Pages

New year Wishes

మంచి అలవాట్లని తగిలించుకోవడం  చెడు అలవాట్లు వదిలించుకోవడం
పదిమందికి మేలు చేస్తే... మనవల్ల అది జరిగితే ..!.అదే పుణ్యం
ఒక్కరికి బాధ కలిగినా అది పాపం...
ప్రతి వాళ్ళము ఏదో ఒక చిన్న తప్పుఅయినా చేస్తాం .
తెలుసుకొని..సరిదిద్దుకునేందుకు.. ఇది ఒక అవకాశం
ఉత్సవాలు... పండుగలు మనకు ఇచ్చే ఓ సదవకాశ0
విదేశీ పండుగలయనా,స్వదేశీ పూజలయునాఅదే అర్థం.. అదే పరమార్థం.
పాపపుణ్యాలు, పురాణాలు శాస్త్రాలు భగవంతుడు
పండుగలు..మంచి ఆచారాలు..మనిషి మనిషిగా ..మానవత్వం పరిమలించే మనిషిగా
బ్రతకాలి.. అని చెప్పడంకోసమే ..ఈ ...తంతులు.
రాత్రుళ్ళు అంతా బిందెలు బిందెలు తాగేసి. చిందేసి ..ఊగేస్తే ..
పొగ వదిలేస్తే ..అదే కొత్తచదువులు ..అదే ..గొప్ప పరిణామం అదే కొత్త నాగరికత
అదే కొత్త అభివృద్ధి అనుకుంటే ..అది చాలా పొరబాటు ..దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు. కాలుష్యం కంపు తప్ప
రానున్న భావి తరాలకు ఏమి ఇస్తాం ..మనస్సులు కాలుష్యం మనిషి కాలుష్యం ఊరు ..సంఘం.. ప్రపంచం ..కాలుష్యం
పెద్దవాళ్లే ...విలువలు తప్పి ..వళ్ళు మరిచి ..ఎంజాయ్ అంటూ వ్యవహరిస్తే పిల్లల భవితవ్యం ఏమిటి ?
జీవితం అంటే సమర్ధవంతంగా బ్రతకడం.ఒకరు బ్రతికేలా తోడపడటం...మన సామర్ధ్యం తో పదిమందికి ఉద్యోగం కలిపించి ..ఆకలిని పోగొట్టే ..ఆ .దరిద్రపు చీకట్లు తరిమే ఓ చిరు దీపం వెలిగించడం
అటువంటి ..గొప్ప మంచి పుణ్యప్రదమైన మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం..
చెట్లుచేమలను సమస్త జీవరాసులను సాటి మనుషులను సుఖంగా..హాయిగా..ఎక్కడా హింస అనేది లేకుండా .. జీవింపచేసే దైవత్వం.. ..అలవర్చుకొనే కొత్త మార్పులు ..ఈ. కొత్త సంవత్సరం కొత్తసంతోషం అందరి ఇంటా పండాలని ఆశించి ప్రయత్నం చేస్తే అదే కొత్త సంవత్సర శుభాకాంక్షలు ...

WISH YOU ALL A HAPPY AND PROSPEROUS NEW YEAR 💐🍰

Hues of Love (a short story) part - 3

 అబ్బా .....చాలు మేడం ...అంటూ షర్ట్ మొత్తం వేసుకుంటున్నాడు. సాయిచంద్ర. అది మీరు ఈసారి నన్ను ఆమ్మాయుగారు అంటే మాత్రం ఇలానే గట్టిగా రాస్తాను నవ్వుతూ.లోపలికి వెళ్ళిపోయింది ..ఐశ్వర్య....మరుసటి రోజు ఉదయం.. పూలమొక్కల కు నీరు పోస్తున్నారు ...సార్ ..మీరు ..మీ ప్రేమ గురించి కూడా చెబుతా నన్నారు.మరి చెప్పండి .నిలదీసినట్లుగా అడుగుతొంది ఐశ్వర్య..... కొద్దిసేపు. మౌ నం... అవును మేడం ..మీ పని వాళ్ళు ఎవరూ ఊరునుంచీ రాలేదేమి టో ....ఆశ్చర్యం గా మెహం పెట్టాడు ..చూడండి సార్ ..మీరు మాట మార్చి మాయ చేయవద్దు .చెప్పండి ..గట్టిగా పట్టుపట్టింది .ఐశ్వర్య... సరే చెబుతాను కాని ఏదైనా ..తేడా వస్తే మీరు అలిగి వెళ్ళీపోకూడదు .మన...స్నేహం ఎప్పటికీ వర్ధిల్లాలి ఓ. కె.ప్రామిస్ అంటేనే చెబుతాను .గట్టిగా చెప్పాడు సాయిచంద్ర .ఏమిటండీ ...కొంపదీసి నాకు తెల్సిన వాళ్ళా అమ్మాయి వాళ్ళు కాదు కదా ?చిన్నగా నవ్వింది ఐశ్వర్య....ఏమిటి సరే. చెప్పండి ..గులాబీకాడలు పట్టుకుంటున్నారు ...అవి పట్టుకుంటే కాని మీకు ..ఎమోషన్ రాదా?కొంచెం జోరుగా అడిగింది?ఐశ్వర్య... ఏమిటి మేడం మీరు అలా అంటారు. సాయిచంద్ర. మొహం దీనం గా పెట్టాడు సాయిచంద్ర... సారీ.. అండీ చాలా కాలం తరువాత ఇంత ఎక్కువగా ..ఇంత ఫ్రీ గా మాట్లాడుతూ న్నాను.. ఓకే.. మీరు చెప్పండి....ఒకసారి ఏమయ్యింది అంటే ..నేను ఒకసారి చదువు నిమిత్తం ..ఓ ఎర్రబస్సు ఎక్కి ...ఓ..మారు మూల గ్రామం వెళ్ళానండి ..ఆ అమ్మాయి ..నాకు కనపడింది ....లిప్ స్టిక్ వేసుకోకుండానే వేసుకున్న ట్లు అనిపించే తేనె పూసినట్లు గా మెరిసే ఎఱ్ఱని దొండపండు పెదవులు ..గులాబీ లాంటి ..చెక్కిళ్ళు.... అందగత్తె ఊర్వశి ముక్కు లాంటి ముక్కు ..నడుము వరకు ఒత్తైన జుత్తు ....తెల్లని.శంఖము లాంటి చక్కని మెడ..చివర్లు కొన తేలిన ట్లుగా ఉండే విశాల నేత్రాలు ..ఏ హారం అవసరం లేకుండానే అందం గా మెరిసే మెడ ..మెరిసిపోయే బంగారపు బుట్టలకే అందం తెచ్చే అందమైన చెవ్వులు. ..అందాలు, సింగారాలూ. అన్నీ కలబోసి నట్లుచీరె కట్టుకున్న అందాల శిల్పం ఆమె ..అలా వర్ణిస్తూ ....అయితే ఒకరోజు . అని .సాయిచంద్ర మొదలు పెట్టగానే ..అమ్మాయి గారు ..నమస్కారం ..ఈ ..దొర ..ఎవరమ్మా బస్ ఆలస్యం అయిపోయిందమ్మా ...మా ఆయన ..నేను. మొక్కల..పని చూత్తం లేండి మీరు ..ఇంట్లోకి వెళ్ళండి... అమ్మా ..వినయంగా చెప్పారు ..పనివాళ్ళు..... అబ్బా ....మీరు ఇప్పుడే రావాలా ..మనస్సు లో విస్సుకొంటూ ...రండి ..మనం హాలులో కూర్చొని మాట్లాడుకుందాం.అంటూ ఐశ్వర్య ...సాయిచంద్ర ని లోపలకు ఆహ్వానించింది... అమ్మయ్య...అస్సలు ...నేను ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే ...చెమటలు పడుతున్నాయి. అస్సలు ఈ అమ్మాయి మొత్తం వింటుందా?విని ఏం స్పందిస్తోందో.. పోనీలే పనివాళ్ళు వచ్చి నన్ను ...నా ప్రేమ ని రక్షించారు...అని మనసులో గొణుకొంటూ లోపలికి దారి తీశాడు.. సాయిచంద్ర.
* * * * * *
రాత్రివేళ... పండు వెన్నెల విరగకాస్తోంది...ఎంత టైమ్ గడుస్తున్నా నిద్ర పట్టక పక్క మీద అటూ..ఇటూ దొర్లుతూంది.. ఏమిటో ..చాలా కాలానికి నా కు సంతోషము, థ్రిల్...అంటే తెలిసింది ఇప్పుడే ..ఏమిటో ..కళ్ళు ..మూసినా, తెరిచినా సాయిచంద్ర గుర్తు వస్తున్నాడు ఏమిటో ...ఎందుకు అస్సలే మళ్ళీ ఏవేవో.. ఆలోచనలు పెంచుకోవడం మళ్ళీ బాధపడటం అవసరమా? ..పనివాళ్ళు హాల్లో పండు కున్నారు ..కాస్త బైట తిరగటం కూడా కష్టమే ...సాయిచంద్ర మాత్రం మంచిగా మాట్లాడతాడు పైగా కష్ట సుఖాలు తెల్సిన వాడు ...ఏమో ..మగవాళ్ళు అంతా అలానే కమ్మగా మాట్లాడతారేమో ...అలా అయితే అతగాడి లవ్ స్టొరీ కూడా. చెప్పాడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు..ఏది.. ఏమైనా ..తన లవర్ అంత అందంగా ఉంటుందా ..ఏమోలే... ఆ.. లవర్ చాలా అదృష్టవంతురాలు...పనివాళ్ళు.. కొద్దిరోజులు రాకుండా ఉండినా బాగుండేది ..చక్కగా అందమైన వెన్నెల్లో తిరిగే వాళ్ళం .ఇప్పడు ...నాకు మందు కూడా తోడు లేకుండా చేశాడు ..ఇక ఈ రాత్రి నాకు జాగారమే ....అలా. ఎనెన్నో ఆలోచనలు తో సతమతం అయిపోతోంది. ఐశ్వర్య.
* * * * * ... *
మరుసటిరోజు ...పొలంలో కూర్చొని రీసెర్చ్ వర్క్ చేసుకుంటున్నాడు సాయిచంద్ర .....ఏమండోయ్.. శాస్త్రవేత్త గారు ..మమ్మల్ని తప్పించుకొని వచ్చేశారు ..?మీ ప్రేమకథ గురించి అడుగుతామనా ..చెప్పండి ..సార్ ..నేను మీకు సహాయం గా వచ్చి మీ పెళ్ళి ఎలా అయినా జరిపిస్తాను ..చిరునవ్వుతో చెప్పింది ఐశ్వర్య... మేడం.. నా.లవ్ ని మీరు సెంకించవద్దు...మీరు మాత్రం ఆ. మాట మీదనే ఉండాలి ..కొంచెము..ధైర్యం తెచ్చుకొని గట్టిగా చెప్పాడు సాయిచంద్ర...కొద్దిసేపు మౌనం.... పొలం ..లో పెద్ద రాయు పై కూర్చొని నీ ళ్లల్లో.... కాళ్ళు ఆడిస్తోంది. తెల్లని కొంగలు మెల్ల మెల్లగా అడుగులు వేస్తున్నాయి.
పక్షులు అన్నీ పొలాలు.. పై తిరుగుతున్నా యు.పిచ్చుకలు నీళ్ళల్లో దిగుతూ..వళ్ళు తడుపుకుంటున్నాయి ..గోరంకలు వాటి పిల్లలకు. రక రకాలుగా శిక్షణ ఇస్తున్నాయి......ఐశ్వర్య.. వైపు చూస్తూ ఉండిపోయాడు సాయిచంద్ర. ఈరోజు చాలాఅందంగా ఉంది ..జీన్స్ ...టాప్. ఒక లూజ్ టీ షర్ట్... జుట్టు అంతాలూజ్ గా వదిలేసి తలలో ఓక్లిప్ పెట్టింది ..దానికి ఓ గులాబీ పువ్వు .... ఇంతలో ఏమి సార్ ...మాకు ఎలా అయినా మీరు ఇవ్వాళ మీ ప్రేమ కథ చెప్పాలసిందే ...మొండిగా పట్టు పడుతోంది ఐశ్వర్య..

....చెప్పాలసిందేనా ?..తప్పదా ?....కొద్దిసేపు..మౌనం ...చెప్పండి ...సార్ ..నేను కూడా మీకు హెల్ప్ చేసి....మీ..లవ్ ...సక్స్ స్..అయ్యే ..లా కృషి చేస్తాను......ఐశ్వర్య అనగానే ...నాకు అస్సలు లవ్ స్టోరీ అనేది పెద్దగా ..ఏమీ లేదండీ ..నేను ..చూడగానే ..ఆమెను ఇష్టపడ్డాను ..అది కూడా. నా వైపే ...మరి ..ఆమె కు నా పై లవ్ ! ఉండాలనేది ఏముంది ?...ఇంకా అది తెలియాలి ?ఏమి చెప్ప ను ..కొంచెం ఫేస్ ..బాధగా పెట్టాడు .సాయిచంద్ర. అస్సలు ఎలా పడ్డారు లవ్ లో ..అడిగింది.. ఐశ్వర్య... ఇంకా నేను ఆరాధిస్తూనే వున్నాను ..ఒకసారి ఒక పల్లెటూరు వెళ్తున్నాను .ఒక అందమైన అమ్మాయి ..కారు తోలుకుంటూ .. వస్తోంది.. పెద్దవర్షం ..కురిసి కురిసి...అప్పుడే ఆగింది కదా అనిమళ్ళి నడవడం మొదలుపెట్టాను .అంతే ..నా మీదకారు తో బురద కొట్టేసింది ...కారు లో వెళ్ళిపోయింది..నేను షాక్ అయ్యాను.. తెరుకొనేలోగా ..మళ్ళి ...కారు వెనక్కి రివర్స్ వచ్చింది ....కార్ డోర్ ..గ్లాస్ క్రిందికి తీసి ...సారీ ..అండీ ఇట్స్ ...రై నింగ్ ..కదా ..సారీ అండీ ..అని చెబుతుంటే ..ఆ మె చిలుక పలకులకు ..ఆ ..అందానికి ఫిదా. అయిపోయి.. మళ్ళి అవాక్కు అ యు పోయాను ..షాక్ నుంచీ తేరుకొనెలోపే ..ఆమె ..ఆమె కారు కనపడలేదు . పెళ్లి కాని బ్రహ్మచారి. ని కదా ..ఇక కొద్దిసేపు బాధ పడ్డాను ..ఆ రోజు నుంచీ ...ఆమె ను ..ఆమె ..అందాన్ని ..ఆరాధిస్తూనే వున్నాను ...ఇప్పుడు చెప్పండి ..నేను ఏమి చేయాలి... ప్లీజ్ ..కోపం వద్దు ..వెళ్లిపోమంటే ..ఇక కనిపించకుండా వెళ్లిపోతాను . దీనంగా ..ముఖం పెట్టుకొని నిలబడ్డాడు .సాయిచంద్ర....ఏమిటి ...బాబు .ఇంత కుట్ర ...అస్సలు మిమ్మలిని ఊరికే వదలను ..అంటూ..బకెట్ నీళ్లు తీసి మీద పోసింది ..ఐశ్వర్య ..తప్పించుకొని అటూ ..ఇటూ పరిగెడుతూఉన్నారు ...కొద్దిసేపు ...ఇద్దరు రొప్పుతూ కొద్దీ దూరంలో నిలబడ్డారు ...ఏం ..చేయమంటారు.. మేడం ...నేను లవ్..డ వ్ ..అంటూ చెబితే ..వాడు ..ఎవడో ..రాజేష్ లా....నన్ను కూడా లెక్కేస్తారేమో ..అస్సలు ...ఈ మగాళ్ళ బుద్దులే ఇటువంటివి అని చీదరించుకొంటారని ..నా భయం. ....ఇంకో..విషయం మేడం ...మీ..అందం ఒక్కటే ముందుగా తెలిసి ప్రేమించా....కానీ ...మీ మనస్సు సౌందర్యం కూడా తెలిసి ..మీరు అంటే ..తెగ మోహం లో పడిపోయాను ..ఇక నన్ను. ...క్షమించండి. అంటూచదివేశాడు..సాయిచంద్ర...ఇక చాలు ఇక్కడ కూర్చోండి.. నేను పరిగెత్తలేను ..రొప్పుతూ కూలబడింది గడ్డిలో ఐశ్వర్య... బాబోయ్ ..మేడం అక్కడ .పేడ ఉంది ...అన్నాడుసాయిచంద్ర.. నాకేమి అంటదు లే ....అది కాదు మేడమ్ ...మీరు కోపం లో నా పై విసిరితే అన్నాడు సాయిచంద్ర.. భలే మంచి ఐడియా ..మీరు చేసిన పనికి .అని నవ్వింది ఐశ్వర్య...

