ప్రణబ్ ముఖర్జీ బహుముఖప్రజ్ఞా శీలిభారతదేశములో పుట్టిన ఒక ప్రపంచ రత్నం ********************************************************************
ఆధునిక భారత కాంగ్రెస్ కి అంటే సోనియాగాంధీ శకం నుంచి చూస్తే ఒక కన్ను పి.వి నరసింహారావు. ..మరో కన్ను ప్రణబ్ ముఖర్జీ . ఇద్దరూ రాజకీయ విధానములో సామాజిక అభివృద్ది ..సాంకేతిక విప్లవం ..ఆర్థిక అభివృద్ధి.అన్ని రంగాలలో వాళ్ళ కృషి ..శ్రమ ..ఆ ఫలాలు ఇప్పుడు భారత్ దేశం అనుభవిస్తోంది కరోనామహమ్మారి... లాకడౌన్ రాక పోయుంటే భారతదేశం అగ్ర దేశాలకే మార్గదర్శక0 గా నిలబడి ఉండేది అని చెప్పవచ్చు ..అస్సలు ప్రణబముఖఃర్జీ మరియు మన్మోహనసింగ్ ఇద్దరికి గురువు పి .వి నరసింహారావు ..మన్మోహనసింగ్ మంచి బ్యూరోక్రాట్ ..రాజకీయ0 తో పని సాధించడం తెలియదు ..అదే పి.వి.మరియు ప్రణబముఖఃర్జీ లు ఎప్పటినించో పెద్దవాళ్ళ దగ్గర పనిచేసి తల ప 0డిన మేధావులు రాజకీయ ఉద్దండులను చూసిన దిగ్గజాలు ..వారి అనుభవం ,సూక్ష్మదృష్టి సమస్యలు పరిశీలన ,పరిష్కారం ..ఇప్పుడు దేశానికి ఏమి కావాలి ..ప్రపంచపటం లో ఇండియా ని ఎలా ధీటుగా మలచాలి అనే విజన్ ఉన్న నాయకులు వారు అదే కోవలోని వారు వాజపేయి సోమనాధ్ చటర్జీ జనతాపార్టీ అధ్యక్షుడులోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారుఇక మిగిలిన వారిలో అధ్వానీ.. మురళి మనోహరజోషీ .అస్సలు జోషి గారు అయితే ఏకంగాఅయితే ముగ్గురు ప్రధాన మంత్రులకు ఆయన గురువు .అటువంటి ఒక్క భారత రత్నాలే కాదు ప్రపంచానికే దిశ దశ చూపే రత్నాలు. ప్రపంచ రత్నాలు పి.వి ..ప్రణబ్ లు ఏమిటంటే సమస్యను స్మూత్ గా పరిష్కారం చేయగలరు ..ఆ కోవలో కి భాజపావాజపాయ్ గారు వస్తారు వీళ్ళు బుర్రకాయ మెదడు అయితే అద్వానీ లాంటి వారు మిగిలిన దృఢ శరీరం వంటి వారు .మానసిక ఆరోగ్యం వారు శా రీరక ఆరోగ్యం వీరు ..కొంతకాలం సోనియా గాంధీ ముందుచూపు తో రాహుల్ గాంధీ ని ,ప్రియాంక గాంధీ ని పి.వి.గారి దగ్గర లేక ప్రణబముఖర్జీ దగ్గరో పెడితే వాళ్ళ శిక్షణ లో తిరిగి ఉంటే చాలా ప్రకాశించేవారు ....ప్రణబ్ రాజనీతిశాస్త్రం ..న్యాయ శాస్త్రం చదువుకున్నారు ..పోస్టల్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ వ్యుద్యోగం తో ప్రారంభం అయి ప్రొఫెసర్ వ్యుద్యోగం చేస్తూ ఒక రాజకీయ సభ లో ఉపన్యాసం ఇచ్చారు ..