Pages

Hues of Love (short story - part 2)

ఓ.కె....మేడం. మీరు అస్సలు మగజాతి అంటే కోపం అన్నారు .ఓ.కె.అస్సలు ఎందుకు అలాంటి భావం మీలో వచ్చింది .అంటే మీరు వాళ్ళ వల్ల దెబ్బతింటమో, లేక నష్టపోవడమో జరిగి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ..యామై... కరెక్ట్..? సందేహం వ్యక్తం చేస్తూ పోజ్..పెట్టాడు సాయిచంద్ర.. తెలుసుకొని ఏమి చేస్తారండి మీరు ఏమైనా ...ఆరుస్తారా?...తీరుస్తారా?.కొంటెగా అడిగింది. ఐస్వర్య.. చూడండి మేడం..మనం ఎందుకు పరిచయం అయ్యామో తెలియదు. మీకు నా వల్ల సహాయం జరగవచ్చు.ఏమో ?ఎలా చెప్పగలం కంఠం బేస్ వాయిస్ తో చెప్పాడు .సాయిచంద్ర. అస్సలు అదికూడా కాదు మేడం మనం ఇద్దరం దోస్తులం కదా ,నా ప్రేమ కష్టాలు మీకు....మీ..కష్టాలు నాకు చెప్పుకుందాం.అని...సాయిచంద్ర చెప్పగానే ఆమె మౌనం గా ఉండిపోయింది .....కొద్దిసేపు కాగానే మేడం త్వరగా చెప్పాలి ...తొందర పెడుతున్నాడు ...........ఎలాగో.. అలా అస్సలు ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ....తెలిస్తే వాళ్ల. ..నాన్న గారికి చెప్పి సొల్యూషణ్.. ఆలోచించవచ్చు ...అబ్బా త్వరగా చెబితే బాగుండును దేవుడా ..అనే. యాంగ్జైటీ లో పడిపోయాడు సాయిచంద్ర........ ఏముంది ....సార్ .కొన్ని సంవత్సరాలు క్రిందట .......అంటూ.......ఆమె గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది.

ఒకరోజు....సాయింత్రం.... బజ్ ....బజ్ ..కాలింగ్ బెల్ శ బ్దం ......తలుపుతీసి....బైటకు వచ్చింది .ఐశ్వర్య . ...కొంచెం మాట్లాడటానికి ....సందేహించింది. ....హాలో.. నన్ను గుర్తు పట్టలేదా ...నేను....రాజేష్ ని కొంచెం చిరునవ్వు చిందిస్తూ ..ముందుకు వచ్చాడు .......ఓ.....రాజూ నువ్వా ...బాగున్నవా. ? లోపలికి రా. కూర్చో. ...అంటూ లోపలికి నడిచింది .ఐశ్వర్య ...నీకోసమే ...బోకే .. హ్యాపీ బర్త్ డే ....అంటూ ఇచ్చాడు .రాజేష్. . నీకు ...ఇంకా గుర్తు0దా ?వ0డర్


ఓ.కే ....థాంక్స్.. అయితే.. ఇవన్నీ ...నేను కాలేజీ స్ట డీస్ తరువాత బంద్ చేశాను.... అవును ....నీకు ఎలా గురుతుంది?కొంచెం ...ఇష్టం గా కొంచెం ఆశ్చర్య0 గా ..ముఖ0 ...విప్పా రుతుంటే అడిగింది ..ఐశ్వర్య... మనం కాలేజీ రోజుల్లో చేసుకున్న ...బర్త్ ...డే. పార్టీ లు. మన ఫ్రెండ్స్... మర్చిపొగలమా ?..అందులో అస్సలు నీ !లాంటి దోస్తులను ఎప్పటికీ మర్చి పోలేము .కళ్ళలోకి చూస్తూ ధీర్ఘం తీశాడు ..రాజేష్ ...ఇంతకీ నేను ఇక్కడ ఉన్నానని ఎలా కనుక్కున్నావు ? కనుబొమ్మలు ముడి పడుతుంటే సందేహం గా అడిగింది ఐశ్వర్య... ఏముంది ....నాకు ఇక్కడ ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చి0ది.. మన గాంగ్ ...కూడా నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావని ...చెప్పారు.. మొన్న ..ఈ ..మధ్య నేను ఇదే కాలనీ లో ఇల్లు వెతుకుతున్నా ను ..నువ్వు అప్పుడే బయలు దేరి బైట నిలబడ్డావు ....నేను ..పలకరించే లోపే నువ్వు కార్ ఎక్కి వెళ్ళి పోయావు .అలా ..కాకతాళీయంగా ..మనం కలుసుకున్నాము ...చాలా తేలిగ్గా చెప్పేశాడు.రాజేష్...


ఇంతకూ ...మీ ఫ్యామిలీ ,పిల్లలు ....అంటూ ఐశ్వర్య ఎ త్తగానే ..మగవాళ్లకు అంత త్వరగా ఈ రోజుల్లో అవుతున్నాయా?..ఇంట్లో ఇతర భాధ్యతలు. ఇంకా ఎన్నో కుటుంబ సమస్యలు ఉంటాయి గా ! అని రాజేష్ చెబుతూ ...మరి ...నీ ..కు పెళ్ళి అయ్యిందా?కొంచెం ...ఎక్కువ ..ఆతృత పడుతూ ...అడిగాడు రాజేష్... బాబూ....ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంత ..తేలిగ్గా అవుతున్నాయా?.ఎన్నో ..పరీక్షలు పెడుతున్నారు వచ్చేవాళ్ళు...దీర్ఘం ..తీసింది. ఐశ్వర్య.. ఏమిటి...నీ లాంటి అంద గత్తెలకు ...కూడా పెళ్ళిళ్ళుఆలస్యమా?...కొంచం ...సంతోషం వ్యక్తం చేస్తూ అన్నాడు... రాజేష్...అయితే మరి ఇక్కడఇంకా ఎవరు ఉంటారు..... అడిగాడు రాజేష్ ...నేను ..మా ఫ్రెండ్.. కోమలి ...తను ఇప్పుడు ఊరు వెళ్ళి0ది. చెప్పింది .ఐశ్వర్య. .ఓ.కె మరి .డిన్నర్ బైట చేద్దాం... ఎలాగూ ...నా వల్ల ఆలశ్యము అయిపోయింది ..కదా.. ఏమ0టావు. కొంచం రి క్వెస్ట్ గా అడిగాడు రాజేష్ .....నో ..నో...నేను ఇప్పుడు ఇక బైటకు రాను ..ఇంకా.. నీవు కూడా .ఇక్కడ కు రావద్దు. ఈ...రోజు ..మా ఇంటి ఓనర్స్ పెళ్లికి వెళ్లారు. అస్సలు ఫ్యామి లీ వాళ్లకు తప్ప ఇంకెవరికి రెంట్ కి ఇవ్వరు ..అయితే ..నాన్నగారికి కొంచెము తెల్సిన వాళ్ళు. ముందే చెప్పారు జె0ట్స్ ,ఏ ఫ్రెండ్స్ రావడానికి లేదు అని ..ప్లీస్ ట్రై. ..టూ ..అండర్ స్టాండ్ మీ ..కావాలంటే నా ఫొన్ నెంబర్ తీసుకో ..బైట ..ఎక్కడైనా కల్సుకుందాము... కాస్తంత ..ప్లజెంట్ గా చెప్పింది ఐశ్వర్య... ఓకే.... ఐశ్వర్య ..థాంక్ యూ ..కాఫీ ..చాలా బాగుంది .. కాంప్లిమెంట్ ఇచ్చి నవ్వుతూ ..బై. ..చేయు ఊపుతూ బైటకు నడిచాడు రాజేష్.....రాత్రివేళ.....నిద్ర ...పట్టక అటూ..ఇటూ.పక్క పై దొర్లుతో0ది ..ఐశ్వర్య.... రాజేష్..... మాటలు పొగడతలు... ఆతని. ..చూపులు గురించే ఆలోచనల్లో ..పడిపోయింది.ఐశ్వర్య... మంచి చదువు....మంచి ఉద్యోగం ...ఉన్నాయి.. పర్సనాలిటీ,,... అందం కూడా తక్కువేమీ కాదు ..ఇప్పుడు ..నాన్నగారు ..తెచ్చే పెళ్ళీ చూపుల్లో ...కూర్చునేంత ..ఓర్పు, ..ఓపిక.. తీరికా.. లేవు ..అమ్మా.. నాన్నగారు...పెళ్ళి... సెటిల్మెంట్. అంటూ ..గొడవ చేస్తున్నారు ....ఒక విధంగా.... రాజేష్ కనుక .లైన్ లోకి వస్తే ...పచ్చజెండా ...ఊపి ... నాన్నగారి కి చెప్పడం ..ఎలా. ఉంటుంది... కొంచం ...కలల్లో ..తేలిపోతోంది.. ఐశ్వర్య...... అలా. నిద్రలోకి జారుకొంది.....