కొద్దిసేపు..మౌనం ..ఇద్దరు దగ్గరగా జరిగారు ..కాదు ...సార్ ...నా గురించి మొత్తం మీకు తెలిసిపోయింది.. కదా ఇంకా నా పైన మీకు ...ఐశ్వర్య ..మాట పూర్తికాకుండానే ..మే డమ్ ...నేటి రోజుల్లో పెళ్లి అయి సంసారం చేస్తూ మధ్య లో విడిపోయి విడి విడిగా.. మళ్ళీఇంకొకరితో పెళ్ళి చేసుకోవడమో ,కల్సి జీవించడమో ..చేస్తున్న రోజులివి ..మీ జీవితం లో మిమ్ములను ఒకళ్ళు నమ్మించి మోసం చేశారు ..ఇంకొకటి ...మీరు పెళ్ళి అవగానే కనపడకుండా పోవడం ..అంటే మీరు మనస్సు లో ..ఒకరు ,పెళ్లి.. ఒకరితో..మీకు ఇష్టం లేదు .అంతే కదా ..రాజేష్ కి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఆతని కోసం వెళ్ళారు...వాడి కన్నింగ్ ...మోసం అర్థం అయిపోయి ఒక ..రకమైన డిప్రెషన్.. కి వెళ్లిపోయారు...అతగాడ్ని. వదిలించుకొని. ఆ..తరువాత యూ.ఎస్..వెళ్లిపోయారు.....ఇంకా ..మీరు తెలివిగా అంతా సమర్పించు కోలేదు .అది మీ అదృష్టం ..లేకపోతే పిల్లా.. జెల్లా..ఎంత కష్టం... అయినా ..మేడం ..పెద్దలు కుదిర్చే సంబంధాలు అన్నీ చెడ్డవి..చెడిపోయేవే ఉండవు...కొన్ని చాలా బాగా కలుస్తాయి. అస్సలు ..పెళ్లిచూపులు... రెండు కుటుంబాలవాళ్ళు కొత్త పరిచయాలు ..అబ్బాయి... అమ్మాయి ..తొలి చూపు ..ఆ. యాంగ్జైటీ.. అదో ..థ్రిల్ ....అంత..కాకపోతే ..ఇద్దరు..పర్శనల్ గా కూర్చొని ..అభిప్రాయాలు తెలుసుకోవచ్చు...తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం.. గురించి... ఎంక్వయిరీ.. చేసుకొవచ్చు. అలా. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ..చాలావరకు బాగానేఉంటాయి... ఏది.. ఏమైనా.. నేను ..మా పెద్దవాళ్ళ ద్వారా ..మీ సంభంధం.. అడిగి ..కోరి. మేము చేసుకుంటాం... అది ...మీకు ..మీ పెద్దలకు ..ఇష్టం అయితేనే... ఓకే.. అని సాయిచంద్ర ..చెప్పగానే ..ఒక్కసారిగా ..ఆమె లో దుఃఖం.. పొంగింది.. అతగాడిని.. ముద్దులతో ..ముంచేయాలి అనుకొంది ....ఎందుకు .మేడం....?..ఏం చెప్పమంటారు ...మిమ్మల్ని.. ఇప్పటికి నేను సంపూర్ణంగా.. అర్థం చేసుకున్నాను ...ఐ... లవ్ ..యూ చంద్ర....అంటూ అతగాడి ..చేతిలో చేయి వేసింది ..నేను కూడా ..ఇప్పుడు భయం. లేకుండా ..చెప్పగలను ..ఐ.. లవ్.. యూ..టూ..మొహంవిప్పార్చుకొని..చెప్పాడు..సాయిచంద్ర......ఇంతలో ఫోన్ రింగ్ అయుంది ....బాబూ..నేను ..వినిపిస్తోందా?....చెప్పండీ.... సార్..వినిపిస్తోంది.. అన్నాడు సాయిచంద్ర.... మేము ..రేపు ఉదయం ..బయలు దేరి వస్తు న్నాము ..కొంచం ఓపిక పట్టండి... మీ పనులు చెడగొట్టి ...మా ..ఇంట్లోనే వుండమ్మన్నాము కదా ..అందుకే చెబుతున్నాను ...వివరణ ..ఇస్తున్నట్లుగా చెబుతున్నారు దొరగారు .మీరు వచ్చేయండి ...ఏం ..పర్వాలేదు కొద్దిగా..నవ్వుతూ చెప్పాడు.సాయిచంద్ర..........


              * * *
మరుసటి రోజు దొరగారు రావడం ...కొద్దిసేపు ప్రయాణ విశేషాలు మాట్లాడుకోవడం అంతా జరిగిపోయింది. ఒకరోజు ఉదయం మళ్ళీ.. దొరగారు ..సాయిచంద్ర. కలిసి రీసెర్చ్ వర్క్ అంటూ పొలం వైపుకు నడిచారు ....ఏం ..బాబూ మా అమ్మాయి దగ్గర నుంచి ఏమైనా విషయం రాబట్టారా?....కొంచెము ఆత్రుత గా అడిగాడు దొరగారు ..మీరు బలే పని చేశారు సార్ ..నాకు అంత స్టోరీ ఆమె బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విషయం ..తెలియదు సార్ ..నాకు మొత్తం ఒక మూవీ చూపించారు ..కొంచెం హాస్యం గా చెప్పాడు సాయిచంద్ర . అదే బాబూ నాకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు ..ఇక మా అమ్మాయి జీవితం సరిదిద్దలేమా బాబు? ..కొంచెం బాధ గా అడిగాడు సాయిచంద్ర .మరి ..నాలాంటి వాళ్ళ కు మీ అమ్మాయి ని ఇచ్చి పెళ్ళి చేసే ఉద్దేశం మీకు ఉందా ..? కొంచం మెల్లగా అడిగాడు సాయిచంద్ర... బాబు అంతకంటే మా అదృష్టం ఇంకేమి ఉంటుంది ? నిట్టూర్పు ..తో మాట్లాడాడు దొరగారు.. ఏమోనండి.. విన్నతరువాత.. మీరు ఎలా చెబితే అలా చేస్తాను ..మీరు ఏ శిక్ష వేసినా పర్వాలేదు ? ..అంటూ చెప్పటం మొదలుపెట్టాడు సాయిచంద్ర ...చూడండి సార్ నేను మీ అమ్మాయి ప్రేమిచుకున్నాం ..అస్సలు మీ అమ్మాయి ని మొదటిసారి మీ దగ్గర కు రాకముందే చూశా ను .అలా కారు బురద దగ్గర నుంచి మొత్తం చెప్పి ఒకళ్ళు కు ఒకళ్ళం అంతా మాట్లాడుకున్నాము. వండుకుతిన్నాము ...మీరు అంగీకరిస్తే మే ము పెళ్ళి చేసుకుంటాము .గబ గబా అప్పచెప్పేశాడు సాయిచంద్ర. బాబు అంటూ దగ్గరగా వచ్చి సాయిచంద్ర ని కౌగిలించుకున్నాడు దొరగారు ..మీరు అన్నీ తెలిసే ముందుకు అడుగు వేస్తున్నారా?.బాబు?..అన్ని విషయాలు మొత్తం తెలుసుకున్నాను ..నాకు ..ఐశ్వర్య కు ఓకే ..మీరు..ఏమంటారు చెప్పండి .సూటిగా అడిగాడు సాయిచంద్ర .మీ..లాంటి వారికి మా అమ్మాయి ని ఇవ్వడం ఒక అదృష్టం ..అయితే ..ముందుగా మా అమ్మాయి నే గట్టిగా అడగాలి ..ఈ సారి అయినా ..నమ్మకం గా పెళ్లి పీట ల పై కూర్చుంటుందా ..ఇక మళ్ళీ మళ్ళీ నేను అవమానాలు పడలేను ..ముందు అది తేలుచుకొని ..మీకు ..మీపెద్దలకు చెబుతాను ..రండి బాబు ..అంటూ ఇంటివైపు కి నడిచారు .
* * * * * *
బెడ్ రూమ్ లో ఐశ్వర్య.. వాళ్ళ అమ్మగారు ..కాఫీ ..సిప్ చేస్తూ ..పిచ్చాపాటి మాట్లాడుకొంటున్నారు ..దొరగారు.. సాయిచంద్ర.. లోపలికి వచ్చారు ..సాయిచంద్ర ..బెడ్ రూం ఈ వతలే... నిలుచండిపోయాడు... లోపలికి వెళ్ళి కూర్చున్న దొరగారు ..సాయిచంద్ర లేకపోవడం చూసి ....అల్లుడుగారు ..లోపలికి రండి బాబు ..అని పిలిచారు.. ఆ పిలుపుకు ఐశ్వర్య కొంచెం సిగ్గు పడుతుంటే ..వాళ్ళ అమ్మగారు విమల ...ఆ .పిలుపు ..నేను విన్నది కరెక్టే నా అని ఆలోచనల్లో పడింది ..ఇంతలో ..లోపల కి తొంగి చూసి ..అమ్మయుగారు ...అమ్మగారు ..ఏదో ..మాట్లాడుకొంటున్నారటలుంది. ..అన్నాడు... అబ్బా ముందు మీరు లోపలికి రండి అబ్బాయుగారు అన్నాడు దొరగారు ...బాగా పిలిచారు నాన్నగారు ..తిక్క కుదిరింది ..నవ్వుకుంటూ అన్నది ఐశ్వర్య.
సరేనమ్మా... ముందు మాకు కూడా రెండు కాఫీ తెప్పించండి .ఆర్డర్ వేశాడు దొరగారు .మాకు తెలియకుండానే...ఏదో జరిగిపోతోంది ..కాస్తంత.. మాకు కూడా చెప్పండి .కొంచం నవ్వుతూ అడిగింది దొరగారి భార్య విమల ..అదే ..తేలుద్దామని ..ఇక్కడకు వచ్చాం... మీ అమ్మాయి గారు ..మీకేమయిన ..విషయం చెప్పారా?..అడిగాడు దొరగారు .లేదే ..మొత్తానికి గతంలో కంటే ..మన ఐశ్వర్య కొంచెము హుషారుగా కనిపిస్తోంది. .తన కళ్ళద్దాలు తుడుచుకుంటూ చెప్పింది తల్లిగారు విమల .అదే ..ఇప్పుడు ..ఈ ...బాబు ..మన అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు ...మనం అంగీకరిస్తే పెళ్లికూడా చేసుకుంటాం అంటున్నాడు ...ఆలనా ..మనం ఇష్టపడటం ఏమిటి ..దాని మొహం ..కొంచెము రెట్టింపు ఉత్సాహం తో లేచి నిలబడింది .తల్లిగారు విమల .పనివాళ్ళు దగ్గర నుంచి కాఫీ అందుకొని బెడ్ రూమ్ లోకి వస్తోంది ఐశ్వర్య ..మీరు ..అబ్బాయి గారు ముందు కాఫీ త్రాగండి .వయ్యారం గా అక్కడ పెట్టింది ఐశ్వర్య.కాదమ్మా నీతోనే ముందుగా మాట్లాడాలి ...ఇక్కడ కూర్చో ..అంటూ చేతిలో కాఫీ .. సాయిచంద్ర కు ఇచ్చి ..ఇంకో కాఫీ తాను తీసుకొని సిప్ చేస్తున్నాడు దొరగారు ...చూడమ్మా ఇది జీవితం..ఈసారి..అయినా కాస్తంత బాధ్యతాయుతంగా వ్యవహరించి.. పెండ్లి చేసుకోవాలి ...ఇదివరలో ..నీవు అలా పెళ్ళి లో చేసిన దానికే ..నా పరువు ..కుటుంబ పరువు ..పోయి..అందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల నా మనస్సు కుపెద్ద గాయం అయి.. చాలాకాలం ..ఇప్పటివరకు...కూడా ఆ పెద్ద మనుషుల ముందు తలఎత్తుకోలేక ,వాళ్లకు ఎదురుపడకుండా తప్పించుకొని తిరుగుతున్నాను.నువ్వు సంపూర్తిగా.. ఒప్పుకుంటేనే ..నేను ..ఈ ..బాబు వాళ్ళ అమ్మా.. నాన్నగారితో మాట్లాడగలను... ఐశ్వర్య కళ్ళలోకి చూస్తూ గట్టిగా అడిగాడు దొరగారు .అబ్బా నాన్నగారు ఆ సందర్భం. ,ఏమిటో ఎందుకు అలా చేయవలసి వచ్చిందో.. అంతా నేను వివరించి చెప్పాను ఆయునా సరే నన్ను చేసుకుంటాను అంటున్నారు ..అందుకే సాయిచంద్ర ని నేను కూడా సినిసియర్ గా ఇష్ట పడుతున్నాను ..ఇక నా నిర్ణయానికి తిరుగు లేదు ప్రామిస్ చేస్తున్నట్లు గా గట్టిగా చెప్పింది ..అలా గట్టిగా నిలబడు తల్లీ... దగ్గరగా తీసుకొని కళ్ళు వత్తుకున్నాడు తండ్రి దొరగారు ...సార్ మీ అమ్మాయి గారు విషయంలో ఇక ఎటువంటి పొరపొచ్చాలు రావు ..మీరు సంతోషముగా ఉండండి... నవ్వులు కలిపాడు సాయిచంద్ర ..ఐశ్వర్య.. ని.,సాయిచంద్ర ని చెరొకవైపు ..రెండు చేతులతో దగ్గరకు హత్తుకున్నాడు.
* * * * * *
అలా. త్వర.. త్వరగా ముహూర్తం చూసేసి సాయిచంద్ర.. ఐశ్వర్య ల పెళ్ళి జరిపించేశారు ..ఆ..రెండు కుటుంబాలు వాళ్ళు ..బంధుత్త్వం కలుపుకున్నారు ....అలా ..ఆనందం. .తో ..మనుమడు...మనుమరాలో వస్తే ..మాకు కాస్త ..టైం. పాస్ అవుతుందిగా ..అనుకొంటూ ..ఎదురుచూస్తూ వున్నారు...ఆ రెండు కుటుంబాల వారు...ఇంతలో ..కొడుకు ..చెన్నై నుంచి ..బిషనా సర్దుకొని దొరగారి ఇంట్లో దిగాడు ....అదే.. మిట్రా.. ఫోన్ ఏమీలేదు... పైగా ..నువ్వు ఒక్కడివే ..ఇంత షడ న్.. గా ఊడి పడ్డావ్?..కొంచెం బిక్కమొహం..తో అడిగాడు తండ్రి దొరగారు ...ఏమో ..నాన్నగారు ...ఆ..అమ్మాయి తో నేను పడలేను ..విడాకులకు అప్లై చేసి ..ఇక ఇక్కడికి వచ్చేశాను ..కొంచెము కోపంతో ముక్కుపుటాలు అదిరిపడుతుంటే ఆవేశంగా ..చెప్పాడు.....ఇదేమిటి...భగవంతుడా ..మళ్ళీ... నాకు ఇంకో పరీక్ష ..పెడుతున్నావా ?..ఆలోచనల్లో పడ్డాడు దొరగారు..అలా కొద్దీ నెలలు గడిచిపోయాయి. ప్రతి రోజు ఐశ్వర్య ..సాయిచంద్ర దంపతులు సిటీ కి కారు లో వెళ్ళడం రావడం ...వీలుబట్టి ఒకోక్క సారి అక్కడ ఆమె కొనుక్కున్న ఇంట్లో ఉండిపోతూ ..కూడా ఎంజాయ్ చేస్తున్నారు అల్లుడుగారు ..సాయిచంద్ర ..ని అడిగి ఏదైనా సలహా తీసుకొని కొడుకు సంసారం తీర్చి దిద్దాలని...అనుకుంటున్నాడు అంతలోనే కొత్తగా పెళ్ళైనవాళ్ళు కదా ..మళ్ళీ వాళ్ళను ఈ ..జంజాటం లోకి లాగడం వద్దులే అనుకొని ఆగిపోతున్నాడు.
ఒకరోజు పొలం దగ్గర కూర్చొని ...తన రీసెర్చ్ వర్క్ చూసుకుంటున్నాడు సాయిచంద్ర .పొలం పని చూసుకొని వచ్చి అల్లుడు సాయిచంద్ర పక్కన కూర్చున్నాడు ...కొద్దిసేపు మౌనం ..ఆ తరువాత ఎదో కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు ..మధ్యలో మాట మాట కల్సి కొడుకు ,కోడలు సంసారం గురించి చర్చ్ కు వచ్చింది. అస్సలు సమస్య అంతా ఎక్కడ ఉంది మొత్తం అంతా వివరించి చెప్పాడు దొరగారు . నేను ..మీ అమ్మాయి కల్సి ఓ ..ఐడియా వేసి ఓ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం లేండి ..మాట ఇచ్చాడు అల్లుడు సాయిచంద్ర................ఆ ప్రకారం గా ప్రతి రోజు ఆ విషయం పైననే కాస్తంత ..దృష్టి పెడుతున్నారు ...మధ్య ..మధ్య కొడుకు ని ..కల్సి కొన్ని విషయాలు రాబడుతున్నారు. ఐశ్వర్య.. సాయిచంద్రలు .













Navagraha Stotram to read at Eclipse time

గ్రహణం సమయంలో చదవాలిసిన నవగ్రహ సోత్రo

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః |

విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥
ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥
దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।
అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥
దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ ౭॥
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ ౮॥
అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ ౯॥
॥ ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సమ్పూర్ణమ్

Surya Graamam - Effects on 12 Rashis


సూర్యగ్రహణం:
సూర్యగ్రహణం ఈసారి గురువారం రోజు వస్తోంది ..అందుకే ..గురునామ స్మరణతో ..ప్రారంభించి మీ ఇష్ట దైవం ఎవరో వారి నామ స్మరణ చేసుకోవచ్చు .ప్రతీ విషయానికి ..మనం మానవులం కాబట్టి భయం సహజం ..అయితే మనం ఒకటి ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి..భగవంతుని ఏ రూపంలో ఆరాధించిన ,ఆయన పాదాలు పట్టుకొని ఆశ్రయిస్తే మనలను తప్పక రక్షిస్తాడు కాకపోతే బలమైన నమ్మకం ఉండాలి .ఎంత నమ్మకం అంటే ద్రౌపది ..వస్త్రాపహరణం జరిగేటప్పుడు శ్రీకృష్ణ భగవానుని ..ఆశ్రయించి నట్లు ..ఆశ్రయించాలి


. శ్రీవేంకటేశ్వర స్వామి వారి నో, శ్రీ రాములవారినో, శ్రీ ఆంజనేయస్వామి వారినో ,శివభగవానుడు నో .నరసింహస్వామి వారినో,దుర్గాదేవి.., షిర్డీసాయి నాధుడినో..లేక విష్ణు సహస్రనామ పారాయణం, లేక శివుని అభిషేకం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ ఏదో ఒక టి మీ కు ఇష్టమైన పరిహారం చేసుకోవచ్చు .భగవంతుడు ఒక్కరే వివిధ రూపాలు గా కని పిస్తాడు ..భగవద్గీత లో భగవానుడు చెప్పినట్లు .ఎవ్వరు ఏ విధముగా కొలిచినను ..ఏ రూపంలో కొలిచినను ..వారు నన్నే పొందుతారు .అని అందుకే సర్వ దేవ నమస్కార:కేశవం ప్రతిగచ్ఛతి " అని ..కాబట్టి భారం ,భయం మొత్తం భగవంతుని పాదాలపై ఉంచి ధ్యానం చేసుకోండి .ఇంకో విషయం జ్యోతిష్యం విషయం లో కూడా చెప్పిన విషయాలు ..భవతించ... నభవతించ ..అని పూర్వకాలం ఋ షులు ...కూడా చెప్పి యున్నారు అంటే జ్యోతిష్యం లో విషయాలు జరుగవచ్చు,... జరగకపోవచ్చు ..అనికూడా ఒక వాదం ఉంది కాబట్టి అన్నింటికీ మూలాధారమైన వాడు భగవంతుడే అని మనం తెలుసుకొని ఏదో ఒక రూపములో ఆయనను పట్టుకుందాం .

