Pages

New year Wishes

మంచి అలవాట్లని తగిలించుకోవడం  చెడు అలవాట్లు వదిలించుకోవడం
పదిమందికి మేలు చేస్తే... మనవల్ల అది జరిగితే ..!.అదే పుణ్యం
ఒక్కరికి బాధ కలిగినా అది పాపం...
ప్రతి వాళ్ళము ఏదో ఒక చిన్న తప్పుఅయినా చేస్తాం .
తెలుసుకొని..సరిదిద్దుకునేందుకు.. ఇది ఒక అవకాశం
ఉత్సవాలు... పండుగలు మనకు ఇచ్చే ఓ సదవకాశ0
విదేశీ పండుగలయనా,స్వదేశీ పూజలయునాఅదే అర్థం.. అదే పరమార్థం.
పాపపుణ్యాలు, పురాణాలు శాస్త్రాలు భగవంతుడు
పండుగలు..మంచి ఆచారాలు..మనిషి మనిషిగా ..మానవత్వం పరిమలించే మనిషిగా
బ్రతకాలి.. అని చెప్పడంకోసమే ..ఈ ...తంతులు.
రాత్రుళ్ళు అంతా బిందెలు బిందెలు తాగేసి. చిందేసి ..ఊగేస్తే ..
పొగ వదిలేస్తే ..అదే కొత్తచదువులు ..అదే ..గొప్ప పరిణామం అదే కొత్త నాగరికత
అదే కొత్త అభివృద్ధి అనుకుంటే ..అది చాలా పొరబాటు ..దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు. కాలుష్యం కంపు తప్ప
రానున్న భావి తరాలకు ఏమి ఇస్తాం ..మనస్సులు కాలుష్యం మనిషి కాలుష్యం ఊరు ..సంఘం.. ప్రపంచం ..కాలుష్యం
పెద్దవాళ్లే ...విలువలు తప్పి ..వళ్ళు మరిచి ..ఎంజాయ్ అంటూ వ్యవహరిస్తే పిల్లల భవితవ్యం ఏమిటి ?
జీవితం అంటే సమర్ధవంతంగా బ్రతకడం.ఒకరు బ్రతికేలా తోడపడటం...మన సామర్ధ్యం తో పదిమందికి ఉద్యోగం కలిపించి ..ఆకలిని పోగొట్టే ..ఆ .దరిద్రపు చీకట్లు తరిమే ఓ చిరు దీపం వెలిగించడం
అటువంటి ..గొప్ప మంచి పుణ్యప్రదమైన మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం..
చెట్లుచేమలను సమస్త జీవరాసులను సాటి మనుషులను సుఖంగా..హాయిగా..ఎక్కడా హింస అనేది లేకుండా .. జీవింపచేసే దైవత్వం.. ..అలవర్చుకొనే కొత్త మార్పులు ..ఈ. కొత్త సంవత్సరం కొత్తసంతోషం అందరి ఇంటా పండాలని ఆశించి ప్రయత్నం చేస్తే అదే కొత్త సంవత్సర శుభాకాంక్షలు ...

WISH YOU ALL A HAPPY AND PROSPEROUS NEW YEAR 💐🍰

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online