Pages

❌ఒక చోళ రాజు చేసిన పిచ్చి పని వల్ల వాడు ఏం మూట కట్టుకున్నాడు..❌...



🌷🌷🌷🌷ఓం నమో నారాయణా య..ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌷🌷🌷

                                                  🌹🌹  ఓం నమో వే0కటేశాయ🌹🌹

ఒకప్పటి లాగా ఇప్పుడు పెళ్ళి అంటే అంతా తేలిక కాదు ..మీరే చూడండి


  

🌷🌷🌷భారతదేశం కర్మ భూమి .అంటారు ...ఇక్కడే మళ్ళీ మళ్ళీ ఎందుకుజన్మి0చాలి అనుకుంటారు..చదవండి 🌹🌹


 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻ఈ భారత వర్షమున పుట్టిన వారి అదృష్టమేమనవచ్చును? భగవంతుడే ఇన్ని జీవరాశుల రూపములతో వివిధ అవతారములతో భూమికి దిగివచ్చి జీవులకు తగిన విధమున జీవిత సత్యమును ఉపదేశించుచుండును‌. మిత్రుడు, చుట్టము రూపమున హరియే కలసి తిరుగుచు ధన్యులను చేయుచుండును. 

జన్మించుట, తాను ఆచరింపవలసిన పనులు చేయుట, తనవి కావనియును, అంతర్యామి యందు జరిగినవి అనియు గుర్తుండి స్తుతించినచో చాలును. ఎవరికైనను కోరి‌నవి అన్నియు ఇచ్చి మోక్షము గూడా ప్రసాదించుచుండును. 

భారత వర్షమున నివసించు జనులకు అసాధ్యము ఏదియును లేదు‌. అన్ని పాపములను పోగొట్టుటకు నారాయణ స్మరణము ఉన్నది. దానిని మరచినచో యజ్ఞము, దానము, తపస్సు మొదలగునవి పాపములను పోగొట్టలేవు‌. ఇతర ప్రదేశములలో బ్రహ్మ‌కల్పమంతయు బ్రదికినను పునర్జన్మ భయమున్నది‌ అంతకన్నా క్షణమాత్రము భారతవర్షమున జీవించి కోరికలన్నిటిని నారాయణునకు సమర్పణ చేసినచో అతని స్థితి వారికి లభించును‌. పెద్దలు ఎప్పుడును భారత వర్షముననే జన్మింప కోరుదురు..........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-56,57,58.

          అన్ని జీవులయందును వసించి వున్నవాడు ...అంటే నివసించి వున్నాడు ..వాసుదేవుడు ..అందుకే ..ఓ అన్నిటియందు ..ఉన్న భగవానుడా ...వాసుదేవా అని అర్ధం ..అందుకే ఓం నమోభగవతే వాసుదేవాయ ...అన్నా లేక నరములయందు ..నివసించి యున్నవాడు ..నారాయణుడు .ఓం నమో నారాయణా య ..అన్నా కూడా అదే భావన 

అదే ఫలితం ఉంటుంది.... అలా జపం చేసుకోవచ్చు ....ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷

ఈ వీడియో మొత్తం చూస్తే ఒక నీతి moral తెలుస్తుంది...


                                         😃😃ఒక నీతి moral ..తెలుసుకుందాం😃😃

🐤🐤🐤🐤🐤🐤పిచ్చుకల జాతి పెరిగేలా కృషిచేద్దాం ....మనవంతు కృషి చేయాలి ..ఓం నమో వేంకటేశాయ 🐦🐤🐤🐤🐤

 

ఇప్పుడు అంతా పావురాలే న0డి బాబు ..ఈ పాడుబడ్డ ..బూజుకంపు నగరాలలో మరీ ఈ అభాగ్యనగరములో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలు పావురాలు వాటి పెంటలు ...వద్దన్నా వాడికేదో పుణ్యం స్వర్గం వస్తోంది అనే ఉన్మాదపిచ్చి లో వద్దని చెబుతూవున్నా..సరే దా న్యం వేసి మరీ పెంచి పోషిస్తున్నారు ..అవి ..మిగతా పక్షులను వీటిని దగ్గరలోకి రానివ్వవు ..పోనీ ఇవి మిగతా పక్షుల్లాగా జెర్రె లాంటి క్రిమి కీటకాల ను తింటాయా ..అదీ లేదు..పై నుంచి వీటి వలన శ్వాస లో చాలా పొల్యూషన్  వచ్చేస్తోంది ..జనాలు తెలిసి కూడా తప్పులు చేసి పెంచుతూవున్నారు  .పావురాలు మహా స్వార్థ జీవులు ..govt వారు ఇంకా బాగా ప్రచారం చేయాల్సి ఉంది 🐦🐦🐦🐦🐦🐤🐤🐤🐤🐦🐦🐦🐦