ఇక గర్భిణులు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం ..బైట తిరిగిన తప్పేమి లేదు కానీ ఒక్కోక్క సారి ఆ రేడియేషన్. ప్రభావం కర్మ కాలి మన మీదే పడుతుందేమో అని ...ఏ గర్భిణీ ఆయునా విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అన్నారు .ఎండాకాలంలో ఎంతో మంది బైట పనులు చేసుకుంటారు ..కానీ కొద్దిమంది ఎండవడ తగిలి అద్దం పడతారు ..అలా ఎవరికి జరుగుతుందో , ఎవరికి జరుగదో చెప్పలేం కాబట్టి ...ఆ కొద్దిసేపు బైట తిరగకుండా విశ్రాంతి తీసుకోమన్నారు పెద్దలు.అలానే గ్రహణం కనిపించే దేశాలలో ..గ్రహణ సమయములో అన్నము తినడం ,నిద్రపోవడం, మైథునం. లాంటి పనులు చేయకూడదు ..గ్రహణం పట్టే సమయం కంటే ముందు కానీ ..విడిచిన తరువాత కానీ భోజనాలు చేయడం ఉత్తమం ..ఇక చంటి పిల్లలు ,వృద్ధులు వారి వారి అనుకూలత బట్టి చేసుకోవచ్చు వారికి తప్పులేదు అని పెద్దలు చెబుతారు .

ఇక సూర్యగ్రహణం ఉదయం8గంటలు నుంచి 11.20 వరకు ఉంటుంది .ముఖ్యమైన ప్రదేశాలలో ధర్భలు వేసి ఉంచుకోండి. గ్రహణ సమయములో మీ ఇష్ట దైవ స్తోత్రాలు ,మంత్రాలు చదువుకోవచ్చు. అది ఎన్నో వేల రెట్లు ఫలితం,పుణ్యం ఇస్తుంది ..శుచి గా లేకపోతే మనస్సులో చదువుకోవడం మంచిది ..గ్రహణం తరువాత విడుపు స్నానం చేస్తారు ..కుదరని వాళ్ళు తలపై నీళ్లు చల్లుకుని మరుసటి రోజుతల స్నానం చేయవచ్చు .వృద్ధులు, ..రోగులు ..చేతకానివారు తల పై నీళ్లు చల్లుకుని కాళ్ళు కడొక్కుని ..మూడు సార్లు ఆచమనం చేసి మీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోవచ్చు. అన్ని వాట్సప్ లు చూసేసి భయభ్రాంతులకు లోను కావద్దు ..మూఢ నమ్మకాలు పెంచుకొని ఒక్కరిని బాధ పెట్టకుండా ,మనం బాధలు పడకుండా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం.



        కేతుగ్రస్త సూర్యగ్రహణం.. ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది. ధనుస్సు రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ధనుస్సు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశివారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే, ఈ సూర్యగ్రహణం వల్ల ఏ ఏ రాశులకు అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయో జ్యోతిషులు తెలియజేస్తున్నారు.

​మేష రాశి


ఈ రాశివారికి గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తుంది కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వీరికి తొమ్మిది భాగ్య స్థానం.. అలాగే ఆధ్యాత్మికతకు కారకం. కాబట్టి ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటంతో కొంత తార్కికవాదన పెరగడం... ప్రతి దానికి ఖండించే మనస్తత్వం అలవడే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక అంశాలపై కూడా కొంత ఆసక్తి తగ్గుతుంది.

​వృషభ రాశి

ఈ రాశివారికి 8వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది. అష్టమ స్థానం అనుకోని సమస్యలు, అవమానాలు, ఆర్థిక సమస్యలకు మూలకారణం. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు తగదు. ఇలా చేస్తే సమస్యలు దూరమవుతాయి.

​మిథున రాశి

ఈ రాశివారికి గ్రహణం ఏడో స్థానం సంభవిస్తుందిది. సప్తమ స్థానం వైవాహిక జీవితం, వ్యాపారం, వ్యసనాలకు కారకత్వం వహిస్తుంది. సూర్య గ్రహణం వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి, వైవాహిక జీవితం కానీ, భాగస్వామ్య వాప్యారాలలో కానీ అనవసర పట్టుదల, అహంకారానికి పోరాదు. ఈ గ్రహణం ఏవిధమైన ప్రభావం చూపించదు. పంతానికి పోయి వ్యసనాలకు బానిస కాకుండా నిగ్రహించుకోవాలి.

​కర్కాటక రాశి

ఈ రాశివారికి గ్రహణం ఆరో స్థానంలో సంభవిస్తుంది. ఇది అనుకూల స్థానం కాబట్టి కోర్టు కేసులు, ఇతర వివాదాల నుంచి బయటపడే అవకాశం మెరుగవుతుంది. అలాగే వృత్తిపరంగానూ అనుకూల ఫలితాలు ఉంటాయి.

​సింహ రాశి

ఈ రాశివారికి గ్రహణం పంచమ స్థానంలో సంభవిస్తుంది. పంచమ స్థానం బుద్ధికి, సంతానానికి, సృజనాత్మకతను కారకం. ఈ గ్రహణం వల్ల సంతానంతో సరైన అవగాహనలేమి, అహంకారం కారణంగా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి.

​కన్య రాశి

గ్రహణం నాలుగో స్థానంలో సంభవిస్తుంది. చతుర్ధ స్థానం సుఖానికి, వాహనాలు, స్థిరాస్తులకు కారకం. కాబట్టి అనుకూలించని స్థిరాస్తి, వాహన కొనుగోలు, ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బద్ధకం, అలసత్వానికి పోకుండా ఉండటం వల్ల చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు.

​తుల రాశి

ఈ రాశివారికి గ్రహణం మూడో స్థానం సంభవిస్తుంది. ఇది ఇది అనుకూల స్థానం. కాబట్టి ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మానసికంగా శారీరకంగా అనుకూలంగా ఉంటుంది.

​వృశ్చిక రాశి

ఈ రాశివారికి గ్రహణం రెండో ఇంట సంభవిస్తుంది. ద్వితీయ స్థానం ధనం, కుటుంబం, మాటకు కారకం. కాబట్టి గొప్పలు, ఆడంబరాలకు పోకుండా ఉండాలి. అలాగే మాట ఇచ్చే విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో అనవసర వాదాలకు దూరంగా ఉండాలి.

​ధనుస్సు రాశి

ఈ రాశివారికి గ్రహణం ఒకటో స్థానంలో సంభవిస్తుంది. అహంకారం, తొందరపాటు తనానికి ఇది కారకం. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. చెడు చేసే నిర్ణయాలు తీసుకోవడం, వ్యతిరేక ఫలితాలను ఇచ్చే పనులు చేపట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆలోచించి అడుగు వేయడం మంచిది.

​మకర రాశి

ఈ రాశివారికి గ్రహణం ద్వాదశ స్థానం (పన్నెండు)లో సంభవిస్తుంది. ఇది ఖర్చులు, విదేశీ యానం, ఆరోగ్య సమస్యలకు కారకత్వం. ఖర్చులు, పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆలోచించి అడుగు వేయడం ఉత్తమం. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

​కుంభ రాశి

ఈ రాశివారికి గ్రహణం 11వ స్థానంలో సంభవిస్తుంది. ఇది లాభ స్థానం కావడం వల్ల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దీని వల్ల ఆర్థిక సమస్యలు సమసిపోవడం, దూరమైన మిత్రులు, బంధువులు కలవడం లాంటి శుభఫలితాలుంటాయి.

​మీన రాశి

ఈ రాశివారికి గ్రహణం పదో స్థానంలో సంభవిస్తుందిది. దశమ స్థానం వృత్తి, పేరు ప్రతిష్ఠలకు కారకం. వృత్తి పరంగా అనుకూలంగా ఉన్నా పై అధికారులతో అనవసరమైన వివాదాలు పెట్టుకోరాదు. పేరు కోసం కాకుండా నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

Hues of Love (short story - part 2)

ఓ.కె....మేడం. మీరు అస్సలు మగజాతి అంటే కోపం అన్నారు .ఓ.కె.అస్సలు ఎందుకు అలాంటి భావం మీలో వచ్చింది .అంటే మీరు వాళ్ళ వల్ల దెబ్బతింటమో, లేక నష్టపోవడమో జరిగి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ..యామై... కరెక్ట్..? సందేహం వ్యక్తం చేస్తూ పోజ్..పెట్టాడు సాయిచంద్ర.. తెలుసుకొని ఏమి చేస్తారండి మీరు ఏమైనా ...ఆరుస్తారా?...తీరుస్తారా?.కొంటెగా అడిగింది. ఐస్వర్య.. చూడండి మేడం..మనం ఎందుకు పరిచయం అయ్యామో తెలియదు. మీకు నా వల్ల సహాయం జరగవచ్చు.ఏమో ?ఎలా చెప్పగలం కంఠం బేస్ వాయిస్ తో చెప్పాడు .సాయిచంద్ర. అస్సలు అదికూడా కాదు మేడం మనం ఇద్దరం దోస్తులం కదా ,నా ప్రేమ కష్టాలు మీకు....మీ..కష్టాలు నాకు చెప్పుకుందాం.అని...సాయిచంద్ర చెప్పగానే ఆమె మౌనం గా ఉండిపోయింది .....కొద్దిసేపు కాగానే మేడం త్వరగా చెప్పాలి ...తొందర పెడుతున్నాడు ...........ఎలాగో.. అలా అస్సలు ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ....తెలిస్తే వాళ్ల. ..నాన్న గారికి చెప్పి సొల్యూషణ్.. ఆలోచించవచ్చు ...అబ్బా త్వరగా చెబితే బాగుండును దేవుడా ..అనే. యాంగ్జైటీ లో పడిపోయాడు సాయిచంద్ర........ ఏముంది ....సార్ .కొన్ని సంవత్సరాలు క్రిందట .......అంటూ.......ఆమె గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది.

ఒకరోజు....సాయింత్రం.... బజ్ ....బజ్ ..కాలింగ్ బెల్ శ బ్దం ......తలుపుతీసి....బైటకు వచ్చింది .ఐశ్వర్య . ...కొంచెం మాట్లాడటానికి ....సందేహించింది. ....హాలో.. నన్ను గుర్తు పట్టలేదా ...నేను....రాజేష్ ని కొంచెం చిరునవ్వు చిందిస్తూ ..ముందుకు వచ్చాడు .......ఓ.....రాజూ నువ్వా ...బాగున్నవా. ? లోపలికి రా. కూర్చో. ...అంటూ లోపలికి నడిచింది .ఐశ్వర్య ...నీకోసమే ...బోకే .. హ్యాపీ బర్త్ డే ....అంటూ ఇచ్చాడు .రాజేష్. . నీకు ...ఇంకా గుర్తు0దా ?వ0డర్


ఓ.కే ....థాంక్స్.. అయితే.. ఇవన్నీ ...నేను కాలేజీ స్ట డీస్ తరువాత బంద్ చేశాను.... అవును ....నీకు ఎలా గురుతుంది?కొంచెం ...ఇష్టం గా కొంచెం ఆశ్చర్య0 గా ..ముఖ0 ...విప్పా రుతుంటే అడిగింది ..ఐశ్వర్య... మనం కాలేజీ రోజుల్లో చేసుకున్న ...బర్త్ ...డే. పార్టీ లు. మన ఫ్రెండ్స్... మర్చిపొగలమా ?..అందులో అస్సలు నీ !లాంటి దోస్తులను ఎప్పటికీ మర్చి పోలేము .కళ్ళలోకి చూస్తూ ధీర్ఘం తీశాడు ..రాజేష్ ...ఇంతకీ నేను ఇక్కడ ఉన్నానని ఎలా కనుక్కున్నావు ? కనుబొమ్మలు ముడి పడుతుంటే సందేహం గా అడిగింది ఐశ్వర్య... ఏముంది ....నాకు ఇక్కడ ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చి0ది.. మన గాంగ్ ...కూడా నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావని ...చెప్పారు.. మొన్న ..ఈ ..మధ్య నేను ఇదే కాలనీ లో ఇల్లు వెతుకుతున్నా ను ..నువ్వు అప్పుడే బయలు దేరి బైట నిలబడ్డావు ....నేను ..పలకరించే లోపే నువ్వు కార్ ఎక్కి వెళ్ళి పోయావు .అలా ..కాకతాళీయంగా ..మనం కలుసుకున్నాము ...చాలా తేలిగ్గా చెప్పేశాడు.రాజేష్...


ఇంతకూ ...మీ ఫ్యామిలీ ,పిల్లలు ....అంటూ ఐశ్వర్య ఎ త్తగానే ..మగవాళ్లకు అంత త్వరగా ఈ రోజుల్లో అవుతున్నాయా?..ఇంట్లో ఇతర భాధ్యతలు. ఇంకా ఎన్నో కుటుంబ సమస్యలు ఉంటాయి గా ! అని రాజేష్ చెబుతూ ...మరి ...నీ ..కు పెళ్ళి అయ్యిందా?కొంచెం ...ఎక్కువ ..ఆతృత పడుతూ ...అడిగాడు రాజేష్... బాబూ....ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంత ..తేలిగ్గా అవుతున్నాయా?.ఎన్నో ..పరీక్షలు పెడుతున్నారు వచ్చేవాళ్ళు...దీర్ఘం ..తీసింది. ఐశ్వర్య.. ఏమిటి...నీ లాంటి అంద గత్తెలకు ...కూడా పెళ్ళిళ్ళుఆలస్యమా?...కొంచం ...సంతోషం వ్యక్తం చేస్తూ అన్నాడు... రాజేష్...అయితే మరి ఇక్కడఇంకా ఎవరు ఉంటారు..... అడిగాడు రాజేష్ ...నేను ..మా ఫ్రెండ్.. కోమలి ...తను ఇప్పుడు ఊరు వెళ్ళి0ది. చెప్పింది .ఐశ్వర్య. .ఓ.కె మరి .డిన్నర్ బైట చేద్దాం... ఎలాగూ ...నా వల్ల ఆలశ్యము అయిపోయింది ..కదా.. ఏమ0టావు. కొంచం రి క్వెస్ట్ గా అడిగాడు రాజేష్ .....నో ..నో...నేను ఇప్పుడు ఇక బైటకు రాను ..ఇంకా.. నీవు కూడా .ఇక్కడ కు రావద్దు. ఈ...రోజు ..మా ఇంటి ఓనర్స్ పెళ్లికి వెళ్లారు. అస్సలు ఫ్యామి లీ వాళ్లకు తప్ప ఇంకెవరికి రెంట్ కి ఇవ్వరు ..అయితే ..నాన్నగారికి కొంచెము తెల్సిన వాళ్ళు. ముందే చెప్పారు జె0ట్స్ ,ఏ ఫ్రెండ్స్ రావడానికి లేదు అని ..ప్లీస్ ట్రై. ..టూ ..అండర్ స్టాండ్ మీ ..కావాలంటే నా ఫొన్ నెంబర్ తీసుకో ..బైట ..ఎక్కడైనా కల్సుకుందాము... కాస్తంత ..ప్లజెంట్ గా చెప్పింది ఐశ్వర్య... ఓకే.... ఐశ్వర్య ..థాంక్ యూ ..కాఫీ ..చాలా బాగుంది .. కాంప్లిమెంట్ ఇచ్చి నవ్వుతూ ..బై. ..చేయు ఊపుతూ బైటకు నడిచాడు రాజేష్.....రాత్రివేళ.....నిద్ర ...పట్టక అటూ..ఇటూ.పక్క పై దొర్లుతో0ది ..ఐశ్వర్య.... రాజేష్..... మాటలు పొగడతలు... ఆతని. ..చూపులు గురించే ఆలోచనల్లో ..పడిపోయింది.ఐశ్వర్య... మంచి చదువు....మంచి ఉద్యోగం ...ఉన్నాయి.. పర్సనాలిటీ,,... అందం కూడా తక్కువేమీ కాదు ..ఇప్పుడు ..నాన్నగారు ..తెచ్చే పెళ్ళీ చూపుల్లో ...కూర్చునేంత ..ఓర్పు, ..ఓపిక.. తీరికా.. లేవు ..అమ్మా.. నాన్నగారు...పెళ్ళి... సెటిల్మెంట్. అంటూ ..గొడవ చేస్తున్నారు ....ఒక విధంగా.... రాజేష్ కనుక .లైన్ లోకి వస్తే ...పచ్చజెండా ...ఊపి ... నాన్నగారి కి చెప్పడం ..ఎలా. ఉంటుంది... కొంచం ...కలల్లో ..తేలిపోతోంది.. ఐశ్వర్య...... అలా. నిద్రలోకి జారుకొంది.....

* * * * *
ఫోన్ రింగ్ అవుతోంది.. పరిగెత్తుకొని వచ్చి ఫోన్ తీసింది ..ఐశ్వర్య... అమ్మ ...చెప్పు ..."..క్షేమ.. సమాచారం పూర్తి కాగానే .విషయానికి వచ్చేసింది ..చూడు. ..తల్లీ ..నువ్వు ఆడపిల్లవి ..ఉద్యోగం తో. పాటు పెళ్ళి... సంసారం ముఖ్యం ..ఏ వయస్సు ..లో ముచ్చట..ఆ. వయస్సులో ..జరగాలి ..నేను ..ఎప్పుడో. పెళ్ళి ..చేస్తే బాగుంటుందని ..చెప్పాను....ఇదిగో...ఇంత దూరం. మీ ..నాన్నగారే. ..తీసుకొచ్చారు ....నాకు ....ఆడపిల్ల వి ఒక్క దానివి ...అంత దూరంలో ..ఉంటుంటే. చాలా. భయంగా ఉంది .రేపు వచ్చే...వీకెండ్ ..లో వచ్చి వెళ్ళు ..కొన్ని పెండ్లి సంబంధాలు. వచ్చాయి... నువ్వు కొన్ని ఎంపిక చేయాలి .ఎందుకు చెబుతున్నానో విను సరే ..అమ్మా. నేను సెలవు రోజు ల్లో వస్తానులే ..నాన్నగారికి చెప్పు ఉంటాను ...ఫోన్ పెట్టే సింది. ఐశ్వర్య..


