ఆరు బయట మంచు బాగా పడుతోంది చల్లని వాతావరణం .లేలేత సూర్యకిరణాలు అప్పుడే ఉదయుస్తున్నాయు అరుణ.
కుమారి మాత్రం చాలా వేగంగా తులసి పూజలు ,ఇంకా ప్రదక్షిణలు పూర్తిచేసేస్తుంది. ఆమె .మనస్సు మాత్రం సెంట్రల్ యూనివర్శిటీ పైననే ఉంది ...బైట పూజల హడావిడి ..ఆ వేగం చూసి కళ్ళు వత్తుకుంటూ బైటకు వచ్చింది మంజుల .అక్కా "ఏమిటి పొద్దున్నే ఇంత హడావుడి ..ఎప్పుడో పది గంటలకు యూనివర్సిటీలో సెమినార్ ..దానికి ఇంత హడావుడి అవసరమా ? కొంచెం నిద్రమత్తు గా విసుగు తో అరుస్తూ అంది మంజుల .ఒక్కసారి...మంజుల వైపు చూసింది.
కుమారి మాత్రం చాలా వేగంగా తులసి పూజలు ,ఇంకా ప్రదక్షిణలు పూర్తిచేసేస్తుంది. ఆమె .మనస్సు మాత్రం సెంట్రల్ యూనివర్శిటీ పైననే ఉంది ...బైట పూజల హడావిడి ..ఆ వేగం చూసి కళ్ళు వత్తుకుంటూ బైటకు వచ్చింది మంజుల .అక్కా "ఏమిటి పొద్దున్నే ఇంత హడావుడి ..ఎప్పుడో పది గంటలకు యూనివర్సిటీలో సెమినార్ ..దానికి ఇంత హడావుడి అవసరమా ? కొంచెం నిద్రమత్తు గా విసుగు తో అరుస్తూ అంది మంజుల .ఒక్కసారి...మంజుల వైపు చూసింది.
నీకేం ఏమి తెలుసు డాక్టర్ శివనారాయణ.. ..ఆయన గురించి ఎంత కాలం నుంచి తపస్సు చేస్తున్నానో ఇంతకాలానికి ఆయన ...దర్శనం అవుతొంది.. నీకు ఒక్క నిమిషంలో ఏమి చెప్పగలను ..అని మనస్సులో గొణుక్కు0టూ తన హడావిడిలో పడిపోయింది అరుణ కుమారి .అంతలోనే మనస్సులో ఆలోచనలు ..సుడితిరుగుతూనే ఉన్నాయి ...అప్పట్లో
శివనారాయణ ..ఓకే ..కానీ నేను అనుకొనే ..నా క్లాసుమీట్ శివనారాయణనేనా ? మంజుల తెచ్చిన ఇన్విటేషన్ పై అతగాడి ఫోటో లాగానే ఉంది ..అతగాడి కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో కి తీసుకుంటే పరిశోధన చేసే అంత శక్తి ,యుక్తి ...లేవు మరి ఏమో చెప్పలేము ..ఏదైనా బ్యాంక్ లోన్ లు అవీ ఇప్పించి ఎవరైనా సహాయం చేశారేమో ?పెళ్ళి అయి పోయి ఉంటుందా ? ఆ అత్తింటి వాళ్ళు చదివించారేమో ..అస్సలే అతగాడు మంచి మేధావి ,కష్ట పడటం సాధించడం అతగాడి నైజం ..నన్ను కృష్ణ కుమారి అని పిలిచేవాడు .నా పేరు మర్చి పోయినట్లు గా నటించి నవ్వేవాడు
గట్టిగా నిలదీస్తే ..మీరు పొడుగాటిజడ ఆ పెద్ద కళ్ళు సినిమాలో ఆమె ఎలా మాట్లాడుతుందో అలానే మీరు మాట్లాడతారు
మీ కట్టు .బొట్టు వేష ..భాష లను బట్టి అలా ఫిక్స్ చేసేశాను ..అని నవ్వేసేవాడు .పాత జ్ఞాపకాలు అలా చుట్టేస్తుంటే తనలో
తానే ముసి ముసి గా నవ్వేసుకుంటుంది అరుణ .అక్కా ..నేను రెడీ... మరి నువ్వు బయలు దేరుతున్నవా ..తన టూవీలర్ ఇంటి లోనించి బైటకు తీస్తూ ఓ కేక వేసింది మ0జుల .ఆ..నేను ఎప్పుడో రెడీ అయి వున్నాను .........
* * * *
మంచి చలి కాలం అవ్వడం వల్ల ..క్యా0పస్ అంతా చెట్లుతో నిండి అడవి లా ఉండటం వల్ల ఎండ పెద్దగా కనిపించడం లేదు .రక రకాల ..చెట్లు ...పూల మొక్కలు ..పక్షులు అన్నీ చూసుకుంటూ మెల్ల.. మెల్లగా సెమినార్ జరిగే ఆడిటోరియం కు
చేరుకుంటున్నారు .అప్పుడే వివిధ రకాల కాలేజీలు నుంచి విద్యార్థులు పరిశోధనా శాస్త్రవేత్తలు అక్కడే పనిచేస్తున్న ప్రొపెసర్లు.. మీడియా ప్రతినిధులు ..అప్పుడు.. అప్పుడప్పుడే వస్తున్నారు ..ఒక ప్రక్క ?గోడలు నిండాఇదివరలో ఎప్పుడో వ్రాసిన సంస్కృతశ్లోకాలు .దాని అర్థం. ఒకటిఅయుతే...ఇంకోరకమ్ అర్థం వ్రాసి కావాలనే విమర్స చేస్తున్నట్లుగా ... అనిపిస్తోంది ...ఇవ్వన్నీ విద్యార్ధి సంఘాలు వ్రాసినవి అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటుంది .అక్కడ ఉంచిన సెమినార్ కరపత్రాలు, వాల్ పోస్టర్లు ..అన్ని చూస్తూ డాక్టర్ శివనారాయణ ..ఆరోజుల్లో శివ నారాయణ ఒకటేనా ..నేను అనుకోని ఊహించుకొనే. శివ నారాయణ ఒకటేనా సరిపోల్చి చూస్తూ ఆలోచల్లో పడిపోతుంది అరుణ ...ఇంతలో అందరూ వేగంగా హడావిడి పడుతూ ఓ బృందం లోపలికి వస్తు న్నారు ..ఓ ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ అమ్మాయిలు ..అబ్బాయిలు ముందుగా లోపలికి వచ్చారు ..ఆ తరువాత ఓ ఫారిన్ ఆవిడ ..చీర కట్టుకొని బొట్టు ,నగలు పెట్టుకుని ...ఆ డాక్టర్ శివనారాయణ తో ఇంగ్లీష్ లో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ..నవ్వుతూ జోక్స్ వేస్తూ వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు ..అక్కా చూడు .ఆ స్పెడ్స్ ..లావు అద్దాలు పెట్టుకున్నా రే ..ఆయనే శివనారాయణ ..గుస గుస గా చెవిలో చెప్పింది మంజుల .అటూ ఇటూ తొంగి ..తొంగి వంగిపోయు మరీ పరీక్ష గా చూస్తోంది అరుణ... ఇంతలో స్టేజ్ పైన ఉన్న ఇంకో ప్రొఫెసర్ ..మైక్ తీసుకొని అనౌన్స్ మెంట్ మొదలుపెట్టి ఒక్కొక్క రిని సభాస్థలి పైకి ఆహ్వానిస్తూన్నారు ..ఇక ఈ నాటి ముఖ్య అతిధి ...అమెరికా లో గొప్ప పేరు పొందిన బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త డాక్టర్ శివనారాయణ గారు మన తెలుగువారవ్వడం మనందరికీ గర్వకారణం ..ఎక్కడో ఒక మారు మూల గ్రామంలో ఆర్థికస్తోమత పెద్దగా లేని ఓ దేవాలయ పూజారిగారి కుటుంబం లో పుట్టి అహోరాత్రులు కష్టపడిచదువుకొని స్వయం కృషితో స్వయం ప్రతిభ తో అమెరికా దాకా మన తెలుగువారి కీర్తిని ఇనుమడింపచేసిన ..ఈ మహానుభావుడు మన0దంరికి...ఇప్పుడొచ్చే కొత్త కొత్త ఔత్సాహిక పరిశోధకులు అందరికి ఎంతో ఆదర్శం .అటువంటి ..