Sree madhya bagay geeta parayanam TTD

 



ఇది శ్రీమద్ భగవద్గీత లోని స్తోత్ర పారాయణం ..ఇందులో శ్లోకాలను పాస్ట్ ఫార్వార్డ్ చేసుకొని కుప్పా శర్మ గారి విశ్లేషణ తప్పనిసరిగా వినండి ..అస్ససిలు ..ఒకటే బ్రహ్మము అనేక రూపాలు ..దేవతల0దరిలో అంతరాత్మ గా వుండే పరబ్రహ్మము ఎవరు ..సర్వ దేవ నమస్కర్:కేశవం ప్రతి గచ్ఛతి ..ఎందుకు అంటారు ఈ విశ్లేషణ లో తెలుస్తోంది..   ఇంకా కృష్ణా ర్ప ణం  అంటే కూడ విశ్వరూపం లో అన్ని శిరస్సులు ..ఆ ఒక్కడికే   చెంది వుంటాయు ..ఏ దేవునికి నమస్కారం చేసినా ...ఆయనకే చెందును   అని కూడా అర్ధం అవుతుంది  ..  ..ఇక నా అభిప్రాయం లో అయితే ....

...అలానే ఏ దేవత లేక దేవుని కి సంభందించిన పురాణం అయితే ..ఆ దేవుడు ..ఆ దేవత  . ను అందరికంటే గొప్పవారు అని చెబటం ఎలాగూ అందరూ అనుకునే సత్యమే కానీ మోక్షం ను ఇచ్చేది మాత్రం శ్రీమన్నారాయణు డు అని ..అందుకే కామకోటి పీఠం వారు ..నారాయణ ..నారాయణ అనడానికి కారణం కూడా అదే ..కామకోటి అంటే వారి భావన లో శ్రీయంత్రము ..శ్రీవిద్య ..అలానే వారి ఉపాసన అంతా కామాక్షి అమ్మవారి ఉపాసన   తద్వారా.  విద్య ..జ్ఞానం.. సముపార్జన .వేష0 శివభగవానుడు ..నామస్మరణ శ్రీమన్నారాయణ ....అలా నే  కొందరు   ..జై శ్రీ మన్నారా య ణ .అని కొంతమంది విశిష్టా ద్వైతులు అంటూ ఉంటారు ఎందుకు ..అని ఆడిగినవారు వున్నారు ..శ్రీవిష్ణు సహస్రనామ ములలో ..శ్రీ మన్నారాయణ శబ్దమాత్రం చేత నే ఘోర ఆపత్కా ల పరిస్థితులు నుంచి ..అనేక శరీర శిథిలా వస్థత  లనుంచి ..బైట పడేస్తుంది ..ఆ మంత్రం అని చెప్పబడినది ....25...30 స0వత్సరముల వారికి మోక్షం ఏమిటి ..అంటే ..వీడిచిపెట్టబడు ట ..ఏమి ..అక్కడ సమస్యలు కావచ్చు ..బాధలు కావచ్చు ఏదైనా ..విపత్తులనుంచి బైటపడటమే.. అని అర్ధం చేసుకోవచ్చు ..ఓం నమో వే0కటేశాయ ..🙏🙏🙏

🌹🌹🌹This is Narasimha swamitemple bidher karnataka state 🌹🌹🌹





1 km నీటిలో నడుచుకుంటూ వెళ్లి తే శ్రీ నరసింహ స్వామివారి గర్భగృహం చేరుకోవచ్చు ..అక్కడ స్వామివారి దర్శనం  అవుతుంది ..ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమ: ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🙏





🌹🌹🙏శివరాత్రి సందర్భంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చూడండి ..ఆమంత్రాలు వినండి తరించండి 🌹🌹🙏



ఈ నమక చమక మంత్రాలు ..స్తోత్రాలు వినడం వల్ల ..సకల దోషాలు పోయు సకల శుభాలు ..కలుగుతాయి .శుభప్రదమైన ..మంచి చేసేవి మేలుచేసే  కోర్కెలు ..ఫలిస్తాయి....సిద్ధిస్తాయి ..

