Pages

Nirikshna .... ..నిరీక్షణ short story part - 3 .............

 Part....3..... 


కిరణ్ చేస్తున్న పరిశోధనకోసం కొంతమంది డాక్టర్లు ను ఇంటర్వ్యూ చేయమని వాళ్ళ ప్రొఫెసర్ ..కిరణ్ కు కొంతమంది డాక్టర్లు ..అడ్రస్ లు తీసిఇచ్చాడు ..ఆ ప్రకారముగా డాక్టర్లు ను కలుసుకొని రిపోర్ట్ రాసుకుంటున్నాడు ..వాళ్ల సలహాలు సూచనలు కూడా వ్రాసుకుంటూ న్నాడు కిరణ్ ..ఆ తరుణం లో డాక్టర్ రమణ తో పరిచయం అయు0ది .డాక్టర్ రమణ కిరణ్ లో ని మంచితనం ..మంచి అలవాట్లు ఆతని సంస్కారం డాక్టర్ రమణ కి నచ్చాయి ..అందుకే కారులో తనతో పాటు తిప్పుకుంటున్నాడు.... వాళ్ళ అమ్మాయి ఒక్కతే కూతురు గీత ను  పరిచయం చేస్తున్నాడు ...ఇటు రామ్మాఒకసారి    తండ్రి.పిలుపు తో హాలులోకి వచ్చింది గీత

ఏమిటి ..నాన్నగారు పిలిచారు ..మరేం లేదమ్మా ..కిరణ్ ..అని రీసెర్చ్ స్కాలర్ సైకాలజీ లో పరిశోధన చేస్తున్నారు ..హలో....నమస్తే .లేచి చేతులు జోడించాడు కిరణ్ ..మా అమ్మాయి  గీత  ..డెంటల్ డాక్టర్ ..చిరునవ్వు ఇస్తూ నమస్కారం అండి అన్నది కూతురు ..చూడమ్మా మాట్లాడుతూ ఉండు నేను ఫ్రెష్ అయి వస్తాను లోపలికి నడిచాడు డాక్టర్ రమణ ..ఒక్క నిముషం పాటు ఆమె అందం చూసి కళ్ళు జిగేల్ మన్నాయు ..తల వంచుకొని కూర్చుండి పోయాడు ..మీరు ఎక్కడ వుంటారు ..అడిగింది గీత ..యూనివర్సిటీ క్యా0ప స్ లో న0డి ..చటుక్కున చెప్పి తల వంచుకున్నాడు కిరణ్ ..మీది ఇక్కడ హైదరాబాద్ కాదా ..మళ్ళీ అడిగింది గీత ..కాదండి ..అని చెప్పి తల వంచుకున్నాడు కిరణ్

చూడండి ..అస్సలు మీ ప్రాబ్లమ్. నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి ..ఏమిటి ప్రేమ ఫెయులా.. పెళ్లి అయు .విడకులా ..మీ ఆవిడ మిమ్మల్ని వేధిస్తోందా .ఆస్తిగొడవలా.. మాట్లాడండి సార్ ..నాకు అలవాటే .మా నాన్నగారుఇలా గొప్ప గొప్ప వాళ్ళను తెచ్చి కౌన్సెలింగ్ కోసం నన్ను కూర్చోబెడతారు లేండి ..మీరు సహకరించకుండా ఉంటే నేను ఏం చేస్తాను చెప్పండి ..రీసెర్చిస్కాలర్ ..మీకు  ఏం. తక్కువ ..మనిషి బ్రహ్మ0డంగా వున్నారు. హీరో లా మరి ఎందుకు డిప్రెషన్ ..నేను చెప్పినట్లు చేస్తే అన్నీ పోతాయి ..లేకపోతే మా నాన్నగారు ఒక గుప్పెడు మందులు వ్రాస్తారు ఆనక ...మీ ఇష్టం ..గల గలా చెప్పేస్తుంది గీత ....అలా కొంచెం పెద్దగా మాట్లాడుతుంటే గీత తండ్రి  డాక్టర్ రమణ గబ గబా వచ్చేశారు....ఏమిటమ్మా అది....ఏమో డాడీ. నాకు రోజూ ఎవరో ఒకళ్ళను తెచ్చి కౌన్స్లింగ్.. చేసిపెట్టు అంటూ ఉంటారు ..అస్సలు ఇంతవరకు వచ్చిన వాళ్లలో  ఈయన గారు మొండి ఘటం . నేను ఏమి అడిగినా దీనంగా సమాధానం చెప్పడ0 ..కూర్చోవడం ..మీరు చూసుకోండి బాబు ..నా వల్ల కావడం లేదు ..అని గీత చెబుతుంటే ..కళ్ళు పెద్దవి చేస్తూ పెదవి విరిచి తల అడ్డంగా ఊపుతున్నాడు ..కిరణ్ ...సరే ..నమ్మా  రీసర్చ్ లో పడి అలా వున్నాడు ఏం చేద్దాము ..ఇంతకూ మనిషి ఎలా వున్నాడు ..కొంచెం నవ్వుతూ అడిగాడు డాక్టర్ రమణ ..మనిషి కేం చాలా అంద0గా వున్నాడు ....లోపలికి  నడవబోతూ సణిగింది  గీత ...నువ్వు ఇటురా ముందు ...అనిఆమె  చెవ్వు పట్టుకున్నాడు తండ్రి వేంకట రమణ ...అబ్బా నాన్న గారు ....కాదమ్మ ..ఆయన పేషంట్ అని నేను చెప్పానా?..అడిగాడు ..చిలిపిగా ..అబ్బా.... కాదా ?..కిలకిలా. నవ్వుతూ ..అలా బెల్లం కొట్టిన రాయు లా ఉంటే పేషంట్ అనుకుంటారు ..సిగ్గుపడుతూ చెప్పింది గీత ...ఏమి అనుకోకు బాబు ..మా అమ్మాయి ఒక రకమైన పాత సినిమాలలో గడుసరి జమున క్యారెక్టర్ ..అనుకో0డి .. జాలిగా అన్నాడు తండ్రి రమణ ..నిజమే సార్ ..మీ అమ్మాయి గారు ఉండటం కూడా అలానే వున్నారు ..కొంచెం నసిగాడు ఏమిట0డి ...కసిరింది గీత ...అదేనండి ఆ జమున గారి అందం ....గట్టిగా నొక్కి చెప్పాడు కిరణ్ ..నా తప్పు అయితే ఏమీ లేదు ....నేను మిమ్మల్ని ఎన్ని సార్లు పిలిచాను ..విసుగ్గా లోపలికి పోయింది గీత ..సార్ ..మీ గీత గారికి కోపం వచ్చినట్లుంది   ..సార్ ..కొంచెం అమయకం గా మొహం పెట్టి అడిగాడు ..కిరణ్

మా అమ్మాయి అంతే లే వయ్యా ..నువ్వు ఏం వర్రీ గాకు .....కూల్ గా చెప్పాడు తండ్రి రమణ .....ఇదిగో   బాబూ ఈ బుక్స్ నీకు పనికి వస్తాయి చదువు ..పరిశోధన లో వాడుకో తెలియకపోతే నన్ను అడుగు ..వివరించి చెబుతాను ..అని బుక్స్ .అవి పెట్టుకోటానికి ఒక సంచి కూడా ఇచ్చాడు ....అన్నీ సర్దుకొని లేచి బయలు దేరాడు కిరణ్ ..నా పై దయ తో ఇన్ని బుక్స్ వెతికి ఇచ్చారు ...మెనీ. మెనీ థాంక్స్ ....చేతులు జోడించి నమస్కారం చేశాడు కిరణ్ అప్పుడే ఎక్కడికి ..కూర్చో0డి ..డిన్నర్ చేద్దాం ...అడిగాడు రమణ ...నేను చాలా దూరం వెళ్ళాలి సార్ ..నవ్వుతూ అన్నాడు కిరణ్ ..బాబూ ..మీ అంకుల్ నీకు  భోజనం  పెట్టకుండా నిన్ను అయితే వదలరు ..ఎందుకంటే ..ఉదయం  పప్పు సాంబారు ..ఆయనే వండుకున్నారు ..నువ్వు కూడా టేస్ట్ చూసి చెప్పాలి ..అది ఆయన బాధ ..అదిగో మీరు వెళ్ళి అక్కడ సింక్ లో చేతులు కడుక్కొని రండి .అం టూ చిరునవ్వుతో   చెప్పింది గీత తల్లి సుజాత ..భోజనాలు చేస్తూ పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు ...కొంచెం ..కొంచెం సిగ్గుపడుతూ అటూ ఇటూ చూస్తోంది గీత ..కిరణ్ కి కూడా కొంచెము  కొత్త గా అనిపించడం వల్ల  మెల్ల మెల్లగా మాట్లాడుతూ వున్నాడు ..బాబూ రీసర్చ్ అంటూ ..కాలం గడిచిపోవటల్లా ..మరి పెళ్ళి గురించి  మీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా ..?.కొంచెం నవ్వుకుంటూ అడిగింది సుజాత ..మా వాళ్ళు కూడా వత్తిడి తెస్తున్నారు కానీ నాకు ఒక చెల్లెలు ఉంది  డిగ్రీ చదువుతుంది ..ముందు ఆమె పెళ్లి చెస్తే .కాస్తంత ఊరట అని నా అభిప్రాయం .తల కొంచెము గా ఎత్తి చెప్పాడు కిరణ్ ...దానిదేమి ఉంది బాబు ముందు నువ్వు చేసుకొని ..మీ ఇద్దరు కల్సి  మీ వాళ్లకు సహకరిస్తూ ..మీ చెల్లెలు కు మంచి సంభంధం చూసి చేయవచ్చు ....గీత తల్లి సుజాత అంటూ ఉంటే కొంచెం సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ వున్నాడు కిరణ్  .గీత కూడా  కిరణ్ ని మధ్య మధ్య పరిశీలిస్తూ ఉంది . ..మొత్తానికి భోజనాలు పూర్తి అయ్యాయి..

*                                     *                              *                                 *.

రాత్రివేళ వెన్నెల పుచ్చ పువ్వులా పచ్చగా ప్రకాశిస్తోంది ..చల్లని గాలి మెల మెల్లగా వేస్తోంది ..కిటికీ  తలుపు తీసి వెన్నెల ను చూస్తూ మౌనం గా కూర్చుండిపోయింది .

అయ్యో ..కిరణ్ ఏమి అనుకున్నారో ఏమో ..అంత సీన్ లేదులే ..కొంచెము మెతక వాడి లా వున్నాడు ...సహజంగా కొంచెము మాట్లాడటమ్ తక్కువ .  ఏమోలే మనిషి మాత్రం బాగున్నాడు ..మంచి క్రమ శిక్షణ .గా పెరిగినట్లు అనిపిస్తోంది.ఏమోలే ..కుటుంబం వదిలి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు గా ..కొంచెం జాగ్రత్తగా ఉండే వాళ్ళు వుంటారు ..నాన్నగారి కి అతగాడు  బాగా నచ్చినట్లు వున్నాడు  లేకుంటే భోజనానికి పిలవరే ..బలమైన భుజాలు ...కొంచెము పింక్  గా కనిపిస్తున్న పెదవులు   ఆపై చక్కని మీస కట్టు   .స్వచ్ఛమైన తెల్లని విశాలమైన లకన్నులు  .ఆచి తూచి మాట్లాడే పద్దతి  ,..అమ్మాయిల తో చక్కగా మాట్లాడటం  వెకిలితనం మాత్రం లేకపోవడం ..మొత్తానికి హీరో పర్సనాలిటీ ..గుడ్ గై ..అలా మనస్సులో   ..అతగాడి పై అంచనాలు వేస్తోంది ఆమె మనస్సు ..కొంచెము సిగ్గుపడుతూ  ముసి ముసి నవ్వులు నవ్వుతూ ..దుప్పటి కప్పుకుంటూ పిల్లో ని కౌగిలిలోకి ..తీసుకొని ముడుచుకొని నిద్రలోకి జారుకొంది గీత .

యావత్తు ప్రపంచం మొత్తాన్ని. తన గానమాధుర్యం తో నింపి ఓలలాడించిన ఒక భారత రత్నం బాలు

