🌹 ఓం నమో వేంకటేశాయ🌹
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🌹 మిత్రులు ...మరియు పెద్దలు అందరికి శ్రీ కృష్ణాష్టమి ...గోకులాష్టమి శుభాకాంక్షలు 🌹
నిరీక్షణ పార్ట్ 12 ............short story part ....12 ...Nirikshna
Part 12
అరుణ వాళ్ళ పిన్ని ఇంట్లో నే కాలం గడుపుతోంది ..ఖాళీగా ఉంటే మనస్సు ఆందోళన గా ఉంటుంది అని భావించుకొని పి .జి చదువు కోసం ప్రయత్నాలు చేసుకుంటూవుంది ..వాళ్ళ అమ్మ వంటరిగా ఊళ్ళో ఉండిపోవడం ..ఆమెను అక్కడ నుంచి ఎలా తన దగ్గరకు తెచ్చుకోవాలో ఆలోచనలో పడిపోయుంది .ఒక్కసారి ఆమె మనస్సులోశివ నారాయణ తొంగి చూసి నట్లు అనిపించింది ....చెరువు గట్టు పై కూర్చొని ..కాళ్ళు నీళ్లలో ఆడిస్తుంది ..అక్కడ రెండు గోరంక లు ..శృ0గార0గా ..వయ్యారంగా కులుకుతున్నాయు ..చల్లటి గాలి
హాయి గా ఉంది ..పచ్చటి పొలాలు పైరు గాలి కి అటూ ఇటూ అందంగా ఊగుతూవున్నాయి ..మంచిగా ఇద్దరం కల్సి ఉండి ఉంటే ఈ పాటికి ఏ యూనివర్సిటీలో నో చదువుకొంటూ వుండే వాళ్ళం .శివ నారాయణకు .ముక్కుమీద నే కోపం ..అయినా అది కొద్దీ సెకన్లు మళ్ళీ బాధ పడతాడు ..నేను తప్పు గా మాట్లాడానా ..సారీ అంటాడు ...అయునా నేనే ఎక్కువ ఎప్పుడూ అతగాడ్ని ఆట పట్టిస్తూ వుండే వాడ్ని ..చ క్రాలాంటి కళ్ళు కోల ముఖము ..కొటేరు ముక్కు ..అన్నింటి కంటే మంచి మనసు ..అబ్బో ..అలా తన లో తానేముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడిపోతోంది ..శివ నారాయణ వచ్చి తన కౌగిలిలో తల దాచుకున్న0తగా. ..దగ్గరకు ముడుచుకుపోతో0ది అరుణ ..అస్సలు ఏం అనుకుంటున్నాడో నేను గుర్తున్నానా ..ఎలా ఉన్నాడో ..ఆ ఎలా ఉంటాడు ..అక్కడే అదే బ్యాంక్ లో చేస్తూ ఉంటాడు .అలాకాల0 గడిపేస్థూ ఉంటాడు ....ఏముంది లే ..మూతి ముడుచుకుంది ..అరుణ కుమారి
** ** ** ** **
కిరణ్ ..మీ ఊరు వెళ్ళి మీ అమ్మగారిని ..మీ చెల్లిగారిని తీసుకొని వద్దాం..వాళ్ళు
వచ్చిన తరువాత ..వాళ్ళ ని కూడా కూర్చోబెట్టి పెళ్ళి విషయాలు మాట్లాడదాం ..అనుకొని వారు ఇద్దరు ఊరు బయలు దేరారు ...