అప్పుడు ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు ..అప్పుడు ఆయనను మేధావిగా గుర్తించి ..ఆమె తన రాజకీయాజీవితం లోకి ఆహ్వానం పలికింది ..బెంగాల్ ప్రాంతంనుంచి డిల్లీ కి చేరుకున్నారు ..కోర్టులను జడ్జి లను అనేక ప్రలోభాలకు వంచి పనిచేసుకోవడమో ..గ్రూపులు కట్టి ?కుట్రలు పన్న డమో వాళ్లకు రావు .. ..పక్కదే శాలనుకలుపుకొని వాళ్ళ ఓడ వ్యాపారాలు చేస్తూ కేంద్ర ప్రభుత్త్వాలని కూల్చి మన కులం ..జాతి వాళ్ళను ...అన్నిరంగాలలోనిలబెట్టి అని రాజ్యాంగ సంస్థలు ..కార్యాలయాల్లో ఒక వ్యూహం గా పెట్టి పనులు వాళ్లకు ఆ నుకూలంగా చేసుకునేలా ఒక తంత్రం ప్లాన్ చేస్తూ పోవడం కాదు చాణక్యుని విధానం ..మోసం కుట్ర కాదు ..అస్సలు ఆ నాయకులకు అంత పిచ్చి కూడా ఉండదు ..సేవ. చేయుంచుకుంటే చేస్తారు రాత్రివేళల్లో నిదుర. తిండి మానేసి అంకితం అయిపోతారు ..వద్దంటే నాలుగు పుస్తకాలు కొనుక్కుని జీవితం ఒక రూమ్ లో గడిపేస్తారు అటువంటి స్థితప్రజ్ఞత ..దక్షత గల ధర్మ స్వరూపులు సంఘస్వరూపులు వాళ్ళు అందుకే వాళ్ళు అందరితో కల్సిపోగలరు పని చేస్తూకావాల్సిన పని ని చేయంచుకోగలరు ..కుళ్ళు రాజకీయాలు వాళ్ళు చేయలేరు ..వాళ్ళలో ఇమడలేరు అది వారి క్యారెక్ట్ ర్....వారి తత్త్వం .చేస్తున్న పనే వాళ్లకు దైవ కార్యం ..చివరి వరకు నిస్వార్థంగా .పనిచేసుకుపోవడమే మార్గ మధ్యలో ఎంతమంది చిరాకు పెట్టేవాళ్లు తగులుతూ ఉంటారు ఆయునా ఓపిగ్గా భరిస్తూ అన్ని దశాబ్దాలు పైకి ఎగిసి వచ్చారు అంటే అది వారి ఉక్కుసంకల్పం నమ్మి కూర్చోబెట్టిన వారికి ..నమ్ముకొని వెనుక నడిచి వస్తున్నవారికి .....చేతనైనంత ..శక్తిమేరకు అంకితం అయిపోవలనే తపన... తృష్ణ వారిది ...అందుకే ప్రపంచం ఆర్ధిక రంగం లో ఓ గొప్ప యోధునిగా పండితు డిగా గుర్తించి ఆర్థికవేత్తగా పురస్కారాలు ఇచ్చింది ..అస్సలు ఆర్థిక శాస్త్రము చదువుకున్న మేధావులు ఇప్పటి సమాజానికి..సామాన్యప్రజ ల చెల్లించే పన్నులు ,దాచుకొనే బ్యాంకు లకు దిశా చేయలేక పేరున్న ఆంధ్రా బాంక్ లు లాంటివి తగలబెట్టి ..ఆదానీలకు ..మాల్యాలకు కట్టబెట్టి వారిని .దేశాన్ని దాటించి రక్షిస్తున్నాము ..దొబ్బితిన్న బ్యాంకు ఎగవేతదారులను కొమ్ము కాసి ..మాఫీ చేసేస్తున్నాము ....పీవీ ప్రణబ్ లాంటి వారికి ఆస్తి పాస్తులు ..పెద్ద ఖరీదు అయిన కార్లు ..