* * * * *
ఫోన్ రింగ్ అవుతోంది.. పరిగెత్తుకొని వచ్చి ఫోన్ తీసింది ..ఐశ్వర్య... అమ్మ ...చెప్పు ..."..క్షేమ.. సమాచారం పూర్తి కాగానే .విషయానికి వచ్చేసింది ..చూడు. ..తల్లీ ..నువ్వు ఆడపిల్లవి ..ఉద్యోగం తో. పాటు పెళ్ళి... సంసారం ముఖ్యం ..ఏ వయస్సు ..లో ముచ్చట..ఆ. వయస్సులో ..జరగాలి ..నేను ..ఎప్పుడో. పెళ్ళి ..చేస్తే బాగుంటుందని ..చెప్పాను....ఇదిగో...ఇంత దూరం. మీ ..నాన్నగారే. ..తీసుకొచ్చారు ....నాకు ....ఆడపిల్ల వి ఒక్క దానివి ...అంత దూరంలో ..ఉంటుంటే. చాలా. భయంగా ఉంది .రేపు వచ్చే...వీకెండ్ ..లో వచ్చి వెళ్ళు ..కొన్ని పెండ్లి సంబంధాలు. వచ్చాయి... నువ్వు కొన్ని ఎంపిక చేయాలి .ఎందుకు చెబుతున్నానో విను సరే ..అమ్మా. నేను సెలవు రోజు ల్లో వస్తానులే ..నాన్నగారికి చెప్పు ఉంటాను ...ఫోన్ పెట్టే సింది. ఐశ్వర్య..


* * * * * *
రాజేష్ ....ఐశ్వర్య.. కల్సి. షాపింగ్ చేస్తున్నారు ....ఐశ్వర్య..... డిన్నర్ టైం ..దాటిపోతుంది... పద ..ఇక్కడ దగ్గర్లో రెస్టారెంట్ కి వెళదాం.. ఇద్దరు కల్సి భోజనం చేశారు ....ఏదైనా. మూవీ కి వెళదాం.. బోరు కొడుతో0ది .అన్నాడు రాజేష్.. వద్దు రాజేష్ ..నాకు అంత మూడ్ లేదు ..లే ..కానీ. ..కాసేపు ఎక్కడైనా ఓ ...పది నిమషాలు.. ఫ్రీ గా కూర్చుందా0....పద ...కొద్దీ దూరం కబుర్లు చెప్పుకుంటూ నడిచారు ..ఓ..పార్క్. లో. కూర్చున్నారు ...ఇంతకీ ....పెళ్ళి కుదిరిందా ?ఎప్పుడు చేసుకుంటున్నావు ?...కాస్తంత ..నవ్వుతూ అడిగాడు ..రాజేష్ ....ఇప్పుడు ..వచ్చిన సమస్య అదే ...సంబంధాలు ..వస్తున్నాయి ..కానీ అందరూ యు.స్.లో ఉన్నవాళ్ళో. లేక ..పెళ్ళి కాగానే ఎబ్రాడ్ ..వెల్దామనో కండీషన్ పెడుతున్నారు ....కొంచెము ఇబ్బంది గా చెబుతో0దీ ఐశ్వర్య ..మరి ఇంకే ......హాయిగా వెళ్ళచ్చు గా. ..సొల్యూషన్ ఇచ్చినట్లుగా మధ్యలో ..మాట్లాడాడు రాజేష్.. ...అబ్బా ..నాకు ...ఎబ్రాడ్.. ఇష్ట0 ..లేదు.....ఎందుకంటే ..ఆల్రెడీ... మా ..అన్నయ్య... అక్కడే ..వున్నాడు ..వాడు ..ఇండియా ..వచ్చేస్తాడని ..నమ్మకం లేదు.మా అమ్మా.. నాన్నలను ..చూసుకుంటూ.. ఇండియా !లో. నే. ఉండిపోవాలని ఉంది.. కొంచం ..నిట్టూ ర్పు.తూ చెప్పింది ..ఐశ్వర్య ... అస్సలు ...ఈ. రోజుల్లో నీలాగా ....ఆలోచించే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారా ? "నాది అదే సమస్య ..మా సిస్టర్స్ ..పెళ్ళి చేయాలి ...మా నాన్నగారు లేడు ...మా అమ్మ.. ..నేను వెళ్ళి ..డబ్బులు పంపిస్తానంటే ..వెళ్ళద్దు ..మగదిక్కు లేని సంసారం ..అంటూ ..ఏదేదో మాట్లాడుతో0ది. మా అమ్మ ..నాదీ ..అదే. బాధ ..చెప్పాడు రాజేష్.....అందుకే. ..నా. బాధ్యతలు లో పాలు పంచుకొని ...నాకు సహకరించే వాళ్ళ కోసం చూస్తున్నాను...అలా. దొరికితే ..నా అదృష్టమే.... ఇద్దరిసేపు ....కొంచం మవునం .....తనకు ఐశ్వర్య అంటే ఎంతో ఇష్టం . ,తాను ఇచ్చిన ఆఫర్ ని ....మె చ్చి ..నన్ను ఇష్టపడుతున్నానని ...పెళ్ళి.. చేసుకుందాం ...అంటే ఎంత బావుణ్ణు .ఇద్దరం ...ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ మిగతా విషయాలు చూసుకోవచ్చు ..తెగ ...ఊహలు ఊహించేస్తున్నాడు .. ఎంతో ...ఆ0దోళన పడుతూ....ఆమె ..సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. రాజేష్. ..


...ఓకే...ఇక వెళదాం.. మా ..రూముమే ట్.. కూడా వచ్చే ఉంటుంది ....చూద్దాం ..కాలం ..ఏమి నిర్ణయిస్తుందో....!బై..రాజేష్ అంటూ ...ఎవరి ఇంటి కి ...వాళ్ళు బయలు దేరి వెళ్ళిపోయారు.