డాక్టర్ శివనారాయణ గారిని వేదిక పైకి సవినయం గా ఆహ్వానిస్తున్నాము ..అనే మాటలు వింటున్న అరుణకుమారి కి కొంత అర్థమైంది ..ఆ. శివనారాయణ..నేను అనుకున్న శివనారాయణ నే ..కొంచెం ఆమె మనస్సులో ఆనందం ప్రారంభం అయ్యింది ..ఇంతలో తన బ్లేజర్.. సర్దుకొని కళ్ళ జోడు సరిచేసుకొని వడి వడీగా సభ పైకి వచ్చి కూర్చొ0టు న్నాడు ..అలా కళ్ళు ఆర్పకుండా అటువైపే చూస్తూ పరిశీలిస్తూఉంది అరుణ ..ఆమె పక్కనే వచ్చి కూర్చుంది ఆ విదేశివనిత ..ఆమె ఎవరు పక్కన కూర్చుంది ..బహుశా యూ.యస్ లో పెళ్ళి చేసేసుకొని ఉంటాడు ...కొంచెం బాధగా కళ్ళ లో నీటిని ఎవరికీ కనిపించకుండా కర్చీఫ్ తో నొక్కి పట్టింది .అరుణ .ఒకరిద్దరు లేచి ప్రసంగం పూర్తి చేశారు ..ఇక శివనారాయణ ప్రసంగం మొదలుపెట్టాడు ..ముందుగా వాళ్ళ. తల్లిదండ్రులు కు గురువులకు ..తాను ఎలా కష్ట పడి చదువుకున్నది ..వాళ్ళ ఊరు దేవాలయ దేవుడిని స్తుతించి ప్రారంభం చేశాడు శివనారాయణ ..ముందుగా నేను విషయం లోకి వెళ్లేముందు ..నన్ను చిన్న తనం లొనే అంటే డిగ్రీ చదివేటప్పుడు ..నన్ను ఒక దేవత ..ఒక స్త్రీ మూర్తి పరిశోధన చేయాలి ..ఆ దిశ గా మనం కల్సి నడుద్దాం అంటూ నాకు ఆ ఆలోచన కు ప్రాణ ప్రతిష్ట చేసిన నా మనస్సులోని ఆ దేవత కు అంజలి ఘటిస్తున్నాను ..పేరు చెప్పవచ్చో చెప్పకూడదో ...ఆమె ను కల్సి అనుమతి తీసుకొని తరువాత మీకు చెబుతాను.. అని అత గాడు చెబుతుంటే పెల్లుఉబికివస్తువున్న...దు:ఖ్ఖ0 ఆబట్టుకోలేక కర్చీఫ్ తో ముఖం అడ్డుగా పెట్టుకొని తలవంచుకొని కూర్చు0డిపోయింది అరుణ ..తను స్టేజి పైన కూర్చొని ఉన్నప్పుడే ఎదురుగా రెండవ వరుస లో కూర్చొని మంచి వెలుతురులో కనిపిస్తూన్న ఆ ముఖాన్ని బాగా పరికించి చూశాడు ..ఆమె తన ఒకప్పటి నేస్త0 కు దగ్గరి పోలిక లా ఊహించాడు ..కానీ ఆమే అని గట్టి నిర్ధారణ కు రాలేక పోయాడు .శివనారాయణ ......ఇక తన ప్రసంగం ప్రారంభిస్తూ పారాసేటమాల్ ..పేరు వినే ఉంటారు ..అది జ్వరాలకు లోపల వచ్చే ఇన్ఫెక్షన్స్ కి వాడే మందు ఇంకా టెట్రాసైక్లిన్ ..ఇంకా కొన్ని విటమిన్స్ లోపాలు ...భోధకాలు కి మందు కనిపెడుతూ మధ్య లో నే చనిపోయారు జ్వరాని కి ఇప్పటికి వాడే మందు పారా సెట్మాల్ ఇప్పటికి అనేక పేర్లు మార్చిన దానిలో ఉండే డ్రగ్ అదే అలా అనేక మందులు కనుక్కున్న ఏలూరు దగ్గరి భీమవరం వాసి డాక్టర్ ఎల్లాప్రెగడసుబ్బారావు గారు ఎలా బీదరికం లోనుంచి వచ్చి ఎలా సాధించాడో చాలా మంది తెలుగు వారికి తెలియదు అస్సలు ఆ ఊరు ..జిల్లా వాళ్ళకే తెలియదు ...లెజెండ్ ఆఫ్ మెడిసిన్ అనే....బిరుదు లండన్ వారు ఆయనకు ఇచ్చారు ..ఇప్పటికి ఆయన బర్త్ డే ని లండన్ లోవిశేషం గా గౌరవంగా జరుపుకుంటారు పెళ్ళి చేసుకుని ఆకట్నం డబ్బు .తీసుకొని లండన్ కి ఓడ ఎక్కాడు .భార్య తో మళ్ళీ వస్తా అను చెప్పిన వాడు ఇక మళ్ళీ తిరిగి రాలేదు భార్యను పెళ్ళి లొనే కల్సి0ది ..ఇక ఆ తరువాత మందు కనుక్కోవాలనే పిచ్చి తోనే ఇంటిని భార్యను మర్చిపోయి పరిశోధన లో మునిగిపోయాడు ...అక్కడే కన్నుమూశాడు సుబ్బారావు గారు ..భార్య ఎంత త్యాగం చేసింది ...ఆయన ఎంతగా జీవితాన్ని అంకితం చేసాడో కదా ...మరి మన దగ్గర చాలా మందికి ఆయన పేరు ఊరు తెలీయదు .కారణం సినిమా. వారికి ,క్రికెట్ వారికి ఇచ్చే గౌరవం లో కొద్దిగా కూడా వాళ్ళకు ఇవ్వక పోవడమే .అని ఇక తన పరిశోధన ఆర్.ఎన్. ఏ.... డీ.ఎన్.. ఏ లు కెమిస్ట్రీ ఎదో అలా ప్రసంగం చేస్తూ మధ్య మధ్యలో పవర్ పాయు0ట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు శివనారాయణ.రీసెర్చ్అనేది ఏదైనా రానున్న తరాలకు మేలు జరిగేలా ఉండాలి.బీటీ వ్యుత్పత్తులు అంటూ ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకముగా విభిన్న మొక్కల పువ్వులు కలిపి కొత్త హైబిరీడ్ అంటూ జీవజాతులు ,మొక్కలు పుట్టించి ప్రపంచంలో కి వదిలితే బాల్యంలో నే ముక్కుపచ్చలారని పసిపిల్లల్లో ఎన్ని రోగాలు చూస్తూన్నాం? అలానే జంతువుల డి ఎన్ ఏ లను బైటకు తీసి పిచ్చి పిచ్చి పరిశోధనలు చేస్తే వచ్చే అంటు రోగాల మహమ్మారికి బలి అయి పోయేది సామాన్యప్రజలే ..బయోవేపన్స్ అంటూ పిచ్చి ప్రయోగాలు ఏమిటి ..అస్సలు వీళ్లకు బుద్ది ఏ మాత్రం లేదా ?భగవత్ శక్తి ని అధికమిం చ గలమా అని కొత్త పరిశోధనల వింత పోకడలను ..ప్రభుత్త్వాలను ఘాటుగా విమర్శిస్తూ ప్రసంగం చేస్తూన్నాడు ప్రొఫెసర్ శివనారాయణ .ఇక ఏదైనా చేయాలి ,కనిపెట్టాలి అని యూనివర్సిటీ లలో పడి పిచ్చివాళ్ళ0 లాగా పరిశోధన చేసి బైటకు వస్తే పొట్ట పోషించుకోడమే పెద్ద కష్టం గా మారిపోయింది. ఈ లోపు కాలేజీలో పార్ట్ టైం అంటూ చేరిన వారిని పర్మినెంట్ చేసేస్తున్నారు ..ఆ విషయం ముందే తెల్సి ఉంటే మేము కూడా పీజీ కాగానే కాలేజీలోనే స్థిర పడిపోయే వాళ్ళం కదా !అంటే నేను వాళ్లకు అవకాశం ఇవ్వద్దు అనడం లేదు అందరికి ఇంటర్వ్యూ లుపెట్టండి ..వాళ్లకు కాస్తంత గ్రేస్ మార్కులు ఇవ్వండి ..నేను డాక్టరేట్ పట్టా పుచ్చుకొని ..పొట్టపట్టుకొని ఆకలితో ఎక్కడెక్కడో తిరిగాను .తల్లితండ్రులు కు ముఖం చూపించలేక ..వాళ్ళ వృద్దాప్యం లో పైసా సహాయం చేయలేక పోయాను .చివరికి అన్నిచోట్లా తిరిగి వ్యుద్యోగం సంపా దించలేక ..మా బంధు జనం నన్ను అవహేళన చేస్తుంటే బిక్క చచ్చి ఉండేవాడిని..