ఇక అమెరికా నుంచి ఇంటికి చేరుకున్న సుధ .. డిప్రషన్ తో కాల0 గడుపుతోంది
సుధ తల్లిదండ్రులు పేరు ఉన్న సైక్రియాటిస్టు డాక్టర్ రమణ అడ్రస్ సేకరించారు ..అదే సమయంలో ..సుధ చెల్లి ప్రియ కి పెండ్లి సంబ0ధం రావడం ..ప్రియ ని ఒప్పుకోమని తల్లిదండ్రులు చెప్పడం ..ఆమె కి ఇష్టం లేదని చెప్పడం ..గుచ్చి గుచ్చి కారణం అడగటం తో ..ఆమె అనిల్ ని ప్రేమించి పెళ్ళి కూడా చేసేసుకున్నాం ..అని గర్వంగా చెప్పి సామాన్లు తీసుకొని బైటకు వెళ్లిపోయుంది ప్రియ . బంధువులో పరువు తీశావు కదవే అని తల్లిదండ్రులు ఇద్దరు తల బాదుకొని కూర్చున్నారు ...అస్సలు నువ్వే కారణం నేను వ్యుద్యోగ0 డ్యూటీ అని వెళ్తూ ఉంటే నువ్వు ఇంట్లో సరిగా ఆడ పిల్లలు ను చూసుకోలేవా..నువ్వు ..అంటే నువ్వు అని ఇద్దరు కసురు కుంటు న్నారు సుధ తల్లిదండ్రులు ..చూసి చేసిన స0బ0ధం ..పెద్దమ్మా యు అమెరికా ది బాగుండి చచ్చిందా ....పోనీలేండి .ప్రియ వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు ..మంచిగా వుంటారేమో చూద్దాం ..అంది ప్రియ తల్లి ...నువ్వు మొట్ట మొదటినుంచి అంటూనే ఉన్నావు ..వాళ్ళు ఎవర్ని చేసుకున్నా ఇష్టమే కుల0 గోత్రం పిచ్చి పట్టింపు లేవని ..నువ్వు పాడే పాట మీ అమ్మాయి నిజం చేసింది ..మళ్ళీ ఆవేశంగా లేచాడు ప్రియ తండ్రి ....ఊరుకోండి ..మీ చుట్టాల అబ్బాయి కిరణ్ వచ్చి పోతూవుండే వాడా ..ఎనోసార్లు ప్రియని అడుగుతూ ఉండేవాడు ..మీకు చాలా సార్లు చెప్పనా ..మీరు చెప్పినప్పుడల్లా రుస రుస లాడారా..లేదా ..దబాయుంచింది. ప్రియ తల్లి .ఏమో మంచిగా చదువుకొని పై స్థాయి కి వస్తారు అనుకున్నాను వళ్ళు కొవ్వెక్కి ఇలా లేచిపోతారు అనుకోలేదు..ఛా.. ఆ కిరణ్ కేసి కట్టినా సరిపోయేది నిట్టూర్పులు విడిచాడు తండ్రి ..ఏమిత్రా భగవంతుడా ..పెద్దమ్మాయి ఇలా ఆయు0ది ..చిన్నమ్మాయి అలా వెళ్లిపోయుంది ..ఏమిటి ఖర్మ ...తల పట్టుకొంటూ .అలా బాధ లో వున్నారు ..ప్రియ తల్లి తండ్రులు ..
** ** ** **
కిరణ్ ..పిల్లనిఇవ్వబోతున్న మామగారు ఇద్దరు కలిసి కిరణ్ స్వగ్రామం చేరుకున్నారు .. అమ్మా ..వీరు నాకు కాబోయే మామ గారు ..డాక్టర్ గారు.. వీరి అమ్మాయిని చేసుకుంటువున్నాను అలా పరిచయం చేయడం ఆతర్వాత అక్కడ పరిస్థితులు అన్ని కొద్దీ కొద్దిగా వివరించి చెబట0 .. కిరణ్ తల్లి ..మొత్తం చెప్పేస్తే కిరణ్ ఆవేశంగా ఊగిపోతాడు ..ఆ రౌడీయిజం చేసే వాళ్ళ బలం ముందు వీడుఎంత ..అలా ఆలోచనల్లో పడి ...పనికి వచ్చే విషయాలు మాత్రమే చెప్పింది ...చూ. చాయగా.అక్కడ పరిస్థితులు బాగోలేదని కిరణ్ కి అర్ధం అయుంది .మొత్తానికి ఆస్తి తగవులు వస్తున్నాయని కొద్దిగా అర్ధం చేసుకున్నాడు
సరే ..అమ్మా ఆ విషయాలు ..సంగతులు అన్నీ తరువాత చూద్దాం ..ముందు నీ బట్టలు సర్దుకో ..అని కిరణ్ చెప్పగానే ..ఆలోచనలో పడిపోయుంది ..అస్సలు ఇక్కడ నుంచి ఎలా కదులుతాం ..ఈ రౌడీ వెధవలు ..మనల్ని కదల్నిస్తారా ..ఏం గొడవలు అవుతాయో ఏమో అని భయపడిపోతుంది కిరణ్ తల్లి ..కిరణ్ ని పక్కన పెద్దాయన చూసిన గ్రామస్తులు ..కొంతమంది రహస్యంగా కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టారు ....మానసిక డాక్టర్ అని తెలుసుకొని కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ..కొన్ని సమస్యలు చెప్పి ..మందులు వ్రాయు0చుకొంటున్నారు ....అలా ఒకటి రెండు రోజులు గడిచేసరికి .. కిరణ్ వైపు చాలామంది పరిచయస్తులు..వాళ్ళ తండ్రి గారి అభిమానులు చాలా మంది వచ్చారు ..డాక్టర్ గారి అల్లుడు కాబోతున్న కిరణ్ ని అభినందనలతో ముంచెత్తారు ..పెళ్ళి కి అందరిని ఆహ్వానించాడు డాక్టర్ రమణ ..పెళ్లి వాళ్ళ ఊళ్ళో పెట్టుకొని ..ఫ0క్షన్ ఇక్కడే పెట్టుకుంటాము అని అప్పుడైనా అందరూ వచ్చి ఆ శీర్వదించాలని భక్తి శ్రద్దలతో వేడుకున్నాడు డాక్టర్ రమణ..ఎప్పటినించో కిరణ్ కుటుంబాన్ని కష్ట నష్టాలకు గురి చేస్తున్న .. మనుషులు .భయంతో.. తప్పుకున్నారు ...ఆ విషయాలు అన్ని మొత్తం వివరించి ..