Pages

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర0 ..కొన్ని ముఖ్య సంఘటన లు

 [7/26, 10:06 PM] Murali: ♦️ *మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది.*

♦️ *దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ లేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా  నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు.   ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.*

        ♦️   *గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు.*

♦️ *మిత్రులకు విన్నపము...* 

*ఈ కష్టం మనకు తెలీదు కనీసం మన శ్రీరాములు, ఘంటసాల గొప్పతనం*

*మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత*.

పైన వచ్చిన రచన ఒక వాట్సాప్ లో వచ్చింది ....దానికి మా తండ్రి గారి కొన్ని సంఘటనలు కూడా పొందుపరిచాను

💐💐💐💐💐

[7/26, 10:06 PM] Murali: సీతారాం గారి ఆమరణ నిరాహారదీక్ష కూడా చాలారోజుల చేశారట ..ఇంచుమించు గా పొట్టి శ్రీరాములు గారి కి కొద్ది రోజులు తేడా ..సీతారాం గారు కూడా అన్న0 తినకు0డా ఉండి చాలారోజుల కష్టపడ్డారట ...ఏదైనా మహానుభావులు ..ప్రాత:స్మరణియులు ..అలానే ఎర్నేని సుబ్రహ్మణ్య0 గారు తరువాత విజయవాడలో గాంధీ ఆశ్రమం స్థాపించారు ..మా నాన్నగారు శ్రీమాన్ మరింగంటి భట్టారచార్యులు సుబ్రమణ్యం గారు .ప్రకాశం పంతులుగారు ఆచార్య వినోభా భావే ..చిట్టిగూడూరు ఆచార్యులు వారుమొదలగు వారంతా విజయవాడ బందరు చిట్టిగూడూరు పెడన ఆ ఊర్లు అన్ని తిరుగుతూ ఇంకా తెలంగాణ లోను ..భూదానోద్యమం ..లోను . మా నాన్నగారు కి ఉన్న కొద్ది

 భూమి కూడా ఇచ్చేసి అంకితం అయిపోయారు హిందీ వృద్దు అరబిక్ భాషలుఇటు తమిళం భాషలు రావడం వల్ల వినోబాజి నాన్న గారిని హిందీ భాష అనువాదం కోసం వెమ్మటి తిప్పుకొనేవారు .కంచు కంఠం ..మైకులు లేకపోయునా గ్రామ సభల్లో పెద్దగా వినిపించేవి ..ఆ .మధుర కంఠం తో విజయవాడలో శ ర భయ్యా  గారి గుళ్ళల్లో కచేరి లు చేశారు ..తెలంగాణ లో వాతాపి గణపతి0 భజే అని ప్రార్థనా గీతంతొలిసారిగా వినిపించినవారిలోవీరు మొట్ట మొదటివారు ఆ రోజుల్లో గ్రామాల్లో అభివృద్ధి కోసం కృషిచేశారు అస్పృశ్యత ..దళితుల మరుగుదొడ్లు శుభ్రము చేయడం ..స్త్రీవిద్య ..ఇలాంటి వి ఎన్నో కార్యక్రమాలు త్రికరణ శుధ్ది గా చేశారు ..అలాంటి వారిని తలచుకొనెలా మీ రు తెచ్చిన రచన కు కృతజ్ఞతా భి వందనములు 

🙏డా౹౹మరి0గంటి మురళీ కృష్ణ

కదానిక 11 పార్ట్ నిరీక్షణ..... Nirikshna. Short story....11 part

 