అప్పుడు ఒక ప్రైవేట్ కాన్వెంట్ వారు నన్ను గౌరవించి నా చదువు ని గౌరవించి ప్రిన్సిపాల్ వ్యుద్యోగం ఇచ్చారు ..అక్కడ కొంతకాలం పనిచేసిన తరువాత ఆ మేనేజ్ మెంట్ వారు ఇప్పించిన ఆర్ధిక సాయం తో ఒక పెలోషిప్ కి ఇంటర్వ్యూ చేసి ఫారెన్ ట్రిప్ కు ఎంపిక అయ్యాను .అలా బయలు దేరి వెళ్లి పోయాను .నేను ఈ మాత్రం పైకి వచ్చి నాలుగు పైసలు సంపాదించే సరికి నా తల్లిదండ్రులు లేకుండా పోయారు ..పీహెచ్డీ చేసిన మా లాంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వారి గురించి ఏం చెప్పగలం ఇక బోధన వృత్తి అదే టీచింగ్ లోకి పోయి బ్రతుకు దామంటే ఒక్క టీచర్ కే యాభై వేల రూపాయలనుంచి లక్ష రూపాయల దాకా జీతం ..ఏం అదే లక్ష రూపాయలు తో మాలాంటి వాళ్ళం నలుగురు కి భోజన0 వెళ్ళిపోతుంది జీతం పాతికవేలు ఇస్తే ....చాలు ఆ పరిస్థితి ల్లో అదే గొప్పగా సేవ చేస్తాం కదా ..ఇక యూనివర్సీటీ ల్లో ప్రొఫెసర్ వుద్యోగాలు అంటే ఈ దేశంలో చాలా కష్టం ..కులం మతం ప్రాంతీయ విభేదాలు తో కొట్టుకు చస్తుంటాం ..మా లాంటి వాళ్లకు అవి కల లోకి కూడా రావు మా కులం వాళ్ళు మమ్మల్ని పైకి రానివ్వరు ...ఇంకోపక్క రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయు రెండువైపులా మాకు నష్టాలే. ...ఇంకో నష్టం మెరిట్ లో కూడా రిజెర్వేషన్ కులాల వారు వచ్చేసి ఓపెన్ కోటాలో మా వ్యుద్యోగాలు లాక్కెళ్ళి పోతున్నారు ..నా అనుభవం తో చెప్పేది ఏమిటంటే వ్యక్తి లో వుండే ధర్మ0 ఆ ఆలోచన బట్టి ప్రతిభ బ్రతుకుతుంది ...నేను కొంతకాలం బ్యాంకు లో అటెండర్ వ్యుద్యోగం చేశా ను ..అలానే రేడియో లో నా కంఠ0 చాలా బాగుంటుంది అంటే అక్కడ అనౌన్స్ ర్ గా పార్ట్ టైం వ్యుద్యోగ0 చేశా ..అప్పుడు పర్మినెంట్ వ్యుద్యోగాలు పడుతూఉంటే ఎప్పుడూ అప్లై చేసి ఇంటర్వ్యూ కూడా బాగా చేసే వాడ్ని ..కానీ ఫైనల్లో ఒక కీచు కంఠం వాళ్లకు రేడియో లోవ్యుద్యోగం ఇప్పిస్తూ ఉండేవాడు ఆ స్టేషన్ డైరక్టర్ ..ఆయన మా కులం వాడే పోనీలే. లే నివాళ్లకు ఇస్తూవున్నాడు కదా అనుకునేవాడిని ..అలా ఎన్ని సార్లు సరిపెట్టుకోను కోర్టుకి వెళ్ళాను ..భారత దేశంలో కోర్టు ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా .. తీర్పు వస్తుంది మావాడికి వ్యుద్యోగం వస్తుంది అని ఎదురుచూసి చూసి ..మా తల్లిదండ్రులు చనిపోయారు ...కేసు తేలలేదు ..ఎప్పుడైనా ఆ జడ్జి మమ్మల్ని పిలుస్తారు ..మా కంఠ0 ..లో పదాలు వినిపించి ఎవరి కంఠం బాగుందో మీరే తేల్చి ఎవరు కి వ్యుద్యోగం ఇచ్చారో చూడండి అని చెబుదామని చాలా కాలం ఎదురుచూశా0 ..మమ్మల్ని ఎవరిని పిలవకుండానే ప్రభుత్త్వం కి వీలుగానే కోర్టు తీర్పు ఇచ్చివేసింది .. అలా0టి పరిస్థితుల్లో రిజర్వేషన్స్ ఉండాలి అని కూడా అనిపించింది ...అవే లేక పోతే మా స్టేషన్ డైరెక్టర్ లాగా వాళ్ళ వాళ్లనే నింపుతూ ఉంటాడు ..కాకపోతే మా ఓపెన్ కోట లో మావి మాకు ఉంచాలి ...అలా చెప్పుకుంటూ ప్రసంగం పూర్తి చేశాడు శివనారాయణ.. .కొంతమంది ముఖ్యులు ఔషధాలు.. పారముల్లాస్ ..కల్తీలు వలన ప్రజాలుపడే ఇబ్బందులు ...సేంద్రీయ వ్యవసాయం ప్రపంచానికి లాభం ఇలాంటి అంశాలు పై కొంతమంది ప్రొపెసర్లు వాళ్ళ ..వాళ్ళ పరిశోధనా పత్రాలు చదువుతూవున్నారు ..శివ నారాయణ కొన్ని వింటూ నోట్ చేసుకుంటున్నాడు ..అంతా పూర్తి అయిపోయింది ఇంతలో పెద్ద రాయల్ కుర్చీ తెచ్చి వేశారు ఇక్కడకు కేంద్ర మంత్రి వర్యులు విచ్చేసారు వారికి స్వాగతం అంటూ ప్రకటనలు వినిపిస్తూవున్నాయి ..కొంతమంది శాలువలు ...పూలదండలు తో హడావిడి గా అటు ఇటు పరుగులు పెడుతూవున్నారు ....కొద్ది సేపు హడావిడి గా గడిచింది ..ఇప్పడుమన దేశంగర్వించే శాస్త్రవేత్త శివనారాయణ గారికి సన్మాన కార్యక్రమం ...అంటూ ప్రకటన చేశారు ...మైకు తీసుకొని....కొంచం పెద్దగా చెప్పాడు రాఘవ ఎక్కడున్నా స్టేజి పైకి రావాలి ...అని చెప్పాడు శివనారాయణ .....ల్యాబ్అసిస్టెంట్ రాఘవ విని ...నన్నెనా ..పిలిచేది ఇంకా ఎవరైనా ఉన్నారా? ....అటు.. ఇటూ చూస్తూ న్నాడు ..రాఘవ ల్యాబ్ లో వ్యుద్యోగి ..అని మళ్ళీ పిలిచాడు శివనారాయణ ...పరుగున వెళ్ళి స్టేజి దగ్గర నిలబడ్డాడు ..రాఘ వ ..నాకు చిన్ననాటి నుంచి స్నేహితుడు ...ముందు వాడికి సన్మానం చేస్తాను తరువాత మీ ఇష్టం అంటూ శాలువ తో నిలబడ్డాడు .రాఘవ ...తనకు సన్మానం కాగానే మైకు లో ప్రస0 గ0 మొదలు పెట్టాడు ....నేను శివ గాడు ఇద్దరం చిన్నప్పటినుండి ఒకే సైకిల్ పై తిరిగే వాళ్ళం మా నాయన చిన్నప్పుడే చనిపోతే గుడిలో అయ్యగారు..శివ వాళ్ళ నాన్నగారు నన్ను తెచ్చి పెంచారు .నాకు అక్షరాభ్యాసం చేసి నాలుగు ముక్కలు చదివించారు..వారు చాలా ..బీదవారు వెనుకాల ఆస్తిపాస్తు లు ఏమీ లేవు ...గుడి ఆదాయం సరిపోయేది కాదు ..పంటలు పండక గుడికి రావాల్సిన ధాన్యం వచ్చేది కాదు ఎన్నోసార్లు ..ఉన్న గంజి పంచుకొని రోజులువెళ్లతీసాం... వీడు బాగా చదివేవాడు .ఆడు రాసుకున్న నోటుపుస్తకాలే నా చేత బలవంతంగా చదివించే వాడు ..నేను ఈ మాత్రం ఉన్నానంటే వాడి దయే . ఆ అమ్మగారు అయ్యగారు జీవించి ఉంటే .. శివ ని చూసి పొంగిపోయే వాళ్ళే ... కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ గద్గద స్వరం తో చెపుతున్నాడు .వీడు నాకు దూరం అయిపోయాడు ..