* * * * * *
ఒక రోజు సాయ0 కాలం.వెన్నెల పుచ్ఛపువ్వులా ప్రకాశిస్తోంది. కొద్దిసేపు కరెంట్ లేకపోవడం వల్ల బాల్కనీ లో అటూ ఇటూ తిరుగుతున్నాడు .పైనుంచీ క్రిందికి చూస్తుంటే ..ఆకు పచ్చని గరిక తివాచీ లా పరుచుకొంది .అందమైన పువ్వులు విరగబూసిన పున్నా పువ్వులు తివాచీ నిండా పరుచుకున్నాయి .పక్కనే ఎత్తైన పున్నాగ చెట్లు మంచి సుగ0దాన్ని వెదజల్లుతున్నాయు ..మనస్సు ఆహ్లాదకరంగా ఉంది .ఐశ్వర్య అందం ..పదే పదే గుర్తుకు వస్తోంది.. ఇక నిరీక్షించి. లాభం ఏమి లేదు ..అస్సలు ..నా వైపు నుంచి ప్రపోజల్ పెడతాను ..సెల్ ఫోన్ తీశాడు రాజేష్...ముందుగా మెసేజ్ పంపించాలి అనుకున్నాడు .. కొద్ది సేపు ఆలోచనల్లో పడ్డాడు .కొత్త పరిచయం ఏమి కాదుగా ...ఇక డైరెక్ట్ గా ..రింగ్ఇచ్చాడు ..హలో......చెప్పు రాజేష్ .. ఫోన్ తీసింది ఐశ్వర్య.....ఏదేదో విషయాలు సోది లా చెప్పుతున్నాడు రాజేష్ .కొద్దిసేపు ఓర్పు గా ..విన్నది .సరేలే ..తరువాత ..మాట్లాడుకోవచ్చు గా అసహనం గా ఫీల్ అవుతొంది .....అధికాదు ...ఐశ్వర్య .నేను ఎలా చెప్పాలా? అని ..ఏమీలేదు ..మన ఇద్దరి భావాలు ఒకటే ..చాలాకాలం నుంచీ ..పరిచయం ..అందుకే ..మనఇద్దరం. కల్సి సెటిల్ అవుతే ...నీ అభిప్రాయం చెప్పు..కొంచం . చెప్పటానికి కొద్దిగా అవస్థలు పడుతూ పూర్తిచేశాడు .రాజేష్.....!ఒక్కసారిగా ...కొంచెము సేపు స్టన్ ...అయిపోయింది ..ఏమి చెప్పాలి ...ఏమి..మాట్లాడాలి అర్థం కాలేదు ...ఫోన్ పెట్టేసింది. ఐశ్వర్య... కొంచెం ...మనస్సులో ..ఆందోOళన పడ్డాడు ..అనవసరం గా ఆమె మనస్సు బాధపెట్టానా?...కొద్దిసేపు ...ఆలోచించాడు .." మళ్ళీ ..ఫోన్ తీసుకొని సారీ ..ఒకవేళ ..నిన్ను బాధ పెట్టాను అనుకుంటే సారీ ...కానీ మన స్నేహం. ...మాత్రం వర్దిల్లాలి ..ఉంటాను ..బై...అని ఫోన్ లో మె సేజ్ ..పెట్టాడు. రాజేష్. ...


.రాత్రివేళ ....చాలా టైం అయ్యింది ..కళ్ళ మీదకు నిద్రే జాడలేదు ..రాజేష్ ..గురించే ఆలోచిస్తోంది .ఎప్పట్నుంచో రాజేష్ తెలుసు ..అతను పూర్తిగా గ్రామీణ వాతావరణంలో పెరిగాడు ..బంధుత్త్వాలు ,అనురాగాలు ,విలువలు అన్నీ తెలిసే పెరిగి ఉంటాడుగా ...పైగా ఆడపిల్లల ...చెల్లెళ్ళు. బాధ్యత ,అన్నింటి తో పెరిగినవాడు ..కాబట్టి ఒప్పేసుకుంటే ...అమ్మో ....ఏమో ...వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ కొంచెము ఆర్ధికంగా లేనివాళ్లే ..మా కుటుంబం తో వాళ్ళంతా ఇమిడిపోగలరా ....అస్సలు నాన్నగారి కి తెలిస్తే ఆయన తట్టుకోగలరా ..అలా ఆలోచిస్తూనే ..లేచి వెళ్ళి మంచి నీళ్ళు ..గబ గబా తాగేసింది ఒక నిట్టూర్పు విడిచి. వెళ్లి మళ్ళీ పడుకొంది.... పోనీ ...అమ్మ చెప్పిన సంబంధాలు ..చూస్తే ..ఏమో ..వాళ్ళ మనస్సులు ,మనస్తత్త్వాలు ,అభి రుచులు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తుంది.

అలా. ..ఆలోచనలతో సతమతం అయిపోతొంది.. ఐశ్వర్య... అలా కొద్దిరోజులు గడిచిపోయాయి...ఒకరోజు రైల్వే స్టేషన్ లో ..ఇద్దరు ఎదురుపడ్డారు .ఐశ్వర్య కి నా మీద కోపం వచ్చే ఉంటుంది ఎలా ..పలుకరించాలి ..అనే సందేహం తో నే ..చిరునవ్వుతో ..దగ్గరకు వచ్చాడు ..రాజేష్. " .హలో ....రాజేష్ ..చిరునవ్వుతో విష్ చేసి నిలబడింది ఐశ్వర్య .సారీ ..నేను ..నిన్ను ఇబ్బంది పెట్టాను ....కొంచెం ..వినయం గా అన్నాడు రాజేష్ ...ఇబ్బంది ...ఏముంది లే ..నీ అభిప్రాయం ..తో బైట పడ్డావు ..ఓకే ..మరి నేను కూడా అన్నీ ..ఆలోచించుకోవాలి కదా ..నవ్వుతూ ...జవాబు చెప్పింది ఐశ్వర్య.... నువ్వు కూడా ఇంటికే నా ..అడిగాడు ...కాదు రాజేష్ ...మా..ఫ్రెండ్ ది ...పెళ్ళి ...తెగ చంపేస్తుంది రమ్మని ..నేను విజయవాడ ..వరకు వస్తాను ....అంటూనే ..మరి నువ్వో....అడిగింది ఐశ్వర్య . నేను ఇంటికే వెళుతున్నాను .....అలా కొద్దిసేపు ..పిచ్చాపాటి ..మాట్లాడుకున్నారు .జోక్స్ వేసుకున్నారు ..ఇంతలో రైల్ రావడం ..ఎక్కడం ..జరిగింది ...ఓకే.. నేను .మధ్య.. మధ్య లో ..నీ కంపార్ట్మెంట్ ..లోకి వస్తుంటాలే ..పద పద ఎక్కు .అని రాజేష్ అనగానే ..ఇద్దరు రైల్ ఎక్కేశారు ....కొద్దిసేపు సెల్ ఫోన్ లో చాటింగ్ లో వున్నారు ...రాజేష్ ..మధ్య మధ్యలో ఏదొక స్టేషన్ లో వచ్చి కొద్దిసేపు నిలబడి మాట్లాడి వెళ్ళుతూనే వున్నాడు ...విజయవాడ..రాగానే ఇద్దరు దిగారు ...బై చెప్పేసి ..సాగనంపింది....మళ్ళీ రైలు ఎక్కి కూర్చున్నాడు రాజేష్ ..తన కోసం ..పెళ్ళివారు పంపించిన టాక్సీ లో పెళ్లికూతురు ఇంట్లో దిగింది. ఐశ్వర్య.