బ్యాంక్ లో నిధులు ..చాతుర్మాస్య దీక్షలు ..ప్రతీ విషయం మీడియా కవరేజ్ లేక జూమ్ మీటింగ్ లో స్వంత డబ్బాలు ..వారి వెనుక గంజిపెట్టి ఇస్త్రీ ఖద్దరు చొక్కాలు వేసుకున్న గూండాల బృందాలు .. వారిపై భజనలు ..ఇవేమీ వారికి తెలీదు ..వారికి సమాజమే ..ప్రజా హితం ,ప్రజా మేలు ప్రజా శ్రేయస్సు ఇవే వారికి తెల్సిన తంత్రం ..ఎన్నో భాషలు పుస్తకాలు చదివారు ..ట్రబుల్ షూటర్ గా కీర్తి గడించారు వారు పక్కకు ఒరిగిన తరువాత వాళ్ళ విషయాలు ఎన్నోబైటకివస్తు నాయుఅదే ఇప్పటి వారు పది మంది చేత భజన .పుస్తకాలు ఎన్నో చదివేసిన మేధావి అంటూ ఫోటోలు ,పొగడ్తలు ..అసలు ఉండవు .మంచి తనం తెలివితేటలు పుట్టుకతో రావడం ఒక రకం ..వారిని తెలుసుకొని నేర్చు కొని..నడుచుకోవడం మనల్ని మనం మల్చుకోవడం ..రెండో రకం. అంతే కానీ కెమెరాల ముందు అన్నీ సిద్ధం చేసుకొని ఫోటోలు దిగితే మహా నాయకులు కారు..... ప్రణబముఖర్జీ ఆర్థిక మంత్రి గా వున్నప్పుడు మన్మోహనసింగ్ ను రిజర్వ్ బ్యాంకు కి గవర్నర్ గా తీసుకొచ్చారు ...అటువంటి సింగ్ గారు ప్రధాని అయిన తరువాత ఆయన క్రింద మళ్ళీ ప్రణబ్ ఆర్ధిక మంత్రి గా పనిచేయాల్సివచ్చి0ది .అది ఎదిగి మళ్ళీ ఒదిగి పోయి ఆయన పని ఆయన చేసుకొని పోయారు అది work is worship అంటే ..పాడు ప్రపంచం కూడా ప్రణబ్ లాంటి వారి ని తొందరగా నమ్మి నెత్తిన పెట్టుకోరు ..ఎందుకంటే గొఱ్ఱెలు కసాయువాడిని నమ్ముతాయు కదా ...అలా అందుకే ఆయన జీవితములో ఎంపీ గా గెలిచినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రణబముఖర్జీ .తనను తానే నమ్మలేక పోయాడు .
మతం సంస్కృతి నాగరికత దైవభక్తి ,దేశభక్తి ..సన్యాసం ఎంతసేపు ఇది ఒక్క కోణంలోనే కాదు ఇంకా ఎన్నో కోణాల్లో దేశాన్ని సమాజాన్ని పాలనని చూడాల్సివుంటుంది ..అన్నికోణాల్లో చూసి పాలన చేసిన వారు కాబట్టే ప్రణబ్ ..పివి లాంటి వారిని బహుముఖప్రజ్ఞావంతులు అని పిలుస్తారు ..అటువంటి మహనీయులు మన దేశం అప్పులు తీర్చేసి బంగారం తాకట్టు లను తీసేసి ఆర్థికభారతాన్ని నిలబెట్టారు .ఎన్నో దేశాలలో ని వారు ..వీరు అడగకపోయున.. మన0 పట్టించుకోకపోయున ఆర్థిక సంస్కర్తలు ..పండితులు అని వీరికి బిరుదులు గౌరవంగామెడలో వేసి వెళ్లారు ...అది వారి మేధస్సు ....ఇక ప్రణబ్ ముఖర్జీజీవితములో ముఖ్య ఘట్టాలను చూస్తే.......