ఏ పని చేసిన నా పిల్లల్ని కుటుంబాన్ని పోషి0 చుకోలేక చాలా కష్టాలు పడ్డాను...శివ గాడికి అడ్రస్ వెతికి పట్టుకొని ఉత్తరం వ్రాశాను ..ఒకరోజు ఇక్కడ ఉద్యోగం ఉంది వచ్చి చేరమని లెటర్ వచ్చింది ...ఇక్కడ సెటిలయ్యాను .తరువాత తెల్సింది వాడుచేసిన కృషి వల్ల నాకు ఈ వ్యుద్యోగం వచ్చింది అని ..వాడు లాంటోళ్లు ఎక్కడ ఉన్నా బాగుండాలి కళ్ళ నీళ్ళు తుడుచుకుని ..శివనారాయణ ని హత్తుకున్నాడు రాఘవ ..ఆ తరువాత ..ఎంతో అట్టహాసంగాశివనారాయణ కు సన్మానం పూర్తి అయుంది .మంత్రి గారి ప్రసంగ0 పూర్తి అయుంది ...శివనారాయణ గారు ఎప్పుడు ఏ పని చేపట్టినా దానికి నిధులు ఇప్పించి సహాయం గా ఉంటానని ప్రతిజ్ఞ లా చెప్పాడు మంత్రిగారు ..సభా కార్యక్రమం పూర్తి అయుంది ..అందరూ స్టేజి దిగి బైటకు వస్తున్నారు ....శివనారాయణ గ్రూప్ వారంతా కారు లో వెళ్లిపోయారు ..మెల్లగా నడుచుకుంటూ బైటకు వచ్చారు అరుణ ..మంజుల ..అక్కా ..ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు తినేసి వెళదాం ..చెప్పింది మంజుల .ఏమో నే బాబు నాకు ఆకలి గా లేదు నువ్వు వెళ్ళే సి రా ..నేను ఇక్కడ లైబ్రరీ లో ఉంటాను చెప్పింది అరుణ ..ఒక ఐస్క్రీమ్ తెచ్చి ఇచ్చిభోజనానికి వెళ్ళి పోయింది మంజుల ....ఇక మళ్ళీ ఆలోచన ల్లో పడిపోయింది అరుణ ...నేను కూడా వెళ్ళి శివనారాయణ ముందు కనపడితే పలకరించేవాడేమో ....ఒక స్త్రీ ..తనకు. పరిశోధన చేయాలనే ఆలోచనకు బీజం వేసింది అనీ ఆ సంకల్పం ఆమెదే అని చెప్పాడుగా... నేనే అయ్యింటానా ? ఏమో ఎక్కడెక్కడో ..చదువుకోసం తిరిగాడు కదా !పైగా ప్రక్కనే ఎవరో విదేశీ అమ్మాయి ఉంది కూడా పెళ్ళి కూడా చేసేసుకొని ఉంటాడు...ఏమోలే ..ఎక్కడున్నా సుఖఃము గా ఉంటే చాలు ..అవును రాఘవ ఇక్కడే ఉంటున్నాడా ?అది నాకు తెలియదు రాఘవ ను కలుసుకొని మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయి గా ..ఏమోలే తెల్సి ఏం చేస్తాం ....అలాఅరుణ మనస్సు ఊగిసలాట లో పడి ఆలోచనలతో నిండిపోయింది ....అక్కా ..బయలు దేరదామా ..అని మంజుల పిలుపుతో ఈ లోకం లో కి వచ్చింది అరుణ ..క్యాంపస్ నుంచీ బైటకు వస్తున్నారు .
అవును మంజూ ....రాఘవ కూడా ఇక్కడే పనిచేస్తాడు అట గా కొంచం ఉత్సాహంగా అడిగింది అరుణ .ఏది ల్యాబ్ అసిస్టెంట్ గారా! అవును ....ఆయనే.... వారు ఇక్కడ కెమిస్ట్రీ లాబ్ లో పనిచేస్తారు ..శివనారాయణ గారి చిన్నప్పటి ప్రెండ్ అట గా ..అందుకే ఆయనకు సన్మానం చేశారు ..అలా మాట్లాడుతూ హాస్టల్ కు చేరుకున్నారు అక్కా చెల్లెళ్ళు ...పిచ్చాపాటి మాటల్లో పడిపోయారు ..అక్కా సరే నీకు ఈ సబ్జక్టులు అంటే ఇష్టం ..అందుకే నువ్వు బయోటెక్నాలజీ చదివావు ..ఓకే కానీ శివనారాయణ గురించి చెప్పితే చాలు నువ్వు షేక్ అయిపోతావు ...అస్సలు కన్నీళ్ళు పెట్టేసుకుంటావు ....శివ నారాయణ మన ఏరియా వాళ్ళు అని తెలుసు కానీ నీ పై అంత ప్రభావం ....కారణం ఏమిటో తెలియడం లేదు?చెప్పాలనుకుంటే చెప్పు ..లేకపోతే వద్దు ..అక్కా ..అడిగింది మంజుల ...బలేదానివి ..నువ్వు మా పిన్ని కూతురువి ..పైగా మీ అమ్మ నాన్నగారి ది పూర్తిగా కోస్తా జిల్లా ..నీకు మా గురించి పెద్దగా తెలియదు ..నేను శివనారాయణ ఇద్దరం క్లాస్ మేట్స్0 ..నా స్కూలు చదువు మనఊరు బీరపల్లి లో పూర్తిఅయిపోయు0ది..పక్కనే సత్యంపల్లి లో ఇంటర్ లో జాయిన్ అయ్యాను ..క్లాస్ లు కి మాత్రం ఎప్పుడూ డుమ్మా కొట్టేదానిని కాదు .మాకు కొంచెం కష్టమయున క్లాస్ కెమిస్ట్రీ ..ఆర్గానిక్ కెమిస్ట్రీ మా క్లాస్ కి వచ్చిన ప్రతీ సార్ పాఠం చెప్పడం పూర్తి అయిపోయిన తరువాత లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళను ఎక్కువగా ప్రశ్నలు వేసేవారు ..వాళ్ళలో ఎవ్వరూ సరిగ్గా చెప్పలేక పోయినా ..ఒక వ్యక్తి ని మాత్రం వదలకుండా లేపి చెప్పు నీకు ఏమి అర్థం అయ్యింది... లేచి ఒక సారి అందరికి చెప్పు అని ఒక స్థూడెంట్ ని లేపి చెప్పించేవారు . లెక్చరర్ ఎలా చెప్పేవారో ..టేప్ రికార్డర్ ..రికార్డ్ చేసినట్లు గా మొత్తం లెస్ న్ మళ్ళీ ఎక్సప్లైన్ చేసి చెప్పేవాడు ..ఆయన ఎప్పుడూ చివరి బెంచ్ లో కూర్చొని లేచి వెళ్ళిపోతుండేవాడు .అతగాడిని చూస్తేనే నాకు కంపరం ఎత్తేది ఇంత లావు గ్లాస్ అద్దాలు . కొంచెము బక్కపలుచగా ఉండేవాడు కొంచెము వెల్సిపోయిన బట్టలు ..క్రాఫ్ లో కన పడకుండా ఉన్న చిన్న పిలక పొడుగాటి బొట్టు.ఎత్తయిన మనిషి ,ఎప్పుడూ ముఖము లో చిరునవ్వు .అది నాకు కొంచెం కోపం తెప్పించేది ..ఎందుకంటే నాకు ..జెలసీ అదిగో ...అలా అతగాడే శివనారాయణ ..అక్కడ చుట్టుపక్కల దేవాలయాలు మా తాతలు కట్టించినవే ఎక్కువ గా ఉండేవి మా నాన్నగారూ ,పెద్దనాన్నలు ..బాబాయులు ,మామయ్య లు ఇలా తలా ఒకటి పంచుకొని ..ఆ ఖర్చులు అవన్నీవాళ్ళు చూసుకునే వాళ్ళు ...ఆ సందర్భంలో ఒకసారి శివనారాయణ ..వాళ్ళ నాన్న గారితో అంటే వాళ్ళ ఊరి గుడి లో ప్రధాన అర్చక స్వామి .న మాట ..ఇద్దరు కల్సి మా ఇంటికి వచ్చారు .దేవాలయ ఉత్సవాలు గురించి ..చాలాసేపు మాట్లాడుకున్నారు ..చిన్న స్వామి ..మా అమ్మాయిగారు ..మీరు ఒకటే క్లాస్ కదా ఎలా చదువుతున్నారు ? అని మా నాన్నగారు కాంతారావు అడిగారు ...అప్పుడు శివ నారాయణ నవ్వి ...మీ అమ్మాయి గారు క్లాసులోలెస్సన్ బాగా వింటారు ..మా కంటే శ్రద్ద బాగా పెడతారు ...