Pages

నిరీక్షణ... కథా నిక... పార్ట్ ...8 .. NIRiKSNA....... SHORT STORY part..8

 సుధ అమెరికాలో పడుతున్న కష్టాలు వాళ్ళ తల్లిదండ్రులు కి తెల్సిపోయుంది ..దగ్గరి బంధువుల సహాయం తో  వాళ్ళ అమ్మ ఆరోగ్యం.గురించి చెప్పి ఆ సాకు   తో అమెరికాలో వుంటువున్న సుధ ని ఎలాగో అలా ఇండియా కి రప్పించారు ఆమె తల్లి తండ్రులు ..మనిషి బాగా డిప్రెషన్ లోకి వెళ్లడం చూసి బోరుమన్నారు ..మెల్ల ..మెల్లగా మనమే దారిలోకి తెచ్చుకోవాలి అని ఆలోచనలో పడ్డారు ..అస్సలు వాడి పై కేసు పెట్టి ఇండియా కి వచ్చి ఊడి పడేలా చేస్తాను కోపము తో ఊగి పోయాడు సుధ తండ్రి ...ఇప్పుడు ముందు మన అమ్మాయి ని  బాగుపడనివ్వండి  ..తరువాత అంతా ఆలోచిద్దాం ..తండ్రి ని ఓదార్చింది సుధ తల్లి

