కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🌷🙏బ్రహ్మ పురాణం లోని ఈ ఘట్టం జాగ్రత్తగా వినండి ..చివర్లో స్తోత్రం చదివిస్తారు ..అది విని తరించుదురుగాక🌷🙏
Part 14 ...............!Short story nirikshana. నిరీక్షణ ....పార్ట్ 14 చిన్న కధ
** ** **
Part 14కిరణ్ తల్లిగారు ఎలా అయితేనేమి ..వాళ్ళ ఊరును0చి వచ్చికొడుకు ఇంటిలో సెటిల్ అయుంది ..అక్కడ అన్ని అష్ట కష్టాలు పడ్డది కానీ ఇక్కడ ఏముంది చాలా హాయిగా ప్రశాంతంగా గడిచి పోతుంది ...తన ని తన కూతురిని అన్ని ఇబ్బందులు ...జీవితం తో ఆడుకున్న ఆ మనుషులను కొట్టుకుంటూ లాక్కొచ్చి తన్ని ..తగలెయ్యాలన్న కోపం తో రగిలిపోతుంది ....మరో ప్రక్క వాళ్ళ అమ్మాయి అరుణ ఎక్కడ కి పోయివుంటుందో ...ఎలా వుందో మనస్సులో తలచుకొని బాధ పడిపోతుంది ...అవును ..చుట్టాలు ఎంతమంది వున్నా . ఎప్పుడూ.. వాళ్ళ పిన్ని..తో వాళ్ళ పిల్లలు కు ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది ..అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ....అలా ..ఆలోచనల్లో పడింది ..ఇంకే ఇక్కడ అడ్రెస్ అబ్బాయి ది ఉంది అది ఇచ్చి .మా చెల్లెలు కి ఉత్తరం వ్రాస్తాను ..ఇక ఆపని లోపడిపోయుండి కిరణ్ తల్లి... ఆ రోజుల్లో ఉత్తరాలే ఫోన్ లు లేవు ..,వున్నా ఎక్కడో ల్యాండ్ ఫోన్ లు ఉండేవి......
ఇక అమెరికాలో ఉంటున్న శివ నారాయణ పరిశోధన అయిపోవడం ..డాక్టరేట్ రావడం ..సన్మానాలు అందుకోవడం ఆ బిజీ లో వున్నాడు ..సభ లో తనకు జరుగుతున్న సన్మానం పై వక్తలు మాట్లాడుతూవున్నారు ..శివ నారాయణ అతి బీద కుటుంబం నుంచి వచ్చి కూడా తాను అను కున్న లక్ష్యం పూర్తి చేసుకున్న ఘనత కలవాడు అని ..అతగాని పరిశోధ న..గురించి ఇతర శాస్త్రవేత్తలు అందరూ ప్రశంసలు కురిపిస్తూ వున్నారు ..సభా కార్యక్రమ0 లో శివనారాయణ కు ఘన సన్మానం పూర్తిఅయి ప్రసంగించడం మొదలుపెట్టారు ...నా తల్లిదండ్రులు ఇక్కడ ఇదంతా చూసి ఉంటే ..తప్పకుండా ..ఎంతో సంతోషి0చి ఉండేవారు మేము ఎంతో కష్టపడి కని పెంచి ఇంత వాడ్ని చేసిన శ్రమ వృధా పోలేదు ...మా కృషి మా కష్టం ఫలించింది అని ఎంత ఆనంద పడే వారో కళ్ళు చెమ్మగిల్లుతు0టే చేతి రుమాలు తో అద్దు కున్నాడు ..ఇక ముఖ్యంగా మా చుట్టాల్లో దగ్గరి బంధువుల్లో ..ఎంతగా అగచాట్లు పడ్డమో నాకు అన్ని గుర్తు ఉన్నాయి .బీదరికమే కారణం ..మిత్రులు తెల్సిన వారు నాకు ఎంతగానో సహాయం చేశారు వాళ్ళను పేరు పేరు న గుర్తుకు తెచ్చుకొని వారికినమస్కారంచేసుకుంటువున్నాను
ఇలా కష్ట పడి చదువుకొని ..దేశాన్ని దాటి ఇక్కడకు వచ్చి పరిశోధన చేస్తానని ఏనాడు అనుకోలేదు ఇంత గా పరిశోధన చేయటం ..ఈ స్థాయుకి వచ్చే తెలివి తేటలు నాలో ఉన్నాయి అని నాకు ఇంటర్ లొనే ఒక మిత్రురాలు గట్టిగా చెప్పేది
నేను ఏ రోజూ చెవికి ఎక్కించుకోలేదు కారణం ..నా బీదరికం ఇక .ఈ సన్మానంనాకు వచ్చిన పేరు.కీర్తి ...నా నేస్తం ..అరుణ కుమారి కి అంకితం ఇస్తున్నాను ..ఇప్పుడు ఆమె ఇక్కడ ఉంటే ఎంత బాగుండే దో ..మళ్ళీ కళ్ళు తుడుచుకు0టు నాడు .. .నాలో ఈఉన్నత చదువు కోసం ఒక స్కూల్ వారు లోను ఇప్పించి ..సహాయం అందించారు వారిని నా జీవితం అంతా గుర్తు పెట్టుకుంటాను ..ఇలా. అమెరికాలో ఒక సన్మాన సభలో ప్రసంగిస్తూ ..బిజీ గా వున్నాడు ..శివనారాయణ .............(to be continued ............ఇంకా ఉంది )
🙏పెద్దలతో అనుభవాలు ..!కొన్ని జ్ఞాపకాలు🥀
🥀పెద్దలతో అనుభవాలు ..ఆ జ్ఞాపకాలు🙏
బ్రాహ్మణులు లో ఎందరో మహానుభావులు వున్నారు .ఎందుకో.కానీ ఇంకో బ్రాహ్మణుడు ని ఆదుకోలేరు ..1996 లో ఆకాశవాణి లో ఎనౌన్సర్. వ్యుద్యోగాలు పడ్డాయి ..sc st bc లు పోగా oc లు కొన్ని ఉన్నాయి .మొట్ట మొదట కొత్తగూడెం కేంద్రం లో నా జర్నలిజం వ్యాసాలు పత్రికల్లో చూసిన మహమూద్ ఖాన్ గారు నాకు రేడియో లో చదివే అవకాశాలు ఇచ్చారు ..కొత్తగూడెం లో చేస్తూ పీజీ చదవటానికి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆకాశవాణి లో చేరాను ..ఒకపక్క చదువుకుంటూ నే సాయంత్రం నుంచి రాత్రి ముగించే వరకు ..ఇంకా బయటకు వెళ్లి ప్రోగ్రాములు చేసుకురావడం .ఇవి చేస్తుండేవాడ్ని ..పోస్ట్ లు పడుతూవుండేవినేను రీటన్ పరీక్ష ..వాయిస్ పరీక్ష ..ఇంటర్వ్యూ లు..చేస్తుండేవాడ్ని ..ఎన్ని టెస్ట్ లు వున్నా వాయిస్ పరీక్ష ముఖ్యం ..నా వాయిస్ మీకు తెలుసు ..ఎన్ని పోస్ట్ లు పడ్డా కూడా శాస్త్రి గారి కమిటీ నన్ను ఎంపిక చేసేది కాదు ...సరే కొంతమంది అన్ని అర్హతలు ఉన్నాయి మీకు అన్యాయం జరుగుతుంది కోర్టు కు వెళ్ళమాన్నారు ...కొంతమంది దగ్గరివాళ్ళు పోనిలే బ్రాహ్మణుడి..కే గాఇచ్చారు వదిలేయు అనేవారు ...అలా కొన్ని పొగుట్టుకున్నా ను ఇక అలా జరుగుతున్నప్పుడు 96 లో పరిమి నెంట్ పోస్టులకు ఎక్కువ స్థానాలు పడ్డాయి ..నా లాంటి వాళ్లపై వస్తున్న వ్యాఖ్యలు తో డైరెక్టర్ శాస్త్రి కమిటీ అప్రమత్తమై మా బ్యాచ్ ని ఏ 0పిక చేశారు ....ఈలోపు కొంతమంది అసహనం తో పేపర్ లో పోస్ట్ లు అమ్ముకుంటున్నారని వార్త ఇచ్చారు ...దానితో మమ్మల్ని ఎంపికచేసిన పైనల్ లిస్ట్ ..