* * * * * *
రాజేష్ ....ఐశ్వర్య.. కల్సి. షాపింగ్ చేస్తున్నారు ....ఐశ్వర్య..... డిన్నర్ టైం ..దాటిపోతుంది... పద ..ఇక్కడ దగ్గర్లో రెస్టారెంట్ కి వెళదాం.. ఇద్దరు కల్సి భోజనం చేశారు ....ఏదైనా. మూవీ కి వెళదాం.. బోరు కొడుతో0ది .అన్నాడు రాజేష్.. వద్దు రాజేష్ ..నాకు అంత మూడ్ లేదు ..లే ..కానీ. ..కాసేపు ఎక్కడైనా ఓ ...పది నిమషాలు.. ఫ్రీ గా కూర్చుందా0....పద ...కొద్దీ దూరం కబుర్లు చెప్పుకుంటూ నడిచారు ..ఓ..పార్క్. లో. కూర్చున్నారు ...ఇంతకీ ....పెళ్ళి కుదిరిందా ?ఎప్పుడు చేసుకుంటున్నావు ?...కాస్తంత ..నవ్వుతూ అడిగాడు ..రాజేష్ ....ఇప్పుడు ..వచ్చిన సమస్య అదే ...సంబంధాలు ..వస్తున్నాయి ..కానీ అందరూ యు.స్.లో ఉన్నవాళ్ళో. లేక ..పెళ్ళి కాగానే ఎబ్రాడ్ ..వెల్దామనో కండీషన్ పెడుతున్నారు ....కొంచెము ఇబ్బంది గా చెబుతో0దీ ఐశ్వర్య ..మరి ఇంకే ......హాయిగా వెళ్ళచ్చు గా. ..సొల్యూషన్ ఇచ్చినట్లుగా మధ్యలో ..మాట్లాడాడు రాజేష్.. ...అబ్బా ..నాకు ...ఎబ్రాడ్.. ఇష్ట0 ..లేదు.....ఎందుకంటే ..ఆల్రెడీ... మా ..అన్నయ్య... అక్కడే ..వున్నాడు ..వాడు ..ఇండియా ..వచ్చేస్తాడని ..నమ్మకం లేదు.మా అమ్మా.. నాన్నలను ..చూసుకుంటూ.. ఇండియా !లో. నే. ఉండిపోవాలని ఉంది.. కొంచం ..నిట్టూ ర్పు.తూ చెప్పింది ..ఐశ్వర్య ... అస్సలు ...ఈ. రోజుల్లో నీలాగా ....ఆలోచించే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారా ? "నాది అదే సమస్య ..మా సిస్టర్స్ ..పెళ్ళి చేయాలి ...మా నాన్నగారు లేడు ...మా అమ్మ.. ..నేను వెళ్ళి ..డబ్బులు పంపిస్తానంటే ..వెళ్ళద్దు ..మగదిక్కు లేని సంసారం ..అంటూ ..ఏదేదో మాట్లాడుతో0ది. మా అమ్మ ..నాదీ ..అదే. బాధ ..చెప్పాడు రాజేష్.....అందుకే. ..నా. బాధ్యతలు లో పాలు పంచుకొని ...నాకు సహకరించే వాళ్ళ కోసం చూస్తున్నాను...అలా. దొరికితే ..నా అదృష్టమే.... ఇద్దరిసేపు ....కొంచం మవునం .....తనకు ఐశ్వర్య అంటే ఎంతో ఇష్టం . ,తాను ఇచ్చిన ఆఫర్ ని ....మె చ్చి ..నన్ను ఇష్టపడుతున్నానని ...పెళ్ళి.. చేసుకుందాం ...అంటే ఎంత బావుణ్ణు .ఇద్దరం ...ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ మిగతా విషయాలు చూసుకోవచ్చు ..తెగ ...ఊహలు ఊహించేస్తున్నాడు .. ఎంతో ...ఆ0దోళన పడుతూ....ఆమె ..సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. రాజేష్. ..


...ఓకే...ఇక వెళదాం.. మా ..రూముమే ట్.. కూడా వచ్చే ఉంటుంది ....చూద్దాం ..కాలం ..ఏమి నిర్ణయిస్తుందో....!బై..రాజేష్ అంటూ ...ఎవరి ఇంటి కి ...వాళ్ళు బయలు దేరి వెళ్ళిపోయారు.


* * * * * *
ఒక రోజు సాయ0 కాలం.వెన్నెల పుచ్ఛపువ్వులా ప్రకాశిస్తోంది. కొద్దిసేపు కరెంట్ లేకపోవడం వల్ల బాల్కనీ లో అటూ ఇటూ తిరుగుతున్నాడు .పైనుంచీ క్రిందికి చూస్తుంటే ..ఆకు పచ్చని గరిక తివాచీ లా పరుచుకొంది .అందమైన పువ్వులు విరగబూసిన పున్నా పువ్వులు తివాచీ నిండా పరుచుకున్నాయి .పక్కనే ఎత్తైన పున్నాగ చెట్లు మంచి సుగ0దాన్ని వెదజల్లుతున్నాయు ..మనస్సు ఆహ్లాదకరంగా ఉంది .ఐశ్వర్య అందం ..పదే పదే గుర్తుకు వస్తోంది.. ఇక నిరీక్షించి. లాభం ఏమి లేదు ..అస్సలు ..నా వైపు నుంచి ప్రపోజల్ పెడతాను ..సెల్ ఫోన్ తీశాడు రాజేష్...ముందుగా మెసేజ్ పంపించాలి అనుకున్నాడు .. కొద్ది సేపు ఆలోచనల్లో పడ్డాడు .కొత్త పరిచయం ఏమి కాదుగా ...ఇక డైరెక్ట్ గా ..రింగ్ఇచ్చాడు ..హలో......చెప్పు రాజేష్ .. ఫోన్ తీసింది ఐశ్వర్య.....ఏదేదో విషయాలు సోది లా చెప్పుతున్నాడు రాజేష్ .కొద్దిసేపు ఓర్పు గా ..విన్నది .సరేలే ..తరువాత ..మాట్లాడుకోవచ్చు గా అసహనం గా ఫీల్ అవుతొంది .....అధికాదు ...ఐశ్వర్య .నేను ఎలా చెప్పాలా? అని ..ఏమీలేదు ..మన ఇద్దరి భావాలు ఒకటే ..చాలాకాలం నుంచీ ..పరిచయం ..అందుకే ..మనఇద్దరం. కల్సి సెటిల్ అవుతే ...నీ అభిప్రాయం చెప్పు..కొంచం . చెప్పటానికి కొద్దిగా అవస్థలు పడుతూ పూర్తిచేశాడు .రాజేష్.....!ఒక్కసారిగా ...కొంచెము సేపు స్టన్ ...అయిపోయింది ..ఏమి చెప్పాలి ...ఏమి..మాట్లాడాలి అర్థం కాలేదు ...ఫోన్ పెట్టేసింది. ఐశ్వర్య... కొంచెం ...మనస్సులో ..ఆందోOళన పడ్డాడు ..అనవసరం గా ఆమె మనస్సు బాధపెట్టానా?...కొద్దిసేపు ...ఆలోచించాడు .." మళ్ళీ ..ఫోన్ తీసుకొని సారీ ..ఒకవేళ ..నిన్ను బాధ పెట్టాను అనుకుంటే సారీ ...కానీ మన స్నేహం. ...మాత్రం వర్దిల్లాలి ..ఉంటాను ..బై...అని ఫోన్ లో మె సేజ్ ..పెట్టాడు. రాజేష్. ...


.రాత్రివేళ ....చాలా టైం అయ్యింది ..కళ్ళ మీదకు నిద్రే జాడలేదు ..రాజేష్ ..గురించే ఆలోచిస్తోంది .ఎప్పట్నుంచో రాజేష్ తెలుసు ..అతను పూర్తిగా గ్రామీణ వాతావరణంలో పెరిగాడు ..బంధుత్త్వాలు ,అనురాగాలు ,విలువలు అన్నీ తెలిసే పెరిగి ఉంటాడుగా ...పైగా ఆడపిల్లల ...చెల్లెళ్ళు. బాధ్యత ,అన్నింటి తో పెరిగినవాడు ..కాబట్టి ఒప్పేసుకుంటే ...అమ్మో ....ఏమో ...వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ కొంచెము ఆర్ధికంగా లేనివాళ్లే ..మా కుటుంబం తో వాళ్ళంతా ఇమిడిపోగలరా ....అస్సలు నాన్నగారి కి తెలిస్తే ఆయన తట్టుకోగలరా ..అలా ఆలోచిస్తూనే ..లేచి వెళ్ళి మంచి నీళ్ళు ..గబ గబా తాగేసింది ఒక నిట్టూర్పు విడిచి. వెళ్లి మళ్ళీ పడుకొంది.... పోనీ ...అమ్మ చెప్పిన సంబంధాలు ..చూస్తే ..ఏమో ..వాళ్ళ మనస్సులు ,మనస్తత్త్వాలు ,అభి రుచులు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తుంది.

అలా. ..ఆలోచనలతో సతమతం అయిపోతొంది.. ఐశ్వర్య... అలా కొద్దిరోజులు గడిచిపోయాయి...ఒకరోజు రైల్వే స్టేషన్ లో ..ఇద్దరు ఎదురుపడ్డారు .ఐశ్వర్య కి నా మీద కోపం వచ్చే ఉంటుంది ఎలా ..పలుకరించాలి ..అనే సందేహం తో నే ..చిరునవ్వుతో ..దగ్గరకు వచ్చాడు ..రాజేష్. " .హలో ....రాజేష్ ..చిరునవ్వుతో విష్ చేసి నిలబడింది ఐశ్వర్య .సారీ ..నేను ..నిన్ను ఇబ్బంది పెట్టాను ....కొంచెం ..వినయం గా అన్నాడు రాజేష్ ...ఇబ్బంది ...ఏముంది లే ..నీ అభిప్రాయం ..తో బైట పడ్డావు ..ఓకే ..మరి నేను కూడా అన్నీ ..ఆలోచించుకోవాలి కదా ..నవ్వుతూ ...జవాబు చెప్పింది ఐశ్వర్య.... నువ్వు కూడా ఇంటికే నా ..అడిగాడు ...కాదు రాజేష్ ...మా..ఫ్రెండ్ ది ...పెళ్ళి ...తెగ చంపేస్తుంది రమ్మని ..నేను విజయవాడ ..వరకు వస్తాను ....అంటూనే ..మరి నువ్వో....అడిగింది ఐశ్వర్య . నేను ఇంటికే వెళుతున్నాను .....అలా కొద్దిసేపు ..పిచ్చాపాటి ..మాట్లాడుకున్నారు .జోక్స్ వేసుకున్నారు ..ఇంతలో రైల్ రావడం ..ఎక్కడం ..జరిగింది ...ఓకే.. నేను .మధ్య.. మధ్య లో ..నీ కంపార్ట్మెంట్ ..లోకి వస్తుంటాలే ..పద పద ఎక్కు .అని రాజేష్ అనగానే ..ఇద్దరు రైల్ ఎక్కేశారు ....కొద్దిసేపు సెల్ ఫోన్ లో చాటింగ్ లో వున్నారు ...రాజేష్ ..మధ్య మధ్యలో ఏదొక స్టేషన్ లో వచ్చి కొద్దిసేపు నిలబడి మాట్లాడి వెళ్ళుతూనే వున్నాడు ...విజయవాడ..రాగానే ఇద్దరు దిగారు ...బై చెప్పేసి ..సాగనంపింది....మళ్ళీ రైలు ఎక్కి కూర్చున్నాడు రాజేష్ ..తన కోసం ..పెళ్ళివారు పంపించిన టాక్సీ లో పెళ్లికూతురు ఇంట్లో దిగింది. ఐశ్వర్య.


* * * * * *
ఒకరోజు రాజేష్ ..వాళ్ళ ఇంటి తోటపని పూర్తి చేసుకొని రిలాక్స్ అవుతూ సెల్ చూసుకుంటున్నాడు .ఇంతలో మెసేజ్ ఎలర్ట్ . ఐశ్వర్య అని చూసి .వెంటనే ..ఓపెన్ చేశాడు ..హలో ...రాజు ..నేను కూడా నువ్వు చెప్పిన విషయాన్ని ఓకే చేస్తున్నాను ..ఇద్దరం కలిసి. సెటిల్ అయితే బాగుంటుంది అని ...మెసేజ్ చదివిన ..రాజేష్ కి ఆనందానికి అవధులులేవు .
సన్నని చిరు జల్లు పడుతోంది ..రెండు గోరింకలు గోడ పై దోబూచులాడుకుంటున్నాయి. . మల్లె పందిరి పైన బడిన చిరుజల్లు మల్లెమొగ్గల పై బడి కొత్త అందాలతో పరిమళ స్తున్నాయు .తాను మళ్ళీ సెల్ ఫొన్ తీసుకొని ఐశ్వర్య కు మెసేజ్ టైప్ చేస్తున్నాడు ..థాంక్స్ ..నా అభిప్రాయం గౌరవించినందుకు ....ఇంకా ..నా వైపు నుంచి ఐ లవ్ యూ ..ఐ లైక్ యు నీవు ఆ ఫీస్ లో బిజీగా. వున్నా వని అనుకుంటున్నాను ..సాయంత్రం ..మాట్లాడు కుందాము. అయినా రేపు నేను అక్కడికి ఎలాగూ చేరుకుంటాను ..ఓకే బై..బై..అని మెసేజ్ పంపించేశాడు రాజేష్.. 


ఆ. తరువాత ..ప్రతీ రోజు కల్సి కొద్దిసేపు మాట్లాడుకోవడం ,సినిమా కి వెళ్ళడం ,షికార్లూ నడుస్తూవున్నాయి.చెల్లెలు శోభన పెళ్లి కుదరడం . ఆ. పెళ్ళీ ఏర్పాట్లు ..అన్నీ ప్లాన్ చేసిపెట్టింది ఐశ్వర్య ..అందులో బాగా ధనవంతుల సంబంధం అవడం వల్ల ..మగపెళ్ళివారి వైపు నుంచి ఏ గొడవలు రాకుండా జాగ్రత్తపడాలని ఎన్నో ....పథకాలు రచించి పెట్టింది !అవసరమైన చోట ..అడ్వాన్స్ చెల్లింపులు కొన్ని తానే చేసేసింది ...ఐశ్వర్య ..దానికి ...రాజేష్ .కృతజ్ఞతలు ..చెపుతూనే వున్నాడు ..మన ఇద్దరి మధ్యలో అవి అవసరమా ? అంటూ. ..తన పని తాను చేసుకుపోతొంది ఐశ్వర్య...
ఒకరోజు.... ఇంటినుంచి ఫోన్ ...ఎక్కడ వున్నావు ఒకసారి అత్యవసరంగా యింటికి రా ..చాలా. అర్జెంట్ ..మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు ..జ్వరం ఎక్కువగా ఉంది... ఫోన్ పెట్టేసింది .ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు... ఇంటి పనివాళ్లకు ఫోన్ చేసి మొత్తం కండీషన్ తెల్సుకొంది ..వాళ్ళు ..కూడా మీరు వస్తేనే చాలా బాగుంటుంది అని తేల్చి చెప్పారు .ఇక పరిస్థితి మొత్తం రాజేష్ కి చెప్పి బయలు దేరింది . ...సారీ ...ఐశ్వర్య ...నేను రాలేక పోతున్నందుకు తప్పు క్షమించు ..అంటూ..ప్రాధేయపడ్డాడు ....రాజేష్. నువ్వు ...ఉండీ ..ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకో ...తాను పూర్తిచేసిన పనులు ..అన్నీ. రాజేష్ కి అప్పగించి బయలుదేరి వెళ్ళిపోయింది .ఐశ్వర్య
* * * * * *
ఇంటికి చేరుకున్న ఐశ్వర్య ..వాళ్ళ నాన్నగారి పక్కనే కూర్చుంది .డాక్టరగారు ఇంజక్షన్ చేస్తున్నారు ...బైటకు రమ్మని సైగ చేశాడు ...చూడమ్మా మీ నాన్న గారికి చిన్న మత్తు టాబ్లెట్ ఇచ్చాను కంగారు పడవద్దు ...ఇప్పుడు మంచి నిద్ర పోతున్నారు .మెల్లగా చెప్పాడు డాక్టర్ .. ".కాదు సార్ ..అస్సలు ...కండీషన్ ఏమిటి ...పోనీ..హైదరాబాద్ తీసుకెళ్లమంటారా? ..కొంచెం ..ఆందోళన గా అడిగింది ఐశ్వర్య... ఇటు కూర్చోమ్మా .."మీ నాన్నగారు ....నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ..ఆయన .ప్రతీ దానికి ..ఆందోళన పడడం ఎక్కువ ...అందులో ఇప్పుడు జ్వరం కదా ..ఈ ..ఇంజెక్షన్ రోజూ ఒకటి చేయాలి ..ఇక ఈ ..టాబ్లెట్స్ ..మాత్రం ..తప్పకుండా వే యాలి .రేపు ఉదయం మళ్ళీ వస్తాను ..మీరు కాస్త పక్కనే వుంటూఉండండి. అన్నీ వివరించి చెప్పి వెళ్ళిపోయాడు డాక్టరుగారు ...