కిరణ్ కు మేము ఉన్నాము మీకే0 పర్వాలేదు అని అభయం ఇస్తున్నారు కొంతమంది ..మా ఊళ్ళో మీ కుటుంబం అంతా కలిసి హాస్పిటల్ పెట్టవచ్చు కదా సారు ..మేము ..మీకు కావాల్సిన ఏర్పాట్లు ..అన్ని చేసిపెడతాము గా సారూ అని కొంతమంది. అభ్యర్దిస్తున్నారు ..అలా అన్ని విషయాలు గ్రహించిన డాక్టర్ రమణ ..కిరణ్ లు కిరణ్ తల్లిగారిని వెమ్మటి పెట్టుకొని కారులో వాళ్ళ పట్టణం కి బయలు దేరారు ..మార్గ మధ్యలో ..తాను పడిన బాధలు ..తన కూతురు అరుణకుమారి...తప్పించుకొని ఎటో వెళ్ళిపోయింది ..ఇంతవరకు నేను వెతకడం కూడా చేయలేక పోయాను ..అంత హీన స్థితిలో ఉండి పోయాను అని బాధపడ్తున్న ..తల్లిని కిరణ్ ..డాక్టర్ రమణ లు ఓదార్చారు ...మాది బాధ్యత మేము ప్రయత్నం గట్టిగా చేసి ..మీ సమస్యలను అన్ని పరిష్కరి స్తాము ..ఓదార్పుగా చెప్పారు ...అవును అన్నయ్య గారు ..మీరు మా అబ్బాయిని ఇంటి అల్లుడు గా స్వీకరించడమే ..మాకు కొండంత అండ ..మొదలయు0ది ..అనిపిస్తూవుంది ..కొంచెము కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ..కిరణ్ తల్లి .అలా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ....
** ** ** ** **
కిరణ ..గీత ల పెళ్ళి అయిపోయింది ....కొత్త బంధ0 కొంగొత్త అనుబంధంగా వారి జీవితాలు ..ఆకళింపు కాబోతున్నాయి.కొత్త పెళ్ళి జంట .కిరణ్ ..గీత లు డాబా పైన వెన్నెల లో విహరిస్తున్నారు ..కిరణ్ ..మీరు.పెళ్ళి కి నిర్వచనం ఏం చెబుతారు ..ఎర్రని పెదవులు విచ్చుకుంటుంటే తెల్లని మల్లె మొగ్గల చిరునవ్వు కొంటెగా విసిరింది ...గీత ..మేడమ్ గారు .మీరు బాగా చెప్పగలరు ..మా కంటే కొంచెం వినయంగా చెప్పాడు కిరణ్ ..ఇక చాలండి మేడమ్ గారు అమ్మయు గారు అని పిలవడం ..గీత అని పిలవచ్చు చాలు ..ఏదో అలా పిలిచి పిలిచి మా డాడీ ని బుట్టలో వేసుకున్నారు ..అమ్మాయు ని పటా యుంచారు ..ఇక చాలదా ఏమిటి ?కొంచెము కవ్విస్తున్నట్లు అనేసింది ..గీత ..సరే గీత ..మీరు అలా అంటే నేను కాదనేది ..ఏముంది .ఒక విధముగా ..నేను సక్సెస్ అయ్యాను ..అమ్మాయిని గెలుచుకున్నాను ..అనుకుంటాను ..ఓకే ..అన్నాడు ముసి ముసి నవ్వులతో కిరణ్
మీరు చెప్పకనే చెప్పారు కిరణ్ ..పెండ్లి కి నిర్వచనం ..ఇదే ..అని నవ్వేసింది గీత
అంటే నాకు అర్ధం కాలేదు ..పెదవి విరిచాడు కిరణ్ ..ఏముంది ..ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం ..సమర్దించుకోవడం ..సరిదిద్దుకోవడం ...సంభాళించు కోవడం నేను అమ్మాయు ని ప టాయుంచారు ..అన్నాను ..అయినా దానిని మీరు మంచి భావన లో కి తిప్పుకున్నారు ...అలాగాకుండా ..ఏంటమ్మా ..నాకు మీ పెద్దలే అడిగి చేశారు నేనేమి వె మ్మటి పడి ప్రేమ లేఖలు వ్రాయ లేదు ..అని అనవచ్చు మీరు అలా అనలేదు గా ..కొంటెగా వివరించి చెప్పింది గీత ....అవును గీత ..రెండు శరీరాలు ..ఒక్కటే హృదయం ..ఇద్దరిది ఒకే మాట ..పెద్దలు నమ్మి కట్టుబాట్లతో
నమ్మకంతో ఇద్దరిని ఒకేచోట కల్పి ఉంచి ముడి వేస్తారు కదా .. ఆ అగ్రిమెంట్ ..ఆ ఒప్పందానికి బంధువులను ..స్నేహితులు ను ..ఊరి జనాలని పిలిచి వారి అందరి సమక్షం లో జరిపేది శుభ కార్యం పేరే పెళ్ళి ...వారందరూ ఒక సాక్ష్యం ...కోపతాపాలు ..కొట్లాటలు ..ఎన్నో యుద్ధాలు రావచ్చు ...కానీ అది కొద్దిసేపు మాత్రమే ...తరువాత ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ..పెద్దల కన్నుల్లో ఆశలను తలచుకుంటే ...వాళ్ళు మనకోసం ఎంతగా శ్రమించారో..పరితపించారో తెలుసు కుంటే ...గంటలు సమయం గడిచేసరికి ..కొట్లాడుకున్నదంపతులు ఏదో విధంగా ..ఒకరికి ఒకరు సారీ చెప్పుకొని కలుసుకోవాలి ...సాధ్యమైనంత వరకు తప్పులు ..మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా దంపతులు మసలుకోవాలి ఇగో లు పక్కన పెట్టాలి ......కానీ ఈ రోజుల్లో రక రకాలుగా కారణాలు కనిపిస్తూవున్నాయి