సాయంత్రం వేళ కిచెన్ లో టీతాగుతూపిచ్చాపాటిమాట్లాడుకొంటూవున్నారు . గీత
వాళ్ళ అమ్మ..చూడమ్మా ..నీకు పెళ్ళిచేసేయాలని మీ నాన్న గారు తెగ ఆరాటపడి
పోతున్నారు ..నువ్వు ఏమంటా వు చెప్పు గీత ...అమ్మా ...అది మీ ఇద్దరు మాట్లాడుకో0డి ..నేను ఎం చెబుతాను ..కొంచెము వయ్యారంగా చెప్పింది గీత
అది సరే ...కానీ నీకుఒకఅబ్బాయినిచూశారు ..చెప్పడ0పూర్తికాకుండానే ..నాకుచూసేశారా !.కొంచెముఆశ్చర్యంప్రకటించింది ..గీత .అదేనమ్మా ..మన కిరణ్ ...అని వాళ్ళ అమ్మ చెబుతూవుంటే ఒక్కసారిగా స్టన్ అయిపోయింది గీత  ...అస్సలు నీకు ఇష్టం అయితేనే ..ఇంకా ఆ అబ్బాయి ని అడగలేదు ..ఏమో నమ్మా అంతా మీ ఇష్ట0 కొంచెము గా సిగ్గుపడుతూ వెళ్లిపోయుంది గీత ..ఏమిటి నాకు కూడా డాక్టర్ నే చూడండి ..అంతేకాని ఈ సంబంధ ము ..వద్దు అంటుందేమో అనుకున్నా ..ఏమి మాట్లాడకుండా అలా పరిగెడుతుందే ..అవునులే అంతా ...ఆయన పోలిక ఏం చేస్తాం .మోహ0.కొంచెము విసుగ్గా పెట్టుకుంది గీత తల్లి ...కొద్దిసేపు సమయ0 అలా గడిచిపోయింది ...డాక్టర్ రమణ ..కిరణ్  వీపు పై చేయు ఆనించి నవ్వుకుంటూ ఇంటి హాల్లో కి తెచ్చి కూర్చోబెట్టాడు ..ఎదురు గా సోఫాలో కూర్చుని భార్య ..బిడ్ద లను పిలిచాడు ..అందరూ కలసి కొద్ది సేపు మాట్లాడుకున్నారు ..కిరణ్ ..నేను సూటిగా అడుగుతు న్నాను ...మా అమ్మాయి గీత గురించి రెండు మాటలు చెప్పండి ...నవ్వుకుంటూ అడిగాడు ..డాక్టర్ రమణ
సార్ ...నాకు పరీక్ష నా ఇది ..కొద్దిగా నవ్వాడు కిరణ్ ఏమిటి డాడీ ఇది .లేచి నిలబడింది గీత ..నువ్వు కూర్చోమ్మా ..ఒక్క నిమిషం ఉండు ..నేను మొత్తం చెబుతా ..అని లేచి ఆమెను కూర్చోబెట్టాడు ..డాక్టర్ గారు ....సై కాలజీ లో ఇది ఒక పరీక్ష లేమ్మా ..చూస్తూ ఉండూ ..మీరు చెప్పండి కిరణ్ ..ఇది కూడా ఒక పరీక్ష మీకు దీనివల్ల చాలా లాభము ఉంటుంది ..అది తరువాత చెబుతాను ..అన్నాడు నవ్వుకుంటూ డాక్టర్ రమణ ..సరే సార్ మీ ఇష్టం ..మీరు నాకు గురువులు ..మీరు ఆర్డర్ వేశారు ..నేను చేయాలి ...అంతే ...గీతగారు చక్కని వినయ వివేకం గల మంచి అమ్మాయి గారు ...కళ్ళు జిగేల్ మనే అందము..అదే ..అదే అందమైన సంస్కారం ..బాగా కష్ట పడి చదువుకొని మంచి డాక్టర్ అయ్యారు ..తల్లిదండ్రులు పెద్దలు చూపిన బాటలోనే నడిచే క్రమశిక్షణ గల మంచి అమ్మయుగారు అనికిరణ్  చెప్పుకుపోతూ ఉంటే.. చాలు డాడీ ఇక ఆపండి ..నవ్వుతూ పెద్దగా చెప్పింది గీత
ఓకే ..మరి నువ్వు చెబుతావా ....కిరణ్ గురించి ..అడిగాడు తండ్రి డాక్టర్ రమణ
డాడీ కొంచెము సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఉంది గీత ..అంతలో ..సార్ వద్దులెండి ..అని రిక్వెస్ట్ గా చెప్పాడు ..కిరణ్ ..సరే ..ఇప్పుడు నా అభిప్రాయం చెబుతాను వినండి ..నేను ఎప్పటినించో అనుకునట్లుగాను ..ఎన్నో పరీక్షల్లోగెలిచి నన్ను  ప్రభావితు డ్ని చేసిన ..కిరణ్ ..డాక్టర్ కిరణ్ ..డాక్టర్ గీత కు పెళ్ళి చేయాలని మా వృద్ద దంపతులము నిర్ణయుంచుకున్నాం ..మీ ఇద్దరూ మాట్లాడుకుని ఇద్దరిలో ఎవరికి అభ్య0తరం వున్నా ..చెప్పండి ...రండి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకో0డి..అంటూ  సోఫా  చూపించాడు ....ఇద్దరికి ఏకాంతం దొరికింది గీతగారు ..మీరు డెంటల్ వైద్యులు ..నేను ఒక మామూలు వాడ్ని ..మరి మీరు ఏం అనుకుంటున్నారు ..తల వంచి నేల చూపులు చూస్తూ అడిగాడు కిరణ్ ..అవును మీరు ఎందుకు సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తున్నారు ..కొంటెగా అడిగిందిగీత
