Pages

Part 14 ...............!Short story nirikshana. నిరీక్షణ ....పార్ట్ 14 చిన్న కధ

       **                             **                                **

Part 14
కిరణ్ తల్లిగారు ఎలా అయితేనేమి ..వాళ్ళ ఊరును0చి వచ్చికొడుకు ఇంటిలో సెటిల్ అయుంది ..అక్కడ అన్ని అష్ట కష్టాలు పడ్డది కానీ ఇక్కడ ఏముంది చాలా హాయిగా ప్రశాంతంగా గడిచి పోతుంది ...తన ని తన కూతురిని    అన్ని ఇబ్బందులు ...జీవితం తో ఆడుకున్న ఆ మనుషులను కొట్టుకుంటూ లాక్కొచ్చి తన్ని  ..తగలెయ్యాలన్న కోపం తో రగిలిపోతుంది ....మరో ప్రక్క వాళ్ళ అమ్మాయి అరుణ  ఎక్కడ కి పోయివుంటుందో ...ఎలా వుందో మనస్సులో తలచుకొని బాధ పడిపోతుంది ...అవును ..చుట్టాలు ఎంతమంది వున్నా .   ఎప్పుడూ.. వాళ్ళ పిన్ని..తో  వాళ్ళ పిల్లలు కు ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది ..అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ....అలా ..ఆలోచనల్లో పడింది ..ఇంకే ఇక్కడ అడ్రెస్ అబ్బాయి ది ఉంది అది ఇచ్చి  .మా చెల్లెలు కి ఉత్తరం వ్రాస్తాను ..ఇక ఆపని లోపడిపోయుండి కిరణ్ తల్లి... ఆ రోజుల్లో ఉత్తరాలే ఫోన్ లు లేవు ..,వున్నా ఎక్కడో ల్యాండ్ ఫోన్ లు ఉండేవి......
ఇక అమెరికాలో ఉంటున్న శివ నారాయణ పరిశోధన అయిపోవడం ..డాక్టరేట్ రావడం ..సన్మానాలు అందుకోవడం ఆ బిజీ లో వున్నాడు ..సభ లో తనకు జరుగుతున్న సన్మానం పై వక్తలు మాట్లాడుతూవున్నారు ..శివ నారాయణ అతి బీద కుటుంబం నుంచి వచ్చి కూడా తాను అను కున్న లక్ష్యం పూర్తి చేసుకున్న ఘనత కలవాడు అని ..అతగాని పరిశోధ న..గురించి ఇతర శాస్త్రవేత్తలు అందరూ ప్రశంసలు కురిపిస్తూ వున్నారు ..సభా కార్యక్రమ0 లో శివనారాయణ కు ఘన సన్మానం పూర్తిఅయి ప్రసంగించడం మొదలుపెట్టారు ...నా తల్లిదండ్రులు ఇక్కడ ఇదంతా చూసి ఉంటే ..తప్పకుండా ..ఎంతో సంతోషి0చి ఉండేవారు మేము ఎంతో కష్టపడి కని పెంచి ఇంత వాడ్ని చేసిన శ్రమ వృధా పోలేదు ...మా కృషి మా కష్టం ఫలించింది అని ఎంత ఆనంద పడే వారో కళ్ళు  చెమ్మగిల్లుతు0టే చేతి రుమాలు తో అద్దు కున్నాడు ..ఇక ముఖ్యంగా మా చుట్టాల్లో దగ్గరి బంధువుల్లో ..ఎంతగా అగచాట్లు పడ్డమో నాకు అన్ని గుర్తు ఉన్నాయి .బీదరికమే కారణం ..మిత్రులు తెల్సిన వారు నాకు ఎంతగానో సహాయం చేశారు వాళ్ళను పేరు పేరు న గుర్తుకు తెచ్చుకొని వారికినమస్కారంచేసుకుంటువున్నాను
ఇలా కష్ట పడి చదువుకొని ..దేశాన్ని దాటి ఇక్కడకు వచ్చి పరిశోధన చేస్తానని ఏనాడు అనుకోలేదు ఇంత గా పరిశోధన చేయటం ..ఈ స్థాయుకి వచ్చే తెలివి తేటలు నాలో ఉన్నాయి అని  నాకు ఇంటర్ లొనే ఒక మిత్రురాలు గట్టిగా చెప్పేది
నేను ఏ రోజూ చెవికి ఎక్కించుకోలేదు కారణం  ..నా బీదరికం  ఇక  .ఈ సన్మానంనాకు వచ్చిన పేరు.కీర్తి ...నా నేస్తం  ..అరుణ కుమారి కి అంకితం ఇస్తున్నాను ..ఇప్పుడు ఆమె ఇక్కడ ఉంటే ఎంత బాగుండే దో ..మళ్ళీ కళ్ళు తుడుచుకు0టు నాడు .. .నాలో ఈఉన్నత చదువు కోసం  ఒక స్కూల్ వారు లోను ఇప్పించి ..సహాయం అందించారు వారిని నా జీవితం అంతా గుర్తు పెట్టుకుంటాను ..ఇలా. అమెరికాలో ఒక  సన్మాన సభలో  ప్రసంగిస్తూ ..బిజీ గా వున్నాడు ..శివనారాయణ .............(to be continued ............ఇంకా ఉంది )

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online