Pages

Part. ..9 ..నిరీక్షణ...... Nirikshnashort story part.....9

 సరే ..లే ఇక పదండి బాబు ..బయలుదేరదాం ...డాక్టర్ రమణ ..కిరణ్  లు క్రిందికి వచ్చి కారులో బయలు దేరారు ..చూడండి కిరణ్ నాకు రెండు ..మూడు రోజులు మా ఇంటి దగ్గర  .వుంటూ నాకు హెల్ప్ చేయాలి ..చేస్తారా ? .కారు డ్రైవింగ్ చేస్తూ అడిగాడు .డాక్టరు రమణ  నేనా సార్ . .అవును ..బాబు ..మీరే ...ఆయునా .కారులో ఉంది మన ఇద్దరమే కానీ ..ఇంకెవరూ లేరే..?....చిరునవ్వు తో అడిగాడు డాక్టర్ రమణ ...కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం ..సరే..లే.కిరణ్ బాబూ ..మీరు అంతగా ఓకే చెప్పటానికి ..సందేహిస్తుంటే ..వద్దులెండి..నేనే ఇంకా ఎవరినైనా చూసుకుంటాను .కొంచం కోపం నటిస్తూ చెప్పాడు డాక్టర్ రమణ .. బలే వారండి ..నేను మీకు ఆ మాత్రం సహాయం చేయలేనా సార్ ....పనులు అన్ని లిస్ట్ వ్రాసుకుంటా చెప్పండి ..సార్ ...కొంచం నవ్వు తెప్పించుకుంటూ అడిగాడు కిరణ్ ..

సరే ఇంతకూ మీ రీసెర్చి పద్ధతి ..విషయ సేకరణ ..అంతా మీ గైడ్ ..అదే ప్రొపెసర్ గారికి నచ్చుతుందా ....బలేవారు ..సార్ ..సాక్షాత్తూ ..ఆ సబ్జెక్ట్ కి డాక్టర్ గారు ..మళ్ళీ దానిలో వృత్తి గా డాక్టర్ గారు ..ఇక మీ నేతృతత్వం లో ఇంకా తిరుగు  ఉంటుందా ..అందుకే ..మా ప్రాపెసర్ గారు కూడా మీరు చెప్పి వ్రాయు0చేయు వన్ని ..ఆయన క్షుణ్ణంగా చదువుతూ వున్నారు...అలా వారిద్దరి సంభాషణ లో ..ఇల్లు రానే వచ్చి0ది
*                         *                             *                         *                          *

రాత్రంతా భయంతో వణికిపోతూ ..చీకటిలో వేగంగా నడిచిపోతుంది అరుణ ..తెల్లవారే లోపు ..దూరంగా వెళ్ళాలి ..ఈ చుట్టుప్రక్కల ఎక్కడ ఉండకూడదు ..ఏమో శివ నారాయణ ఇంటి కి వెళ్ళి ఈ రాత్రి కి తల దాచు కుంటే ఎలా ఉండేదో ..ఏమో లే నా గురించి ..ఆ కుటుంబా న్ని ..ఇబ్బ0దుల పాలు చేయడం దేనికి ..అస్సలే మా వాళ్ళు వెధవలు ..ఒక పక్క ఆలోచిస్తూనే ఇంకో పక్క తన పమిటి చెం గు తో ముఖాన్ని తుడుచుకుంటూ తుప్పలు ..గుట్టలు దాటుకుంటూ ..భయ భయ 0గా దగ్గర లోని ..పెద్దిపాడు రైల్వే స్టేషన్ కి చేరుకుంది ...అనేక కష్టాలు ..నష్టాలు కి తట్టుకొని ..ధైర్యం కూడ గట్టుకొని ఆగి ఉన్న రైలు లో ఎక్కి కూర్చుంది ...ప్రయాణం లో పడి ..దూరంగా జరిగిపోతుంది.
ఒక పక్క అరుణ కుమారి ఇంట్లో ..వాళ్ళ .రౌడీచుట్ట0   ..కాపు కాసి చూస్తున్నాడు అరుణ ఇంటికి తిరిగి రాగానే ..బంధించి ..వాళ్ల అబ్బాయి తో పెళ్లికి ఒప్పించి ..పొలం తానే కొట్టేయాలని  ..పధకం వేసుకున్నాడు ....ఒకాయన వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకున్నాడు ... చూడమ్మా.. మీ అమ్మాయి ని ఎక్కడికి  పంపించావో చెప్పు ..లేదంటే చెప్పించాల్సి ఉంటుంది ....హెచ్చరిక గా చెప్పాడు గురు నాధ0 ..  ఏమయ్యా...నీకే తెలియాలి ..నువ్వు ని గ్రూప్ వాళ్ళు మా కుటుంబ0 మీద పడ్డారు ...మీకేం మాయరోగం ..మా అమ్మాయి ని ఏం చేశారో నువ్వే చెప్పు ...కొద్ది గా గర్జించి నట్లు గా .అడిగింది ఆరుణ వాళ్ళ అమ్మ ...నేను ఏం చేశాను ...నేను  చేస్తున్నపని మంచి పని ..మీ అమ్మాయి ని మా ఇంటి కోడలు గా చేసుకొని ..మీ కుటుంబాన్నీ ఉద్దరించా లని కంకణం కట్టుకున్నాం ..అక్కయ్య ..దీర్ఘ0 తీ శాడు ....కొద్దిసేపు వాదోపవాదాలు ..చూడమ్మా ..అతిగా ఆవేశపడకు ..మీ అమ్మాయి .నీ దగ్గరకు వస్తుంది ..వచ్చినప్పుడు ..కాస్తంత నచ్చచెప్పు ....పిచ్చి పిచ్చి వేషాలు వద్దు మేము ..కాపలా కాస్తూనే ఉంటాం .. జాగ్రత్త   ..ఇక రండిరా పోదాం ..ఆవేశంగా ఊగిపోతూ వార్నింగ్ ఇచ్చి ..అంతా బైటకు ..వెళ్లిపోయారు ......
**                            **                            **                           **                  **