* * * * * *
ఒకరోజు రాజేష్ ..వాళ్ళ ఇంటి తోటపని పూర్తి చేసుకొని రిలాక్స్ అవుతూ సెల్ చూసుకుంటున్నాడు .ఇంతలో మెసేజ్ ఎలర్ట్ . ఐశ్వర్య అని చూసి .వెంటనే ..ఓపెన్ చేశాడు ..హలో ...రాజు ..నేను కూడా నువ్వు చెప్పిన విషయాన్ని ఓకే చేస్తున్నాను ..ఇద్దరం కలిసి. సెటిల్ అయితే బాగుంటుంది అని ...మెసేజ్ చదివిన ..రాజేష్ కి ఆనందానికి అవధులులేవు .
సన్నని చిరు జల్లు పడుతోంది ..రెండు గోరింకలు గోడ పై దోబూచులాడుకుంటున్నాయి. . మల్లె పందిరి పైన బడిన చిరుజల్లు మల్లెమొగ్గల పై బడి కొత్త అందాలతో పరిమళ స్తున్నాయు .తాను మళ్ళీ సెల్ ఫొన్ తీసుకొని ఐశ్వర్య కు మెసేజ్ టైప్ చేస్తున్నాడు ..థాంక్స్ ..నా అభిప్రాయం గౌరవించినందుకు ....ఇంకా ..నా వైపు నుంచి ఐ లవ్ యూ ..ఐ లైక్ యు నీవు ఆ ఫీస్ లో బిజీగా. వున్నా వని అనుకుంటున్నాను ..సాయంత్రం ..మాట్లాడు కుందాము. అయినా రేపు నేను అక్కడికి ఎలాగూ చేరుకుంటాను ..ఓకే బై..బై..అని మెసేజ్ పంపించేశాడు రాజేష్.. 


ఆ. తరువాత ..ప్రతీ రోజు కల్సి కొద్దిసేపు మాట్లాడుకోవడం ,సినిమా కి వెళ్ళడం ,షికార్లూ నడుస్తూవున్నాయి.చెల్లెలు శోభన పెళ్లి కుదరడం . ఆ. పెళ్ళీ ఏర్పాట్లు ..అన్నీ ప్లాన్ చేసిపెట్టింది ఐశ్వర్య ..అందులో బాగా ధనవంతుల సంబంధం అవడం వల్ల ..మగపెళ్ళివారి వైపు నుంచి ఏ గొడవలు రాకుండా జాగ్రత్తపడాలని ఎన్నో ....పథకాలు రచించి పెట్టింది !అవసరమైన చోట ..అడ్వాన్స్ చెల్లింపులు కొన్ని తానే చేసేసింది ...ఐశ్వర్య ..దానికి ...రాజేష్ .కృతజ్ఞతలు ..చెపుతూనే వున్నాడు ..మన ఇద్దరి మధ్యలో అవి అవసరమా ? అంటూ. ..తన పని తాను చేసుకుపోతొంది ఐశ్వర్య...
ఒకరోజు.... ఇంటినుంచి ఫోన్ ...ఎక్కడ వున్నావు ఒకసారి అత్యవసరంగా యింటికి రా ..చాలా. అర్జెంట్ ..మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు ..జ్వరం ఎక్కువగా ఉంది... ఫోన్ పెట్టేసింది .ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు... ఇంటి పనివాళ్లకు ఫోన్ చేసి మొత్తం కండీషన్ తెల్సుకొంది ..వాళ్ళు ..కూడా మీరు వస్తేనే చాలా బాగుంటుంది అని తేల్చి చెప్పారు .ఇక పరిస్థితి మొత్తం రాజేష్ కి చెప్పి బయలు దేరింది . ...సారీ ...ఐశ్వర్య ...నేను రాలేక పోతున్నందుకు తప్పు క్షమించు ..అంటూ..ప్రాధేయపడ్డాడు ....రాజేష్. నువ్వు ...ఉండీ ..ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకో ...తాను పూర్తిచేసిన పనులు ..అన్నీ. రాజేష్ కి అప్పగించి బయలుదేరి వెళ్ళిపోయింది .ఐశ్వర్య
* * * * * *
ఇంటికి చేరుకున్న ఐశ్వర్య ..వాళ్ళ నాన్నగారి పక్కనే కూర్చుంది .డాక్టరగారు ఇంజక్షన్ చేస్తున్నారు ...బైటకు రమ్మని సైగ చేశాడు ...చూడమ్మా మీ నాన్న గారికి చిన్న మత్తు టాబ్లెట్ ఇచ్చాను కంగారు పడవద్దు ...ఇప్పుడు మంచి నిద్ర పోతున్నారు .మెల్లగా చెప్పాడు డాక్టర్ .. ".కాదు సార్ ..అస్సలు ...కండీషన్ ఏమిటి ...పోనీ..హైదరాబాద్ తీసుకెళ్లమంటారా? ..కొంచెం ..ఆందోళన గా అడిగింది ఐశ్వర్య... ఇటు కూర్చోమ్మా .."మీ నాన్నగారు ....నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ..ఆయన .ప్రతీ దానికి ..ఆందోళన పడడం ఎక్కువ ...అందులో ఇప్పుడు జ్వరం కదా ..ఈ ..ఇంజెక్షన్ రోజూ ఒకటి చేయాలి ..ఇక ఈ ..టాబ్లెట్స్ ..మాత్రం ..తప్పకుండా వే యాలి .రేపు ఉదయం మళ్ళీ వస్తాను ..మీరు కాస్త పక్కనే వుంటూఉండండి. అన్నీ వివరించి చెప్పి వెళ్ళిపోయాడు డాక్టరుగారు ...


