🥀పెద్దలతో అనుభవాలు ..ఆ జ్ఞాపకాలు🙏
బ్రాహ్మణులు లో ఎందరో మహానుభావులు వున్నారు .ఎందుకో.కానీ ఇంకో బ్రాహ్మణుడు ని ఆదుకోలేరు ..1996 లో ఆకాశవాణి లో ఎనౌన్సర్. వ్యుద్యోగాలు పడ్డాయి ..sc st bc లు పోగా oc లు కొన్ని ఉన్నాయి .మొట్ట మొదట కొత్తగూడెం కేంద్రం లో నా జర్నలిజం వ్యాసాలు పత్రికల్లో చూసిన మహమూద్ ఖాన్ గారు నాకు రేడియో లో చదివే అవకాశాలు ఇచ్చారు ..కొత్తగూడెం లో చేస్తూ పీజీ చదవటానికి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆకాశవాణి లో చేరాను ..ఒకపక్క చదువుకుంటూ నే సాయంత్రం నుంచి రాత్రి ముగించే వరకు ..ఇంకా బయటకు వెళ్లి ప్రోగ్రాములు చేసుకురావడం .ఇవి చేస్తుండేవాడ్ని ..పోస్ట్ లు పడుతూవుండేవినేను రీటన్ పరీక్ష ..వాయిస్ పరీక్ష ..ఇంటర్వ్యూ లు..చేస్తుండేవాడ్ని ..ఎన్ని టెస్ట్ లు వున్నా వాయిస్ పరీక్ష ముఖ్యం ..నా వాయిస్ మీకు తెలుసు ..ఎన్ని పోస్ట్ లు పడ్డా కూడా శాస్త్రి గారి కమిటీ నన్ను ఎంపిక చేసేది కాదు ...సరే కొంతమంది అన్ని అర్హతలు ఉన్నాయి మీకు అన్యాయం జరుగుతుంది కోర్టు కు వెళ్ళమాన్నారు ...కొంతమంది దగ్గరివాళ్ళు పోనిలే బ్రాహ్మణుడి..కే గాఇచ్చారు వదిలేయు అనేవారు ...అలా కొన్ని పొగుట్టుకున్నా ను ఇక అలా జరుగుతున్నప్పుడు 96 లో పరిమి నెంట్ పోస్టులకు ఎక్కువ స్థానాలు పడ్డాయి ..నా లాంటి వాళ్లపై వస్తున్న వ్యాఖ్యలు తో డైరెక్టర్ శాస్త్రి కమిటీ అప్రమత్తమై మా బ్యాచ్ ని ఏ 0పిక చేశారు ....ఈలోపు కొంతమంది అసహనం తో పేపర్ లో పోస్ట్ లు అమ్ముకుంటున్నారని వార్త ఇచ్చారు ...దానితో మమ్మల్ని ఎంపికచేసిన పైనల్ లిస్ట్ ..ఢిల్లీ కి పంపిస్తున్న టైం లో సీబీఐ వాళ్ళు పేపర్ లో వార్త ఆధారంగా దాడి చేసి మొత్తం మా పరీక్ష పేపర్లు ...మేము వాయిస్ టెస్ట్ టేపులు అన్ని వేసుకుపోయారు .సంవత్సరాలు గడిచిపోయినా ఏ రిజల్ట్ లేదు ..మా నాన్నగారు కొంతమంది పెద్దలతో మాట్లాడి అవి సీబీఐ వాళ్ళు ఢిల్లీ మెయిన్ ఆఫీస్ లో ఇచ్చేశారు అని తెలుసుకున్నారు ....మళ్ళీ ఇక్కడనుంచి నాన్న గారి కి హిందీ బాగా వచ్చు కదా లెటర్స్ డ్రాఫ్ట్ చేసి మాకు న్యాయం చేయండి అని పంపిస్తూ వుండే వాళ్ళం ..కొంతకాలానికి ఢిల్లీ నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడు ..వచ్చేటప్పుడు ఆ పేపర్లు ..ఆ టేపులు అన్ని తెచ్చి పరీక్ష చేశాడు ..చివరికి అందులో ఏవో లోపాలు ఉన్నాయి అని రిపోర్టు ఇచ్చాడు ..ఆ రిక్రూట్ మెంట్ మాఫీ చేసేయ మని ఫైల్ లో వ్రాసి ఢిల్లీ లో పడేసిపోయాడు ..ఇక రిజర్వేషన్ వర్గం వారికి వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయారు ..ఇక బ్రాహ్మణులంబీసీ వారు .మేము అందరం కోర్టు కు వెళ్ళాము అప్పట్లో నూతి వారు మంచి పేరున్న వారు ..వారి న్యాయం వాదించి ..మా కు లాభము చేస్తాను అన్నారు ..కానీ ఈ లోపు వారు జడ్జి అయిపోయి ..కేసులన్ని వాళ్ళ శిష్యుడి కి అప్పగించారు ...ఆ లాయర్ గారు ఇలా ఫైల్ చేశారు పరీక్ష పేపర్లు అన్నిచూశారు కదా .వ్యుద్యోగ ఫలితాలు చెప్పండి అని వేశారు ..హైకోర్టులో ..అలా ఎదురు చూస్తున్నాం అందరూ హైదరాబాద్ లో అద్దెలు కి వుంటూ న్న చాలా బీద బ్రాహ్మణ కుటుంబాలు అందరివి ....ఇంతలో నాకు పెళ్లి అయిపోయుంది ...కోర్ట్ లో వేశాం కాబట్టి మమ్మల్ని అందరిని స్టేషన్ కి రా వద్దు అన్నారు ..ఇక అలా కోర్టులో ఉంది మేము లాయర్ గారి ని కలుస్తూనే ఉన్నాం ..ఇంతలో మా ఆవిడ కూడా కొన్ని విన్నపాలు గా చెప్పింది ..లాయర్ గారు మీరు పరీక్ష రిజల్ట్స్ అని అడగవద్దు అలా అడిగితే అవి మాఫీ చేశారు లేక క్వాష్ చేశారు అనే ఢిల్లీ వాళ్ళ కాగితం ..చూపించేస్తారు ..కాబట్టిఅలా వద్దు మా పరీక్ష పేపర్లు ..మా వాయిస్ లుతెప్పించి విని పరిశీలించి న్యాయం చేయండి ఎందుకంటే ఢిల్లీ నుంచివచ్చిన అధికారి కి తెలుగు రాదు ఆయనఏకే పాడి అనే ఒరిస్సా వారు ..ఆయన తెలుగు లోని పేపర్లు. ని..పరీక్ష ఎలా చేయగలడు ..తెలుగుభాష రాని వాడ్ని ఎందుకు పంపారు అని కేసు ఫైల్ చేయండి ..ఒక రిక్వెస్ట్ గా చెప్పింది ...వాళ్ళు వినరు కదా ..ఇక ఆతర్వాత చాలా సం లు గడిచిపోతున్నాయు ..ఎవరి దారివాళ్ళు బ్రతుకు తెరువు కి వెళ్లిపోయారు ..ఇక నేను విస్సాటీవీ చానల్ అలా కొన్ని0టిలోకి వెళ్ళి బండి లాగు తూ వున్నాను ..శోభా రాజు గారు మా నాన్నగారు ని గురువులు గా భావిస్తూ ..ఎన్నో సన్మానాలు చేశారు .. హిందీ భాష లో వారు కీర్తనలు చేస్తున్నప్పుడు సంస్కృత హిందీ వృద్దు పదాలు బాగా లోతుగా అధ్య యన 0 చేసుకొనే సందర్భంలో నాన్న గారితో బాగా మాట్లాడుతూ వుండే వారు ..