Part 12
అరుణ వాళ్ళ పిన్ని ఇంట్లో నే కాలం గడుపుతోంది ..ఖాళీగా ఉంటే మనస్సు ఆందోళన గా ఉంటుంది అని భావించుకొని పి .జి చదువు కోసం ప్రయత్నాలు చేసుకుంటూవుంది ..వాళ్ళ అమ్మ వంటరిగా ఊళ్ళో ఉండిపోవడం ..ఆమెను అక్కడ నుంచి ఎలా తన దగ్గరకు తెచ్చుకోవాలో ఆలోచనలో పడిపోయుంది .ఒక్కసారి ఆమె మనస్సులోశివ నారాయణ తొంగి చూసి నట్లు అనిపించింది ....చెరువు గట్టు పై కూర్చొని ..కాళ్ళు నీళ్లలో ఆడిస్తుంది ..అక్కడ రెండు గోరంక లు ..శృ0గార0గా ..వయ్యారంగా కులుకుతున్నాయు ..చల్లటి గాలి
హాయి గా ఉంది ..పచ్చటి పొలాలు పైరు గాలి కి అటూ ఇటూ అందంగా ఊగుతూవున్నాయి ..మంచిగా ఇద్దరం కల్సి ఉండి ఉంటే ఈ పాటికి ఏ యూనివర్సిటీలో నో చదువుకొంటూ వుండే వాళ్ళం .శివ నారాయణకు .ముక్కుమీద నే కోపం ..అయినా అది కొద్దీ సెకన్లు మళ్ళీ బాధ పడతాడు ..నేను తప్పు గా మాట్లాడానా ..సారీ అంటాడు ...అయునా నేనే ఎక్కువ ఎప్పుడూ అతగాడ్ని ఆట పట్టిస్తూ వుండే వాడ్ని ..చ క్రాలాంటి కళ్ళు కోల ముఖము ..కొటేరు ముక్కు ..అన్నింటి కంటే మంచి మనసు ..అబ్బో ..అలా తన లో తానేముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడిపోతోంది ..శివ నారాయణ వచ్చి తన కౌగిలిలో తల దాచుకున్న0తగా. ..దగ్గరకు ముడుచుకుపోతో0ది అరుణ ..అస్సలు ఏం అనుకుంటున్నాడో నేను గుర్తున్నానా ..ఎలా ఉన్నాడో ..ఆ ఎలా ఉంటాడు ..అక్కడే అదే బ్యాంక్ లో చేస్తూ ఉంటాడు .అలాకాల0 గడిపేస్థూ ఉంటాడు ....ఏముంది లే ..మూతి ముడుచుకుంది ..అరుణ కుమారి
** ** ** ** **
కిరణ్ ..మీ ఊరు వెళ్ళి మీ అమ్మగారిని ..మీ చెల్లిగారిని తీసుకొని వద్దాం..వాళ్ళు
వచ్చిన తరువాత ..వాళ్ళ ని కూడా కూర్చోబెట్టి పెళ్ళి విషయాలు మాట్లాడదాం ..అనుకొని వారు ఇద్దరు ఊరు బయలు దేరారు ...