🌷🌷న మ:పార్వతీ ప తయే హర హర మహాదేవ ...శ 0భో శంకరా ....శివ శివ శంకరా జయ జయ శ0కరా ..🌷🌷

                                                  🙏🌹ఓం నమో వే0కటేశాయ 🌹🙏

🌹🌹🌹🙏🙏🙏మిత్రులు. ..పెద్దలు ..అందరికి ..శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏🌷🌷🌷🌷

శివాభిషేకాలు - వాటి ఫలితాలు 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.

4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.

8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).

18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.

21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.

22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.

23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.

24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

  🙏🌷ఓం నమః శివాయ🌷నమ:పార్వతీ పతయే ..హర హర మహాదేవ .హర ..జై శ0కర  జయజయ  శంకర 🌷🙏





🌷🌷🌷🙏తిరుమల శ్రేవేంకటేశ్వరక్షేత్రం లోని మాడవీధుల గురించి తెలుసుకుందాము సేకరణ చేయబడినది🌷🌷🌷🙏

 మాడ వీధి అంటే ఏమిటి ? 

తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు. 


తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది


ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు


శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.


 తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి.

వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు


1.తూర్పు మాడ వీధి.


ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి.

శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.


ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న

(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు


ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.


క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు. 


మాస్టర్ ప్లాన్ లో భాగంగా  కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.


2.దక్షిణ మాడ వీధి


ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది.దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) 'ఊంజల్ మండపం' ఉంది


ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు.


దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది తిరుమల నంబి గుడి తర్వాత 'ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.


3.పడమర మాడ వీధి.


ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి

ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు)  కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.


4.ఉత్తర మాడ వీధి.


ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి 'అచ్యుతరాయ కోనేరు' అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా

పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది.


ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి

స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది

తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి

తరిగొండ బృందావనం - ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల  ఉంది.


 ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు.

ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి.వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.


ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ  నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.


తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవిందా..

మహా ప్రదక్షిణ ప్రియ గోవిందా..

ఆనంద నిలయ వాసా గోవిందా ...!గోవిందా...!

ఓం నమో వేంకటేశాయ .....శ్రీ వేంకటేశ చరణం శరణం ప్రపధ్యే .. శ్రీ పద్మావతి వేం కటేశ్వర ప్రభువు కు నిత్యమంగళం🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

😂😀 నవ్వు తెప్పించే ఒక సంభాషణ వినండి. ..just fun 🤓🤓😂


 

నిరీక్షణ... కథా నిక... పార్ట్ ...8 .. NIRiKSNA....... SHORT STORY part..8

 సుధ అమెరికాలో పడుతున్న కష్టాలు వాళ్ళ తల్లిదండ్రులు కి తెల్సిపోయుంది ..దగ్గరి బంధువుల సహాయం తో  వాళ్ళ అమ్మ ఆరోగ్యం.గురించి చెప్పి ఆ సాకు   తో అమెరికాలో వుంటువున్న సుధ ని ఎలాగో అలా ఇండియా కి రప్పించారు ఆమె తల్లి తండ్రులు ..మనిషి బాగా డిప్రెషన్ లోకి వెళ్లడం చూసి బోరుమన్నారు ..మెల్ల ..మెల్లగా మనమే దారిలోకి తెచ్చుకోవాలి అని ఆలోచనలో పడ్డారు ..అస్సలు వాడి పై కేసు పెట్టి ఇండియా కి వచ్చి ఊడి పడేలా చేస్తాను కోపము తో ఊగి పోయాడు సుధ తండ్రి ...ఇప్పుడు ముందు మన అమ్మాయి ని  బాగుపడనివ్వండి  ..తరువాత అంతా ఆలోచిద్దాం ..తండ్రి ని ఓదార్చింది సుధ తల్లి