వారి ఇచ్చిన ఒక అవకాశముతో నాన్న గారు కేంద్ర మంత్రి అరుణజైట్లీ అన్నమాచార్య సభ లో వక్త లు ..అప్పుడు జైట్లీ నాన్న గారికి పాద నమస్కారం చేశారు ..అప్పుడు హిందీలో విన్నపం గా మొత్తం పక్కన కూర్చొని వివరించారు ..ఇన్సాప్ కరూ0గా కరూంగా ..అన్నారు ..వారు కూడా ఏమి పట్టి0చుకోలేదు ..తరువాత జైపాల్ రెడ్డి ని చాలా మంది ని కల్సి లేఖ లు ఇచ్చాం ..ఏ ఉపయోగం జరుగలేదు .ఇక ఇంతలో మొత్తం రేడియో..అండ్ డి.డి శాఖకు తెలుగు సీనియర్ ఐఎఎస్ ఒక రు మన వాళ్లే వచ్చారు ఇండియా మొత్తం ఆ శాఖ ఆయన చేతిలో ఉంది ..అని తెల్సింది వారిది బంజారాహిల్స్ లో నివాసం అని పేరు చెప్పి పట్టుకోమన్నారు అప్పటి తెలుగు యూనివర్సిటీ వీసీ సుబ్రహ్మణ్యం గారు ..నాన్న గారిని ..నాది పీహెచ్ డి కదా తెలుగుయూనివర్సిటీ లో ఏమైనా ప్రొఫెసర్ ఉద్యోగం కాంటాక్ట్ బేసిస్ దొరుకు తుందేమో అనే ప్రయత్నం మీద వెళ్లారు ...సుబ్రహ్మణ్యం గారు నాన్న గారు ఇద్దరు విశ్వనాధ వారి శిష్యులే ..ఇద్దరు నాగఫణి శర్మ గారి అవధానం లో కలుసుకున్నారు ..అలా స్నేహము మీద వెళ్ళితే ..ఆయన గారి యూనివర్సిటీ లో ఖాళీ లు ఏమి లేవు అని చెప్పి, ఆగిపోయిన..ఆకాశవాణి వ్యుద్యోగ0 కోసం ఆ తెలుగు సీఈఓ గారిని పట్టుకోండి అన్నారు ..ఇక నాన్నగారు 70 ఏళ్ల మనిషి ఆ పేరు ఒక కాగితం పై వ్రాసుకొని ..ఒక సీసాలో మంచి నీరు పోసుకొని మంచి ఎండల్లో నన్ను లాక్కొని వెళ్లారు ప్రతి ఇల్లు నేమ్ బోర్డ్ వెతకడం ప్రారం భించాము ఇక అలిసిపోయి రోడ్డు పక్కన ఒక చెట్టు క్రింద శాలువా పెట్టుకొని నిద్ర పోయారు ..అలా వెతికి వెతికి అలసిపోయి అలా కాదని ఇంకోరి సహాయంతో వారి అడ్రసు వెతికి ఇల్లు పట్టుకొనివెళ్లారు ..వారు ఢిల్లీ వెళ్లారు అక్కడే ఎక్కువ వుంటారు ..ఎప్పుడో కానీ వారు రారు అంటే . కొన్ని అర్జీ లు వ్రాసి ఇచ్చి వచ్చారు వారి pa గారికి ...ఇక అది అలా జరిగిపోయు రోజులు గడుస్తున్నాయి ..ఇంతలో నను పెద్ద చదువులు వైపుకు మళ్లించి .నేను ఇన్ని డిగ్రీలు చేయడానికి మదిలో ఆలోచనలు రేకిత్తించిన వ్యక్తి నా ప్రియ మిత్రుడు డాక్టర్ కుమార్ అన్నవరపు ..మా ఊర్లోనే పక్క బజారులో వారి ఇల్లు ... వారి నాన్నగారు కూడా టీచరు ..మన వాళ్ళ పిల్లలు ఏదైనామంచి ఉన్నత చదువులు పదవులు సాధి0చాలనిఎంతో సపోర్ట్ ఇస్తూవుండేవారు ..