 గాన గంధర్వులు బాలు గారికి నివాళి


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

సుమారుగా 50 ,000 వరకు పాటలు ..14 భాషల్లో పాడి పెద్దహీరో లకు ప్రారంభించి ..వారి మనుమలు వరకు ..పాడటం ఇంత లాంగ్ కెరీర్ నభూతో నభవిష్యతి ..అని చెప్పాలి .50 సంవత్సరాలు గానామృతాన్ని. .ప్రవాహంగా అందరికి పంచడం ..దేశ విదేశాలలో వారికి  వీరాభిమానులు ఉండటం ..ఈ సమయంలో వారందరు బాలు కోసం కంట తడి పెట్టడం మామూలు విషయం ఏమీ కాదు ..నేను సెలిబ్రిటీ కాకపోయినా ..నాలాంటి సామాన్యుడికి కూడా పరిచయం కలగడం ..నాతో కూడా చక్కగా మాట్లాడటం జరిగింది ..డిగ్రీ కాగానే సినిమా డైరెక్టర్ కావాలని  హైదరాబాద్ వచ్చాను ..అనేకమంది సినిమా ఇండస్ట్రీ వారిని కలుస్తూ స్టూడియో లు తిరుగుతూఉండేవాడిని ..భుక్తి కోసం కొన్ని న్యూస్ పత్రికలలో జర్నలిస్ట్ గా చేరడం ..అలా అలా రేడియో కి చేరి నా వాయిస్ బాగుంటుంది అంటే కాంటాక్ట్ బేసిస్ లో ఎనౌన్సర్ చేస్తూ బైటకు వెళ్లి ప్రోగ్రామ్స్ చేసుకొని వచ్చేవాళ్ళం ..అప్పుడు కొన్ని కొన్ని సభా కార్యక్రమాలు ను రికార్డు చేసుకునే సమయము లో అనేక సార్లు బాలు గారిని కలవడం జరిగింది .  1994  లో  శుభసంకల్పం సినిమా  పంక్షన్ హైదరాబాద్ లో జరిగింది  .అప్పుడు ఎన్ టి ఆర్ గారు  లక్ష్మీపార్వతి .కమల్ హస్సన్ బాలు వీరి అందరూ  సభా కార్యక్రమ0 లోవున్నారు ఇంకా వేటూరి సుందర రామ్మూర్తి గారు సోమయాజులు గారు మా తండ్రి గారు పక్కనే కూర్చున్నారు ..సభా కార్యక్రమం కు ముందు రోజు నేను  .మా తండ్రిగారు గ్రాండ్ కాకతీయ హోటల్లో  అందరిని కలిశాము  కమలహాసన్.. కూడా అక్కడ వున్నారు  నాన్న గారి కమల్ హస్సన్ తో కొద్దిసేపు మాట్లాడారు ఆ తరువాత నాన్న గారి పాదాలకు నమస్కారం చేశారు కమల్..అప్పుడు మానాన్నగారి దగ్గర భద్రాచలం లడ్డూ ప్రసాదం  ఉంటే . అది ఇచ్చారు  .మా నాన్న గారి ని నామాలు ..కంఠ స్వరాన్ని ..అందాన్ని నవ్వుకుంటూ మీరు చాలా అందంగా వున్నారు ..మీరు కూడా మా ఫీల్డ్ లోకి ఎందుకు రాకూడదు ..అన్నారు నాన్న గారు కమల్ ని చాలాసేపు చిన్న పిల్లవాడ్ని పట్టుకున్నట్లు   ఒక పక్కగా హత్తుకొని మాట్లాడారు ..ఇక ఆ తరువాత శైలజ గారు సుధాకర్ గారు వాళ్ళ పిల్లలు చాలా చిన్న పిల్లలు అలా వారందరి తో గడిపి ..మరుసటి రోజు న  సభా ప్రాంగణం  చేరుకున్నాం ..అప్పుడు కూడా బాలు కొద్దిసేపు మాట్లాడారు ..2004తరువాత .ఒకసారి విజయలక్ష్మి గారు అనే ఒక గాయని  24 గంటలు గిన్నిస్ రికార్డ్  అప్పుడు బాలు గారు ..ఇతర గాయనీ మణులు అందరూ వచ్చారు సుశీల గారి నుంచి జిక్కి ఎల్ ఆర్ ఈశ్వరీ వరకు అందరూ వచ్చారు  .అప్పుడు మా మేనల్లుడు చిన్నపిల్లవాడు ..వాడిని తీసుకొని ఆ సభ కి వెళ్లడం జరిగింది   బాలు   మా మేనల్లుడిని ఎత్తుకున్నారు వాడికి ఒక పెన్ను కూడా ఇచ్చారు అలా   వారి తో మాట్లాడటం ..వారు నా చదువు పరిశోధన గురించి అడగటం ..అలా భేషజం లేకుండా పలకరించడం వారికే చెల్లింది ...రాగ సప్త స్వరం అనే ఒక సాంస్కృతిక సేవా సంస్థ వారు అనాథ ల ఆశ్రమం స్థాపన సందర్భంలో బాలు గారు వచ్చారు ..నేను అక్కడే వున్నాను ..కార్యక్రమం అయిన తరువాత పక్క భవనం నుంచిబైటకు రాగానే రాత్రి అవ్వడం వల్ల వారి చెప్పులు కనపడలేదు ..నేను భవనం ముందుకు వెళ్లి  వెతికితే ఒక్క చెప్పుల జత కనపడింది అవి పట్టుకొని ఆయన పాదా ల దగ్గర పెట్టి ఇవి మీవేనా చూసుకో0డి
అంటే ఇవి నావే అక్కడ విప్పి అటు వచ్చా కదా ..అయినా మీరు అలా ఎందుకు తెచ్చారు స్వామి నాకు చూపిస్తే నేను తెచ్చుకొనేవాడిని కదా అని నా భుజం పై ప్రేమ గా చేయు వేసి అన్నారు ..నిజంగా నా భాగ్యం అంత కళా కారుడి పాదరక్షలు మోయడం ....ఇలాంటి నాకు మధురస్మృతులు గా మిగిలి పోయాయి ..
ఏది ఏమైనా అంత మేరు పర్వతం ఎత్తుకి ఎదిగి అలా వినయం గా ఒదిగి ఉండటం ..సామాన్యుడిలా ప్రవర్ర్తి0చడం అందరివల్లా కాదు ..నేను ఎంతోమంది ప్రముఖులను కలిశాను మాట్లాడను కానీ ..ఇలా ప్రవర్తించిన వారు మాత్రం కొద్దిమందే వున్నారు ..అందులోఅత్యంత మహనీయుడు బాలుగారు
ఇక వారు కృష్ణుడు దగ్గరనుంచి క్రీస్తు వరకు ఎన్నో భక్తి గీతాలు ప్రయివేటు భక్తి గీతాలు ,స్తోత్రాలు పాడారు   వారు పాడిన .. లింగాష్టకం బాగా ప్రాచుర్యం పొందింది  .కాశీ విశ్వనాథ క్షేత్ర 0 లో .తెల్లవారు తూనే ఒక మేలుకొలుపు లాగా ఇప్పటికి ..ఎప్పటికి వారి మధుర కంఠ0 వినిపిస్తూనే ఉంటుంది  ..అంతే కాదు నటన లో కూడా కొన్ని సినిమాలలో అత్యంత ప్రతిభ చూపెట్టారు ..చాలా కళా ఖ0డాలు సినిమాలకు స0గీత దర్శకత్వం వహించారు ....బాలు ఇచ్చిన డబ్బింగ్ వల్లనూ ..ఆయన పాడిన మదు ర మైన  గీతాలు వల్ల కూడా కొంతమంది నటులకు అత్యంత మైన గొప్ప ఘన కీర్తి ..మంచి కెరీర్ వచ్చాయి అని ఘంటాపథంగా  గా చెప్పవచ్చు  . అస్సలు ఆ వయస్సు లో ఇటువంటి భయానకర. పరిస్థితుల్లో కాలు బైట పెట్టకుండా ఉండాలసింది ...కానీ ఒక  టీవీ చానల్ వారు   వాళ్ళ ఛానల్ నష్టాల్లో ఉంది అని ..రేటింగ్ లు పడిపోయాయి అని  ఆ ఛానల్ వారు గట్టిగా పిలిపించుకుంటే ..కాదనలేక ..ఈ లాకడౌన్ సమయం లో వచ్చి ..హైదరాబాద్ లో స్థూడియో లో సతీసమేతంగా ..వచ్చి వృత్తి కి న్యాయం చేసిన సందర్భములో ...కొంతమందికి .కరోనా బారిన పడటం ...దానిలో బాలు కుటుంబం కూడా ఉందని తెల్సి ...యావత్తు లోకం షాక్ ఆయ్యు0ది ..కోలుకుని వస్తాను అని ధైర్యం గా బాలు చెప్పారు కదా అని మళ్ళీ అభిమానలోకం అంతా గాలిపీల్చుకున్నారు  ..ఇంతలోనే బాలు మాయం .... ఆ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ..ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేశారు .  అస్సలు ఆయన స్వయంగా మంచి భక్తుడు ..మంచి మానసిక స్థయిర్యం ..డాక్టర్లు ఎందరో ఉండి కూడా ..బాలు మనందరి అభిమానం దాటి అంద కుండా ..అందని లోకాలకు వెళ్ళిపోయారు.  .కానీ ప్రతి జీవుడి కి భగవంతుడు కొంత ప్రోగ్రాం వ్రాసి ఓ క్యాసెట్ ఇస్త్తాడు ..జీవుడు చివరివరకు దానిలో వ్రాసిన ప్రోగ్రాం మాత్రమే చేయగలరు ..తరువాత క్యాసెట్ పూర్తి అయిపోయింది ..ఇక ఇంకేమి లేదే మో అని వేదాంతం చెప్పుకోవడమే ..మన బాధకు ..కాస్తంత రిలీఫ్ దొరుకుతు0దేమో అని భావిస్తూ .వారిని భగవంతుడు అక్కున చేర్చుకొని వారికి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్ధించుదాం.... కళా కారుడికి ..మరణం లేదు ఆయన   మధురమైన పాటలు ఆ చంద్ర తారార్కం.... No END FOR ANY ART🌺🌺🌺🌺🌺🌺🌺



Part....2 ........ నిరీక్షణ .......Nirikshna. .....shortstory. part......2...............

 



కాలింగ్ బెల్ శబ్దం...విని తలుపు తీసింది జానకి ..అక్కయ్య.. నేను కిరణ్ ....లోపలికి రా ...కూర్చో ..అంటూ సోఫా.దగ్గర నిలబడింది ..ఏమిటి విశేషాలు ....ఎక్కడినుంచి వస్తున్నావు ..అడిగింది జానకి ....బావగారు లేరా ?..ఈ రోజు ఆదివారం కదా ఇంట్లో ఎవరూ కనపడటం లేదు ?అటూ ఇటూ పరికించి చూశాడు కిరణ్

బాబూ ...సిటీ లో ఏవో పనులు పెట్టుకుతిరిగే వారికి ఆదివారం తో సంభంధం ఏముందిలే ...కొంచెం ..వయ్యారంగా కొంచెం వెటకారంగా మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయింది జానకి ...ఇదిగో టే తీసుకో ..కప్పుచేతికి ఇచ్చింది ...జానకి .అదేమిటి అక్కయ్య ప్రియ ...సుధ ఎవ్వరూ లేరా?...ప్రియ అని ఒక్క పేరు అడిగితే అనుమానం వస్తుంది అని సుధ ని కూడా కల్పి అడిగాడు కిరణ్ .టీ కప్పు అందుకొని ఆమె వెంట నడుస్తూ ...ఇద్దరూ పిచ్చాపాటీ ఏవో విషయాలు మాట్లాడుకొంటూ వున్నారు ..కిరణ్ కు వరుసకు అక్క ఏదో పీచు చుట్టరికం వల్ల అక్క అయుంది.. కానీ స్వంత అక్క కాదుకదా ...అందుకే ఆచి తూచి మాట్లాడుతూ ఉంటాడు కిరణ్ ..ప్రియ ..సుధ ల వెమ్మటి పడుతున్నాడా! ఒక కంట కాపు కాస్తూనే ఉంది జానకి

పైగా ..త్వరగా పెళ్ళి చేసుకో ..మీ అమ్మ నాన్నగారు పెద్దవాళ్ళు అయిపోతున్నారుగా ..వీలుంటే అస్సలు మన అమ్మాయిలతో రాఖీ లు కట్టిస్తే ఎలా ఉంటుంది ప్లాన్ లు వేసుకొని ఊహించేసుకుంటో0ది జానకి ..వీలు కుదిరనప్పుడల్లా నువ్వు చదువుకున్న అమ్మాయి ల కోసం ఆశ పడకు ..వాళ్ళు నీ పల్లెటూరు నీ కుటుంబ వాతావరణంలో వాళ్ళు ఇమడలేరు .....నీకు సుఖం ఉండదు  ..మీ వాళ్ళకు సుఖం ఉండదు ..గీతా బోధన చేస్తూ ఉంటుంది  .కిరణ్ మాత్రం ఎలా అయినా ప్రియ ను వలలో వేసుకోవాలని ప్లాన్లు వేస్తున్నాడు .అస్సలు ప్రియ ని ఒంటరి గా కలవాలి ..నా లోని విషయం అంతా చెప్పాలి ..ఇలా ఆలోచిస్తూ టీ కప్పు ..టీ పాయి మీద పెట్టాడు ...ఇంతలో అక్కా చెల్లెళ్ళు ..బయట నుంచి ఇంటికి చేరారు ..హాయ్ ..ప్రియా హాయ్ సుధా ..అని పలకరించాడు  చిరునవ్వుతో కిరణ్ ..హాలో.... అనిఒకరు హాయ్ అని ఒకరు నవ్వారు ..ఎలా ఉంది మీ హాస్టల్ ..మీ స్టడీ ..కుర్చీ దగ్గరకు లాగి కూర్చుంది సుధ ..సుధ మాట్లాడుతుంది కానీ నోరు మాట్లాడుతూ ఉంటుంది నొస్సలు తో వెక్కిరిస్తున్నట్లు గా ఉంటుంది ..అస్సలు ఇంట్లో..అందరికి అదే తత్త్వం.. వాళ్ళకే అన్నీ తెలుసు ..వాళ్ళే మేధావులు అలా అనుకుంటారు .ఇవతలి వారిని ...తక్కువ చేసి చూడటం వాళ్ళ ఇంట్లో అందరికీ ఉన్న జబ్బు ..అలా మనస్సులోనే గొణుక్కు0టూ ..నీకు తెలుసుగా కాలేజీల్లో, యునివర్సీ టీ ల్లో క్లాసులు ఎక్కడ జరుగుతాయి   ఎప్పుడూ ఏదో ఒక స్ట్రైక్ ..గోల మనమే ..చదువుకోవాలి తెలియక పోతే ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళడం లేకుంటే లైబ్రరీ లో బుక్స్ రిఫర్  చేసుకోవడం ....అంటూ ఒక నవ్వు నవ్వాడు కిరణ్ ..సరే కూర్చో టీ త్రాగుదాం లోపలికి వెళ్ళి0ది. సుధ....లోపలికి వెళ్ళిన ప్రియ మాత్రం ఎంతసేపు అయినా బైటకు రాలేదు ..ఒక్కసారి తాను ప్రేమించి కలలు కనే ప్రియ వస్తే చూసి పలకరించి వెళదామని ఎన్నో ఆశలు తో అక్కడి న్యూస్ పేపర్స్ తిరగేస్తూ !కూర్చున్నాడు కిరణ్.

*                     *                             *                                      *                        

ఆ..రోజుల్లో పోస్టులో లెటర్స్ ..ల్యాండ్ లైన్ ఫోన్లు ..అది కూడా చాలామంది పి.పి నంబర్స్ ఇస్తుండే వారు ..అంటే కొంచెం పిలవండి ..అని ఫోన్ దగ్గరకి పిలిచిమాట్లాడటం జరుగుతూవుండేది .అందులో అన్నయ్య వాళ్ళ హాస్టల్ కు ఫోన్ ఉండేది

ఎప్పుడూ ఫోన్ కి దొరికే వాడు కాదు ..లెటర్స్ వ్రాసి పోస్ట్ చేసే వాళ్ళం ..ఒకసారి నేను వ్రాసిన లెటర్ అందుకొని చదువుకున్నాడు .........అన్నయ్యా ..ఇక్కడ మన ఊళ్ళో పరిస్థితులు ఏమీ బాగోలేవు ..నాన్నగారి ఆరోగ్యం ఏమి బాగుండటం లేదు నువ్వు సినిమాలు ..అదీ ఇదీ అని అక్కడ కూర్చోవద్దు ఇక పనులు అవచేసుకొని.అన్నీ సర్దుకొని

ఇక్కడి కి వచ్చేయ గలవు ..నా మాట నైనా అర్థం చేకుంటావని తలుస్తూ..నీ కోసం ఎదురుచూస్తు0టాము ...ఇట్లు నీ చెల్లి .

లెటర్ ..చదివి ఆలోచనలో పడ్డాడు కిరణ్ ....రోజులు అలా గడిచిపోతున్నాయు .అన్నయ్య కోసం ఎదురు చూపులు కనీసం వ్రాసిన లెటర్ క

అయినా ఏదైనా జవాబు ఇస్తాడాని కొన్నిరోజులు ఎదురు చూసింది అరుణ .ఓ పక్క రీసెర్చ్ ..ఓపక్క సినిమా రంగం అలా తిరుగుతూ చాలా బిజీగావున్నాడుకిరణ్

మద్రాస్ లో  సినిమా రంగం పెద్దవాళ్ళు అంతా పరిచయం అవుతున్నారు ..అందరితో కలిసి తిరుగుతూ వున్నాడు దానికే తన కలలు తీరే రోజు దగ్గరలో ఉంది అని కలలు కంటున్నాడు ..కిరణ్ మధ్య ..మధ్యలో పండుగ సెలవులకు హైదరాబాద్ వచ్చి తన పరిశోధన కొంత పూర్తి చేసుకొని ..ప్రొఫెసర్ ని కల్సి వెళ్తూ వున్నాడు..కాలగమనంలో ..వరుసకు అక్క కూతురు సుధ కు అమెరికాపెళ్లికొడుకు తో పెళ్ళి ఖాయం అవుతుంది ..పెళ్ళి పత్రికలు కిరణ్ తండ్రి కాంతారావు కు అందుతాయి ..కాంతారావు ..అరుణ తో చెబుతాడు నువ్వు   ,అమ్మా కల్సి  పెళ్ళికి వెళ్ళి వస్తే బాగుంటుందమ్మా అన్నాడు  కాంతారావు

*                       *                              *                               *                         *

హైదరాబాద్ పెళ్ళి కి వచ్చిన తల్లి ..కూతుర్లు కిరణ్ కలుసుకున్నారు .పెళ్ళి వారిఇంట్లో తిరుగుతూ అన్ని విషయాలు చూస్తున్నారు . ...కిరణ్ మనస్సులో ప్రియ ఉంది అని తెలీయకపోయినా ప్రియ పైన పడింది ఆ తల్లీ కూతురు లమనస్సు ..కిరణ్ కి మంచి జోడీ ..అని ఇంకా సంబంధాలు ఎక్కడో వెతకడం ఎందుకు అన్నట్లు గా వారి అభిప్రాయం ప్రియ బుర్ర లో ఎక్కించే ప్రయత్నం చేశారు