ఢిల్లీ కి పంపిస్తున్న టైం లో సీబీఐ వాళ్ళు పేపర్ లో వార్త ఆధారంగా దాడి చేసి మొత్తం మా పరీక్ష పేపర్లు ...మేము వాయిస్ టెస్ట్ టేపులు అన్ని వేసుకుపోయారు .సంవత్సరాలు గడిచిపోయినా ఏ రిజల్ట్ లేదు ..మా నాన్నగారు కొంతమంది పెద్దలతో మాట్లాడి అవి సీబీఐ వాళ్ళు ఢిల్లీ మెయిన్ ఆఫీస్ లో ఇచ్చేశారు అని తెలుసుకున్నారు ....మళ్ళీ ఇక్కడనుంచి నాన్న గారి కి హిందీ బాగా వచ్చు కదా లెటర్స్ డ్రాఫ్ట్ చేసి మాకు న్యాయం చేయండి అని పంపిస్తూ వుండే వాళ్ళం ..కొంతకాలానికి ఢిల్లీ నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడు ..వచ్చేటప్పుడు ఆ పేపర్లు ..ఆ టేపులు అన్ని తెచ్చి పరీక్ష చేశాడు ..చివరికి అందులో ఏవో లోపాలు ఉన్నాయి అని రిపోర్టు ఇచ్చాడు ..ఆ రిక్రూట్ మెంట్ మాఫీ చేసేయ మని ఫైల్ లో వ్రాసి ఢిల్లీ లో పడేసిపోయాడు ..ఇక రిజర్వేషన్ వర్గం వారికి వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయారు ..ఇక బ్రాహ్మణులంబీసీ వారు .మేము అందరం కోర్టు కు వెళ్ళాము అప్పట్లో నూతి వారు మంచి పేరున్న వారు ..వారి న్యాయం వాదించి ..మా కు లాభము చేస్తాను అన్నారు ..కానీ ఈ లోపు వారు జడ్జి అయిపోయి ..కేసులన్ని వాళ్ళ శిష్యుడి కి అప్పగించారు ...ఆ లాయర్ గారు ఇలా ఫైల్ చేశారు పరీక్ష పేపర్లు అన్నిచూశారు కదా .వ్యుద్యోగ ఫలితాలు చెప్పండి అని వేశారు ..హైకోర్టులో ..అలా ఎదురు చూస్తున్నాం అందరూ హైదరాబాద్ లో అద్దెలు కి వుంటూ న్న చాలా బీద బ్రాహ్మణ కుటుంబాలు అందరివి ....ఇంతలో నాకు పెళ్లి అయిపోయుంది ...కోర్ట్ లో వేశాం కాబట్టి మమ్మల్ని అందరిని స్టేషన్ కి రా వద్దు అన్నారు ..ఇక అలా కోర్టులో ఉంది మేము లాయర్ గారి ని కలుస్తూనే ఉన్నాం ..ఇంతలో మా ఆవిడ కూడా కొన్ని విన్నపాలు గా చెప్పింది ..లాయర్ గారు మీరు పరీక్ష రిజల్ట్స్ అని అడగవద్దు అలా అడిగితే అవి మాఫీ చేశారు లేక క్వాష్ చేశారు అనే ఢిల్లీ వాళ్ళ కాగితం ..చూపించేస్తారు ..కాబట్టిఅలా వద్దు మా పరీక్ష పేపర్లు ..మా వాయిస్ లుతెప్పించి విని పరిశీలించి న్యాయం చేయండి ఎందుకంటే ఢిల్లీ నుంచివచ్చిన అధికారి కి తెలుగు రాదు ఆయనఏకే పాడి అనే ఒరిస్సా వారు ..ఆయన తెలుగు లోని పేపర్లు. ని..పరీక్ష ఎలా చేయగలడు ..తెలుగుభాష రాని వాడ్ని ఎందుకు పంపారు అని కేసు ఫైల్ చేయండి ..ఒక రిక్వెస్ట్ గా చెప్పింది ...వాళ్ళు వినరు కదా ..ఇక ఆతర్వాత చాలా సం లు గడిచిపోతున్నాయు ..ఎవరి దారివాళ్ళు బ్రతుకు తెరువు కి వెళ్లిపోయారు ..ఇక నేను విస్సాటీవీ చానల్ అలా కొన్ని0టిలోకి వెళ్ళి బండి లాగు తూ వున్నాను ..శోభా రాజు గారు మా నాన్నగారు ని గురువులు గా భావిస్తూ ..ఎన్నో సన్మానాలు చేశారు .. హిందీ భాష లో వారు కీర్తనలు చేస్తున్నప్పుడు సంస్కృత హిందీ వృద్దు పదాలు బాగా లోతుగా అధ్య యన 0 చేసుకొనే సందర్భంలో నాన్న గారితో బాగా మాట్లాడుతూ వుండే వారు ..వారి ఇచ్చిన ఒక అవకాశముతో నాన్న గారు కేంద్ర మంత్రి అరుణజైట్లీ అన్నమాచార్య సభ లో వక్త లు ..అప్పుడు జైట్లీ నాన్న గారికి పాద నమస్కారం చేశారు ..అప్పుడు హిందీలో విన్నపం గా మొత్తం పక్కన కూర్చొని వివరించారు ..ఇన్సాప్ కరూ0గా కరూంగా ..అన్నారు ..వారు కూడా ఏమి పట్టి0చుకోలేదు ..తరువాత జైపాల్ రెడ్డి ని చాలా మంది ని కల్సి లేఖ లు ఇచ్చాం ..ఏ ఉపయోగం జరుగలేదు .ఇక ఇంతలో మొత్తం రేడియో..అండ్ డి.డి శాఖకు తెలుగు సీనియర్ ఐఎఎస్ ఒక రు మన వాళ్లే వచ్చారు ఇండియా మొత్తం ఆ శాఖ ఆయన చేతిలో ఉంది ..అని తెల్సింది వారిది బంజారాహిల్స్ లో నివాసం అని పేరు చెప్పి పట్టుకోమన్నారు అప్పటి తెలుగు యూనివర్సిటీ వీసీ సుబ్రహ్మణ్యం గారు ..నాన్న గారిని ..నాది పీహెచ్ డి కదా తెలుగుయూనివర్సిటీ లో ఏమైనా ప్రొఫెసర్ ఉద్యోగం కాంటాక్ట్ బేసిస్ దొరుకు తుందేమో అనే ప్రయత్నం మీద వెళ్లారు ...సుబ్రహ్మణ్యం గారు నాన్న గారు ఇద్దరు విశ్వనాధ వారి శిష్యులే ..ఇద్దరు నాగఫణి శర్మ గారి అవధానం లో కలుసుకున్నారు ..అలా స్నేహము మీద వెళ్ళితే ..ఆయన గారి యూనివర్సిటీ లో ఖాళీ లు ఏమి లేవు అని చెప్పి, ఆగిపోయిన..ఆకాశవాణి వ్యుద్యోగ0 కోసం ఆ తెలుగు సీఈఓ గారిని పట్టుకోండి అన్నారు ..ఇక నాన్నగారు 70 ఏళ్ల మనిషి ఆ పేరు ఒక కాగితం పై వ్రాసుకొని ..ఒక సీసాలో మంచి నీరు పోసుకొని మంచి ఎండల్లో నన్ను లాక్కొని వెళ్లారు ప్రతి ఇల్లు నేమ్ బోర్డ్ వెతకడం ప్రారం భించాము ఇక అలిసిపోయి రోడ్డు పక్కన ఒక చెట్టు క్రింద శాలువా పెట్టుకొని నిద్ర పోయారు ..అలా వెతికి వెతికి అలసిపోయి అలా కాదని ఇంకోరి సహాయంతో వారి అడ్రసు వెతికి ఇల్లు పట్టుకొనివెళ్లారు ..వారు ఢిల్లీ వెళ్లారు అక్కడే ఎక్కువ వుంటారు ..ఎప్పుడో కానీ వారు రారు అంటే . కొన్ని అర్జీ లు వ్రాసి ఇచ్చి వచ్చారు వారి pa గారికి ...ఇక అది అలా జరిగిపోయు రోజులు గడుస్తున్నాయి ..ఇంతలో నను పెద్ద చదువులు వైపుకు మళ్లించి .నేను ఇన్ని డిగ్రీలు చేయడానికి మదిలో ఆలోచనలు రేకిత్తించిన వ్యక్తి నా ప్రియ మిత్రుడు డాక్టర్ కుమార్ అన్నవరపు ..