అది ..మీఅందం నా కళ్ళకు గ్లేజ్ కొడుతుంది ..నేను అస్సలు ఊహించలేదు . ఇది నా జీవితంలో ఒక గొప్ప మలుపు ..ఇంత అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడుతుందా ..మళ్ళీ ఎక్కడో ఒక చిన్న సందేహం ....హలో ఇక ఆపండి సార్
అవి అన్ని పూర్తిచేసుకుని ఇక్కడ కూర్చున్నా ము ..మీ అంద చందాలు ..మీ నడవడిక ..మా అందరికి నచ్చడం వల్లే కదా ...అలా కొద్దిసేపు కాలం గడిచింది
ఇంతకు ..మీకు ఇద్దరికి ఓకే నా ..కుర్చీ దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు డాక్టర్ రమణ..ఇద్దరూ కొంచెము సిగ్గు పడుతూవున్నారు ..కిరణ్ మీరు చెప్పండి ..నాకు ఓ. కే .సార్ గీత గారు నాకు నచ్చారు ...నాకు ఆమె అంటే ఎంతో ఇష్టం ..మెల్లగా చెప్పాడు ..కిరణ్ ..ఏమ్మా .మరి నువ్వు చెప్పాలి మాకు ..నీ అభిప్రాయం కూడా చాలా ముఖ్యం ..త్వరగా చెప్పాలి. ఓకే ..డాడీ ..అంతా మీ ఇష్టం ..అదే వద్దు ..నీ జీవితం ..నీది ..ఒకవేళ సిగ్గుగా అనిపిస్తే ..నేను మీ అమ్మ లోపలికి పోదాం అక్కడ చెప్పు ..ఓకే ..అన్నాడు డాక్టర్ రమణ ..అబ్బా డాడీ ...ఓకే మిస్టర్ కిరణ్ గారు అంటే నాకు ఇష్టమే ..కొంచం మెల్లగా చెప్పి కొంచం సిగ్గుపడుతూ లోపలికి వెళ్లిపోయుంది ..గీత ..వెను వెంటనే కిరణ్ లేచి డాక్టర్ రమణ  దగ్గరకు చేరుకున్నాడు ..పాదాలును తాకాడు ..ఇది ఏమిటయ్యా బాబూ ..అంటూ లేచి నిలబడ్డాడు .డాక్టర్ రమణ ..సార్ ..నా గురించిమొత్తం  తెలుసు ..నేను మా చుట్టాల అమ్మాయి వెమ్మటి ప్రేమా .దోమ అంటూ తిరిగాను ..నేను పెద్ద రిచ్ కాదు
అయునా ...నన్ను నమ్మి ఇంత అవకాశం ఇచ్చారు ..సార్ .నిజ0గా ..మీరు నాకు దేవుడే ..ఈ రోజుల్లో ఎవ్వరూ ఇలా చేయరు ..ఎంత నమ్మకం ఉంటే మీ ఒకానొక కూతరు ని పైగా చదువుకున్న ..అందంగా ఉన్న అమ్మాయి  నాకు ఇచ్చి వివాహం జరిపించాలి అనుకుంటారు ..అందుకే మీ పాదాలకు నా తల అనించాను సార్ ..మీ నమ్మకాన్ని ..ఎప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ను వమ్ము కానివ్వను అని ప్రమాణం  చేసి చెబుతున్నా సార్ ...మీ పెద్దలు ఇద్దరు చెప్పినట్లే జీవితం అంతా నడుస్తాను ....గట్టిగా శపథం చేస్తునట్లు గా చెప్పాడు కిరణ్ ..మాకు  కావల్సింది అదేగా బాబూ నవ్వుతూ చెప్పాడు డాక్టర్ రమణ ..ముఖ్యంగా మీరు మేడమ్ ..ఆడపిల్లల విషయం లో అమ్మదే నిర్ణయం .. అటువంటి మీరు కూడా నన్ను ఇంటి అల్లుడు  అవడానికి అంగీకారం తెలపడం నా కోటీజన్మల అదృష్టం అంటూ ఆమె కి కూడా వంగి పాద నమస్కారం చేశాడు ..కిరణ్ ..చూడు బాబు నేను డాక్టర్ చదువుకోలేదు అయి నా నన్ను పెళ్ళిచేకున్నారు ..మీ మామయ్య గారు..మాకు అతిగా ఆశ లు ఏమీ లేవు బాబు ..ఒకళ్ళు అభిప్రాయాలను ఒకరు వినడం గౌరవించు కోవడం .ఎప్పుడూ..ఆయనకు నేను ఎదురు చెప్పలేదు ఇలా కాదండి అలా చేస్తే బాగుంటుందేమో ..అంటే సరే అనేవారు మీ మామయ్య గారు ..మాకు ఇగో అంటే తెలియదు ....బాబూ ఎంతో గరాబంగా..మురిపెంగా పెంచి మీ చేతిలో పెడుతున్నాం ..ఆ అమ్మాయి ని మంచిగా ఏ లోటు రాకుండా చూసుకుంటే ..మాకు అదే పెద్ద సంతోషం ..అదే పెద్ద వరం ...చిరునవ్వు తో చెప్పింది ..కాబోయే అత్తగారు ..
**                                    **                               **                             **                        **                         **  

