Pages

సద్గురు షిర్డీసాయి నాధ్ మహరాజ్ కి జై ఇది నా అనుభవం ...భగవంతుని దయ ఉంటే తప్పక రక్షిస్తాదు ఓం నమో వేంకటేశాయ

 20 రోజులు ...మందులువాడి భగవంతుని దయ వల్ల..మీ లాంటి వారి పెద్దల ఆస్సిస్సుల తో  నెగటివ్ అని తేల్చుకొని ఇల్లు చేరాము ..4 రోజులు అయ్యుంది ..

అస్సలు ఏమైంది అంటే.........

   ఇక ఇప్పుడు లాక్ డౌన్ కంటే ముందుఏప్రిల్ లో 

నేను మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాను ..ఇంటికి వచ్చాను రెండు రోజులు గడిచింది ..కొంచెము జ్వరం ..ఒళ్ళు నెప్పులు ..ఇది వ్యాక్సిన్ ప్రభావం అనుకున్నాను ...నాలుగురోజులు గడిచినా తగ్గడం లేదు ..పై నుంచి వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొద్దిరోజుల వరకు test లు చేస్తే  పాజిటీవ్ అనే వస్తుంది ..అనే ఒక ప్రచారం వల్ల నేను test కి వెళ్ళలేదు ..వ్యాక్సిన్ వాళ్ళు సూచించిన విధంగా .పేరాసెట్మా ల్ dolo650 వేసుకుంటువున్నాను .   నాకు స్పాండిలోలైటి స్ బాగా ఉంది ..దానికి ఆయుర్వేదం వాడుతూవుంటాను ..వ్యాక్సిన్ వల్ల అన్నిమందులు  ఆపేశాం కదా దానివల్ల అనుకున్నాను ...కానీ మిత్రుడు నా కు ఫోన్ చేసి నప్పుడు ...నా వ్యాక్సిన్ బాధలు చెప్పుకున్నాను నాకు   నోరు..లో  అరుచి ..గొంతునొప్పి లేవు ..కొద్దిగా పొడి దగ్గు అప్పుడు start అయి0ది .అతగాడు ..ఈ కోవిడ్ లక్షణాలు ను పసిగట్టగలడు ..కారణం వాళ్ళయింట్లో చాలా మందికి కోవిడ్ వచ్చి అతగాడికి ఎంతో అనుభవాన్ని తెచ్చిపెట్టింది ... .ఆయిల్ కార్పొరేషన్ లో మంచి హోదా పోస్ట్ లో వున్నారు ....ఆయన నా మాటలు ఫోన్ లో వింటూ కొద్దీ ఆయాసం కూడా విన్నాడు ..నడుస్తూ మాట్లాడుతున్నారా ..లేక మెట్లు ఎక్కుతూ మాట్లాడుతూవున్నారా ..అని అడిగాడు ..లేదు కూర్చొని మాట్లాడుతూవున్నాను ....వెంటనే మీ మేడమ్ కి ఫోన్ ఇమ్మన్నారు ..మీ సార్ ను తీసుకొని వెంటనే లంగ్స్ స్కాన్ చేయుంచమన్నారు ....ఇది వ్యాక్సిన్ ప్రభావం కాదు ..కోవిడ్ లక్షణాలు అన్నాడు ...స్కాన్ సెంటర్ వెతికి ..లంగ్స్ తీసి ఒక తెల్సిన డాక్టర్ గారికి పంపాము ..వెంటనే కోవిడ్ సోకింది  అని మెసేజ్ పెట్టాడు ...ఇక నేను ..మా ఆవిడ తలపట్టుకొని కూర్చున్నాము ..భగవంతుడా ..మా ఇంట్లో చేతకాని అమ్మాయి ఉంది ..ఆమెకు సేవలు ఎలా ...మేము ఎక్కడికి వెళ్ళాలి ఎలా జాయిన్ కావాలి .. మొర పెట్టుకు0టున్నాము  గా స్వామి. ప్రతీ రోజు మేము అన్ని మానుకొని ఇంట్లో కూర్చుంటువున్నాం ..ఇప్పుడు మమ్మల్ని పరీక్షలు పెట్టకు స్వామి అని.... ఇప్పడు ఎలా .?మంది ...మహార్బలం.. డబ్బు ..దశకం కావాలి ..ఎవరు వస్తారు ..ఇక నాకు ధైర్యం సన్నగిల్లి .నొప్పులు ..ఎక్కువై మూలుగు ప్రారంభం అయుంది ..కొద్దిమంది ..దగ్గర్లో మనవాళ్ళు పరిచయిస్టులకు .తెలిసింది ..వాళ్ళు ఫోన్ లు తీయడం లేదు ...వాళ్ళని ఏమి అనలేము.  భయం కదా ..ఇంతలో నా మేనల్లుడికి తెలిపి0దినా సతీమణి .....సాయంత్రం వేళ ..మా పెద్దమేనల్లుడు  ..భార్య తో బయలుదేరి మా ఇంటికి వచ్చి జాగ్రత్తలు తీసుకొని కొద్దీ దూరంలో కూర్చున్నారు ..వాళ్ళు భద్రాచలం వాస్తవ్యులు శ్రీరామ భక్తులు ...ఇక నాలుగు బట్టలు పెట్టుకొని బయలు దేరండి ..అని వత్తిడి తెచ్చారు ..వద్దు ..మేము చూసుకుంటాం ..అన్నా వినలేదు నేను ..మా సతీమణి ..మా అక్కయ్య .mentally challenged ..ముగ్గురం కారు వెనక సీట్లో కూర్చున్నాం ..ముందు డ్రైవింగ్ లైన్ లో వాళ్ళు ఎలా అయితే ఒక గంట లో వాళ్ళ ఇంటికి వెళ్లడం అక్కడ వాళ్ళకు తెల్సిన పెద్ద డాక్టర్ గారు రాపిడ్ మా ఇద్దరకి చేయడం పాజిటివ్ రావడం .....మా అక్క మాత్రం ముక్కు లో పెట్టించుకో దు ..అయునా ఆమెకు  కూడా  మందులు start చేసేశారు ....ఎక్కడా బెడ్ లు ఖాళీ లేవు అని డాక్టర్ గారు మమ్మల్ని మేనల్లుడి  పెంట్ హౌస్ లో పైన పెట్టి నాకు మాత్రం ఆక్సిజన్ అవసరం అని తెప్పించి పెట్టారు .ఇక సమ స్య మా అక్క కు ఎవరైనా సేవ లు చేయడానికి కావాలి ఆ అమ్మాయి కి ఏ పని రాదు మాస్క్ పెట్టుకోదు ..పీకి పారేస్తుంది ......ఇంకో మేనల్లుడు ..అక్కడ ట్రైన్ ఎక్కి మా దగ్గరకు చేరాడు ..pp కిట్ కొనుక్కొని వేసుకొని ..ఆ అమ్మయు కి సేవలు మొదలుపెట్టాడు ..  డ్రైవింగ్ చేస్తూ వచ్చి న 

