సూర్యగ్రహణం:
సూర్యగ్రహణం ఈసారి గురువారం రోజు వస్తోంది ..అందుకే ..గురునామ స్మరణతో ..ప్రారంభించి మీ ఇష్ట దైవం ఎవరో వారి నామ స్మరణ చేసుకోవచ్చు .ప్రతీ విషయానికి ..మనం మానవులం కాబట్టి భయం సహజం ..అయితే మనం ఒకటి ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి..భగవంతుని ఏ రూపంలో ఆరాధించిన ,ఆయన పాదాలు పట్టుకొని ఆశ్రయిస్తే మనలను తప్పక రక్షిస్తాడు కాకపోతే బలమైన నమ్మకం ఉండాలి .ఎంత నమ్మకం అంటే ద్రౌపది ..వస్త్రాపహరణం జరిగేటప్పుడు శ్రీకృష్ణ భగవానుని ..ఆశ్రయించి నట్లు ..ఆశ్రయించాలి
. శ్రీవేంకటేశ్వర స్వామి వారి నో, శ్రీ రాములవారినో, శ్రీ ఆంజనేయస్వామి వారినో ,శివభగవానుడు నో .నరసింహస్వామి వారినో,దుర్గాదేవి.., షిర్డీసాయి నాధుడినో..లేక విష్ణు సహస్రనామ పారాయణం, లేక శివుని అభిషేకం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ ఏదో ఒక టి మీ కు ఇష్టమైన పరిహారం చేసుకోవచ్చు .భగవంతుడు ఒక్కరే వివిధ రూపాలు గా కని పిస్తాడు ..భగవద్గీత లో భగవానుడు చెప్పినట్లు .ఎవ్వరు ఏ విధముగా కొలిచినను ..ఏ రూపంలో కొలిచినను ..వారు నన్నే పొందుతారు .అని అందుకే సర్వ దేవ నమస్కార:కేశవం ప్రతిగచ్ఛతి " అని ..కాబట్టి భారం ,భయం మొత్తం భగవంతుని పాదాలపై ఉంచి ధ్యానం చేసుకోండి .ఇంకో విషయం జ్యోతిష్యం విషయం లో కూడా చెప్పిన విషయాలు ..భవతించ... నభవతించ ..అని పూర్వకాలం ఋ షులు ...కూడా చెప్పి యున్నారు అంటే జ్యోతిష్యం లో విషయాలు జరుగవచ్చు,... జరగకపోవచ్చు ..అనికూడా ఒక వాదం ఉంది కాబట్టి అన్నింటికీ మూలాధారమైన వాడు భగవంతుడే అని మనం తెలుసుకొని ఏదో ఒక రూపములో ఆయనను పట్టుకుందాం .
ఇక గర్భిణులు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం ..బైట తిరిగిన తప్పేమి లేదు కానీ ఒక్కోక్క సారి ఆ రేడియేషన్. ప్రభావం కర్మ కాలి మన మీదే పడుతుందేమో అని ...ఏ గర్భిణీ ఆయునా విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అన్నారు .ఎండాకాలంలో ఎంతో మంది బైట పనులు చేసుకుంటారు ..కానీ కొద్దిమంది ఎండవడ తగిలి అద్దం పడతారు ..అలా ఎవరికి జరుగుతుందో , ఎవరికి జరుగదో చెప్పలేం కాబట్టి ...ఆ కొద్దిసేపు బైట తిరగకుండా విశ్రాంతి తీసుకోమన్నారు పెద్దలు.అలానే గ్రహణం కనిపించే దేశాలలో ..గ్రహణ సమయములో అన్నము తినడం ,నిద్రపోవడం, మైథునం. లాంటి పనులు చేయకూడదు ..గ్రహణం పట్టే సమయం కంటే ముందు కానీ ..విడిచిన తరువాత కానీ భోజనాలు చేయడం ఉత్తమం ..ఇక చంటి పిల్లలు ,వృద్ధులు వారి వారి అనుకూలత బట్టి చేసుకోవచ్చు వారికి తప్పులేదు అని పెద్దలు చెబుతారు .
ఇక సూర్యగ్రహణం ఉదయం8గంటలు నుంచి 11.20 వరకు ఉంటుంది .ముఖ్యమైన ప్రదేశాలలో ధర్భలు వేసి ఉంచుకోండి. గ్రహణ సమయములో మీ ఇష్ట దైవ స్తోత్రాలు ,మంత్రాలు చదువుకోవచ్చు. అది ఎన్నో వేల రెట్లు ఫలితం,పుణ్యం ఇస్తుంది ..శుచి గా లేకపోతే మనస్సులో చదువుకోవడం మంచిది ..గ్రహణం తరువాత విడుపు స్నానం చేస్తారు ..కుదరని వాళ్ళు తలపై నీళ్లు చల్లుకుని మరుసటి రోజుతల స్నానం చేయవచ్చు .వృద్ధులు, ..రోగులు ..చేతకానివారు తల పై నీళ్లు చల్లుకుని కాళ్ళు కడొక్కుని ..మూడు సార్లు ఆచమనం చేసి మీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోవచ్చు. అన్ని వాట్సప్ లు చూసేసి భయభ్రాంతులకు లోను కావద్దు ..మూఢ నమ్మకాలు పెంచుకొని ఒక్కరిని బాధ పెట్టకుండా ,మనం బాధలు పడకుండా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం.
