Pages

Hues of Love (a short story) part - 1


[ ] వర్షం బాగా పడుతో0ది. పెద్ద మట్టి రోడ్డు పై ఓ ఎర్ర బస్సు వచ్చి ఆగింది .అందులొంచి ఓ జెంటిల్ మాన్ దిగాడు .అతగాడి పేరు సాయిచంద్ర .ఆత్రుతగా ఓ షెడ్ లోకి పరిగెత్తాడు .ఓ డైరీ తీసి ఆత్రుత గా అడ్రస్ వెతికి పట్టుకున్నాడు.ఇంతలో వర్షం తగ్గుముఖం పడుతుంది.. అడ్రస్ చూస్తూ రోడ్డు పైకి వచ్చాడు .ఎదురుగా వచ్చిన ఓ పెద్ద కార్ అతగాడిని తాకపోయి తప్పుకొని బురద నీళ్లు ఒళ్ళుఅంతా చిమ్మింది.ఒక్కక్షణం తన స్పెటికల్స్ తీసి అవ్వాకు అయ్యాడు . ఆవేశం తో ఏదో తిట్టాలని ,కోపంగా అరవాలని అనుకొనేంతలో ,కారు కొంచం వెనక్కి వచ్చి0ది. గ్లాస్ కొంచెము దింపి హలో ఎస్క్యూజ్ మీ ఐ యాం వెరీ సారీ ,ఇట్ ఈజ్ రైనింగ్ కదా కొంచం విసురుగా మళ్ళీ దూసుకువెళ్ళి పోయింది. ఓ అందాల భామ .


[ ] కొద్ది సేపు వరకు అలానే చలనం లేకుండా మొద్దుబారిపోయాడు సాయిచంద్ర. అస్సలు ఏమి అందం ,ఏం పర్సనాలిటీ నాలో ఇప్పటి వరకు ఇంత పులకరింత ఎప్పుడు కలగలా? అస్సలు కారు నెంబర్ నోటు చేసుకుంటే ఎలా ఉండేది .అరే వెరీ బ్యాడ్ లక్ .అంటూ ఈ పెళ్లి కాని ప్రసాద్ ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరటం లేదు.అటువంటిది ఇక నాకు ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందా?ఏమో ఇది ఒక స్వీట్ డ్రీమ్ అనుకోని వదిలేస్తే పోలా .అయినా కలలు కనండి అని వక పెద్దాయన చెప్పారుగా కందాములే .రెండు నిట్టూర్పులు విడిచి ,గాగుల్స్ తగిలించుకుని చకా, చకా, ముందుకు సాగిపోయాడు. 


1. బాబు రామన్నపాలెం ఎటుగా వెళ్ళాలి చెబుతారా?అంటూ అక్కడ అందర్నీఅడుగుతున్నాదు సాయిచంద్ర .అదిగో సారూ అటువెళ్లండి ఆ మట్టి రోడ్ లో ఓ రెండు కిలోమీటర్లు నడిస్తే వెళ్ళి పోవచ్చు అని చేయు చూపిస్తూ చెప్పాడు ఒకాయన. సన్నని సూదిచినుకలలో అడుగులు వేగంగా వేస్తున్నాడు కొద్దిదూరం వచ్చి చుట్టూ ఒకసారి కలియ చూశాడు. ఎటువైపు చూసిన పచ్చని కొండలు ,మైదానాలు, కాస్తంత బురద, కాస్తంత నీళ్ళు, ఎత్తయిన గుబురు చెట్లు..అలానే చూస్తూ ,చూస్తూ ఎలానో అలా కాస్తంత బురద ను కాళ్లకు పట్టించుకొని ఊరు చేరాడు. 


2. సార్ ఇక్కడ లక్ష్మీ పతి రావు గారి ఇల్లు తెలుస్సా అడ్రస్ చూపించి అడిగాడు .సాయిచంద్ర. బలే వాడివి సారూ ఆ కనపడే పెద్ద బంగ్లా అదే గా ఇక్కడ ఒకప్పుడు బాగా. పేరున్న సర్పంచ్ గారు.....అయ్యబాబోయ్. చుట్టుపక్కల అన్నీ పొలాలే .ఒక్క ఇల్లు కూడా లేదు .ఊరి మొదట్లోనే ఇల్లు కట్టేసుకున్నారు.
3. మెల్లగా గేటు కొట్టాడు .కుక్కలు ఏమి లేవు అని నిర్ధారించుకున్నాడు. ఇక గేటు తీసిమెల్లగా లోపలికి నడుస్తున్నాడు.సాయిచంద్ర. ఏమండీ ఎవ్వరు మీరు ఎవ్వరు కావాలి మీకు ,కుక్క ని గట్టిగా గొలుసు చేత్తో పట్టుకొని ఎదురు వచ్చి అడిగాడు రామయ్య .బాబూ లక్ష్మీపతిదొరగారి ఇల్లు ఇదేనా కొంచం ఆతృతగా అడిగాడు సాయిచంద్ర. ఆ. ! అవునండీ. దొరగారు లోపల వున్నారు .మీరు కొంచం ముందుకువెళ్లి అక్కడ ఇంకో గేట్ ఉంటుంది అది తీసుకొని వెళ్లి హాల్ లో కూర్చో0డి. వినయంగా చెప్పాడు రామయ్య. కొద్దిసేపటి తరువాత పనివాళ్ళు మంచినీళ్లు తెచ్చి ఇచ్చారు ..పేపర్లుతిరగేస్తూ అటూ ఇటూకలియ చూస్తున్నాడు సాయిచంద్ర.


కొద్దిసేపటి తరువాత కొద్ది మంది ని వెమ్మటి పెట్టుకొని ,వాళ్లకు పనులు పురమాయిస్తూ ,వాళ్ళ అందరిని పంపిచేసేపనిలో హడావిడిగా వున్నాడు దొరగారు. అది గమనించిన సాయిచంద్ర లేచి నిలబడ్డాడు . ఇటువైపే చూస్తూ వస్తున్న పెద్దాయన ను గమనించాడు తెల్లగా మెరుస్తూవున్న దేహ చ్చాయ, ఖద్దరు చొక్కా మెడలోతులసీమాలలు నుదుటన ఎర్రని నిలువుబొట్టు ,ఆజానుబాహుడు పెద్ద అంచుల పంచ కట్టి దగ్గరగా వచ్చాడు .నమస్కారం అండీ చేతులుజోడించాడు సాయిచంద్ర .మీరు ఎవరు బాబు ,నాతో ఏమైనా పనిబడిందా ?గంభీరంగా అడిగాడు దొరగారు. నేను లక్ష్మీపతిరావు గారిని కలవాలని వచ్చానండి .వినయంగా చెప్పాడు సాయిచంద్ర. . కూర్చోండి నేనే ......చెప్పండి బాబు .కంచు కంఠం తో చెప్పి పెద్ద పడక కుర్చీ లాక్కొని కాలు పై కాలు వేసుకొని కూర్చున్నాడు. సార్ నా పేరు సాయిచంద్ర ,మా నాన్నగారు గోపాల్ నేను వ్యవసాయ విశ్వవిద్యాలయములో పరిశోధనా శాస్త్రవేత్త మీరు ఏదో ఓ కొత్త వరి విత్తనాలు తెచ్చి పంట లు వేశారట .దానిని పరిశీలించి సినాప్సిస్ వ్రాసుకోవాలి అని వచ్చాను .మీరు అనుమతిస్తే మీ పొలం దగ్గర ఉండి పరిశోధన ప్రారంభిస్తాను .వినయంగా అడిగాడు సాయిచంద్ర. .....