వింటూ చిరాకు పడుతూన్న..ప్రియ ను ..ఏమో లేమ్మా వాడు కూడా చెబితే వినాలి కదా ....వాడి మనస్సులో ఏముందో లే ..మాట వరుసకు అన్నాములే ....అని ఒక నవ్వు నవ్వారు.. కిరణ్ తల్లి ,చెల్లెలు ..సుధ ..శ్రీకాంత్ ల పెళ్ళి అయిపోయింది నూతన జంట బ0ధువుల ను ,స్నేహితులను అందరిని పరిచయం చేసుకుంటున్నారు .పలకరింపులు ,విందుభోజనాలు అన్నీ పూర్తి అయి బైట పడ్డారు కిరణ్ కుటుంబం ..ఒకచోట ప్రశాంతంగా కూర్చొని అన్నివిషయాలు మాట్లాడుకుంటున్నారు.. ఏమిటేబాబు .....ఆ చిన్న అమ్మాయి ప్రియ ని మన కిరణ్ కి ఇస్తే ఈడు జోడు బాగుంటుంది అన్నానో లేదో ...ఆ అమ్మాయి రుస రుస లాడిపోతుంది  ఎందుకో ..కొంచెం సాగదీస్తూ అన్నది కిరణ్ తల్లి ..ఏమో అమ్మా ఆ అమ్మాయి మనస్సులో ఎవరైనా ఉన్నారేమో... లేక ఇంకా ఇతర ఆశయాలు కోరికలు ఏమైనా ఉండీ ఉంటాయి ..ఏమి చెప్పగలం ..అయినా అన్నయ్యకు ఇష్టం కూడా ఉండాలి ..అని చెల్లెలు అరుణ అంటూ ఉంటే ..ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా ..వ్రాసి పెట్టి ఉంటే ఎవరూ ఆపలేరు పెళ్ళి ..నవ్వుతూ చెప్పాడు కిరణ్ ..నాన్న గారు కూడా వస్తే అందరినీ చూసినట్లు వుండేదిగా ..అమ్మా ..అదేరా అన్నయ్యా నేను చెప్పేది ..నాన్న గారి కి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు ..నీకు ఉత్తరాలు లో పదే ..పదే రాస్తుండేది అదే ..నువ్వు యునివర్సీ టీ లో పనులు పూర్తి చేసుకొని వచ్చేయి అన్నయ్యా అని వ్రాస్తూనే వున్నాను ..కొంచెం బాధగా చెప్పుకుంటూ పోతుంది చెల్లెలు అరుణ .ఒకరోజు ఉండి యూనివర్సిటీ అంతా తిరిగి చూశారు ..ఇక వాళ్ళ స్వంత ఊరు కి బయలుదేరారు తల్లీ ..కూతురు

*                                         *                                *                                  *                                               *

                                                                        (  To be continued)...................................

Benfits of walking.......... నిత్యము నడక వలన ప్రయోజనాలు......

 






🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

_వాకింగ్ చేసినా, చేయకపోయినా ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి..

   _మీకు హిపోక్రాట్స్ తెలుసా? ఆయ‌న ఇప్ప‌టి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవ‌త్స‌రానికి చెందిన వాడు. అప్ప‌ట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయ‌న్ను "ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ " అని పిలుస్తారు. ఇంతకీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. స‌ద‌రు హిపోక్రాట్స్ అనే ఆయ‌న వాకింగ్ గురించి ఓ కొటేష‌న్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని ఆయ‌న అన్నారు. అవును, మీరు విన్న‌ది నిజమే. ఈ క్రమంలోనే ప్ర‌తి రోజూ క‌నీసం  30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!_

*_1. వాకింగ్_* రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

*_2. నిత్యం_* వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.

*_3. నిత్యం_* ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.

*_4. వాకింగ్_* చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

*_5. డ‌యాబెటిస్_* ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

*_6. నిత్యం_* క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.

*_7. నిత్యం_* 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.

*_8. నిత్యం_* వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

*_9. బ్యాక్ పెయిన్‌తో_* స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

*_10. నిత్యం_* వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి, క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది. 🐑🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

.



**&,**** నిరీక్షణ. ......shortstory*******†*******




ఆరు బయట మంచు బాగా పడుతోంది చల్లని వాతావరణం .లేలేత సూర్యకిరణాలు అప్పుడే ఉదయుస్తున్నాయు అరుణ.
కుమారి మాత్రం చాలా వేగంగా తులసి పూజలు ,ఇంకా ప్రదక్షిణలు పూర్తిచేసేస్తుంది.    ఆమె  .మనస్సు మాత్రం సెంట్రల్ యూనివర్శిటీ పైననే ఉంది  ...బైట పూజల హడావిడి ..ఆ వేగం చూసి కళ్ళు వత్తుకుంటూ బైటకు వచ్చింది మంజుల .అక్కా "ఏమిటి పొద్దున్నే ఇంత హడావుడి ..ఎప్పుడో పది గంటలకు యూనివర్సిటీలో సెమినార్ ..దానికి ఇంత హడావుడి అవసరమా ? కొంచెం నిద్రమత్తు గా విసుగు తో అరుస్తూ అంది మంజుల .ఒక్కసారి...మంజుల వైపు చూసింది.

