Pages

కదానిక 11 పార్ట్ నిరీక్షణ..... Nirikshna. Short story....11 part

 


సాయంత్రం వేళ కిచెన్ లో టీతాగుతూపిచ్చాపాటిమాట్లాడుకొంటూవున్నారు . గీత
వాళ్ళ అమ్మ..చూడమ్మా ..నీకు పెళ్ళిచేసేయాలని మీ నాన్న గారు తెగ ఆరాటపడి
పోతున్నారు ..నువ్వు ఏమంటా వు చెప్పు గీత ...అమ్మా ...అది మీ ఇద్దరు మాట్లాడుకో0డి ..నేను ఎం చెబుతాను ..కొంచెము వయ్యారంగా చెప్పింది గీత
అది సరే ...కానీ నీకుఒకఅబ్బాయినిచూశారు ..చెప్పడ0పూర్తికాకుండానే ..నాకుచూసేశారా !.కొంచెముఆశ్చర్యంప్రకటించింది ..గీత .అదేనమ్మా ..మన కిరణ్ ...అని వాళ్ళ అమ్మ చెబుతూవుంటే ఒక్కసారిగా స్టన్ అయిపోయింది గీత  ...అస్సలు నీకు ఇష్టం అయితేనే ..ఇంకా ఆ అబ్బాయి ని అడగలేదు ..ఏమో నమ్మా అంతా మీ ఇష్ట0 కొంచెము గా సిగ్గుపడుతూ వెళ్లిపోయుంది గీత ..ఏమిటి నాకు కూడా డాక్టర్ నే చూడండి ..అంతేకాని ఈ సంబంధ ము ..వద్దు అంటుందేమో అనుకున్నా ..ఏమి మాట్లాడకుండా అలా పరిగెడుతుందే ..అవునులే అంతా ...ఆయన పోలిక ఏం చేస్తాం .మోహ0.కొంచెము విసుగ్గా పెట్టుకుంది గీత తల్లి ...కొద్దిసేపు సమయ0 అలా గడిచిపోయింది ...డాక్టర్ రమణ ..కిరణ్  వీపు పై చేయు ఆనించి నవ్వుకుంటూ ఇంటి హాల్లో కి తెచ్చి కూర్చోబెట్టాడు ..ఎదురు గా సోఫాలో కూర్చుని భార్య ..బిడ్ద లను పిలిచాడు ..అందరూ కలసి కొద్ది సేపు మాట్లాడుకున్నారు ..కిరణ్ ..నేను సూటిగా అడుగుతు న్నాను ...మా అమ్మాయి గీత గురించి రెండు మాటలు చెప్పండి ...నవ్వుకుంటూ అడిగాడు ..డాక్టర్ రమణ
సార్ ...నాకు పరీక్ష నా ఇది ..కొద్దిగా నవ్వాడు కిరణ్ ఏమిటి డాడీ ఇది .లేచి నిలబడింది గీత ..నువ్వు కూర్చోమ్మా ..ఒక్క నిమిషం ఉండు ..నేను మొత్తం చెబుతా ..అని లేచి ఆమెను కూర్చోబెట్టాడు ..డాక్టర్ గారు ....సై కాలజీ లో ఇది ఒక పరీక్ష లేమ్మా ..చూస్తూ ఉండూ ..మీరు చెప్పండి కిరణ్ ..ఇది కూడా ఒక పరీక్ష మీకు దీనివల్ల చాలా లాభము ఉంటుంది ..అది తరువాత చెబుతాను ..అన్నాడు నవ్వుకుంటూ డాక్టర్ రమణ ..సరే సార్ మీ ఇష్టం ..మీరు నాకు గురువులు ..మీరు ఆర్డర్ వేశారు ..నేను చేయాలి ...అంతే ...గీతగారు చక్కని వినయ వివేకం గల మంచి అమ్మాయి గారు ...కళ్ళు జిగేల్ మనే అందము..అదే ..అదే అందమైన సంస్కారం ..బాగా కష్ట పడి చదువుకొని మంచి డాక్టర్ అయ్యారు ..తల్లిదండ్రులు పెద్దలు చూపిన బాటలోనే నడిచే క్రమశిక్షణ గల మంచి అమ్మయుగారు అనికిరణ్  చెప్పుకుపోతూ ఉంటే.. చాలు డాడీ ఇక ఆపండి ..నవ్వుతూ పెద్దగా చెప్పింది గీత
ఓకే ..మరి నువ్వు చెబుతావా ....కిరణ్ గురించి ..అడిగాడు తండ్రి డాక్టర్ రమణ
డాడీ కొంచెము సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఉంది గీత ..అంతలో ..సార్ వద్దులెండి ..అని రిక్వెస్ట్ గా చెప్పాడు ..కిరణ్ ..సరే ..ఇప్పుడు నా అభిప్రాయం చెబుతాను వినండి ..నేను ఎప్పటినించో అనుకునట్లుగాను ..ఎన్నో పరీక్షల్లోగెలిచి నన్ను  ప్రభావితు డ్ని చేసిన ..కిరణ్ ..డాక్టర్ కిరణ్ ..డాక్టర్ గీత కు పెళ్ళి చేయాలని మా వృద్ద దంపతులము నిర్ణయుంచుకున్నాం ..మీ ఇద్దరూ మాట్లాడుకుని ఇద్దరిలో ఎవరికి అభ్య0తరం వున్నా ..చెప్పండి ...రండి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకో0డి..అంటూ  సోఫా  చూపించాడు ....ఇద్దరికి ఏకాంతం దొరికింది గీతగారు ..మీరు డెంటల్ వైద్యులు ..నేను ఒక మామూలు వాడ్ని ..మరి మీరు ఏం అనుకుంటున్నారు ..తల వంచి నేల చూపులు చూస్తూ అడిగాడు కిరణ్ ..అవును మీరు ఎందుకు సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తున్నారు ..కొంటెగా అడిగిందిగీత