.పైనుంచి క్రిందికి. .... క్రింది నుంచి పైకి పరిశీలన గా చూస్తున్నాడు లక్ష్మీపతి రావు. హీరో అనిపించే చక్కని పర్సనాలిటీ ,కోటేరు ముక్కు, కోలముఖం చక్కని సరిపడా విగ్రహం ,ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడటం, ఒకరిని బాధపెట్టకూడదు అనేలా అతని నడవడిక ,మంచి డ్రెస్ ,దానికి తగ్గ వినయం , అన్నీ క్షణాల్లో చదివేశాడు లక్ష్మీప తి రావు. ......ఆ ... అవును మీ స్వగ్రామం ఎక్కడా? అదే మీరు. నేటివ్ ప్లేస్ అంటారే అది కొద్దిగా నవ్వు తూ అడిగాడు లక్ష్మీపతిదొర. .రాజా నగరం అండీ .ఇక్కడకు మూడుగంటలు ప్రయాణం పడుతుంది .సార్.మెల్లగా చెప్పాడు సాయిచంద్ర. నాకు ఎందుకు తెలియెదయ్యా ,ఇంతకీ మీ నాన్నగారి పేరు ?తనకు ఆ ఊరు మొత్తం తెలుసు అన్నట్లు ఉత్సాహంగా కండువ దులిపి ముందుకు వంగి ...అడిగాడు దొరగారు . మా నాన్న గారి పేరు గోపాలం . ...సార్ చెప్పాడు. సాయిచంద్ర ఆ......సన్న గా ,ఎత్తుగా ఉంటారు ,దేవాలయం పక్కన ఇల్లు చెప్పుకొంటూ పోతున్నాడు దొరగారు... ఆ. ..... ఆ... ఆవును సార్. ...ఆవును అవును . మీకు తెలుస్సా ఆశ్చర్యంగా అడిగాడు సాయిచంద్ర .అదేమిటి బాబు చిన్న తనం లో మీ తాత గారు తాళపత్ర గ్రంధాలు తీసుకొని ఎడ్ల బండి పై ఈ గ్రామాలు అన్నీ తిరిగేవారు .ఆ తాళపత్ర గ్రంథాలలో మా లాంటి వారి వంశవృక్షాలు ,కుటుంబ సభ్యుల సమాచారం వ్రాసి ఉండేవి .గ్రామాల్లో తిష్ట వేసి అందరికి పురాణ విషయాలు, దైవానికి సంభంధించిన నాలుగు ముక్కలు చెప్పి దేవాలయాల్లో ఉత్సవాలు జరిపించి ,కొంతమందికి భగవద్ నామ0 ,మంత్రో పదేశం చేసి ,వెళ్తూవుండేవారు.. అన్ని కులాలవారు ఆయన గారికీ శిష్యులుగా ఉండేవారు .భగవంతుని శరణు జొచ్చి ఆయన పాదాలు పట్టుకో0డి మంచి జరుగుతుంది అని చేప్పేవారు .ఇంతకీ మీ నాన్నగారు ఎలా ఉన్నారు ? జ్ఞాపకాలను కొద్దిసేపు వల్లె వేసుకొని ఆర్తిగా అడిగాడు దొరగారు. బాగానే ఉన్నారండి " చిరునవ్వుతో చెప్పాడు సాయిచంద్ర. .......

మరి ఇంతకూ మీ చదువు అదే పరిశోధన ఎక్కడ ? " మళ్ళీ ఉత్సాహంగా అడిగాడు. " నేను హైదరా బాద్ లో,వ్యవసాయ విశ్వవిద్యాలయం లో పరిశోధన చేస్తున్నాను, అక్కడే హాస్టల్ లో .ఉంటున్నాను సార్ . చెప్పాడు సాయిచంద్ర . రామయ్యా ......పెద్దగా పిలిచాడు లక్ష్మీపతిదొరవారు. 

3. దొరగారు ......అంటూ ....క్షణాల్లో ఆయన ముందు వాలిపోయాడు సేవకుడు.. మరి ఏమి లేదు కానీ ఈ అబ్బాయిగారు మనకు దగ్గరి వాళ్ళు ,కావాల్సిన వాళ్ళు ,మన గురువులు కి సంభందించిన వాళ్ళు వీరికి పైన ఏదైనా ఒక ఖాళీ గా ఉన్న రూమ్ చూపించు ఆర్డర్ వేశాడు దొరగారు ...... పర్వాలేదు సార్ నేను ఎక్కడైనా బైట నేను రూమ్ చూసుకొంటాను .మీరు నా కోసం శ్రమ తీసుకోకండి .వినయంగా చెప్పాడు సాయిచంద్ర .బలే వాడివి బాబు మీరు మా అతిథి ,ఇక్కడకు మా ఇలాకాలో కి వచ్చిన తరువాత మేము చెప్పిందే మీరు వినాలి పెద్దగా నవ్వుతూ చెప్పాడు దొరగారు. పైగా మీకు పక్కనే మన పొలం మీకు రీసెర్చ్ కి కూడా మీకు టైమ్ బాగా కల్సివస్తుంది. పదండీ అంటూ గట్టిగా చెబుతూ అక్కడనుంచి వెళ్లి పోయాడు లక్ష్మీపతిదొరగారు .....రూమ్ కి చేరుకొని తన లగేజీ సర్దుకొని రిలాక్స్ అవుతున్నాడు సాయిచంద్ర .....
• బాగా వర్షము పడుతొంది . రాత్రివేళ చాలా పొద్దుపోయింది దొరగారి ఇల్లు గేట్ లు వేసేసివున్నాయి ఒక పెద్ద కారు వచ్చి గేటు ముందు ఆగింది .తెగ హారన్ వాయంచేస్తున్నారు ." ఈ పనివాళ్ళు ఎక్కడ ఎడీశారో ఒక్కడు ,రాడు, గేటు తీయడు తెగ కోపం తో అరిచిపడేస్తోంది కారు లో ఆమె........ఇక ఆ సౌండ్ భరించలేని సాయిచంద్ర పై నుంచీ దిగి వచ్చి గేట్ లు తెరిచాడు .లోపలికి వెళ్ళిపోయింది కారు .చీకటి అందులోనూ బాగా వర్షము ,ఎవరో ,ఏమిటో ఏమీ కనపడలేదు ,అర్థం. కాలేదు గబగబా గేట్ లు వేసుకొని ,పైకి వెళ్ళిపోయాడు సాయిచంద్ర...........

• మరుసటిరోజు ఉదయం సాయిచంద్ర ని క్రింది కి పిలిపించారు దొరగారు. బాబు రండి అలా పొలం లోకి వెళదాం మా. వరి చేలు చూపిస్తాను.. అంటూనే పొలంవైపుకు బైట కు. నడవడం మొదలుపెట్టారు. బాబు మీరు పెళ్లి చేసుకున్నారా?అడిగారు దొరగారు. లేదండీ. ...ఈ. చదువు పరిశోధన పూర్తికాగానే పెళ్ళి చేసుకుందామని అని ఆనుకుంటున్నాను."చిరునవ్వుతో వినయంగా చెప్పాడు సాయిచంద్ర . ఏదైనా మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు బాబు కొంచెం దీనంగా అన్నాడు.... మన్నించాలి.... సార్ మీరు అలా ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు కొంచెం ముఖం ఆశ్చర్యంగా పెట్టాడు సాయిచంద్ర. అంతా తరువాత మీకే తెలుస్తుంది. కాదు కాదు నేనే చెబుతానులే ,భుజం పై ఉత్తరీయం ని సర్దుకొని జీరబోయిన గొంతు తో అన్నాడు దొరగారు.........." బాబు. అవును రాత్రి వేళ కారు హారన్ చాలాసేపు మోగినట్లు0ది. బాగా వర్షం పడుతొంది నేను వెంటనే లేచి రాలేకపోయాను .పనివాళ్ళు ఇద్దరు ఊరు వెళ్ళారు .ఒక్కడు వున్నాడు ,వాడికి ఎన్నిపనులు చెప్పగలం ,ఉదయం నుంచి అలసిపోయి ఉంటున్నాడు .ఆలా చెప్పుకొంటూ పోతున్నా.....దొరగారి మాటలకు అడ్డు వచ్చిన సాయిచంద్ర "పరవా లేదం డీ ,నేను వెళ్ళి గేట్ లు తీశాను. ఎవరో మేడం కారులో వచ్చారు .వర్షం పెద్దగా పడుతూఉండటం వల్ల నాకు స్పష్టం గా కనిపించలేదు., ఇక నేను లోపలికి వెళ్ళి పడుకున్నాను సార్ .వివరిస్తూ చెప్పాడు .." థాంక్స్ బాబు .......బలేవారండీ ....ఇంత చిన్న దానికి మనలో థాంక్స్ ఎందుకండీ .....