మా ఊర్లోనే పక్క బజారులో వారి ఇల్లు ... వారి నాన్నగారు కూడా టీచరు ..మన వాళ్ళ పిల్లలు ఏదైనామంచి ఉన్నత చదువులు పదవులు సాధి0చాలనిఎంతో సపోర్ట్ ఇస్తూవుండేవారు ..బాగా ధైర్యం మెండుగా ఉన్న మనిషి ..ఈ కుమార్ మా సత్తుపల్లి కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఫాదర్ ఆఫ్ జర్నలిజం ..మంచి జర్నలిస్ట్ గా ఎదిగిఅది ఒక రంగం ఉంది అని మా కు తెలియ చెప్పాడు..ఆయన ఉదయం లో పనిచేసే వారు ...గ్రామాల్లో జనం ఆయన కాళ్ళమీద పడిపోతుండే వారు ..సార్ మాగురించి వ్రాయండి ..మా పంట నష్ట పోయిన పొలాల గురించి వ్రాయండి అని కొబ్బరి బొండాలు కొట్టితెచ్చి అందిస్తూ ప్రాధేయపడేవారుఇక అలా .ఆరోజుల్లో మేము అంతా జర్నలిస్టులు అయిపోయి ..అక్కడ పనిచేసి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ పత్రికా ఆఫీస్ లో పనిచేయడం మొదలుపెట్టాం .కుమార్ ..కి ఇంకా పెళ్ళి కాలేదు చిన్న వయస్సు ..మేధస్సు అమోఘం ..ఆ రోజుల్లోనే కుమార్ ని రామోజీరావు గారు దగ్గర పెట్టుకున్నారు ..ఈనాడు లో మెయిన్ పేజీ లో మంచి గమత్తు అయిన హెడ్డింగ్ లు పెట్టె బాధ్యత ను ఎంతో నమ్మకం తో ఇచ్చారు ..కొన్ని మెయిన్ పేజీ కధనాలు కూడా ఇచ్చేవారు ....ఇద్దరం 1990 లోసోమాజిగూడా లో ఈనాడు దగ్గరే రూ0 తీసుకొని .వండుకొని తినే వాళ్ళం నా పత్రికా అనుభవంతో రేడియో కి వెళ్ళాను ..కుమార్ గారు అనంతపురం లో డాక్టరేట్ కోసం జాయిన్ ఆయు నన్ను కూడా ఉస్మానియా లో రిసర్చికోసం ఎంట్రెన్స్ వ్రాయమని ప్రోత్సహించడం ..చదివి కృషి చేసి సీటు కొట్టడం అలా నేను రేడియో ..కి ఆయన ఢిల్లీ కి వెళ్లడం ..విద్య పత్రిక విజయవాడలో స్థాపించడం నేను రేడియో లో తిరగడం అలా వేరుపడిపోయాము ..కొంత కాలానికి ..మా ఊరు మళ్ళీ వచ్చినప్పుడు మా తమ్ముడి ద్వారారేడియో కేసు గందరగోళం తెలుసుకొని నాకు సహాయం చేయాలని హైదరాబాద్ లో కల్సి నన్ను తీసుకొని ఆ సీఈవో ఐఏఎస్ గారు నాకు బాగా పరిచయం అని వారి ఇంటికి తీసుకెళ్లి మంచి వ్యుద్యోగం లేదు జీవితంలో ఇంకా స్థిరపడ లేదు అని చెప్పి మీరు సహాయం చేయండి మా ప్రెండ్ కి అని కుమార్ నేను ఇద్దరం కాళ్ళు పట్టుకొని వదల లేదు ..ఇక ఆతరువాత వారు ఢిల్లీ లో కలవమన్నారు .. ఢిల్లీ లొనే ఉంటున్నకుమార్ ..నా కేసు డిటైల్స్ తీసుకొని వెళ్లి కలిసి మాట్లాడి వచ్చాడు ...కాల0 అలా అలా స0వత్సరాలు..కదిలిపోయుంది ఏమి జరగలేదు ..మళ్ళీ కొంత కాలానికి నాన్నగారు గుంటూరు శే షేంద్ర శర్మ గారి ఇంటికి వెళ్లే వారు ..ఇద్దరూ విశ్వనాథ వారి శిష్యులే ..అలా ఒక సందర్భములో తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో ఒక సభ..దానిలో నాన్న గారుశేషే0ద్ర శర్మ గారు మల్లెమాలఈ రేడియోమఱియు డి.డి కేంద్రసి ఈ ఓ గారు వున్నారు వీరు అంతా వక్త లు ..శేషేంద్ర శర్మ గారు మొత్తం ఇంగ్లీష్ లో ప్రసంగం చేశారు...దానికి మల్లె మాల రెడ్డి గారికి కోపం వచ్చింది ..ఇక అప్పుడు సభ ముగిసే లోపు రేడియోజాబ్ ఆగిపోయిన బ్రాహ్మణులు ..అందరూ పెళ్ళాం పిల్లలు తో సహా అక్కడకు చేరుకున్నాం నేను కూడా మా సిస్టర్ మానసిక వికలాంగురాలు ని తీసుకొని మా కుటుంబం వారు అందరూ వచ్చారు కొద్దిరోజుల్లో ఆ సీఈవో గారి పదవీ కాలం ముగిసిపోతుంది ..కాబట్టి చివరి ప్రయత్నం గా అందరం సభా స్థలి కివచ్చి వారిని కలిసి ..మీరు దిగిపోయే ముందు మా ఫైల్ పై సంతకం చేసి మాకు భృతి కల్పించండి అని అందరూ ప్రాధేయ పడి అడిగారు ..ఇక నేను చేయటం కుదరదు అండి ..నేను చేయలేను ..నావల్ల కాదు ఆ పని అందరికి నమస్కారం? అని అక్కడనుంచి వెళ్లిపోయారు ..ఆ బ్రాహ్మణ సి.ఈ వో గారు ..అక్కడితో ఆఖరి ప్రయత్నం కూడా అయిపోయుంది ..కొంతకాలం గడిచింది .మళ్ళీ కోర్టు తీర్పు కోసం ఎదురు చూసిన మా పెద్దవాళ్ళు పోయారు ..ఇక కొంతకాలానికి కోర్ట్ తీర్పు ఇచ్చింది ...మాఫీ చేసిన విధానం ఒకప్రభుత్త్వఅధికారిక సంస్థ ...దానిని తప్పు బట్టడం ప్రశ్నించడం చేయకూడదు .మూసుకోండి ఇక అని కోర్టు గొప్పగాతీర్పు చెప్పింది ..ఇక ఆ జడ్జిమెంట్ కాగితాలు తీసుకొని నాఫ్రెండ్స్ కొంతమంది జడ్జీలయ్యారు ..వాళ్ళ దగ్గరికి వెళ్ళాను .నాకు అన్యాయం జరిగింది పై కోర్టు కి వెళదాం అంటే ..ఇక ఈ జడ్జి లు మనవాళ్లే కానీ ..ఎందుకో పప్పుచారు మాటల మాట్లాడటం మొదలుపెట్టారు ..ఎందుకు స్వామి టైమ్ వేస్ట్ ..అది లేకపోతే బ్రతకాలేమా అని చాల్లార్చారు ....అది కాదు నా బాధ నేను అన్ని రకాల ప్రతిభ ఉండి అన్యాయం గా ఒడిపోయాను అని నాబాధ ..ఇక మన వాళ్ళు వల్ల కాదనిబొజ్జా తారకం గారిని కలుసుకొని నా బాధ చెప్పి ఫైలు ఇచ్చాను ..అప్పుడు వారుపెద్ద ఏజ్ లోవున్నారు .కొంచెము.అస్వస్థత తో వున్నారు..మళ్ళీ వచ్చి కలవండి..కొంచెముటైం ఇవ్వండి చదువుతాను అన్నారు కొంతకాలం గడిచింది ఈ లోపు అక్కడ నా ఫైలు మిస్ అయిపోయుంది ..వారి అసిస్టెంట్ గారు ఎలానో నా ఫైలు సంపాదించి కేసు ప్రారంభించారు ...ఇదిగో ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంస్థ తో పని పడింది కొత్త లాయర్ గారు ఒక విషయం అడిగారు ..