బాగా ధైర్యం మెండుగా ఉన్న మనిషి ..ఈ కుమార్ మా సత్తుపల్లి కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఫాదర్ ఆఫ్ జర్నలిజం ..మంచి జర్నలిస్ట్ గా ఎదిగిఅది ఒక రంగం ఉంది అని మా కు తెలియ చెప్పాడు..ఆయన ఉదయం లో పనిచేసే వారు ...గ్రామాల్లో జనం ఆయన కాళ్ళమీద పడిపోతుండే వారు ..సార్ మాగురించి వ్రాయండి ..మా పంట నష్ట పోయిన పొలాల గురించి వ్రాయండి అని కొబ్బరి బొండాలు కొట్టితెచ్చి అందిస్తూ ప్రాధేయపడేవారుఇక అలా .ఆరోజుల్లో మేము అంతా జర్నలిస్టులు అయిపోయి ..అక్కడ పనిచేసి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ పత్రికా ఆఫీస్ లో పనిచేయడం మొదలుపెట్టాం .కుమార్ ..కి ఇంకా పెళ్ళి కాలేదు చిన్న వయస్సు ..మేధస్సు అమోఘం ..ఆ రోజుల్లోనే కుమార్ ని రామోజీరావు గారు దగ్గర పెట్టుకున్నారు ..ఈనాడు లో మెయిన్ పేజీ లో మంచి గమత్తు అయిన హెడ్డింగ్ లు పెట్టె బాధ్యత ను ఎంతో నమ్మకం తో ఇచ్చారు ..కొన్ని మెయిన్ పేజీ కధనాలు కూడా ఇచ్చేవారు ....ఇద్దరం 1990 లోసోమాజిగూడా లో ఈనాడు దగ్గరే రూ0 తీసుకొని .వండుకొని తినే వాళ్ళం నా పత్రికా అనుభవంతో రేడియో కి వెళ్ళాను ..కుమార్ గారు అనంతపురం లో డాక్టరేట్ కోసం జాయిన్ ఆయు నన్ను కూడా ఉస్మానియా లో రిసర్చికోసం ఎంట్రెన్స్ వ్రాయమని ప్రోత్సహించడం ..చదివి కృషి చేసి సీటు కొట్టడం అలా నేను రేడియో ..కి ఆయన ఢిల్లీ కి వెళ్లడం ..విద్య పత్రిక విజయవాడలో స్థాపించడం నేను రేడియో లో తిరగడం అలా వేరుపడిపోయాము ..కొంత కాలానికి ..మా ఊరు మళ్ళీ వచ్చినప్పుడు మా తమ్ముడి ద్వారారేడియో కేసు గందరగోళం తెలుసుకొని నాకు సహాయం చేయాలని హైదరాబాద్ లో కల్సి నన్ను తీసుకొని ఆ సీఈవో ఐఏఎస్ గారు నాకు బాగా పరిచయం అని వారి ఇంటికి తీసుకెళ్లి మంచి వ్యుద్యోగం లేదు జీవితంలో ఇంకా స్థిరపడ లేదు అని చెప్పి మీరు సహాయం చేయండి మా ప్రెండ్ కి అని కుమార్ నేను ఇద్దరం కాళ్ళు పట్టుకొని వదల లేదు ..ఇక ఆతరువాత వారు ఢిల్లీ లో కలవమన్నారు .. ఢిల్లీ లొనే ఉంటున్నకుమార్ ..నా కేసు డిటైల్స్ తీసుకొని వెళ్లి కలిసి మాట్లాడి వచ్చాడు ...కాల0 అలా అలా స0వత్సరాలు..కదిలిపోయుంది ఏమి జరగలేదు ..మళ్ళీ కొంత కాలానికి నాన్నగారు గుంటూరు శే షేంద్ర శర్మ గారి ఇంటికి వెళ్లే వారు ..