సరే బాబు ఇదే. ఆ రైస్ వంగడం చూడండి ..మొక్కలు అన్నీ బాగా ఎదిగాయు ,అంత పెద్దగా నాకు చీడ ఏమి కనిపించలేదు .అస్సలు చీడ పీడలు తట్టుకుంటుందనే ఉద్దేశంతోనే దీనిని వేశాం . ఒకరక మైన గడ్డి జాతి మొక్కలుకి మామూలు వరి కల్పి నేను తయారు చేశాను .చెప్పుకుంటూపోతున్నాడు దొరగారు. అస్సలు మీకు ఇలా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది.. నేను ,నా ఫ్రెండ్ వృక్షశాస్త్రము పి.జీ లో ఉన్నప్పుడే ఈ ఆలోచనలు వస్తూవుండేవి.. చాలా కాలం తరువాత మేము కలుసుకున్నాం .ఇప్పుడు అమలు చేశాం .అయితే మీరు కూడా పరిశోధకులే అవడం చాలా సంతోషం గా వు0ది. ఆనందం వ్యక్తం చేస్తూ చెప్పాడు. సాయిచంద్ర. 

బాబు మీకు ఒకమాట చెప్పనా రోజూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అస్సలు చదువు లేని వాళ్ళు పొలం పనులు కోసం ఎన్నెన్ని కనిపెడుతూవున్నారో , అస్సలు సిస్సలు ఐఐటీ లు ,ఎంటెక్ లు మేం టెక్నో క్రాట్స్ అని చెప్పుకోవడం ఎంతమంది ఏం కొత్తవి ఆవిష్కరిస్తున్నారు. పూర్వకాలంలో ఒక్క డాక్టర్ అన్ని రోగాలు నయం చేసేవారు ,ఇప్పుడు ఏ పార్ట్ కి ఆ స్పెషల్ డాక్టర్ పోనీ రోగాలు తగ్గిపోతున్నాయా?అదీ lలేదు .అన్నీ కనిపెడుతున్నారు ఓకే కానీ విపరీతమైన సైడ్ ఎఫక్ట్స్ .మందులు, ఎరువులు .అన్నీ రసాయనాలే. మనలోపలికి వెళ్ళిపోయి చిన్న వయసులోనే అనేక రోగాలు .ఆవేదన. గా చెప్పుకొంటూ పోతున్నాడు దొరగారు .అవునుసార్ గాలి,నీరు తిండి మొత్తం కాలుష్యం ,పూర్వకాలంలో గ్రామాలలో ఇంత వాస్తు పిచ్చి ఎక్కడవుంది అస్సలు భావి ఒకపక్క ,బాత్రూము లు ఎక్కడో ఒకచోట అన్నట్లుగా ఉండేవి. అయనా అప్పట్లో ఇన్ని రోగాలు లేవు తొంభై, వంద సంవత్సరాలు హాయిగా బ్రతికేసేవారుఅని మానాన్న గారు అంటూవుంటారు .ఎదో స్పీచ్ లా చెప్పేస్తున్నాడు .సాయిచంద్ర .బాగా చెప్పారు మీ వాళ్ళు"... ...కొద్దిసేపు. వరి చేలు చూస్తూ ఫొటోలు ట్రయి చేస్తున్నాడుసాయిచంద్ర. . నీకు అలా ఫోటో మంచిగ రాదు ఆ మొక్క నేను పట్టుకుంటాను ...ఆ ఇప్పుడు తీయండి బాబు. అలా వంగి వరిమొక్క ని పట్టుకున్నాడు . దొరగారు . చాలాసేపు పరిశీలన చేస్తున్నాడు సాయిచంద్ర ఇంతలో ఒక చెట్టుక్రింద ఉన్న పెద్ద రాయు పై హాయిగా కూర్చున్నాడు .దొరగారు. .కొద్దిసేపు. ప్రశాంతంగా గడిచింది..... ఇంతలో నడుచుకొంటూ వచ్చి దొరగారి దగ్గరలో కూర్చున్నాడు .సాయిచంద్ర .

ఇంతలో సెల్ ఫోన్ మ్రోగింది నాన్నగారు చెప్పండి....అంటూ ఇక్కడ లక్ష్మీపతి దొరగారు అని చెప్పనే వారి ఇంట్లో వున్నాను....వారే భోజనం పెడుతున్నారు . మీ గురించి అడుగుతూవుంటారు ఉండండి ఫోన్ వారికి ఇస్తున్నాను మాట్లాడండి .అంటూ ఫోన్ దొరగారికీ ఇచ్చాడు సాయిచంద్ర ." ! పునః పరిచయం ,కుశల ప్రశ్నలు అన్నీ మాట్లాడుకున్నారు .చివర్లో మాత్రం. అన్నయ్య గారు మా సాయి కి మీ కు తెల్సిన మంచి సంబంధం ఉంటే చెప్పండి ,మేము పెద్దవాళ్లం అయినాము తిరగలేకపోతున్నాం కొంచెం ఆతృత గా చెప్పింది సాయిచంద్ర తల్లి లలితాంబ ....కొంచెం ఆలోచనలో పడ్డాడు. కొంత ఆనందలోను పడ్డాడు. దొరగారు. 

ఏంటి ...సార్. మా. వాళ్ళు అప్పుడే మీకు పని చెప్పేసారా? అదే. ...సార్. పెళ్ళి సంభంధం .కొంచం చిలిపిగా నవ్వాడు సాయిచంద్ర. "అంతేగా ..బాబు పెద్దవాళ్లు అయిన తరువాత బాధ్యత లు తీర్చుకోవాలని ఆరాటపడుతుంటారు కదా .ఓకే ..... .బాబు .......మాకు ఒక బలమైన సమస్యతో బాధపడుతూ జీవితం గడుపుతున్నాము .నేను ఎప్పటినించో భగవంతుని ప్రార్థిస్తూనేవున్నాను .అందుకే మిమ్ములను పంపించి ఉంటాడు అనిపిస్తోంది. నా దృష్టిలో మీకు ఆ సామర్ధ్యం వుంది. చెప్పమంటారా బాబు ..కొంచెం బాధగా అడిగాడు దొరగారు. బలేవారండీ మీకు నా పట్ల ఇంత నమ్మకం పెట్టుకున్నారంటే నా పూర్వజన్మల సుకృతం ,మీ లాంటి పెద్దలకు ,ధనవంతులకు నా సహాయం ఏమిఉంటుంది . ......చేతులు జోడించి నమస్కారం చేస్తూ ..అడిగాడు ......సాయిచంద్ర"..........