మరుసటి రోజు ....కాస్త ఆరోగ్యం కుదుటపడగానే ..ఐశ్వర్య. ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు తండ్రి దొరగారు. .. .చూడమ్మా ...కొంతకాలం క్రితం ..ఎవరో అమ్మాయి ని ఇష్ట పడ్డాను చేసుకుంటాను ..అని నా బుర్ర తినేవాడు ..ఆ అమ్మాయి ఎవరో ,ఏమిటో కులం,గోత్రము ఏమి తెలియకుండా ఎవర్ని తెస్తాడో .ఏం అల్లర్లు జరుగుతాయో అని టెన్షన్ పడ్డా కానీ భగవంతుడు అర్థం చేసుకొని ఎలానో తప్పించాడు అనుకుంటే ..ఇప్పుడు కుదిరిన అమ్మాయి ని ..ఉన్నఫళ్ళము గా చేసేసుకోవాలని కంగారు ...అని దొరగారు చెబుతుంటే ..అమ్మో మరి. నా ప్రేమ ,పెళ్ళి గురించి ఎలా చెప్పాలో ,ఏమిటో తెగ ఆలోచనల్లోకి వెళ్ళిపోతోంది. ఐశ్వర్య మనస్సు.. ఏమిటమ్మా ..ఏమి ఆలోచిస్తున్నావు ? అన్న పిలుపుకు ఈ. లోకంలోకి వచ్చింది ఐశ్వర్య ...అదే నేను కూడా ఆలోచిస్తున్నాను ..అనగానే మళ్ళీ రిపీట్ చేసిఆందోళనగా చెప్పుతున్నాడు దొరగారు .అన్నయ్య కు మంచి సంబంధం వచ్చింది ..పైగా ఇద్దరు యూ.ఎస్ .వెళ్ళడానికి పెళ్లి చేసుకుంటారట ..త్వరగా ఏర్పాట్లు చేసుకుందాం అంటున్నారు .ఇప్పటికీప్పుడే పెళ్ళి అంటే ఎలా పరిగెడతాం .మీ అన్నయ్య కి పిల్ల బాగా నచ్చింది అట ...బాగా చదువుకున్న అమ్మాయి ..నా కెరీర్ కూడా బాగుంటుంది అని తెగ చంపేస్తున్నాడు ..ఏమి చేద్దాం ,ఎలా చేద్దాం ...కొంచెం ...ఆవేశ పడిపోతూ ..అడిగాడు తండ్రి దొరగారు ..దానిదే ముంది నాన్నగారు ..ఈ రోజుల్లో అన్నీ ..ఫోన్లు. ..ఆన్ లైన్ లే కదా ..మీరు ముందు ఫ్రీగా ,టెన్షన్ పడకుండా ఉంటే ..నేనే ఎదో. రకంగా ..దారిలోకి తెస్తాను ఓకే నా ! అంటూ తండ్రి చేయు తన చేతిలో పెట్టుకొని లాలిస్తున్నట్లు గా చెప్పింది ఐశ్వర్య. రాజేష్ కి ఫోన్ చేసి తండ్రి ఆరోగ్యం ఇంటి పరిస్థితులు అంతా వివరించి చెప్పింది ఐశ్వర్య . సరే ..నువ్వు నీ పనులు జాగ్రత్తగా చేసుకో ,ఇక్కడ నాకు మా వాళ్ళు సహకరించే వాళ్ళు వున్నారు పరవాలేదులే జాగ్రత్త అవసరం ఉంటే ఫోన్ చేయి ....ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు రాజేష్ .
* * * * * *
అలా కొద్దిరోజులు వేగంగా కదిలిపోయాయి ..అక్కడ రాజేష్ చెల్లెలు పెళ్ళి ...ఇక్కడ ..ఐశ్వర్య అన్నయ్య పెళ్ళి కొద్దిరోజులు తేడాతో పూర్తిఅయిపోయాయి. ఒకరోజు ...నాన్నగారు .నేను మా ఆఫీసు కి వెళ్ళాలి ..సెలవు కూడా అయిపోయింది .మరి నేను రేపు బయలు దేరి వెళ్ళ తాను ..చిన్న గా చెప్పింది .ఐశ్వర్య ...అదేమీటమ్మా ..నీకు కూడా చాలా పెండ్లి సంబంధాలు వచ్చాయి కదా ..నువ్వు వెళ్ళితే ఎలా ? అయినా ..నీ పెళ్ళి కూడా అయితే ఇక మేము విశ్రాంతి గా రామా.. కృష్ణా అని బ్రతికేస్తాం.. ఇప్పుడు ఉద్యోగం కంటే నీకు పెళ్ళి ముఖ్యం తల్లీ ..వినమ్మా .అంటూ లాలన గా చెప్పాడు తండ్రి దొరగారు. ఇంతలో ...ఏమిటండీ ..నసుకుతారు ..అది వెళ్ళితే మళ్ళీ ఇప్పట్లో రాదు కాస్తంత గట్టిగా చెప్పండి. ..మొదటినించీ ...అతిగారాభం చేసి ఇంత వరకు తెచ్చారు గట్టిగా విసుక్కోని అరిచి చెప్పింది విమల .


* * ఐశ్వర్య కు పెళ్ళి చూపులు ఏర్పాట్లు ..మగపెళ్ళివారికి అమ్మాయి పిచ్చి పిచ్చి గా తెగ నచ్చేసింది .కట్నం ఇంత అంత అనే బేరాలు కూడా ఏమి జరగ లేదు .పెళ్లి ముహూర్తాలు కొద్ధి రోజులు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత ..అన్నీ మూఢా లే ముహూర్తాలు లేవు అని పురోహితులు చెప్పడం ..చక చకా పెళ్ళిఏర్పాట్లు పెళ్ళి జరిగిపోయింది.. ఇక విందు భోజనాలు,... అప్పగింతలు, అన్నీ పూర్తిఅయిపోయాయి . ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోతున్నారు ..మగపెండ్లివారు కూడా తరలి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ఎందుకో ఉన్నట్లు ఉండి ఐశ్వర్య కు మాత్రం ఇదంతా మనస్సు కు ఇష్టం గా లేదు పైగా ..నేను పెళ్ళికొడుకు ని మోసం చేస్తున్నాను అనే ఓ పిచ్చి ఆలోచనల్లో పడిపోయింది .పోనీ నా మనస్సులోని విషయం జరిగిన ప్రేమ వ్యవహారం అంతా కూర్చోబెట్టి మొత్తం చెబుదామని అనుకున్నాను ...కానీ వాళ్ళు చాలా ఆచారసాంప్రదా యాలు కల వాళ్ళని ...నాకు అర్థం అయుం ది. ఇంకా చెప్పినా ఎవరూ వినే వాళ్ళు లేరు .ఇక చేసేదిలేక భయపడి అక్కడ నుంచి ఎలా బైట పడాలా అనే ఆలోచనల్లో పడ్డాను. అలానే ఓపికతో ,ఓర్పు తో అన్ని పూజల్లో పాల్గొనిపెళ్ళి కొడుకు గారి ఇంటికి వచ్చాను . ఇక వాళ్ళు శోభనం ఏర్పాట్లు గురించి ఏవేవో ప్లాన్ వేసుకుంటున్నారు ...ఇక నేను మా కార్ డ్రైవర్ శంకరం ని బ్రతిమి లాడాను .అతను కూడా అక్కా నువ్వు బాగా ఆలోచించుకో అని పది సార్లు నాకు నచ్చ చెప్పాలని చూశాడు . నేను వినకుండా బైటకు నడుచుకుంటూ వెళ్లిపోతుంటే ..తను నన్ను ఎక్కించుకొని హైదరాబాద్ బస్ ఎక్కించాడు ...అలా జరిగిపోయింది .ఇక ఆ తరువాత అందరూ వెతకడం ,మా నాన్నగారి ని నిలదీయడం .కొన్ని నెలలు నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు .కొంతకాలం మా నాన్నగారు అస్సలు బైటకు కూడా రాలేదు .సరే అది అలా ఉండగా ..నేను బస్ లో హైదరాబాద్ చేరుకొని ...రాజేష్. ని కలవాలని జరిగింది అంతా చెప్పుకుంటే ఓదార్చి దగ్గరకు తీసుకొని అండగా ఉంటాడు అనుకుంటూ).


సిటీ కి చేరుకున్న ..ఐశ్వర్య ..హడావిడిగా ఫోన్ చేసింది ..ఎంతో ఆతృతగాఆనందం తో చిరునవ్వులతో హలొ ...రాజూ నేను ఊరునుంచి వచ్చేశాను ..ఎప్పుడు కల్సుకుందాం ..అన్నిపనులు ఎలా. జరిగాయి .. అవును ...రాజేష్ మావాళ్ళు ...నాకు .హడావిడిగా పెళ్లి జరిపించారు .మా నాన్నగారి ఆరోగ్యం దృష్ట్యా ఏమి చేయలేక పెళ్లికి ఒప్పుకున్నాను..పెళ్ళికొడుకు కి అన్ని విషయాలు. వివరంగాచెప్పి. హెల్ప్ అడిగి తప్పించుకోవాలని చూశాను. కానీ. కుదరలేదు ...అందుకే పెళ్లి అయిపోగానే తప్పించుకొని నీ కోసం వచ్చేశాను .నాకు. కొంచెం ..ఆందోళన గా ఉంది. నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళ వా? కొంచం భయపడుతూ అడుగుతుండగానే ..ఐశ్వర్య ..నేను కొంచెం బిజీ ...గా వున్నాను ..ఫ్రీ కాగానే నేనే ..ఫోన్ చేస్తాను ..అయినా..నీవు అలా పెళ్లి జరిపించుకొని తప్పించుకొని రావడం చాలా పెద్ద తప్పు చేశావు...సరే మనం కల్సి కూర్చొనిమొత్తం మాట్లాడుకుందాం .ఫోన్ పెట్టేశాడు. రాజేష్.

..అవునులే ..పెళ్ళి హడావుడి. అయిపోయి సర్దుబాటు లు ,సాగనంపడా లు లో బిజీ అయుఉంటాడు లే అని సర్దిపెట్టుకొని ఇక తన ఉద్యోగ. .రొటీన్ లోపడిపోయిందిఐశ్వర్య. ....రోజులు గడుస్తున్నాయి .ఇదివరలో లా ...రాజేష్ పలకడం లేదు ...ప్రవర్తన లో చాలా తేడా వచ్చింది అనుకొంటూ ఆలోచనల్లో పడిపోయింది ...అస్సలు ఎందుకు ఇలా ?తెలుసుకోవాలని గట్టి పట్టుదలతో ప్రయత్నం చేస్తుంది..మళ్ళీ కొద్దిరోజులు..ఆగి మళ్ళీ ..ఫోన్ చేసింది ....హలొ ఎవరండీ..... మేడం...నాకు రాజేష్ ..కజిన్ అతని ఫోన్ నా దగ్గరే ఉంది ..అతను బిజీ గా ఉండటం వల్ల ఫోన్ నా దగ్గరే ఉంచేస్తున్నాడు ..నేను మీరు చేశారని తప్పకుండా చెబుతాను ..ఉంటా మేడం ..ఫోన్ పెట్టేశాడు ఆవల వ్యక్తి ..ఇక ఫోన్ నేను చేయను ..వేస్ట్.. చేస్తే తాను చేస్తాడు ..లేకపోతే లేదు ..ఫోన్...సోఫా లో విసిరింది ఐశ్వర్య....మళ్ళీకొద్ది రోజులు గడిచాయి ....ఏమిపాలుపోని ఐశ్వర్య. ..అన్ని విషయాలు వదిలేసి ..ఆఫీసు కు వెళ్ళీ బుద్దిగా పనిచేసుకుంటూపోతొంది. ...

ఇంతలో ఆఫీస్ వాళ్ళు ..అమెరికా వెళ్ళాల్సిన పని బడింది మేడమ్ ..ఒక ప్రాజెక్టు డీల్ కోసం మీరు వెళ్లి వస్తారా ? అంటూ. ప్రపోజల్ తెచ్చారు ...నేను వెళ్లలేను ఇంకొకరిని పంపించుకొండి ..కాస్తంత విసుగ్గా చెప్పేసింది .ఐశ్వర్య....అలా కొద్దిరోజులు గడవగానే ...ఒకరోజు. .ఫోన్ లో వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడుకొంటున్నారు ..అవును నువ్వు రాజేష్ పెళ్లికి వస్తావని అనుకున్నాను ..నువ్వురాలేదు ..నేను ఒకరోజు అక్కడ వున్నాను ..పైగా రాజేష్ వాళ్ళు మాకు దూర పు బంధువులు కదా ..అవును ..రాజేష్ కూడా మంచి సంభంధం కుదిరిందిఅని టాక్ వచ్చింది.. అదికూడా మంత్రి గారి పి.ఏ . కూతురు అట మంచి రిచ్ పార్టీ అనిచెప్పుకుంటున్నారు ..అని ఫోన్ లో తన ఫ్రెండ్ చెబుతుండగానే ..ఒక్కసారిగా ఐశ్వర్య తల పై పిడుగు పడినంత పని అయ్యింది.. ఒక్కసారిగా ఆమె కంఠం జీర్ పోయింది.. సరే ...ఇంతకీ మనం ఎప్పుడు ..ఎక్కడ కలుద్దాం అని తన ప్రెండ్ అడుగుతున్నా ....ఏమీ మాట్లాడలేక కళ్ళల్లో ..నీళ్ళు వత్తుకుంటూ బాధ ను దిగమింగుతోంది..ఐశ్వర్య. ఏమే ఐశ్వర్యా ..వినిపిస్తుందా ..ఏమి మాట్లాడవేం....అవతలనుంచీ గట్టిగా అరుస్తోంది ఆమె ఫ్రెండ్ ....ఓ.కె నే ...సిగ్నల్స్ మంచిగా లేనట్లుగా ఉన్నాయి .నువ్వే వీలు చేసుకొని ప్లాన్ చేయి ఒకసారి కలుద్దాం ఉంటానే బై...అని అవతల మాట్లాడిన ఫ్రెండ్ ఫోన్ పెట్టేసింది .

చాలాసేపు ఆలోచనలలో మునిగిపోయింది. అందుకేనేమో ...తన తప్పు నా మీద నెట్టి నన్ను తెలివిగా వదిలించుకుంటున్నాడు . రాత్రి వేళ నిద్ర పోకుండా. ..కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఉంది ..తెల్లవారింది. అతని దగ్గరకు వెళ్ళి నిలదీయాలనుకొంది .....ముందు ఫోన్ చేసింది స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది . వెళ్లి తే ?ఏమిలాభము? ఏదో కధ వినిపిస్తాడు ...సారీ చెబుతాడు ..అంతేగా ..అయినా పట్టువదలకుండా మెసేజ్ లు పెడుతూనే ఉంది... కొద్దిరోజులు గడిచిపోతున్నా మెస్సేజ్ కి జవాబు రాలేదు . తమ్ముడు పెట్టినట్లుగా ఒక మెసేజ్ పెట్టాడు రాజేష్ కి పెళ్ళి జరిగిపోయింది అని ...మీరు రాజేష్ ని మరిచిపోవడం మీ జీవితానికి చాలా మంచిది అనే మెస్సేజ్ చదివాను .రాజేష్ ని చాలా. చాలాఅసహ్యించుకున్నాను. రీయల్లి ఐ. హేట్ హిం ఇంటికి వెళ్ళీ. అంతా నిలదీయాలని. అనుకున్నాను.కానీ..నేను అంత మాస్ కాను నేను ఒక్కదానిని ఏమి చేయగలను .ఏ పోలీస్ సహాయం తీసుకున్నా కూడా నేను గెలవలేక పోవచ్చు ఆయునా అతగాడి మనస్సులో నే ..నాకు స్థానం లేనప్పుడు. ఎలాపోరాడినా ఏమి లాభం అనుకున్నాను .మంచి సంబంధం ..చూసి అమ్మ నాన్నలు ఘనంగా పెళ్ళి చేయాలని చూశారు ..కానీ వాళ్ళని మోసంచేశాను కానీ నేనే గోతిలో పడిపోయాను పెద్దలు చెప్పినట్లు వినని నా లాంటి వాళ్లకు ఇదోగుణ పాఠం .మరి పెద్దలు చేసినవి కొన్ని ఇలా జరగవా అని అనుకున్నా ....అలా వాళ్ళ పెద్దరికంలో ఇటువంటివి జరిగితే పెద్దవాళ్లే అండగా నిలబడి బైటకు లాగుతారు అస్సలు ఆ ధైర్యం , ఆ. సందర్భం అదంతా ఒక పద్ధతి ...కానీ ఇది అలా కాదు ఇదంతా ఆశాస్త్రీయము. మంచిగా చదువుకొని పైకి రమ్మని ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు నమ్మారు .కానీ నా లాంటి వాళ్ళు ..పెళ్లిచూపులు ,పెద్దలు చూసే సంబంధం..ఆ కొత్త పరిచయం ..అంతా. నాన్సెన్స్ ..పాత చింతకాయపచ్చడి ..ఈ. ప్రేమ ...దోమ. అని మా జీవితాలలో మేమే ..నిప్పులు పోసుకుంటున్నాం. ఇలా ఆలోచనల సుడిగుండంలో పడి గిరా గిరా తీరిగిపోతొంది . ఇక ..అమ్మా... నాన్నదగ్గరకి నేను ఎలా వెళ్ళ గలను ...నా ముఖం ..ఇకవాళ్ళకు ..చూపించలేను .అలా ఎన్నో నిదుర లేని రాత్రుళ్ళు ఆలోచించి ఐశ్వర్య డిప్రెషన్ లో మునిగి తేలుతుంది .

ఒకరోజు దేవాలయం లో ప్రశాంతం గా దేవుని ఎదుట ధ్యానంలో కూర్చుని ఉంది .ఆమె మనస్సు దేవుని తిరునామం.శం ఖ చక్రాలు అలా ఆమె మనస్సు తిరుగుతూ ఉంటే ...అర్చక స్వామి పిలిచి పూవ్వులుపండ్లు చేతిలో పెట్టాడు చూడండి అమ్మా... మీరు త్వరగా అమెరికా వెళ్లి....మాకు కూడా దారి చూపిస్తే అక్కడ కూడా మా స్వామి వారి ఆలయాలు ఉంటాయి. మేము కూడా వచ్చి అక్కడ స్వామివారి సేవ ... వారి దయతో ఇంకాస్త డబ్బులు కూడా సంపాదించుకుంటాం కదా ...చిరునవ్వుతో లేచింది.నమస్కారం చేసి తన ఆఫీస్ కు వెళ్ళిపోయింది. ఇక మేనేజర్ ద్వారా ఇదివరలో వచ్చిన అమెరికా చ్ఛాన్స్ మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఎట్టకేలకు. ..కంపనీ తరుపున వర్క్ పర్మిట్ తో అమెరికా లో జీవితం ప్రారంభం చేసింది .తన జీవితంలో కి తొంగి చూసిన రాజేష్ ని మనో ఫలకం నుంచి తుడిచి వేయడానికి చాలాకాలం పట్టింది ....మెల్లగా కొత్త జీవితం ,కొత్తవాతావర్ణం లో పడిపోయింది. ఐశ్వర్య .ఇక అప్పటినుంచి మగాళ్లు అంటేనే ఒక అసహ్యం, ఒక అభద్రత.....తన పని తాను చూసుకొని ఇంట్లో ఉండిపోయేది .తన స్నేహితురాలు అందరికి పెళ్లి అయిపోయిందని భర్త ..అత్తగారు వాళ్ళంతా ఇండియా లో ఓ మారుమూల కు గ్రామం అనిచెప్పేది. అలా కొంతకాలం గడిచిపోయింది .

తల్లిదండ్రులు ...చాలాకాలం. దిగులు తోనూ, ఇంకోపక్క పరువు తీసింది అనే కోపం తో ను ఎక్కడికి , కనీసం బైటకు పోలేక ,ఎవరికి చెప్పుకోలేక కాలం గడుపుతూవున్నారు . కొద్దీ సంవత్సరాలు యూ.యస్ లో వున్నాను. ఇంతలో వీసా టైం ముగిసింది .మా ఆఫీస్ వాళ్ళు వీసా పొడిగింపు కోసం ఏర్పాట్లు చేశారు నేనే అక్కడ ఉండలేక తిరిగి ఇంటికి బయలుదేరి వచ్చాను ..కొద్దీసంవత్సరాలు గడిచిపోవడం తో అమ్మ ఏడుస్తూ నన్ను లోపలికి తీసుకెళ్లింది. మా నాన్నగారు మాత్రం ...ఇప్పుడు ఎందుకు వచ్చావ్ ...బ్రతికిఉన్నారా? చచ్చారా?అని చూడటానికి వచ్చావా? నాకు ఉన్న పరువు ...ప్రతిష్ట..తర.. తరా ల నుంచి ఉన్న గౌరవం అన్నీ మంట కలిపేశావు కదవే. తిడుతూ ..నాతో .ఆ రోజు ..నుంచి మాట్లాడం మానేసారు. చాలా కాలం తరువాత. మా అమ్మ ..నా జీవితం యూఎస్ వెళ్ళడం.. ముందు వచ్చిన సంబంధమ్. లోని లోటు పాట్లు ఏవో కధలు అల్లి మళ్ళీ నాకు ...మా నాన్నగారి కి మాటలు కలిపింది. .ఇక అప్పటినించి నేను నా డబ్బులతో ఇల్లు ,..కారు కొనుక్కున్నాను...కాకపోతే ..నేను డిప్రెషన్ లో పడి పోయి కాస్తంత మందు అలవాటు చేసుకొని నిద్రపోతున్నాను ...నాకు.. ఏమి చేయాలో,..అర్ధం కావడంలేదు. అలానే మా అమ్మా.. నాన్న కు కూడా ఏమి చేయాలో పాలుపో క.. పాపం దీనం గా ..జీవితం గడుపుతున్నారు. 