కేతుగ్రస్త సూర్యగ్రహణం.. ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది. ధనుస్సు రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ధనుస్సు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశివారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే, ఈ సూర్యగ్రహణం వల్ల ఏ ఏ రాశులకు అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయో జ్యోతిషులు తెలియజేస్తున్నారు.
మేష రాశి
ఈ రాశివారికి గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తుంది కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వీరికి తొమ్మిది భాగ్య స్థానం.. అలాగే ఆధ్యాత్మికతకు కారకం. కాబట్టి ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటంతో కొంత తార్కికవాదన పెరగడం... ప్రతి దానికి ఖండించే మనస్తత్వం అలవడే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక అంశాలపై కూడా కొంత ఆసక్తి తగ్గుతుంది.
వృషభ రాశి
ఈ రాశివారికి 8వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది. అష్టమ స్థానం అనుకోని సమస్యలు, అవమానాలు, ఆర్థిక సమస్యలకు మూలకారణం. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు తగదు. ఇలా చేస్తే సమస్యలు దూరమవుతాయి.
మిథున రాశి
ఈ రాశివారికి గ్రహణం ఏడో స్థానం సంభవిస్తుందిది. సప్తమ స్థానం వైవాహిక జీవితం, వ్యాపారం, వ్యసనాలకు కారకత్వం వహిస్తుంది. సూర్య గ్రహణం వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి, వైవాహిక జీవితం కానీ, భాగస్వామ్య వాప్యారాలలో కానీ అనవసర పట్టుదల, అహంకారానికి పోరాదు. ఈ గ్రహణం ఏవిధమైన ప్రభావం చూపించదు. పంతానికి పోయి వ్యసనాలకు బానిస కాకుండా నిగ్రహించుకోవాలి.
కర్కాటక రాశి
ఈ రాశివారికి గ్రహణం ఆరో స్థానంలో సంభవిస్తుంది. ఇది అనుకూల స్థానం కాబట్టి కోర్టు కేసులు, ఇతర వివాదాల నుంచి బయటపడే అవకాశం మెరుగవుతుంది. అలాగే వృత్తిపరంగానూ అనుకూల ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి
ఈ రాశివారికి గ్రహణం పంచమ స్థానంలో సంభవిస్తుంది. పంచమ స్థానం బుద్ధికి, సంతానానికి, సృజనాత్మకతను కారకం. ఈ గ్రహణం వల్ల సంతానంతో సరైన అవగాహనలేమి, అహంకారం కారణంగా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి.
కన్య రాశి
గ్రహణం నాలుగో స్థానంలో సంభవిస్తుంది. చతుర్ధ స్థానం సుఖానికి, వాహనాలు, స్థిరాస్తులకు కారకం. కాబట్టి అనుకూలించని స్థిరాస్తి, వాహన కొనుగోలు, ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బద్ధకం, అలసత్వానికి పోకుండా ఉండటం వల్ల చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు.
తుల రాశి
ఈ రాశివారికి గ్రహణం మూడో స్థానం సంభవిస్తుంది. ఇది ఇది అనుకూల స్థానం. కాబట్టి ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మానసికంగా శారీరకంగా అనుకూలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి గ్రహణం రెండో ఇంట సంభవిస్తుంది. ద్వితీయ స్థానం ధనం, కుటుంబం, మాటకు కారకం. కాబట్టి గొప్పలు, ఆడంబరాలకు పోకుండా ఉండాలి. అలాగే మాట ఇచ్చే విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో అనవసర వాదాలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి గ్రహణం ఒకటో స్థానంలో సంభవిస్తుంది. అహంకారం, తొందరపాటు తనానికి ఇది కారకం. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. చెడు చేసే నిర్ణయాలు తీసుకోవడం, వ్యతిరేక ఫలితాలను ఇచ్చే పనులు చేపట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆలోచించి అడుగు వేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశివారికి గ్రహణం ద్వాదశ స్థానం (పన్నెండు)లో సంభవిస్తుంది. ఇది ఖర్చులు, విదేశీ యానం, ఆరోగ్య సమస్యలకు కారకత్వం. ఖర్చులు, పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆలోచించి అడుగు వేయడం ఉత్తమం. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కుంభ రాశి
ఈ రాశివారికి గ్రహణం 11వ స్థానంలో సంభవిస్తుంది. ఇది లాభ స్థానం కావడం వల్ల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దీని వల్ల ఆర్థిక సమస్యలు సమసిపోవడం, దూరమైన మిత్రులు, బంధువులు కలవడం లాంటి శుభఫలితాలుంటాయి.
మీన రాశి
ఈ రాశివారికి గ్రహణం పదో స్థానంలో సంభవిస్తుందిది. దశమ స్థానం వృత్తి, పేరు ప్రతిష్ఠలకు కారకం. వృత్తి పరంగా అనుకూలంగా ఉన్నా పై అధికారులతో అనవసరమైన వివాదాలు పెట్టుకోరాదు. పేరు కోసం కాకుండా నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
0 comments:
Post a Comment