ఇక అమెరికా నుంచి ఇంటికి చేరుకున్న సుధ .. డిప్రషన్ తో కాల0 గడుపుతోంది
సుధ తల్లిదండ్రులు పేరు ఉన్న సైక్రియాటిస్టు డాక్టర్ రమణ అడ్రస్ సేకరించారు ..అదే సమయంలో ..సుధ చెల్లి ప్రియ కి పెండ్లి సంబ0ధం రావడం ..ప్రియ ని ఒప్పుకోమని తల్లిదండ్రులు చెప్పడం ..ఆమె కి ఇష్టం లేదని చెప్పడం ..గుచ్చి గుచ్చి కారణం అడగటం తో ..ఆమె అనిల్ ని ప్రేమించి పెళ్ళి కూడా చేసేసుకున్నాం ..అని గర్వంగా చెప్పి సామాన్లు తీసుకొని బైటకు వెళ్లిపోయుంది ప్రియ . బంధువులో పరువు తీశావు కదవే అని తల్లిదండ్రులు ఇద్దరు తల బాదుకొని కూర్చున్నారు ...అస్సలు నువ్వే కారణం నేను వ్యుద్యోగ0 డ్యూటీ అని వెళ్తూ ఉంటే నువ్వు ఇంట్లో సరిగా ఆడ పిల్లలు ను చూసుకోలేవా..నువ్వు ..అంటే నువ్వు అని ఇద్దరు కసురు కుంటు న్నారు సుధ తల్లిదండ్రులు ..చూసి చేసిన స0బ0ధం ..పెద్దమ్మా యు అమెరికా ది బాగుండి చచ్చిందా ....పోనీలేండి .ప్రియ వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు ..మంచిగా వుంటారేమో చూద్దాం ..అంది ప్రియ తల్లి ...నువ్వు మొట్ట మొదటినుంచి అంటూనే ఉన్నావు ..వాళ్ళు ఎవర్ని చేసుకున్నా ఇష్టమే కుల0 గోత్రం పిచ్చి పట్టింపు లేవని ..నువ్వు పాడే పాట మీ అమ్మాయి నిజం చేసింది ..మళ్ళీ ఆవేశంగా లేచాడు ప్రియ తండ్రి ....ఊరుకోండి ..మీ చుట్టాల అబ్బాయి కిరణ్ వచ్చి పోతూవుండే వాడా ..ఎనోసార్లు ప్రియని అడుగుతూ ఉండేవాడు ..మీకు చాలా సార్లు చెప్పనా ..మీరు చెప్పినప్పుడల్లా రుస రుస లాడారా..లేదా ..దబాయుంచింది. ప్రియ తల్లి .ఏమో మంచిగా చదువుకొని పై స్థాయి కి వస్తారు అనుకున్నాను వళ్ళు కొవ్వెక్కి ఇలా లేచిపోతారు అనుకోలేదు..ఛా.. ఆ కిరణ్ కేసి కట్టినా సరిపోయేది నిట్టూర్పులు విడిచాడు తండ్రి ..ఏమిత్రా భగవంతుడా ..పెద్దమ్మాయి ఇలా ఆయు0ది ..చిన్నమ్మాయి అలా వెళ్లిపోయుంది ..ఏమిటి ఖర్మ ...తల పట్టుకొంటూ .అలా బాధ లో వున్నారు ..ప్రియ తల్లి తండ్రులు ..
** ** ** **
కిరణ్ ..పిల్లనిఇవ్వబోతున్న మామగారు ఇద్దరు కలిసి కిరణ్ స్వగ్రామం చేరుకున్నారు .. అమ్మా ..వీరు నాకు కాబోయే మామ గారు ..డాక్టర్ గారు.. వీరి అమ్మాయిని చేసుకుంటువున్నాను అలా పరిచయం చేయడం ఆతర్వాత అక్కడ పరిస్థితులు అన్ని కొద్దీ కొద్దిగా వివరించి చెబట0 .. కిరణ్ తల్లి ..మొత్తం చెప్పేస్తే కిరణ్ ఆవేశంగా ఊగిపోతాడు ..ఆ రౌడీయిజం చేసే వాళ్ళ బలం ముందు వీడుఎంత ..అలా ఆలోచనల్లో పడి ...పనికి వచ్చే విషయాలు మాత్రమే చెప్పింది ...చూ. చాయగా.అక్కడ పరిస్థితులు బాగోలేదని కిరణ్ కి అర్ధం అయుంది .మొత్తానికి ఆస్తి తగవులు వస్తున్నాయని కొద్దిగా అర్ధం చేసుకున్నాడు