మీరు ఆ ఒరిస్సా అధికారి ..ఫైలు లో ఏమి వ్రాశాడో ..తెలిస్తే ..మన0 కొంచం తేలిగ్గా కేసులో ముందుకు పోవచ్చు అన్నారు ..నేను అప్లై చేశాం ఆ లెటర్ కోసం ..అప్పుడు ఆ ఇన్ఫెర్మేషన్ యాక్ట్ లో అప్లై చేశాం ..వాళ్ళు కుదరదు ఇవ్వడం అన్నారు ..అప్పుడు ఈ విషయాలు మొత్తం మాడభూషి వారికి మెయిల్ లోను ఫోన్ మెస్సేజ్ లోను వారిని సంప్రదించాను .ఈ విషయంలో .నేను కూడా ఏమి చేయలేను అన్నారు .....ఇక కొంత కాలం అలగడిచిపోయు0ది ...రేడియో దూరదర్శన్ కి కి కూడా కాల0 చెల్లిపోయుంది ఇప్పుడు ఆ చూసేవాడు వినేవారు ఎవ్వరూ లేరు కాబట్టి ..ఆ శ కం ముగిసిపోయింది .. పాత వారు ఎమో కానీ ఈ మధ్య ...ఇప్పటికి నావాయుస్ కొట్టే వాళ్ళు అందులో కి రాలేదు ..అది సరస్వతీ అమ్మవారి ప్రసాదమే ..కాక పోతే సాహిత్యం కళలు సినిమా రంగం వారు ..పెద్ద పెద్ద ఐఏఎస్ఉద్దండులని కలిసి ఇంటర్వ్యూ లు చేశాను.శ్రీమాన్ ..పుట్టపర్తి నారాయణా చార్యులు గారిఅమ్మాయి డా౹౹నాగపద్మినిగారి దగ్గర ,కలగా కృష్ణ మోహన్ గారి దగ్గర హైదరాబాద్ బ్రదర్స్ శేషా చార్యులు గారి వద్ద విల్సన్ హెరాల్డ్ గారి వద్ద ఇంకా ఎందరో గొప్పవారి వద్ద హైదరాబాద్ కేంద్రం లో పనిచేశాను అది అలా అమ్మవారు కల్పించిన భాగ్యమే .. ..ఇక ఆ తరువాత ప్రవైట్ టీవీ చానల్స్ లో చేస్తూ మెల్లగా టీచింగ్ వైపు కి వెళ్ళిపోయాను .పరీక్ష తప్పాను మెరిట్ రాలేదు అంటే బాధ పడం కానీ అర్హతలు అన్నీ ఉండి ..అన్ని పరీక్షలు పాసై తినే దాకా వస్తే నేల పాలు చేయడం సహించ లేక పోరాటం చేశాను....కాలేదు ..అంతే
ఇప్పటికీ ఇంకో తెలుగువారు వే0పటి ..వారు మొత్తం దేశానికి ఆకాశవాణి డిడి సీ ఈ ఓ గా వచ్చారని తెలిసి వారికి కూడా కొద్దీ సం౹౹ల క్రితం అన్నివిషయలు వ్రాసి న్యాయం చేయమని లెటర్ పెట్టాను .ఇప్పటికీ లెటర్ నెట్ లో కనిపిస్తుంది అనుకోండి ..కాల0 గడిచిపోయింది ...ఇప్పుడు రేడియో దూరదర్శన్ లకు ఆదరణే..పోయింది ...ఇక ఆ సెకం ముగిసిపోయింది .............. .స్వస్తి
🌹🙏విజయదశమి శుభాకాంక్షలు సందర్భంలో విజయవాడలో శ్రీదుర్గా మ్మ వారి హారతులు దర్శించి తరించండి సకలశుభాలు పొందండి🌷🌹
🙏 🌹🌹🌹 విజయవాడ శ్రీ దుర్గా మాతా కి జై 🌹🌹🌹🙏
మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |.
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||
మీకు మీ కుటుంబ సభ్యులకు.. విజయదశమి శుభాకాంక్షలు🙏🏻
🙏 🌷🌷 శ్రీ దుర్గామతాకి జై ...శ్రీ దుర్గమలేశ్వరస్వామి వారికి జయం జయం 🌷🌷🙏
🌷🙏ఒక సూక్తి🙏🌷
ఒక సూక్తి ని తెలుసుకుందాము
----------------------------------
*గీతా గంగా చ గాయత్రీ*
*గోవిన్దేతి హృది స్థితే*౹
*చతుర్గ కారసంయుక్తే*
*పునర్జన్మ న విద్యతే*౹౹
గీత, గంగ, గాయత్రి,గోవిందుడు
అను 'గ'కార యుక్తములగు ఈ నాలుగు నామములను హృదయమందు ధారణ యొనర్చు కొనినచో మనుజునకిక ఈ సంసారమున తిరిగి జన్మకలుగదు...అంటే మోక్షం సిద్దించును .....
నిరీక్షణ.. shortstory. Nirikshna. Part 13 ......నిరీక్షణ
** ** ** **
Part13పెళ్ళి సంబరాలు ...పెళ్ళి యాత్రలు పూర్తి అయి ఇక కుటుంబం అంతా క్లినిక్ తెరిచారు ..లోపల డాక్టర్ రమణ ..తన రూ0 అంతా శుభ్రం చేయుంచుకుంటున్నారు ..బయట హాలు లో డాక్టర్ కిరణ్ ..వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ తో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ..ఇంతలో డాక్టర్ గారు ఉన్నారా ..సార్ అని పిలుపు వినబడి ..బైటకు వచ్చింది నర్సు ..ఉన్నారండీ ..అని క్రింద రెసిప్స్ న్ కూర్చో బెట్టి ..వివరాలు వ్రాసుకొంటూ ఉంది ...డాక్టర్ గారి రూమ్ లో తెల్ల కోటు పై స్టెత్ వేసుకొని కూర్చొని ఉన్న గీత ..ఆమె భర్త డాక్టర్ కిరణ్ ..మామ గారు డాక్టర్ రమణ కూర్చొని మాట్లాడుకొంటున్నారు ..డెంటల్ విభాగం క్రింద పెట్టేద్దాం నాన్న గారు ..మొత్తం ఒక వారం లో ఎస్టా బ్లిష్ చేసేస్తాం ..మీరు ఏమంటారు చెప్పండి
కొంచం బాబిడి హెయిర్ పైకి లాగుకొంటూ అడిగింది గీత ..చూడమ్మా ..నువ్వు ..అల్లుడు గారు చూసుకోండి ..నాకు ఫైనల్ గా చెప్పండి చాలు ..ప్లానింగ్ మీదే నమ్మా ..అని నవ్వుతూ చెప్పాడు డాక్టర్ రమణ ఇంత లో సార్ ..సార్ ..క్రింద పేషెంట్ వచ్చారు ..పైకి తీసుకు వస్తాను ..పైకి వచ్చి చెప్పింది ..నర్సు ..తీసుకురామ్మా ...క్లీనింగ్ ..అయిపోయుంది గా ..మరి ఒక పని చేయు నువ్వు కిరణ్ రూం లో కి తీసుకురా ...నేను కిరణ్ గారిని పిలుస్తాను ..అంటూ పక్కనే ఉన్న కిరణ్ కొత్త రూమ్ ని చూపించాడు ..పేషంట్ ను తీసుకొని తల్లిదండ్రులు డాక్టర్ కిరణ్ రూ0 లోకి వచ్చారు ...నమస్కారం డాక్టర్ గారు ...తల ఎత్తి చూశాడు .కిరణ్ ...రండి ..రండి ..లేచి నిలబడ్డాడు ....లోపలికి వస్తూ నే ఏమయ్యా .బాబూ నువ్వు ఇక్కడ ....? కొంచెము ఆశ్చర్యం గా అడిగాడు సుధ తండ్రి గారు ..నేను డాక్టరేట్ పూర్తి చేసుకోవడం ....వారి అమ్మాయిని ఇచ్చి వారి అల్లుడు గా చేసుకోవడం ..అంతా మా మామగారు డాక్టర్ రమణ గారి దయే ..ఆయనగారి చలువే..అలా కొద్దిసేపుఅన్ని విషయాలు మాట్లాడుకున్నారు ...ఇదంతా నిజమా ...