కొంతమందిలో విపరీతమైన కోపం ...శా డిజం ..అనుమానం ..తో అవమానించడం ..ఇక ఓర్పు కూడా పోయి విడిపో తున్నారు ..ఇక అంత ప్రశాంత జీవితం జీవనం లేనప్పుడు ...విడిపోయి ఎవరి దారి వాళ్ళు హాయిగా బ్రతకచ్చు అనుకుంటు న్నారు ...కానీ పిల్లలు ఉంటే మాత్రం వారిని బాధ పెట్టకూడదు అలా కొత్త దంపతులు సీరియస్ టాపిక్ విన్నది అటువైపుగా వచ్చిన కిరణ్ తల్లి గారు
ఏమిటమ్మా ..మీరు..ఎప్పుడో పెళ్ళి అయిపోయిన దంపతుల్లా మాట్లాడుకుంటున్నారు ..అని నవ్వుకుంటూ అక్కడకు వచ్చి నిలబడింది ....................(..ఇంకా ఉంది ....to be continued ............)
వరలక్ష్మీ వ్రతం (పూజా విధానం)
వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )
శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-
పసుపు ................. 100 grms
కుంకుమ ................100 grms
గంధం .................... 1box
విడిపూలు................ 1/2 kg
పూల మాలలు ........... 6
తమలపాకులు............ 30
వక్కలు..................... 100 grms
ఖర్జూరములు..............50 grms
అగర్బత్తి ....................1 pack
కర్పూరము.................50 grms
చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )
తెల్ల టవల్ .................1
బ్లౌస్ పీసులు .............. 2
మామిడి ఆకులు............
అరటిపండ్లు ................ 1 dazans
ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు
అమ్మవారి ఫోటోల ......................
కలశము .................... 1
కొబ్బరి కాయలు ............ 3
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............
స్వీట్లు ..............................
బియ్యం 2 kg
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML
పూజా సామాగ్రి :-
దీపాలు ....
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
నూనె
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే
శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి *
ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు *
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు,
లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.
వ్రత విధానం :-
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.
కావలసినవి :-
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.
తోరం ఎలా తయారుచేసుకోవాలి :-
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
గణపతి పూజ:-
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
కలశపూజ :-
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
అధాంగపూజ:-
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.
(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః
తోరపూజ :-
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
వ్రత కథా ప్రారంభం :-
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.
శ్రద్ధగా వినండి.
పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం :-
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.
అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో
సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.
వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.
భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడంతప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది....
సర్వేజనాసుఖినోభవతు *
శ్రావణమాసం శుభవేళ ..వరలక్ష్మి అమ్మవారి పూజ అలిమేలు మంగమ్మ తల్లి దగ్గర చూసి తరించుదాం
🙏🌷 శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస ప్రభువు కి జయం జయం ...నిత్యా మంగళం 🙏🌷
🙏🌹🌹 ఓం నమో నారాయణాయా ..ఓం నమో వేంకటేశాయ 🌹🌷🙏
లింక్ పై టచ్ చేయండి .....యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది ..అప్పుడు చూడవచ్చు ..