సుధ ని డిప్రెషన్ లో నుంచి బైట పడే పని లో సమాయత్తమవుతున్నారు ..
*                               *                           *                          *                           *
రీసెర్చి పేపర్లు వ్రాసుకొని డాక్టర్ రమణ క్లినిక్ కి వెళ్ళాడు కిరణ్ ..పేపర్ లు అన్ని కరెక్షన్స్ చేసుకున్నాడు ...ఎలా ఉన్నారు కిరణ్ ..మీ ప్రేమ వ్యవహారం ఎలా నడుస్తోంది ..ముగింపు వచ్చిందా   సక్సెస్ ఆర్  ఫెయుల్ ..చిరునవ్వు తో అడిగాడు డాక్టర్ ..మీరే చెప్పాలి సార్ ..మొత్తం మీకు చెప్పేశాను కదా .పెదవి విరిచాడు కిరణ్ ..బలే వాడివయ్య ..నేను ఏమైనా ..ఆ అమ్మయు తల్లినా తండ్రినా ..బలవంతంగా తెచ్చి నీకు పెళ్లి చేయటానికి ..అయినా అలా చేసినా అది కరెక్ట్ కాదుకదా .అయినా.ఆ అమ్మాయి మనస్సు కు నచ్చిన వాడి వెమ్మటి వెళ్తు0ది గాని ఎవ్వరు చెప్పినావింటుందా? .అస్సలు .తల్లిదండ్రులు చెప్పితే వినే రోజులు ఎప్పుడో పోయినాయు ..ఇంకా ఎవరు చెప్పగలరు .అయినా కిరణ్ మీకు ఒక విషయం తెలుసా ..మీ ..లవర్. ప్రియ గారికి పెళ్ళి అయిపోయింది తెలుసా!
కొంచం ఆశ్చర్యం వ్యక్త0 చేస్తూ చెప్పాడు డాక్టర్ రమణ...సార్ ..మీ రు జోకు చేయడానికి నేనే  దొరికానా ..కొంచెము బాధగా అడిగాడు కిరణ్ ..అది కాదు బాబూ మీకు నా మాటపై నమ్మకం లేదా ....కొద్దిసేపు టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాం ..ఒక్క క్షణం ....అంటూ నర్స్ ని పిలిచాడు డాక్టరు గారు ..పేషంట్స్  అందరూ  .అయిపోయారా?ఇంకాఎవరైనా  వస్తే కోర్చోబెట్టు అని చెప్పి కిరణ్ ని తీ సుకొని పైన విశ్రాంతి గదిలోకి వెళ్ళాడు డాక్టర్ రమణ ..చూడు బాబు కిరణ్ .కొద్దిరోజుల క్రితం ..నేను నా మిత్రుడు కల్సి మీ లవర్ ప్రియ గారు చదువుతున్న కాలేజ్ కి వెళ్లాం ..ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా నా మిత్రుడి కి బాగా తెలుసు ..అప్పుడు ఆ ప్రిన్సిపాల్ చెప్పాడు .అనిల్ ..ప్రియ లు కల్సి ప్రేమ వివాహం చేసుకున్నారు అని .ఎవరో కొంతమంది స్థూడెంట్స్ తప్ప పెద్దవాళ్ళు ఎవరూ ..రాలేదట ..పైగా ఇద్దరూ కూడా మేజర్లు కాబట్టి కాలేజీ ప్రిన్సిపాల్ గా నాకు ఏ గోడవా లేదు ..నేను హ్యాపీ ..ఏదైనా వాళ్ళ పెద్దవాళ్ళు గొడవ లు తీసుకు వస్తే కోర్టు.. పోలీసులు చూసుకుంటారు ..అని బాహాటంగా చెప్పాడు ..ఆ విషయం మేము నీకోసమే వెళ్ళి తెలుసుకొని వచ్చాము ..నీకు నమ్మకం లేకపోతే  కాలేజీ కి వెళ్ళి తెలుసుకో ..నాకు ఏ అభ్యంతరం లేదు ..గట్టిగా చెప్పాడు డాక్టర్ రమణ
సార్ ..కాళ్ళ కు నమస్కారం చేస్తూ వంగిపోయాడు ..కిరణ్ ..బలే వాడివయ్యా బాబు ఇప్పుడు ఇదంతా ఏమిటి ..తన చేతులతో లేపి నిలుచో బెట్టాడు డాక్టర్ రమ ణ ..ఏమి లేదు సార్ ..నా జీవితం బాగుండాలని ..నా లాంటి సామాన్యుని కోసం ..మీరు వెళ్ళి మొత్తం విషయం అంతా తెలుసుకొని వచ్చారు ..ముందు దానికి  నేను ఎంతో రుణ పడి వున్నాను ..మీ చుట్టం కాక పోయినా కేవలం కొద్దీ పరిచయం తో నాకు ఎన్నోసార్లు దశ దిశ ..చూపిస్తూనే వున్నారు .ఇక నేను నా పరిశోధన మీ శిష్య రకములో పూర్తి చేసుకొని నా ఆశయం నిలుపుకుంటాను ..కొద్దిగా ఆర్ధ్ర త గా కళ్ళలో నీటి బిందువులు వస్తుంటే చెప్పాడు కిరణ్ ..చూడు బాబు నీ అకడమిక్ రికార్డ్ అంతా చాలా బాగుంది ..మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడవు ఎటువంటి చెడు అలవాట్లు లేవు ..అందుకే నిన్ను ఒక మంచి దారిలో పెట్టాలనేది నా తాపత్రయం ...చిరునవ్వు ఇస్తూ చెప్పాడు డాక్టర్ రమణ .అవును ఆ అమ్మాయి చాలా అందగత్తె నా ....మరిచిపోలేక పోతున్నావా ..కొంటెగా అడిగాడు రమణ