మరుసటి రోజు ....కాస్త ఆరోగ్యం కుదుటపడగానే ..ఐశ్వర్య. ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు తండ్రి దొరగారు. .. .చూడమ్మా ...కొంతకాలం క్రితం ..ఎవరో అమ్మాయి ని ఇష్ట పడ్డాను చేసుకుంటాను ..అని నా బుర్ర తినేవాడు ..ఆ అమ్మాయి ఎవరో ,ఏమిటో కులం,గోత్రము ఏమి తెలియకుండా ఎవర్ని తెస్తాడో .ఏం అల్లర్లు జరుగుతాయో అని టెన్షన్ పడ్డా కానీ భగవంతుడు అర్థం చేసుకొని ఎలానో తప్పించాడు అనుకుంటే ..ఇప్పుడు కుదిరిన అమ్మాయి ని ..ఉన్నఫళ్ళము గా చేసేసుకోవాలని కంగారు ...అని దొరగారు చెబుతుంటే ..అమ్మో మరి. నా ప్రేమ ,పెళ్ళి గురించి ఎలా చెప్పాలో ,ఏమిటో తెగ ఆలోచనల్లోకి వెళ్ళిపోతోంది. ఐశ్వర్య మనస్సు.. ఏమిటమ్మా ..ఏమి ఆలోచిస్తున్నావు ? అన్న పిలుపుకు ఈ. లోకంలోకి వచ్చింది ఐశ్వర్య ...అదే నేను కూడా ఆలోచిస్తున్నాను ..అనగానే మళ్ళీ రిపీట్ చేసిఆందోళనగా చెప్పుతున్నాడు దొరగారు .అన్నయ్య కు మంచి సంబంధం వచ్చింది ..పైగా ఇద్దరు యూ.ఎస్ .వెళ్ళడానికి పెళ్లి చేసుకుంటారట ..త్వరగా ఏర్పాట్లు చేసుకుందాం అంటున్నారు .ఇప్పటికీప్పుడే పెళ్ళి అంటే ఎలా పరిగెడతాం .మీ అన్నయ్య కి పిల్ల బాగా నచ్చింది అట ...బాగా చదువుకున్న అమ్మాయి ..నా కెరీర్ కూడా బాగుంటుంది అని తెగ చంపేస్తున్నాడు ..ఏమి చేద్దాం ,ఎలా చేద్దాం ...కొంచెం ...ఆవేశ పడిపోతూ ..అడిగాడు తండ్రి దొరగారు ..దానిదే ముంది నాన్నగారు ..ఈ రోజుల్లో అన్నీ ..ఫోన్లు. ..ఆన్ లైన్ లే కదా ..మీరు ముందు ఫ్రీగా ,టెన్షన్ పడకుండా ఉంటే ..నేనే ఎదో. రకంగా ..దారిలోకి తెస్తాను ఓకే నా ! అంటూ తండ్రి చేయు తన చేతిలో పెట్టుకొని లాలిస్తున్నట్లు గా చెప్పింది ఐశ్వర్య. రాజేష్ కి ఫోన్ చేసి తండ్రి ఆరోగ్యం ఇంటి పరిస్థితులు అంతా వివరించి చెప్పింది ఐశ్వర్య . సరే ..నువ్వు నీ పనులు జాగ్రత్తగా చేసుకో ,ఇక్కడ నాకు మా వాళ్ళు సహకరించే వాళ్ళు వున్నారు పరవాలేదులే జాగ్రత్త అవసరం ఉంటే ఫోన్ చేయి ....ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు రాజేష్ .
* * * * * *
అలా కొద్దిరోజులు వేగంగా కదిలిపోయాయి ..అక్కడ రాజేష్ చెల్లెలు పెళ్ళి ...ఇక్కడ ..ఐశ్వర్య అన్నయ్య పెళ్ళి కొద్దిరోజులు తేడాతో పూర్తిఅయిపోయాయి. ఒకరోజు ...నాన్నగారు .నేను మా ఆఫీసు కి వెళ్ళాలి ..సెలవు కూడా అయిపోయింది .మరి నేను రేపు బయలు దేరి వెళ్ళ తాను ..చిన్న గా చెప్పింది .ఐశ్వర్య ...అదేమీటమ్మా ..నీకు కూడా చాలా పెండ్లి సంబంధాలు వచ్చాయి కదా ..నువ్వు వెళ్ళితే ఎలా ? అయినా ..నీ పెళ్ళి కూడా అయితే ఇక మేము విశ్రాంతి గా రామా.. కృష్ణా అని బ్రతికేస్తాం.. ఇప్పుడు ఉద్యోగం కంటే నీకు పెళ్ళి ముఖ్యం తల్లీ ..వినమ్మా .అంటూ లాలన గా చెప్పాడు తండ్రి దొరగారు. ఇంతలో ...ఏమిటండీ ..నసుకుతారు ..అది వెళ్ళితే మళ్ళీ ఇప్పట్లో రాదు కాస్తంత గట్టిగా చెప్పండి. ..మొదటినించీ ...అతిగారాభం చేసి ఇంత వరకు తెచ్చారు గట్టిగా విసుక్కోని అరిచి చెప్పింది విమల .


* * ఐశ్వర్య కు పెళ్ళి చూపులు ఏర్పాట్లు ..మగపెళ్ళివారికి అమ్మాయి పిచ్చి పిచ్చి గా తెగ నచ్చేసింది .కట్నం ఇంత అంత అనే బేరాలు కూడా ఏమి జరగ లేదు .పెళ్లి ముహూర్తాలు కొద్ధి రోజులు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత ..అన్నీ మూఢా లే ముహూర్తాలు లేవు అని పురోహితులు చెప్పడం ..చక చకా పెళ్ళిఏర్పాట్లు పెళ్ళి జరిగిపోయింది.. ఇక విందు భోజనాలు,... అప్పగింతలు, అన్నీ పూర్తిఅయిపోయాయి . ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోతున్నారు ..మగపెండ్లివారు కూడా తరలి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ఎందుకో ఉన్నట్లు ఉండి ఐశ్వర్య కు మాత్రం ఇదంతా మనస్సు కు ఇష్టం గా లేదు పైగా ..నేను పెళ్ళికొడుకు ని మోసం చేస్తున్నాను అనే ఓ పిచ్చి ఆలోచనల్లో పడిపోయింది .పోనీ నా మనస్సులోని విషయం జరిగిన ప్రేమ వ్యవహారం అంతా కూర్చోబెట్టి మొత్తం చెబుదామని అనుకున్నాను ...కానీ వాళ్ళు చాలా ఆచారసాంప్రదా యాలు కల వాళ్ళని ...నాకు అర్థం అయుం ది. ఇంకా చెప్పినా ఎవరూ వినే వాళ్ళు లేరు .ఇక చేసేదిలేక భయపడి అక్కడ నుంచి ఎలా బైట పడాలా అనే ఆలోచనల్లో పడ్డాను. అలానే ఓపికతో ,ఓర్పు తో అన్ని పూజల్లో పాల్గొనిపెళ్ళి కొడుకు గారి ఇంటికి వచ్చాను . ఇక వాళ్ళు శోభనం ఏర్పాట్లు గురించి ఏవేవో ప్లాన్ వేసుకుంటున్నారు ...ఇక నేను మా కార్ డ్రైవర్ శంకరం ని బ్రతిమి లాడాను .అతను కూడా అక్కా నువ్వు బాగా ఆలోచించుకో అని పది సార్లు నాకు నచ్చ చెప్పాలని చూశాడు . నేను వినకుండా బైటకు నడుచుకుంటూ వెళ్లిపోతుంటే ..తను నన్ను ఎక్కించుకొని హైదరాబాద్ బస్ ఎక్కించాడు ...అలా జరిగిపోయింది .ఇక ఆ తరువాత అందరూ వెతకడం ,మా నాన్నగారి ని నిలదీయడం .కొన్ని నెలలు నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు .కొంతకాలం మా నాన్నగారు అస్సలు బైటకు కూడా రాలేదు .సరే అది అలా ఉండగా ..నేను బస్ లో హైదరాబాద్ చేరుకొని ...రాజేష్. ని కలవాలని జరిగింది అంతా చెప్పుకుంటే ఓదార్చి దగ్గరకు తీసుకొని అండగా ఉంటాడు అనుకుంటూ).


సిటీ కి చేరుకున్న ..ఐశ్వర్య ..హడావిడిగా ఫోన్ చేసింది ..ఎంతో ఆతృతగాఆనందం తో చిరునవ్వులతో హలొ ...రాజూ నేను ఊరునుంచి వచ్చేశాను ..ఎప్పుడు కల్సుకుందాం ..అన్నిపనులు ఎలా. జరిగాయి .. అవును ...రాజేష్ మావాళ్ళు ...నాకు .హడావిడిగా పెళ్లి జరిపించారు .మా నాన్నగారి ఆరోగ్యం దృష్ట్యా ఏమి చేయలేక పెళ్లికి ఒప్పుకున్నాను..పెళ్ళికొడుకు కి అన్ని విషయాలు. వివరంగాచెప్పి. హెల్ప్ అడిగి తప్పించుకోవాలని చూశాను. కానీ. కుదరలేదు ...అందుకే పెళ్లి అయిపోగానే తప్పించుకొని నీ కోసం వచ్చేశాను .నాకు. కొంచెం ..ఆందోళన గా ఉంది. నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళ వా? కొంచం భయపడుతూ అడుగుతుండగానే ..ఐశ్వర్య ..నేను కొంచెం బిజీ ...గా వున్నాను ..ఫ్రీ కాగానే నేనే ..ఫోన్ చేస్తాను ..అయినా..నీవు అలా పెళ్లి జరిపించుకొని తప్పించుకొని రావడం చాలా పెద్ద తప్పు చేశావు...సరే మనం కల్సి కూర్చొనిమొత్తం మాట్లాడుకుందాం .ఫోన్ పెట్టేశాడు. రాజేష్.

