Pages

యావత్తు ప్రపంచం మొత్తాన్ని. తన గానమాధుర్యం తో నింపి ఓలలాడించిన ఒక భారత రత్నం బాలు

 గాన గంధర్వులు బాలు గారికి నివాళి


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

సుమారుగా 50 ,000 వరకు పాటలు ..14 భాషల్లో పాడి పెద్దహీరో లకు ప్రారంభించి ..వారి మనుమలు వరకు ..పాడటం ఇంత లాంగ్ కెరీర్ నభూతో నభవిష్యతి ..అని చెప్పాలి .50 సంవత్సరాలు గానామృతాన్ని. .ప్రవాహంగా అందరికి పంచడం ..దేశ విదేశాలలో వారికి  వీరాభిమానులు ఉండటం ..ఈ సమయంలో వారందరు బాలు కోసం కంట తడి పెట్టడం మామూలు విషయం ఏమీ కాదు ..నేను సెలిబ్రిటీ కాకపోయినా ..నాలాంటి సామాన్యుడికి కూడా పరిచయం కలగడం ..నాతో కూడా చక్కగా మాట్లాడటం జరిగింది ..డిగ్రీ కాగానే సినిమా డైరెక్టర్ కావాలని  హైదరాబాద్ వచ్చాను ..అనేకమంది సినిమా ఇండస్ట్రీ వారిని కలుస్తూ స్టూడియో లు తిరుగుతూఉండేవాడిని ..భుక్తి కోసం కొన్ని న్యూస్ పత్రికలలో జర్నలిస్ట్ గా చేరడం ..అలా అలా రేడియో కి చేరి నా వాయిస్ బాగుంటుంది అంటే కాంటాక్ట్ బేసిస్ లో ఎనౌన్సర్ చేస్తూ బైటకు వెళ్లి ప్రోగ్రామ్స్ చేసుకొని వచ్చేవాళ్ళం ..అప్పుడు కొన్ని కొన్ని సభా కార్యక్రమాలు ను రికార్డు చేసుకునే సమయము లో అనేక సార్లు బాలు గారిని కలవడం జరిగింది .  1994  లో  శుభసంకల్పం సినిమా  పంక్షన్ హైదరాబాద్ లో జరిగింది  .అప్పుడు ఎన్ టి ఆర్ గారు  లక్ష్మీపార్వతి .కమల్ హస్సన్ బాలు వీరి అందరూ  సభా కార్యక్రమ0 లోవున్నారు ఇంకా వేటూరి సుందర రామ్మూర్తి గారు సోమయాజులు గారు మా తండ్రి గారు పక్కనే కూర్చున్నారు ..సభా కార్యక్రమం కు ముందు రోజు నేను  .మా తండ్రిగారు గ్రాండ్ కాకతీయ హోటల్లో  అందరిని కలిశాము  కమలహాసన్.. కూడా అక్కడ వున్నారు  నాన్న గారి కమల్ హస్సన్ తో కొద్దిసేపు మాట్లాడారు ఆ తరువాత నాన్న గారి పాదాలకు నమస్కారం చేశారు కమల్..అప్పుడు మానాన్నగారి దగ్గర భద్రాచలం లడ్డూ ప్రసాదం  ఉంటే . అది ఇచ్చారు  .మా నాన్న గారి ని నామాలు ..కంఠ స్వరాన్ని ..అందాన్ని నవ్వుకుంటూ మీరు చాలా అందంగా వున్నారు ..మీరు కూడా మా ఫీల్డ్ లోకి ఎందుకు రాకూడదు ..అన్నారు నాన్న గారు కమల్ ని చాలాసేపు చిన్న పిల్లవాడ్ని పట్టుకున్నట్లు   ఒక పక్కగా హత్తుకొని మాట్లాడారు ..ఇక ఆ తరువాత శైలజ గారు సుధాకర్ గారు వాళ్ళ పిల్లలు చాలా చిన్న పిల్లలు అలా వారందరి తో గడిపి ..మరుసటి రోజు న  సభా ప్రాంగణం  చేరుకున్నాం ..అప్పుడు కూడా బాలు కొద్దిసేపు మాట్లాడారు ..2004తరువాత .ఒకసారి విజయలక్ష్మి గారు అనే ఒక గాయని  24 గంటలు గిన్నిస్ రికార్డ్  అప్పుడు బాలు గారు ..ఇతర గాయనీ మణులు అందరూ వచ్చారు సుశీల గారి నుంచి జిక్కి ఎల్ ఆర్ ఈశ్వరీ వరకు అందరూ వచ్చారు  .అప్పుడు మా మేనల్లుడు చిన్నపిల్లవాడు ..వాడిని తీసుకొని ఆ సభ కి వెళ్లడం జరిగింది   బాలు   మా మేనల్లుడిని ఎత్తుకున్నారు వాడికి ఒక పెన్ను కూడా ఇచ్చారు అలా   వారి తో మాట్లాడటం ..వారు నా చదువు పరిశోధన గురించి అడగటం ..అలా భేషజం లేకుండా పలకరించడం వారికే చెల్లింది ...రాగ సప్త స్వరం అనే ఒక సాంస్కృతిక సేవా సంస్థ వారు అనాథ ల ఆశ్రమం స్థాపన సందర్భంలో బాలు గారు వచ్చారు ..నేను అక్కడే వున్నాను ..కార్యక్రమం అయిన తరువాత పక్క భవనం నుంచిబైటకు రాగానే రాత్రి అవ్వడం వల్ల వారి చెప్పులు కనపడలేదు ..నేను భవనం ముందుకు వెళ్లి  వెతికితే ఒక్క చెప్పుల జత కనపడింది అవి పట్టుకొని ఆయన పాదా ల దగ్గర పెట్టి ఇవి మీవేనా చూసుకో0డి