Real estate...0pen.Plots for sale
పుల మామిడి....శంకరపల్లి దగ్గర ...మణికొండ నుంచి 50 ని..లు A PP L E G A T E... Royal gardens
Photo ...1ఇవి agriculture lands ..వీటిలో వ్యవసాయం చేసి లాభాల్లో షేర్ ఇస్తారుApplegate.... Royal Forms
గజం 5,500 రూ ..వీటిలో బేరం అడుకోవచ్చు నేను చెబితే ..మా వాళ్ళు తగ్గిస్తారు ..ఇవి గ్రామ పంచాయతీ అనుమతిపొందినవి ..మణికొండ నుంచి 50 ని లు పడుతుంశ0కర్ పల్లి ..పుల మామిడి ..మీరు నెట్ లో కూడా చూసుకోవచ్చు ..5 సం ల తర్వాత మంచి రేటు కి అమ్ముకోవచ్చు ...
దీనిలో పసుపు రంగు వేసిన వి అమ్మేసిన వి ...ఇంకాదీనికి స0..న దృశ్యాలు క్రింద చూడండి
305గజాలు ..605 గ ..1ooo గ ప్లాట్స్ గలవు
ఇది కూడా హైదరాబాద్ లో సంగారెడ్డి కి వెళ్ళే దారిలో ఉంది ..
ఇది కూడా DTCP. R E R A ...govt ఆమోదం పొందినది ...వెళ్ళి ఇల్లు కట్టేసుకోవచ్చు ..లేదా కొంతకాలం ఆగి మంచి రేటు కి అమ్ముకోవచ్చు ..సెల్ ఫోన్ ద్వారా మొత్తం ..పని పూర్తి చేసుకోవచ్చు ఏ దేశం లో వున్నా మీ సైట్ ని మీరే చూసుకోవ చ్చు అక్కడనుంచే నేరుగా డబ్బులు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ముందు ఫోన్ లో సంప్రదించండి ..లేదా ఒక మెస్సేజ్ ..ఇందులో డ్రాప్ చేయండి ...ఓం నమో వేంకటేశాయ
Hyderabad. ..నందు యాదాద్రి క్షేత్రం కి పక్కనే ఇళ్ళు కట్టుకోవడానికి వెంచర్ సిద్ధం
మీరు మొత్తం చూడండి ..అన్ని అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మి0చుకోవడానికి మధ్య తరగతి వారు ఎవరైనా సరే కొనేసుకొని ...ఇల్లు కట్టేసుకోవచ్చు ..గజం సుమారు 10 000 నుంచి ఉంటుంది ..మీరు మీ సెల్ ఫోన్ లో మీ సైట్ ని అనుసంధానం చేసుకొని రక్షణ పొందవచ్చు వాయిదా పద్ధతి లో కూడా ఉన్నాయి ..బ్యాంకు లోను కి అర్హత ఉన్నాయి
మీ ఇష్టం ..మీకు కావాలంటే ..ఒక మెస్సేజ్ పెట్టండి చాలు విదేశములో ఉండి కూడా సెల్ ఫోన్ లో మీ సైట్ ని చూసుకోవచ్చు ..అక్కడనుంచే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ..మిగతా వివరాలుకోసం 9866049495 లో సంప్రదించండి ...ఓం నమో వేంకటేశాయ
DTCP ..RE R A లో ..అంటే govt లో రిజిష్టర్ ఆయు అనుమతి పొందినది ఎటువంటి మోసాలు ఉండవు
మనిషి ........ గ్లోబలైజేషన్..
*మనిషి ఇరుక్కున్నాడు గ్లోబలైజేషన్ లో*
👉 డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు !
👉 పీలికబట్టల్ని వస్త్రధారణ అంటున్నారు!
👉 భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు!
👉 గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు!
👉 డూప్ ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు!
👉 పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు!
👉 అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు!
👉 ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు!
👉 సరదాలను సంస్కృతి అంటున్నారు!
👉 భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు!
👉 కోరిన కోర్కెలు తీరిస్తేనే దేవుడంటున్నారు!
👉 ఆస్తి ఉంటేనే గొప్పవాడు అంటున్నారు!
👉 మందు పోయిస్తేనే మిత్రుడు అంటున్నారు!
👉 సొమ్ములు తెస్తేనే సంసారం అంటున్నారు!
👉 కాసులు తెస్తేనే కాపురం అంటున్నారు!
👉 నిజాయితీగా ఉంటే అసమర్ధుడంటున్నారు!
👉 సక్రమంగా ఉంటే అమాయకుడంటున్నారు!
👉 అసత్యాలు మాట్లాడితే బ్రతక నేర్చిన వాడంటున్నారు!
👉 నిజం పలికితే బ్రతక నేర్వని వాడంటున్నారు!