..అవునులే ..పెళ్ళి హడావుడి. అయిపోయి సర్దుబాటు లు ,సాగనంపడా లు లో బిజీ అయుఉంటాడు లే అని సర్దిపెట్టుకొని ఇక తన ఉద్యోగ. .రొటీన్ లోపడిపోయిందిఐశ్వర్య. ....రోజులు గడుస్తున్నాయి .ఇదివరలో లా ...రాజేష్ పలకడం లేదు ...ప్రవర్తన లో చాలా తేడా వచ్చింది అనుకొంటూ ఆలోచనల్లో పడిపోయింది ...అస్సలు ఎందుకు ఇలా ?తెలుసుకోవాలని గట్టి పట్టుదలతో ప్రయత్నం చేస్తుంది..మళ్ళీ కొద్దిరోజులు..ఆగి మళ్ళీ ..ఫోన్ చేసింది ....హలొ ఎవరండీ..... మేడం...నాకు రాజేష్ ..కజిన్ అతని ఫోన్ నా దగ్గరే ఉంది ..అతను బిజీ గా ఉండటం వల్ల ఫోన్ నా దగ్గరే ఉంచేస్తున్నాడు ..నేను మీరు చేశారని తప్పకుండా చెబుతాను ..ఉంటా మేడం ..ఫోన్ పెట్టేశాడు ఆవల వ్యక్తి ..ఇక ఫోన్ నేను చేయను ..వేస్ట్.. చేస్తే తాను చేస్తాడు ..లేకపోతే లేదు ..ఫోన్...సోఫా లో విసిరింది ఐశ్వర్య....మళ్ళీకొద్ది రోజులు గడిచాయి ....ఏమిపాలుపోని ఐశ్వర్య. ..అన్ని విషయాలు వదిలేసి ..ఆఫీసు కు వెళ్ళీ బుద్దిగా పనిచేసుకుంటూపోతొంది. ...

ఇంతలో ఆఫీస్ వాళ్ళు ..అమెరికా వెళ్ళాల్సిన పని బడింది మేడమ్ ..ఒక ప్రాజెక్టు డీల్ కోసం మీరు వెళ్లి వస్తారా ? అంటూ. ప్రపోజల్ తెచ్చారు ...నేను వెళ్లలేను ఇంకొకరిని పంపించుకొండి ..కాస్తంత విసుగ్గా చెప్పేసింది .ఐశ్వర్య....అలా కొద్దిరోజులు గడవగానే ...ఒకరోజు. .ఫోన్ లో వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడుకొంటున్నారు ..అవును నువ్వు రాజేష్ పెళ్లికి వస్తావని అనుకున్నాను ..నువ్వురాలేదు ..నేను ఒకరోజు అక్కడ వున్నాను ..పైగా రాజేష్ వాళ్ళు మాకు దూర పు బంధువులు కదా ..అవును ..రాజేష్ కూడా మంచి సంభంధం కుదిరిందిఅని టాక్ వచ్చింది.. అదికూడా మంత్రి గారి పి.ఏ . కూతురు అట మంచి రిచ్ పార్టీ అనిచెప్పుకుంటున్నారు ..అని ఫోన్ లో తన ఫ్రెండ్ చెబుతుండగానే ..ఒక్కసారిగా ఐశ్వర్య తల పై పిడుగు పడినంత పని అయ్యింది.. ఒక్కసారిగా ఆమె కంఠం జీర్ పోయింది.. సరే ...ఇంతకీ మనం ఎప్పుడు ..ఎక్కడ కలుద్దాం అని తన ప్రెండ్ అడుగుతున్నా ....ఏమీ మాట్లాడలేక కళ్ళల్లో ..నీళ్ళు వత్తుకుంటూ బాధ ను దిగమింగుతోంది..ఐశ్వర్య. ఏమే ఐశ్వర్యా ..వినిపిస్తుందా ..ఏమి మాట్లాడవేం....అవతలనుంచీ గట్టిగా అరుస్తోంది ఆమె ఫ్రెండ్ ....ఓ.కె నే ...సిగ్నల్స్ మంచిగా లేనట్లుగా ఉన్నాయి .నువ్వే వీలు చేసుకొని ప్లాన్ చేయి ఒకసారి కలుద్దాం ఉంటానే బై...అని అవతల మాట్లాడిన ఫ్రెండ్ ఫోన్ పెట్టేసింది .

చాలాసేపు ఆలోచనలలో మునిగిపోయింది. అందుకేనేమో ...తన తప్పు నా మీద నెట్టి నన్ను తెలివిగా వదిలించుకుంటున్నాడు . రాత్రి వేళ నిద్ర పోకుండా. ..కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఉంది ..తెల్లవారింది. అతని దగ్గరకు వెళ్ళి నిలదీయాలనుకొంది .....ముందు ఫోన్ చేసింది స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది . వెళ్లి తే ?ఏమిలాభము? ఏదో కధ వినిపిస్తాడు ...సారీ చెబుతాడు ..అంతేగా ..అయినా పట్టువదలకుండా మెసేజ్ లు పెడుతూనే ఉంది... కొద్దిరోజులు గడిచిపోతున్నా మెస్సేజ్ కి జవాబు రాలేదు . తమ్ముడు పెట్టినట్లుగా ఒక మెసేజ్ పెట్టాడు రాజేష్ కి పెళ్ళి జరిగిపోయింది అని ...మీరు రాజేష్ ని మరిచిపోవడం మీ జీవితానికి చాలా మంచిది అనే మెస్సేజ్ చదివాను .రాజేష్ ని చాలా. చాలాఅసహ్యించుకున్నాను. రీయల్లి ఐ. హేట్ హిం ఇంటికి వెళ్ళీ. అంతా నిలదీయాలని. అనుకున్నాను.కానీ..నేను అంత మాస్ కాను నేను ఒక్కదానిని ఏమి చేయగలను .ఏ పోలీస్ సహాయం తీసుకున్నా కూడా నేను గెలవలేక పోవచ్చు ఆయునా అతగాడి మనస్సులో నే ..నాకు స్థానం లేనప్పుడు. ఎలాపోరాడినా ఏమి లాభం అనుకున్నాను .మంచి సంబంధం ..చూసి అమ్మ నాన్నలు ఘనంగా పెళ్ళి చేయాలని చూశారు ..కానీ వాళ్ళని మోసంచేశాను కానీ నేనే గోతిలో పడిపోయాను పెద్దలు చెప్పినట్లు వినని నా లాంటి వాళ్లకు ఇదోగుణ పాఠం .మరి పెద్దలు చేసినవి కొన్ని ఇలా జరగవా అని అనుకున్నా ....అలా వాళ్ళ పెద్దరికంలో ఇటువంటివి జరిగితే పెద్దవాళ్లే అండగా నిలబడి బైటకు లాగుతారు అస్సలు ఆ ధైర్యం , ఆ. సందర్భం అదంతా ఒక పద్ధతి ...కానీ ఇది అలా కాదు ఇదంతా ఆశాస్త్రీయము. మంచిగా చదువుకొని పైకి రమ్మని ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు నమ్మారు .కానీ నా లాంటి వాళ్ళు ..పెళ్లిచూపులు ,పెద్దలు చూసే సంబంధం..ఆ కొత్త పరిచయం ..అంతా. నాన్సెన్స్ ..పాత చింతకాయపచ్చడి ..ఈ. ప్రేమ ...దోమ. అని మా జీవితాలలో మేమే ..నిప్పులు పోసుకుంటున్నాం. ఇలా ఆలోచనల సుడిగుండంలో పడి గిరా గిరా తీరిగిపోతొంది . ఇక ..అమ్మా... నాన్నదగ్గరకి నేను ఎలా వెళ్ళ గలను ...నా ముఖం ..ఇకవాళ్ళకు ..చూపించలేను .అలా ఎన్నో నిదుర లేని రాత్రుళ్ళు ఆలోచించి ఐశ్వర్య డిప్రెషన్ లో మునిగి తేలుతుంది .