అంటే ఇవి నావే అక్కడ విప్పి అటు వచ్చా కదా ..అయినా మీరు అలా ఎందుకు తెచ్చారు స్వామి నాకు చూపిస్తే నేను తెచ్చుకొనేవాడిని కదా అని నా భుజం పై ప్రేమ గా చేయు వేసి అన్నారు ..నిజంగా నా భాగ్యం అంత కళా కారుడి పాదరక్షలు మోయడం ....ఇలాంటి నాకు మధురస్మృతులు గా మిగిలి పోయాయి ..
ఏది ఏమైనా అంత మేరు పర్వతం ఎత్తుకి ఎదిగి అలా వినయం గా ఒదిగి ఉండటం ..సామాన్యుడిలా ప్రవర్ర్తి0చడం అందరివల్లా కాదు ..నేను ఎంతోమంది ప్రముఖులను కలిశాను మాట్లాడను కానీ ..ఇలా ప్రవర్తించిన వారు మాత్రం కొద్దిమందే వున్నారు ..అందులోఅత్యంత మహనీయుడు బాలుగారు
ఇక వారు కృష్ణుడు దగ్గరనుంచి క్రీస్తు వరకు ఎన్నో భక్తి గీతాలు ప్రయివేటు భక్తి గీతాలు ,స్తోత్రాలు పాడారు   వారు పాడిన .. లింగాష్టకం బాగా ప్రాచుర్యం పొందింది  .కాశీ విశ్వనాథ క్షేత్ర 0 లో .తెల్లవారు తూనే ఒక మేలుకొలుపు లాగా ఇప్పటికి ..ఎప్పటికి వారి మధుర కంఠ0 వినిపిస్తూనే ఉంటుంది  ..అంతే కాదు నటన లో కూడా కొన్ని సినిమాలలో అత్యంత ప్రతిభ చూపెట్టారు ..చాలా కళా ఖ0డాలు సినిమాలకు స0గీత దర్శకత్వం వహించారు ....బాలు ఇచ్చిన డబ్బింగ్ వల్లనూ ..ఆయన పాడిన మదు ర మైన  గీతాలు వల్ల కూడా కొంతమంది నటులకు అత్యంత మైన గొప్ప ఘన కీర్తి ..మంచి కెరీర్ వచ్చాయి అని ఘంటాపథంగా  గా చెప్పవచ్చు  . అస్సలు ఆ వయస్సు లో ఇటువంటి భయానకర. పరిస్థితుల్లో కాలు బైట పెట్టకుండా ఉండాలసింది ...కానీ ఒక  టీవీ చానల్ వారు   వాళ్ళ ఛానల్ నష్టాల్లో ఉంది అని ..రేటింగ్ లు పడిపోయాయి అని  ఆ ఛానల్ వారు గట్టిగా పిలిపించుకుంటే ..కాదనలేక ..ఈ లాకడౌన్ సమయం లో వచ్చి ..హైదరాబాద్ లో స్థూడియో లో సతీసమేతంగా ..వచ్చి వృత్తి కి న్యాయం చేసిన సందర్భములో ...కొంతమందికి .కరోనా బారిన పడటం ...దానిలో బాలు కుటుంబం కూడా ఉందని తెల్సి ...యావత్తు లోకం షాక్ ఆయ్యు0ది ..కోలుకుని వస్తాను అని ధైర్యం గా బాలు చెప్పారు కదా అని మళ్ళీ అభిమానలోకం అంతా గాలిపీల్చుకున్నారు  ..ఇంతలోనే బాలు మాయం .... ఆ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ..ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేశారు .  అస్సలు ఆయన స్వయంగా మంచి భక్తుడు ..మంచి మానసిక స్థయిర్యం ..డాక్టర్లు ఎందరో ఉండి కూడా ..బాలు మనందరి అభిమానం దాటి అంద కుండా ..అందని లోకాలకు వెళ్ళిపోయారు.  .కానీ ప్రతి జీవుడి కి భగవంతుడు కొంత ప్రోగ్రాం వ్రాసి ఓ క్యాసెట్ ఇస్త్తాడు ..జీవుడు చివరివరకు దానిలో వ్రాసిన ప్రోగ్రాం మాత్రమే చేయగలరు ..తరువాత క్యాసెట్ పూర్తి అయిపోయింది ..ఇక ఇంకేమి లేదే మో అని వేదాంతం చెప్పుకోవడమే ..మన బాధకు ..కాస్తంత రిలీఫ్ దొరుకుతు0దేమో అని భావిస్తూ .వారిని భగవంతుడు అక్కున చేర్చుకొని వారికి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్ధించుదాం.... కళా కారుడికి ..మరణం లేదు ఆయన   మధురమైన పాటలు ఆ చంద్ర తారార్కం.... No END FOR ANY ART🌺🌺🌺🌺🌺🌺🌺



0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online