అదేమీ కాదు సర్ ..ఆ అమ్మాయి కంటే అంద గత్తె లు చాలామంది ఉన్నారు ..అయునా ఆమె మనస్సులో కానీ బుర్రలో కానీ నా ఊసే లేనప్పుడు అది ఎవరైతే నాకేంటి ..అందంగా ఉంటే లేకపోతేమీ సార్ ..నాకే అసహ్యం పుట్టింది ..ఇప్పడు నాకు కసిగా ఉంది ..ఆ కుటుంబం కంటే తల దన్నే మంచి అమ్మాయి ని వెతికి చేసుకోవాలి అని గట్టి పట్టుదల తో వున్నాను ....మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు సార్ ..గట్టిగా కసి గా నొక్కి చెప్పారు కిరణ్ ...డాడీ మీ కోసం చాలాసేపు క్రింద కూర్చున్నాను ..పేషంట్ ..తో వున్నాను అని చెబితే వెళ్లిపోయేదాన్ని కదా ..పెద్దగా బుంగ మూతి పెట్టి గుమ్మం వద్ద నిలబడింది గీత చూడమ్మా ..నీవు కౌన్స్లింగ్ ఇచ్చావు ఇదివరలో ..ఆ పర్సన్ ..నీ పేషంట్ ..మేము ఇద్దరం కలిసి కాస్తంత ఆయన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను ..చూడు..అనగానే లోపలికి తొంగి చూసింది గీత ..కళ్లు మెరుపులు కు తల వంచేశాడు కిరణ్   ..పో..డాడీ ..మీకు ఎప్పుడూ జోక్ లే వేస్తారు ..నేను కారు తీసుకెళ్లి పోయు ..మళ్ళీ పంపిస్తాను ..విస విస గా బైటకు వెళ్ళిపోయింది ..గీత ..మా అమ్మాయి కౌన్స్లింగ్ బాగా ఇస్తుంది ..పోనీ రెండు ..మూడు సిట్టింగ్ లు వేద్దామా ..క్యాజువల్ గా అడిగాడు రమణ ..అయ్యబాబోయ్ ..వద్దులేండి ..సార్ ..అన్నాడు కిరణ్ ..ఎందుకు అలా అన్నావో. చెప్పాలి ...పట్టుబట్టాడు ..రమణ ...సార్ మీ అమ్మా యుగారు ఎంత చెప్పుకున్నా సిటీ లోపుట్టి పెరిగారు ..మేము ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం ...వారికి ...నాలాంటి వాళ్లకు పోలిక వద్దు సార్ ..కొంచెము నిరుత్సాహం గా చెప్పాడు కిరణ్ ..మరి మీలవర్ ప్రియ ను ప్రేమించేటప్పుడు ..కొంచెం వ్యంగ్య0గా ..అడిగాడు రమణ ..మాకు ..వాళ్ల కుటుంబం ..వాళ్లకు మా కుటుంబం .చిన్నప్పటినించి .తెల్సిన  వాళ్ళమే కదా సార్  ..అందుకే అంత తేలిక అని అంచనా వేశాను ..చెప్పాడు కిరణ్ ..సరే ఇంతకు పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నవా .. ఏమో సార్ ఇప్పుడు ఎవరు ఇస్తారు ..పైగా మీరు నా కు కళ్ళు తెరిపించారు గా సార్ ..ముందు మా చెల్లెలు కి పెళ్లి చేయాలి ..మా అమ్మను తెచ్చి దగ్గర పెట్టుకోవాలి ..నా రీసెర్చ్ పూర్తి అయుపట్టా తీసుకోవాలి ..వ్యుద్యోగం సంపాదించాలి అప్పుడు కదాసార్ ..నా  స్వ విషయం ఆలోచించాలి ..నాకు చాలాటైమ్ పడుతుంది అనుకుంటాను ....ఏది ఏమైనా ..నా బాధ్యతలు ..నాకు గుర్తు చేసినందుకు ..నన్ను పిచ్చిగా అగాధం లో పడి కొట్టుకు పోకుండా  కాపాడి జ్ఞాన బోధ చేశారు ..మీ ఋణ0 ఎలా తీర్చుకోగలను ..సార్ ..తల వంచి  నమస్కారం చేస్తూ ..అన్నాడు కిరణ్ *
                                 