..."బాబు. ...నాకు ఒక అమ్మాయి ,...ఒక అబ్బాయి వున్నారు .అబ్బాయి యూ ఎస్ నుంచీ వచ్చాడు .చెన్నై లో ఉంటాడు .వాడి భార్య శోభ వాళ్లకు ఒక కొడుకు వాడు నాకు ఏ విషయములోను సహకరించ లేక పోతున్నాడు .వాడికి కూడా. మేము సంభంధం ..వెతికి పెళ్లి. చేశాము.. కానీ ఎప్పుడూ ఏదో ఒక రకంగా కొట్లాడుకొంటూనే ఉంటారు. దాఖలాలు లేవు .మా అమ్మాయి ఎంటెక్ చదివింది ఆపై విదేశం వెళ్ళిఫుల్లు గా సంపాదించుకొని వచ్చింది. దగ్గరలోని సిటీలో ఒక ఇల్లు కొన్నది .ఒక్కొక్కసారి అక్కడకు వెళ్ళి వస్తూవుంటుంది .ఎప్పుడూ అర్థం ,పర్థం లేకుండా సీరియస్ గా వుంటుంది .ప్రతి రోజు అలా అలా కారు వేసుకొని అలా వూళ్ళు చూసుకొంటూషికార్ చేస్తూ వెళ్లడం రావడం ఇలా టైం పాస్ చేయడం. ...పెళ్ళి చేసుకోమంటే ఏవేవో సాకులు చెబుతుంది ..మగాళ్ళను నమ్మకూడదు అంటుంది. , బాబు మీరు ఈ నాటి యువతరం.... మీకు అయితే కొంత పరిస్థితి ఆమె అలా ఎందుకు మారిపోయింది ,ఇవ్వన్నీ మీరు కనిపెట్టగలరని , ఆ దైవమే పంపించాడేమో అని నేను భావిస్తున్నాను బాబు .మీరు నాకు ఆ సహాయం చేసి నన్ను మళ్ళీ పునర్జీవింప చేయండి .బాబు ......కొంచెం గద్గత కంఠం తో చేతులు జోడించాడు దొరగారు. ...ఇక ఆగండి. ..సార్ మీరు పెద్దలు ..మీరు మరీ అలా అయిపోకూడదు ..దైవాన్ని నమ్ముకున్న కుటుంబాలు మనవి ,మన పై ఆయన దయ ఎప్పుడూ వుంటుంది . నేను కష్టపడి అయినా మొత్తం తెలుసుకుంటాను .నాకు పరిచయం చేయండి ,మీకు ,మీ అమ్మాయి గారికి ఎలాంటి హాని చేయను ....అనే నమ్మకం వుంటేనే .."...కొద్ధి గా నవ్వుతూ చెప్పాడు సాయిచంద్ర. బలే వారు బాబు , భుజం పట్టుకొని మెల్లగా నవ్వాడు దొరగారు.పదండి ...బాబు ..లంచ్ చేద్దాం ...ఇద్దరు పొలం లోనుంచి ఇంటి ముఖం పట్టారు...

• బాబు ...ఈమె. నా. భార్య. . విమల ...అదిగో. ...వస్తూంది. అదిగో. మా. అమ్మాయి. ఐశ్వర్య ...రామ్మా ...మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు అని చెప్పాగదా....... బాబు ...మా అమ్మాయి .పరిచయం చేస్తునారు దొరగారు .......నమస్కారం...అండీ చిరు నవ్వు ఇస్తూ చెప్పాడు సాయిచంద్ర. నిన్ననే గా కారుబురద చిమ్మినప్పుడు సారీ కూడా చెప్పాను .ఇక్కడ ఊడిపడ్డాడు విషయం అంతా నాన్న గారి తో చెప్పాడా ,ఏమిటి? ఆలోచనల్లో పడింది ఐశ్వర్య ..ఏమిటమ్మా పరధ్యానం ......బాబు విష్ చేస్తున్నాడు ...వారి పేరు సాయిచంద్ర..... .పరిశోధనా శాస్త్రవేత్త ..ఆ. ...ఆ. నమస్కారం అండీ ...చిరునవ్వు తెప్పించుకుని చెప్పింది....... ఓ...అవునులే నిజంగా అందగత్తె .....కారు దగ్గర మిస్ అ య్యాను అని తెగ బాధపడిపోయాను . తాంక్ గాడ్ ...ఐశ్వర్యా ...ఇక నీ పని తే లుస్తా గా మనస్సులో గొణుక్కున్నాడు సాయిచంద్ర ..పరిచయాలు,. కుటుంబ విశేషాలు ,చదువులు అలా ఒకసారి భూగోళం అంతా చుట్టి వచ్చారు.గబ గబా లంచ్ పూర్తిచేసి లోపలికి వెళ్ళిపోయింది ఐశ్వర్య ..మంచిదండీ. ...నేను నా రూమ్ లో రిలాక్స్ అవుతానుఅంటూ వెళ్ళిపోయాడు సాయిచంద్ర. ......ఏమండీ ...అబ్బాయి. ..చాలా నిదనస్తుడిలా ,మంచి ప్రవర్తన కలవాడి గా కనిపిస్తున్నాడు .....చిన్న స్వరంతో ....భర్త తో ..అన్నది విమల . అవును వాళ్ళది ..కుటుంబం ,వాళ్ళ తండ్రి గారు ,తాతలు దగ్గరనుంచీ నాకు పరిచయమే ,వాళ్ళందరూ ఒక పద్ధతి గల మనుష్యులు .నీకు వాళ్ళ నాన్న గారు వాళ్ళు కూడా తెలుసు ,అలా పూర్వాపరాలు చర్చించుకుంటున్నారు.



క్రింద కారు శబ్దం ,ఏదో లగేజీ సర్దుతున్న శబ్దం ...కొంత హడావిడి వినిపిస్తోంది .గబ గబా మెట్లు దిగి హడావిడిగా వెళ్ళాడు సాయిచంద్ర ......ఏమీ ...అర్థం కాక అలా చూస్తూ నిలుచున్నాడు. .."..ఆ. ...బాబూ ...వచ్చారా ...మరేమీ ..లేదు .మా బావమరిది కాం తారావు ఊరు వెళుతున్నాము .కాస్తంత పని పడింది కొద్దీ రోజుల్లో అది. పూర్తి చేసుకొని వచ్చేస్తాము ..కాస్త ఇల్లు చూస్తూ ఉండండి .మీకు ఏదైనా పని ఉంటే మేము రాగానే వెళ్ళుదురుగాని. ప్లీజ్ ..బాబు ..కొంచెం ..బ్రతిమిలాడుతున్నట్లుగా అడిగాడు ..దొరగారు .." ..సరే. ....సార్ ..మీ. యిష్టం .అని సాయిచంద్ర చెప్పేలోపే ..ఐశ్వర్య కు అంతా చెప్పాను ..బాబు. వంట ..పర్వాలేదు ..కాస్తంత వచ్చు ...చేసి టేబుల్ పైన పెడుతుంది మీ పని. అయిన తరువాత వెళ్ళి పెట్టుకొని తినండి ..ఏమి అనుకోకండి . వంటచేసే అమ్మాయి వాళ్ళు కూడా పనిమీద ..కొద్దిరోజులు ఊరు వెళ్ళారు... వచ్చేస్తారు . . అంటూ. విమల ..చెబుతుంటే ..పెదవి ..విరిచి ఒక్కసారి జడ విది లించి ..లోపలికి వెళ్లిపోయింది ..ఐశ్వర్య." ..పర్వాలేద0డి ....మీరు ..హాయిగా ..మీ పని ..చూసుకురండి ....అంతా నేను చూసుకుంటాను .విష్ యు హ్యాపీ జర్నీ. అంటూ. దొరగారికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సాయిచంద్ర .
* * * * . . . . .... తోట అంతా తిరిగి నోట్స్ వ్రాసుకొని ...మధ్యాహ్నం కు ఇల్లు చేరుకున్నాడు సాయిచంద్ర .కిచెన్ లోకి వెళ్ళి టేబుల్ పై చూశాడు .ఆకలి విరగ తీస్తుంటే భోజనం వడ్డించుకొని మొదలుపెట్టాడు .నోట్లో ఒక ముద్ద పెట్టుకోగానే వాంటింగ్ వచ్చింది. ఆపుకొని ....నీయబ్బ. ..ఇదేమి ..అరటిపూవు కూర ..చేతకాదని ఏడిస్తే ..నేనే. .చేసే వాడ్నిగా విసురుగా లేచి వెళ్ళిపోయాడు .సాయిచంద్ర .....దగ్గర్లో .....కనపడకుండా కూర్చోనీవున్న ఐశ్వర్య కు మొత్తం సీన్ అర్ధం అయి0ది. లేచి వచ్చి మొత్తం చూసి ...జాలిగా పెదవి విరిచి వెళ్ళిపోయింది... 