కిరణ్ ..రీసర్చివర్క్ సజావుగా సాగిపోతుంది  ఒక పది పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది ....తొంభై శా తం పని పూర్తి అయిపోవడం ..ప్రొఫెసర్ గారు అభినందించడం అలా ఉత్సాహం తో ఉన్న కిరణ్...డాక్టర్ రమణ  ఇంట్లో ..చిన్న లగేజ్ తో దిగాడు .చిన్న చిన్న పనులు ..చేయుంచుకుంటూ తన కుటుంబం లో ఒక మనిషి లా ..మార్చేశాడు డాక్టర్ రమణ ..వాళ్ళ  జమీందారీ కుటుంబం ..వాళ్ళను నమ్ముకున్న  ఊరు ప్రజలు ....ఇప్పడు రాజకీయ పార్టీలు వచ్చిన తరువాత ఎలా మారిపోయారు ..డాక్టర్ రమణకుటుంబం .కిరణ్ లు కల్సి మాట్లాడుకుంటూ ..ఎంతో సంతోషంగా కాలం గడుపుతూవున్నారు ..కావాలనే డాక్టర్ ...కూతురు గీత .. కిరణ్ కు ...కల్పి పనులు కేటాయిస్తూ వున్నాడు ..అంతర్జాతీయ పత్రిక కు  కొన్ని వ్యాసాలు ..టైప్ చేయడం ..కొన్ని ట్రాన్సలేషన్ చేసి పెట్టడం ..కొన్ని బుక్స్ లోనుంచి ..కొన్ని విషయాలు వెతికి పెట్టడం
బీరువాలలో పడి పాడైపోయిన చాలా విలువైన పుస్తకాలను కుట్టడం ..వాటిని ఒక లైనుకు తెచ్చి మళ్ళీ జాగ్రత్తగా భద్రపర్చడం ..లాంటి పనులు చేస్తూ ..చాలా బిజీ అయిపోయారు గీత ..కిరణ్ లు ..మరోపక్క తన రీసెర్చి వర్క్ కూడా చూసుకోవడం ..ఆతగాడి  వర్క్ టైపింగ్  లో కూడా గీత సహకరించడం ..అలా అలా జరిగిపోతున్నాయి ..మన ఇంటి పని వాళ్ళు దీపావళి పండుగ కు వెళ్ళారు కదా ..కాస్తంత మీ ఇద్దరు కారులో వెళ్ళి పండుగ సామాన్లు ..ఆ సరుకులు అన్నీ మీరు చూసుకొని తీసుకురావాలి ....ఆ పని కిరణ్ ..వాళ్ళ అమ్మాయి గీత కు పురమా యుంచాడు ...మరుసటిరోజు ఇద్దరూ వెళ్ళా రు . గీత కారు డ్రైవ్ చేస్తుంది ..పక్క సీట్లో కిరణ్ భయ భక్తులతో వినయంగా కూర్చొని వున్నాడు ...మీరు కూడా కార్ డ్రైవ్ చేస్తారా అడిగింది గీత ...ఏదో మీ అంతగా  ప్రాక్టీస్ లేదు ..మేము పల్లె నుంచీ వచ్చిన వాళ్ళం కదా ..దీర్గ0 తీసి మాట్లాడాడు కిరణ్ . ఎమోలేండి   మీరు జమిందారు లు కదా ..కొంచ0 కావాలనే ఆట పట్టిస్తోంది ..గీత   అదే మాకు చిన్న తనం. లో బాగా సమస్యలను తెచ్చి పెట్టింది ..మాకు ప్రతిపనికి పనివాళ్ళు వుండే వాళ్ళు ..మా ఇంట్లో ఆరోజుల్లో పాత మోడల్ పీయట్ కారు ఉండేది  ..అప్పటికే మూల బడింది ....అయినా నాకు డ్రైవింగ్ వచ్చు ..కొద్దిగా నవ్వుతూ చెప్పాడు  కిరణ్ ..ఎమోలేండి ..మీరు బుద్దిమంతులు అట ..మంచి అందగా డట . కొంటెగా అడిగింది గీత ..అది మీ అభిప్రాయమా ? ఎదురు ప్రశ్నించాడు కిరణ్ ..