ఇద్దరూ విశ్వనాథ వారి శిష్యులే ..అలా ఒక సందర్భములో తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో ఒక సభ..దానిలో నాన్న గారుశేషే0ద్ర శర్మ గారు మల్లెమాలఈ రేడియోమఱియు డి.డి కేంద్రసి ఈ ఓ గారు వున్నారు వీరు అంతా వక్త లు ..శేషేంద్ర శర్మ గారు మొత్తం ఇంగ్లీష్ లో ప్రసంగం చేశారు...దానికి మల్లె మాల రెడ్డి గారికి కోపం వచ్చింది ..ఇక అప్పుడు సభ ముగిసే లోపు రేడియోజాబ్ ఆగిపోయిన బ్రాహ్మణులు ..అందరూ పెళ్ళాం పిల్లలు తో సహా అక్కడకు చేరుకున్నాం నేను కూడా మా సిస్టర్ మానసిక వికలాంగురాలు ని తీసుకొని మా కుటుంబం వారు అందరూ వచ్చారు కొద్దిరోజుల్లో ఆ సీఈవో గారి పదవీ కాలం ముగిసిపోతుంది ..కాబట్టి చివరి ప్రయత్నం గా అందరం సభా స్థలి కివచ్చి వారిని కలిసి ..మీరు దిగిపోయే ముందు మా ఫైల్ పై సంతకం చేసి మాకు భృతి కల్పించండి అని అందరూ ప్రాధేయ పడి అడిగారు ..ఇక నేను చేయటం కుదరదు అండి ..నేను చేయలేను ..నావల్ల కాదు ఆ పని అందరికి నమస్కారం? అని అక్కడనుంచి వెళ్లిపోయారు ..ఆ బ్రాహ్మణ సి.ఈ వో గారు ..అక్కడితో ఆఖరి ప్రయత్నం కూడా అయిపోయుంది ..కొంతకాలం గడిచింది .మళ్ళీ కోర్టు తీర్పు కోసం ఎదురు చూసిన మా పెద్దవాళ్ళు పోయారు ..ఇక కొంతకాలానికి కోర్ట్ తీర్పు ఇచ్చింది ...మాఫీ చేసిన విధానం ఒకప్రభుత్త్వఅధికారిక సంస్థ ...దానిని తప్పు బట్టడం ప్రశ్నించడం చేయకూడదు .మూసుకోండి ఇక అని కోర్టు గొప్పగాతీర్పు చెప్పింది ..ఇక ఆ జడ్జిమెంట్ కాగితాలు తీసుకొని నాఫ్రెండ్స్ కొంతమంది జడ్జీలయ్యారు ..వాళ్ళ దగ్గరికి వెళ్ళాను .నాకు అన్యాయం జరిగింది పై కోర్టు కి వెళదాం అంటే ..ఇక ఈ జడ్జి లు మనవాళ్లే కానీ ..ఎందుకో పప్పుచారు మాటల మాట్లాడటం మొదలుపెట్టారు ..ఎందుకు స్వామి టైమ్ వేస్ట్ ..అది లేకపోతే బ్రతకాలేమా అని చాల్లార్చారు ....అది కాదు నా బాధ నేను అన్ని రకాల ప్రతిభ ఉండి అన్యాయం గా ఒడిపోయాను అని నాబాధ ..ఇక మన వాళ్ళు వల్ల కాదనిబొజ్జా తారకం గారిని కలుసుకొని నా బాధ చెప్పి ఫైలు ఇచ్చాను ..అప్పుడు వారుపెద్ద ఏజ్ లోవున్నారు .కొంచెము.అస్వస్థత తో వున్నారు..మళ్ళీ వచ్చి కలవండి..కొంచెముటైం ఇవ్వండి చదువుతాను అన్నారు కొంతకాలం గడిచింది ఈ లోపు అక్కడ నా ఫైలు మిస్ అయిపోయుంది ..