అని చెబుతుంటే నాకే నవ్వు వచ్చింది ...ఇంతలో మా కాలేజీ కి రెండు రోజులు సెలవు వచ్చాయి... దేవాలయ పనుల కోసం మా ఇంటికి వస్తూ పోతూ వున్నాడు శివనారాయణ. ..ఒకరోజు మా ఇంటి ముందు నోట్స్ రాస్తూ కూర్చొని వున్నాను ...మా నాన్నగారి కోసం ..వెయిటింగ్ ..నాకు దగ్గర లో నిలబడి ..అమ్మాయి గారు మీ హాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది ..నాది కోళ్లు కెళికినట్లు గా ఉంటుంది ..చిన్నగా నవ్వుతూ అన్నాడు .శివనారాయణ .నేను తల ఎత్తి ..అవునులేండి ..సార్ మేధావుల చేతి వ్రాత అలానే ఉంటుంది ...కొంచెము వెటకారం గా అన్నాను .ఒక నవ్వు నవ్వి వదిలేశాడు ..అస్సలు కోపం ఏ మాత్రం రాలేదు ..శివనారాయణ కు ..పైగా మేడం నాకు ఒక డౌట్ ఉంది ..అని మొదలు పెట్టాడు ...ఏం సార్ క్లాస్ ఫస్ట్ వాళ్లకు..ఏమి డౌట్స్ ఉంటాయి...పెదవి విరిచి వెక్కిరించాను అప్పుడు ఆయన ... .మీరు కూడా క్లాస్ మొత్తం లో రెండో రాంక్ లో వున్నారు ..మీరు చెబుతారు అనుకున్నాను ..ఇక ప్రతీ దానికి మీరు నన్ను వెక్కిరించి మాట్లాడుతూ ఉంటే ..ఎలా మేడం ..కొంచెము ముఖం ముడిచాడు శివనారాయణ .ఏమో సార్ ..నన్ను పరీక్షించుతున్నారేమో అనుకోవచ్చు గా ..మెల్లగా అన్నాను ..ఆ రోజుల్లో మనిషికి ..మనిషి కాస్తంత దూరంగా ఉండి మాట్లాడుకొనేవాళ్ళం ..ఆడ... మగ ..అయితే ఒకళ్ళు తో ఒకళ్ళు ..మాట్లాడుకోవాలంటే ..చెమటలు పట్టేసేవి ...ఈ రోజుల్లో అయితే చాలా మార్పులు శర వేగంగా వచ్చేశాయ్అనుకో .కాలేజీల్లో..అమ్మాయిలు ..అబ్బాయిలు .కల్సి ఒకే కప్పు టీ ..అందరూ కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ రౌవుండ్ తిప్పుతూ ..ఎంగిలి కూడా లెక్కలేదు అనుకో ..అలానే ఈ రోజుల్లో అమ్మాయి అమ్మాయిని ...అబ్బాయి ..అబ్బాయిని ..లవ్ చేస్తున్న రోజులు ఇవి ...కొన్ని దేశాలు అయితే ఇంకాస్త ముందుకు పోయి అటువంటి సంభంధాలు ను చట్టబద్ధం చేస్తున్నాయి ....సరే ఇవి అన్నీ ఈ కలియుగ 0లోని లక్షణాలు ..మనలాంటి వాళ్ళం దానిపై కూడా ఏమీ మాట్లాడలేము ..ఓ .కె ..అయితే ..శివ నారాయణ ..అప్పుడు మా ఇంట్లో నన్ను నిజంగానే ...తనకు వచ్చిన డౌట్ నన్ను అడిగాడు అనిపించింది...నేను మొదలు పెట్టి మొత్తం వివరించి చెప్పాను ..నిజంగా మేడమ్ మీరు చెప్పినది ..నాకు పూర్తిగా అర్థం అయుంది ..ఇదివరలో దీనినే మొత్తం చుట్టూ.. తిప్పి చెబుతూఉండేవాడిని .ఇప్పుడు మీరు చెప్పినది డైరెక్ట్ గా ఇది నా ముక్కు అనేట్లుగా సింపుల్ గా చెప్పారు ..థాంక్స్ మేడం ..నాకు కూడ ఏదైనా డౌట్ వస్తే చెప్పేవాళ్లు మంచి ఫ్రెండ్ ఉన్నారని ..నేను భావిస్తున్నాను అని నవ్వుతూ నమస్కారం చేయగానే ...చిన్న స్వామి లోపలికి వచ్చి ఈ ..సామాను సర్ది తీసుకెళ్లండి బాబు అనికేక వేశాడు కాంతారావు ...అయ్య గారు ..వస్తున్నానండీ ..లోపలికి పరుగు తీశాడు శివనారాయణ .ఇచ్చిన పూజా సామాగ్రి అంతా సర్దుకొని సైకిల్ పై పెట్టుకొని నా వైపు చూసి కళ్ళతో వెళ్లివస్తా ను ..బై అని చెప్పినట్లు అనిపించింది
నాన్నగారు అక్కడే వున్నారు కాబట్టి నేను ఒక చిరునవ్వు ఇచ్చాను ..అలా శివ నారాయణ నాకు పరిచయం అవడం ప్రారంభం అయుంది ..ఇకప్రతిరోజు కాలేజీ లో మెట్లపైనా....కాలేజీ గ్రౌండ్ లో గార్డెన్ లోను ..మా క్లాస్ అమ్మాయిలు అందరం కూర్చొని మాట్లాడుకోవడం ,సైన్స్ రికార్డ్స్ వ్రాసుకొంటూ ఉండేవాళ్ళం ..డౌట్స్ ఉంటే శివా ఇటురా బాబు కొంచెం ఇదిచెప్పూ.. అది చెప్పూ అని ఫిజిక్స్ లోని ప్రాబ్లమ్స్ ..మొత్తం చెప్పించుకొని ..అవసరం కాగానే అతగాడి వెళ్లిపోగానే ఆతని పై జోకులు వేసేవాళ్ళు .. క్రమేణా నాకు ఆ విధానం నచ్చలేదు .మా ఊరి అమ్మాయిలు కొద్ది మందే ఉండేవాళ్ళం ...మేము అందరం మాట్లాడుకుంటూ ..శివ నారాయణ మాతో మాట్లాడుతూ అలా నడుచుకుంటూ మా ఊరు వచ్చేసే వాళ్ళం .అతగాడు నిత్యపూజలు ,అష్టోత్రాలు, గోత్రాలు పూజలు కోసం ఆ డబ్బులు వసూళ్ళు కు తిరుగుతూ ఉండేవాడు .మా తో వచ్చినా ..ఒక్కరు ,ఇద్దరు వున్నా కూడా చాలా డీసెంట్ గా మాట్లాడేవాడు ...అలా అలా పరీక్షలు ...పరిచయాలు కాలేజీలో సభలు అలా అలా సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి .నేను ..కొంతమంది మా ఫ్రెండ్స్ అమ్మాయిలు ..శివనారాయణ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి పోయాము .డిగ్రీ కాలేజీ ..ఇంకాస్త దూరం నాకు డిగ్రీ చదవాలని ఎంతో ఉత్సాహ పడ్డాను ..ముందు ఇంట్లో ని ఆడపిల్ల బైటకు వెళ్ళి చదవడం ..పెద్దవాళ్ళకు ఎవరికి ఇష్టం లేదు .ఆ రోజులలో అంతే ..చిట్ట చివరకు నాన్నగారు ..నేను ముభావం గా ఇంట్లో కూర్చోవడం ,హుషారు గా లేకపోవడం గమనించి ...నన్ను చదివించాలని నిర్ణయం తీసుకున్నారు.ఇంట్లో బాబాయి,పిన్ని అమ్మమ్మ అందరి తో వాడులాడి ఒప్పించారు .శివ నారాయణ ను పిలిపించి ఆ కాలేజీ గురించి కొన్ని విషయాలు రాబట్టారు .మాదగ్గర నుంచి కొద్దిదూరం నడిచి బస్ ఎక్కి వెళ్ళిరావాలి
* * * *
ఓ బాబూ శివ నారాయణ ..ఏమిటి అంత స్పీడ్ గా నడుస్తావు .నువ్వు అంటే బక్కగా వున్నావు ,గాలిలో అయినా ఎగురుకుంటూవెళ్ళుతూ ఉంటా వు ..మాకు భగవంతుడు అటువంటి శరీరం ఇవ్వలేదు కదా ,మాది కొంచెము ఒబాసిటీ గట్టిగా అరుస్తోంది అరుణ .ఏంటి మేడమ్ ...నన్ను ఏదో అన్నారు...చెప్పండి ..కొంచం కోపంగా అడిగాడు శివ .నేను