                                                (  To be continued ...........ఇంకా ఉంది)

🌹శ్రీరాధా కృష్ణ తత్వం ఆ కథా చరితం ఒకసారి చూసి తరించుదాం🌹


🌷 https://youtu.be/yI30qLoYgoI.....u ట్యూబ్ అనేది క్లిక్ చేయండి...డైరెక్ట్ గా వచ్చేస్తుంది జై రాధే కృష్ణ🌷

🌷ఏ యుగం ఎన్ని స0వత్సరాలు ..కాల చక్రం లె క్క లు🌷



ప్రపంచం లో పరిస్థితులు చూస్తుంటే కలియుగం అంతం అంటువున్నారు ..కానీ ఉత్సవాలు పూజలు ప్రారంభ సమయంలో కలియుగే ప్రధమ పా దే ...అని చదువుతూవుంటాము .కాబట్టి ఇంకా ప్రధమ పాదం నడుస్తుందిఇంకా

చాలా ఉంది ప్రధమ పాదం లో ఆ తరువాత ఇంకా మూడుపాదాలు జరగాలి  ...ఇప్పుడే పరిస్థితులు ఘోరంగా వుంటూవున్నాయి ...ఇంకా ఎంత ఘోరం గా రానున్నాయో ...అన్నివేళలా  భ గవ0తుని నామ0 జపిస్తూ మంచి మార్గం లో నడవటమే ...🌷మనకు శ్రీరామ రక్ష ...ఓం సద్గురు సాయునాదాయన మహా:🌷

                                        🙏🌷  ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🌷

Rainy season ..ఈ వర్షాకాలంలో వర్షాలు మొదలైనాయు ..గింజలు నాటి మొక్కలు పెంచుదాం


 