నీకేం ఏమి తెలుసు డాక్టర్ శివనారాయణ.. ..ఆయన గురించి ఎంత కాలం నుంచి తపస్సు చేస్తున్నానో ఇంతకాలానికి  ఆయన ...దర్శనం అవుతొంది.. నీకు ఒక్క నిమిషంలో ఏమి చెప్పగలను ..అని మనస్సులో గొణుక్కు0టూ తన హడావిడిలో పడిపోయింది అరుణ కుమారి .అంతలోనే మనస్సులో ఆలోచనలు ..సుడితిరుగుతూనే ఉన్నాయి ...అప్పట్లో
శివనారాయణ ..ఓకే ..కానీ నేను అనుకొనే ..నా క్లాసుమీట్ శివనారాయణనేనా ? మంజుల తెచ్చిన ఇన్విటేషన్ పై అతగాడి ఫోటో లాగానే ఉంది ..అతగాడి కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో కి తీసుకుంటే పరిశోధన చేసే అంత శక్తి ,యుక్తి ...లేవు మరి ఏమో చెప్పలేము ..ఏదైనా బ్యాంక్ లోన్ లు అవీ ఇప్పించి ఎవరైనా సహాయం చేశారేమో ?పెళ్ళి అయి పోయి ఉంటుందా ? ఆ అత్తింటి వాళ్ళు చదివించారేమో ..అస్సలే అతగాడు మంచి మేధావి ,కష్ట పడటం సాధించడం అతగాడి నైజం ..నన్ను కృష్ణ కుమారి అని పిలిచేవాడు .నా పేరు మర్చి పోయినట్లు గా నటించి నవ్వేవాడు 
గట్టిగా నిలదీస్తే ..మీరు పొడుగాటిజడ ఆ పెద్ద కళ్ళు సినిమాలో ఆమె ఎలా మాట్లాడుతుందో అలానే మీరు మాట్లాడతారు 
మీ కట్టు .బొట్టు వేష ..భాష లను బట్టి అలా ఫిక్స్ చేసేశాను ..అని నవ్వేసేవాడు .పాత జ్ఞాపకాలు అలా చుట్టేస్తుంటే తనలో
తానే ముసి ముసి గా నవ్వేసుకుంటుంది అరుణ .అక్కా ..నేను రెడీ... మరి నువ్వు బయలు దేరుతున్నవా ..తన టూవీలర్ ఇంటి లోనించి  బైటకు తీస్తూ ఓ కేక వేసింది మ0జుల .ఆ..నేను ఎప్పుడో రెడీ అయి వున్నాను .........
*                                         *                                     *                                 *
మంచి చలి కాలం అవ్వడం వల్ల ..క్యా0పస్ అంతా చెట్లుతో నిండి  అడవి లా ఉండటం వల్ల ఎండ పెద్దగా కనిపించడం లేదు .రక రకాల ..చెట్లు ...పూల మొక్కలు ..పక్షులు అన్నీ చూసుకుంటూ మెల్ల.. మెల్లగా సెమినార్ జరిగే ఆడిటోరియం కు 
చేరుకుంటున్నారు .అప్పుడే వివిధ రకాల కాలేజీలు నుంచి విద్యార్థులు పరిశోధనా శాస్త్రవేత్తలు అక్కడే పనిచేస్తున్న ప్రొపెసర్లు.. మీడియా ప్రతినిధులు ..అప్పుడు.. అప్పుడప్పుడే వస్తున్నారు ..ఒక ప్రక్క ?గోడలు నిండాఇదివరలో ఎప్పుడో వ్రాసిన  సంస్కృతశ్లోకాలు .దాని అర్థం. ఒకటిఅయుతే...ఇంకోరకమ్ అర్థం వ్రాసి కావాలనే విమర్స చేస్తున్నట్లుగా ...   అనిపిస్తోంది ...ఇవ్వన్నీ విద్యార్ధి సంఘాలు వ్రాసినవి అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటుంది .అక్కడ ఉంచిన సెమినార్ కరపత్రాలు, వాల్ పోస్టర్లు ..అన్ని చూస్తూ డాక్టర్ శివనారాయణ ..ఆరోజుల్లో శివ నారాయణ ఒకటేనా ..నేను అనుకోని  ఊహించుకొనే. శివ నారాయణ ఒకటేనా సరిపోల్చి చూస్తూ ఆలోచల్లో పడిపోతుంది అరుణ ...ఇంతలో అందరూ వేగంగా హడావిడి పడుతూ ఓ బృందం లోపలికి వస్తు న్నారు ..ఓ ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ అమ్మాయిలు ..అబ్బాయిలు ముందుగా లోపలికి వచ్చారు ..ఆ తరువాత ఓ ఫారిన్ ఆవిడ ..చీర కట్టుకొని బొట్టు ,నగలు పెట్టుకుని ...ఆ డాక్టర్ శివనారాయణ తో ఇంగ్లీష్ లో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ..నవ్వుతూ జోక్స్ వేస్తూ వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు ..అక్కా  చూడు .ఆ స్పెడ్స్ ..లావు అద్దాలు పెట్టుకున్నా రే ..ఆయనే శివనారాయణ ..గుస గుస గా చెవిలో చెప్పింది మంజుల .అటూ ఇటూ తొంగి ..తొంగి వంగిపోయు మరీ పరీక్ష గా చూస్తోంది అరుణ... ఇంతలో స్టేజ్ పైన ఉన్న ఇంకో ప్రొఫెసర్ ..మైక్ తీసుకొని అనౌన్స్ మెంట్ మొదలుపెట్టి ఒక్కొక్క రిని సభాస్థలి పైకి ఆహ్వానిస్తూన్నారు ..ఇక ఈ నాటి ముఖ్య అతిధి ...అమెరికా లో గొప్ప పేరు పొందిన బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త  డాక్టర్ శివనారాయణ  గారు మన తెలుగువారవ్వడం మనందరికీ గర్వకారణం ..ఎక్కడో ఒక మారు మూల గ్రామంలో ఆర్థికస్తోమత పెద్దగా లేని ఓ దేవాలయ పూజారిగారి కుటుంబం లో పుట్టి అహోరాత్రులు కష్టపడిచదువుకొని స్వయం కృషితో స్వయం ప్రతిభ తో అమెరికా దాకా మన తెలుగువారి కీర్తిని ఇనుమడింపచేసిన ..ఈ మహానుభావుడు మన0దంరికి...ఇప్పుడొచ్చే కొత్త కొత్త ఔత్సాహిక పరిశోధకులు అందరికి ఎంతో ఆదర్శం .అటువంటి ..డాక్టర్ శివనారాయణ గారిని వేదిక పైకి సవినయం గా ఆహ్వానిస్తున్నాము ..అనే మాటలు వింటున్న అరుణకుమారి కి కొంత అర్థమైంది ..ఆ. శివనారాయణ..నేను  అనుకున్న  శివనారాయణ నే ..కొంచెం ఆమె మనస్సులో ఆనందం ప్రారంభం   అయ్యింది ..ఇంతలో తన బ్లేజర్.. సర్దుకొని కళ్ళ జోడు సరిచేసుకొని వడి వడీగా సభ పైకి వచ్చి కూర్చొ0టు న్నాడు ..అలా కళ్ళు ఆర్పకుండా అటువైపే చూస్తూ పరిశీలిస్తూఉంది అరుణ ..ఆమె పక్కనే వచ్చి కూర్చుంది ఆ విదేశివనిత ..ఆమె ఎవరు పక్కన కూర్చుంది ..బహుశా యూ.యస్ లో పెళ్ళి చేసేసుకొని ఉంటాడు ...కొంచెం బాధగా కళ్ళ లో నీటిని ఎవరికీ కనిపించకుండా కర్చీఫ్ తో నొక్కి పట్టింది .అరుణ .ఒకరిద్దరు లేచి ప్రసంగం పూర్తి చేశారు ..ఇక శివనారాయణ  ప్రసంగం మొదలుపెట్టాడు ..ముందుగా వాళ్ళ. తల్లిదండ్రులు కు గురువులకు ..తాను ఎలా కష్ట పడి చదువుకున్నది ..వాళ్ళ ఊరు దేవాలయ దేవుడిని స్తుతించి ప్రారంభం చేశాడు శివనారాయణ ..ముందుగా నేను విషయం లోకి వెళ్లేముందు ..నన్ను చిన్న తనం లొనే అంటే డిగ్రీ చదివేటప్పుడు ..నన్ను ఒక దేవత ..ఒక స్త్రీ మూర్తి పరిశోధన చేయాలి ..ఆ దిశ గా మనం కల్సి నడుద్దాం అంటూ నాకు ఆ ఆలోచన కు ప్రాణ ప్రతిష్ట చేసిన నా మనస్సులోని ఆ దేవత కు అంజలి ఘటిస్తున్నాను ..పేరు చెప్పవచ్చో చెప్పకూడదో ...ఆమె ను కల్సి అనుమతి తీసుకొని తరువాత మీకు చెబుతాను.. అని అత గాడు చెబుతుంటే పెల్లుఉబికివస్తువున్న...దు:ఖ్ఖ0  ఆబట్టుకోలేక కర్చీఫ్ తో ముఖం అడ్డుగా పెట్టుకొని తలవంచుకొని కూర్చు0డిపోయింది అరుణ ..తను స్టేజి పైన కూర్చొని ఉన్నప్పుడే  ఎదురుగా రెండవ వరుస లో కూర్చొని మంచి వెలుతురులో కనిపిస్తూన్న ఆ ముఖాన్ని బాగా పరికించి చూశాడు ..ఆమె తన ఒకప్పటి నేస్త0 కు దగ్గరి పోలిక లా ఊహించాడు ..కానీ ఆమే అని గట్టి నిర్ధారణ కు రాలేక పోయాడు .శివనారాయణ ......ఇక తన ప్రసంగం ప్రారంభిస్తూ  పారాసేటమాల్ ..పేరు వినే ఉంటారు ..అది జ్వరాలకు లోపల వచ్చే ఇన్ఫెక్షన్స్ కి వాడే మందు ఇంకా టెట్రాసైక్లిన్ ..ఇంకా కొన్ని విటమిన్స్ లోపాలు ...భోధకాలు కి మందు కనిపెడుతూ మధ్య లో నే చనిపోయారు జ్వరాని కి ఇప్పటికి వాడే మందు పారా సెట్మాల్ ఇప్పటికి అనేక పేర్లు మార్చిన దానిలో ఉండే డ్రగ్ అదే   అలా  అనేక మందులు కనుక్కున్న ఏలూరు దగ్గరి భీమవరం వాసి డాక్టర్ ఎల్లాప్రెగడసుబ్బారావు గారు ఎలా బీదరికం లోనుంచి వచ్చి ఎలా సాధించాడో చాలా మంది తెలుగు వారికి తెలియదు అస్సలు ఆ ఊరు ..జిల్లా వాళ్ళకే తెలియదు ...లెజెండ్ ఆఫ్ మెడిసిన్ అనే....బిరుదు లండన్ వారు ఆయనకు ఇచ్చారు ..ఇప్పటికి ఆయన బర్త్ డే ని లండన్ లోవిశేషం గా గౌరవంగా జరుపుకుంటారు పెళ్ళి చేసుకుని ఆకట్నం  డబ్బు .తీసుకొని లండన్ కి ఓడ ఎక్కాడు .భార్య తో మళ్ళీ వస్తా అను చెప్పిన వాడు ఇక మళ్ళీ తిరిగి రాలేదు భార్యను పెళ్ళి లొనే కల్సి0ది ..ఇక ఆ తరువాత మందు కనుక్కోవాలనే పిచ్చి తోనే ఇంటిని భార్యను మర్చిపోయి పరిశోధన లో మునిగిపోయాడు ...అక్కడే కన్నుమూశాడు సుబ్బారావు గారు ..భార్య ఎంత త్యాగం చేసింది ...ఆయన ఎంతగా జీవితాన్ని అంకితం చేసాడో కదా ...మరి మన దగ్గర చాలా మందికి ఆయన పేరు ఊరు తెలీయదు .కారణం సినిమా. వారికి ,క్రికెట్ వారికి ఇచ్చే గౌరవం లో కొద్దిగా కూడా వాళ్ళకు ఇవ్వక పోవడమే .అని ఇక తన పరిశోధన ఆర్.ఎన్. ఏ.... డీ.ఎన్.. ఏ లు కెమిస్ట్రీ ఎదో అలా ప్రసంగం చేస్తూ మధ్య మధ్యలో పవర్ పాయు0ట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు శివనారాయణ.రీసెర్చ్అనేది ఏదైనా రానున్న తరాలకు మేలు జరిగేలా ఉండాలి.బీటీ వ్యుత్పత్తులు అంటూ ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకముగా విభిన్న మొక్కల పువ్వులు కలిపి కొత్త హైబిరీడ్ అంటూ జీవజాతులు ,మొక్కలు పుట్టించి ప్రపంచంలో కి వదిలితే బాల్యంలో నే ముక్కుపచ్చలారని పసిపిల్లల్లో ఎన్ని రోగాలు చూస్తూన్నాం? అలానే జంతువుల డి ఎన్ ఏ లను బైటకు తీసి పిచ్చి పిచ్చి పరిశోధనలు చేస్తే వచ్చే అంటు రోగాల మహమ్మారికి బలి అయి పోయేది సామాన్యప్రజలే ..బయోవేపన్స్ అంటూ పిచ్చి ప్రయోగాలు ఏమిటి ..అస్సలు వీళ్లకు బుద్ది ఏ మాత్రం లేదా ?భగవత్ శక్తి ని అధికమిం చ గలమా అని కొత్త పరిశోధనల వింత పోకడలను ..ప్రభుత్త్వాలను ఘాటుగా విమర్శిస్తూ ప్రసంగం చేస్తూన్నాడు ప్రొఫెసర్ శివనారాయణ .ఇక ఏదైనా చేయాలి ,కనిపెట్టాలి అని యూనివర్సిటీ లలో పడి పిచ్చివాళ్ళ0 లాగా పరిశోధన చేసి బైటకు వస్తే పొట్ట పోషించుకోడమే పెద్ద కష్టం గా మారిపోయింది. ఈ లోపు కాలేజీలో పార్ట్ టైం అంటూ చేరిన వారిని పర్మినెంట్ చేసేస్తున్నారు ..ఆ విషయం ముందే తెల్సి ఉంటే మేము కూడా పీజీ కాగానే కాలేజీలోనే స్థిర పడిపోయే వాళ్ళం కదా !అంటే నేను వాళ్లకు అవకాశం ఇవ్వద్దు అనడం లేదు అందరికి ఇంటర్వ్యూ లుపెట్టండి ..వాళ్లకు కాస్తంత గ్రేస్ మార్కులు ఇవ్వండి ..నేను డాక్టరేట్ పట్టా పుచ్చుకొని ..పొట్టపట్టుకొని ఆకలితో ఎక్కడెక్కడో తిరిగాను .తల్లితండ్రులు కు ముఖం చూపించలేక ..వాళ్ళ వృద్దాప్యం లో పైసా సహాయం  చేయలేక పోయాను .చివరికి అన్నిచోట్లా తిరిగి వ్యుద్యోగం సంపా దించలేక ..మా బంధు జనం నన్ను అవహేళన చేస్తుంటే బిక్క చచ్చి ఉండేవాడిని..అప్పుడు ఒక ప్రైవేట్ కాన్వెంట్ వారు నన్ను గౌరవించి నా చదువు ని గౌరవించి ప్రిన్సిపాల్ వ్యుద్యోగం ఇచ్చారు ..అక్కడ కొంతకాలం పనిచేసిన తరువాత ఆ మేనేజ్ మెంట్ వారు ఇప్పించిన ఆర్ధిక సాయం తో ఒక పెలోషిప్ కి ఇంటర్వ్యూ చేసి ఫారెన్ ట్రిప్ కు ఎంపిక అయ్యాను .అలా బయలు దేరి వెళ్లి పోయాను .నేను ఈ మాత్రం పైకి వచ్చి నాలుగు పైసలు సంపాదించే సరికి నా తల్లిదండ్రులు లేకుండా పోయారు ..పీహెచ్డీ చేసిన మా లాంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వారి గురించి ఏం చెప్పగలం ఇక బోధన వృత్తి అదే టీచింగ్ లోకి పోయి బ్రతుకు దామంటే ఒక్క టీచర్ కే యాభై వేల రూపాయలనుంచి లక్ష రూపాయల దాకా జీతం ..ఏం అదే లక్ష రూపాయలు తో మాలాంటి వాళ్ళం నలుగురు కి భోజన0 వెళ్ళిపోతుంది జీతం పాతికవేలు ఇస్తే ....చాలు ఆ పరిస్థితి ల్లో అదే గొప్పగా సేవ చేస్తాం కదా ..ఇక యూనివర్సీటీ ల్లో ప్రొఫెసర్ వుద్యోగాలు అంటే ఈ దేశంలో చాలా కష్టం ..కులం మతం ప్రాంతీయ విభేదాలు తో కొట్టుకు చస్తుంటాం ..మా లాంటి వాళ్లకు అవి కల లోకి కూడా రావు మా కులం వాళ్ళు మమ్మల్ని పైకి రానివ్వరు ...ఇంకోపక్క రిజర్వేషన్లు ఉండనే ఉన్నాయు రెండువైపులా మాకు నష్టాలే. ...ఇంకో నష్టం మెరిట్  లో కూడా రిజెర్వేషన్ కులాల వారు వచ్చేసి ఓపెన్ కోటాలో మా వ్యుద్యోగాలు లాక్కెళ్ళి పోతున్నారు ..నా అనుభవం తో  చెప్పేది ఏమిటంటే వ్యక్తి లో వుండే ధర్మ0 ఆ ఆలోచన బట్టి ప్రతిభ బ్రతుకుతుంది ...నేను కొంతకాలం బ్యాంకు లో అటెండర్ వ్యుద్యోగం చేశా ను ..అలానే రేడియో లో నా కంఠ0 చాలా బాగుంటుంది అంటే అక్కడ అనౌన్స్ ర్ గా పార్ట్ టైం వ్యుద్యోగ0 చేశా ..అప్పుడు పర్మినెంట్ వ్యుద్యోగాలు పడుతూఉంటే ఎప్పుడూ అప్లై చేసి ఇంటర్వ్యూ కూడా బాగా చేసే వాడ్ని ..కానీ ఫైనల్లో ఒక కీచు కంఠం వాళ్లకు రేడియో లోవ్యుద్యోగం ఇప్పిస్తూ ఉండేవాడు ఆ స్టేషన్ డైరక్టర్ ..ఆయన మా కులం వాడే పోనీలే.  లే నివాళ్లకు  ఇస్తూవున్నాడు కదా అనుకునేవాడిని ..అలా ఎన్ని సార్లు సరిపెట్టుకోను  కోర్టుకి వెళ్ళాను ..భారత దేశంలో కోర్టు ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా ..  తీర్పు వస్తుంది మావాడికి వ్యుద్యోగం వస్తుంది అని ఎదురుచూసి చూసి ..మా తల్లిదండ్రులు చనిపోయారు ...కేసు తేలలేదు ..ఎప్పుడైనా ఆ జడ్జి మమ్మల్ని పిలుస్తారు ..మా కంఠ0 ..లో పదాలు వినిపించి ఎవరి కంఠం బాగుందో మీరే తేల్చి ఎవరు కి వ్యుద్యోగం ఇచ్చారో చూడండి అని చెబుదామని చాలా కాలం ఎదురుచూశా0 ..మమ్మల్ని ఎవరిని పిలవకుండానే ప్రభుత్త్వం కి  వీలుగానే కోర్టు తీర్పు ఇచ్చివేసింది .. అలా0టి పరిస్థితుల్లో రిజర్వేషన్స్   ఉండాలి అని కూడా అనిపించింది ...అవే లేక పోతే మా స్టేషన్ డైరెక్టర్ లాగా వాళ్ళ వాళ్లనే నింపుతూ ఉంటాడు ..కాకపోతే మా ఓపెన్ కోట లో మావి మాకు ఉంచాలి ...అలా చెప్పుకుంటూ ప్రసంగం పూర్తి చేశాడు శివనారాయణ.. .కొంతమంది ముఖ్యులు ఔషధాలు.. పారముల్లాస్ ..కల్తీలు వలన ప్రజాలుపడే ఇబ్బందులు ...సేంద్రీయ వ్యవసాయం ప్రపంచానికి లాభం ఇలాంటి అంశాలు పై  కొంతమంది ప్రొపెసర్లు వాళ్ళ ..వాళ్ళ పరిశోధనా పత్రాలు చదువుతూవున్నారు ..శివ నారాయణ కొన్ని వింటూ నోట్ చేసుకుంటున్నాడు ..అంతా పూర్తి అయిపోయింది ఇంతలో పెద్ద రాయల్ కుర్చీ తెచ్చి వేశారు ఇక్కడకు కేంద్ర మంత్రి వర్యులు విచ్చేసారు వారికి స్వాగతం అంటూ ప్రకటనలు వినిపిస్తూవున్నాయి ..కొంతమంది శాలువలు ...పూలదండలు తో హడావిడి గా అటు ఇటు పరుగులు పెడుతూవున్నారు ....కొద్ది సేపు హడావిడి గా గడిచింది ..ఇప్పడుమన దేశంగర్వించే శాస్త్రవేత్త శివనారాయణ గారికి సన్మాన కార్యక్రమం ...అంటూ ప్రకటన చేశారు ...మైకు తీసుకొని....కొంచం పెద్దగా చెప్పాడు  రాఘవ ఎక్కడున్నా స్టేజి పైకి రావాలి ...అని చెప్పాడు శివనారాయణ .....ల్యాబ్అసిస్టెంట్ రాఘవ విని ...నన్నెనా ..పిలిచేది ఇంకా ఎవరైనా ఉన్నారా? ....అటు.. ఇటూ చూస్తూ న్నాడు ..