 మా అన్నయ్య ది అది ఒక రకం కధ ..మా వదిన కు పనికిరాని ఇగో ..ఎంతసేపు వాళ్ళవాళ్ళని నెత్తిన పెట్టుకుంటుంది .మా అమ్మా.. నాన్నగారిని అస్సలు గౌరవించదు .మనమడిని కూడా కాస్తంత ఎత్తుకొని ముద్దాడాలని అనిపిస్తుంది కదా పెద్దవాళ్ళకు దగ్గరకు ..రాగానే లాక్కొని తీసుకెళ్ళిపోతుంది. అస్తమానం ఏవో గొడవలు తో కొట్లాటలు ...వాటిని...సరిదిద్దటానికి మా అమ్మా... నాన్నలు పరిగెడుతూఉంటారు .మా ....కుటుంబం సరిదిద్దటానికి ఏ దైనా దేవుడు అవతారం వస్తే బాగుండు అని మా నాన్నగారి ...దైవప్రార్ధనలు. ఇలా తన ఫ్లాష్. బ్యాక్ ..ఒక మూడు గంటల సినిమా చూపించింది ఐశ్వర్య .
అయ్యబాబోయ్.. నాకు ..మాత్రం అస్సలు ..రెండు మూడు. సినిమాలు కలిపి చూసినంత పని అయుంది ...తల దిమ్మెక్కి పోయింది ..అమ్మాయి గారు ..కాస్త. టీ కానీ కాఫీ కానీ వేడి వేడి గా ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది .దీనంగా ఆడిగాడుసాయిచంద్ర. ఓ. కె దానికి అంత ప్రార్ధన అవసరం ..లేదు లేండి అబ్బాయుగారు అని దీర్ఘం తీస్తూ ఇంటివైపు కి నడిచారు వాళ్లిద్దరు.



అవును ...సాయిచంద్ర గారు ...మరి మా గత జీవితం అంతా చెప్పించుకొని చక్కగా వినేశారు .మరి మీది కూడా గత జీవితం తాలూకు ..ప్రేమ కథ లు ఉన్నాయి అని ఒకళ్లకు ..ఒకళ్ళం చెప్పుకొని బాధ పంచుకోవాలి అన్నారు .మరి మీ కథ ఏమిటో. ..మాకు చెప్పరా? కొంచం చిలిపిగా కళ్ళలోకి చూస్తూ అడిగింది ఐశ్వర్య ...చెబుతాలేండి ..కానీ ఇక మీరు పెళ్ళీ చేసుకోరా ? మొహం ఆశ్చర్యం గా పెట్టి అడిగాడు .సాయిచంద్ర ...భలే..వారండి ..ఈ త్రాగుబోతు ..ఈ ..అమ్మాయి ని ఇంకా ఎవరు వచ్చి చేసుకుంటారు లేండి ? కొంచం నిట్టూర్పు గా చెప్పింది ఐశ్వర్య ....భలే వారు మీరు ..జీవితం అంటేనే సమస్యలు .కొంతమందికి అవి ఇంకాస్త ముదిరి సుడిగుండాలుఅవుతుంటాయి ..చీకటి లో నడుస్తూవుంటాం ..కానీ కొంతకాలానికి వెలుగులోకి వెళ్తాము ...కష్టం తరువాత సుఖం ఉండొచ్చుగా .వరదల్లో కొట్టుకుపోతున్నవాడికి ...ఏదో ఒక మండో, చెట్టు లేక తాడో ఏదయినా ఒకటి తగిలి రక్షింప బడతామేమో ..ఎవరు చెప్పొచ్చారు ?..అలా చెప్పుకుంటూ పోతున్న సాయిచంద్ర మాటలకు అడ్డు వచ్చిన ఐశ్వర్య ..చూడండి సార్ మా జీవితాలు అస్సలు వెలుగు ఉంటే కదా మావి దారి తప్పిన,గాడి తప్పిన జీవితాలు ...నిట్టూర్చింది. ....


కాదు మేడం ..మనిషి ఆశాజీవి ..రేపు సుఖపడతాము అని కలలు కంటాడు. తప్పదు కనాలి .మనకంటే ఘోరమైన సమస్యలు వున్న వాళ్ళు చుట్టూ చాలామంది ఉన్నారు ...మనం వాళ్ళకంటే బెటర్ అని లెక్క వేసుకోవాలి ..ఎవడో ..ఒకడి గురించి ..మన జీవితం ఆపుకోకూడదు ..ఆగిపోకూడదు. .నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి ..మీరు ..రాజేష్ కోసం పెళ్ళి తరువాత తప్పించుకొని వెళ్ళారు ...మిమ్మల్ని ..మోసం చేశాడు ..మీరు ఏ అఘాయిత్యమో చేసుకొని ఉంటే ...మీరు నిజముగా ఓడిపోయునట్లే ..కానీ మీరు ధైర్యము తో , యూ.స్.వెళ్ళిపోయి కొంతకాలం బ్రతుకు లాగారు అది సమస్య పై పోరాటం కానీ ఖలేజా గాని ..అది ఛాలెంజ్ అంటే ..మన మనస్సు ఎన్నో రకాలు గా ఉంటుంది ..అన్నీ కూడా మన మనస్సు బట్టి చేయలేము ..బ్రతుకు బాగుండకపోతే మనస్సు ఏం చెబుతుంది ...చచ్చిపోవచ్చు గా అని పిరికితనం ..నూరిపోస్తుంది ..అందుకే బుద్దిని ..దార్లోపెట్టుకొని ...మనస్సుని మంచిదారివైపుకు లొంగతీసుకోవాలి ..పిచ్చి పిచ్చి గా ఆలోచిస్తున్న మనస్సుని ..కళ్ళెం. తో బిగించాలి ..ఎటువైపు పడితే అటువైపుకు వెళ్ళనివ్వకూడదు ...అందుకే చూడండి ..ఏదైనా తప్పు చేస్తే ...ఏమిరా ...నీకు మనస్సు. ఉందా? ...అని ఎవ్వరూ అడగరు ...నీకు బుద్ధిఉం దా? అంటారు ...దానినే ఇంటలెక్టువల్ ...అని అంటారు ..అలా. ..తనకు వచ్చిన భావన లను ఆమెకు భోధిస్తూ .....మధ్యలో మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు ?సాయిచంద్ర ....అవును మేడం ..మీరు మధ్యలో వెళ్ళీ పాపం పెళ్లిపీటలు పై కూర్చోని వాళ్ళ ని ఇబ్బందులకు గురి చేస్తే ఎలా మేడం? ..అవునండీ... ఏమి చేయమంటారు ?నేను ముందుగా అంతా మాట్లాడి ముందే తప్పించుకొని వెమని ఎంతో ..ప్రయత్నం చేశా ..కానీ ..కుదరలేదు ..పైగా ..ఆ పెళ్ళికొడుకు గారు ..అస్సలు చాలా కొద్దిటైం మాత్రమే గడిపి మళ్ళి కనిపించలేదు .అంటూ. ఐశ్వర్యచెపుతుంటే ..అవునులేండి ....మీకు అస్సలు ఏమిచేయాలో కూడా ఆలోచన రాకపోయుండ వచ్చు...సాయిచంద్ర .కొంచం గట్టిగా అన్నాడు ..ఏమోలెండి... మొత్తానికి ..వాళ్ళ కుటుంబానికి కూడా కష్టాలు ,నా వల్ల అవమానాలు చాలా పడ్డారు ...నేను ..అలా చేసి ఉండాలసింది ..కాదు .ముందే ఖరా ఖండిగా నాకు వద్దు , నేను చేసుకోను అని చెప్పాల్సి ఉంది...భగవంతుడా... నన్ను క్షమించు. అని దండం పెట్టుకుందిఐశ్వర్య.


ఏమిటి ..సాయి చంద్ర గారు భుజం అంత వాచి పోయింది ..ఏది ..కొంచం. చూపించండి ..ఆందోళన గా అడిగింది ...ఐశ్వర్య... చొక్కా కొద్దిగా విప్పి..చూసుకున్నాడు ....అవునండీ ...కొద్దిరోజులు. ..క్రితం మిమ్మలిని రక్షించడానికి కిరిటీ లో నుంచి దూకినప్పుడు ..ఆ ..కిటికి కమ్మీ బలంగా తగిలింది ..దెబ్బను చూసుకొంటూ చెబుతున్నాడు సాయిచంద్ర .ఉండండి... ఇంట్లో పెయిన్ ఆయుల్ ఉంది ...అంటూ వెళ్ళితీసుకుని వచ్చింది ఐశ్వర్య . చేయు లో వేసుకొని రుద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు .సాయిచంద్ర..సార్ ...మే ..ఐ...హెల్ప్.. యు కొంటెగా అడిగింది ...ఏమో మేడం .బాగుండదే మో ..నసుగుతున్నాడు సాయిచంద్ర ..బలేవా రండి. నేను రూము లో పడిపోతే మీరు నన్ను ఎందుకు కాపాడారు .గట్టిగా అడిగింది ఐశ్వర్య ..ప్రేమ ...అదేనండి .మానవత్త్వపు ప్రేమ ...కొంచముసిగ్గుపడుతూ చెప్పాడు సాయిచంద్ర .ఓ...అదేనండి. ..ఇప్పుడు మాలోను అదే ..షర్ట్ తీయండి ..అంటూ ఆయుల్ మర్దన చేస్తోంది ఐశ్వర్య...తనకు ఏమిటో కొత్త..కొత్తగా అనిపిస్తోంది ..సాయిచంద్రకు...అలానే ఎవరో పరాయి పురుషుడి భుజం ..వీపు పై రాస్తూ ఉంటే కూడా ...కొత్త... కొత్త ..సిగ్గులు ..ముఖం నిండా పువ్వులై ముడుచుకుపోతున్నాయి.... సిగ్గు..పడుతూ చాలు అమ్మాయిగారు ...కులుకు తూ చెప్పాడు ..ఏమిటండీ ....అబ్బాయుగారు .పర్వాలేదేమో ...ఇంకొద్ది సేపు రాయవచ్చేమో..కొంటెగా ముఖం పెట్టింది ఐశ్వర్య.

.

Hues of Love (a short story) part - 1


[ ] వర్షం బాగా పడుతో0ది. పెద్ద మట్టి రోడ్డు పై ఓ ఎర్ర బస్సు వచ్చి ఆగింది .అందులొంచి ఓ జెంటిల్ మాన్ దిగాడు .అతగాడి పేరు సాయిచంద్ర .ఆత్రుతగా ఓ షెడ్ లోకి పరిగెత్తాడు .ఓ డైరీ తీసి ఆత్రుత గా అడ్రస్ వెతికి పట్టుకున్నాడు.ఇంతలో వర్షం తగ్గుముఖం పడుతుంది.. అడ్రస్ చూస్తూ రోడ్డు పైకి వచ్చాడు .ఎదురుగా వచ్చిన ఓ పెద్ద కార్ అతగాడిని తాకపోయి తప్పుకొని బురద నీళ్లు ఒళ్ళుఅంతా చిమ్మింది.ఒక్కక్షణం తన స్పెటికల్స్ తీసి అవ్వాకు అయ్యాడు . ఆవేశం తో ఏదో తిట్టాలని ,కోపంగా అరవాలని అనుకొనేంతలో ,కారు కొంచం వెనక్కి వచ్చి0ది. గ్లాస్ కొంచెము దింపి హలో ఎస్క్యూజ్ మీ ఐ యాం వెరీ సారీ ,ఇట్ ఈజ్ రైనింగ్ కదా కొంచం విసురుగా మళ్ళీ దూసుకువెళ్ళి పోయింది. ఓ అందాల భామ .


[ ] కొద్ది సేపు వరకు అలానే చలనం లేకుండా మొద్దుబారిపోయాడు సాయిచంద్ర. అస్సలు ఏమి అందం ,ఏం పర్సనాలిటీ నాలో ఇప్పటి వరకు ఇంత పులకరింత ఎప్పుడు కలగలా? అస్సలు కారు నెంబర్ నోటు చేసుకుంటే ఎలా ఉండేది .అరే వెరీ బ్యాడ్ లక్ .అంటూ ఈ పెళ్లి కాని ప్రసాద్ ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరటం లేదు.అటువంటిది ఇక నాకు ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందా?ఏమో ఇది ఒక స్వీట్ డ్రీమ్ అనుకోని వదిలేస్తే పోలా .అయినా కలలు కనండి అని వక పెద్దాయన చెప్పారుగా కందాములే .రెండు నిట్టూర్పులు విడిచి ,గాగుల్స్ తగిలించుకుని చకా, చకా, ముందుకు సాగిపోయాడు. 


1. బాబు రామన్నపాలెం ఎటుగా వెళ్ళాలి చెబుతారా?అంటూ అక్కడ అందర్నీఅడుగుతున్నాదు సాయిచంద్ర .అదిగో సారూ అటువెళ్లండి ఆ మట్టి రోడ్ లో ఓ రెండు కిలోమీటర్లు నడిస్తే వెళ్ళి పోవచ్చు అని చేయు చూపిస్తూ చెప్పాడు ఒకాయన. సన్నని సూదిచినుకలలో అడుగులు వేగంగా వేస్తున్నాడు కొద్దిదూరం వచ్చి చుట్టూ ఒకసారి కలియ చూశాడు. ఎటువైపు చూసిన పచ్చని కొండలు ,మైదానాలు, కాస్తంత బురద, కాస్తంత నీళ్ళు, ఎత్తయిన గుబురు చెట్లు..అలానే చూస్తూ ,చూస్తూ ఎలానో అలా కాస్తంత బురద ను కాళ్లకు పట్టించుకొని ఊరు చేరాడు. 


2. సార్ ఇక్కడ లక్ష్మీ పతి రావు గారి ఇల్లు తెలుస్సా అడ్రస్ చూపించి అడిగాడు .సాయిచంద్ర. బలే వాడివి సారూ ఆ కనపడే పెద్ద బంగ్లా అదే గా ఇక్కడ ఒకప్పుడు బాగా. పేరున్న సర్పంచ్ గారు.....అయ్యబాబోయ్. చుట్టుపక్కల అన్నీ పొలాలే .ఒక్క ఇల్లు కూడా లేదు .ఊరి మొదట్లోనే ఇల్లు కట్టేసుకున్నారు.
3. మెల్లగా గేటు కొట్టాడు .కుక్కలు ఏమి లేవు అని నిర్ధారించుకున్నాడు. ఇక గేటు తీసిమెల్లగా లోపలికి నడుస్తున్నాడు.సాయిచంద్ర. ఏమండీ ఎవ్వరు మీరు ఎవ్వరు కావాలి మీకు ,కుక్క ని గట్టిగా గొలుసు చేత్తో పట్టుకొని ఎదురు వచ్చి అడిగాడు రామయ్య .బాబూ లక్ష్మీపతిదొరగారి ఇల్లు ఇదేనా కొంచం ఆతృతగా అడిగాడు సాయిచంద్ర. ఆ. ! అవునండీ. దొరగారు లోపల వున్నారు .మీరు కొంచం ముందుకువెళ్లి అక్కడ ఇంకో గేట్ ఉంటుంది అది తీసుకొని వెళ్లి హాల్ లో కూర్చో0డి. వినయంగా చెప్పాడు రామయ్య. కొద్దిసేపటి తరువాత పనివాళ్ళు మంచినీళ్లు తెచ్చి ఇచ్చారు ..పేపర్లుతిరగేస్తూ అటూ ఇటూకలియ చూస్తున్నాడు సాయిచంద్ర.


కొద్దిసేపటి తరువాత కొద్ది మంది ని వెమ్మటి పెట్టుకొని ,వాళ్లకు పనులు పురమాయిస్తూ ,వాళ్ళ అందరిని పంపిచేసేపనిలో హడావిడిగా వున్నాడు దొరగారు. అది గమనించిన సాయిచంద్ర లేచి నిలబడ్డాడు . ఇటువైపే చూస్తూ వస్తున్న పెద్దాయన ను గమనించాడు తెల్లగా మెరుస్తూవున్న దేహ చ్చాయ, ఖద్దరు చొక్కా మెడలోతులసీమాలలు నుదుటన ఎర్రని నిలువుబొట్టు ,ఆజానుబాహుడు పెద్ద అంచుల పంచ కట్టి దగ్గరగా వచ్చాడు .నమస్కారం అండీ చేతులుజోడించాడు సాయిచంద్ర .మీరు ఎవరు బాబు ,నాతో ఏమైనా పనిబడిందా ?గంభీరంగా అడిగాడు దొరగారు. నేను లక్ష్మీపతిరావు గారిని కలవాలని వచ్చానండి .వినయంగా చెప్పాడు సాయిచంద్ర. . కూర్చోండి నేనే ......చెప్పండి బాబు .కంచు కంఠం తో చెప్పి పెద్ద పడక కుర్చీ లాక్కొని కాలు పై కాలు వేసుకొని కూర్చున్నాడు. సార్ నా పేరు సాయిచంద్ర ,మా నాన్నగారు గోపాల్ నేను వ్యవసాయ విశ్వవిద్యాలయములో పరిశోధనా శాస్త్రవేత్త మీరు ఏదో ఓ కొత్త వరి విత్తనాలు తెచ్చి పంట లు వేశారట .దానిని పరిశీలించి సినాప్సిస్ వ్రాసుకోవాలి అని వచ్చాను .మీరు అనుమతిస్తే మీ పొలం దగ్గర ఉండి పరిశోధన ప్రారంభిస్తాను .వినయంగా అడిగాడు సాయిచంద్ర. .....