వర్షాలు మొదలయ్యాయి ..ఇలా ఇంట్లో కుటుంబ సభ్యులు తిని పడేసిన నేరేడు ..సపోటా సీతా ఫలం ఇంకా పోగేసిన కొన్ని వేప గింజలు ..డివైడర్స్ లోను మన0 బైయటకు వెళ్ళినప్పుడు ..ఖాళీ ప్రదేశాలలోను ..పండ్ల చెట్ల గింజలు ..ఇతర చెట్ల గింజలు వేస్తూవుంటాను .అలానే గోడలలో ..పాత చూరులలో ఇళ్లల్లో  మూలల్లో కనిపించే రావి ఇతర మొక్కలు కూడా తీసుకెళ్లి ..డివైడర్ లలో వేస్తూవుంటాను      ఇప్పటికి పదుల లో రావి ..ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇతర చెట్లు ఎన్నింటినో తెచ్చాను ...మీరు విత్తులు ప్రోగు చేసి ..బజారు వెళ్తూ ..లేదా మార్ని0గ్ వాక్ లో అయినా ఒక చిన్న పుల్లతో గుచ్చి ఒక్కొక్క విత్తనం వేస్తూ వెళ్ళండి ..లేదు బురదలో ఆయునా తిన్న గింజలు విసరండీ ..ముఖ్య0గా
అడవి జంతువులు కోతుల కి తిండి కోసం ఖాళీ ప్రదేశాల్లో పండ్ల మొక్కల కోసం కృషిచేద్దాం ..ముఖ్యంగా ..ప్రకృతి లో చెట్లు పెంచి మంచి గాలి వీచి మన జనులకోసం ..సమాజ0 కోసం కాస్త పాటుపడదాం డాక్టర్ యం.కె..
                         🙏🌷   ఓం నమో శ్రీ వేంకటేశాయ ..సద్గురు సాయునాధ మహారాజుకి జై  🙏🌷
                                                        🙏సర్వే జనా:సుఖినోభవంతు.  🙏

🙏🌷 శ్రీ వేంకటేశ్వరుని వైభవం ..మహాత్మ్యం.. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🌷🙏


 

🌷🌷🌷🙏శ్రీవేంకటేశ్వర స్వామివారి ...చరిత్ర భక్తి విశేషాలు కొన్ని 🌷🌷🌷🙏

 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర కె


*“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !*

*వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!*


తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం.


కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. 


శ్రీ మహావిష్ణువు తిరుమలలో మొదటిసారి వెలసింది మొదలు ఇప్పటివరకు మొత్తం మూడుసార్లు ఆలయ నిర్మాణం జరిగింది. విశ్వకర్మ, తొండమాన్ చక్రవర్తి ఇద్దరూ కట్టించిన రెండు ఆలయాలు ఇప్పటికీ సప్తగిరుల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి.


 మూడోసారి భరద్వాజ మహర్షి కట్టించిన ఆలయమే నేటి తిరుమల క్షేత్రంగా భాసిల్లుతోంది. అప్పటినుంచి తిరుమలేశుడు దేవదేవుడిగా పూజలందుకుంటున్నాడు.


ద్వాపరయుగం చివర్లో, కలియుగం ఆరంభాన స్వామివారికి తొండమాన్ చక్రవర్తి ఒక ఆలయం కట్టించారు. రెండు గోపురాలు, మూడు ప్రకారాలతో వేంకటేశ్వరస్వామికి ఆలయం నిర్మించినట్టు అష్టాదశ పురాణాల్లో ఉంది.


అయితే, తొండమాన్ చక్రవర్తి కట్టించిన గుడి కూడా కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. 


దాంతో స్వామివారి దివ్యమంగళ అర్చావతార స్వరూపం కూడా భూగతమైపోయింది. 


రెండో ఆలయం కూడా శిథిలం కావటంతో చాలాకాలం తర్వాత మళ్లీ శ్రీనివాసుడి కోసం ఆలయ నిర్మాణం జరిగింది. 


1900 సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో దేవాలయం నిర్మించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయ అర్చకులు శ్రీ గోపీనాథ దీక్షితులు, మరో గ్రామానికి చెందిన యాదవునికి స్వామివారు ఒకేసారి కలలో కనిపించారు. 


తన అర్చావతార స్వరూపం స్వామివారి పుష్కరిణికి దక్షిణం దిశగా ఒక చింతచెట్టు కింద భూగతమై ఉన్నట్టు చెప్పారు. దానిని వెలికితీసి అదే చోట మళ్లీ ప్రతిష్టించమని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం వాళ్లిద్దరూ దివ్యమంగళ స్వరూపం కోసం వెతుకుతూ వెళ్లి ఒక చోట కలుసుకుంటారు. 