రాఘవ ల్యాబ్ లో వ్యుద్యోగి ..అని మళ్ళీ పిలిచాడు శివనారాయణ ...పరుగున వెళ్ళి స్టేజి దగ్గర నిలబడ్డాడు ..రాఘ వ ..నాకు చిన్ననాటి నుంచి స్నేహితుడు ...ముందు వాడికి సన్మానం చేస్తాను తరువాత మీ ఇష్టం అంటూ శాలువ తో నిలబడ్డాడు .రాఘవ ...తనకు సన్మానం కాగానే మైకు లో ప్రస0 గ0 మొదలు పెట్టాడు ....నేను శివ గాడు ఇద్దరం చిన్నప్పటినుండి ఒకే సైకిల్ పై తిరిగే వాళ్ళం మా నాయన చిన్నప్పుడే చనిపోతే గుడిలో అయ్యగారు..శివ వాళ్ళ నాన్నగారు  నన్ను తెచ్చి పెంచారు .నాకు అక్షరాభ్యాసం చేసి నాలుగు ముక్కలు చదివించారు..వారు చాలా ..బీదవారు వెనుకాల ఆస్తిపాస్తు లు ఏమీ లేవు ...గుడి ఆదాయం సరిపోయేది కాదు ..పంటలు పండక గుడికి రావాల్సిన ధాన్యం వచ్చేది కాదు ఎన్నోసార్లు  ..ఉన్న గంజి పంచుకొని రోజులువెళ్లతీసాం... వీడు బాగా చదివేవాడు .ఆడు రాసుకున్న నోటుపుస్తకాలే నా చేత బలవంతంగా చదివించే వాడు ..నేను ఈ మాత్రం ఉన్నానంటే వాడి దయే . ఆ అమ్మగారు అయ్యగారు జీవించి  ఉంటే .. శివ ని చూసి పొంగిపోయే వాళ్ళే ... కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ గద్గద స్వరం తో చెపుతున్నాడు .వీడు నాకు దూరం అయిపోయాడు ..ఏ పని చేసిన నా పిల్లల్ని కుటుంబాన్ని పోషి0 చుకోలేక చాలా కష్టాలు పడ్డాను...శివ గాడికి అడ్రస్ వెతికి పట్టుకొని ఉత్తరం వ్రాశాను ..ఒకరోజు ఇక్కడ ఉద్యోగం ఉంది వచ్చి చేరమని లెటర్ వచ్చింది ...ఇక్కడ సెటిలయ్యాను .తరువాత తెల్సింది వాడుచేసిన కృషి వల్ల నాకు  ఈ వ్యుద్యోగం వచ్చింది అని ..వాడు లాంటోళ్లు ఎక్కడ ఉన్నా బాగుండాలి కళ్ళ నీళ్ళు తుడుచుకుని ..శివనారాయణ ని హత్తుకున్నాడు రాఘవ  ..ఆ తరువాత ..ఎంతో అట్టహాసంగాశివనారాయణ కు సన్మానం పూర్తి అయుంది .మంత్రి గారి ప్రసంగ0 పూర్తి అయుంది ...శివనారాయణ గారు ఎప్పుడు ఏ పని చేపట్టినా దానికి నిధులు ఇప్పించి సహాయం గా ఉంటానని ప్రతిజ్ఞ లా చెప్పాడు మంత్రిగారు ..సభా కార్యక్రమం పూర్తి అయుంది ..అందరూ స్టేజి దిగి బైటకు వస్తున్నారు ....శివనారాయణ గ్రూప్ వారంతా కారు లో వెళ్లిపోయారు ..మెల్లగా  నడుచుకుంటూ బైటకు వచ్చారు అరుణ ..మంజుల ..అక్కా ..ఇక్కడ భోజనాలు కూడా  ఏర్పాటు చేశారు తినేసి వెళదాం ..చెప్పింది మంజుల .ఏమో నే బాబు నాకు ఆకలి గా లేదు నువ్వు వెళ్ళే సి రా ..నేను ఇక్కడ లైబ్రరీ లో ఉంటాను చెప్పింది అరుణ ..ఒక ఐస్క్రీమ్ తెచ్చి ఇచ్చిభోజనానికి వెళ్ళి పోయింది మంజుల ....ఇక మళ్ళీ ఆలోచన ల్లో పడిపోయింది అరుణ ...నేను కూడా వెళ్ళి శివనారాయణ ముందు కనపడితే పలకరించేవాడేమో ....ఒక స్త్రీ ..తనకు. పరిశోధన చేయాలనే ఆలోచనకు  బీజం వేసింది అనీ ఆ సంకల్పం ఆమెదే అని చెప్పాడుగా...  నేనే అయ్యింటానా ? ఏమో ఎక్కడెక్కడో ..చదువుకోసం తిరిగాడు కదా !పైగా ప్రక్కనే ఎవరో విదేశీ అమ్మాయి ఉంది కూడా  పెళ్ళి కూడా చేసేసుకొని ఉంటాడు...ఏమోలే ..ఎక్కడున్నా సుఖఃము  గా ఉంటే చాలు ..అవును రాఘవ ఇక్కడే ఉంటున్నాడా ?అది నాకు తెలియదు రాఘవ ను కలుసుకొని మాట్లాడితే అన్ని విషయాలు  తెలుస్తాయి గా ..ఏమోలే తెల్సి ఏం చేస్తాం ....అలాఅరుణ  మనస్సు ఊగిసలాట లో పడి ఆలోచనలతో నిండిపోయింది ....అక్కా ..బయలు దేరదామా ..అని మంజుల పిలుపుతో ఈ లోకం లో కి వచ్చింది అరుణ ..క్యాంపస్ నుంచీ బైటకు వస్తున్నారు .
అవును మంజూ ....రాఘవ కూడా ఇక్కడే పనిచేస్తాడు అట గా కొంచం ఉత్సాహంగా అడిగింది అరుణ .ఏది ల్యాబ్ అసిస్టెంట్ గారా! అవును ....ఆయనే.... వారు ఇక్కడ కెమిస్ట్రీ లాబ్ లో పనిచేస్తారు ..శివనారాయణ గారి చిన్నప్పటి ప్రెండ్ అట గా ..అందుకే ఆయనకు సన్మానం చేశారు ..అలా మాట్లాడుతూ హాస్టల్ కు చేరుకున్నారు అక్కా చెల్లెళ్ళు ...పిచ్చాపాటి మాటల్లో పడిపోయారు ..అక్కా సరే నీకు ఈ సబ్జక్టులు అంటే ఇష్టం ..అందుకే నువ్వు బయోటెక్నాలజీ చదివావు ..ఓకే కానీ శివనారాయణ గురించి చెప్పితే చాలు నువ్వు షేక్ అయిపోతావు ...అస్సలు కన్నీళ్ళు పెట్టేసుకుంటావు ....శివ నారాయణ మన ఏరియా వాళ్ళు అని తెలుసు కానీ నీ పై అంత ప్రభావం ....కారణం ఏమిటో తెలియడం లేదు?చెప్పాలనుకుంటే చెప్పు ..లేకపోతే వద్దు ..అక్కా ..అడిగింది మంజుల ...బలేదానివి ..నువ్వు మా పిన్ని కూతురువి ..పైగా మీ అమ్మ నాన్నగారి ది పూర్తిగా కోస్తా జిల్లా ..నీకు మా గురించి పెద్దగా తెలియదు ..నేను శివనారాయణ ఇద్దరం క్లాస్ మేట్స్0 ..నా స్కూలు చదువు  మనఊరు బీరపల్లి లో పూర్తిఅయిపోయు0ది..పక్కనే సత్యంపల్లి  లో ఇంటర్ లో జాయిన్ అయ్యాను ..క్లాస్ లు కి మాత్రం ఎప్పుడూ డుమ్మా కొట్టేదానిని కాదు .మాకు కొంచెం కష్టమయున క్లాస్ కెమిస్ట్రీ ..ఆర్గానిక్ కెమిస్ట్రీ మా క్లాస్ కి వచ్చిన ప్రతీ సార్ పాఠం చెప్పడం పూర్తి అయిపోయిన తరువాత లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళను ఎక్కువగా ప్రశ్నలు వేసేవారు ..వాళ్ళలో ఎవ్వరూ సరిగ్గా చెప్పలేక పోయినా ..ఒక వ్యక్తి ని మాత్రం వదలకుండా లేపి చెప్పు నీకు ఏమి అర్థం అయ్యింది... లేచి ఒక సారి అందరికి చెప్పు అని ఒక స్థూడెంట్ ని లేపి చెప్పించేవారు .    లెక్చరర్ ఎలా చెప్పేవారో ..టేప్ రికార్డర్ ..రికార్డ్ చేసినట్లు గా మొత్తం లెస్ న్ మళ్ళీ ఎక్సప్లైన్ చేసి చెప్పేవాడు ..ఆయన ఎప్పుడూ చివరి బెంచ్ లో కూర్చొని  లేచి వెళ్ళిపోతుండేవాడు .అతగాడిని చూస్తేనే నాకు కంపరం ఎత్తేది ఇంత లావు గ్లాస్ అద్దాలు . కొంచెము బక్కపలుచగా ఉండేవాడు కొంచెము వెల్సిపోయిన బట్టలు ..క్రాఫ్ లో కన పడకుండా ఉన్న చిన్న పిలక పొడుగాటి బొట్టు.ఎత్తయిన మనిషి ,ఎప్పుడూ ముఖము లో చిరునవ్వు .అది నాకు   కొంచెం కోపం తెప్పించేది  ..ఎందుకంటే నాకు ..జెలసీ అదిగో ...అలా అతగాడే శివనారాయణ ..అక్కడ చుట్టుపక్కల దేవాలయాలు మా తాతలు కట్టించినవే ఎక్కువ గా ఉండేవి మా నాన్నగారూ  ,పెద్దనాన్నలు ..బాబాయులు ,మామయ్య లు ఇలా తలా ఒకటి పంచుకొని ..ఆ ఖర్చులు అవన్నీవాళ్ళు చూసుకునే వాళ్ళు ...ఆ సందర్భంలో ఒకసారి శివనారాయణ ..వాళ్ళ నాన్న గారితో అంటే వాళ్ళ ఊరి గుడి లో ప్రధాన అర్చక స్వామి .న మాట ..ఇద్దరు కల్సి మా ఇంటికి వచ్చారు .దేవాలయ ఉత్సవాలు గురించి ..చాలాసేపు మాట్లాడుకున్నారు ..చిన్న స్వామి ..మా అమ్మాయిగారు ..మీరు ఒకటే క్లాస్ కదా ఎలా చదువుతున్నారు ? అని మా నాన్నగారు  కాంతారావు అడిగారు ...అప్పుడు శివ నారాయణ  నవ్వి ...మీ అమ్మాయి గారు క్లాసులోలెస్సన్  బాగా వింటారు ..మా కంటే శ్రద్ద బాగా పెడతారు ...అని చెబుతుంటే నాకే నవ్వు వచ్చింది ...ఇంతలో మా కాలేజీ కి రెండు రోజులు సెలవు వచ్చాయి... దేవాలయ పనుల కోసం మా ఇంటికి వస్తూ పోతూ వున్నాడు శివనారాయణ. ..ఒకరోజు మా ఇంటి ముందు నోట్స్ రాస్తూ కూర్చొని వున్నాను ...మా నాన్నగారి కోసం ..వెయిటింగ్ ..నాకు దగ్గర లో నిలబడి ..అమ్మాయి గారు మీ హాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది ..నాది కోళ్లు కెళికినట్లు గా ఉంటుంది ..చిన్నగా నవ్వుతూ అన్నాడు .శివనారాయణ .నేను తల ఎత్తి ..అవునులేండి ..సార్ మేధావుల చేతి వ్రాత అలానే ఉంటుంది ...కొంచెము వెటకారం గా అన్నాను .ఒక నవ్వు నవ్వి వదిలేశాడు ..అస్సలు కోపం ఏ మాత్రం రాలేదు ..శివనారాయణ కు ..పైగా మేడం నాకు ఒక డౌట్ ఉంది ..అని మొదలు పెట్టాడు ...ఏం సార్ క్లాస్ ఫస్ట్ వాళ్లకు..ఏమి డౌట్స్ ఉంటాయి...పెదవి విరిచి వెక్కిరించాను అప్పుడు ఆయన ... .మీరు కూడా క్లాస్ మొత్తం లో రెండో రాంక్ లో వున్నారు ..మీరు చెబుతారు అనుకున్నాను ..ఇక ప్రతీ దానికి మీరు నన్ను వెక్కిరించి మాట్లాడుతూ ఉంటే ..ఎలా మేడం ..కొంచెము ముఖం ముడిచాడు శివనారాయణ .ఏమో సార్ ..నన్ను పరీక్షించుతున్నారేమో అనుకోవచ్చు గా ..మెల్లగా అన్నాను ..ఆ రోజుల్లో మనిషికి  ..మనిషి కాస్తంత దూరంగా ఉండి మాట్లాడుకొనేవాళ్ళం ..ఆడ... మగ ..అయితే ఒకళ్ళు తో ఒకళ్ళు ..మాట్లాడుకోవాలంటే ..చెమటలు పట్టేసేవి ...ఈ రోజుల్లో అయితే చాలా మార్పులు శర వేగంగా వచ్చేశాయ్అనుకో .కాలేజీల్లో..అమ్మాయిలు ..అబ్బాయిలు .కల్సి ఒకే కప్పు టీ ..అందరూ కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ రౌవుండ్ తిప్పుతూ ..ఎంగిలి కూడా లెక్కలేదు అనుకో ..అలానే ఈ రోజుల్లో అమ్మాయి అమ్మాయిని ...అబ్బాయి ..అబ్బాయిని ..లవ్ చేస్తున్న రోజులు ఇవి ...కొన్ని దేశాలు అయితే ఇంకాస్త ముందుకు పోయి  అటువంటి సంభంధాలు  ను చట్టబద్ధం చేస్తున్నాయి ....సరే ఇవి అన్నీ ఈ కలియుగ 0లోని లక్షణాలు ..మనలాంటి వాళ్ళం దానిపై కూడా ఏమీ మాట్లాడలేము ..ఓ .కె ..అయితే ..శివ నారాయణ ..అప్పుడు మా ఇంట్లో నన్ను నిజంగానే ...తనకు వచ్చిన డౌట్ నన్ను అడిగాడు అనిపించింది...నేను మొదలు పెట్టి మొత్తం వివరించి చెప్పాను ..నిజంగా మేడమ్ మీరు చెప్పినది ..నాకు పూర్తిగా అర్థం అయుంది ..ఇదివరలో దీనినే మొత్తం చుట్టూ.. తిప్పి చెబుతూఉండేవాడిని .ఇప్పుడు మీరు చెప్పినది డైరెక్ట్ గా ఇది నా ముక్కు అనేట్లుగా సింపుల్ గా చెప్పారు ..థాంక్స్ మేడం ..నాకు కూడ ఏదైనా డౌట్ వస్తే చెప్పేవాళ్లు మంచి ఫ్రెండ్ ఉన్నారని ..నేను భావిస్తున్నాను అని నవ్వుతూ నమస్కారం చేయగానే ...చిన్న స్వామి లోపలికి వచ్చి ఈ ..సామాను సర్ది తీసుకెళ్లండి బాబు అనికేక వేశాడు కాంతారావు ...అయ్య గారు ..వస్తున్నానండీ ..లోపలికి పరుగు తీశాడు శివనారాయణ .ఇచ్చిన పూజా సామాగ్రి అంతా సర్దుకొని సైకిల్ పై పెట్టుకొని నా వైపు చూసి కళ్ళతో వెళ్లివస్తా ను ..బై అని చెప్పినట్లు అనిపించింది 
నాన్నగారు అక్కడే వున్నారు కాబట్టి నేను ఒక చిరునవ్వు ఇచ్చాను ..అలా శివ నారాయణ నాకు పరిచయం అవడం ప్రారంభం అయుంది ..ఇకప్రతిరోజు కాలేజీ లో మెట్లపైనా....కాలేజీ గ్రౌండ్ లో గార్డెన్ లోను ..మా క్లాస్ అమ్మాయిలు అందరం కూర్చొని మాట్లాడుకోవడం ,సైన్స్ రికార్డ్స్ వ్రాసుకొంటూ ఉండేవాళ్ళం ..డౌట్స్ ఉంటే శివా ఇటురా బాబు కొంచెం ఇదిచెప్పూ.. అది చెప్పూ అని ఫిజిక్స్ లోని ప్రాబ్లమ్స్ ..మొత్తం చెప్పించుకొని ..అవసరం కాగానే అతగాడి వెళ్లిపోగానే   ఆతని పై  జోకులు వేసేవాళ్ళు .. క్రమేణా నాకు ఆ విధానం నచ్చలేదు .మా ఊరి అమ్మాయిలు కొద్ది మందే ఉండేవాళ్ళం ...మేము అందరం మాట్లాడుకుంటూ ..శివ నారాయణ మాతో మాట్లాడుతూ అలా నడుచుకుంటూ మా ఊరు వచ్చేసే వాళ్ళం .అతగాడు నిత్యపూజలు ,అష్టోత్రాలు, గోత్రాలు పూజలు కోసం ఆ డబ్బులు వసూళ్ళు కు తిరుగుతూ ఉండేవాడు .మా తో వచ్చినా  ..ఒక్కరు ,ఇద్దరు వున్నా కూడా చాలా డీసెంట్ గా మాట్లాడేవాడు ...అలా అలా పరీక్షలు ...పరిచయాలు కాలేజీలో సభలు అలా అలా సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి .నేను ..కొంతమంది మా ఫ్రెండ్స్ అమ్మాయిలు ..శివనారాయణ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి పోయాము .డిగ్రీ కాలేజీ ..ఇంకాస్త దూరం నాకు డిగ్రీ చదవాలని ఎంతో ఉత్సాహ పడ్డాను ..ముందు ఇంట్లో ని ఆడపిల్ల బైటకు వెళ్ళి చదవడం ..పెద్దవాళ్ళకు ఎవరికి ఇష్టం లేదు .ఆ రోజులలో అంతే ..చిట్ట  చివరకు నాన్నగారు ..నేను ముభావం గా ఇంట్లో కూర్చోవడం ,హుషారు గా లేకపోవడం గమనించి ...నన్ను చదివించాలని నిర్ణయం తీసుకున్నారు.ఇంట్లో బాబాయి,పిన్ని అమ్మమ్మ అందరి తో వాడులాడి ఒప్పించారు .శివ నారాయణ ను పిలిపించి ఆ కాలేజీ గురించి కొన్ని విషయాలు రాబట్టారు .మాదగ్గర నుంచి కొద్దిదూరం నడిచి బస్ ఎక్కి వెళ్ళిరావాలి
*                                             *                                  *                           *    
ఓ బాబూ శివ నారాయణ ..ఏమిటి అంత స్పీడ్ గా నడుస్తావు .నువ్వు అంటే బక్కగా వున్నావు ,గాలిలో అయినా ఎగురుకుంటూవెళ్ళుతూ ఉంటా వు ..మాకు భగవంతుడు అటువంటి శరీరం ఇవ్వలేదు కదా ,మాది కొంచెము ఒబాసిటీ గట్టిగా అరుస్తోంది అరుణ .ఏంటి  మేడమ్  ...నన్ను ఏదో అన్నారు...చెప్పండి ..కొంచం కోపంగా అడిగాడు శివ .నేను
అన్నది అర్థం కాలేదా? ..కొంగ లా మేము వేగంగా ఎగురుకుంటూ వెళ్ళ లేము అన్నాను ...నాకు అర్థం అయ్యింది పాపా ..రేపు నా దారి నేను చూసుకుంటాను ...నీతో మాత్రం రాను అమ్మాయి గారు.... .కొంచెం కోపంగా ఫేస్ పెట్టి చెప్పేశాడు శివనారాయణ ...సరే అదే మాట పై ఉండండి ..వెళ్ళగానే నాన్న గారితో ఇదే విషయం చెబుతాను ..అమ్మాయి గారు ..మీ ఇల్లు వచ్చింది ..నేను వెళ్ళి సైకిల్ తెచ్చుకుంటాను మీరు లోపలికి వెళ్ళండి శివ నారాయణ చెబుతూ ఉండగానే ..మరి రేపటి నుంచి నువ్వు  రావు కదా ఎలా ?అమాయకంగా ముఖం పెట్టి కళ్ళు పెద్దవిచేసి కొంచెం బాధ నటిస్తున్నట్లు. గా అడిగింది అరుణ ...అబ్బా ..తల్లీ నీకో నమస్కారం కృష్ణకుమారి.సారి అరుణ కుమారి   దయచేసి లోపలికి వెళ్లండి ....నేను రాకుండా ఎక్కడికిపోతాను ..మీ నాన్న గారు వింటే నా పని ...అంటూ న్నంతలో .రండి చిన్న స్వామి లోపలికి వచ్చి కూర్చోండీ ..కాస్త టీ తీసుకొని వెళ్ళండి ..పర్వాలేదు అయ్యగారు నేను రేపు వస్తానుగా అంటూ కంగారుగా సైకిల్ పై వెళ్ళిపో యాడు .శివనారాయణ ..తనలో తాను ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి పోయింది అరుణ కుమారి ..............
