ్ళే చేస్తూ ఇంకో దేవత.ఆరాధకులను ..రానివ్వరు ...అడ్డబొట్టుపెట్టుకుని  అన్నింటిలోనూ వారేఉంటారు అందాక ఎందుకు అన్ని టీవీ ఛానల్స్ వాళ్లే  వైదికులేరాజ్యము ఏ లుతూ ఉంటారు వాళ్ళకే మొత్తం తెలుసు అనే అహ0కారము ఒకళ్ళు చేరితే చాలు మొత్తం వాళ్లవాళ్లనే అందరిని దింపుతారు ఆకాశవాణి లో వ్యుద్యోగాలు వాళ్ళవే అన్నిఛానల్లో  కూడాచాలామంది వారే .. ఇక ...ఎన్నిసార్లు చాగంటి వారు విష్ణు వు ను విమర్శించారో పాత వి ఆయ నవి.ఉపన్యాసాలు తీసి చూడండి ...ఈ మధ్య ఎందుకో కాస్తంతా తగ్గించారు ...చాలామంది వైదికులు కు విష్ణువుపడదు ...ఇప్పుడు మారుతూ వున్నారు ..శ్రీరాముడు ..శ్రీకృష్ణుడు ఆరాధనలో ఉండి కొంత మారుతూవున్నారు .ఓకే. బాగానే ఉంది అది వారి ఇష్టం కానీ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ..ఎక్కువ శాతం వారి పేర్లు విష్ణు వు పేర్లు కలిగి ఉంటారు ..సూర్యనారాయణ,శాస్త్రి   శ్రీనివాసశర్మ... లక్ష్మీపతి ..హరిశాస్త్రి.. రామకృష్ణ శాస్త్రి.. అలా ఉంటాయి .....అలా ఎందుకు .వారి దైవం పేరు ఏదో అదే పెట్టుకోవచ్చు కదా !..కానీ వైష్ణవులు కనపడితే రుస రుస లాడతారు ఎందుకో తెలీయదు. ..నా ఉద్దేశ్యం ప్రకారం అగ్ని..సంపదలు శివభగవానుడు జ్ఞానం,అధికారం  ఇస్తాడు ..సూర్యభగవానుడు....ఆరోగ్యాన్ని ఇస్తాడు ..శ్రీమహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ..అనే కారణం అయుండవచ్చు .అందుకే ..శివ దేవుని బొట్టు పెట్టుకుంటారు విష్ణువు పేరు పెట్టుకుంటారు ..ఎందుకంటే మోక్షం కావాలిగా అందుకు .  మళ్ళీనియోగు లలో ,వైష్ణవు లు  శైవులు శాక్తేయులు ఉంటారు . నియోగులలో లింగదారులు ఉంటారు ..వారు శివలింగాన్ని ధరిస్తారు చాగంటి వారు ,ఎస్.పి బాలు ,వీరు లింగధారులు ..ఇక శుద్ధ వైష్ణవు లు కూడా ఉంటారు ..మనం ఈ ఆధునిక కాలంలో చెప్పుకొనే ఆంధ్రావాల్మీకి ...వాసుదాసు గారు వావికోలను సుబ్బారావు గారు ,కంచర్ల గోపన్న గారు ...ఇంకా చాలామంది ఉన్నారు ..అస్సలు శ్రీ వైష్ణవ అనే శా ఖ పేరు లోనే వుంది.. వాళ్ళు విష్ణుఆరాధకులు  అని రామానుజులు శ్రీ చేర్చారు ..అమ్మవారు ని పట్టుకొని అయ్యవారికి చెప్పించుకోవడం ...తల్లి మనస్సు కొంచెం కోమలం కదా బిడ్డని మన్నిస్తూ తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ..తండ్రి కోపాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇప్పిస్తుంది అని శ్రీవైష్ణవ అని చెప్పారు .అటువంటి విష్ణుదేవతా కులం వారు లేక శాఖ వారు వేరే దేవుని విషయం వారి మనస్సుల్లో రాదేమిటి అని కొంతమంది పౌరాణికులు అడగడం కొంచెం ఆశ్చర్యము ...ఈ రోజుల్లో అందరూ అంత విధి గా పాటించడ0 లేదు ...ఎవరో చాలా కొద్ది శాతం చాదస్తం తో మాట్లాడుతున్నారు కానీ ...మిగిలిన వారు అన్ని దేవాలయాలు తిరుగుతూనే వున్నారు ..పైగా కొన్ని జాతక సమస్యలకు ...చాలామంది శ్రీ వైష్ణవ పండితులు శివాభిషేకం చేయంచుకోమనే వారు ...కొంతమంది కొద్దిశాతం వారు శుద్ధ వైష్ణవ0  ఉన్నమాట నిజమే ఉదాహరణకు అన్నమాచార్యలవారు ...ఆయన కు విష్ణువు దర్సనం కావాలని కొండలు,కోనలు తిరుగుతూఉంటే ..శివభగవానుడు దర్సనం ఇచ్చాడు ...కుదరదు ..