రాజనీతిశాస్త్రం... న్యాయశాస్త్రం చదివారు
పోస్టల్ శాఖ లో క్లర్క్ గా జీవితం ప్రారంభం
1969 లో ఈయన ఒక సభ లో ఇస్తూ ఉన్న ఉపన్యాసం చూసి ఆయన. చురుకుదనం గమనించి న ఇందిరాగాంధీ ఈయన గారిని రాజకీయాలలోకి తీసుకువచ్చింది ..అప్పటినుంచి 18 గంటలు పార్టీ కోసం...పిచ్చిగా నిస్వార్థంగా పనిచేయడ0 అలవర్చుకున్నారు
ఇందిరాగాంధీ ఈయన కృషి ని గమనించి రాజ్యసభ కు పంపించారు.
కేంద్రం లో దాదాపు గా అన్ని శాఖలు కు మంత్రి గా పనిచేసి గౌరవం తెచ్చిపెట్టారు
90కి పైగా ఉపసంఘాలకు ఆయన అధ్యక్షుడు గా సలహాలు సూచనలు చేశారు అందుకోసం ఆయన చాలా బిజీగా రాత్రి రెండు గంటలు దాకా పనిచేస్తూ ఉండేవారు .అయినా కూడా పెద్ద ఫోజు పెట్టకుండా అందరికి ఫోన్లు లో అందుబాటులోకి వచ్చి మాట్లాడేవారు .అందరిని కలుపుకొని వెళ్ళే అంత నిగర్వి అన్ని సబ్జెక్ట్ లు పై సంపూర్ణ అవగాహన ఉండటం వల్ల అన్ని సంఘాలు వాళ్ళను డీల్ చేయగలిగారు
7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి .పైగా ఆయన చదివినది ఆర్థిక శాస్త్రము కాదు ఇప్పుడు so called economist ల కంటే 99 శాతం బెస్ట్. ఆయన లో మెరిట్ గమనించే 1984 లో యూరోమనీ మ్యాగజైన్ ప్రపంచ ఉత్తమ ఆర్ధిక వేత్త అని కీర్తి0చి0ది
సుధీర్ఘ కాలం పార్లమెంట్ రీ పార్టీ నేత గా వున్నారు ...ప్రధాని లేని అత్యవసర సమావేశాలు అన్నీ .ప్రణబ్ ముఖర్జీఏ చూసుకునేవారు.
ఇందిరా గాంధీ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రణబముఖర్జీ ని దూరం పెట్టింది అప్పుడు ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు ...కొంతకాలానికి రాజీవ్ గాంధీ అభ్య ర్ధన మేరకు మళ్ళీ తన పార్టీ ని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు ప్రణబ్.
జనతా ప్రభుత్త్వం ఆ రోజుల్లో ఎమర్జెన్సీ గురించి ఆయనను విచారించింది ..కానీ ఆయన దగ్గర ఏ విషయం దొరక లేదు ..ఎంతో ఎత్తులు చూసిన పొట్టివాడు మహా గట్టివాడు ఎత్తు కేవలం 5'1 అడుగులే ..
ఆర్థిక సరళీకృత సమయంలో ప్రారంభం ఆయనే ఆర్థిక మంత్రి .తరువాత కూడా కాలాన్ని బట్టి ఆర్థిక విధానాలు రూపొందించినవారి లోను ఆర్థిక మంత్రి ప్రణబముఖర్జీనే
ఎప్పుడో పార్టీ నాయకుల తో విందు ల్లో పాల్గొన్న ప్పుడు తనకు హిందీ రాకపోవడం వల్లే ప్రధాన మంత్రి కాలేక పోయానని జోకులు గా చెప్పేవారు ..కానీ క్లిష్ట సమయాలలో ప్రధాని గా ఆయన పేరు వినిపిస్తూ ఉండేది ..జగానికి ..మేధావులకు అందరి రాజకీయ నాయకుల కుపదవిలో కనపడని ప్రధాని ప్రణబముఖర్జీ గా వెలుగుతూఉండేవారు
రాష్ట్రపతి గా వున్నప్పుడు చాలామంది తీవ్ర వాదులు దేశద్రోహుల కు క్షమాభిక్ష ను
తిరస్కరించాడు .