.పైనుంచి క్రిందికి. .... క్రింది నుంచి పైకి పరిశీలన గా చూస్తున్నాడు లక్ష్మీపతి రావు. హీరో అనిపించే చక్కని పర్సనాలిటీ ,కోటేరు ముక్కు, కోలముఖం చక్కని సరిపడా విగ్రహం ,ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడటం, ఒకరిని బాధపెట్టకూడదు అనేలా అతని నడవడిక ,మంచి డ్రెస్ ,దానికి తగ్గ వినయం , అన్నీ క్షణాల్లో చదివేశాడు లక్ష్మీప తి రావు. ......ఆ ... అవును మీ స్వగ్రామం ఎక్కడా? అదే మీరు. నేటివ్ ప్లేస్ అంటారే అది కొద్దిగా నవ్వు తూ అడిగాడు లక్ష్మీపతిదొర. .రాజా నగరం అండీ .ఇక్కడకు మూడుగంటలు ప్రయాణం పడుతుంది .సార్.మెల్లగా చెప్పాడు సాయిచంద్ర. నాకు ఎందుకు తెలియెదయ్యా ,ఇంతకీ మీ నాన్నగారి పేరు ?తనకు ఆ ఊరు మొత్తం తెలుసు అన్నట్లు ఉత్సాహంగా కండువ దులిపి ముందుకు వంగి ...అడిగాడు దొరగారు . మా నాన్న గారి పేరు గోపాలం . ...సార్ చెప్పాడు. సాయిచంద్ర ఆ......సన్న గా ,ఎత్తుగా ఉంటారు ,దేవాలయం పక్కన ఇల్లు చెప్పుకొంటూ పోతున్నాడు దొరగారు... ఆ. ..... ఆ... ఆవును సార్. ...ఆవును అవును . మీకు తెలుస్సా ఆశ్చర్యంగా అడిగాడు సాయిచంద్ర .అదేమిటి బాబు చిన్న తనం లో మీ తాత గారు తాళపత్ర గ్రంధాలు తీసుకొని ఎడ్ల బండి పై ఈ గ్రామాలు అన్నీ తిరిగేవారు .ఆ తాళపత్ర గ్రంథాలలో మా లాంటి వారి వంశవృక్షాలు ,కుటుంబ సభ్యుల సమాచారం వ్రాసి ఉండేవి .గ్రామాల్లో తిష్ట వేసి అందరికి పురాణ విషయాలు, దైవానికి సంభంధించిన నాలుగు ముక్కలు చెప్పి దేవాలయాల్లో ఉత్సవాలు జరిపించి ,కొంతమందికి భగవద్ నామ0 ,మంత్రో పదేశం చేసి ,వెళ్తూవుండేవారు.. అన్ని కులాలవారు ఆయన గారికీ శిష్యులుగా ఉండేవారు .భగవంతుని శరణు జొచ్చి ఆయన పాదాలు పట్టుకో0డి మంచి జరుగుతుంది అని చేప్పేవారు .ఇంతకీ మీ నాన్నగారు ఎలా ఉన్నారు ? జ్ఞాపకాలను కొద్దిసేపు వల్లె వేసుకొని ఆర్తిగా అడిగాడు దొరగారు. బాగానే ఉన్నారండి " చిరునవ్వుతో చెప్పాడు సాయిచంద్ర. .......

మరి ఇంతకూ మీ చదువు అదే పరిశోధన ఎక్కడ ? " మళ్ళీ ఉత్సాహంగా అడిగాడు. " నేను హైదరా బాద్ లో,వ్యవసాయ విశ్వవిద్యాలయం లో పరిశోధన చేస్తున్నాను, అక్కడే హాస్టల్ లో .ఉంటున్నాను సార్ . చెప్పాడు సాయిచంద్ర . రామయ్యా ......పెద్దగా పిలిచాడు లక్ష్మీపతిదొరవారు. 

3. దొరగారు ......అంటూ ....క్షణాల్లో ఆయన ముందు వాలిపోయాడు సేవకుడు.. మరి ఏమి లేదు కానీ ఈ అబ్బాయిగారు మనకు దగ్గరి వాళ్ళు ,కావాల్సిన వాళ్ళు ,మన గురువులు కి సంభందించిన వాళ్ళు వీరికి పైన ఏదైనా ఒక ఖాళీ గా ఉన్న రూమ్ చూపించు ఆర్డర్ వేశాడు దొరగారు ...... పర్వాలేదు సార్ నేను ఎక్కడైనా బైట నేను రూమ్ చూసుకొంటాను .మీరు నా కోసం శ్రమ తీసుకోకండి .వినయంగా చెప్పాడు సాయిచంద్ర .బలే వాడివి బాబు మీరు మా అతిథి ,ఇక్కడకు మా ఇలాకాలో కి వచ్చిన తరువాత మేము చెప్పిందే మీరు వినాలి పెద్దగా నవ్వుతూ చెప్పాడు దొరగారు. పైగా మీకు పక్కనే మన పొలం మీకు రీసెర్చ్ కి కూడా మీకు టైమ్ బాగా కల్సివస్తుంది. పదండీ అంటూ గట్టిగా చెబుతూ అక్కడనుంచి వెళ్లి పోయాడు లక్ష్మీపతిదొరగారు .....రూమ్ కి చేరుకొని తన లగేజీ సర్దుకొని రిలాక్స్ అవుతున్నాడు సాయిచంద్ర .....
• బాగా వర్షము పడుతొంది . రాత్రివేళ చాలా పొద్దుపోయింది దొరగారి ఇల్లు గేట్ లు వేసేసివున్నాయి ఒక పెద్ద కారు వచ్చి గేటు ముందు ఆగింది .తెగ హారన్ వాయంచేస్తున్నారు ." ఈ పనివాళ్ళు ఎక్కడ ఎడీశారో ఒక్కడు ,రాడు, గేటు తీయడు తెగ కోపం తో అరిచిపడేస్తోంది కారు లో ఆమె........ఇక ఆ సౌండ్ భరించలేని సాయిచంద్ర పై నుంచీ దిగి వచ్చి గేట్ లు తెరిచాడు .లోపలికి వెళ్ళిపోయింది కారు .చీకటి అందులోనూ బాగా వర్షము ,ఎవరో ,ఏమిటో ఏమీ కనపడలేదు ,అర్థం. కాలేదు గబగబా గేట్ లు వేసుకొని ,పైకి వెళ్ళిపోయాడు సాయిచంద్ర...........

• మరుసటిరోజు ఉదయం సాయిచంద్ర ని క్రింది కి పిలిపించారు దొరగారు. బాబు రండి అలా పొలం లోకి వెళదాం మా. వరి చేలు చూపిస్తాను.. అంటూనే పొలంవైపుకు బైట కు. నడవడం మొదలుపెట్టారు. బాబు మీరు పెళ్లి చేసుకున్నారా?అడిగారు దొరగారు. లేదండీ. ...ఈ. చదువు పరిశోధన పూర్తికాగానే పెళ్ళి చేసుకుందామని అని ఆనుకుంటున్నాను."చిరునవ్వుతో వినయంగా చెప్పాడు సాయిచంద్ర . ఏదైనా మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు బాబు కొంచెం దీనంగా అన్నాడు.... మన్నించాలి.... సార్ మీరు అలా ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు కొంచెం ముఖం ఆశ్చర్యంగా పెట్టాడు సాయిచంద్ర. అంతా తరువాత మీకే తెలుస్తుంది. కాదు కాదు నేనే చెబుతానులే ,భుజం పై ఉత్తరీయం ని సర్దుకొని జీరబోయిన గొంతు తో అన్నాడు దొరగారు.........." బాబు. అవును రాత్రి వేళ కారు హారన్ చాలాసేపు మోగినట్లు0ది. బాగా వర్షం పడుతొంది నేను వెంటనే లేచి రాలేకపోయాను .పనివాళ్ళు ఇద్దరు ఊరు వెళ్ళారు .ఒక్కడు వున్నాడు ,వాడికి ఎన్నిపనులు చెప్పగలం ,ఉదయం నుంచి అలసిపోయి ఉంటున్నాడు .ఆలా చెప్పుకొంటూ పోతున్నా.....దొరగారి మాటలకు అడ్డు వచ్చిన సాయిచంద్ర "పరవా లేదం డీ ,నేను వెళ్ళి గేట్ లు తీశాను. ఎవరో మేడం కారులో వచ్చారు .వర్షం పెద్దగా పడుతూఉండటం వల్ల నాకు స్పష్టం గా కనిపించలేదు., ఇక నేను లోపలికి వెళ్ళి పడుకున్నాను సార్ .వివరిస్తూ చెప్పాడు .." థాంక్స్ బాబు .......బలేవారండీ ....ఇంత చిన్న దానికి మనలో థాంక్స్ ఎందుకండీ .....


సరే బాబు ఇదే. ఆ రైస్ వంగడం చూడండి ..మొక్కలు అన్నీ బాగా ఎదిగాయు ,అంత పెద్దగా నాకు చీడ ఏమి కనిపించలేదు .అస్సలు చీడ పీడలు తట్టుకుంటుందనే ఉద్దేశంతోనే దీనిని వేశాం . ఒకరక మైన గడ్డి జాతి మొక్కలుకి మామూలు వరి కల్పి నేను తయారు చేశాను .చెప్పుకుంటూపోతున్నాడు దొరగారు. అస్సలు మీకు ఇలా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది.. నేను ,నా ఫ్రెండ్ వృక్షశాస్త్రము పి.జీ లో ఉన్నప్పుడే ఈ ఆలోచనలు వస్తూవుండేవి.. చాలా కాలం తరువాత మేము కలుసుకున్నాం .ఇప్పుడు అమలు చేశాం .అయితే మీరు కూడా పరిశోధకులే అవడం చాలా సంతోషం గా వు0ది. ఆనందం వ్యక్తం చేస్తూ చెప్పాడు. సాయిచంద్ర. 

బాబు మీకు ఒకమాట చెప్పనా రోజూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అస్సలు చదువు లేని వాళ్ళు పొలం పనులు కోసం ఎన్నెన్ని కనిపెడుతూవున్నారో , అస్సలు సిస్సలు ఐఐటీ లు ,ఎంటెక్ లు మేం టెక్నో క్రాట్స్ అని చెప్పుకోవడం ఎంతమంది ఏం కొత్తవి ఆవిష్కరిస్తున్నారు. పూర్వకాలంలో ఒక్క డాక్టర్ అన్ని రోగాలు నయం చేసేవారు ,ఇప్పుడు ఏ పార్ట్ కి ఆ స్పెషల్ డాక్టర్ పోనీ రోగాలు తగ్గిపోతున్నాయా?అదీ lలేదు .అన్నీ కనిపెడుతున్నారు ఓకే కానీ విపరీతమైన సైడ్ ఎఫక్ట్స్ .మందులు, ఎరువులు .అన్నీ రసాయనాలే. మనలోపలికి వెళ్ళిపోయి చిన్న వయసులోనే అనేక రోగాలు .ఆవేదన. గా చెప్పుకొంటూ పోతున్నాడు దొరగారు .అవునుసార్ గాలి,నీరు తిండి మొత్తం కాలుష్యం ,పూర్వకాలంలో గ్రామాలలో ఇంత వాస్తు పిచ్చి ఎక్కడవుంది అస్సలు భావి ఒకపక్క ,బాత్రూము లు ఎక్కడో ఒకచోట అన్నట్లుగా ఉండేవి. అయనా అప్పట్లో ఇన్ని రోగాలు లేవు తొంభై, వంద సంవత్సరాలు హాయిగా బ్రతికేసేవారుఅని మానాన్న గారు అంటూవుంటారు .ఎదో స్పీచ్ లా చెప్పేస్తున్నాడు .సాయిచంద్ర .బాగా చెప్పారు మీ వాళ్ళు"... ...కొద్దిసేపు. వరి చేలు చూస్తూ ఫొటోలు ట్రయి చేస్తున్నాడుసాయిచంద్ర. . నీకు అలా ఫోటో మంచిగ రాదు ఆ మొక్క నేను పట్టుకుంటాను ...ఆ ఇప్పుడు తీయండి బాబు. అలా వంగి వరిమొక్క ని పట్టుకున్నాడు . దొరగారు . చాలాసేపు పరిశీలన చేస్తున్నాడు సాయిచంద్ర ఇంతలో ఒక చెట్టుక్రింద ఉన్న పెద్ద రాయు పై హాయిగా కూర్చున్నాడు .దొరగారు. .కొద్దిసేపు. ప్రశాంతంగా గడిచింది..... ఇంతలో నడుచుకొంటూ వచ్చి దొరగారి దగ్గరలో కూర్చున్నాడు .సాయిచంద్ర .

ఇంతలో సెల్ ఫోన్ మ్రోగింది నాన్నగారు చెప్పండి....అంటూ ఇక్కడ లక్ష్మీపతి దొరగారు అని చెప్పనే వారి ఇంట్లో వున్నాను....వారే భోజనం పెడుతున్నారు . మీ గురించి అడుగుతూవుంటారు ఉండండి ఫోన్ వారికి ఇస్తున్నాను మాట్లాడండి .అంటూ ఫోన్ దొరగారికీ ఇచ్చాడు సాయిచంద్ర ." ! పునః పరిచయం ,కుశల ప్రశ్నలు అన్నీ మాట్లాడుకున్నారు .చివర్లో మాత్రం. అన్నయ్య గారు మా సాయి కి మీ కు తెల్సిన మంచి సంబంధం ఉంటే చెప్పండి ,మేము పెద్దవాళ్లం అయినాము తిరగలేకపోతున్నాం కొంచెం ఆతృత గా చెప్పింది సాయిచంద్ర తల్లి లలితాంబ ....కొంచెం ఆలోచనలో పడ్డాడు. కొంత ఆనందలోను పడ్డాడు. దొరగారు. 

ఏంటి ...సార్. మా. వాళ్ళు అప్పుడే మీకు పని చెప్పేసారా? అదే. ...సార్. పెళ్ళి సంభంధం .కొంచం చిలిపిగా నవ్వాడు సాయిచంద్ర. "అంతేగా ..బాబు పెద్దవాళ్లు అయిన తరువాత బాధ్యత లు తీర్చుకోవాలని ఆరాటపడుతుంటారు కదా .ఓకే ..... .బాబు .......మాకు ఒక బలమైన సమస్యతో బాధపడుతూ జీవితం గడుపుతున్నాము .నేను ఎప్పటినించో భగవంతుని ప్రార్థిస్తూనేవున్నాను .అందుకే మిమ్ములను పంపించి ఉంటాడు అనిపిస్తోంది. నా దృష్టిలో మీకు ఆ సామర్ధ్యం వుంది. చెప్పమంటారా బాబు ..కొంచెం బాధగా అడిగాడు దొరగారు. బలేవారండీ మీకు నా పట్ల ఇంత నమ్మకం పెట్టుకున్నారంటే నా పూర్వజన్మల సుకృతం ,మీ లాంటి పెద్దలకు ,ధనవంతులకు నా సహాయం ఏమిఉంటుంది . ......చేతులు జోడించి నమస్కారం చేస్తూ ..అడిగాడు ......సాయిచంద్ర"..........

..."బాబు. ...నాకు ఒక అమ్మాయి ,...ఒక అబ్బాయి వున్నారు .అబ్బాయి యూ ఎస్ నుంచీ వచ్చాడు .చెన్నై లో ఉంటాడు .వాడి భార్య శోభ వాళ్లకు ఒక కొడుకు వాడు నాకు ఏ విషయములోను సహకరించ లేక పోతున్నాడు .వాడికి కూడా. మేము సంభంధం ..వెతికి పెళ్లి. చేశాము.. కానీ ఎప్పుడూ ఏదో ఒక రకంగా కొట్లాడుకొంటూనే ఉంటారు. దాఖలాలు లేవు .మా అమ్మాయి ఎంటెక్ చదివింది ఆపై విదేశం వెళ్ళిఫుల్లు గా సంపాదించుకొని వచ్చింది. దగ్గరలోని సిటీలో ఒక ఇల్లు కొన్నది .ఒక్కొక్కసారి అక్కడకు వెళ్ళి వస్తూవుంటుంది .ఎప్పుడూ అర్థం ,పర్థం లేకుండా సీరియస్ గా వుంటుంది .ప్రతి రోజు అలా అలా కారు వేసుకొని అలా వూళ్ళు చూసుకొంటూషికార్ చేస్తూ వెళ్లడం రావడం ఇలా టైం పాస్ చేయడం. ...పెళ్ళి చేసుకోమంటే ఏవేవో సాకులు చెబుతుంది ..మగాళ్ళను నమ్మకూడదు అంటుంది. , బాబు మీరు ఈ నాటి యువతరం.... మీకు అయితే కొంత పరిస్థితి ఆమె అలా ఎందుకు మారిపోయింది ,ఇవ్వన్నీ మీరు కనిపెట్టగలరని , ఆ దైవమే పంపించాడేమో అని నేను భావిస్తున్నాను బాబు .మీరు నాకు ఆ సహాయం చేసి నన్ను మళ్ళీ పునర్జీవింప చేయండి .బాబు ......కొంచెం గద్గత కంఠం తో చేతులు జోడించాడు దొరగారు. ...ఇక ఆగండి. ..సార్ మీరు పెద్దలు ..మీరు మరీ అలా అయిపోకూడదు ..దైవాన్ని నమ్ముకున్న కుటుంబాలు మనవి ,మన పై ఆయన దయ ఎప్పుడూ వుంటుంది . నేను కష్టపడి అయినా మొత్తం తెలుసుకుంటాను .నాకు పరిచయం చేయండి ,మీకు ,మీ అమ్మాయి గారికి ఎలాంటి హాని చేయను ....అనే నమ్మకం వుంటేనే .."...కొద్ధి గా నవ్వుతూ చెప్పాడు సాయిచంద్ర. బలే వారు బాబు , భుజం పట్టుకొని మెల్లగా నవ్వాడు దొరగారు.పదండి ...బాబు ..లంచ్ చేద్దాం ...ఇద్దరు పొలం లోనుంచి ఇంటి ముఖం పట్టారు...

