🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻ఈ భారత వర్షమున పుట్టిన వారి అదృష్టమేమనవచ్చును? భగవంతుడే ఇన్ని జీవరాశుల రూపములతో వివిధ అవతారములతో భూమికి దిగివచ్చి జీవులకు తగిన విధమున జీవిత సత్యమును ఉపదేశించుచుండును. మిత్రుడు, చుట్టము రూపమున హరియే కలసి తిరుగుచు ధన్యులను చేయుచుండును.
జన్మించుట, తాను ఆచరింపవలసిన పనులు చేయుట, తనవి కావనియును, అంతర్యామి యందు జరిగినవి అనియు గుర్తుండి స్తుతించినచో చాలును. ఎవరికైనను కోరినవి అన్నియు ఇచ్చి మోక్షము గూడా ప్రసాదించుచుండును.
భారత వర్షమున నివసించు జనులకు అసాధ్యము ఏదియును లేదు. అన్ని పాపములను పోగొట్టుటకు నారాయణ స్మరణము ఉన్నది. దానిని మరచినచో యజ్ఞము, దానము, తపస్సు మొదలగునవి పాపములను పోగొట్టలేవు. ఇతర ప్రదేశములలో బ్రహ్మకల్పమంతయు బ్రదికినను పునర్జన్మ భయమున్నది అంతకన్నా క్షణమాత్రము భారతవర్షమున జీవించి కోరికలన్నిటిని నారాయణునకు సమర్పణ చేసినచో అతని స్థితి వారికి లభించును. పెద్దలు ఎప్పుడును భారత వర్షముననే జన్మింప కోరుదురు..........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-56,57,58.
అన్ని జీవులయందును వసించి వున్నవాడు ...అంటే నివసించి వున్నాడు ..వాసుదేవుడు ..అందుకే ..ఓ అన్నిటియందు ..ఉన్న భగవానుడా ...వాసుదేవా అని అర్ధం ..అందుకే ఓం నమోభగవతే వాసుదేవాయ ...అన్నా లేక నరములయందు ..నివసించి యున్నవాడు ..నారాయణుడు .ఓం నమో నారాయణా య ..అన్నా కూడా అదే భావన
అదే ఫలితం ఉంటుంది.... అలా జపం చేసుకోవచ్చు ....ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷
0 comments:
Post a Comment