స్వామి ..నా అన్వేషణ అంతా శ్రీమహావిష్ణువు ..ఆయనే స్వయంగా నాకు దర్శనం కావాలి ...అని ముందుకు వెళ్లిపోయాడు అన్నమయ్య....అలానే ..శా క్తేయులు కూడ అంటే ..వాళ్ళ.. కులం పేరే అది ...అస్సలు త్రిమూర్తులును  ఇంద్రుడుని కుబేరుడు ని   అమ్మవారు ...కి నాలుగు మంచము కోడుల్లాచేసుకొని అమ్మవారు పైన సింహాసనేశ్వరి లా కూర్చున్నది అని వాళ్ళు చెబుతారు ..కాబట్టి వైదికులు వారి శా ఖా పద్దతులే వేరు....వారిని మిగతా వారితో కల్పలేము ..అయితే ఇప్పుడు.... ఇప్పుడే ..శ్రీవైష్ణవు లు కూడా పౌరోహిత్యమ్ లోకి వస్తూవున్నారు ....వాళ్ళు కూడా శివాభిషేకం చేస్తూ ,చేయు0 చడం నేను విన్నాను ..అస్సలు బ్రహ్మ వైవర్తి  పురాణములో శివభాగవానుడే శ్రీమహావిష్ణువు ని సేవించేవారిలో మొట్టమొదటి భాగవతోత్తముడు అని చెప్పబడినది .సరే శివభగవానుడి గురించి చెప్పినప్పుడు శ్రీమహావిష్ణువు ఆయనను సేవిస్తాడాని ఇలా రెండు అభిప్రాయాలు కనిపిస్తూనేఉంటాయి పురాణాలలో అందుకే వాళ్ళిద్దరకు బేధం లేదు అని కదా .......    ఇప్పుడు వీళ్ళు అంటారు.ఎంతోకాలం ఎంతోమంది విష్ణుభక్తులు వారి పోరాటం జీవితాల్ని బలిపెట్టిన తరువాత ఇప్పటికి శివకేశవులకు బేధము లేదు అనే విషయం బైటకు వ్యాప్తి ఆయనది అనియు ,తిరుమల తిరుపతి క్షేత్రం కృతయుగం నుంచి వివిధ పేర్లు తో.. ఉన్నప్పటికీ ఇప్పటి యుగం లో ఉన్న మూర్తి ఎవరు అనే గొడవల్లోభగవత్ రామనుజలవారు కృషి తో ...అప్పటివరకు ఎంతో మంది వైష్ణవ భాగవతోత్తముల.. బలిదానము తో తానే స్వయంగా కదిలివచ్చి శ్రీమన్నారాయణుడు శ0ఖచక్రధారి అయి కలియుగరక్షకుడు గా నిరూపించ బడటం. రామానుజలవారు..వైష్ణవం.. ని శ్రీవైష్ణవం గా తీర్చి దిద్దటం తో వైష్ణవులకు ఈ నాటికి ..ఇప్పటికి సంపూర్ణ గౌరవం వచ్చింది అని చెప్పేవారు లేకపోలేదు . కొంతమంది పురాణ పండితుల బాధ ఏమిటంటే ..ఒకప్పుడు దేవాలయాలు శైవ విష్ణు ఏదైనా కూడా ..వైదికులు మాత్రమే ఉండేవారు ..అన్ని పూజలు వాళ్ళే చేసేసేవారు ..ఇప్పుడు రామానుజ మతాన్ని బహుళ ప్రచారం లోకి తెచ్చిన జీయర్ స్వామివారి కృషి వల్ల ..ఇప్పుడు దేవాలయాలలోను ..గ్రామాల్లో పట్టణాలలో ను పౌరోహిత్యం శ్రీ వైస్టనవులు కూడా చేస్తున్నారు ..ఇంత కాలం మహా శివలింగాన్ని పొడు వును బ్రహ్మ విష్ణువు కనుక్కోలేపోయారని ..ఆ కధ ప్రచారం చేసుకున్నారు ..తర్వాత క్రమంలో వైస్టనవులు ..ఇటువంటి కధ పద్మ పురాణంలో ఒకటి ఉంది ..శ్రీ మహా విష్ణువు ..వచ్చి పెద్ద అగ్ని పర్వతంగా నిలబడి ..శివ బ్రహ్మ లని అడిగితే ఆ అగ్ని తేజస్సు. శ్రీ మహా విష్ణు వే అని ఎవ్వరు చెప్పలేక పోతారు అలా 0టి కధ లు వైష్ణవ మతం వారి పురాణ కధలు బైటకు వచ్ఛాయు ..ఇక ఈ మధ్య కాలం లో కొన్ని దేవాలయాలలో వైస్టనవులు వాళ్ళ ఆగమ0 పెట్టి మొత్తం వైష్ణవ0 చేసేస్తున్నారు అని కొన్నాళ్ళు గొడవలు పెట్టారు ..ఇదంతా జీయర్ స్వామి వారి మీద కోపంతో ఆయాప్రసిద్ద పురాణ పండితులు ఆయన్ని ..పనిలో పని వైష్ణవ జనాలను కూడా..తిట్టి పారేస్తున్నారు..రాగ ద్వేషాలు ను పరిమితి లో పెట్టుకోవాలి లేదా తీసేయాలి..అని చెప్పే ఇరు వర్గాల వారు వాటిని పుష్టిగా పెంచుకొని కొట్టుకుంటూ వున్నారు 