కల కాదు కదా ఆలోచనల్లో పడింది సుధ తల్లి ..సరే ముందు నేను కేస్ స్టడీ రాసి డాక్టర్ గారి దగ్గరకు తీసుకొని వెళతాను ...అలా మొత్తం...వాళ్ళను అడగటం మొదలు పెట్టాడు వాళ్ళు అమెరికా సంభంధం. రావడం పెళ్ళి ..వాళ్ళు పెట్టిన కష్టాలు . ..ఆ తరువాత ఎన్నో సాధించాలి అనుకొని ..ఏమి చేయలేక ..చాలా కాలం వృధా చేసుకొని ...మాకు ..ఎవరికి ఏమి చెప్పుకోలేక ...అలా ఆలోచించి ..ఆలోచించి ..బాధపడి ..భయం భయం ప్రతిదానికి భయం అంటుంది ..ఒక్కతే వంటరిగా కూర్చొని అన్నీ ఆలోచిస్తూ అదే అదే ధ్యాస లో ఉండిపోతుంది ..తరువాత జీవితం లోకి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు రావడం లేదు తెచ్చుకోదు ..ఎంతో చెప్పిచూశాము ..అలా సుధ తల్లి చెబుతుంటే వివరాలు మొత్తం వ్రాసుకున్నాడు ..మరి నిద్ర ఎలా పోతుంది ..మంచిగా పడుకొంటుందా ..అడిగాడు డాక్టర్ కిరణ్ ..అది కూడా అంతంత మాత్రమే ..చెప్పింది సుధ తల్లి ..నువ్వే మొత్తం చెబుతున్నావు ..సుధ ఏం మాట్లాడవేం ..కొంచెము నవ్వుతూ అడిగాడు కిరణ్ ..తల వంచేసుకొంది సుధ
అబ్బా సుధా ...నీకు ఏమి పెద్ద జబ్బు ఏం కాదు ..మంచిగా తిను మంచిగా నిద్రపో కొద్ధి రోజుల తరువాత అంతా సర్దుకొంటుంది ...ఓ.కె చేయు పట్టుకొని ఊపాడు ..కిరణ్ ...సరే రండి ..డాక్టర్ గారి దగ్గరకు పోదాం ..అంతా కలిసి డాక్టర్ రమణ గారి రూమ్ లోకి వెళ్లారు ...పరిచయ కార్యక్రమాలు అన్ని పూర్తి అయిపోయాయి చూడండి అమ్మా ..ఒక టాబ్లెట్ రాత్రి పడుకొనే టప్పుడు.. ఒకటి ఉదయం వేయండి చాలు ...మొక్కలు పెంచడం ..సాయంత్రం షూ వేసుకొని వాకి0గ్ చేయడం ...ప్రశాంతమైన ఒక దేవాలయానికి వెళ్ళండి అక్కడ కాసేపు ధ్యానం గా స్వామిని చూస్తూ కూర్చోండి ..ఉదయం యోగా సాధన చేయు0చండి ..అలా కొన్ని సూచనలు ఇవ్వడం పూర్తి కాగానే అంతా బైటకు వచ్చారు ..మళ్ళీ డాక్టర్ సుధ తల్లిని పిలిచి వ0టరిగా మాట్లాడాడు ..మీరు కొద్ది రోజులు ఆమెను జాగ్రత్తగా కాపాడుకోండి వంటరిగా ఉంచొద్దు ..పైగా ఆమె అమెరికా ఫోటోలు ఇంకా ఏమైనా ఉంటే కళ్ళ ఎదురుగా ఉంచకండి ..ఇలా చెప్పి పంపించేశాడు..ఆ తరువాత .కిరణ్ ..తన భార్య ని పిలిచి పరిచయం చేశాడు ..అంతా కలిసి టీ తీసుకున్నారు .కొద్దీ రోజులు ఇక్కడ కు తీసుకు రండి నేను కౌ న్సిలింగ్ ఇస్తాను ..ఇక్కడ ఒక రెండు గంటలు మాతో గడుపుతుంది ....మీకు తెలుసు ఒకరి బాధ ని నేను అర్ధం చేసుకుని సహాయం చేసే వాడ్ని కానీ ..ఎక సఖ్యా లు ఆడే వాడ్ని కాదు ..మీ కు నా వంతు సహాయం చేసి సుధని బైట ప్రపంచం లో పడేయగలను ..మీరు నన్ను ఇదివరలో లా తీసి పడేయకండి ..నేను చెప్పేది వినండి అలా అంతా సర్ది చెప్పి అక్కడనుంచి పంపించేశాడు కిరణ్ ...
** ** ** ** **
సుధ ఇంట్లో పెద్దగా వినిపిస్తున్నాయి మాటలు ..యుద్ధం జరుగుతుంది ..చూడండి కిరణ్ ఎంత మంచిగా సెటిల్ అయ్యాడు ..అందివచ్చిన అవకాశం వదులుకున్నాము ..ఇద్దరిలో ఒక దాన్నివాడికి అంటగడితే ఒక విషయం లో ఆయునా జీవితం ప్రశాంతంగా చక్కగా ఉండేది ...అని సుధ తల్లి విసుగ్గా అరిచేస్తుంది ...ఏం చేయమంటావు ..నేను మంచిగ చదువుకోమని చెప్పా ఖర్చు అనుకోకుండా చదివిస్తాను అని చెప్పా ...వాళ్ళు ఆ పని చేస్తారని కల కనలేదుగా
విసుగ్గా చెప్పాడు సుధ తండ్రి ..అందుకే అండి.. పెళ్లివయస్సు రాగానే పెళ్ళి చేసిపారేసే వాళ్ళు పూర్వకాలంలో ..ఇలాంటి తల నొప్పులు ఉండవని ....ఆ ఇక చాల్లే నువ్వు చెప్పింది ...చేసిన తరువాత మాత్రం మంచిగా లేని కేసులు ఎన్ని లేవు ..మన పిల్లకి చేశాము గా పెళ్లి చేసి ఇదిగో ఇలాడిప్రెషన్ పడేశాము ..గా పెద్దగా మాట్లాడుతున్నాడు సుధ తండ్రి ...ఇక చాలు ..ఆపండి ..అది విని మరీ బాధ పడుతుంది ...కొద్దీ సేపట్లో మేము బయలు దేరి కిరణ్ దగ్గరకే వెళతాము రమ్మ నాడుగా....ఎం చేస్తాము వాడు వచ్చినప్పుడు అందరికి ఇగో తో పోజు లు కొట్టాము వాడు పల్లెటూరు వాడు అని ఇప్పుడు ..వాడే గతి...అదే దైవ లీల ..అలా ఇద్దరు భీకరంగా వాదించుకొని కిరణ్ క్లీనిక్కు కి బయలు దేరారు ....................(ఇంకా ఉంది ....to be continued................)
🙏🌹బ్రాహ్మణులు లో లోపాలను దిద్దుకొని అందరూ ఐక్యం గా ఉండాలని చెప్పే వ్యాసం🙏🌹
🌷🌷🙏 ఓం నమో నారాయణా య 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏ఓం నమః శివా య🌷🌷🌷🌷
వైష్ణవులు వారిమనస్సుల్లోఇంకో దేవుడు ఉండడు ,వాళ్ళు ఇంకో గుల్లోకి వెళ్ళడం ఒప్పుకోరు ఇలాంటి వ్యాఖ్యలు ఒక పురాణ 0 చెప్పే ఒక పండితుడు పదే పదే ఆ0టూ ఉన్న వ్యాఖ్యలపై పై చిన్న మాట అస్సలు వారి మతం పేరు శ్రీ వైష్ణవ0 ..వారు శ్రీ మహా విష్ణువు ఆరాధకులు ..అస్సలు ఒక కులం వారు ఇంకోరి కుల సభకు వెళ్తారా అని ముందు ఆలోచించాలి ..కదా .....ఇక శంకరాచార్యులవారి అవతారం వచ్చి వెళ్లిపోయునతరువాత కొంతకాలానికి ఈ ఆరు మతాల వారు కూడా కొట్టు కోవడం ,నాది గొప్ప అంటే నాది గొప్ప అని వాదనలు చేస్తూ దూషించుకోవడం మొదలుపెట్టారు ..ఎక్కువగా కొట్లాటకు దిగినవారు శైవులు ..వైష్ణవులు ...విష్ణువు అనువాడు ఒకడు ఉండెను ..స్థితికారకుడు ..ఆయనే లక్ష్మీపతి ..వారు కూడా ఆదిదంపతులే.