మా నాన్నగారు తెగ చెబుతూ వుంటారు .మీ గురించి .పెదవి విరిచింది గీత ..మీరు అందగత్తె కాదా మేడమ్ ..సినిమా నటి గీత లాగానే వుంటారు ..మీరు కూడా డాక్టర్ చదువుకున్నారు ..మీ అందం ముందు మేము ఎంత  ..అస్సలు మీ కళ్ళ లోకి సూటిగా చూసి మాట్లాడ లేకపోయేవాడ్ని ..మీ అందం జిగేల్ మనిపించేది .మీకు వచ్చేవాడు ఎవరో కానీ అదృష్ట వంతుడు .మీ మంచి కుటుంబానికి మంచి వాళ్ళు రావాలి అని నా కోరిక ..అని కిరణ్ చెబుతూ మార్కెట్ దాటి పోతున్నాం ఇక్కడ కొనేవి ఏమీ లేవా  కొంచెము ఆత్రుత గా అడిగాడు కిరణ్ ..లేదండి దేవాలయం దగ్గర ఒక పెద్ద పూజా సామగ్రిషాపు  ఉంటుంది .మా నాన్నగారు చెప్పిన పూజవి అక్కడే తేవాలి బాబు ..అయి నా మళ్ళీ ఇటు వస్తాము కదా ..డ్రైవింగ్ చేస్తూ చెప్పేసింది  గీత ..ఇంతలో ఒక దేవాలయం దగ్గర ఆపేసింది కారు .రండి ఇది చాలా పెద్ద శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయం ..దండం పెట్టుకొని వెళదాం ..అంటూ ఇద్దరు దేవాలయం లోకి  వెళ్ళారు ..అలా అలా మొదలుపెట్టి కారులో చెక్కర్లు కొడుతూవున్నారు గీత ..కిరణ్  ..ఇంటి ముఖం పట్టారు ..మధ్య లో ఒక రెస్టారెంట్ లోకి దూసుకు వెళ్ళారు ..ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ లా గించేశారు .మీరు ఎలా ఇస్తారు సార్ ..మీరు మా ఇంట్లో మా పనులకు సహాయం చేయడం కాకుండా డబ్బులు కూడా ఇస్తారా ...ఎంత మంచి వారు సార్ ..మీరు ..చిలిపిగా అన్నది గీత ....అంటూ తనే మొత్తం పే చేసి కారులో ఇంటివైపు దూసుకువెళ్తున్నారు.......వీళ్ళు ఎలా వుంటున్నారు ..వీళ్ళ ఇద్దరి మధ్య స్నేహం ఎలా ఉంది ....జాగ్రత్తగా గమనిస్తూవున్నాడు  డా.రమణ ..
రాత్రి పూట ..భోజనాలు పూర్తి అయిపోయాయి .అందరూ కలసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటూ తెగ నవ్వుకుంటున్నారు ...కిరణ్ గారు మీరు  కబుర్లు చెబుతూ ఉంటే ..తెగ నవ్వు వస్తుంది బాబు ...హాస్టల్ లో ఎందుకు ..ఎంచక్కా మీరు వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు గా ..ఎలాగూ మీ గురువుగారు ...డాక్టర్ గారితో మీకు ఏదో ఒక టీ మాట్లాడుతూ వ్రాస్తూనే వుంటారు కదా ..కొంచం వినయంగా అడిగింది ..డాక్టర్ గారి భార్య ..అందరూ ఆవులించుతూ లేచారు ..ఇంతలో గీత గారు ..మనం రేపు కొన్ని పనులు సంపూర్తి చేయవచ్చు ....ఏదో చూపిస్తూ వివారిస్తూవున్నాడు కిరణ్ ...చూడు బాబు ..గీత అంటే చాలు ..గారు అవి అన్నీ వద్దు బాబు ..