కాలం వేగంగా గడిచి పోతుంది ....రెండు సంవత్సరాలు గా అనా వృష్టి తో పంటలు లేవు ..అరుణ కుమారి కుటుంబం కూడా అందరి లా ...సమస్యల తో కాలం ఈడుస్తున్నారు ..పై నుంచి  వస్తూన్న జమిందారి పద్ధతులు ,పోషణ అంతా బీటలు వారుతున్నాయి.వాళ్ళ పరిధి లోని దేవాలయాలు నడపడం, మరమ్మత్తులు కూడా కష్టం అవుతూ వున్నాయు ...వాళ్ళ పై ఆధారపడ్డ పనివాళ్ళ ను పోషించడం చాలా కష్ట తరం అవుతూ ఉన్నాయి .ఇక గ్రాడ్యుయేషన్ రెండవ సంవత్సరం పూర్తి అయి కాలేజీ సెలవలు అవ్వడం వల్ల ఇంట్లోనే గ.డుపుతున్నారు అరుణ, శివనారాయణ లు ..ఒక్కసారిగా మబ్బులు పట్టి పెద్ద వర్షం ప్రారంభం అయ్యింది.... పనివాళ్ళు... తో కుటుంబం వాళ్ళు చాలా సీరియస్ గా సమాలోచనలు చేస్తూ ఆందోళన పడిపోతున్నారు ...ఎలా అయ్య గారు ..కాస్తంత బోర్ క్రింద పండించాము కదా వరి ..చేతికి వస్తూన్న టైం లో ..మొత్తం పాడైపోతుంది ..ఏమి చేయాలో పాలుపోవడం లేదు అని మాట్లాడుకుంటున్నారు ..అరుణ మాత్రం ఇంటి వెనుక తోట లో కి చూస్తూ నిలబడిపోయి0ది .పిచ్చుకలు ,గోరింకలు తడుస్తూ లోపలికి ,బైటకు తిరుగుతూ ఉన్నాయి.కాకుల జంట కదిలిపోతున్న వాటి గూడును... చిన్న పుల్లలు అటూ ఇటూ సర్దుతూ గూడును,...గోడును దిద్దుకొనే ప్రయత్నం లో ఉన్నాయి .అరుణ మనస్సు లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి .శివనారాయణ చాలా తెలివి గలవాడు ..మంచి మనసున్న వాడు ..మంచి మేధావి ..ఇద్దరం పై చదువులకు వెళ్ళాలి ..ఇక ఇష్టం తో కస్టపడి పరిశోధన చేయాలి ..మా ఇంట్లో వాళ్ళు నన్ను చదువు కోనిస్తారా ? ఏమో చూద్దాము అస్సలు శివనారాయణ మనస్సులో ఏముందో తెలుసుకుంటాను నిండా ఆలోచనలో మునిగిపోయిన అరుణ కు పిలుపు ....తడిసిపోయున బట్టలు లోపల ఆరవేయు0చు ..ఆ  పనిఅమ్మాయి సీతమ్మ తో ...అలానే .ఆ మడిబట్టలు మూల పెట్టు రేపు ఉదయం నేను మళ్ళీ ఎండేసుకుంటాను .అని తల్లి వాసంతి ..చేప్పగానే ఆ పనిలోకి వెళ్ళిపోయింది అరుణ .
*                             *                          *                                     *                   *
శివనారాయణ ఇంట్లో కూడా ..ఎన్నో మార్పులు వస్తున్నాయి . శివనారాయణ కుటుంబం చాలా పెద్దది .వాళ్ళ నాయనమ్మ గారు ..తండ్రి గారు ఆడపిల్లలు   కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి ..ప్రతి రోజు ప్రతి సారి జమీందారు లు ఎంత అని ఇస్తారు .వాళ్ళ వలన .ఎంతో కొంత పచ్చడి మెతుకులు లు  తో జీవితం గడిచిపోతూనే ఉంది. ఇంకా అడిగితే ఏం బాగుంటుంది! ..పైగా రెండు సంవత్సరాలు నుంచి పంటలు లేవు !వర్షాలు లేవు కరువు కాటకాలు ..శివ నారాయణ చదువు కూడా కొంచెం భారం గానే నడుస్తోంది... పట్టణంలో లో ఏదైనా జాబ్ లో పెడితే కాస్తంత వాడు బాగుపడతాడేమో దేవాలయం అరుగులపైన కూర్చొని ...ఆలోచనల్లో పడిపోయా డు శివనారాయణ  తండ్రి శేషాచలం ..తాత గారి దగ్గర నేర్చుకున్న ఆయుర్వేదం.. తో వాడి జే బు ఖర్చులు ...ఎలానో వెళ్ళ దీసుకుంటున్నాడు ..ఇంచుమించు గా ఒక సంవత్సరం పడుతుంది వాడి చదువు అంతా అయిపోయి సర్టిఫికెట్ చేతికి వచ్చేసరికి ....ఆలోచల్లో ఒక అయిడియా తట్టింది ..కొంచెం ఆనంద పడుతూ ....దేవాలయం మెట్లు కడుగుతూవున్న భార్య ఆండాళ్ తో .అబ్బాయి ..ని ఒకసారి పిలువు ..అంటూ ఆర్డర్ వేశాడు ..భావి దగ్గరనుంచీ నీళ్ళు చేరవేస్తూ బిందె అక్కడ పెట్టి నాన్నగారూ చెప్పండి ....అంటూ వచ్చాడు .కొద్దిసేపు  అన్నివిషయాలు మాట్లాడుకుని ఏమి లేదురా! నువ్వు చదివి ఉద్యోగం చెయాలి ..ఆ..వ్యుద్యోగాలు మనకు వస్తాయని అస్సలు గ్యారంటీ లేదు ..పైగా మనవి పెద్దకులాలట ...ఇంకా కష్టం ..పైగా ఇతర కులాల వారందరు కోచింగ్ లు తీసుకొని ఓపెన్ కోటా లో కూడా ఇతరులు వచ్చేస్తున్నారు ....కాబట్టి నేను కోచింగ్ లకు పట్టణాలు పంపించి డబ్బులు కట్టలేను ...కొత్తగా లంకపల్లి లో గవర్నమెంట్ బ్యాంకు వస్తోంది అట దానిలో..ఆఫీస్ బోయ్ కి ఒక దరకాస్తు వ్రాసి ఇవ్వు ..పది చదివితే చాలు. అంటున్నారు ..ఏమంటావు ?...ముఖం అంతా సంతోషం పులుముకొని అడిగాడు .తండ్రి శేషాచలం ...ఓ. కె.. నాన్నగారు మీరు ఎలా అంటే అలా? తలఊపేశాడు శివనారాయణ..
*                             *                               *                               *                *
అరుణకుమారి ఊళ్ళో....... ఊరి మర్రిచెట్టుక్రింద కూర్చొని ఏదో ఒక ఊరి సమస్య పై కొట్లాట పెట్టుకోవడం ...దానిలోకి రాజకీయాలు చొప్పించి ...పార్టీలు గా విడిపోయి కొట్టేసుకుంటు న్నారు .ఈ మ ధ్య కాస్తంత ఆరోగ్యం బాగోలేక ఆమె తండ్రి ఏ దీ పెద్దగా పట్టించుకోవడం లేదు ..జీడిమామిడి తోటలు మాత్రం బాగా నే కాపు వచ్చింది... బాబాయులు మాత్రం పంట కోతలు ..అన్ని విషయాలు వాళ్ళే చూసుకుంటున్నారు ..వాళ్ళతో కల్సి కాస్తంత రీలాక్సేషన్ కోసం తోటల దగ్గరకి వెళ్ళుతుంది ...కానీ వాళ్ళ ప్రవర్తన లో అసూయాద్వేషాలు కనిపిస్తూన్నట్లు గుర్తించింది అరుణ ...కారణాలు కోసం రోజూ వాళ్ళను అనుసరిస్తూ తిరుగుతొంది.... వాళ్ళ .ల్లో..ఈమె రావడం ..మధ్య మధ్య ఇంటికి వచ్చి వెళ్ళే ఆమె నేస్తం శివనారాయణ రావడం వాళ్ళ ఎవరికి నచ్చడం లేదు ...శివనారాయణ.... అరుణ ల స్నేహం పై బురద జల్లుతూ వాళ్ళ ఇంటి అందరిలో శివనారాయణ చెడ్డవాడు అనే అభిప్రాయం ..తెప్పించే ప్రయత్నం లో వున్నారు .....ఈ రోజు స్నేహం అంటారు ...రేపటి రోజు ముదిరి ప్రేమ అంటారు ...ఇలా కుటుంబం మొత్తం లో అందరిలోనూ అక్కరలేని ప్రచారం చేస్తున్నారు .ఒకరోజు ....అరుణకుమారి ఇంట్లోనే ఉండిపోయింది ...వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం చూసుకుంటూ మందులూ అవి ఇస్తూ ఆయన ప్రక్కన కూర్చొని ...తన క్లాసు పుస్తకాలు చదువుకుంటూ ఉంది ....ఎమ్మా!...ఏమిటి తల్లి శివనారాయణ ..పై ఇంత గా చెబుతూ తెగ బాధ పడిపోతూవున్నారు ?..కొంచెము మెల్లగా అడిగాడు అరుణ తండ్రి కాంతారావు ..మీకు తెలుసుగా నాన్నగారు ...మన వాళ్ళ0దరిలోను ఏదో అసూయాద్వేషాలు వచ్చాయి ...నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.... ఎందుకు అయి ఉంటుంది నాన్నగారు.. కొంచెం బాధ గా అడిగింది అరుణ ...ఈ రోజుతెచ్చి ఏమిటమ్మా !..ఎప్పటినుంచో ..వాళ్ళకు అవి ఉన్నాయి ...కాకపోతే మీరు చిన్న పిల్లలు కదా !మీలో ఇవి నాటడం ఎందుకు అని నేను ఎప్పుడూ అనలేదమ్మా!...కానీ ..ఇక ఇప్పుడు పరిస్థితులు ముదురుతున్నాయు ...అందుకే నేను హెచ్చరించాల్సి వస్తోంది ...తల్లీ ..జాగ్రత్త... కొంచెము గట్టిగా నొక్కి చెప్పారు కాంతారావు ....ఎందుకు నాన్న గారు స్వంత వాళ్ళ లోనే ఇంత ఈర్ష్య ?....కారణాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా ..ప్రతిసారి ఊరివాళ్లందరు నన్నే సర్పంచ్ గా పోటీ చేయమంటారు ...చేసి గెలుస్తూనే ఉంటాను ...ఈ ఊరి జనాలకు నేను అంటే ప్రాణసమానం ..ఒకటమ్మా.... ఇక్కడ వాడిది ...వీడిది ..లాగేసి పోగేయాలని నాకు ఎప్పుడూ లేదు ....కానీ మన వాళ్ళలోనే ..ఈ పిచ్చ ఎక్కువైంది ...ఎవడు బాధ లో వున్నా వాడి అవసరానికి  అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గరనుంచి ..తక్కువ ధరకు కొనేయడం ...వాడికి డబ్బులు పూర్తిగా ముట్టచెప్పక పోవడం ..అలానే కొన్ని బంజరు భూములు కలిపేసుకోవడం ..మనవాళ్లు ఇతరుల చెడ్డవాళ్ళతో చేరి
ఊరిలో అందరిని బాధపెట్టడం ...నేను సర్పంచ్ గా ఎదిరించడం ఇలా జరుగుతూవస్తోంది తల్లి ...అందుకే నేను ఇస్సారి ఇక పోటీ చేయను తల్లీ ...కొంచం బాధగా చెప్పుకుంటూ పోతున్నాడుతండ్రి  కాంతారావు..ఒక అన్నగారు .సంఘసేవ .నాన్న గారు ..ఆ రోజుల్లో  స్వాతంత్ర్య పోరాటంలో దేశసేవ ..కోసం చాలా. భాగం ఆస్తులు కరిగించి ఇచ్చేశారు ...ఇంకొంత భాగం ..రంగస్థలం.... నాటకాలు ..హరికథలు ..గుళ్ళుగోపురాలు ..ఉత్సవాలు అంటూ కొంత అయిపోయింది ...మిగతా. కొద్ది భాగం ..ఇంటిఅవసరాలకు అయిపోయింది... పూర్వం రోజుల్లో జమీందారు అంటే ..పొలం.... గొడ్లు..గోదా ఉండేవి కానీ ..ఒక వంద రూపాయలు ..కూడా క్యాష్ ..ఉండేది కాదు ..అదే ఇప్పుడు .చూడు...స్కూలుపిల్లల దగ్గర ఏకంగా వందరూపాయలు నోటు ఉంటుంది .....ఆ రోజుల్లో ఏం కొనాలన్నా వడ్లు లేక బియ్యంఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడం ...ఇక పెద్ద.... పెద్ద వి ఏవైనా అవసరాలు వస్తే ఏకంగాకొంత పొలం ఇచ్చేసి ..అవసరాలుతీర్చుకునేవారు .అలా... అలా భూమి చాలా అయిపోయింది.. ఇంకొన్నిచోట్ల ..ఇతర కులాల వారు వీరి భూమిలో జండాలు పాతి ..ఆక్రమించుకున్నారు ...ఇంకా మిగిలిన భూమి సేద్యం చేయాలంటే ..రైతుకూలీలు వారి పనులు..శ్రద్ధ.. లలో చాలా తేడాలు వచ్చేశాయి ....వాళ్ళలో కూడా రాజకీయపార్టీలు జొరబడ్డాయి . ..ఆ సమస్య తో పాటు కరువులు కాటకాలు ..వ్యవసాయం చేయలేక కౌలుకు ఇచ్చుకొని పట్టణాలకు వ్యుద్యోగాలకు వలస పోయిన వారు కొంతమంది .ఏది ఏమైనా వ్యవసాయ రంగం చాలా కష్టం గా ఉందమ్మా ..ఖర్చులు పోనూ ఏమీ మిగలడం లేదు ..పైగా విత్తనాలు ..ఎరువులు అన్నీ కల్తీలే .....పైగా పంట ఎక్కువ పడినప్పుడు వర్షాలు పడి కొట్టుకుపోవడం ..లేకపోతే వర్షాలు లేక కరువు కాటకాలు ..ఇలా తాను చూసిన అనుభవాలు చెప్పుకుంటూ పోతున్నాడు అరుణ తండ్రి కాంతారావు.అమ్మా ఇక నాకు పేరుకి కొడుకే కానీ వాడు ఇక్కడకు వస్తాడని కానీ ..మన కుటుంబం చూసుకుంటాడని నాకు అయితే నమ్మకం లేదమ్మా .సినిమా పిచ్చ లో పడి జీవితాన్ని పా డుచేసుకుంటున్నాడమ్మా..హైదరాబాద్,.తిరుగుతూఉంటాడు ..ఇంటికి.      మాత్రం రాడు ...చూడు మ్మా ఏదో లెటర్అంటున్నాడు  పోస్టుమ్యాన్  ...తండ్రి కాంతారావు చెప్పగానే ..గబ గబా వెళ్ళి అందుకొని వచ్చింది అరుణ ..అన్నయ్య వ్రాశాడు ..కళ్ళు పెద్దవి చేస్తూ ఆనందం గా తండ్రికి ఇచ్చింది అరుణ ..ఇక్కడ కూర్చొని చదువు తల్లీ ..మంచం..పైన కూర్చొని చదివి వినిపించింది ..కిరణ్అన్నయ్య య మ్మెస్సీ ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాడట.... ఇక రీసెర్చ్ లో జాయిన్ అవుతాడట ...కాక పోతే తాను ఒక సినిమా డైరెక్షన్ కోర్సు చేయాలని ఉంది అట అందుకే పూణే వెళ్లి అక్కడ జాయిన్ అవుతాడట ...కొంచెం డబ్బు అవసరం ఉంది పంపమని రాస్తున్నాడు ..అంతే నమ్మా డబ్బులు అప్పుడు మనం గుర్తు వస్తావమ్మ... మనకెందుకు తల్లీ సినిమాల గోల .మేము పెద్దవాళ్ళం అయ్యాము కదా ..ఇంటి సంగతి కాస్తంత పట్టించుకోవచ్చు కదమ్మా ....కాదు నాన్నగారు చదువుకుంటూ ఏదో ప్రయత్నం చేస్తూన్నాడే కానీ చదువు డుమ్మా కొట్టలేదుగా ..కొంచెం నవ్వు చిందిస్తూ చెప్పింది అరుణ ....ఏమిటి సినిమా పిచ్చ ...సరే లేమ్మా ..మీ అమ్మ కిచెన్ లోనో ...ఎక్కడో ఉంటుంది చూసి అబ్బాయి గారు లెటర్ అని ఇచ్చి రా తల్లి ...పంపిచేశాడు తండ్రి కాంతారావు
.*                                           *                                   *                              *
ప్రియా నువ్వు ఇక్కడ ....ఏం రాకూడడా? యూనివర్సిటీలో పనులు అందరికీ ఉంటాయు ..మా సీనియర్ వనజ  ను కలవడానికి వచ్చాను ..పని అయిపోయింది .బయలుదేరుతున్నాను ..చిరునవ్వుతో చెప్పింది ప్రియ ..కనీసం మా వైపు వచ్చావు కదా టీ త్రాగుదాం .. ఎలా వచ్చావు సైకిల్ పైనా ? కొద్దిగా నవ్వుతూ అడిగాడు కిరణ్ ..వాట్ ..ఇంతదూరం సైకిల్ పైనా నావల్ల కాదు బాబు ....పోనీలే ..మా ప్రెండ్ ది బైక్ ఉంది తెస్తాను ...కొంచెం ముందుకి కదిలాడు కిరణ్ పర్వాలేదు నేను బయలు దేరుతాను ....అరే ఒక్క నిమిషం ...అంటూ .అక్కడ టూ వీలర్ తీసి ..ప్రియ ను ఎక్కించుకున్నా డు ..కొద్దిగా ముందుకి వెళ్ళి క్యాంటిన్ లో టీ సిప్ చేస్తున్నారు .మధ్య  మధ్య .ప్రియ వైపే చూస్తున్నాడు కిరణ్ .ఆమె బాబ్లీ హెయిర్ ను మొత్తం గా క్లిప్ పెట్టుకుంటుంది ..ఆమె పెదవులు తేనె పూసినట్లు మెరుస్తున్నాయి .ఆమె మెడ ..వక్షస్థల0 ..వెన్నెల అరబోసినట్లు పచ్చగా మెరుస్తుంది ...చేతులు ఎత్తి .హెయిర్ క్లిప్ పెట్టుకుంటుంటే ఆమె బహుమూలాలు ..అతగాడినికవ్వి
స్తున్నాయు ...విశాలమైన కళ్ళు చిన్న కాటుక రేఖ ..మనస్సులో ఎక్కడో ఆమె పై చిన్ని చిన్ని ఆశ ..ఏమిటి చూస్తున్నావు ..
మీ హాస్టల్ ఎక్కడ ఏమీ చూపించవా ....?తెల్లని మల్లెలు ని విసిరి రెచ్చగొట్టినట్లు అనిపించే ఆ పలు వరుస ....తేనె అందుకోవా అనిపించే ఆ మెరుస్తున్న పెదవులు ...తో చిరునవ్వు విసిరింది ...ప్రియ ..వై నాట్ ...రా ఇక్కడే ..అంటూ రూమ్ అక్కడనుంచి వాళ్ళ దగ్గరలోని పార్క్ అందమైన పూలమొక్కలు అన్నీ చూపించాడు ...సాయంత్రం వేళ ..ఇద్దరు ఒక చెట్టు మొదట్లో దగ్గరగా అనుకోని కబుర్లు చెప్పుకుంటున్నారు ...ప్రియా ..నేనంటే నీకు ఇష్టమేనా ..కొంచెం మెల్లగా అడిగాడు కిరణ్ ..బలే వాడివి కిరణ్ ..నేను ఎంత చెప్పినా నీకు వయస్సులో అన్నింటిలో సరిపోయే అందమైన అమ్మాయిని ..పైగా మేనకోడలను ....నువ్వు బాగా చదు వుకుంటున్నవాడివి ...అండగాడివి ..నిన్ను కాక ఎవర్ని ఇష్టపడతాను ఒకర్ని ఒకరు
అల్లుకుంటున్నారు ....ఆమె మేను నిండా ముద్దులు పెడుతున్నాడు ....చేతులు ఎత్తి బాహుమూలంలోకి ముద్దుపెట్టబోయా డు .. ..ఆమె స్తనద్వయం అతని మనస్సులో గుచ్చుకుపోయింది ...ఆమెను కౌగిలిలోకి లాక్కొంటున్నాడు....ఆమె బాహుమూలాల నుంచి సహజం గా వస్తున్న వాసనలు అతగాడ్ని మత్తులోకి గమ్మత్తుగా లాగేస్తున్నాయు  ...మెడపై ఉన్న జిప్పు ను తప్పించాలని .మన్మ్ ధ సామ్రాజ్యం లోకి లాగాలని తెగ ఆవేశపడి పోతున్నాడు ...ఇంతలో ఆమె ఒక్క తోపు తోసింది ..అతను క్రిందకు పడిపోయాడు ....అంతే .బెడ్  పైనుంచి  . క్రిందికి . డొల్లి పడిపోయాడు కిరణ్ ...అరేయ్ .ఇప్పుడు టైం తొమ్మిది అయ్యింది ..బారెడు ......పొద్దు ఎక్కింది ..లేవరా బాబు రూంలో తన ఫ్రెండ్ నవ్వుతూ అరుస్తున్నాడు... అబ్బ ఏం డ్రీమ్ మిస్ అయిపోయిందిరా ..అవులిస్తూ లేచి  బ్రష్ పేస్ట్ తీసుకున్నాడు..కిరణ్ .
*                             *                                                        ***                                     *                           *