అది ..మీఅందం నా కళ్ళకు గ్లేజ్ కొడుతుంది ..నేను అస్సలు ఊహించలేదు . ఇది నా జీవితంలో ఒక గొప్ప మలుపు ..ఇంత అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడుతుందా ..మళ్ళీ ఎక్కడో ఒక చిన్న సందేహం ....హలో ఇక ఆపండి సార్
అవి అన్ని పూర్తిచేసుకుని ఇక్కడ కూర్చున్నా ము ..మీ అంద చందాలు ..మీ నడవడిక ..మా అందరికి నచ్చడం వల్లే కదా ...అలా కొద్దిసేపు కాలం గడిచింది
ఇంతకు ..మీకు ఇద్దరికి ఓకే నా ..కుర్చీ దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు డాక్టర్ రమణ..ఇద్దరూ కొంచెము సిగ్గు పడుతూవున్నారు ..కిరణ్ మీరు చెప్పండి ..నాకు ఓ. కే .సార్ గీత గారు నాకు నచ్చారు ...నాకు ఆమె అంటే ఎంతో ఇష్టం ..మెల్లగా చెప్పాడు ..కిరణ్ ..ఏమ్మా .మరి నువ్వు చెప్పాలి మాకు ..నీ అభిప్రాయం కూడా చాలా ముఖ్యం ..త్వరగా చెప్పాలి. ఓకే ..డాడీ ..అంతా మీ ఇష్టం ..అదే వద్దు ..నీ జీవితం ..నీది ..ఒకవేళ సిగ్గుగా అనిపిస్తే ..నేను మీ అమ్మ లోపలికి పోదాం అక్కడ చెప్పు ..ఓకే ..అన్నాడు డాక్టర్ రమణ ..అబ్బా డాడీ ...ఓకే మిస్టర్ కిరణ్ గారు అంటే నాకు ఇష్టమే ..కొంచం మెల్లగా చెప్పి కొంచం సిగ్గుపడుతూ లోపలికి వెళ్లిపోయుంది ..గీత ..వెను వెంటనే కిరణ్ లేచి డాక్టర్ రమణ  దగ్గరకు చేరుకున్నాడు ..పాదాలును తాకాడు ..ఇది ఏమిటయ్యా బాబూ ..అంటూ లేచి నిలబడ్డాడు .డాక్టర్ రమణ ..సార్ ..నా గురించిమొత్తం  తెలుసు ..నేను మా చుట్టాల అమ్మాయి వెమ్మటి ప్రేమా .దోమ అంటూ తిరిగాను ..నేను పెద్ద రిచ్ కాదు
అయునా ...నన్ను నమ్మి ఇంత అవకాశం ఇచ్చారు ..సార్ .నిజ0గా ..మీరు నాకు దేవుడే ..ఈ రోజుల్లో ఎవ్వరూ ఇలా చేయరు ..ఎంత నమ్మకం ఉంటే మీ ఒకానొక కూతరు ని పైగా చదువుకున్న ..అందంగా ఉన్న అమ్మాయి  నాకు ఇచ్చి వివాహం జరిపించాలి అనుకుంటారు ..అందుకే మీ పాదాలకు నా తల అనించాను సార్ ..మీ నమ్మకాన్ని ..ఎప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ను వమ్ము కానివ్వను అని ప్రమాణం  చేసి చెబుతున్నా సార్ ...మీ పెద్దలు ఇద్దరు చెప్పినట్లే జీవితం అంతా నడుస్తాను ....గట్టిగా శపథం చేస్తునట్లు గా చెప్పాడు కిరణ్ ..మాకు  కావల్సింది అదేగా బాబూ నవ్వుతూ చెప్పాడు డాక్టర్ రమణ ..ముఖ్యంగా మీరు మేడమ్ ..ఆడపిల్లల విషయం లో అమ్మదే నిర్ణయం .. అటువంటి మీరు కూడా నన్ను ఇంటి అల్లుడు  అవడానికి అంగీకారం తెలపడం నా కోటీజన్మల అదృష్టం అంటూ ఆమె కి కూడా వంగి పాద నమస్కారం చేశాడు ..కిరణ్ ..చూడు బాబు నేను డాక్టర్ చదువుకోలేదు అయి నా నన్ను పెళ్ళిచేకున్నారు ..మీ మామయ్య గారు..మాకు అతిగా ఆశ లు ఏమీ లేవు బాబు ..ఒకళ్ళు అభిప్రాయాలను ఒకరు వినడం గౌరవించు కోవడం .ఎప్పుడూ..ఆయనకు నేను ఎదురు చెప్పలేదు ఇలా కాదండి అలా చేస్తే బాగుంటుందేమో ..అంటే సరే అనేవారు మీ మామయ్య గారు ..మాకు ఇగో అంటే తెలియదు ....బాబూ ఎంతో గరాబంగా..మురిపెంగా పెంచి మీ చేతిలో పెడుతున్నాం ..ఆ అమ్మాయి ని మంచిగా ఏ లోటు రాకుండా చూసుకుంటే ..మాకు అదే పెద్ద సంతోషం ..అదే పెద్ద వరం ...చిరునవ్వు తో చెప్పింది ..కాబోయే అత్తగారు ..
**                                    **                               **                             **                        **                         **  

                                                (  To be continued ...........ఇంకా ఉంది)

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online