గట్టిగా చెప్పింది డాక్టర్ భార్య ..తల ఊపాడు కిరణ్ .ఎవరి గది లోకి వాళ్ళు వెళ్లిపోయారు ..హాలులో కిరిటి పక్కన  దివాన్ పై పడుకొని ఆరు బయటకి దృష్టి సారించాడు  అప్పుడప్పుడే వెన్నెల కనిపిస్తోంది...ఇంటిముందు చెట్ల   క్రిందఎడ్ల బం డి క్రిందకు దించేసి దానికి  రెండు ఎద్దులు కట్టేసి ఉన్నాయి ...ఒక ఎద్దు ఇంకో ఎద్దు ని నాకుతూ ఉంది ..అక్కడ పనిచేసే దంపతులు చాప పై కూర్చొని  భోజనం చేస్తున్నారు ..భార్య బట్టలు బాగా కట్టుకుంది ..కొప్పు లో మల్లె దండలు చుట్టుకొంది ..కాగడా దీపం  కాంతి లో మెరిసిపోతోంది .దొ0గ సచ్చినో డా
నాకు. గింత వేసి కూరమొత్తం ఏసేసుకున్నవా ..తింటే తిన్నావు బావా మొత్తం తిని ఏం బాగోలేదు అంటవు.. సూడు ..అప్పుడు చిర్రున కాలుద్దీ నాకు ..గొణుగు తోంది......అబ్బా ఇక ఆపవే ..కావాలంటే ఇదిగో తీసుకో ..అంతే కాని మంచిగ ఇద్దరం పక్క ఎక్కే టైం లో గొడవలు మాత్రం బెట్టకు దుర్గి ..బ్రతిమి లాడుతునట్లు గా చెప్పాడు ...ఉతికిన బట్టలు ఇచ్చానా ...మళ్ళీ మురికి బట్టలు తగిలించుకుని అన్నా నికి  వచ్చినావు ..నువ్వు నాపక్కన పండొద్దు ..అంతే ..కొంచెము కోపంగా అరిచేస్తుంది దుర్గి ....అదృశ్యాలు చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు కిరణ్ ..గీత చాలా మంచి అమ్మాయి ..అందగత్తె బాగా చదువుకున్నది కూడా కొంచెము పైకి కఠినంగా అనిపించినా మనస్సు మాత్రం వెన్న ......ఒకవేళ అదృష్టం కలిసివచ్చి నన్ను ...గీత ని చేసుకోమంటే ..అమ్మో ..ఇంత అందమైన అమ్మాయి నా కౌగిలిలో ఉండిపోతుందా ..ఊహించుకోలేను ....ఏమోలే... వాళ్ళు అన్నీ ఉన్న మహారాజులు ..వాళ్ళు తలచుకుంటే ..పెద్దపెద్ద  డాక్టర్లు పెళ్ళికొడుకుగా వచ్చి నిలబడతారు ..అవును ..ఏదేదో ఊహించుకొ0టే .. ఇదివరలో ఒక అమ్మాయి నన్ను దెబ్బకొట్టింది ...ఇక చాలు అనుభవం ....ఇక చాలు.. కంట్రోల్ అనుకొంటూ నిద్ర లోకి జారుకున్నాడు  కిరణ్
**                               **                                  **                             **                         **                        **  

                                                                                                        (ఇంకా ఉంది   to be continued............                     


       

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online