అని చెప్పడం ..ఆ బొట్టుపెట్టుకొని తిరగడం ముందుగా నచ్చని వాళ్ళు శైవులు .లేదా ఆ ఆబొట్టు పెట్టుకొని తిరిగిన కొంతమంది మహానుభావులు ..మా వాడు తప్ప ఇంకెవరూ ఆయనకు సమానమైనవారు అస్సలు లేరు ..అని వాదించేవారు ..చివరికి అదిహింసా మార్గంలోకి వెళ్ళిపోయింది... వీరభద్రస్వామి కి వుండే ఒక పీఠం లాంటి పళ్ళెం తీసుకొని దానిని వీరభద్ర పళ్ళెం అంటారు ..దానికి అన్నీ ముళ్ళు ఉంటాయి ..దానిని బెట్టి వైష్ణవుల తల పై వేసే వాళ్ళు అలా చాలామంది వైష్ణవు లను ఘోరంగా చంపేశారు ...మరి వీళ్ళు ఎదురు దాడి చేయలేదా అనే సందేహం రావచ్చు .కానీ వీళ్లకు రాజ్యాలలో రాజుల తోడ్పాటు లేదు ఎక్కువ శైవులే రాజులు ..కొంతమంది వైష్ణవ స్వాములను పట్టి రాజులు. అధికారగ ర్వం తో ..చాలామంది కి శిరచ్ఛేదం, కనుగ్రుడ్లు పెకిలించిన సందర్భాలు చాలవున్నాయి .అలా జరుగుతున్న తరుణములో ..పోతన్న గారి లాంటి కవులు ఆ దారుణాలు చూడలేక ,సహించలేక ..శ్రీమద్భాగవతమ్ లాంటి సంస్కృత గ్రంధాలను ప్రచారం లోకి తేవాలని కంకణం కట్టుకొని స్వయానా ఆయన వైష్ణవ భాగవోతోత్తముడి గా మారారు అని ప్రాచీన గ్రంధాలు చెబుతూవున్నాయి ...మనం ఈ మధ్య కాలంలో కమలహాసన్ తీసిన విశ్వరూప్0 లో కూడా ఒక ఆళ్వార్ ని శ్రీమహావిష్ణువు విగ్రహానికి కట్టి నీళ్ళ లో వేసిన ఘట్టం ఒకటి చూపబడినది ...అలాంటి వి ఎన్నో రాజుల పక్కన ఉండి వైష్ణవు ల పై జరిగాయి ...ఆళ్వారులు కొంతమంది అజ్ఞాతంలో అడవుల్లో దాక్కు0డిపోయారు ఇలా శైవులు అరాచకం విపరీతంగా పెరిగిపోయింది.చాలా మంది రాజులు వారికి వత్తాసు పలికేవారు .కొంతమంది అయితే శంకరాచార్యులవారిని ...సంకరాచార్యులు అని కూడా విమర్శలు చేసేవారు ...ఎందుకు స్వామి అని అడిగితే ఆయన అన్నీ కలిపేశాడని .అయ్యవారు ఒక్కరే కాదు అమ్మవారు కూడా ఉంది ..ఇంకా వారి పరివారం ఉంది ఇదంతా వివరించి ఆరాధనక్రమ0 ..సరిచేయడం వాళ్ళకు నచ్చలేదు .ఇక అలా కొంతకాలానికి మళ్ళీ కొన్ని అవైదిక మతాలు మళ్ళీ చిగురులు పెట్టాయి శైవులు తో విసిగి కోపం పెంచుకొని ...శైవులు శివుని ఆరాధిస్తారు ...వాళ్ళలో రాక్షసులు ఎక్కువ ఆ బొట్టే వాళ్లే చాలా మంది రాక్షసులు వాళ్ళను చూడరాదు ,వాళ్ళతో భోజనం చేయరాదు ఇలా. వైష్ణవు లు..కోపం ప్రద ర్శించే వారు ...ఇటువంటి సమయంలో ..వచ్చారు ఆదిశేషుని అవతారం శ్రీరామానుజా చార్యులవారు ...ఆయన.. వంద సంవత్సరాలు పైగా జీవించారు ...ఆయన ..మాట కు కూడా ఎవరూ పెద్దగా మొదట్లో విలువ ను ఇవ్వలేదు ....ఆయన కూడా చాలా సార్లు కొన్నిరాజ్యాల నుంచి మారువేష ము లో ..వేరొక చోటికి తప్పించుకొని దాక్కొనేవారు....ఒకరాజ్యములో రాజు కూతురికి ..పిశాచి బాధ పట్టుకొంది ..చాలామంది పండితులు శైవులు వల్ల అది కంట్రోల్ కాలేదు ...అప్పుడు రామనుజలవారు నేను వచ్చి తగ్గిస్తాను అని వర్తమానం పంపి 0చాడు ..అప్పుడు రాజుఆయనను ఆహ్వానించడం నారాయణ కవచ స్తోత్రం. తో .......ఆ రోగం తగ్గిపోవడం అలా రాజు ఆదరణ లభించడం ...అక్కడినుంచి రామనుజలవారి సెకం ప్రారంభం అయ్యింది అని చెప్పవచ్చు. విష్ణు దేవాలయాలు ఇన్ని రావడం ..ఇంతమంది శ్రీవైష్ణవ పండితులకు ..పురోహితులు కు దేవాలయాలు ఏర్పడి ..వాళ్ళ భక్తి తత్వ0 కి..వాళ్ళ ఆగమాలకు ప్రచారం రావడం ..వాళ్ళకి ఉదర పోషణార్థం ...కూడా లాభం జరగడం ..ఈ పుణ్యం అంతా రామనుజుల వారిదే అన్ని నిస్సందేహముగా చెప్పవచ్చు ..అయితే ..వైఖానుసు లు .ఈ శ్రీ వైష్ణవు లను హీనంగా చూస్తారు ..తిరుపతి మార్గ దర్సకాలలో అతి పూర్వకాలంలో శ్రీమద్ భగవత్ రామనుజులవారు శ్రీ వైష్ణవ తెంగల్ శా ఖకు చెందిన వారు అయినా కూడా వారు చాలా ని స్వార్థం గా శ్రీవేంకటేశ్వర స్వామి వారి వద్ద విఖనస మహర్షి వారి ఆగమ పూజా విధానాన్నే అవలభించేలా ఏర్పాటు చేశారు అంతే ..కానీ వారి పెత్తనం ఉంది కదా అని పాంచరాత్రాగమము పెట్టలేదు ..అది వారి అవతార వైశిష్ట్యం ..ఏది ఏమైనా శ్రీవిష్ణు మతం లో ఉన్న ఏ అర్చక స్వామి వారు అయునా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహానికిముందుగా తీర్ద్ పు పాత్ర ..శఠారి పెట్టుకొని కూర్చున్న వారు..నేనే గొప్ప అనే అహ0కారంఉండకూడదు కదా ..అది వదిలిపెట్టన్నప్పుడు ..ఎన్ని శాస్త్రాలు చదివినా ..ఎన్ని చోట్ల బొట్లు పెట్టుకున్నా స్వామివారు మాత్రం క్షమించడు ..గరుడుడు నేనే మహా బలవంతుడను అనే అబిప్రాయం చెప్పినప్పుడు ..స్వామివారు వారి ఒక చేతిని గరుడుడు పై పెట్టాడు ..ఇక కదలలేక ..బలం చాలక తప్పు తెలుసుకున్నాడు ..నీ బలం కు కారణం నేను ..అనే జ్ఞానం తెలియ చేసి కళ్ళు తెరిపించాడు ..కాబట్టి వైఖానుసులైన..శ్రీ వైష్టనవులైనా ఇంకెవరైనా స్వామివారి ముందుకూర్చొని వారి ప్రతినిధి గా వున్నప్పుడు అహ0కారంపనికిరాదు...శ్రీమద్.గురు రాఘవేంద్ర స్వామి గారి కి ఒక విషయం అనుకొనేవారట .బ్రాహ్మణులలో.ఇతరుల శాఖలు వారి వారి సిద్ధాంతాలు తో మీతో కలిసినా ..కలవకపోయినా..కనీసం. మీ ముగ్గురు అయినా...వైఖనసా.. శ్రీ వైష్ణవ మధ్వ శా ఖలు వారైనా ఐక్యమత్య0 గా..ఉంటే బాగుంటుంది ..అని వారి అభిప్రాయం అట ...