అన్నది అర్థం కాలేదా? ..కొంగ లా మేము వేగంగా ఎగురుకుంటూ వెళ్ళ లేము అన్నాను ...నాకు అర్థం అయ్యింది పాపా ..రేపు నా దారి నేను చూసుకుంటాను ...నీతో మాత్రం రాను అమ్మాయి గారు.... .కొంచెం కోపంగా ఫేస్ పెట్టి చెప్పేశాడు శివనారాయణ ...సరే అదే మాట పై ఉండండి ..వెళ్ళగానే నాన్న గారితో ఇదే విషయం చెబుతాను ..అమ్మాయి గారు ..మీ ఇల్లు వచ్చింది ..నేను వెళ్ళి సైకిల్ తెచ్చుకుంటాను మీరు లోపలికి వెళ్ళండి శివ నారాయణ చెబుతూ ఉండగానే ..మరి రేపటి నుంచి నువ్వు రావు కదా ఎలా ?అమాయకంగా ముఖం పెట్టి కళ్ళు పెద్దవిచేసి కొంచెం బాధ నటిస్తున్నట్లు. గా అడిగింది అరుణ ...అబ్బా ..తల్లీ నీకో నమస్కారం కృష్ణకుమారి.సారి అరుణ కుమారి దయచేసి లోపలికి వెళ్లండి ....నేను రాకుండా ఎక్కడికిపోతాను ..మీ నాన్న గారు వింటే నా పని ...అంటూ న్నంతలో .రండి చిన్న స్వామి లోపలికి వచ్చి కూర్చోండీ ..కాస్త టీ తీసుకొని వెళ్ళండి ..పర్వాలేదు అయ్యగారు నేను రేపు వస్తానుగా అంటూ కంగారుగా సైకిల్ పై వెళ్ళిపో యాడు .శివనారాయణ ..తనలో తాను ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి పోయింది అరుణ కుమారి ..............
కాలం వేగంగా గడిచి పోతుంది ....రెండు సంవత్సరాలు గా అనా వృష్టి తో పంటలు లేవు ..అరుణ కుమారి కుటుంబం కూడా అందరి లా ...సమస్యల తో కాలం ఈడుస్తున్నారు ..పై నుంచి వస్తూన్న జమిందారి పద్ధతులు ,పోషణ అంతా బీటలు వారుతున్నాయి.వాళ్ళ పరిధి లోని దేవాలయాలు నడపడం, మరమ్మత్తులు కూడా కష్టం అవుతూ వున్నాయు ...వాళ్ళ పై ఆధారపడ్డ పనివాళ్ళ ను పోషించడం చాలా కష్ట తరం అవుతూ ఉన్నాయి .ఇక గ్రాడ్యుయేషన్ రెండవ సంవత్సరం పూర్తి అయి కాలేజీ సెలవలు అవ్వడం వల్ల ఇంట్లోనే గ.డుపుతున్నారు అరుణ, శివనారాయణ లు ..ఒక్కసారిగా మబ్బులు పట్టి పెద్ద వర్షం ప్రారంభం అయ్యింది.... పనివాళ్ళు... తో కుటుంబం వాళ్ళు చాలా సీరియస్ గా సమాలోచనలు చేస్తూ ఆందోళన పడిపోతున్నారు ...ఎలా అయ్య గారు ..కాస్తంత బోర్ క్రింద పండించాము కదా వరి ..చేతికి వస్తూన్న టైం లో ..మొత్తం పాడైపోతుంది ..ఏమి చేయాలో పాలుపోవడం లేదు అని మాట్లాడుకుంటున్నారు ..అరుణ మాత్రం ఇంటి వెనుక తోట లో కి చూస్తూ నిలబడిపోయి0ది .పిచ్చుకలు ,గోరింకలు తడుస్తూ లోపలికి ,బైటకు తిరుగుతూ ఉన్నాయి.కాకుల జంట కదిలిపోతున్న వాటి గూడును... చిన్న పుల్లలు అటూ ఇటూ సర్దుతూ గూడును,...గోడును దిద్దుకొనే ప్రయత్నం లో ఉన్నాయి .అరుణ మనస్సు లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి .శివనారాయణ చాలా తెలివి గలవాడు ..మంచి మనసున్న వాడు ..మంచి మేధావి ..ఇద్దరం పై చదువులకు వెళ్ళాలి ..ఇక ఇష్టం తో కస్టపడి పరిశోధన చేయాలి ..మా ఇంట్లో వాళ్ళు నన్ను చదువు కోనిస్తారా ? ఏమో చూద్దాము అస్సలు శివనారాయణ మనస్సులో ఏముందో తెలుసుకుంటాను నిండా ఆలోచనలో మునిగిపోయిన అరుణ కు పిలుపు ....తడిసిపోయున బట్టలు లోపల ఆరవేయు0చు ..ఆ పనిఅమ్మాయి సీతమ్మ తో ...అలానే .ఆ మడిబట్టలు మూల పెట్టు రేపు ఉదయం నేను మళ్ళీ ఎండేసుకుంటాను .అని తల్లి వాసంతి ..చేప్పగానే ఆ పనిలోకి వెళ్ళిపోయింది అరుణ .
శివనారాయణ ఇంట్లో కూడా ..ఎన్నో మార్పులు వస్తున్నాయి . శివనారాయణ కుటుంబం చాలా పెద్దది .వాళ్ళ నాయనమ్మ గారు ..తండ్రి గారు ఆడపిల్లలు కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి ..ప్రతి రోజు ప్రతి సారి జమీందారు లు ఎంత అని ఇస్తారు .వాళ్ళ వలన .ఎంతో కొంత పచ్చడి మెతుకులు లు తో జీవితం గడిచిపోతూనే ఉంది. ఇంకా అడిగితే ఏం బాగుంటుంది! ..పైగా రెండు సంవత్సరాలు నుంచి పంటలు లేవు !వర్షాలు లేవు కరువు కాటకాలు ..శివ నారాయణ చదువు కూడా కొంచెం భారం గానే నడుస్తోంది... పట్టణంలో లో ఏదైనా జాబ్ లో పెడితే కాస్తంత వాడు బాగుపడతాడేమో దేవాలయం అరుగులపైన కూర్చొని ...ఆలోచనల్లో పడిపోయా డు శివనారాయణ తండ్రి శేషాచలం ..తాత గారి దగ్గర నేర్చుకున్న ఆయుర్వేదం.. తో వాడి జే బు ఖర్చులు ...ఎలానో వెళ్ళ దీసుకుంటున్నాడు ..ఇంచుమించు గా ఒక సంవత్సరం పడుతుంది వాడి చదువు అంతా అయిపోయి సర్టిఫికెట్ చేతికి వచ్చేసరికి ....ఆలోచల్లో ఒక అయిడియా తట్టింది ..కొంచెం ఆనంద పడుతూ ....దేవాలయం మెట్లు కడుగుతూవున్న భార్య ఆండాళ్ తో .అబ్బాయి ..ని ఒకసారి పిలువు ..అంటూ ఆర్డర్ వేశాడు ..భావి దగ్గరనుంచీ నీళ్ళు చేరవేస్తూ బిందె అక్కడ పెట్టి నాన్నగారూ చెప్పండి ....అంటూ వచ్చాడు .కొద్దిసేపు అన్నివిషయాలు మాట్లాడుకుని ఏమి లేదురా! నువ్వు చదివి ఉద్యోగం చెయాలి ..ఆ..వ్యుద్యోగాలు మనకు వస్తాయని అస్సలు గ్యారంటీ లేదు ..పైగా మనవి పెద్దకులాలట ...ఇంకా కష్టం ..పైగా ఇతర కులాల వారందరు కోచింగ్ లు తీసుకొని ఓపెన్ కోటా లో కూడా ఇతరులు వచ్చేస్తున్నారు ....కాబట్టి నేను కోచింగ్ లకు పట్టణాలు పంపించి డబ్బులు కట్టలేను ...కొత్తగా లంకపల్లి లో గవర్నమెంట్ బ్యాంకు వస్తోంది అట దానిలో..ఆఫీస్ బోయ్ కి ఒక దరకాస్తు వ్రాసి ఇవ్వు ..పది చదివితే చాలు. అంటున్నారు ..ఏమంటావు ?...ముఖం అంతా సంతోషం పులుముకొని అడిగాడు .తండ్రి శేషాచలం ...ఓ. కె.. నాన్నగారు మీరు ఎలా అంటే అలా? తలఊపేశాడు శివనారాయణ..