👉 న్యాయబద్ధంగా ఉంటే ఎలా బ్రతుకుతాడో అంటున్నారు!
👉 అన్యాయంగా బ్రతికినా ఎంచక్కా ఉన్నాడంటున్నారు !
👉 అన్యాయాన్ని ఎదిరిస్తే అతనికెందుకు అంటున్నారు!
👉 నిజాయితీగా బ్రతికితే కూడుపెడుతుందా అంటున్నారు!
👉 మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!
👉 మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు!
👉 పరిస్థితులకు అనుగుణంగా పాత అర్ధం చెరిగిపోయి, ప్రయోజనాలకు అండగా పరమార్ధం ఆవిర్భవిస్తోంది!
👉 స్వార్ధ కాంక్షాణుగుణంగా విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది!
*ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే!*
👶 టెక్నాలజీ పెరిగింది.
👶 సౌకర్యం పెరిగింది.
👶 విలాసం పెరిగింది.
👶 విజ్ఞానం పెరిగింది.
👶 కాలుష్యం పెరుగింది.
👶 ఖర్చు పెరిగింది.
👶 కల్తీ పెరిగింది.
👶 రసాయన బంధం పెరిగింది.
*సర్వే జనా సుఖినోభవంతు* ......సేకరణ.....
కొన్ని మెసేజ్ లు ఇలా చక్కర్లు కొడుతూవున్నాయు very pity
🙏🙏విన్నపం.....విన్నపం ...విజ్ణప్తి ..🙏🙏🌷
చాలా మంది లాక్ డౌన్ సమయం లో ఎన్నో ఇబ్బందులు పడుతూవున్నారు ..ముఖ్యంగా ప్రయివేటు రంగంవ్యుద్యోగస్థులు కాలేజీలు స్కూళ్లు ..ఇంకా కాంటాక్ట్ బేసిస్ వ్యుద్యోగస్టులు ..కి పొట్ట గడవటమే కష్టం గా ఉంది ..అలానే చిన్న చిన్న సాఫ్టువేరు వ్యుద్యోగుల పరిస్థితి బాగాలేదు కానీ లక్ష ల్లో జీతం వచ్చే సాఫ్టువేరు లు బాగానే వున్నారు ..ఇంట్లో కూర్చొని ఖాతాలో వేయుంచుకుంటున్నారు ....ఇక ప్రభుత్త్వ వ్యుద్యోగుల లో ముఖ్యంగా కాలేజీలు ..ప్రభుత్త్వ పాఠశాలలు వారి కి కూడా జీత భత్యాలు బాగానే పెరిగి ..ప్రస్తుతం లక్డౌన్ లో చాలా కాలం నుంచి ఇంట్లోనే ఉండిపోయు నా జీతం ఖాతాల్లో పడిపోతుంది ....బాగుంది ..అందరూ బాగుండాలి అని కోరుకుంటాం కదా ఓకే ..ఇక ఇప్పటి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ వ్యుద్యోగస్థులు టీచర్లు లెక్చరర్లు ..ప్రొపెసర్లు ..ప్రయువేటు టీచి0 గ్ రంగ0 కుదేలుపడిబాధపడుతూవున్న వారి అందరిని కాస్తో కూస్తో ఆదుకోవాల్సిన ధర్మం ఉంది ....అలానే చిన్న సాఫ్టువేరు వ్యుద్యోగస్టులు అందరిని ఆ పెద్ద కంపెనీ సాఫ్టువేరు వ్యుద్యోగులు ఆదుకోవాల్సివుంది...అలానే ఇస్సారి పరిస్థితులను బట్టి బాగా సంపాదించుకొని తల పండిన వాళ్ళు 50 స0 దాటిన వాళ్ళు స్వచ్ఛందంగా దిగితే కొత్తవాళ్లకు అవకాశాలు వస్తాయి ..కొంతమంది భార్యా భర్తలు కూడా సాఫ్టువేరు లో ఫుల్లుగా సంపాదించు కున్నారు ..వాళ్ళు కూడా నిరుద్యోగుల దమనీయ పరిస్థితిని ఒక్కసారి పరిశీలించ0డి ..ఇకనైనా ఇతరులకి అవకాశాలు ఇవ్వండి ..పొలాలు ఇల్లు దొడ్లు ..షా పింగ్ కాంప్లెక్స్ తోటలు ..రెండు కార్లు ..మూడు కార్లు ఇలా ఎన్నో కొనేసి వున్నారు కదా పొట్టకు పట్టెడు అన్న0 చాలు ..మిగతాదంతా ఇనుపబీరువాల్లో .మూలిగితే ఏమిటి ప్రయోజనం ఈ లక్డౌన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ..కనీసం తిండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ..అవకాశం ఇమ్మని ప్రార్ధన🙏🙏🙏🙏🙏🙏🙏🙏...........(సేకరణ ............