సరే ..అమ్మా ఆ విషయాలు ..సంగతులు అన్నీ తరువాత చూద్దాం ..ముందు నీ బట్టలు సర్దుకో ..అని కిరణ్ చెప్పగానే ..ఆలోచనలో పడిపోయుంది ..అస్సలు ఇక్కడ నుంచి ఎలా కదులుతాం ..ఈ రౌడీ వెధవలు ..మనల్ని కదల్నిస్తారా ..ఏం గొడవలు అవుతాయో ఏమో అని భయపడిపోతుంది కిరణ్ తల్లి ..కిరణ్ ని పక్కన పెద్దాయన చూసిన గ్రామస్తులు ..కొంతమంది రహస్యంగా కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టారు ....మానసిక డాక్టర్ అని తెలుసుకొని కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ..కొన్ని సమస్యలు చెప్పి ..మందులు వ్రాయు0చుకొంటున్నారు ....అలా ఒకటి రెండు రోజులు గడిచేసరికి .. కిరణ్ వైపు చాలామంది పరిచయస్తులు..వాళ్ళ తండ్రి గారి అభిమానులు చాలా మంది వచ్చారు ..డాక్టర్ గారి అల్లుడు కాబోతున్న కిరణ్ ని అభినందనలతో ముంచెత్తారు ..పెళ్ళి కి అందరిని ఆహ్వానించాడు డాక్టర్ రమణ ..పెళ్లి వాళ్ళ ఊళ్ళో పెట్టుకొని ..ఫ0క్షన్ ఇక్కడే పెట్టుకుంటాము అని అప్పుడైనా అందరూ వచ్చి ఆ శీర్వదించాలని భక్తి శ్రద్దలతో వేడుకున్నాడు డాక్టర్ రమణ..ఎప్పటినించో కిరణ్ కుటుంబాన్ని కష్ట నష్టాలకు గురి చేస్తున్న .. మనుషులు .భయంతో.. తప్పుకున్నారు ...ఆ విషయాలు అన్ని మొత్తం వివరించి ..కిరణ్ కు మేము ఉన్నాము మీకే0 పర్వాలేదు అని అభయం ఇస్తున్నారు కొంతమంది ..మా ఊళ్ళో మీ కుటుంబం అంతా కలిసి హాస్పిటల్ పెట్టవచ్చు కదా సారు ..మేము ..మీకు కావాల్సిన ఏర్పాట్లు ..అన్ని చేసిపెడతాము గా సారూ అని కొంతమంది. అభ్యర్దిస్తున్నారు ..అలా అన్ని విషయాలు గ్రహించిన డాక్టర్ రమణ ..కిరణ్ లు కిరణ్ తల్లిగారిని వెమ్మటి పెట్టుకొని కారులో వాళ్ళ పట్టణం కి బయలు దేరారు ..మార్గ మధ్యలో ..తాను పడిన బాధలు ..తన కూతురు అరుణకుమారి...తప్పించుకొని ఎటో వెళ్ళిపోయింది ..ఇంతవరకు నేను వెతకడం కూడా చేయలేక పోయాను ..అంత హీన స్థితిలో ఉండి పోయాను అని బాధపడ్తున్న ..తల్లిని కిరణ్ ..డాక్టర్ రమణ లు ఓదార్చారు ...మాది బాధ్యత మేము ప్రయత్నం గట్టిగా చేసి ..మీ సమస్యలను అన్ని పరిష్కరి స్తాము ..ఓదార్పుగా చెప్పారు ...అవును అన్నయ్య గారు ..మీరు మా అబ్బాయిని ఇంటి అల్లుడు గా స్వీకరించడమే ..మాకు కొండంత అండ ..మొదలయు0ది ..అనిపిస్తూవుంది ..కొంచెము కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ..కిరణ్ తల్లి .అలా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ....