ఇద్దరూ కలిసి చెట్టు కింద స్వామివారి రూపాన్ని కనుగొంటారు. తర్వాత కపిలగోవు పాలను కుండల్లో తీసుకొచ్చి పుట్ట మీద పోస్తారు. దాంతో పుట్టమన్ను కరిగిపోయి, అర్చావతారంలో ఉన్న స్వామివారు దర్శనమిస్తారు. సరిగ్గా అదే చోట భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో వైఖానస ఆగమోత్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు


భరద్వాజ మహర్షి నిర్మించిన ఆలయాన్ని అనేక మంది రాజులు, రారాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఆలయం చుట్టుపక్కల అనేక నూతన నిర్మాణాలు చేపట్టారు. తరతరాలుగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ దీక్షితుల వంశం వాళ్లే స్వామి వారికి సేవలు అందిస్తున్నారు. వారికి మాత్రమే మూలవిరాట్టుని తాకే అర్హత ఉంది. 


క్రీ.శ.614లో పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగా ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది.


ఆ వెండి విగ్రహాన్ని మనవాల పెరుమాల్ అని పిలుస్తారు. అప్పటికే స్వామివారి ఆలయంలో గర్భాలయం, అంతరాలం, విమాన గోపురం ఉన్నాయి.

అంతరాలం అనేది స్వామివారికి ఏకాంత సేవ జరిపే శయన మంటపం! ఈ మంటపం బయట రాములవారి మేడ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు స్వామివారి ఆలయ ప్రదక్షిణ ఉండేది. 


1150వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. స్వామివారి విమాన ఆకారాన్ని పెంచి, ఆ బరువును మోయడానికి గర్భాలయ గోడలను మరింత పటిష్టం చేశారు.


 ఆ క్రమంలోనే ప్రస్తుతమున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. రాములవారి మేడను మూసేసి అర్థమంటపం, ముఖ మంటపం కట్టారు. గరుడాళ్వార్ సన్నిధి, ఇరువైపులా ద్వారపాలకులను కూడా ఆసమయంలోనే నిర్మించారు. ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యం వైపు యోగ నరసింహస్వామి దేవాలయం, ఆగ్నేయంలో వరదరాజులస్వామి వారి ఆలయం, దక్షిణ ఆగ్నేయంలో యాగశాల మంటపం, పచన మంటపం, పాకశాల నిర్మించారు. అప్పుడే విమాన ప్రదక్షిణం ఏర్పడింది. 


గరుడాళ్వార్ సన్నిధి వెనకవైపు ధ్వజస్తంభం, బలిపీఠాన్ని ప్రతిష్టించారు. ఆ సమయంలోనే రెండో ప్రాకారంగా పిలిచే వెండివాకిలి నిర్మించారు.

13వ శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి మరిన్ని హంగులద్దారు. ఆలయం బయట రంగనాయకుల మండపాన్ని నిర్మించారు. 


అప్పుడే అద్దాల మండపం కూడా కట్టారు. ఈ అద్దాల మండపంలోనే వరాహస్వామి కొలువై ఉండేవారని చెప్తుంటారు. అప్పట్లో అక్కడ ఒక పూలబావి ఉండేది. 14వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల హయాంలో మహద్వార గోపురం, మహాప్రాకారం నిర్మించారు. 


మహద్వార గోపురం లోపల 16 స్తంభాలతో ప్రతిమా మంటపాన్ని కట్టారు. అందులో శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సామాన్య భక్తుడిగా తన ఇద్దరు రాణుల ప్రతిమలను ఏర్పాటు చేయించారు. ఆ రెండు విగ్రహాలు స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తాయి. 


అప్పటికే ఆలయంలో సుమారు 9, 10 శతాబ్దాల్లో నిర్మించిన వెయ్యి కాళ్ల మంటపం, వాహన మంటపం ఉండేవి. తిరుమల వెంకన్న ఆలయంలోని మండపాలు, ప్రాకారాలు, సోపానాలు, జలాశయాలే కాదు - ప్రతీరాయి ప్రతీస్తంభం వైఖానస ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మించారు. ఎక్కడా శాస్త్రాన్ని మీరలేదు. కించిత్ వాస్తుదోషం లేకుండా దివ్యక్షేత్రంగా తిరుమల ఆలయ నిర్మాణం జరిగింది.