😂🌝 సరదాగా కాసేపు రాజకీయ వినోదం...ఈ లింక్ లో చదువుదాం 😂🌝
https://www.idreampost.com/te/news/political/top-notch-officials-opinion-on-jagans-nanu-nedu-scheme
భక్తి లోకం ఆవల రాజకీయాలు కూడా ఎలా మలుపులు తిరుతున్నాయో కొంచెము మసాళా taste చూద్దాం
సరదాగా పరిశీలన చేద్దాం ..మనకు ఏ రాజకీయపార్టీ లు వద్దు కొంచెం గరం గరం మసాలా.. చూసి వదిలేద్దాం
దీనిలో ఒక సీనియర్ జర్నలిస్ట్ సింగం కృష్ణమోహన్ గారు ఈ అంశం లోబాగా నిర్వహించారు అని కొందరు చెప్పారు చూద్దాం
వంద శ్లోకాలు చదివితే శ్రీమద్ రామాయణం చదివినట్లే. కనీసం వింటూ పని చేసుకోండి ఎంతో శుభం ..లాభం
🙏🌷🌷🌷శ్రీ హనుమ జయ హనుమ ..జయ జయ హనుమ ...శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌷🌷🌷🙏
ఈ లింక్ లో కొంత రాజకీయ సమాచారం ఉంది ..విందాము
https://www.idreampost.com/te/news/political/ap-debts-is-all-loan-lent-by-jagan
శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతం చూడండి కనీసం వింటూ అయునా పనిచేసుకోవచ్చు ..శుభ ఫలితం ఉంటుంది
🙏 🌹🌹 🌹 మంగళ గౌరీ అమ్మవారికి .శ్రీ శంకర.స్వామివారికి జయం జయం 🌹🌹🌹🙏
🙏 🌷🌷🌷 ఓం నమో వే0కటేశాయ ..ఓం నమో నారాయణా య🌷🌷🌷🙏
🙏🌷🌷భగవంతుడు మనకు జ్ఞానం చెప్పటానికి ఒక అంశ లో గురువులుగా వచ్చి మనలని ఉద్దరిస్తూవుంటారు🙏🌷🌷
సద్గురు రాఘవేంద్రులు ..వారికి చాలా పేర్లు ఉన్నాయి ..వేంకట నాధుడు ..పరిమళా చార్యులు ..భట్టారచార్యులు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ..అయితే శ్రీవేంకటేశ్వర స్వామి వారి అంశ తో వచ్చిన స్వామి ..అందుకే శ్రీ వేంకటేశ్వర
స్వామి వారి అవతారం గురు రాఘవేంద్రులు అనాలి .అలా అనడం సబబు ..ఎందుకంటే శ్రీవే0కటేశ్వర స్వామి వారు వివిధ పేర్లు తో కోట్ల సంవత్సరాల నుంచి వున్నారు ....గురు వులు ఒక వంద సంవత్సరాలు క్రితం వచ్చిన అవతారం కొంత మంది తెలియక గురువు అవతారము ..భగవంతుడు అనడం అంత సబబు కాదు ..అలానే చాలామంది ఆధునిక గురువులు ..యోగా గురువులు ..గాడ్ మెన్ ఉమెన్ ..లు వుంటారు ..అంతర్జాతీయంగా ఎన్నో దేశాలలో వారి ఫోటో లు ..పుస్తకాలు ..స్పీచ్ లు ..జనాల ఉన్న సభలు మనకు కని పిస్తూ ..వినిపిస్తూ ఉంటాయి .అంత మాత్రం చేత ..పెద్ద పెద్ద బొమ్మలు వాళ్ళవి పెడుతూవుంటారు ..వారి పాదాల చిత్రం ..కూర్చున్న చిత్రం పవళించిన చిత్రం తెచ్చి పెట్టుకుంటారు ..అది బాగానే వుంది ఎవరి ఇష్టం వారిది ..కానీ ..తర .తరా ల నుంచి మన పూర్వులనుంచీ వస్తున్న దేవుడి బొమ్మలు ..విగ్రహాలు ఉంటాయి ..వీటిని ..మోడరన్ .గురువులు ..లేక గురువులు పాదాల దగ్గర పెడుతూవుంటారు ..కొన్ని చోట్ల శ్రీయంత్రం పైన గురువుల బొమ్మలు పెట్టి పూజలు చేస్తుంటారు ..అది చాలా తప్పు.