వారి అసిస్టెంట్ గారు ఎలానో నా ఫైలు సంపాదించి కేసు ప్రారంభించారు ...ఇదిగో ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంస్థ తో పని పడింది కొత్త లాయర్ గారు ఒక విషయం అడిగారు ..మీరు ఆ ఒరిస్సా అధికారి ..ఫైలు లో ఏమి వ్రాశాడో ..తెలిస్తే ..మన0 కొంచం తేలిగ్గా కేసులో ముందుకు పోవచ్చు అన్నారు ..నేను అప్లై చేశాం ఆ లెటర్ కోసం ..అప్పుడు ఆ ఇన్ఫెర్మేషన్ యాక్ట్ లో అప్లై చేశాం ..వాళ్ళు కుదరదు ఇవ్వడం అన్నారు ..అప్పుడు ఈ విషయాలు మొత్తం మాడభూషి వారికి మెయిల్ లోను ఫోన్ మెస్సేజ్ లోను వారిని సంప్రదించాను .ఈ విషయంలో .నేను కూడా ఏమి చేయలేను అన్నారు .....ఇక కొంత కాలం అలగడిచిపోయు0ది ...రేడియో దూరదర్శన్ కి కి కూడా కాల0 చెల్లిపోయుంది ఇప్పుడు ఆ చూసేవాడు వినేవారు ఎవ్వరూ లేరు కాబట్టి ..ఆ శ కం ముగిసిపోయింది .. పాత వారు ఎమో కానీ ఈ మధ్య ...ఇప్పటికి నావాయుస్ కొట్టే వాళ్ళు అందులో కి రాలేదు ..అది సరస్వతీ అమ్మవారి ప్రసాదమే ..కాక పోతే సాహిత్యం కళలు సినిమా రంగం వారు ..పెద్ద పెద్ద ఐఏఎస్ఉద్దండులని కలిసి ఇంటర్వ్యూ లు చేశాను.శ్రీమాన్ ..పుట్టపర్తి నారాయణా చార్యులు గారిఅమ్మాయి డా౹౹నాగపద్మినిగారి దగ్గర ,కలగా కృష్ణ మోహన్ గారి దగ్గర హైదరాబాద్ బ్రదర్స్ శేషా చార్యులు గారి వద్ద విల్సన్ హెరాల్డ్ గారి వద్ద ఇంకా ఎందరో గొప్పవారి వద్ద హైదరాబాద్ కేంద్రం లో పనిచేశాను అది అలా అమ్మవారు కల్పించిన భాగ్యమే .. ..ఇక ఆ తరువాత ప్రవైట్ టీవీ చానల్స్ లో చేస్తూ మెల్లగా టీచింగ్ వైపు కి వెళ్ళిపోయాను .పరీక్ష తప్పాను మెరిట్ రాలేదు అంటే బాధ పడం కానీ అర్హతలు అన్నీ ఉండి ..అన్ని పరీక్షలు పాసై తినే దాకా వస్తే నేల పాలు చేయడం సహించ లేక పోరాటం చేశాను....కాలేదు ..అంతే
ఇప్పటికీ ఇంకో తెలుగువారు వే0పటి ..వారు మొత్తం దేశానికి ఆకాశవాణి డిడి సీ ఈ ఓ గా వచ్చారని తెలిసి వారికి కూడా కొద్దీ సం౹౹ల క్రితం అన్నివిషయలు వ్రాసి న్యాయం చేయమని లెటర్ పెట్టాను .ఇప్పటికీ లెటర్ నెట్ లో కనిపిస్తుంది అనుకోండి ..కాల0 గడిచిపోయింది ...ఇప్పుడు రేడియో దూరదర్శన్ లకు ఆదరణే..పోయింది ...ఇక ఆ సెకం ముగిసిపోయింది .............. .స్వస్తి
0 comments:
Post a Comment