 ..                                                                            (to be continued)


Small clarification.

 Due to some editorial mistakes i removed the story Nireekshana.  After correcting them will post the story once again.

కోర్టులో ఇంగ్లీష్ మీడియం పై జరిగిన చర్చ

 

నేను చాలాసార్లు ఇంగ్లీషు రాకపోవడం పై చాలా సార్లు నా అభిప్రాయం ఇక్కడ ఇచ్చాను ..పట్టణాల్లో బంధువుల పిల్లలే మాకు ఇంగ్లీషు హిందీ రావని పురుగులను చూసినట్టు చూసేవారు .మాకు పద్యాలు సంస్కృత శ్లోకాలు పంచకావ్యాలు చదువుకున్నా అవి ఇంకొంచెము గౌరవాన్ని జీవితాన్ని తెచ్చిపెడతాయు కానీ ఈ గ్లోబలైజేషన్ లో ఆంగ్ల భాష రాకపోతే చాలా ప్రమాదం..అక్కినేని నాగేశ్వరరావు ఇంగ్లీషు భాష రాదని బాత్ రూ0 లో కూర్చొని విలపించారు .అంతదాకా ఎందుకు నేను IAS కోచింగ్ అకాడమీ ప్రొపెసర్ గా పనిచేస్తున్నప్పుడు మా చైర్మన్ గారు( ఉర్దూయూనివర్సిటీలో )మీకు తెల్సిన మంచి విజ్ఞాన వంతులను పిలిపించి వారి knowledge మన విద్యార్థులకు ఉపయోగించండి అని చెబితే ..నేను మన బ్రాహ్మణ కోవిదులు పత్రికా రచయితలను  వెళ్లి ఆహ్వానం పలికితే నాకు ఇంగ్లీష్ రాదుగా స్వామి అని బాధ పడుతూ చెప్పారు .మా బంధువులు ఇతర స్టేట్ లో చిన్నపడినుంచి స్థిరపడి అమెరికా వెళ్లిపోయున బ్రాహ్మణులే ..వారితో ఇంగ్లీష్ భాష లొనే మాట్లాడాలసి వస్తోంది పార్టీలతో రాజకీయాలు తో అవసరం లేదు ఎవ్వరు పదిమందికి పనికి వచ్చే పని చేస్తే బేషరతుగా తప్పక అభినందించాలి.
నా లాంటి కు గ్రామం నుంచి వచ్చి చాలాకాలం  అవమానింప బడి తెలివితేటలు తెచ్చుకొని ఈ రోజు డాక్టరేట్ లు తీసుకొని ప్రవైట్ లో పనిచేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను ..చాలామంది అర్చకులకు నేను ఇంగ్లీషు నేర్పి విదేశాలకు పంపాను ..

గణితం లోఎన్నో అవధానా లు చేసిన గణిత శాస్త్ర వేత్త!సంజీవరాయ శర్మ ప్రతిభను అందరికీ తెలుపుదాం

 *గణిత బ్రహ్మలక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 27, 1907 - డిసెంబరు 2, 1997)*


మీరే కనుక మహా మహా ఙ్ఞానులను గౌరవించే వారైతే , మీ పిల్లలకు లెక్కల పై మక్కువ పెంచాలను కునే వాళ్ళు అయితే ? తప్పకుండా ఈ పోస్టు పూర్తిగా చదవండి . మిగిలిన వారితో చదివించండి. గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 27, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.


సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు. శ్రీ సంజీవరాయ శర్మ జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ గారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.


శ్రీ సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించారు. అప్పటినుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ శ్రీసంజీవరాయశర్మ గారి గణితావధానమే.


సాధారణంగా, గణితావధానం లో, పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడాచెప్పి, కొంతవరకు జాతకం కూడాచెప్పేవారు. ఈ ప్రత్యేకతను (మానవ గణనయంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలాదేవితో సహా) మరెవరూ చూపలేకపోయారు. ఆవిధంగా, ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత........ 1966 డిసెంబరు ఏడో తేదీ

అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక

2 power 103 ఎంత?

దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని.

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత?

ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు...

కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు!

ఆయనేమన్నా విద్యావంతుడా ?... కాదు.

పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా ?... కాదు.

పుట్టుగుడ్డి!

పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది.

ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!

శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా... మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది... ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ అందరూ తలలు పట్టుకుంటారు! దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం... ''ఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట... (1,84,46,74,40,73,70,95,51,615!)

ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే... అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు! అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!

ఇదంతా అబ్బురమనిపించవచ్చు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ అదంతా!

ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు! సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షిత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు.తొలిసారి 1928లో గణితావధానం నిర్వహిం చిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను పలు ప్రదర్శనలిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబరు 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ సంజీవరాయశర్మ గణితావధానమే! ఆయన పొందిన సన్మానాలు, ప్రదర్శనలు ఒక పుస్తకం అంత ఉన్నాయి. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం!

అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్లా కీర్తించారు. శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు. అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేకపోయారు. వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.

ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ.

ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం'' అని శర్మనుద్దేశించి అన్నారు. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయశర్మని రక్షించుకోలేకపోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. 'అంక విద్యాసాగర' విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు! ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు... ఆయన ప్రతిభ  కు సరిపోవు అనిపిస్తుంది.....

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ప్రణబముఖర్జీ బహుముఖప్రజ్ఞాశీలి భారత దేశములోపుట్టిన ఒక ప్రపంచరత్నం.......?

 ప్రణబ్ ముఖర్జీ బహుముఖప్రజ్ఞా శీలిభారతదేశములో పుట్టిన ఒక ప్రపంచ రత్నం ********************************************************************