ఇంకా కొంతమంది వాదం ఏమిటంటే గురు అనుగ్రహం ఉంటే చాలు....బాగానేవుంది ..అంతమాత్రం చేత భగవంతుని
వదిలేయమని కాదు ..గురువు కి నమస్కారం చేసి భగవంతుడు ని ప్రార్ధన చేసుకోవాలి ..గురువు భగవంతుడిని చేరుకోవడానికి మార్గం చూపుతాడు ..చేయు పట్టుకొని భగవంతుని దగ్గరకు చేరుస్తాడు ....అందుకే గురువు తో పాటు భగవంతుని పై ధ్యాస కూడా ఉండాలి ..అందుకే సద్గురు సాయునాధుల వారు ..ఆయన భక్తులచేత భగ వద్గీత ..భాగవతం ..శ్రీ విష్ణు సహస్ర నామాలు చదివించే వారు ..శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేయి మని చెప్పుతూవుండే వారు ..శ్రీ వైష్ణవ మతం లో ఆహ్0 బ్రాహ్మా స్మి అనే స్థితి ఉండదు ..నేనే మొత్తం .....అందరిని ..రక్షించేస్తాను అని గురువు చెప్పడు ...భగవంతుని వైపు చూపిస్తాడు ..ఆయనే అందరిని రక్షించే దైవం ..ఆయన నామ0 జపించండి ..అని చెబుతాడు ..జగద్గురువుఆ ది శంకరాచార్యులు వారు కూడా ఎన్నో మహాత్మ్యాలు చూపించారు ..కానీ గురువులు గానే చెప్పుకుంటారు అలానే ..ఒక గురువును ధిక్కరించి ..శ్రీమత్ రామనుజులు వారు ఓం నమో నారాయణాయ అనే తిరు మంత్రం ..దేవాలయ శి ఖరం ..ఎక్కి ప్రజల0దరికి బిగ్గరగా అరిచి చెప్పాడు..అంతే కాని తన పేరు చెప్పుకుని నన్ను కొలవండి ..అంతా చేస్తాను ..అని వారు చెప్పలేదు వారిని మాత్రమే సద్గురువు లు అని పిలుస్తారు ..ఆ సద్గురు వులు ..శ్రీమతే రామనుజాయయై నమ్: సద్గురు రాఘవేంద్రా యనమః ఓం సద్గురు సాయునాధ్ మహా రాజు కీ జై
🌹🌹 ఓం నమో శ్రీ వేంకటేశా య🌹🌹
🌷🌷🌷ప్రతిరోజూ ప్రతీ మనిషి ముఖ్యంగా పఠించాల్సినమంత్ర0 .....జయ మంత్రం 🌹🌹🌹
Blog Archive
-
▼
2021
(189)
-
▼
August
(21)
- 🌹 మిత్రులు ...మరియు పెద్దలు అందరికి శ్రీ కృష్ణ...
- కొబ్బరికాయ ను చాలా తేలికగా పైన పెంకు తీయా లంటే ..ఇ...
- నిరీక్షణ పార్ట్ 12 ............short story part .....
- వరలక్ష్మీ వ్రతం (పూజా విధానం)
- శ్రావణమాసం శుభవేళ ..వరలక్ష్మి అమ్మవారి పూజ అలిమేలు...
- Real estate...0pen.Plots for sale
- పుల మామిడి....శంకరపల్లి దగ్గర ...మణికొండ నుంచి 50 ...
- Photo ...1ఇవి agriculture lands ..వీటిలో వ్యవసాయం ...
- ఇది కూడా హైదరాబాద్ లో సంగారెడ్డి కి వెళ్ళే దారిలో ...
- Hyderabad. ..నందు యాదాద్రి క్షేత్రం కి పక్కనే ఇళ్ళ...
- మనిషి ........ గ్లోబలైజేషన్..
- కొన్ని మెసేజ్ లు ఇలా చక్కర్లు కొడుతూవున్నాయు very ...
- 😂🌝 సరదాగా కాసేపు రాజకీయ వినోదం...ఈ లింక్ లో చ...
- భక్తి లోకం ఆవల రాజకీయాలు కూడా ఎలా మలుపులు తిరుతు...
- దీనిలో ఒక సీనియర్ జర్నలిస్ట్ సింగం కృష్ణమోహన్ గారు...
- వంద శ్లోకాలు చదివితే శ్రీమద్ రామాయణం చదివినట్లే. క...
- పార్లమెంట్ లో ఆ కధఏమిటి ...ఆ వార్త విందాము ఒకసారి
- ఈ లింక్ లో కొంత రాజకీయ సమాచారం ఉంది ..విందాము
- శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతం చూడండి కనీసం వింటూ అయు...
- 🙏🌷🌷భగవంతుడు మనకు జ్ఞానం చెప్పటానికి ఒక అంశ లో గ...
- 🌷🌷🌷ప్రతిరోజూ ప్రతీ మనిషి ముఖ్యంగా పఠించాల్సినమం...
-
▼
August
(21)
Followers
About Me
- Dr.M muralikrishna