సాయంత్రం వేళ పైన డాబా పై అటూ,ఇటూ వేగంగా నడుస్తూ ఉంది ఐశ్వర్య." మేడం ...కొంచెం టీ ..తీసుకో0డి ..ట్రే ..లోరెండు కప్పులు తెచ్చాడు సాయిచంద్ర.... ఈ. టైం లో టీ. నా ..అస్సలు నాకు అలవాటే లేదు .అయినా నేను మిమ్మలిని అడిగానా? కొంచెం విసురుగా అడిగింది." బలేవారు ...మేడం. ఏదో ..నాకు కాస్తంత కంపెనీ అని అనుకున్నాను .నాకోసం. కొద్దిగా ప్లీజ్ ..రిక్వెస్ట్ గా అడిగాడు. సాయిచంద్ర. .బలవంతంగా చేతిలో కి ఇచ్చాడు .చూడండి మేడం ...ఈ. మగా ళ్ళంతా. అంతే. వట్టి మాయగాళ్ళు ముందు పరిచయం పెంచి తరువాత లవ్ ,గివ్అని వెమ్మటి పడి గోల చేస్తారు .ఆ అభిప్రాయం తోనే. మీరు నన్ను. లెక్కిస్తున్నారు., యామై... కరెక్ట్. ...?టీ. కప్పు లో టీ కొంచెం సిప్ చేస్తూ అడిగాడు ?" యస్. ...ఎక్సాట్లీ ....కరెక్ట్... అని కోపంగా అంటూ టీ ..కొంచెం ...సిప్. ..చేసింది ...ఐశ్వర్య
ఓకే. ...మేడం ..బై..దీ. బై ...టీ. ఎలా. ఉంది ..?అడిగాడు సాయిచంద్ర.. పర్వాలేదే. ...మీకు ..వంటలు చేయడం కూడా. వచ్చా.? ఆశ్చర్యం గా. దీర్ఘం తీస్తూ అడిగింది ..ఐశ్వర్య...ఎదో. లెండి. మీ అంత కాదు. అస్సలు మీరు అరటిపువ్వుకూర ..చాలా బాగా చేశారు .?ఎక్కడ ..నేర్చుకున్నారు మేడం ..కొంచెం చిరునవ్వుతో అడిగాడు. సాయిచంద్ర. ఏమిటి. ..మీకు. నచ్చే అడుగుతున్నారా?లేక ఎ టకారమా? కొద్దిగా ...ఆవేశంగా అడిగింది. ..ఐశ్వర్య ......సరే. మేడం ...అది. వదిలేయండి ...ఇక బై ...డి...బై. .మనం మంచి స్నేహితులము .కాబట్టి ప్రేమా, దోమా ,ఏమీ ...ఉండవు..ఎందుకంటే ..నాకు ...ఆల్రెడీ. లవర్. ఉంది. ..కాబట్టి మీరు. నా గురించి భయపడాల్సిన పని లేదు.కొంచెం క్యాజువల్ గా చెప్పేసాడు సాయిచంద్ర .హమ్మయ్య ....అన్నట్లు ..గాలి ...నిట్టూర్పు గా వదిలింది ఐశ్వర్య.


మేడం ....అవును ..మీరు ..బైటకు వెళ్లాలంటే ...కారు ..లేదు .....బోర్. కొడుతున్నట్లు0ది. ఆశ్చర్యంప్రకటించాడు సాయిచంద్ర... .. కొంచెం. ...తల. ..అవును ...అన్నట్లు. ఊపింది ఐశ్వర్య .అవును మేడం ...మీరు నా మీద ..అలా బురద ..కొట్టేశారు ...ఆ. రోజు ..మీరు అప్పుడే ...నా పై కోపముతో ఉన్నారా? కొంచం నవ్వుతూ చిలిపిగా అడిగాడు సాయిచంద్ర......... చూడండి .....సార్ ...నేను ...ఆ ..రోజు .వెనక్కి వచ్చి మరీ సారీ చెప్పాను కదా !కొద్ది ఆవేశం తెచ్చుకొని మరీ చెప్పింది.......ఐశ్వర్య........"ఓకే ...మేడం ....నేను కిచెన్ లోకి వె ళ్తున్నా ను ....నాకు. ..ఒక్క ...అవకాశం ఇవ్వండి మేడం ..అంటూ కిచెన్ లో కి వెళ్ళిపోయాడు .సాయిచంద్ర.


రాత్రివేళ ...వెన్నెల...పుచ్ఛపువ్వులా ...పసుపుపచ్చ గా ప్రకాశిస్తోంది....వంట పూర్తి అయిపోయి ...డాబా పైన తిరుగుతూ ఉన్నాడు .అమ్మయ్య ...ఎలానో అలా ఆ ...మొ0డి పిల్లను కాస్త మాటల్లో పెట్టగలిగాను....నిజానికి ...ఏమి అందం..కలల్లో మునిగి తేలుతున్నాడు సాయిచంద్ర.


* * * * *
చెన్నై చేరుకున్న దొరగారు ,ఆయన భార్య ......బావమరిది ......కొడుకు చైతన్య కుటుంబం లో సమస్య ను కొంతైనా పరిష్కరించాలని ప్రయత్నంలో భాగంగా. అక్కడ తిష్ట వేశారు . తాతయ్యా అంటూ మనుమడు వచ్చాడు."రా. ...కన్నయ్య ...రా. ...నాన్న. ....రా.. బాబు అంటూ ముద్దు చేస్తూ దగ్గరకు తీసుకున్నాడు దొరగారు .ఇదంతా ..చూస్తూ ఉన్న కోడలు కు కొంచ0 ఏవ గింప్ గా భావిస్తోంది...మొహం చిటపట లాడి స్తో0ది .కోడలు శోభ."


కొద్దిసేపు మనుమడు తో తాతయ్యా, నాయనమ్మ లు ఆడు కున్నారు.... బాబు. ఇక చాలు. రా పడు కొందువు గానీ అంటూ విసుగ్గా పిలిచింది .రాత్రి వేళ చాలా టైమ్ అవుతున్నా డిన్నర్ కు పిలవడం లేదు సరి కదా బైట సోఫా లో కూర్చున్న వాళ్లకు కనీసం పడుకోవడానికి వసతి కూడా చూడటం లేదు . ...చా లా సేపు అలా గడిచి పోయింది .రోజూలా సోఫా లొనే కునికి పాట్లు పడుతున్నారు .కోడలు,మాత్రం పై అంతస్తు లోని వాళ్ళ తల్లిదండ్రులు కు సేవ లు చేసి పడుకోబెట్టి తాను కూడా కొడుకుని పక్కలో వేసుకొని నిద్ర లోకి జారుకొంది .