ఆధునిక భారత కాంగ్రెస్ కి అంటే సోనియాగాంధీ శకం నుంచి చూస్తే ఒక కన్ను పి.వి నరసింహారావు. ..మరో కన్ను ప్రణబ్ ముఖర్జీ .  ఇద్దరూ రాజకీయ విధానములో సామాజిక అభివృద్ది ..సాంకేతిక విప్లవం ..ఆర్థిక అభివృద్ధి.అన్ని రంగాలలో వాళ్ళ కృషి ..శ్రమ ..ఆ ఫలాలు ఇప్పుడు భారత్ దేశం అనుభవిస్తోంది కరోనామహమ్మారి... లాకడౌన్ రాక పోయుంటే భారతదేశం అగ్ర దేశాలకే మార్గదర్శక0 గా నిలబడి ఉండేది అని చెప్పవచ్చు ..అస్సలు  ప్రణబముఖఃర్జీ మరియు మన్మోహనసింగ్ ఇద్దరికి గురువు పి .వి నరసింహారావు ..మన్మోహనసింగ్ మంచి బ్యూరోక్రాట్ ..రాజకీయ0 తో పని సాధించడం తెలియదు ..అదే పి.వి.మరియు ప్రణబముఖఃర్జీ లు ఎప్పటినించో పెద్దవాళ్ళ దగ్గర పనిచేసి తల ప 0డిన మేధావులు రాజకీయ ఉద్దండులను చూసిన దిగ్గజాలు ..వారి అనుభవం ,సూక్ష్మదృష్టి సమస్యలు పరిశీలన ,పరిష్కారం ..ఇప్పుడు దేశానికి ఏమి కావాలి ..ప్రపంచపటం లో ఇండియా ని ఎలా ధీటుగా మలచాలి అనే విజన్ ఉన్న నాయకులు వారు అదే కోవలోని వారు వాజపేయి సోమనాధ్ చటర్జీ జనతాపార్టీ అధ్యక్షుడులోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారుఇక మిగిలిన వారిలో అధ్వానీ.. మురళి మనోహరజోషీ .అస్సలు జోషి గారు అయితే ఏకంగాఅయితే ముగ్గురు ప్రధాన మంత్రులకు ఆయన గురువు .అటువంటి ఒక్క భారత రత్నాలే కాదు ప్రపంచానికే దిశ దశ చూపే రత్నాలు. ప్రపంచ రత్నాలు  పి.వి ..ప్రణబ్  లు ఏమిటంటే సమస్యను స్మూత్ గా పరిష్కారం చేయగలరు ..ఆ కోవలో కి భాజపావాజపాయ్ గారు వస్తారు వీళ్ళు బుర్రకాయ మెదడు అయితే అద్వానీ లాంటి వారు మిగిలిన దృఢ శరీరం వంటి వారు .మానసిక ఆరోగ్యం వారు శా రీరక ఆరోగ్యం వీరు ..కొంతకాలం సోనియా గాంధీ  ముందుచూపు తో రాహుల్ గాంధీ ని ,ప్రియాంక గాంధీ ని పి.వి.గారి దగ్గర లేక ప్రణబముఖర్జీ దగ్గరో పెడితే వాళ్ళ శిక్షణ లో తిరిగి ఉంటే చాలా ప్రకాశించేవారు ....ప్రణబ్ రాజనీతిశాస్త్రం ..న్యాయ శాస్త్రం చదువుకున్నారు ..పోస్టల్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ వ్యుద్యోగం తో ప్రారంభం అయి ప్రొఫెసర్ వ్యుద్యోగం చేస్తూ ఒక రాజకీయ సభ లో ఉపన్యాసం ఇచ్చారు ..అప్పుడు ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు ..అప్పుడు ఆయనను మేధావిగా గుర్తించి ..ఆమె తన రాజకీయాజీవితం లోకి ఆహ్వానం పలికింది  ..బెంగాల్ ప్రాంతంనుంచి డిల్లీ కి చేరుకున్నారు ..కోర్టులను జడ్జి లను అనేక ప్రలోభాలకు వంచి పనిచేసుకోవడమో ..గ్రూపులు కట్టి ?కుట్రలు పన్న డమో వాళ్లకు రావు .. ..పక్కదే శాలనుకలుపుకొని  వాళ్ళ ఓడ వ్యాపారాలు చేస్తూ  కేంద్ర ప్రభుత్త్వాలని కూల్చి మన కులం ..జాతి వాళ్ళను ...అన్నిరంగాలలోనిలబెట్టి అని రాజ్యాంగ సంస్థలు ..కార్యాలయాల్లో ఒక వ్యూహం గా పెట్టి పనులు వాళ్లకు ఆ నుకూలంగా చేసుకునేలా ఒక తంత్రం ప్లాన్ చేస్తూ పోవడం కాదు చాణక్యుని విధానం ..మోసం కుట్ర  కాదు ..అస్సలు ఆ నాయకులకు అంత పిచ్చి కూడా ఉండదు ..సేవ. చేయుంచుకుంటే చేస్తారు రాత్రివేళల్లో నిదుర. తిండి మానేసి అంకితం అయిపోతారు ..వద్దంటే నాలుగు పుస్తకాలు కొనుక్కుని జీవితం ఒక రూమ్ లో గడిపేస్తారు అటువంటి స్థితప్రజ్ఞత ..దక్షత గల ధర్మ స్వరూపులు సంఘస్వరూపులు వాళ్ళు అందుకే వాళ్ళు అందరితో కల్సిపోగలరు పని చేస్తూకావాల్సిన  పని ని చేయంచుకోగలరు ..కుళ్ళు రాజకీయాలు వాళ్ళు చేయలేరు ..వాళ్ళలో ఇమడలేరు అది వారి క్యారెక్ట్ ర్....వారి తత్త్వం .చేస్తున్న పనే వాళ్లకు దైవ కార్యం ..చివరి వరకు నిస్వార్థంగా .పనిచేసుకుపోవడమే మార్గ మధ్యలో ఎంతమంది చిరాకు పెట్టేవాళ్లు తగులుతూ ఉంటారు ఆయునా ఓపిగ్గా భరిస్తూ అన్ని దశాబ్దాలు పైకి ఎగిసి వచ్చారు అంటే అది వారి ఉక్కుసంకల్పం నమ్మి కూర్చోబెట్టిన వారికి ..నమ్ముకొని వెనుక నడిచి వస్తున్నవారికి .....చేతనైనంత ..శక్తిమేరకు అంకితం అయిపోవలనే తపన... తృష్ణ వారిది ...అందుకే ప్రపంచం  ఆర్ధిక రంగం లో ఓ గొప్ప యోధునిగా పండితు డిగా గుర్తించి ఆర్థికవేత్తగా పురస్కారాలు ఇచ్చింది ..అస్సలు ఆర్థిక శాస్త్రము చదువుకున్న మేధావులు ఇప్పటి సమాజానికి..సామాన్యప్రజ ల చెల్లించే పన్నులు ,దాచుకొనే బ్యాంకు లకు దిశా చేయలేక పేరున్న ఆంధ్రా బాంక్ లు లాంటివి తగలబెట్టి ..ఆదానీలకు ..మాల్యాలకు కట్టబెట్టి వారిని  .దేశాన్ని దాటించి రక్షిస్తున్నాము ..దొబ్బితిన్న బ్యాంకు ఎగవేతదారులను కొమ్ము కాసి ..మాఫీ చేసేస్తున్నాము ....పీవీ ప్రణబ్ లాంటి వారికి ఆస్తి పాస్తులు ..పెద్ద ఖరీదు అయిన కార్లు ..బ్యాంక్ లో నిధులు ..చాతుర్మాస్య దీక్షలు ..ప్రతీ విషయం మీడియా కవరేజ్ లేక జూమ్ మీటింగ్ లో స్వంత డబ్బాలు ..వారి వెనుక గంజిపెట్టి ఇస్త్రీ ఖద్దరు చొక్కాలు వేసుకున్న గూండాల బృందాలు .. వారిపై భజనలు ..ఇవేమీ వారికి తెలీదు ..వారికి సమాజమే ..ప్రజా హితం ,ప్రజా మేలు ప్రజా శ్రేయస్సు ఇవే వారికి తెల్సిన తంత్రం ..ఎన్నో భాషలు పుస్తకాలు చదివారు ..ట్రబుల్ షూటర్ గా కీర్తి గడించారు వారు పక్కకు ఒరిగిన తరువాత వాళ్ళ విషయాలు ఎన్నోబైటకివస్తు నాయు
అదే ఇప్పటి వారు పది మంది చేత భజన .పుస్తకాలు ఎన్నో చదివేసిన మేధావి అంటూ ఫోటోలు ,పొగడ్తలు ..అసలు ఉండవు .మంచి తనం తెలివితేటలు పుట్టుకతో రావడం ఒక రకం ..వారిని తెలుసుకొని నేర్చు కొని..నడుచుకోవడం మనల్ని మనం మల్చుకోవడం ..రెండో రకం.  అంతే  కానీ కెమెరాల ముందు అన్నీ సిద్ధం చేసుకొని ఫోటోలు దిగితే మహా నాయకులు కారు..... ప్రణబముఖర్జీ ఆర్థిక మంత్రి గా వున్నప్పుడు మన్మోహనసింగ్ ను రిజర్వ్ బ్యాంకు కి గవర్నర్ గా తీసుకొచ్చారు ...అటువంటి సింగ్ గారు ప్రధాని అయిన తరువాత ఆయన క్రింద  మళ్ళీ ప్రణబ్ ఆర్ధిక మంత్రి గా పనిచేయాల్సివచ్చి0ది  .అది ఎదిగి మళ్ళీ ఒదిగి పోయి ఆయన పని ఆయన చేసుకొని పోయారు అది work is worship అంటే ..పాడు ప్రపంచం కూడా ప్రణబ్ లాంటి వారి ని తొందరగా నమ్మి నెత్తిన పెట్టుకోరు ..ఎందుకంటే గొఱ్ఱెలు కసాయువాడిని నమ్ముతాయు కదా ...అలా అందుకే ఆయన జీవితములో ఎంపీ గా గెలిచినప్పుడు  కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రణబముఖర్జీ .తనను తానే నమ్మలేక పోయాడు .
మతం సంస్కృతి నాగరికత దైవభక్తి ,దేశభక్తి ..సన్యాసం ఎంతసేపు ఇది ఒక్క కోణంలోనే కాదు ఇంకా ఎన్నో కోణాల్లో దేశాన్ని సమాజాన్ని పాలనని చూడాల్సివుంటుంది ..అన్నికోణాల్లో చూసి పాలన చేసిన వారు కాబట్టే ప్రణబ్ ..పివి లాంటి వారిని బహుముఖప్రజ్ఞావంతులు అని పిలుస్తారు ..అటువంటి మహనీయులు మన దేశం అప్పులు తీర్చేసి బంగారం తాకట్టు లను తీసేసి ఆర్థికభారతాన్ని నిలబెట్టారు .ఎన్నో దేశాలలో ని వారు ..వీరు అడగకపోయున.. మన0 పట్టించుకోకపోయున ఆర్థిక సంస్కర్తలు ..పండితులు అని వీరికి బిరుదులు గౌరవంగామెడలో వేసి వెళ్లారు ...అది వారి మేధస్సు  ....ఇక ప్రణబ్ ముఖర్జీజీవితములో ముఖ్య ఘట్టాలను చూస్తే.......
రాజనీతిశాస్త్రం... న్యాయశాస్త్రం చదివారు
పోస్టల్ శాఖ లో క్లర్క్ గా జీవితం ప్రారంభం
1969 లో ఈయన ఒక సభ లో ఇస్తూ ఉన్న ఉపన్యాసం చూసి ఆయన. చురుకుదనం గమనించి న ఇందిరాగాంధీ ఈయన గారిని రాజకీయాలలోకి తీసుకువచ్చింది ..అప్పటినుంచి 18 గంటలు పార్టీ కోసం...పిచ్చిగా నిస్వార్థంగా  పనిచేయడ0 అలవర్చుకున్నారు
ఇందిరాగాంధీ ఈయన కృషి ని గమనించి రాజ్యసభ కు పంపించారు.
కేంద్రం లో దాదాపు గా అన్ని శాఖలు కు మంత్రి గా పనిచేసి గౌరవం తెచ్చిపెట్టారు
90కి పైగా ఉపసంఘాలకు ఆయన అధ్యక్షుడు గా సలహాలు సూచనలు చేశారు అందుకోసం ఆయన చాలా బిజీగా రాత్రి రెండు గంటలు దాకా పనిచేస్తూ ఉండేవారు .అయినా కూడా పెద్ద ఫోజు పెట్టకుండా అందరికి ఫోన్లు లో అందుబాటులోకి వచ్చి మాట్లాడేవారు .అందరిని కలుపుకొని వెళ్ళే అంత నిగర్వి అన్ని సబ్జెక్ట్ లు పై సంపూర్ణ అవగాహన ఉండటం వల్ల అన్ని సంఘాలు వాళ్ళను డీల్ చేయగలిగారు
7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి .పైగా ఆయన  చదివినది ఆర్థిక శాస్త్రము కాదు ఇప్పుడు so called economist ల కంటే 99 శాతం బెస్ట్. ఆయన లో మెరిట్ గమనించే 1984 లో యూరోమనీ మ్యాగజైన్ ప్రపంచ ఉత్తమ ఆర్ధిక వేత్త అని కీర్తి0చి0ది
సుధీర్ఘ కాలం పార్లమెంట్ రీ పార్టీ నేత గా వున్నారు ...ప్రధాని లేని అత్యవసర సమావేశాలు అన్నీ .ప్రణబ్ ముఖర్జీఏ చూసుకునేవారు.
ఇందిరా గాంధీ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రణబముఖర్జీ ని దూరం పెట్టింది అప్పుడు ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు ...కొంతకాలానికి రాజీవ్ గాంధీ అభ్య ర్ధన మేరకు మళ్ళీ తన పార్టీ ని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు ప్రణబ్.
జనతా ప్రభుత్త్వం ఆ రోజుల్లో ఎమర్జెన్సీ గురించి ఆయనను విచారించింది ..కానీ ఆయన దగ్గర ఏ విషయం దొరక లేదు ..ఎంతో ఎత్తులు చూసిన పొట్టివాడు మహా గట్టివాడు ఎత్తు కేవలం 5'1 అడుగులే ..
ఆర్థిక సరళీకృత సమయంలో ప్రారంభం ఆయనే ఆర్థిక మంత్రి .తరువాత కూడా కాలాన్ని బట్టి ఆర్థిక విధానాలు రూపొందించినవారి లోను ఆర్థిక మంత్రి ప్రణబముఖర్జీనే
ఎప్పుడో పార్టీ నాయకుల తో విందు ల్లో పాల్గొన్న ప్పుడు తనకు హిందీ రాకపోవడం వల్లే ప్రధాన మంత్రి కాలేక పోయానని జోకులు గా చెప్పేవారు ..కానీ క్లిష్ట సమయాలలో ప్రధాని గా ఆయన పేరు వినిపిస్తూ ఉండేది ..జగానికి ..మేధావులకు అందరి రాజకీయ నాయకుల కుపదవిలో కనపడని  ప్రధాని ప్రణబముఖర్జీ గా వెలుగుతూఉండేవారు
రాష్ట్రపతి గా వున్నప్పుడు చాలామంది తీవ్ర వాదులు దేశద్రోహుల కు క్షమాభిక్ష ను
తిరస్కరించాడు .
తనకు వచ్చిన ఇంగ్లీషు భాషనే బెంగాలీ యాస లో మాట్లాడే వాడు ..ఇందిరాగాంధీ నవ్వుతూ ఒక ట్యూటర్ ని పెట్టుకోమంటే ...నవ్వి వద్దు మేడం నా యాస లొనే మాట్లాడుతాను అని నవ్వుతూ చెప్పేసేవారేట ప్రణబ్ .
కొంతకాలం పైప్ తో పొగ త్రాగే వారు ..వృద్ధాప్యంలో పూర్తిగా మనివేశారు.
ప్రణబ్ ముఖర్జీ దుర్గా దేవి భక్తుడు ప్రతీ ఏటా ఓ నాలుగు రోజులు వాళ్ళ స్వంత ఊరు వెళ్లి దుర్గా మాత పూజలు చేసుకొని తిరిగి వచ్చేసే వారు ..అది ఆయనసంవత్సరం లో  వాడుకున్న సెలవులు
1957 లొసువ్రాముఖర్జీ అనే మహిళ ను పెండ్లి చేసుకున్నారు ..సువ్రా కుటుంబ0 బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన కుటుంబ0 ..ఎప్పుడు పుస్తకాలు చడవడమే పిచ్చి ఆయన ఇల్లు అంతా ఒక పుస్తకాలు లైబ్రరీ అని చెప్పవచ్చును.
2004 లో జంగి పూర్ నుంచి ప్రత్యక్షంగా ఎంపీ గా గెలిచినప్పుడు ప్రజల అభిమానానికి ...ఆయన కన్నీరు పెట్టేసు కున్నారు.పి.వి ని గురువు గా భావించినా వాజపాయ్ గారి స్నేహంతో బాగా ఎంజాయ్ చేసేవారు
ఏది ఏమైనా మన్మోహనసింగ్ కి ఒక టర్మ్ ప్రధానిగా ఇచ్చి రెండో టర్మ్ లో ప్రణబముఖర్జీ కి అవకాశం ఇచ్చి ఉంటే మన దేశం అగ్రరాజ్యాలను మించి పోయి ఉండేది .కనీసం తరువాత అయునా కళ్ళు తెరిచిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నతస్థాయి పదవి రాష్ట్ర పతి గా కూర్చోపెట్టి ..తన గౌరవం తాను కాపాడుకోగలిగింది...పదవులు కోసం వాళ్ళు పుట్టరు పద వులే వాళ్ళ కోసం ఎదురుచూస్తు0టాయు ....పదవులు అటువంటి వారికి చాలా వన్నె తక్కువ ..పదవులకేవారు వన్నె తెస్తారు .వారికి పని, బాధ్యత లు తప్ప ఏమీ ఎవ్వరినీ పట్టించుకోరు ...వాళ్ళను దేశమే పట్టించుకోవాలి ..గొప్పలు చెప్పుకొనే రాజకీయ బుడుతలు ..ఇటువంటి మహావృక్షం స్థాయి కి ఎదిగి నిలబడగలమా ఒక్కసారి మననం చేసుకోవాలి ...కనీసం ఫోటోలకు ..ఫోజులు మాని జూమ్ మీటింగ్ లు మాని ..వాస్తవ ప్రపంచం చూసే ప్రయత్నం అయునా చెయ్యాలి...
అటువంటి ప్రపంచంలో ని భారతదేశం లోని వెలుగు వెలిగిన ప్రపంచ రత్నం ప్రణబముఖర్జీ ...ఆయన కు పవిత్రమైన మనస్సుతో కోటి నమ సుమాంజలులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏..🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹














 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online