సుధ ని డిప్రెషన్ లో నుంచి బైట పడే పని లో సమాయత్తమవుతున్నారు ..
*                               *                           *                          *                           *
రీసెర్చి పేపర్లు వ్రాసుకొని డాక్టర్ రమణ క్లినిక్ కి వెళ్ళాడు కిరణ్ ..పేపర్ లు అన్ని కరెక్షన్స్ చేసుకున్నాడు ...ఎలా ఉన్నారు కిరణ్ ..మీ ప్రేమ వ్యవహారం ఎలా నడుస్తోంది ..ముగింపు వచ్చిందా   సక్సెస్ ఆర్  ఫెయుల్ ..చిరునవ్వు తో అడిగాడు డాక్టర్ ..మీరే చెప్పాలి సార్ ..మొత్తం మీకు చెప్పేశాను కదా .పెదవి విరిచాడు కిరణ్ ..బలే వాడివయ్య ..నేను ఏమైనా ..ఆ అమ్మయు తల్లినా తండ్రినా ..బలవంతంగా తెచ్చి నీకు పెళ్లి చేయటానికి ..అయినా అలా చేసినా అది కరెక్ట్ కాదుకదా .అయినా.ఆ అమ్మాయి మనస్సు కు నచ్చిన వాడి వెమ్మటి వెళ్తు0ది గాని ఎవ్వరు చెప్పినావింటుందా? .అస్సలు .తల్లిదండ్రులు చెప్పితే వినే రోజులు ఎప్పుడో పోయినాయు ..ఇంకా ఎవరు చెప్పగలరు .అయినా కిరణ్ మీకు ఒక విషయం తెలుసా ..మీ ..లవర్. ప్రియ గారికి పెళ్ళి అయిపోయింది తెలుసా!
కొంచం ఆశ్చర్యం వ్యక్త0 చేస్తూ చెప్పాడు డాక్టర్ రమణ...సార్ ..మీ రు జోకు చేయడానికి నేనే  దొరికానా ..కొంచెము బాధగా అడిగాడు కిరణ్ ..అది కాదు బాబూ మీకు నా మాటపై నమ్మకం లేదా ....కొద్దిసేపు టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాం ..ఒక్క క్షణం ....అంటూ నర్స్ ని పిలిచాడు డాక్టరు గారు ..పేషంట్స్  అందరూ  .అయిపోయారా?ఇంకాఎవరైనా  వస్తే కోర్చోబెట్టు అని చెప్పి కిరణ్ ని తీ సుకొని పైన విశ్రాంతి గదిలోకి వెళ్ళాడు డాక్టర్ రమణ ..చూడు బాబు కిరణ్ .కొద్దిరోజుల క్రితం ..నేను నా మిత్రుడు కల్సి మీ లవర్ ప్రియ గారు చదువుతున్న కాలేజ్ కి వెళ్లాం ..ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా నా మిత్రుడి కి బాగా తెలుసు ..అప్పుడు ఆ ప్రిన్సిపాల్ చెప్పాడు .అనిల్ ..ప్రియ లు కల్సి ప్రేమ వివాహం చేసుకున్నారు అని .ఎవరో కొంతమంది స్థూడెంట్స్ తప్ప పెద్దవాళ్ళు ఎవరూ ..రాలేదట ..పైగా ఇద్దరూ కూడా మేజర్లు కాబట్టి కాలేజీ ప్రిన్సిపాల్ గా నాకు ఏ గోడవా లేదు ..నేను హ్యాపీ ..ఏదైనా వాళ్ళ పెద్దవాళ్ళు గొడవ లు తీసుకు వస్తే కోర్టు.. పోలీసులు చూసుకుంటారు ..అని బాహాటంగా చెప్పాడు ..ఆ విషయం మేము నీకోసమే వెళ్ళి తెలుసుకొని వచ్చాము ..నీకు నమ్మకం లేకపోతే  కాలేజీ కి వెళ్ళి తెలుసుకో ..నాకు ఏ అభ్యంతరం లేదు ..గట్టిగా చెప్పాడు డాక్టర్ రమణ
సార్ ..కాళ్ళ కు నమస్కారం చేస్తూ వంగిపోయాడు ..కిరణ్ ..బలే వాడివయ్యా బాబు ఇప్పుడు ఇదంతా ఏమిటి ..తన చేతులతో లేపి నిలుచో బెట్టాడు డాక్టర్ రమ ణ ..ఏమి లేదు సార్ ..నా జీవితం బాగుండాలని ..నా లాంటి సామాన్యుని కోసం ..మీరు వెళ్ళి మొత్తం విషయం అంతా తెలుసుకొని వచ్చారు ..ముందు దానికి  నేను ఎంతో రుణ పడి వున్నాను ..మీ చుట్టం కాక పోయినా కేవలం కొద్దీ పరిచయం తో నాకు ఎన్నోసార్లు దశ దిశ ..చూపిస్తూనే వున్నారు .ఇక నేను నా పరిశోధన మీ శిష్య రకములో పూర్తి చేసుకొని నా ఆశయం నిలుపుకుంటాను ..కొద్దిగా ఆర్ధ్ర త గా కళ్ళలో నీటి బిందువులు వస్తుంటే చెప్పాడు కిరణ్ ..చూడు బాబు నీ అకడమిక్ రికార్డ్ అంతా చాలా బాగుంది ..మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడవు ఎటువంటి చెడు అలవాట్లు లేవు ..అందుకే నిన్ను ఒక మంచి దారిలో పెట్టాలనేది నా తాపత్రయం ...చిరునవ్వు ఇస్తూ చెప్పాడు డాక్టర్ రమణ .అవును ఆ అమ్మాయి చాలా అందగత్తె నా ....మరిచిపోలేక పోతున్నావా ..కొంటెగా అడిగాడు రమణ
అదేమీ కాదు సర్ ..ఆ అమ్మాయి కంటే అంద గత్తె లు చాలామంది ఉన్నారు ..అయునా ఆమె మనస్సులో కానీ బుర్రలో కానీ నా ఊసే లేనప్పుడు అది ఎవరైతే నాకేంటి ..అందంగా ఉంటే లేకపోతేమీ సార్ ..నాకే అసహ్యం పుట్టింది ..ఇప్పడు నాకు కసిగా ఉంది ..ఆ కుటుంబం కంటే తల దన్నే మంచి అమ్మాయి ని వెతికి చేసుకోవాలి అని గట్టి పట్టుదల తో వున్నాను ....మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు సార్ ..గట్టిగా కసి గా నొక్కి చెప్పారు కిరణ్ ...డాడీ మీ కోసం చాలాసేపు క్రింద కూర్చున్నాను ..పేషంట్ ..తో వున్నాను అని చెబితే వెళ్లిపోయేదాన్ని కదా ..పెద్దగా బుంగ మూతి పెట్టి గుమ్మం వద్ద నిలబడింది గీత చూడమ్మా ..నీవు కౌన్స్లింగ్ ఇచ్చావు ఇదివరలో ..ఆ పర్సన్ ..నీ పేషంట్ ..మేము ఇద్దరం కలిసి కాస్తంత ఆయన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను ..చూడు..అనగానే లోపలికి తొంగి చూసింది గీత ..కళ్లు మెరుపులు కు తల వంచేశాడు కిరణ్   ..పో..డాడీ ..మీకు ఎప్పుడూ జోక్ లే వేస్తారు ..నేను కారు తీసుకెళ్లి పోయు ..మళ్ళీ పంపిస్తాను ..విస విస గా బైటకు వెళ్ళిపోయింది ..గీత ..మా అమ్మాయి కౌన్స్లింగ్ బాగా ఇస్తుంది ..పోనీ రెండు ..మూడు సిట్టింగ్ లు వేద్దామా ..క్యాజువల్ గా అడిగాడు రమణ ..అయ్యబాబోయ్ ..వద్దులేండి ..సార్ ..అన్నాడు కిరణ్ ..ఎందుకు అలా అన్నావో. చెప్పాలి ...పట్టుబట్టాడు ..రమణ ...సార్ మీ అమ్మా యుగారు ఎంత చెప్పుకున్నా సిటీ లోపుట్టి పెరిగారు ..మేము ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం ...వారికి ...నాలాంటి వాళ్లకు పోలిక వద్దు సార్ ..కొంచెము నిరుత్సాహం గా చెప్పాడు కిరణ్ ..మరి మీలవర్ ప్రియ ను ప్రేమించేటప్పుడు ..కొంచెం వ్యంగ్య0గా ..అడిగాడు రమణ ..మాకు ..వాళ్ల కుటుంబం ..వాళ్లకు మా కుటుంబం .చిన్నప్పటినించి .తెల్సిన  వాళ్ళమే కదా సార్  ..అందుకే అంత తేలిక అని అంచనా వేశాను ..చెప్పాడు కిరణ్ ..సరే ఇంతకు పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నవా .. ఏమో సార్ ఇప్పుడు ఎవరు ఇస్తారు ..పైగా మీరు నా కు కళ్ళు తెరిపించారు గా సార్ ..ముందు మా చెల్లెలు కి పెళ్లి చేయాలి ..మా అమ్మను తెచ్చి దగ్గర పెట్టుకోవాలి ..నా రీసెర్చ్ పూర్తి అయుపట్టా తీసుకోవాలి ..వ్యుద్యోగం సంపాదించాలి అప్పుడు కదాసార్ ..నా  స్వ విషయం ఆలోచించాలి ..నాకు చాలాటైమ్ పడుతుంది అనుకుంటాను ....ఏది ఏమైనా ..నా బాధ్యతలు ..నాకు గుర్తు చేసినందుకు ..నన్ను పిచ్చిగా అగాధం లో పడి కొట్టుకు పోకుండా  కాపాడి జ్ఞాన బోధ చేశారు ..మీ ఋణ0 ఎలా తీర్చుకోగలను ..సార్ ..తల వంచి  నమస్కారం చేస్తూ ..అన్నాడు కిరణ్ *
                                 
                                                                            (  To be contiuned.......ఇంకా ఉంది)













0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online