ఒకరోజు దేవాలయం లో ప్రశాంతం గా దేవుని ఎదుట ధ్యానంలో కూర్చుని ఉంది .ఆమె మనస్సు దేవుని తిరునామం.శం ఖ చక్రాలు అలా ఆమె మనస్సు తిరుగుతూ ఉంటే ...అర్చక స్వామి పిలిచి పూవ్వులుపండ్లు చేతిలో పెట్టాడు చూడండి అమ్మా... మీరు త్వరగా అమెరికా వెళ్లి....మాకు కూడా దారి చూపిస్తే అక్కడ కూడా మా స్వామి వారి ఆలయాలు ఉంటాయి. మేము కూడా వచ్చి అక్కడ స్వామివారి సేవ ... వారి దయతో ఇంకాస్త డబ్బులు కూడా సంపాదించుకుంటాం కదా ...చిరునవ్వుతో లేచింది.నమస్కారం చేసి తన ఆఫీస్ కు వెళ్ళిపోయింది. ఇక మేనేజర్ ద్వారా ఇదివరలో వచ్చిన అమెరికా చ్ఛాన్స్ మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఎట్టకేలకు. ..కంపనీ తరుపున వర్క్ పర్మిట్ తో అమెరికా లో జీవితం ప్రారంభం చేసింది .తన జీవితంలో కి తొంగి చూసిన రాజేష్ ని మనో ఫలకం నుంచి తుడిచి వేయడానికి చాలాకాలం పట్టింది ....మెల్లగా కొత్త జీవితం ,కొత్తవాతావర్ణం లో పడిపోయింది. ఐశ్వర్య .ఇక అప్పటినుంచి మగాళ్లు అంటేనే ఒక అసహ్యం, ఒక అభద్రత.....తన పని తాను చూసుకొని ఇంట్లో ఉండిపోయేది .తన స్నేహితురాలు అందరికి పెళ్లి అయిపోయిందని భర్త ..అత్తగారు వాళ్ళంతా ఇండియా లో ఓ మారుమూల కు గ్రామం అనిచెప్పేది. అలా కొంతకాలం గడిచిపోయింది .

తల్లిదండ్రులు ...చాలాకాలం. దిగులు తోనూ, ఇంకోపక్క పరువు తీసింది అనే కోపం తో ను ఎక్కడికి , కనీసం బైటకు పోలేక ,ఎవరికి చెప్పుకోలేక కాలం గడుపుతూవున్నారు . కొద్దీ సంవత్సరాలు యూ.యస్ లో వున్నాను. ఇంతలో వీసా టైం ముగిసింది .మా ఆఫీస్ వాళ్ళు వీసా పొడిగింపు కోసం ఏర్పాట్లు చేశారు నేనే అక్కడ ఉండలేక తిరిగి ఇంటికి బయలుదేరి వచ్చాను ..కొద్దీసంవత్సరాలు గడిచిపోవడం తో అమ్మ ఏడుస్తూ నన్ను లోపలికి తీసుకెళ్లింది. మా నాన్నగారు మాత్రం ...ఇప్పుడు ఎందుకు వచ్చావ్ ...బ్రతికిఉన్నారా? చచ్చారా?అని చూడటానికి వచ్చావా? నాకు ఉన్న పరువు ...ప్రతిష్ట..తర.. తరా ల నుంచి ఉన్న గౌరవం అన్నీ మంట కలిపేశావు కదవే. తిడుతూ ..నాతో .ఆ రోజు ..నుంచి మాట్లాడం మానేసారు. చాలా కాలం తరువాత. మా అమ్మ ..నా జీవితం యూఎస్ వెళ్ళడం.. ముందు వచ్చిన సంబంధమ్. లోని లోటు పాట్లు ఏవో కధలు అల్లి మళ్ళీ నాకు ...మా నాన్నగారి కి మాటలు కలిపింది. .ఇక అప్పటినించి నేను నా డబ్బులతో ఇల్లు ,..కారు కొనుక్కున్నాను...కాకపోతే ..నేను డిప్రెషన్ లో పడి పోయి కాస్తంత మందు అలవాటు చేసుకొని నిద్రపోతున్నాను ...నాకు.. ఏమి చేయాలో,..అర్ధం కావడంలేదు. అలానే మా అమ్మా.. నాన్న కు కూడా ఏమి చేయాలో పాలుపో క.. పాపం దీనం గా ..జీవితం గడుపుతున్నారు. 

 మా అన్నయ్య ది అది ఒక రకం కధ ..మా వదిన కు పనికిరాని ఇగో ..ఎంతసేపు వాళ్ళవాళ్ళని నెత్తిన పెట్టుకుంటుంది .మా అమ్మా.. నాన్నగారిని అస్సలు గౌరవించదు .మనమడిని కూడా కాస్తంత ఎత్తుకొని ముద్దాడాలని అనిపిస్తుంది కదా పెద్దవాళ్ళకు దగ్గరకు ..రాగానే లాక్కొని తీసుకెళ్ళిపోతుంది. అస్తమానం ఏవో గొడవలు తో కొట్లాటలు ...వాటిని...సరిదిద్దటానికి మా అమ్మా... నాన్నలు పరిగెడుతూఉంటారు .మా ....కుటుంబం సరిదిద్దటానికి ఏ దైనా దేవుడు అవతారం వస్తే బాగుండు అని మా నాన్నగారి ...దైవప్రార్ధనలు. ఇలా తన ఫ్లాష్. బ్యాక్ ..ఒక మూడు గంటల సినిమా చూపించింది ఐశ్వర్య .
అయ్యబాబోయ్.. నాకు ..మాత్రం అస్సలు ..రెండు మూడు. సినిమాలు కలిపి చూసినంత పని అయుంది ...తల దిమ్మెక్కి పోయింది ..అమ్మాయి గారు ..కాస్త. టీ కానీ కాఫీ కానీ వేడి వేడి గా ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది .దీనంగా ఆడిగాడుసాయిచంద్ర. ఓ. కె దానికి అంత ప్రార్ధన అవసరం ..లేదు లేండి అబ్బాయుగారు అని దీర్ఘం తీస్తూ ఇంటివైపు కి నడిచారు వాళ్లిద్దరు.