                                                                            (  To be contiuned.......ఇంకా ఉంది)













🙏🙏🌷🌷🌷🌷 ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అభినవ మణిద్వీపంచూడండి ..తరించండి ..శ్రీమాత్రేనమ: ఓం నమో వెంకటేశాయ 🌷🌷🌷🌷


 *విశాఖ జిల్లాలోని దేవీపురం - ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం* 

విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని శ్రీచక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది.

దేవీపురం - ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం

ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీ చక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు.మ్

దేవిపురం విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్న అరుదైన హైందవ ఆలయ సముదాయం. ఈ ఆలయ సముదాయం ప్రధానంగా హిందూమతనికి సంబంధించిన శక్తి పాఠశాలకు అనుబంధముగా ఉంది. అది దేవత స్వరూపమైన సహ్రక్షి (వెయ్యి కళ్ళు కలిగింది) కి, ఆమె భర్త కామేశ్వరుడు (శివుని ఆంశ) కు అంకితం.


“నాకు ఇల్లు కట్టించు” :


న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసి, ముంబాయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ లో శాస్త్రవేత్త గా పనిచేస్తున్న నిష్ఠల ప్రహ్లాద శాస్త్రిని ఈ ఆలయ నిర్మాణానికి అమ్మవారు ఎన్నుకుంది. ఒకసారి ప్రహ్లాదశాస్త్రి గారు హైదరాబాద్ లో బిర్లామందిర్ కు వెళ్ళి, బాలాజీని దర్శించి, ఒకచోట ధ్యానం చేసుకుంటుండగా, వారికి బాలాజీ స్త్రీ రూపంలో త్రిపురసుందరిగా దర్శనమిచ్చి "నాకు ఇల్లు కట్టించు" అని పలికి అంతర్థానమైనట్లుదేవీపురం - ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం

అనిపించిందిట.


అప్పుడే కాకుండా మరొకమారు వారికి ధ్యానసమయంలో దర్శనమిచ్చి "ఈ కార్యం నీ వల్లే నెరవేరాలి. జాగ్రత్తగా, దోషరహితంగా, ప్రజలందరికీ మేలు కలిగేలా శ్రీదేవి నిలయం నిర్మించు" అని ఆదేశించింది.


ప్రహ్లాద శాస్త్రి తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారు.


ఆలయం ఎక్కడ కట్టాలి ?


ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982 లో 108 రుత్విక్కులతో 16 రోజులు దేవీయాగం చేశారు. ఆ యజ్ఞంలో ఆలయం నిమిత్తం మూడు ఎకరాల భూమి యజ్ఞప్రసాదంగా లభించింది. ఈ విధంగా శ్రీ చక్రాలయ నిర్మాణ స్థలాన్ని త్రిపురసుందరీ దేవి స్వయంగా ఎంచుకుంది. తొమ్మిది కొండల మధ్య, రమణీయంగా, ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో ప్రహ్లాదశాస్త్రి తిరుగుతూ ఉండగా, ఒకరోజు ఒక అగ్ని దేవీపురం - ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపంగుండంలో మెరుపులతో మెరిసే శరీరంతో 16 ఏళ్ళ అమ్మాయిలా దేవి కనిపించింది. పూజలు అందుకుంది. తనకు అక్కడే ఇల్లు కట్టాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రదేశంలో తవ్వితే, అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మేరువు లభించింది. దాని గురించి విచారించగా సుమారు 250 ఏళ్ళ క్రితం అక్కడ గొప్ప యజ్ఞం జరిగినట్లు తెలిసింది.