రాత్రి వేళ నల్లని మేఘాల మధ్య చందమామ దోబూచులాడుతూ వెన్నెల చిలుకుతున్నాడు ..ఆఫీసు నుంచి కొడుకు చైతన్య వచ్చాడు "నాన్నగారు ఏంటి ఇక్కడ నిద్ర... లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా అయినా అస్సలు భోజనం చేశారా?కొంచెం ఆతృత గా అడిగాడు ....."ఏది బాబు ...నువ్వు రాకుండా ఎలా చేస్తాం ? .అన్నాడు దొరగారు .నాకు తెలుసులే నాన్నా ..ఆ రాక్షసి ...మి మ్మలని ఎవర్నీ ..పట్టి0చుకొనిఉండదు. పదండి ....డిన్నర్ చేద్దాం అంటూ అందరూ లోపలికి వెళ్లిపోయారు .


* * * * *
సాయిచంద్ర ..వంట. మొత్తం.పూర్తి చేశాడు . ఫ్రెష్ అయి ..కిచెన్ లో నుంచి ప్లేట్స్ ,వండిన పాత్రలు అన్నీ. డైనింగ్ టేబుల్ పైకి తెచ్చి పెట్టాడు .రెండు ప్లేట్స్ సిద్ధం చేసి. ఐశ్వర్య రూమ్ కి వెళ్ళి తలుపు కొట్టాడు ...." మేడం రండి డిన్నర్ చేద్దాం. మీరు కూడా వస్తే కాస్త నాకు. కూడా. కంపెనీ ఉంటుంది కదా ..కిరిటీ. ..లోనుంచి చూస్తూ రిక్వెస్ట్ గా అడిగాడు సాయిచంద్ర...... మీరు చేసి వెళ్ళి ..పడుకో0డి సార్ ,నాకు. ఇప్పుడు తినాలని లేదు ..ఏదో ..పుస్తకం చదువుతూ ..తల ఎత్త కుండానే చెప్పేసింది ఐశ్వర్య ...సరే. ..మేడం ..కొంచెం సేపు మీ కోసం నేను ఆగుతాను.. భుజం పై కండువా తో ముఖం ,చేతులు తుడుచు కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సాయిచంద్ర .....కొద్దిసేపు ..పుస్తకం చదివి టైమ్ పాస్ చేశాడు 


.అయ్యో ...పది గంటలు అయిపోయింది ..డిన్నర్ టైం దాటిపోయింది . గబ గబా వేగంగా ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి కిరిటీలోనించి పిలిచాడు " మేడం..... ఓ. ఐశ్వర్యా మేడం...వాలు కుర్చీ లో పడుకొని ఉంది ....చిన్న బెడ్ లైట్ వెలుగు లో రూమ్ లో స్పష్టంగా ఏమీ కనిపించడంలేదు... చేతిలో. బీర్ సీసా లా అనుమానం వస్తోంది... అయ్యబాబోయ్ ...ఫుల్లుగా, ఎక్కువ తాగేసినట్లు ఉంది.... తెగ కంగారు పడిపోతూ ..ఇప్పుడు ఏమి చేయాలి బుర్ర గోక్కు0టున్నాడు. సాయిచంద్ర .ఎలానో అలా తలుపు గడియ ను విరిచి లోపలికి ప్రవేశించాడు .క్షణాల్లోనే అర్థం అయి0ది .తాగి ,తాగి స్పృహ ..కోల్పోయిందని ......అటూ ....ఇటూ..పరుగులు తీశాడు ....చివరికి ఫ్రిజ్ లో నీళ్ళు ముఖం పై పోశాడు . కొద్దిగా కదిలింది ....బాగా అటూ,ఇటూ...ఊపి ..లేపి కూర్చోబెట్టాడు .కొద్ది కొద్దిగా మత్తుగా కళ్ళు మూస్తూ...తెరుస్తూ. ...ఉంది ..ఐశ్వర్య..... ఇక వెంటనే కిచెన్ లో కి ...పరిగెత్తుకొని వెళ్లి .....మజ్జిగ తెచ్చి నోట్లోకి కొద్దిగా ముందు చుక్కలు వేసి తరువాత కొద్దిగా త్రాగించాడు .సాయిచంద్ర .కొంచం ...మత్తు పోగానే సాయిచంద్ర ని ధిక్కరించి ..మజ్జిగ బైటకు ఉమ్మేస్తుంది.. రెండు సార్లు చెప్పిచూశాడు ఇక కోపం. ఆపి పట్టుకోలేక చంప పై లాగి కొట్టాడు ...ఏ0 ....అర్థం కావడం ...లేదా. ఎక్కువ తాగేసావు ..ఛస్తావు... కోపంగా అరిచాడు.సాయిచంద్ర........"నువ్వుఎవ్వరివి నా. మొగుడివా...నా. లవర్ వా. నా యిష్టం ...నాది. బోకరిస్తోంది. ఐశ్వర్య. ఎస్..... నేను .నిన్ను ఆరాదిస్తున్నాను...లవ రనే... అనుకో...గట్టిగా అరిచాడు..సాయిచంద్ర... ఆ మాటలకు మత్తు దిగిపోయి...ఏడవడం మొదలుపెట్టింది .....అక్కడనుంచి .....బైటకు వెళ్లి ...నిలుచుండిపోయాడు సాయిచంద్ర.

తొందర పడ్డా నా ....ఏమో. ఆవేశం లో ఏదేదో అనేశాను ..గదిలో ...కూర్చొని ఏడుచు కుంటూ టవల్ తో ...ముఖం కప్పుకొంది ఐశ్వర్య ...కొద్దిసేపు ..అలా గడిచిపోయింది. ..ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఆలోచనలో పడ్డాడు సాయిచంద్ర.లోపలికి తొంగి చూశాడు ....ఆమెకు దగ్గరగా వెళ్ళాడు ..చూడండి మేడం. ..అలా ఎంతసేపు బాధపడుతూ కూర్చు0టారు .ఇక లేవండి ...నేను మీ ఇంటికి గెస్ట్ లా వచ్చి ...మీ మీద రుబావు చేయడం నాదే తప్పు అని తెలుసు ..ఐ. యాం వెరీ ...సారీ... కానీ ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో పాలు పోలేదు ...పోనీ మీరు ...నన్ను ముందు క్షమించండి... ఆ తరువాత నేను మా ఊరు వెళ్ళిపోతాను .కాకపోతే ..మీకు రక్షణ గా నన్ను ఉండమని గట్టిగా చెప్పారు .నేను అదే. ...ఆలోచిస్తున్నాను. కొంచెం ....పశ్చాతా ప0 ...పడుతున్నట్లుగా చెప్పాడు.సాయిచంద్ర.కళ్ళ లోకి సూటిగా చూడలేక తల వంచుకొని మాట్లాడుతున్నాడు ...ప్లీజ్. ..నాతో. ఎవరు. మాట్లాడవద్దు ..మీరు ..బైటకు వెళ్లిపో0డి ,లేకపోతే. నేనే. ...ఈ. అర్థ. రాత్రి. బైటకు వెళతాను. కోపంగా అరిచింది. ఐ శ్వర్య...సారీ. మేడం నేనే వెళతాను..... బైటకు వెళ్ళిపోయాడుసాయిచంద్ర....నల్లని ..మేఘాల చాటుకు. వెళ్ళిపోయాడు .