* * * * *
అరుణకుమారి ఊళ్ళో....... ఊరి మర్రిచెట్టుక్రింద కూర్చొని ఏదో ఒక ఊరి సమస్య పై కొట్లాట పెట్టుకోవడం ...దానిలోకి రాజకీయాలు చొప్పించి ...పార్టీలు గా విడిపోయి కొట్టేసుకుంటు న్నారు .ఈ మ ధ్య కాస్తంత ఆరోగ్యం బాగోలేక ఆమె తండ్రి ఏ దీ పెద్దగా పట్టించుకోవడం లేదు ..జీడిమామిడి తోటలు మాత్రం బాగా నే కాపు వచ్చింది... బాబాయులు మాత్రం పంట కోతలు ..అన్ని విషయాలు వాళ్ళే చూసుకుంటున్నారు ..వాళ్ళతో కల్సి కాస్తంత రీలాక్సేషన్ కోసం తోటల దగ్గరకి వెళ్ళుతుంది ...కానీ వాళ్ళ ప్రవర్తన లో అసూయాద్వేషాలు కనిపిస్తూన్నట్లు గుర్తించింది అరుణ ...కారణాలు కోసం రోజూ వాళ్ళను అనుసరిస్తూ తిరుగుతొంది.... వాళ్ళ .ల్లో..ఈమె రావడం ..మధ్య మధ్య ఇంటికి వచ్చి వెళ్ళే ఆమె నేస్తం శివనారాయణ రావడం వాళ్ళ ఎవరికి నచ్చడం లేదు ...శివనారాయణ.... అరుణ ల స్నేహం పై బురద జల్లుతూ వాళ్ళ ఇంటి అందరిలో శివనారాయణ చెడ్డవాడు అనే అభిప్రాయం ..తెప్పించే ప్రయత్నం లో వున్నారు .....ఈ రోజు స్నేహం అంటారు ...రేపటి రోజు ముదిరి ప్రేమ అంటారు ...ఇలా కుటుంబం మొత్తం లో అందరిలోనూ అక్కరలేని ప్రచారం చేస్తున్నారు .ఒకరోజు ....అరుణకుమారి ఇంట్లోనే ఉండిపోయింది ...వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం చూసుకుంటూ మందులూ అవి ఇస్తూ ఆయన ప్రక్కన కూర్చొని ...తన క్లాసు పుస్తకాలు చదువుకుంటూ ఉంది ....ఎమ్మా!...ఏమిటి తల్లి శివనారాయణ ..పై ఇంత గా చెబుతూ తెగ బాధ పడిపోతూవున్నారు ?..కొంచెము మెల్లగా అడిగాడు అరుణ తండ్రి కాంతారావు ..మీకు తెలుసుగా నాన్నగారు ...మన వాళ్ళ0దరిలోను ఏదో అసూయాద్వేషాలు వచ్చాయి ...నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.... ఎందుకు అయి ఉంటుంది నాన్నగారు.. కొంచెం బాధ గా అడిగింది అరుణ ...ఈ రోజుతెచ్చి ఏమిటమ్మా !..ఎప్పటినుంచో ..వాళ్ళకు అవి ఉన్నాయి ...కాకపోతే మీరు చిన్న పిల్లలు కదా !మీలో ఇవి నాటడం ఎందుకు అని నేను ఎప్పుడూ అనలేదమ్మా!...కానీ ..ఇక ఇప్పుడు పరిస్థితులు ముదురుతున్నాయు ...అందుకే నేను హెచ్చరించాల్సి వస్తోంది ...తల్లీ ..జాగ్రత్త... కొంచెము గట్టిగా నొక్కి చెప్పారు కాంతారావు ....ఎందుకు నాన్న గారు స్వంత వాళ్ళ లోనే ఇంత ఈర్ష్య ?....కారణాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా ..ప్రతిసారి ఊరివాళ్లందరు నన్నే సర్పంచ్ గా పోటీ చేయమంటారు ...చేసి గెలుస్తూనే ఉంటాను ...ఈ ఊరి జనాలకు నేను అంటే ప్రాణసమానం ..ఒకటమ్మా.... ఇక్కడ వాడిది ...వీడిది ..లాగేసి పోగేయాలని నాకు ఎప్పుడూ లేదు ....కానీ మన వాళ్ళలోనే ..ఈ పిచ్చ ఎక్కువైంది ...ఎవడు బాధ లో వున్నా వాడి అవసరానికి అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గరనుంచి ..తక్కువ ధరకు కొనేయడం ...వాడికి డబ్బులు పూర్తిగా ముట్టచెప్పక పోవడం ..అలానే కొన్ని బంజరు భూములు కలిపేసుకోవడం ..మనవాళ్లు ఇతరుల చెడ్డవాళ్ళతో చేరి
ఊరిలో అందరిని బాధపెట్టడం ...నేను సర్పంచ్ గా ఎదిరించడం ఇలా జరుగుతూవస్తోంది తల్లి ...అందుకే నేను ఇస్సారి ఇక పోటీ చేయను తల్లీ ...కొంచం బాధగా చెప్పుకుంటూ పోతున్నాడుతండ్రి కాంతారావు..ఒక అన్నగారు .సంఘసేవ .నాన్న గారు ..ఆ రోజుల్లో స్వాతంత్ర్య పోరాటంలో దేశసేవ ..కోసం చాలా. భాగం ఆస్తులు కరిగించి ఇచ్చేశారు ...ఇంకొంత భాగం ..రంగస్థలం.... నాటకాలు ..హరికథలు ..గుళ్ళుగోపురాలు ..ఉత్సవాలు అంటూ కొంత అయిపోయింది ...మిగతా. కొద్ది భాగం ..ఇంటిఅవసరాలకు అయిపోయింది... పూర్వం రోజుల్లో జమీందారు అంటే ..పొలం.... గొడ్లు..గోదా ఉండేవి కానీ ..ఒక వంద రూపాయలు ..కూడా క్యాష్ ..ఉండేది కాదు ..అదే ఇప్పుడు .చూడు...స్కూలుపిల్లల దగ్గర ఏకంగా వందరూపాయలు నోటు ఉంటుంది .....ఆ రోజుల్లో ఏం కొనాలన్నా వడ్లు లేక బియ్యంఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడం ...ఇక పెద్ద.... పెద్ద వి ఏవైనా అవసరాలు వస్తే ఏకంగాకొంత పొలం ఇచ్చేసి ..అవసరాలుతీర్చుకునేవారు .అలా... అలా భూమి చాలా అయిపోయింది.. ఇంకొన్నిచోట్ల ..ఇతర కులాల వారు వీరి భూమిలో జండాలు పాతి ..ఆక్రమించుకున్నారు ...ఇంకా మిగిలిన భూమి సేద్యం చేయాలంటే ..రైతుకూలీలు వారి పనులు..శ్రద్ధ.. లలో చాలా తేడాలు వచ్చేశాయి ....వాళ్ళలో కూడా రాజకీయపార్టీలు జొరబడ్డాయి . ..ఆ సమస్య తో పాటు కరువులు కాటకాలు ..వ్యవసాయం చేయలేక కౌలుకు ఇచ్చుకొని పట్టణాలకు వ్యుద్యోగాలకు వలస పోయిన వారు కొంతమంది .ఏది ఏమైనా వ్యవసాయ రంగం చాలా కష్టం గా ఉందమ్మా ..ఖర్చులు పోనూ ఏమీ మిగలడం లేదు ..పైగా విత్తనాలు ..ఎరువులు అన్నీ కల్తీలే .....