ఆ దంపతులు కి మాత్రం కరోనా లేదు అని తేలిపోయుంది ....ఇక వాళ్ళుఅన్నము  వండి పైకి పంపిస్తూవున్నారు ..డాక్టర్లు ..నర్సు ..పరీక్షలు మందులు ఇంట్లో అందరికీ .టెన్షన్ .క్యాష్ ..చెల్లింపులు ..ఇక ఇవన్నీ చాలాఉంది చెబితే ఇక మా అక్క కు యా0టిబాడీస్ టెస్ట్ చేయంచాను ..ఆమె కు కూడా వచ్చి పోయుంది అని తెలిసింది ..pp కిట్టు వానికి చేయు0చాం  వాడు అన్ని రోజులు సేవ చేసినా వాడికి నెగటివ్ వచ్చింది ..మా మేనల్లుళ్ళు అందరూ మా ఇంట్లో మా తల్లి తండ్రులు దగ్గర ఉండి .చదువుకున్నవాళ్ళే . ..రెండు చేతులతో ఎంత పారిశుద్ధ్య పనిఅయినా. అసహ్య0

చుకోకుండా చేసి పడేస్తారు అది ..నిజంగా దైవత్త్వ0 ..నేను చేస్తాను ..కదా అ0టే.వాళ్ళు చేయాలని రూల్ ఏముంది  మన పెద్దవాళ్ళు అన్ని పనులు నేర్పించి చేయుంచేవారు ..అలా వాళ్ళకి అనుభవం. ఇక   ముఖ్యంగా ఈ కోవిడ్ అప్పుడు  వుండవల్సిందిభగవంతునిదయ ...విపరీతమైనధైర్యం 

బలమైన ఆహారం ఇక ....ఆ సీతారాము లవారు హనుమ మనుష్య రూపములో వచ్చి కాపాడారు ..మొదట్లో ఫోన్ లో ఆ మిత్రుడు  చెప్పకపోతే ఇంకా ఆలశ్యం అయ్యేది 

ఇది చదివిన వారందరికీ నా విన్నపం మామూలు గుడ్డ మాసుకు లు వైరస్ ను అపలేవుమాస్క్ N95 ధరించండి .ఇంటికి వచ్చేవరకు తీయకూడదు ..తీసామా మొత్తం లోపలికి పోతాయి ...మొత్తం కళ్ళని మూసే కళ్ళద్దాలు ధరిస్తే ఇంకా మంచిది ..నేను తక్కువ రక0 గుడ్డ మాస్క్ ధరించాను ..ఎక్కడికి వెళ్ళలేదు ..మందుల షాపు ..గుడి .కి ఎబ్న్నో జాగ్రత్తలు తీసుకుని వెళ్ళే వాడ్ని...కొద్ధిగా తగ్గించాను  జాగ్రత్తలు ..అంతే నేను ...ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వుండే మా ఆవిడ కు కూడా అంటించాను కాబట్టి ..కాంప్రమైజ్ కాకండి  పక్క బజారు కెళ్ళి మందులు తెచ్చుకున్నా సరే పై బట్టలు తీసి లోపలికి రండి ..వచ్చేముందు మీ ఇంట్లో వారి సాయంతో చేతులు వీపు కాళ్ళు పై శానిటైజర్ తో బాగా స్ప్రే చేయుంచుకోండి ...తప్పదు    శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ..         శ్రీరామ జయ రామ.. జయ జయ  రామ................జయశ్రీ రామ్ .(M K








0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online