తెల్లవారి...లేలేత సూర్యకిరణాలు మీద పడుతుంటే ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు సాయిచంద్ర ...ఈ అమ్మాయి ఉందా ...కోపం వచ్చి ఏదైనా చేసుకోవడమో, ...ఎటైనా వెళ్లిపోవడమో చేసిందా? కంగారుగా లోపలికి వెళ్ళి అంతా వెతికి చూసాడు సాయిచంద్ర. బ్రష్ చేస్తూ ఫ్రెషవతుంది.. ఐశ్వర్య.... హమయ్య....బ్రతికిపోయాను ...తాను కూడా గబ గబా బ్రష్ చేసి వేగంగా కిచెన్ లోకి వెళ్ళాడు కాఫీ కలిపాడు .రెండు కప్పుల్లో..పోసుకొని ....హాలులో కి వెళ్ళాడు సాయిచంద్ర...మేడం ..కాఫీ .....టీ పాయ్ పై పెట్టాడు తలవంచి నిలుచున్నాడు .....ఏమిటి...నేను ఆడిగానా... మీకు ఎంత చెప్పినా సిగ్గు అనిపించడం లేదా ? రోషం గా మాట్లాడింది .ఐశ్వర్య... " చూడండి ..మేడం. మీరు నన్ను తిట్టినా పర్వాలేదు ,పోనీ నన్ను రెండు చెంప దెబ్బలు కొట్టి కసి తీర్చుకో0డి మేడం.. అంతే కానీ ..మీరు నాతో అలా మాట్లాడవద్దు ప్లీజ్ ..అయిపోయింది ఏదో అయిపోయింది .మనమిక మంచి ..దోస్త్ ల్లా ఉండి పోదాం.కాఫీ అందించాడు సాయిచంద్ర.


ఇక చాలు వినయ విధేయతలు .."దయచేసి కూర్చో0డి "....కాఫీ తీసుకుంటూ వ్య0గ్యం గా అన్నది..ఐశ్వర్య....మీరు నన్ను చెంప పై పెళ్లుమనికొట్టారు, ...తిరిగి ...నేను వాయుస్తే ....ఎలా ..ఉండేది ..కొంచం కళ్ళలో నీటి చార. ఉబికి వస్తుంటే బాధగా అన్నది ఐశ్వర్య. ...మేడం ....మీకు అప్పుడే సారీ చెప్పాను .మీరు కూడా కొట్టండి అన్నాను.కావాలంటే ఇప్పుడు కొట్టుకోండి ..మొహం. ఆమెకు ..దగ్గరగా తెచ్చాడు ....సాయిచంద్ర... నేను మరీ అంత సంస్కారం లేని దాన్ని కాదు ..నన్ను బ్రతికించాలని పట్టుదలలో, తొందరలో ఒక దెబ్బ పడింది అని అర్థం చేసుకున్నాను..... బుద్దిమంతురాలులాఐ శ్వర్య చెబుతుంటే .. ఆశ్చర్యంగా ..చూస్తూ థా0క్ .. గాడ్..అని ..నిట్టూర్పు విడిచాడు సాయిచంద్ర.
అయినా మీ లాంటి అందమైన అమ్మాయి అలా త్రాగడం ఏంటి మేడం... మీకు సూట్ కాదు ...అని సాయిచంద్ర చెప్పబోతుంటే ... కొంచం. లోలోపల...సిగ్గు పడుతూ ..మాట మార్చి. వేరే ...విషయం మాట్లాడుతూ ఉంది ఐశ్వర్య. మేడం....మీరు దయచేసి ..మాట మార్చవద్దు ..ఓకే... నా..చిలిపిగా అన్నాడుసాయిచంద్ర. సమస్యలు కు ,బాధలకు అందం,వయస్సు స్త్రీ,పురుష బేధం ఉంటాయా మాస్టారూ?..కొంచం కళ్ళు పెద్దవి చేసి ప్రశ్నించింది.. 


.....ఓ.కె.మేడం. నేను బ్రేక్ పాస్ట్. ...ప్రిపేర్ చేస్తాను ..రండి ..కిచెన్. లోకి వెళ్లి మాట్లాడుకుందాం., ఎందుకంటే రాత్రి మన ఇద్దరం. అస్సలు భోజనమే చేయలేదు ,బాగా ఆకలిగాఉంది అన్నాడు సాయిచంద్ర.."నేను .వంట..చేస్తాను. సార్...పదండి..అంటూ కిచెన్ లోకి దారి తీస్తోంది. ఐశ్వర్య. ..మేడం...... మొన్న మీరు నాకు అరటిపూవు కూర తినిపించారు గా నాకు అర్ధం అయిపోయింది లేండి.... కొంచెం నవ్వుకుంటూ చెప్పాడు సాయిచంద్ర. మరి. అదే. సార్.. మమ్మల్ని ...తక్కువ చేసి మాట్లాడుతున్నారు.. ....లేదు ....మేడమ్ మీరే అన్నీ ఒప్పేసుకుంటున్నారు మొన్న కూర గురించి...అన్నాడు సాయిచంద్ర .........ఓకే మేడం. ...ఇద్దరం కలిసి చేద్దాం మేడం. బోత్ ...ఉయు ..ఆర్ ఈక్వల్.. అంటూ. కిచెన్ లోకి ప్రవేశించారు.


*....................* * ...................*..... * . *
చెన్నై లో. ఆ. రోజు. ఆదివారం ..సెలవు కాబట్టి ..అందరూ ఇంట్లో. వున్నారు ...దొరగారు కుటుంబం... కొడుకు, కోడలు కొడుకు మామ గారు ,అత్తగారు అందరూ కలిసి కూర్చున్నారు ....మీ తప్పు అంటే మీది తప్పు అని వాదించుకొంటున్నారు . అది కాదండి ...తాత.. నాయనమ్మ లను దగ్గరకు ఆ మనుమడు ని రానివ్వరు .వాడు. ప్రేమగా తాతయ్యా, నానీ... అనుకుంటూ రాగానే ...వెంటనే వచ్చి. రివ్వున తీసుకెళ్లిపోతుంది.... ఇది ఎక్కడి దౌర్భాగ్యం అండీ. 


[ ] వాళ్ళు ఏమైనా పరాయువాళ్ళు కాదు కదా ..కొద్దీ రోజులు ఉండి వెళ్లి పోతారు కదా ,ఎందుకు పెద్దవాళ్లను బాధపెట్టటం?నిలదీశాడు. దొరగారి బావమరిది. నేను చాలా సార్లు చెప్పాను నాన్నగారు.. ఇక వాళ్ళు మారరు.. విసుగ్గా చెప్పాడు కొడుకు చైతన్య. పెళ్ళి అ యు ఎంత కాలం అయి0ది. ఒక్కసారి ఎప్పుడో మమ్మల్ని చూడటానికి వచ్చారు ?కనీసం ఎలా ఉన్నామో ఫోన్ కూడా చేయరు...మేము చేస్తే కోడలు ఫోన్ తీయదు..అంతా మా కర్మ గాక పోతే ఏమిటి చెప్ప0డి .తలపై కొట్టుకొని విసుగ్గా మాట్లాడుతొంది ...."చైతన్య. ...తల్లి విమల. .అయ్యా ....అమ్మాయి.. తండ్రి గారు ..మీరు ఆయునా ...ఒక. పరిష్కారం చెప్పండి ..కొంచెం దీనంగాఅడిగాడు దొరగారు...ఏం చెప్పమంటారు ..మేము అందరం ..బ్రహ్మ0డ 0గా ,చక్కగా వున్నాము. నసిగినట్లు మాట్లాడాడు చైతన్య మామగారు... అంత. బాగుంటే ...మా అబ్బాయి ఆఫీసులో నే ఎందుకు పడుకుంటాడు .ఎదురు దాడి కి దిగాడు దొరగారు... అది ..మీ. అబ్బాయి నే అడగండి.. అంటూ ...లేచి వెళ్ళిపోయాడు చైతన్య మామగారు ....నాన్న గారు ...వాళ్ళు అలా. వినరు ..నేను. మనవూరు వచ్చేస్తాను ...తాను వస్తే స0తోషం,లేకపోతే ఇక తన జీవితం తన యిష్టం... కోపంగా. అరిచి లోపలికి వెళ్ళి పోయాడు చైతన్య.కొద్దిసేపు అంతా తలా పట్టుకొని కూర్చున్నారు 