ఇక ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాము
బ్రాహ్మణులు లో దేశమంతా 116 శా ఖలు ఉన్నాయి .ఎవరి ఇష్ట దైవం వారు ఆరాధించుకుంటున్నారు. కొంతమంది శంకరాచార్యులవారు చెప్పిన పంచాయతనం .పెట్టుకొని ఆరాధించుకుంటున్నారు .ఇలా రక రకాల గా దైవా రాధన నడుస్తోంది .ఇక్కడ మనం చూడవల్సినది ..వైష్ణవులు ...వీరవైష్ణవు లు అని రెండు రకాలు శైవులు ..వీరశైవులు లాగా వైష్ణవులు లోకూడా శ్రీవైష్ణవులు ..వైష్ణవులు అని మళ్ళి రెండు రకాలు .శైవులు లాగానే వైష్ణవులు ..కూడా కేవలం అయ్యవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు ..అమ్మవారిని ..పరివారం ను వాళ్ళు ఒప్పుకోరు ..తలచుకోరు ..వారిలో ఒకరు మధ్వ లు ..వారు కేవలం విష్ణువు ని మాత్రమే ఆరాధిస్తారు ..ఆయన పైననే అందరూ ఆధారపడతారు ...కాబట్టి ఆ స్వామిని తలుచుకుంటే ..చాలు.అని వారి సిద్దాంతం ఇంకా శ్యాక్తేయులు వారు శక్తి సంబంధించి ఆరాధన మాత్రమే ఉంటుంది ..కొండ గుహల్లో అమ్మవారిని మాత్రమే ఆరాధిస్తూవున్న రోజుల్లో శంకరాచార్యులవారు ...పక్కన శివలింగాలు కూడా పెట్టమని ఆజ్ఞాపించారు ....ఇద్దరు లేనిదే. సృష్టి ఎలా వచ్చింది ?అని వాళ్లకు నచ్చచెప్పారని కూడా చరిత్రగ్రంధాలలో ఉంది ...ఇక వైదికులు అనే వారు ఒక ప్రధానమైన శాఖ ఉంది ...వీరు వైదికసంభ0ధ మైన కార్యక్రమాలు నిర్వహిస్తూ పౌరోహిత్య0 చేస్తూఉంటారు ...అన్ని దేవుళ్ళని ఆరాధిస్తారు ...అందరి దేవుళ్ళ పూజలను చేస్తారు ...చేయిస్తారు ..వైదికులు.. వైదిక త్త్వం ..వేదం ప్రకారము నడుచుకునే వారు ..అని కదా ..శంకరాచార్యులవారు కూడా ..అలాంటి వారు అని నాఅభిప్రాయం ...జగద్గురువు లు అయి ఒక వైదికపూజ,లేక అర్చన విధానాన్ని ఒక రూపం లో కి శా స్త్రీయం గా తెచ్చిపెట్టారు ..అందుకే వైదికులు కాని ......వారి కి సంభందించిన పూజ్య పీఠాధిపతులు, లేక పీఠాలు కాని అన్ని దేవతా మూర్తుల దేవతలను ..దేవాలయాలు నిర్మిస్తున్నారు.. ఇది చాలా పవిత్రమైన అంశము ..గొప్పవిషయమే కదా .కాబట్టి వారిపేరు లొనే ఉంది వైదికులుఅని కాకపోతే అందరూ శైవం కు సంబంధించి న విభూది పుండ్రములు ధరిస్తారు ....కాకపోతే ఈ విషయాన్ని కూడా విమర్శించే వాళ్ళు వున్నారు ...అన్నీ...వాళ్ళే చేస్తూ ఇంకో దేవత.ఆరాధకులను ..రానివ్వరు ...అడ్డబొట్టుపెట్టుకుని అన్నింటిలోనూ వారేఉంటారు అందాక ఎందుకు అన్ని టీవీ ఛానల్స్ వాళ్లే వైదికులేరాజ్యము ఏ లుతూ ఉంటారు వాళ్ళకే మొత్తం తెలుసు అనే అహ0కారము ఒకళ్ళు చేరితే చాలు మొత్తం వాళ్లవాళ్లనే అందరిని దింపుతారు ఆకాశవాణి లో వ్యుద్యోగాలు వాళ్ళవే అన్నిఛానల్లో కూడాచాలామంది వారే .. ఇక ...ఎన్నిసార్లు చాగంటి వారు విష్ణు వు ను విమర్శించారో పాత వి ఆయ నవి.ఉపన్యాసాలు తీసి చూడండి ...ఈ మధ్య ఎందుకో కాస్తంతా తగ్గించారు ...చాలామంది వైదికులు కు విష్ణువుపడదు ...ఇప్పుడు మారుతూ వున్నారు ..శ్రీరాముడు ..శ్రీకృష్ణుడు ఆరాధనలో ఉండి కొంత మారుతూవున్నారు .ఓకే. బాగానే ఉంది అది వారి ఇష్టం కానీ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ..ఎక్కువ శాతం వారి పేర్లు విష్ణు వు పేర్లు కలిగి ఉంటారు ..సూర్యనారాయణ,శాస్త్రి శ్రీనివాసశర్మ... లక్ష్మీపతి ..హరిశాస్త్రి.. రామకృష్ణ శాస్త్రి.. అలా ఉంటాయి .....అలా ఎందుకు .వారి దైవం పేరు ఏదో అదే పెట్టుకోవచ్చు కదా !..కానీ వైష్ణవులు కనపడితే రుస రుస లాడతారు ఎందుకో తెలీయదు. ..నా ఉద్దేశ్యం ప్రకారం అగ్ని..సంపదలు శివభగవానుడు జ్ఞానం,అధికారం ఇస్తాడు ..సూర్యభగవానుడు....ఆరోగ్యాన్ని ఇస్తాడు ..శ్రీమహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ..అనే కారణం అయుండవచ్చు .అందుకే ..శివ దేవుని బొట్టు పెట్టుకుంటారు విష్ణువు పేరు పెట్టుకుంటారు ..ఎందుకంటే మోక్షం కావాలిగా అందుకు . మళ్ళీనియోగు లలో ,వైష్ణవు లు శైవులు శాక్తేయులు ఉంటారు . నియోగులలో లింగదారులు ఉంటారు ..వారు శివలింగాన్ని ధరిస్తారు చాగంటి వారు ,ఎస్.పి బాలు ,వీరు లింగధారులు ..ఇక శుద్ధ వైష్ణవు లు కూడా ఉంటారు ..మనం ఈ ఆధునిక కాలంలో చెప్పుకొనే ఆంధ్రావాల్మీకి ...వాసుదాసు గారు వావికోలను సుబ్బారావు గారు ,కంచర్ల గోపన్న గారు ...ఇంకా చాలామంది ఉన్నారు ..అస్సలు శ్రీ వైష్ణవ అనే శా ఖ పేరు లోనే వుంది.. వాళ్ళు విష్ణుఆరాధకులు అని రామానుజులు శ్రీ చేర్చారు ..అమ్మవారు ని పట్టుకొని అయ్యవారికి చెప్పించుకోవడం ...తల్లి మనస్సు కొంచెం కోమలం కదా బిడ్డని మన్నిస్తూ తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ..తండ్రి కోపాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇప్పిస్తుంది అని శ్రీవైష్ణవ అని చెప్పారు .అటువంటి విష్ణుదేవతా కులం వారు లేక శాఖ వారు వేరే దేవుని విషయం వారి మనస్సుల్లో రాదేమిటి అని కొంతమంది పౌరాణికులు అడగడం కొంచెం ఆశ్చర్యము ...ఈ రోజుల్లో అందరూ అంత విధి గా పాటించడ0 లేదు ...ఎవరో చాలా కొద్ది శాతం చాదస్తం తో మాట్లాడుతున్నారు కానీ ...మిగిలిన వారు అన్ని దేవాలయాలు తిరుగుతూనే వున్నారు ..పైగా కొన్ని జాతక సమస్యలకు ...చాలామంది శ్రీ వైష్ణవ పండితులు శివాభిషేకం చేయంచుకోమనే వారు ...కొంతమంది కొద్దిశాతం వారు శుద్ధ వైష్ణవ0 ఉన్నమాట నిజమే ఉదాహరణకు అన్నమాచార్యలవారు ...ఆయన కు విష్ణువు దర్సనం కావాలని కొండలు,కోనలు తిరుగుతూఉంటే ..శివభగవానుడు దర్సనం ఇచ్చాడు ...కుదరదు ..స్వామి ..నా అన్వేషణ అంతా శ్రీమహావిష్ణువు ..ఆయనే స్వయంగా నాకు దర్శనం కావాలి ...అని ముందుకు వెళ్లిపోయాడు అన్నమయ్య....అలానే ..శా క్తేయులు కూడ అంటే ..వాళ్ళ.. కులం పేరే అది ...అస్సలు త్రిమూర్తులును ఇంద్రుడుని కుబేరుడు ని అమ్మవారు ...కి నాలుగు మంచము కోడుల్లాచేసుకొని అమ్మవారు పైన సింహాసనేశ్వరి లా కూర్చున్నది అని వాళ్ళు చెబుతారు ..కాబట్టి వైదికులు వారి శా ఖా పద్దతులే వేరు....వారిని మిగతా వారితో కల్పలేము ..అయితే ఇప్పుడు.... ఇప్పుడే ..శ్రీవైష్ణవు లు కూడా పౌరోహిత్యమ్ లోకి వస్తూవున్నారు ....