పైగా పంట ఎక్కువ పడినప్పుడు వర్షాలు పడి కొట్టుకుపోవడం ..లేకపోతే వర్షాలు లేక కరువు కాటకాలు ..ఇలా తాను చూసిన అనుభవాలు చెప్పుకుంటూ పోతున్నాడు అరుణ తండ్రి కాంతారావు.అమ్మా ఇక నాకు పేరుకి కొడుకే కానీ వాడు ఇక్కడకు వస్తాడని కానీ ..మన కుటుంబం చూసుకుంటాడని నాకు అయితే నమ్మకం లేదమ్మా .సినిమా పిచ్చ లో పడి జీవితాన్ని పా డుచేసుకుంటున్నాడమ్మా..హైదరాబాద్,.తిరుగుతూఉంటాడు ..ఇంటికి. మాత్రం రాడు ...చూడు మ్మా ఏదో లెటర్అంటున్నాడు పోస్టుమ్యాన్ ...తండ్రి కాంతారావు చెప్పగానే ..గబ గబా వెళ్ళి అందుకొని వచ్చింది అరుణ ..అన్నయ్య వ్రాశాడు ..కళ్ళు పెద్దవి చేస్తూ ఆనందం గా తండ్రికి ఇచ్చింది అరుణ ..ఇక్కడ కూర్చొని చదువు తల్లీ ..మంచం..పైన కూర్చొని చదివి వినిపించింది ..కిరణ్అన్నయ్య య మ్మెస్సీ ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాడట.... ఇక రీసెర్చ్ లో జాయిన్ అవుతాడట ...కాక పోతే తాను ఒక సినిమా డైరెక్షన్ కోర్సు చేయాలని ఉంది అట అందుకే పూణే వెళ్లి అక్కడ జాయిన్ అవుతాడట ...కొంచెం డబ్బు అవసరం ఉంది పంపమని రాస్తున్నాడు ..అంతే నమ్మా డబ్బులు అప్పుడు మనం గుర్తు వస్తావమ్మ... మనకెందుకు తల్లీ సినిమాల గోల .మేము పెద్దవాళ్ళం అయ్యాము కదా ..ఇంటి సంగతి కాస్తంత పట్టించుకోవచ్చు కదమ్మా ....కాదు నాన్నగారు చదువుకుంటూ ఏదో ప్రయత్నం చేస్తూన్నాడే కానీ చదువు డుమ్మా కొట్టలేదుగా ..కొంచెం నవ్వు చిందిస్తూ చెప్పింది అరుణ ....ఏమిటి సినిమా పిచ్చ ...సరే లేమ్మా ..మీ అమ్మ కిచెన్ లోనో ...ఎక్కడో ఉంటుంది చూసి అబ్బాయి గారు లెటర్ అని ఇచ్చి రా తల్లి ...పంపిచేశాడు తండ్రి కాంతారావు
.* * * *
ప్రియా నువ్వు ఇక్కడ ....ఏం రాకూడడా? యూనివర్సిటీలో పనులు అందరికీ ఉంటాయు ..మా సీనియర్ వనజ ను కలవడానికి వచ్చాను ..పని అయిపోయింది .బయలుదేరుతున్నాను ..చిరునవ్వుతో చెప్పింది ప్రియ ..కనీసం మా వైపు వచ్చావు కదా టీ త్రాగుదాం .. ఎలా వచ్చావు సైకిల్ పైనా ? కొద్దిగా నవ్వుతూ అడిగాడు కిరణ్ ..వాట్ ..ఇంతదూరం సైకిల్ పైనా నావల్ల కాదు బాబు ....పోనీలే ..మా ప్రెండ్ ది బైక్ ఉంది తెస్తాను ...కొంచెం ముందుకి కదిలాడు కిరణ్ పర్వాలేదు నేను బయలు దేరుతాను ....అరే ఒక్క నిమిషం ...అంటూ .అక్కడ టూ వీలర్ తీసి ..ప్రియ ను ఎక్కించుకున్నా డు ..కొద్దిగా ముందుకి వెళ్ళి క్యాంటిన్ లో టీ సిప్ చేస్తున్నారు .మధ్య మధ్య .ప్రియ వైపే చూస్తున్నాడు కిరణ్ .ఆమె బాబ్లీ హెయిర్ ను మొత్తం గా క్లిప్ పెట్టుకుంటుంది ..ఆమె పెదవులు తేనె పూసినట్లు మెరుస్తున్నాయి .ఆమె మెడ ..వక్షస్థల0 ..వెన్నెల అరబోసినట్లు పచ్చగా మెరుస్తుంది ...చేతులు ఎత్తి .హెయిర్ క్లిప్ పెట్టుకుంటుంటే ఆమె బహుమూలాలు ..అతగాడినికవ్వి
స్తున్నాయు ...విశాలమైన కళ్ళు చిన్న కాటుక రేఖ ..మనస్సులో ఎక్కడో ఆమె పై చిన్ని చిన్ని ఆశ ..ఏమిటి చూస్తున్నావు ..
మీ హాస్టల్ ఎక్కడ ఏమీ చూపించవా ....?తెల్లని మల్లెలు ని విసిరి రెచ్చగొట్టినట్లు అనిపించే ఆ పలు వరుస ....తేనె అందుకోవా అనిపించే ఆ మెరుస్తున్న పెదవులు ...తో చిరునవ్వు విసిరింది ...ప్రియ ..వై నాట్ ...రా ఇక్కడే ..అంటూ రూమ్ అక్కడనుంచి వాళ్ళ దగ్గరలోని పార్క్ అందమైన పూలమొక్కలు అన్నీ చూపించాడు ...సాయంత్రం వేళ ..ఇద్దరు ఒక చెట్టు మొదట్లో దగ్గరగా అనుకోని కబుర్లు చెప్పుకుంటున్నారు ...ప్రియా ..నేనంటే నీకు ఇష్టమేనా ..కొంచెం మెల్లగా అడిగాడు కిరణ్ ..బలే వాడివి కిరణ్ ..నేను ఎంత చెప్పినా నీకు వయస్సులో అన్నింటిలో సరిపోయే అందమైన అమ్మాయిని ..పైగా మేనకోడలను ....నువ్వు బాగా చదు వుకుంటున్నవాడివి ...అండగాడివి ..నిన్ను కాక ఎవర్ని ఇష్టపడతాను ఒకర్ని ఒకరు
అల్లుకుంటున్నారు ....ఆమె మేను నిండా ముద్దులు పెడుతున్నాడు ....చేతులు ఎత్తి బాహుమూలంలోకి ముద్దుపెట్టబోయా డు .. ..ఆమె స్తనద్వయం అతని మనస్సులో గుచ్చుకుపోయింది ...ఆమెను కౌగిలిలోకి లాక్కొంటున్నాడు....ఆమె బాహుమూలాల నుంచి సహజం గా వస్తున్న వాసనలు అతగాడ్ని మత్తులోకి గమ్మత్తుగా లాగేస్తున్నాయు ...మెడపై ఉన్న జిప్పు ను తప్పించాలని .మన్మ్ ధ సామ్రాజ్యం లోకి లాగాలని తెగ ఆవేశపడి పోతున్నాడు ...ఇంతలో ఆమె ఒక్క తోపు తోసింది ..అతను క్రిందకు పడిపోయాడు ....అంతే .బెడ్ పైనుంచి . క్రిందికి . డొల్లి పడిపోయాడు కిరణ్ ...అరేయ్ .ఇప్పుడు టైం తొమ్మిది అయ్యింది ..బారెడు ......పొద్దు ఎక్కింది ..లేవరా బాబు రూంలో తన ఫ్రెండ్ నవ్వుతూ అరుస్తున్నాడు... అబ్బ ఏం డ్రీమ్ మిస్ అయిపోయిందిరా ..అవులిస్తూ లేచి బ్రష్ పేస్ట్ తీసుకున్నాడు..కిరణ్ .
* * *** * *
.. (to be continued)
0 comments:
Post a Comment