** ** ** ** **
కిరణ ..గీత ల పెళ్ళి అయిపోయింది ....కొత్త బంధ0 కొంగొత్త అనుబంధంగా వారి జీవితాలు ..ఆకళింపు కాబోతున్నాయి.కొత్త పెళ్ళి జంట .కిరణ్ ..గీత లు డాబా పైన వెన్నెల లో విహరిస్తున్నారు ..కిరణ్ ..మీరు.పెళ్ళి కి నిర్వచనం ఏం చెబుతారు ..ఎర్రని పెదవులు విచ్చుకుంటుంటే తెల్లని మల్లె మొగ్గల చిరునవ్వు కొంటెగా విసిరింది ...గీత ..మేడమ్ గారు .మీరు బాగా చెప్పగలరు ..మా కంటే కొంచెం వినయంగా చెప్పాడు కిరణ్ ..ఇక చాలండి మేడమ్ గారు అమ్మయు గారు అని పిలవడం ..గీత అని పిలవచ్చు చాలు ..ఏదో అలా పిలిచి పిలిచి మా డాడీ ని బుట్టలో వేసుకున్నారు ..అమ్మాయు ని పటా యుంచారు ..ఇక చాలదా ఏమిటి ?కొంచెము కవ్విస్తున్నట్లు అనేసింది ..గీత ..సరే గీత ..మీరు అలా అంటే నేను కాదనేది ..ఏముంది .ఒక విధముగా ..నేను సక్సెస్ అయ్యాను ..అమ్మాయిని గెలుచుకున్నాను ..అనుకుంటాను ..ఓకే ..అన్నాడు ముసి ముసి నవ్వులతో కిరణ్
మీరు చెప్పకనే చెప్పారు కిరణ్ ..పెండ్లి కి నిర్వచనం ..ఇదే ..అని నవ్వేసింది గీత
అంటే నాకు అర్ధం కాలేదు ..పెదవి విరిచాడు కిరణ్ ..ఏముంది ..ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం ..సమర్దించుకోవడం ..సరిదిద్దుకోవడం ...సంభాళించు కోవడం నేను అమ్మాయు ని ప టాయుంచారు ..అన్నాను ..అయినా దానిని మీరు మంచి భావన లో కి తిప్పుకున్నారు ...అలాగాకుండా ..ఏంటమ్మా ..నాకు మీ పెద్దలే అడిగి చేశారు నేనేమి వె మ్మటి పడి ప్రేమ లేఖలు వ్రాయ లేదు ..అని అనవచ్చు మీరు అలా అనలేదు గా ..కొంటెగా వివరించి చెప్పింది గీత ....అవును గీత ..రెండు శరీరాలు ..ఒక్కటే హృదయం ..ఇద్దరిది ఒకే మాట ..పెద్దలు నమ్మి కట్టుబాట్లతో
నమ్మకంతో ఇద్దరిని ఒకేచోట కల్పి ఉంచి ముడి వేస్తారు కదా .. ఆ అగ్రిమెంట్ ..ఆ ఒప్పందానికి బంధువులను ..స్నేహితులు ను ..ఊరి జనాలని పిలిచి వారి అందరి సమక్షం లో జరిపేది శుభ కార్యం పేరే పెళ్ళి ...వారందరూ ఒక సాక్ష్యం ...కోపతాపాలు ..కొట్లాటలు ..ఎన్నో యుద్ధాలు రావచ్చు ...కానీ అది కొద్దిసేపు మాత్రమే ...తరువాత ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ..పెద్దల కన్నుల్లో ఆశలను తలచుకుంటే ...వాళ్ళు మనకోసం ఎంతగా శ్రమించారో..పరితపించారో తెలుసు కుంటే ...గంటలు సమయం గడిచేసరికి ..కొట్లాడుకున్నదంపతులు ఏదో విధంగా ..ఒకరికి ఒకరు సారీ చెప్పుకొని కలుసుకోవాలి ...సాధ్యమైనంత వరకు తప్పులు ..మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా దంపతులు మసలుకోవాలి ఇగో లు పక్కన పెట్టాలి ......కానీ ఈ రోజుల్లో రక రకాలుగా కారణాలు కనిపిస్తూవున్నాయి
కొంతమందిలో విపరీతమైన కోపం ...శా డిజం ..అనుమానం ..తో అవమానించడం ..ఇక ఓర్పు కూడా పోయి విడిపో తున్నారు ..ఇక అంత ప్రశాంత జీవితం జీవనం లేనప్పుడు ...విడిపోయి ఎవరి దారి వాళ్ళు హాయిగా బ్రతకచ్చు అనుకుంటు న్నారు ...కానీ పిల్లలు ఉంటే మాత్రం వారిని బాధ పెట్టకూడదు అలా కొత్త దంపతులు సీరియస్ టాపిక్ విన్నది అటువైపుగా వచ్చిన కిరణ్ తల్లి గారు
ఏమిటమ్మా ..మీరు..ఎప్పుడో పెళ్ళి అయిపోయిన దంపతుల్లా మాట్లాడుకుంటున్నారు ..అని నవ్వుకుంటూ అక్కడకు వచ్చి నిలబడింది ....................(..ఇంకా ఉంది ....to be continued ............)
0 comments:
Post a Comment