వాళ్ళు కూడా శివాభిషేకం చేస్తూ ,చేయు0 చడం నేను విన్నాను ..అస్సలు బ్రహ్మ వైవర్తి పురాణములో శివభాగవానుడే శ్రీమహావిష్ణువు ని సేవించేవారిలో మొట్టమొదటి భాగవతోత్తముడు అని చెప్పబడినది .సరే శివభగవానుడి గురించి చెప్పినప్పుడు శ్రీమహావిష్ణువు ఆయనను సేవిస్తాడాని ఇలా రెండు అభిప్రాయాలు కనిపిస్తూనేఉంటాయి పురాణాలలో అందుకే వాళ్ళిద్దరకు బేధం లేదు అని కదా ....... ఇప్పుడు వీళ్ళు అంటారు.ఎంతోకాలం ఎంతోమంది విష్ణుభక్తులు వారి పోరాటం జీవితాల్ని బలిపెట్టిన తరువాత ఇప్పటికి శివకేశవులకు బేధము లేదు అనే విషయం బైటకు వ్యాప్తి ఆయనది అనియు ,తిరుమల తిరుపతి క్షేత్రం కృతయుగం నుంచి వివిధ పేర్లు తో.. ఉన్నప్పటికీ ఇప్పటి యుగం లో ఉన్న మూర్తి ఎవరు అనే గొడవల్లోభగవత్ రామనుజలవారు కృషి తో ...అప్పటివరకు ఎంతో మంది వైష్ణవ భాగవతోత్తముల.. బలిదానము తో తానే స్వయంగా కదిలివచ్చి శ్రీమన్నారాయణుడు శ0ఖచక్రధారి అయి కలియుగరక్షకుడు గా నిరూపించ బడటం. రామానుజలవారు..వైష్ణవం.. ని శ్రీవైష్ణవం గా తీర్చి దిద్దటం తో వైష్ణవులకు ఈ నాటికి ..ఇప్పటికి సంపూర్ణ గౌరవం వచ్చింది అని చెప్పేవారు లేకపోలేదు . కొంతమంది పురాణ పండితుల బాధ ఏమిటంటే ..ఒకప్పుడు దేవాలయాలు శైవ విష్ణు ఏదైనా కూడా ..వైదికులు మాత్రమే ఉండేవారు ..అన్ని పూజలు వాళ్ళే చేసేసేవారు ..ఇప్పుడు రామానుజ మతాన్ని బహుళ ప్రచారం లోకి తెచ్చిన జీయర్ స్వామివారి కృషి వల్ల ..ఇప్పుడు దేవాలయాలలోను ..గ్రామాల్లో పట్టణాలలో ను పౌరోహిత్యం శ్రీ వైస్టనవులు కూడా చేస్తున్నారు ..ఇంత కాలం మహా శివలింగాన్ని పొడు వును బ్రహ్మ విష్ణువు కనుక్కోలేపోయారని ..ఆ కధ ప్రచారం చేసుకున్నారు ..తర్వాత క్రమంలో వైస్టనవులు ..ఇటువంటి కధ పద్మ పురాణంలో ఒకటి ఉంది ..శ్రీ మహా విష్ణువు ..వచ్చి పెద్ద అగ్ని పర్వతంగా నిలబడి ..శివ బ్రహ్మ లని అడిగితే ఆ అగ్ని తేజస్సు. శ్రీ మహా విష్ణు వే అని ఎవ్వరు చెప్పలేక పోతారు అలా 0టి కధ లు వైష్ణవ మతం వారి పురాణ కధలు బైటకు వచ్ఛాయు ..ఇక ఈ మధ్య కాలం లో కొన్ని దేవాలయాలలో వైస్టనవులు వాళ్ళ ఆగమ0 పెట్టి మొత్తం వైష్ణవ0 చేసేస్తున్నారు అని కొన్నాళ్ళు గొడవలు పెట్టారు ..ఇదంతా జీయర్ స్వామి వారి మీద కోపంతో ఆయాప్రసిద్ద పురాణ పండితులు ఆయన్ని ..పనిలో పని వైష్ణవ జనాలను కూడా..తిట్టి పారేస్తున్నారు..రాగ ద్వేషాలు ను పరిమితి లో పెట్టుకోవాలి లేదా తీసేయాలి..అని చెప్పే ఇరు వర్గాల వారు వాటిని పుష్టిగా పెంచుకొని కొట్టుకుంటూ వున్నారు
అస్సలు రామానుజులు వారిది అద్వెతమే కానీ..... విశిష్ట మైన అద్వెతము ...అందుకే విశిష్టాద్వైతం ము అని రామానుజులవారి మతానికి పేరు వచ్చింది ..ఎవరో కొంతమంది ఆళ్వార్లు మాత్రం
వీర వైష్టవం పలుకులు పలికినవారే...ఎందుకంటే వారు మొట్టమొదటి మార్గదర్సక0గా నిలబడిన వారు ..కాబట్టి వారు తొణకరు బెణ కరు ..కదా గట్టిగా వారి సిద్ధాంతం ఏదో గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది ..
ఏది ఏమైనా ...రాజాశ్రయం పొందిన వారుఅలా చెబుతున్నారు అని కొంతమంది పురాణం చెప్పేవారి ఆరోపణ కానీ ఎవరో నాకు అర్థం కాలేదు ఒక వేళ జీయర్ వారు అనుకుంటే .......... జీయర్ వారు కూడా యాదగిరి గుట్ట పై శివాలయాన్ని కూడా చాలా గొప్పగా నిర్మాణం చేయంచారు ..ప్రతీ వైష్ణవ ప్రముఖ క్షేత్రాల!లో శివుడు క్షేత్రపాలకులు గా ఉంటూ ఉంటాడు ఇది ప్రతి వైష్ణవ జనుల కు తెలిసినదే ....మరి జీయర్ స్వామి వారు అంటే కొంతమంది పౌరాణికు లు కు నచ్చదు ..వారి..పురాణకాలక్షేపం.. అస్సలేనచ్చదు
అలానే జీయర్ స్వామి వారు చెప్పినట్లుగా వింటున్నారు కేసీఆర్ అన్నారు ......కానీ ..చండీ యాగం, రుద్రయాగం కేరళ వారిచే కొన్ని శైవయా గాలు కూడా చేయంచుకుంటూనే వున్నారు ....కొన్ని సందర్భాల్లో వైదికులు ,శైవులతో ఆ యాగం చేయుంచుకొండి ..అని కూడా కే సీ ఆర్ కు జీయర్ స్వామి వారు చెప్పారు ..అంతే కాదు శ్రీ శారదాపీఠం స్వరూపానంద స్వామి వారికి కూడా కేసీఆర్ కొంత భూమి ఆశ్రమం కోసం ఇచ్చి వారి సలహాలు కూడా కేసీఆర్ తీసుకుంటున్నారు కదా
మరి రాజాశ్రయం పొంది ..పిచ్చిపిచ్చి సలహాలు ఇస్తే ఇంతకాలం వారి సంబంధాలు బాగుండేవా?...ఏది ఏమైనా ...ఎవరి పీఠం వారు వారి వారి మతాయునులకు శిరోధార్యం ఆ విషయం కాదనలేము ....దాని విషయంలో ఈర్ష్య.. ద్వేప్షము ..జీయరు వారిపై. పెంచుకుంటే చేసేది ఏమీ లేదు ..శ్రీమన్నారాయణ డే అందరికి రక్ష
ఇక బ్రాహ్మణుల కు బ్రాహ్మణులే శత్రువులు ..అని చెబుతూ అంబేద్కర్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారం అని ..బ్రాహ్మణ విష సర్పాల కోరలు పీకేశాడ ని ...అందరి బ్రాహ్మణులు కు మొగుడు మా అంబేత్కర్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు
దానితో అయినా అన్ని బ్రాహ్మణ వర్గాలు, అందులో అన్నిశాఖల వారు ఇకనైనా ఒకరి పట్ల ఒకరు ఈర్ష్య, అసూయ ముఖ్య0గా ఆహ0కారం వదిలేసుకొని బుద్దిగా కల్సి మెలసి ఉండాలని ...ఈ పాఠం బోధిస్తోంది ...ఇది సత్యం ...సత్యం ....సత్యం ..ముమ్మాటికీ సత్యం🌹🌹🌹
🙏🌹 నీళ్లతో ..water ఉపయోగించి దీపాలు వెలిగించే ప్రక్రియ ...చూడండి 🌹🙏
🙏🌷ఓం నమో వేంకటేశాయ ...ఓం నమో నారాయణాయ🙏🌷
Blog Archive
-
▼
2021
(189)
-
▼
October
(12)
- 🌷🙏బ్రహ్మ పురాణం లోని ఈ ఘట్టం జాగ్రత్తగా వినండి ....
- Part 14 ...............!Short story nirikshana. ...
- మసాలా రాజకీయాలు ఒకసారి చూద్దాం ....
- 🙏పెద్దలతో అనుభవాలు ..!కొన్ని జ్ఞాపకాలు🥀
- 🌹🙏విజయదశమి శుభాకాంక్షలు సందర్భంలో విజయవాడలో శ్రీ...
- మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
- 🌷🙏ఒక సూక్తి🙏🌷
- నిరీక్షణ.. shortstory. Nirikshna. Part 13 .....
- 🙏🌹బ్రాహ్మణులు లో లోపాలను దిద్దుకొని అందరూ ఐక్యం ...
- 🙏🌷 ఏనుగు కధ చూడండి Personality develop?ent కి...
- 🙏🌹 నీళ్లతో ..water ఉపయోగించి దీపాలు వెలిగించే ప...
- పూర్వకాలంలో అగ్గిపెట్టె కు బదులుగా ఈ చిన్న పనిముట్...
-
▼
October
(12)
Followers
About Me
- Dr.M muralikrishna