అస్సలు రామానుజులు వారిది అద్వెతమే కానీ..... విశిష్ట మైన అద్వెతము ...అందుకే విశిష్టాద్వైతం ము అని రామానుజులవారి మతానికి పేరు  వచ్చింది ..ఎవరో కొంతమంది ఆళ్వార్లు మాత్రం 

వీర వైష్టవం పలుకులు పలికినవారే...ఎందుకంటే వారు మొట్టమొదటి మార్గదర్సక0గా నిలబడిన వారు ..కాబట్టి వారు తొణకరు బెణ కరు ..కదా గట్టిగా వారి సిద్ధాంతం ఏదో గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది ..

ఏది ఏమైనా ...రాజాశ్రయం పొందిన   వారుఅలా చెబుతున్నారు  అని కొంతమంది పురాణం చెప్పేవారి  ఆరోపణ  కానీ ఎవరో నాకు అర్థం కాలేదు ఒక వేళ జీయర్ వారు అనుకుంటే ..........     జీయర్ వారు కూడా యాదగిరి గుట్ట పై శివాలయాన్ని కూడా చాలా గొప్పగా నిర్మాణం చేయంచారు ..ప్రతీ వైష్ణవ ప్రముఖ క్షేత్రాల!లో శివుడు క్షేత్రపాలకులు గా ఉంటూ ఉంటాడు ఇది ప్రతి వైష్ణవ జనుల కు తెలిసినదే ....మరి జీయర్ స్వామి వారు అంటే కొంతమంది పౌరాణికు లు కు నచ్చదు ..వారి..పురాణకాలక్షేపం.. అస్సలేనచ్చదు 

అలానే జీయర్ స్వామి వారు చెప్పినట్లుగా వింటున్నారు కేసీఆర్ అన్నారు ......కానీ ..చండీ యాగం, రుద్రయాగం కేరళ వారిచే కొన్ని శైవయా గాలు కూడా చేయంచుకుంటూనే వున్నారు ....కొన్ని సందర్భాల్లో వైదికులు ,శైవులతో ఆ యాగం చేయుంచుకొండి ..అని కూడా కే సీ ఆర్ కు జీయర్ స్వామి వారు చెప్పారు ..అంతే కాదు శ్రీ శారదాపీఠం స్వరూపానంద స్వామి వారికి కూడా కేసీఆర్ కొంత భూమి ఆశ్రమం కోసం ఇచ్చి వారి సలహాలు కూడా కేసీఆర్ తీసుకుంటున్నారు కదా 

మరి  రాజాశ్రయం పొంది ..పిచ్చిపిచ్చి సలహాలు ఇస్తే ఇంతకాలం వారి సంబంధాలు బాగుండేవా?...ఏది ఏమైనా ...ఎవరి పీఠం వారు వారి వారి మతాయునులకు శిరోధార్యం ఆ విషయం కాదనలేము ....దాని విషయంలో ఈర్ష్య.. ద్వేప్షము ..జీయరు వారిపై. పెంచుకుంటే చేసేది ఏమీ లేదు ..శ్రీమన్నారాయణ డే అందరికి రక్ష

ఇక బ్రాహ్మణుల కు బ్రాహ్మణులే శత్రువులు ..అని చెబుతూ అంబేద్కర్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారం అని ..బ్రాహ్మణ విష సర్పాల కోరలు పీకేశాడ ని ...అందరి బ్రాహ్మణులు కు మొగుడు మా అంబేత్కర్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు 

దానితో అయినా అన్ని బ్రాహ్మణ వర్గాలు, అందులో అన్నిశాఖల వారు ఇకనైనా ఒకరి పట్ల ఒకరు ఈర్ష్య, అసూయ   ముఖ్య0గా ఆహ0కారం  వదిలేసుకొని బుద్దిగా కల్సి మెలసి ఉండాలని ...ఈ పాఠం బోధిస్తోంది ...ఇది సత్యం ...సత్యం ....సత్యం ..ముమ్మాటికీ సత్యం🌹🌹🌹

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online