ఇంతలో ...దొరగారికీ ఇంటివైపు ధ్యాస మళ్లీ0ది.... వెంటనే ఫోన్ చేశాడు.. ఏ0....బాబు. ఎలా ఉన్నారు..?మేము త్వరలో బయలు దేరతాం..మీరు ఏమి అనుకోవద్దు బాబు?.....ఏం.... పర్వాలేదు సార్. ...మీ పని పూర్తి చేసుకొని రండి మీ ఇంటి కాపలా విషయం పూచి నాది... ఇక మీ అమ్మాయి గారు కూడా హ్యాపీ ...ఒకే నా...?.ఆన0ద0గా చెప్పాడు...సాయిచంద్ర.. 


[ ] * * * * *
కొన్ని కాగితాలు ,కొన్ని బుక్స్ తీసుకొని. పొలం వైపుకు బయలు దేరుటున్నాడు సాయిచంద్ర ..ఐశ్వర్య గారు మీరు టి. వి చూస్తూ ఉండండి .కొద్దిగా నా రీసెర్చ్ వర్క్ చూసుకొని వస్తాను .కాగితలన్నీ ..వరుస లో పెట్టుకుంటూ చెప్పాడు సాయిచంద్ర. ..చూడండి సార్ ఐశ్వర్య గారు అని ఏం పిలవక్కరలేదు ,ఐశ్వర్య ..అంటే చాలు ..కొంచెం చిలిపిగా నవ్వుతూ చెప్పింది .....ఏమో. ..అమ్మాయి గారు ..మీ ఊళ్ళో వాళ్ళంతా ఇలా పిలుస్తు0టే.. నేను అలా పిలిచాను అనుకొండి ...సినిమాస్టార్ రజనీకాంత్ అభిమానుల్లా నా పై పడి .. నా భరతం పడితే .లేదా. మీ నాన్నగారి దగ్గర కూడా ఇలానే పిలిచాను అనుకొండి ...అప్పుడు మీ నాన్నగారు అదే మా దొరగారు ఏమయ్యా ..ఏదో. తెల్సిన వాళ్ళ అబ్బాయి అని చనువు ఇస్తే ...ఇలా చేస్తావా ఏం పిచ్చ పిచ్చ గా ఉందా అని రావు గోపాల్ రావు లా ..కర్ర ఎత్తితే "..కొంచెము నటిస్తున్నట్లు గా ..చెపుతుంటే .....మధ్యలో ..అడ్డ0 వచ్చి......అబ్బా. ..మీ. మిమిక్రీ. ..ఇక ఆపండి .చాలా బాగుంది ..కొంటెగా చెప్పింది ఐ శ్వర్య...."ఓకే.... మేడం ..మీరు చెప్పిందే ఖాయం.... సరే ..ఇంతకీ..నేను కొద్దిసేపు ...పని చూసుకొని వస్తాను......బైటకు నడుస్తున్నాడు సాయిచంద్ర... ఏమి. మాస్టారు మేము రాకూడదా ....కొద్దిగా నవ్వుతూ. అడిగింది .......వై. నాట్. మీరు కూడా వస్తానంటే చాలా సంతోషం..ఇద్దరు నడుస్తూ ..మాట్లాడుకొంటున్నారు ." మేడం ...మీకు టీ షర్ట్ స్,జీన్స్ బాగా ..సూట్ అవుతాయి మేడం ..కొంచెం ఆనందంగా చెప్పాడు సాయిచంద్ర . రియల్లీ .....? థాంక్స్ ఆనేసింది ...ఐశ్వర్య ..


ఏదైనా. మేడమ్. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో కానీ వాడి పని ....ఇక వర్ణించ తరం కాదు. కావాలని కవ్విస్తూన్నాడు. .ఆమె ఎందుకు సెటలవడంలేదు ..పెళ్ళి. ఎందుకు చేసుకోవడం లేదు. ...విషయం ...బైటకు లాగలని రెచ్చగొట్టడం ప్రారంభించాడు సాయిచంద్ర. .అక్కర్లేదు లేండి... నేను అస్సలు మగ జాతినే. నమ్మను..నేను ఇక పెళ్ళి చేసుకోను.మోహము లో రంగులు మార్రి పోతుంటే చెపుతోంది ఐ శ్వర్య ...ఓ...మరి ..నేను మగజాతే. గా మేడమ్....?..కొంచం సన్నగా ...గొణిగాడు... సాయిచంద్ర. .. అందుకే. ....మిమ్మలిని కూడా సగమే ...నమ్మాను.. కోపంగా చెప్పింది. ....అవును మేడం. ....స్త్రీ రూపం. సగమే కదా ,మిగతాదంతా పురుషరూపం కదా ...ఏదొ జోక్ లా. మాట్లాడాడు సాయిచంద్ర. ఆ మాత్రం. చచ్చు తెలివితేటలు మాకూ ఉన్నాయి ..అంతాఎక్కడ? సగం పోతే. సగం మీది. అదే గా. అర్ధ నారీశ్వరుడు, కోపంగా చెప్పింది ఐ శ్వర్య. అది. కాదం డి లక్ష్మీనారాయణు లు. చూడండి. హృదయం లో మాత్రమే కదా. మిగతాదంతా. మావోడిదే. కదా....ఏదో చెప్పబోయాడు సాయిచంద్ర .....ఏమిటి హృదయం. మొత్తం ...ఆమే. అక్రమి0చుకొనికూర్చు0ది ,ముఖ్య మైనదే అది.ఇంకా ఎవరికి ప్లేస్ ఉండదు .వివరిస్తూ దబాయిస్తుంది ........అందుకే మేడం. ... బ్రహ్మ గారు. తెలివి గా నాలుక పై పెట్టుకున్నాడు .... ఛాలెంజ్ గా చెప్పాడు సాయిచంద్ర. అబ్బా. ...నాలుక పై ఎందుకు కూర్చుందో తెలుస్సా?.....ఇంకెవరికి ఐ లవ్ యూ ...అని చెప్పనీయకుండా అంటూకొద్దిగా నవ్వి0ది ఐ శ్వర్య.... మేడం ...మీతో. మాట్లాడాలంటే కొంచం కష్టమే మేడం ల"....కళ్ళు. నేలపై. వాల్చి సణిగాడు.. సాయిచంద్ర.....సరే. మేడం ....ఈ. ప్లేస్ ..నాకు. బాగా నచ్చి0ది.....కొద్దిసేపు.కూర్చున్నామా. ..మొన్న ...మీ నాన్నగారు....నేను ...కూర్చుని. మొత్తం పరిశోధన ,వరివంగడం ..గురించే మాట్లాడుకున్నాము ..ఓకే. .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online