తనకు వచ్చిన ఇంగ్లీషు భాషనే బెంగాలీ యాస లో మాట్లాడే వాడు ..ఇందిరాగాంధీ నవ్వుతూ ఒక ట్యూటర్ ని పెట్టుకోమంటే ...నవ్వి వద్దు మేడం నా యాస లొనే మాట్లాడుతాను అని నవ్వుతూ చెప్పేసేవారేట ప్రణబ్ .
కొంతకాలం పైప్ తో పొగ త్రాగే వారు ..వృద్ధాప్యంలో పూర్తిగా మనివేశారు.
ప్రణబ్ ముఖర్జీ దుర్గా దేవి భక్తుడు ప్రతీ ఏటా ఓ నాలుగు రోజులు వాళ్ళ స్వంత ఊరు వెళ్లి దుర్గా మాత పూజలు చేసుకొని తిరిగి వచ్చేసే వారు ..అది ఆయనసంవత్సరం లో వాడుకున్న సెలవులు
1957 లొసువ్రాముఖర్జీ అనే మహిళ ను పెండ్లి చేసుకున్నారు ..సువ్రా కుటుంబ0 బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన కుటుంబ0 ..ఎప్పుడు పుస్తకాలు చడవడమే పిచ్చి ఆయన ఇల్లు అంతా ఒక పుస్తకాలు లైబ్రరీ అని చెప్పవచ్చును.
2004 లో జంగి పూర్ నుంచి ప్రత్యక్షంగా ఎంపీ గా గెలిచినప్పుడు ప్రజల అభిమానానికి ...ఆయన కన్నీరు పెట్టేసు కున్నారు.పి.వి ని గురువు గా భావించినా వాజపాయ్ గారి స్నేహంతో బాగా ఎంజాయ్ చేసేవారు
ఏది ఏమైనా మన్మోహనసింగ్ కి ఒక టర్మ్ ప్రధానిగా ఇచ్చి రెండో టర్మ్ లో ప్రణబముఖర్జీ కి అవకాశం ఇచ్చి ఉంటే మన దేశం అగ్రరాజ్యాలను మించి పోయి ఉండేది .కనీసం తరువాత అయునా కళ్ళు తెరిచిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నతస్థాయి పదవి రాష్ట్ర పతి గా కూర్చోపెట్టి ..తన గౌరవం తాను కాపాడుకోగలిగింది...పదవులు కోసం వాళ్ళు పుట్టరు పద వులే వాళ్ళ కోసం ఎదురుచూస్తు0టాయు ....పదవులు అటువంటి వారికి చాలా వన్నె తక్కువ ..పదవులకేవారు వన్నె తెస్తారు .వారికి పని, బాధ్యత లు తప్ప ఏమీ ఎవ్వరినీ పట్టించుకోరు ...వాళ్ళను దేశమే పట్టించుకోవాలి ..గొప్పలు చెప్పుకొనే రాజకీయ బుడుతలు ..ఇటువంటి మహావృక్షం స్థాయి కి ఎదిగి నిలబడగలమా ఒక్కసారి మననం చేసుకోవాలి ...కనీసం ఫోటోలకు ..ఫోజులు మాని జూమ్ మీటింగ్ లు మాని ..వాస్తవ ప్రపంచం చూసే ప్రయత్నం అయునా చెయ్యాలి...
అటువంటి ప్రపంచంలో ని భారతదేశం లోని వెలుగు వెలిగిన ప్రపంచ రత్నం ప్రణబముఖర్జీ ...ఆయన కు పవిత్రమైన మనస్సుతో కోటి నమ సుమాంజలులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏..🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
0 comments:
Post a Comment