అవును ...సాయిచంద్ర గారు ...మరి మా గత జీవితం అంతా చెప్పించుకొని చక్కగా వినేశారు .మరి మీది కూడా గత జీవితం తాలూకు ..ప్రేమ కథ లు ఉన్నాయి అని ఒకళ్లకు ..ఒకళ్ళం చెప్పుకొని బాధ పంచుకోవాలి అన్నారు .మరి మీ కథ ఏమిటో. ..మాకు చెప్పరా? కొంచం చిలిపిగా కళ్ళలోకి చూస్తూ అడిగింది ఐశ్వర్య ...చెబుతాలేండి ..కానీ ఇక మీరు పెళ్ళీ చేసుకోరా ? మొహం ఆశ్చర్యం గా పెట్టి అడిగాడు .సాయిచంద్ర ...భలే..వారండి ..ఈ త్రాగుబోతు ..ఈ ..అమ్మాయి ని ఇంకా ఎవరు వచ్చి చేసుకుంటారు లేండి ? కొంచం నిట్టూర్పు గా చెప్పింది ఐశ్వర్య ....భలే వారు మీరు ..జీవితం అంటేనే సమస్యలు .కొంతమందికి అవి ఇంకాస్త ముదిరి సుడిగుండాలుఅవుతుంటాయి ..చీకటి లో నడుస్తూవుంటాం ..కానీ కొంతకాలానికి వెలుగులోకి వెళ్తాము ...కష్టం తరువాత సుఖం ఉండొచ్చుగా .వరదల్లో కొట్టుకుపోతున్నవాడికి ...ఏదో ఒక మండో, చెట్టు లేక తాడో ఏదయినా ఒకటి తగిలి రక్షింప బడతామేమో ..ఎవరు చెప్పొచ్చారు ?..అలా చెప్పుకుంటూ పోతున్న సాయిచంద్ర మాటలకు అడ్డు వచ్చిన ఐశ్వర్య ..చూడండి సార్ మా జీవితాలు అస్సలు వెలుగు ఉంటే కదా మావి దారి తప్పిన,గాడి తప్పిన జీవితాలు ...నిట్టూర్చింది. ....


కాదు మేడం ..మనిషి ఆశాజీవి ..రేపు సుఖపడతాము అని కలలు కంటాడు. తప్పదు కనాలి .మనకంటే ఘోరమైన సమస్యలు వున్న వాళ్ళు చుట్టూ చాలామంది ఉన్నారు ...మనం వాళ్ళకంటే బెటర్ అని లెక్క వేసుకోవాలి ..ఎవడో ..ఒకడి గురించి ..మన జీవితం ఆపుకోకూడదు ..ఆగిపోకూడదు. .నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి ..మీరు ..రాజేష్ కోసం పెళ్ళి తరువాత తప్పించుకొని వెళ్ళారు ...మిమ్మల్ని ..మోసం చేశాడు ..మీరు ఏ అఘాయిత్యమో చేసుకొని ఉంటే ...మీరు నిజముగా ఓడిపోయునట్లే ..కానీ మీరు ధైర్యము తో , యూ.స్.వెళ్ళిపోయి కొంతకాలం బ్రతుకు లాగారు అది సమస్య పై పోరాటం కానీ ఖలేజా గాని ..అది ఛాలెంజ్ అంటే ..మన మనస్సు ఎన్నో రకాలు గా ఉంటుంది ..అన్నీ కూడా మన మనస్సు బట్టి చేయలేము ..బ్రతుకు బాగుండకపోతే మనస్సు ఏం చెబుతుంది ...చచ్చిపోవచ్చు గా అని పిరికితనం ..నూరిపోస్తుంది ..అందుకే బుద్దిని ..దార్లోపెట్టుకొని ...మనస్సుని మంచిదారివైపుకు లొంగతీసుకోవాలి ..పిచ్చి పిచ్చి గా ఆలోచిస్తున్న మనస్సుని ..కళ్ళెం. తో బిగించాలి ..ఎటువైపు పడితే అటువైపుకు వెళ్ళనివ్వకూడదు ...అందుకే చూడండి ..ఏదైనా తప్పు చేస్తే ...ఏమిరా ...నీకు మనస్సు. ఉందా? ...అని ఎవ్వరూ అడగరు ...నీకు బుద్ధిఉం దా? అంటారు ...దానినే ఇంటలెక్టువల్ ...అని అంటారు ..అలా. ..తనకు వచ్చిన భావన లను ఆమెకు భోధిస్తూ .....మధ్యలో మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు ?సాయిచంద్ర ....అవును మేడం ..మీరు మధ్యలో వెళ్ళీ పాపం పెళ్లిపీటలు పై కూర్చోని వాళ్ళ ని ఇబ్బందులకు గురి చేస్తే ఎలా మేడం? ..అవునండీ... ఏమి చేయమంటారు ?నేను ముందుగా అంతా మాట్లాడి ముందే తప్పించుకొని వెమని ఎంతో ..ప్రయత్నం చేశా ..కానీ ..కుదరలేదు ..పైగా ..ఆ పెళ్ళికొడుకు గారు ..అస్సలు చాలా కొద్దిటైం మాత్రమే గడిపి మళ్ళి కనిపించలేదు .అంటూ. ఐశ్వర్యచెపుతుంటే ..అవునులేండి ....మీకు అస్సలు ఏమిచేయాలో కూడా ఆలోచన రాకపోయుండ వచ్చు...సాయిచంద్ర .కొంచం గట్టిగా అన్నాడు ..ఏమోలెండి... మొత్తానికి ..వాళ్ళ కుటుంబానికి కూడా కష్టాలు ,నా వల్ల అవమానాలు చాలా పడ్డారు ...నేను ..అలా చేసి ఉండాలసింది ..కాదు .ముందే ఖరా ఖండిగా నాకు వద్దు , నేను చేసుకోను అని చెప్పాల్సి ఉంది...భగవంతుడా... నన్ను క్షమించు. అని దండం పెట్టుకుందిఐశ్వర్య.


ఏమిటి ..సాయి చంద్ర గారు భుజం అంత వాచి పోయింది ..ఏది ..కొంచం. చూపించండి ..ఆందోళన గా అడిగింది ...ఐశ్వర్య... చొక్కా కొద్దిగా విప్పి..చూసుకున్నాడు ....అవునండీ ...కొద్దిరోజులు. ..క్రితం మిమ్మలిని రక్షించడానికి కిరిటీ లో నుంచి దూకినప్పుడు ..ఆ ..కిటికి కమ్మీ బలంగా తగిలింది ..దెబ్బను చూసుకొంటూ చెబుతున్నాడు సాయిచంద్ర .ఉండండి... ఇంట్లో పెయిన్ ఆయుల్ ఉంది ...అంటూ వెళ్ళితీసుకుని వచ్చింది ఐశ్వర్య . చేయు లో వేసుకొని రుద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు .సాయిచంద్ర..సార్ ...మే ..ఐ...హెల్ప్.. యు కొంటెగా అడిగింది ...ఏమో మేడం .బాగుండదే మో ..నసుగుతున్నాడు సాయిచంద్ర ..బలేవా రండి. నేను రూము లో పడిపోతే మీరు నన్ను ఎందుకు కాపాడారు .గట్టిగా అడిగింది ఐశ్వర్య ..ప్రేమ ...అదేనండి .మానవత్త్వపు ప్రేమ ...కొంచముసిగ్గుపడుతూ చెప్పాడు సాయిచంద్ర .ఓ...అదేనండి. ..ఇప్పుడు మాలోను అదే ..షర్ట్ తీయండి ..అంటూ ఆయుల్ మర్దన చేస్తోంది ఐశ్వర్య...తనకు ఏమిటో కొత్త..కొత్తగా అనిపిస్తోంది ..సాయిచంద్రకు...అలానే ఎవరో పరాయి పురుషుడి భుజం ..వీపు పై రాస్తూ ఉంటే కూడా ...కొత్త... కొత్త ..సిగ్గులు ..ముఖం నిండా పువ్వులై ముడుచుకుపోతున్నాయి.... సిగ్గు..పడుతూ చాలు అమ్మాయిగారు ...కులుకు తూ చెప్పాడు ..ఏమిటండీ ....అబ్బాయుగారు .పర్వాలేదేమో ...ఇంకొద్ది సేపు రాయవచ్చేమో..కొంటెగా ముఖం పెట్టింది ఐశ్వర్య.

.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online