*ఒకపక్క వరదహస్తం మరోపక్క కటిహస్తంతో నిశ్చలానంద మందార మకరందంతో కనిపించే శ్రీనివాసుడి రూపం మధురం!*


ఆయన నామం బతికించే సిద్ధమంత్రం! ఆయన పాదం పరమపదం! అందుకే


 *వేంకటాద్రి సమంస్థానం* *బ్రహ్మాండే నాస్తికించన!* 


ఎన్నిసార్లు కైమోడ్పులు అర్పించినా.. పునర్దర్శనం ఇప్పించు స్వామీ అని వేడుకుంటాం.


*గోవిందా హరి గోవిందా,*

*వేంకట రమణా గోవిందా,* *గోవిందా హరి గోవిందా,*

*వేంకట రమణా గోవిందా. ||32*


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వేంకటేశాయ*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తల్లిదండ్రులు కి ఉన్న ఒక అంచనా ..ఒక తియ్యని మమకారం ఒక తియ్యని అనుబంధం


 అమృతం తాగిన వారు దేవతలు ...అమృతం తాగించే వారు అమ్మా నాన్నలు ----అమీర్ కుష్రో 

ఒక వృద్దాశ్రమం లో తండ్రి గారి ని చూడటానికి వచ్చారు ..కొడుకు కుటుంబం .....కూతురు కుటుంబం 

గొప్పకట్టడం. ఈ బ్రిడ్జి ..లేక వంతెన


 

Relax ....free .from stress












                                                                         🌝😀Just fun😃🌝

పక్షులకోసం ఆయన పడే తపన


 

ప్రకృతి కోసం ..ప్రకృతి లోని జంతుజాలం కోసం ..రానున్న భావితరాల వారికోసం ఏదైనా ...కొద్దిగా నైనా చేద్దాం 

పురోహితులు ..వేద పండితులు కి భారతదేశం లో పెళ్ళి కావడం లేదు


 


భారతదేశసంస్కృతి ..ఆర్ష సంప్రదాయం ..భక్తి మార్గం కు పట్టుకొమ్మలు పూజారులు ..వేదపండితులు ..ఇప్పడు ఒక్కొక్కరికి 40 స0 లుదాటిపోతున్నా పెళ్లిళ్లు కావడం లేదు...వారిలో ఆదాయం బాగున్నా కూడా పెళ్లి కానివారు ఎంతోమంది వున్నారు ..కారణం ఆడపిల్లలు తక్కువగా ఉండటం ..వున్నా అతి కోరికలు ..ఇంకా ఇతర కులాలు లోకి వెళ్ళి ప్రేమ వివాహాలు ..ఇలా ఉంది ..ప్రపంచం ..గొప్ప గొప్ప ఇంటి పేరువున్న పండితులకు ..పిల్లలు ..వారసులు లేరు ముఖ్యంగా లేట్ మ్యారేజ్ స్ ...అస్సలు పెళ్ళి కాకపోవడం ..బ్రహ్మచారులుగా మిగిలిపోవడం ..ఇప్పడు మనుషులంతాభారత దేశంలో ..విదేశీ సంస్కృతి ..ఆ తిండి .అక్కడి ఆచారాలు ఎరువు తెచ్చుకొని ..అలవాటు పడిపోతున్నారు ..ప్రేమ వివాహాలు అంటూ ఆడ ..మగ కూడా ఎన్నో సార్లు పెళ్లి చేసుకుంటారు ..పెటాకులు కూడా చాలా తేలిక గా చేసేసుకుంటున్నారు ..పెళ్ళి పవిత్రత ..ఆ .బంధము గొప్పతనం ఇప్పుడు చాలామందికి తెలుసుకోవడం లేదు ...తెలిసినా గాలికి వదిలేసి ..తిరుగుతూవున్నారు ....అంతా మాయ ..

మహాసంకల్పం. అంటే ..ఏమిటో వినండి

 


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online