ఆ శ్రీచక్రమేరువును మళ్ళీ భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్యపీఠం ప్రతిష్టించారు. ప్రక్కనే వున్న ఎత్తైన కొండమీద శివాలయం కట్టించారు.


ఆలయ సొగసులు :


ఈ దేవీపురం ప్రాంతంలోని శ్రీచక్రమేరునిలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో నిర్మితమైంది.

ప్రహ్లాదశాస్త్రి ఏకాగ్రతతో, సౌందర్యలహరిలో ఆదిశంకరులు సూచించిన విధంగా, లలితా సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు వర్ణించిన విధంగా ఉండేటట్లు, ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు. 1990 లో జూన్ 4 వతేదీన మూలవిరాట్ ‘సహస్రాక్షి’ విగ్రహ ప్రతిష్ట జరిగింది. శ్రీ చక్రాలయంలో బిందు స్థానంలో (మూడో అంతస్తు) పవళించిన సదాశివుని మీద కూర్చున్న, నిలువెత్తు ఆ విగ్రహం కళ్ళలోకి చూస్తుంటే, జీవకళ ఉట్టిపడుతూ, జీవితం ధన్యమవుతుంది. ఆమె చుట్టూ, క్రింది అంతస్తులలో, నక్షత్రాలను పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉన్నారు.

నిష్ఠల ప్రహ్లాద శాస్త్రికి ధ్యానంలో గోచరించిన విధంగా ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాతృమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద,

10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, రెండో అంతస్తులో 10 విగ్రహాలను సిమెంటు చేసి పెట్టారు. మిగిలిన విగ్రహాలను పంచలోహాలతో చేయించి మూడో అంతస్తులో అష్ట దళ పద్మంలో ఉంచారు. ఇవికాక భూమిమీదే భ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, బాలాజీ, కాళియమర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు _ఈ పది విగ్రహాలనూ రాతితో చెక్కించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాలకు భక్తులు అభిషేకాలు చేస్తారు.

ఈ దేవీ పురాన్ని శ్రీదేవీ భాగవతంలో వర్ణించిన ‘మణిద్వీపం’ గా రూపొందించాలని గురూజీ (ప్రహ్లాద శాస్త్రి) ఆకాంక్ష .

ఆలయ విశిష్టత:

దేవిపురం ప్రాముఖ్యత సహ్రక్షి మేరు ఆలయం, శ్రీ మేరు యంత్ర ఆకారంలో నిర్మించిన ఏకైక మూడు అంతస్తుల నిర్మాణం. అంటే శ్రీవిద్య ఉపాసన కేంద్రమైన శ్రీ చక్రం అని పిలిచే పవిత్రమైన హైందవధర్మ౦  రేఖాచిత్రం. 108 అడుగుల (33 మీ) చదరపు కొలత గలిగిన బేస్ పై 54 అడుగుల (16 మీ) ఎత్తు, పొడవు గల ఆలయం.ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా దస్త్రం:Meru1.jpgవిరాజిల్లుతుంది. ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండలపై కామాఖ్య పీఠం, శివాలయం ఉన్నాయి.

సహ్రక్షి మేరు ఆలయం గర్భగుడిలో 100 కంటే ఎక్కువగా వున్న మనిషి సైజు విగ్రహలను ప్రదక్షిణాల ద్వారా చేరు కొనవచ్చును.ఈ దేవాలయంలో విగ్రహలకు కుల, సంప్రదాయాలు లేదా లింగ నిమిత్తం లేకుండా సొంతముగా పూజ చేసుకోవచ్చు. 👇(సేకరించబడిన సమాచా రం)....ఓం నమో వేంకటేశాయ ...🌹🌹🌹🙏🙏🙏

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online