• బాబు ...ఈమె. నా. భార్య. . విమల ...అదిగో. ...వస్తూంది. అదిగో. మా. అమ్మాయి. ఐశ్వర్య ...రామ్మా ...మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు అని చెప్పాగదా....... బాబు ...మా అమ్మాయి .పరిచయం చేస్తునారు దొరగారు .......నమస్కారం...అండీ చిరు నవ్వు ఇస్తూ చెప్పాడు సాయిచంద్ర. నిన్ననే గా కారుబురద చిమ్మినప్పుడు సారీ కూడా చెప్పాను .ఇక్కడ ఊడిపడ్డాడు విషయం అంతా నాన్న గారి తో చెప్పాడా ,ఏమిటి? ఆలోచనల్లో పడింది ఐశ్వర్య ..ఏమిటమ్మా పరధ్యానం ......బాబు విష్ చేస్తున్నాడు ...వారి పేరు సాయిచంద్ర..... .పరిశోధనా శాస్త్రవేత్త ..ఆ. ...ఆ. నమస్కారం అండీ ...చిరునవ్వు తెప్పించుకుని చెప్పింది....... ఓ...అవునులే నిజంగా అందగత్తె .....కారు దగ్గర మిస్ అ య్యాను అని తెగ బాధపడిపోయాను . తాంక్ గాడ్ ...ఐశ్వర్యా ...ఇక నీ పని తే లుస్తా గా మనస్సులో గొణుక్కున్నాడు సాయిచంద్ర ..పరిచయాలు,. కుటుంబ విశేషాలు ,చదువులు అలా ఒకసారి భూగోళం అంతా చుట్టి వచ్చారు.గబ గబా లంచ్ పూర్తిచేసి లోపలికి వెళ్ళిపోయింది ఐశ్వర్య ..మంచిదండీ. ...నేను నా రూమ్ లో రిలాక్స్ అవుతానుఅంటూ వెళ్ళిపోయాడు సాయిచంద్ర. ......ఏమండీ ...అబ్బాయి. ..చాలా నిదనస్తుడిలా ,మంచి ప్రవర్తన కలవాడి గా కనిపిస్తున్నాడు .....చిన్న స్వరంతో ....భర్త తో ..అన్నది విమల . అవును వాళ్ళది ..కుటుంబం ,వాళ్ళ తండ్రి గారు ,తాతలు దగ్గరనుంచీ నాకు పరిచయమే ,వాళ్ళందరూ ఒక పద్ధతి గల మనుష్యులు .నీకు వాళ్ళ నాన్న గారు వాళ్ళు కూడా తెలుసు ,అలా పూర్వాపరాలు చర్చించుకుంటున్నారు.



క్రింద కారు శబ్దం ,ఏదో లగేజీ సర్దుతున్న శబ్దం ...కొంత హడావిడి వినిపిస్తోంది .గబ గబా మెట్లు దిగి హడావిడిగా వెళ్ళాడు సాయిచంద్ర ......ఏమీ ...అర్థం కాక అలా చూస్తూ నిలుచున్నాడు. .."..ఆ. ...బాబూ ...వచ్చారా ...మరేమీ ..లేదు .మా బావమరిది కాం తారావు ఊరు వెళుతున్నాము .కాస్తంత పని పడింది కొద్దీ రోజుల్లో అది. పూర్తి చేసుకొని వచ్చేస్తాము ..కాస్త ఇల్లు చూస్తూ ఉండండి .మీకు ఏదైనా పని ఉంటే మేము రాగానే వెళ్ళుదురుగాని. ప్లీజ్ ..బాబు ..కొంచెం ..బ్రతిమిలాడుతున్నట్లుగా అడిగాడు ..దొరగారు .." ..సరే. ....సార్ ..మీ. యిష్టం .అని సాయిచంద్ర చెప్పేలోపే ..ఐశ్వర్య కు అంతా చెప్పాను ..బాబు. వంట ..పర్వాలేదు ..కాస్తంత వచ్చు ...చేసి టేబుల్ పైన పెడుతుంది మీ పని. అయిన తరువాత వెళ్ళి పెట్టుకొని తినండి ..ఏమి అనుకోకండి . వంటచేసే అమ్మాయి వాళ్ళు కూడా పనిమీద ..కొద్దిరోజులు ఊరు వెళ్ళారు... వచ్చేస్తారు . . అంటూ. విమల ..చెబుతుంటే ..పెదవి ..విరిచి ఒక్కసారి జడ విది లించి ..లోపలికి వెళ్లిపోయింది ..ఐశ్వర్య." ..పర్వాలేద0డి ....మీరు ..హాయిగా ..మీ పని ..చూసుకురండి ....అంతా నేను చూసుకుంటాను .విష్ యు హ్యాపీ జర్నీ. అంటూ. దొరగారికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సాయిచంద్ర .
* * * * . . . . .... తోట అంతా తిరిగి నోట్స్ వ్రాసుకొని ...మధ్యాహ్నం కు ఇల్లు చేరుకున్నాడు సాయిచంద్ర .కిచెన్ లోకి వెళ్ళి టేబుల్ పై చూశాడు .ఆకలి విరగ తీస్తుంటే భోజనం వడ్డించుకొని మొదలుపెట్టాడు .నోట్లో ఒక ముద్ద పెట్టుకోగానే వాంటింగ్ వచ్చింది. ఆపుకొని ....నీయబ్బ. ..ఇదేమి ..అరటిపూవు కూర ..చేతకాదని ఏడిస్తే ..నేనే. .చేసే వాడ్నిగా విసురుగా లేచి వెళ్ళిపోయాడు .సాయిచంద్ర .....దగ్గర్లో .....కనపడకుండా కూర్చోనీవున్న ఐశ్వర్య కు మొత్తం సీన్ అర్ధం అయి0ది. లేచి వచ్చి మొత్తం చూసి ...జాలిగా పెదవి విరిచి వెళ్ళిపోయింది... 



సాయంత్రం వేళ పైన డాబా పై అటూ,ఇటూ వేగంగా నడుస్తూ ఉంది ఐశ్వర్య." మేడం ...కొంచెం టీ ..తీసుకో0డి ..ట్రే ..లోరెండు కప్పులు తెచ్చాడు సాయిచంద్ర.... ఈ. టైం లో టీ. నా ..అస్సలు నాకు అలవాటే లేదు .అయినా నేను మిమ్మలిని అడిగానా? కొంచెం విసురుగా అడిగింది." బలేవారు ...మేడం. ఏదో ..నాకు కాస్తంత కంపెనీ అని అనుకున్నాను .నాకోసం. కొద్దిగా ప్లీజ్ ..రిక్వెస్ట్ గా అడిగాడు. సాయిచంద్ర. .బలవంతంగా చేతిలో కి ఇచ్చాడు .చూడండి మేడం ...ఈ. మగా ళ్ళంతా. అంతే. వట్టి మాయగాళ్ళు ముందు పరిచయం పెంచి తరువాత లవ్ ,గివ్అని వెమ్మటి పడి గోల చేస్తారు .ఆ అభిప్రాయం తోనే. మీరు నన్ను. లెక్కిస్తున్నారు., యామై... కరెక్ట్. ...?టీ. కప్పు లో టీ కొంచెం సిప్ చేస్తూ అడిగాడు ?" యస్. ...ఎక్సాట్లీ ....కరెక్ట్... అని కోపంగా అంటూ టీ ..కొంచెం ...సిప్. ..చేసింది ...ఐశ్వర్య
ఓకే. ...మేడం ..బై..దీ. బై ...టీ. ఎలా. ఉంది ..?అడిగాడు సాయిచంద్ర.. పర్వాలేదే. ...మీకు ..వంటలు చేయడం కూడా. వచ్చా.? ఆశ్చర్యం గా. దీర్ఘం తీస్తూ అడిగింది ..ఐశ్వర్య...ఎదో. లెండి. మీ అంత కాదు. అస్సలు మీరు అరటిపువ్వుకూర ..చాలా బాగా చేశారు .?ఎక్కడ ..నేర్చుకున్నారు మేడం ..కొంచెం చిరునవ్వుతో అడిగాడు. సాయిచంద్ర. ఏమిటి. ..మీకు. నచ్చే అడుగుతున్నారా?లేక ఎ టకారమా? కొద్దిగా ...ఆవేశంగా అడిగింది. ..ఐశ్వర్య ......సరే. మేడం ...అది. వదిలేయండి ...ఇక బై ...డి...బై. .మనం మంచి స్నేహితులము .కాబట్టి ప్రేమా, దోమా ,ఏమీ ...ఉండవు..ఎందుకంటే ..నాకు ...ఆల్రెడీ. లవర్. ఉంది. ..కాబట్టి మీరు. నా గురించి భయపడాల్సిన పని లేదు.కొంచెం క్యాజువల్ గా చెప్పేసాడు సాయిచంద్ర .హమ్మయ్య ....అన్నట్లు ..గాలి ...నిట్టూర్పు గా వదిలింది ఐశ్వర్య.


మేడం ....అవును ..మీరు ..బైటకు వెళ్లాలంటే ...కారు ..లేదు .....బోర్. కొడుతున్నట్లు0ది. ఆశ్చర్యంప్రకటించాడు సాయిచంద్ర... .. కొంచెం. ...తల. ..అవును ...అన్నట్లు. ఊపింది ఐశ్వర్య .అవును మేడం ...మీరు నా మీద ..అలా బురద ..కొట్టేశారు ...ఆ. రోజు ..మీరు అప్పుడే ...నా పై కోపముతో ఉన్నారా? కొంచం నవ్వుతూ చిలిపిగా అడిగాడు సాయిచంద్ర......... చూడండి .....సార్ ...నేను ...ఆ ..రోజు .వెనక్కి వచ్చి మరీ సారీ చెప్పాను కదా !కొద్ది ఆవేశం తెచ్చుకొని మరీ చెప్పింది.......ఐశ్వర్య........"ఓకే ...మేడం ....నేను కిచెన్ లోకి వె ళ్తున్నా ను ....నాకు. ..ఒక్క ...అవకాశం ఇవ్వండి మేడం ..అంటూ కిచెన్ లో కి వెళ్ళిపోయాడు .సాయిచంద్ర.


రాత్రివేళ ...వెన్నెల...పుచ్ఛపువ్వులా ...పసుపుపచ్చ గా ప్రకాశిస్తోంది....వంట పూర్తి అయిపోయి ...డాబా పైన తిరుగుతూ ఉన్నాడు .అమ్మయ్య ...ఎలానో అలా ఆ ...మొ0డి పిల్లను కాస్త మాటల్లో పెట్టగలిగాను....నిజానికి ...ఏమి అందం..కలల్లో మునిగి తేలుతున్నాడు సాయిచంద్ర.


* * * * *
చెన్నై చేరుకున్న దొరగారు ,ఆయన భార్య ......బావమరిది ......కొడుకు చైతన్య కుటుంబం లో సమస్య ను కొంతైనా పరిష్కరించాలని ప్రయత్నంలో భాగంగా. అక్కడ తిష్ట వేశారు . తాతయ్యా అంటూ మనుమడు వచ్చాడు."రా. ...కన్నయ్య ...రా. ...నాన్న. ....రా.. బాబు అంటూ ముద్దు చేస్తూ దగ్గరకు తీసుకున్నాడు దొరగారు .ఇదంతా ..చూస్తూ ఉన్న కోడలు కు కొంచ0 ఏవ గింప్ గా భావిస్తోంది...మొహం చిటపట లాడి స్తో0ది .కోడలు శోభ."


కొద్దిసేపు మనుమడు తో తాతయ్యా, నాయనమ్మ లు ఆడు కున్నారు.... బాబు. ఇక చాలు. రా పడు కొందువు గానీ అంటూ విసుగ్గా పిలిచింది .రాత్రి వేళ చాలా టైమ్ అవుతున్నా డిన్నర్ కు పిలవడం లేదు సరి కదా బైట సోఫా లో కూర్చున్న వాళ్లకు కనీసం పడుకోవడానికి వసతి కూడా చూడటం లేదు . ...చా లా సేపు అలా గడిచి పోయింది .రోజూలా సోఫా లొనే కునికి పాట్లు పడుతున్నారు .కోడలు,మాత్రం పై అంతస్తు లోని వాళ్ళ తల్లిదండ్రులు కు సేవ లు చేసి పడుకోబెట్టి తాను కూడా కొడుకుని పక్కలో వేసుకొని నిద్ర లోకి జారుకొంది .


రాత్రి వేళ నల్లని మేఘాల మధ్య చందమామ దోబూచులాడుతూ వెన్నెల చిలుకుతున్నాడు ..ఆఫీసు నుంచి కొడుకు చైతన్య వచ్చాడు "నాన్నగారు ఏంటి ఇక్కడ నిద్ర... లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా అయినా అస్సలు భోజనం చేశారా?కొంచెం ఆతృత గా అడిగాడు ....."ఏది బాబు ...నువ్వు రాకుండా ఎలా చేస్తాం ? .అన్నాడు దొరగారు .నాకు తెలుసులే నాన్నా ..ఆ రాక్షసి ...మి మ్మలని ఎవర్నీ ..పట్టి0చుకొనిఉండదు. పదండి ....డిన్నర్ చేద్దాం అంటూ అందరూ లోపలికి వెళ్లిపోయారు .


* * * * *
సాయిచంద్ర ..వంట. మొత్తం.పూర్తి చేశాడు . ఫ్రెష్ అయి ..కిచెన్ లో నుంచి ప్లేట్స్ ,వండిన పాత్రలు అన్నీ. డైనింగ్ టేబుల్ పైకి తెచ్చి పెట్టాడు .రెండు ప్లేట్స్ సిద్ధం చేసి. ఐశ్వర్య రూమ్ కి వెళ్ళి తలుపు కొట్టాడు ...." మేడం రండి డిన్నర్ చేద్దాం. మీరు కూడా వస్తే కాస్త నాకు. కూడా. కంపెనీ ఉంటుంది కదా ..కిరిటీ. ..లోనుంచి చూస్తూ రిక్వెస్ట్ గా అడిగాడు సాయిచంద్ర...... మీరు చేసి వెళ్ళి ..పడుకో0డి సార్ ,నాకు. ఇప్పుడు తినాలని లేదు ..ఏదో ..పుస్తకం చదువుతూ ..తల ఎత్త కుండానే చెప్పేసింది ఐశ్వర్య ...సరే. ..మేడం ..కొంచెం సేపు మీ కోసం నేను ఆగుతాను.. భుజం పై కండువా తో ముఖం ,చేతులు తుడుచు కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సాయిచంద్ర .....కొద్దిసేపు ..పుస్తకం చదివి టైమ్ పాస్ చేశాడు 


.అయ్యో ...పది గంటలు అయిపోయింది ..డిన్నర్ టైం దాటిపోయింది . గబ గబా వేగంగా ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి కిరిటీలోనించి పిలిచాడు " మేడం..... ఓ. ఐశ్వర్యా మేడం...వాలు కుర్చీ లో పడుకొని ఉంది ....చిన్న బెడ్ లైట్ వెలుగు లో రూమ్ లో స్పష్టంగా ఏమీ కనిపించడంలేదు... చేతిలో. బీర్ సీసా లా అనుమానం వస్తోంది... అయ్యబాబోయ్ ...ఫుల్లుగా, ఎక్కువ తాగేసినట్లు ఉంది.... తెగ కంగారు పడిపోతూ ..ఇప్పుడు ఏమి చేయాలి బుర్ర గోక్కు0టున్నాడు. సాయిచంద్ర .ఎలానో అలా తలుపు గడియ ను విరిచి లోపలికి ప్రవేశించాడు .క్షణాల్లోనే అర్థం అయి0ది .తాగి ,తాగి స్పృహ ..కోల్పోయిందని ......అటూ ....ఇటూ..పరుగులు తీశాడు ....చివరికి ఫ్రిజ్ లో నీళ్ళు ముఖం పై పోశాడు . కొద్దిగా కదిలింది ....బాగా అటూ,ఇటూ...ఊపి ..లేపి కూర్చోబెట్టాడు .కొద్ది కొద్దిగా మత్తుగా కళ్ళు మూస్తూ...తెరుస్తూ. ...ఉంది ..ఐశ్వర్య..... ఇక వెంటనే కిచెన్ లో కి ...పరిగెత్తుకొని వెళ్లి .....మజ్జిగ తెచ్చి నోట్లోకి కొద్దిగా ముందు చుక్కలు వేసి తరువాత కొద్దిగా త్రాగించాడు .సాయిచంద్ర .కొంచం ...మత్తు పోగానే సాయిచంద్ర ని ధిక్కరించి ..మజ్జిగ బైటకు ఉమ్మేస్తుంది.. రెండు సార్లు చెప్పిచూశాడు ఇక కోపం. ఆపి పట్టుకోలేక చంప పై లాగి కొట్టాడు ...ఏ0 ....అర్థం కావడం ...లేదా. ఎక్కువ తాగేసావు ..ఛస్తావు... కోపంగా అరిచాడు.సాయిచంద్ర........"నువ్వుఎవ్వరివి నా. మొగుడివా...నా. లవర్ వా. నా యిష్టం ...నాది. బోకరిస్తోంది. ఐశ్వర్య. ఎస్..... నేను .నిన్ను ఆరాదిస్తున్నాను...లవ రనే... అనుకో...గట్టిగా అరిచాడు..సాయిచంద్ర... ఆ మాటలకు మత్తు దిగిపోయి...ఏడవడం మొదలుపెట్టింది .....అక్కడనుంచి .....బైటకు వెళ్లి ...నిలుచుండిపోయాడు సాయిచంద్ర.

తొందర పడ్డా నా ....ఏమో. ఆవేశం లో ఏదేదో అనేశాను ..గదిలో ...కూర్చొని ఏడుచు కుంటూ టవల్ తో ...ముఖం కప్పుకొంది ఐశ్వర్య ...కొద్దిసేపు ..అలా గడిచిపోయింది. ..ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఆలోచనలో పడ్డాడు సాయిచంద్ర.లోపలికి తొంగి చూశాడు ....ఆమెకు దగ్గరగా వెళ్ళాడు ..చూడండి మేడం. ..అలా ఎంతసేపు బాధపడుతూ కూర్చు0టారు .ఇక లేవండి ...నేను మీ ఇంటికి గెస్ట్ లా వచ్చి ...మీ మీద రుబావు చేయడం నాదే తప్పు అని తెలుసు ..ఐ. యాం వెరీ ...సారీ... కానీ ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో పాలు పోలేదు ...పోనీ మీరు ...నన్ను ముందు క్షమించండి... ఆ తరువాత నేను మా ఊరు వెళ్ళిపోతాను .కాకపోతే ..మీకు రక్షణ గా నన్ను ఉండమని గట్టిగా చెప్పారు .నేను అదే. ...ఆలోచిస్తున్నాను. కొంచెం ....పశ్చాతా ప0 ...పడుతున్నట్లుగా చెప్పాడు.సాయిచంద్ర.కళ్ళ లోకి సూటిగా చూడలేక తల వంచుకొని మాట్లాడుతున్నాడు ...ప్లీజ్. ..నాతో. ఎవరు. మాట్లాడవద్దు ..మీరు ..బైటకు వెళ్లిపో0డి ,లేకపోతే. నేనే. ...ఈ. అర్థ. రాత్రి. బైటకు వెళతాను. కోపంగా అరిచింది. ఐ శ్వర్య...సారీ. మేడం నేనే వెళతాను..... బైటకు వెళ్ళిపోయాడుసాయిచంద్ర....నల్లని ..మేఘాల చాటుకు. వెళ్ళిపోయాడు .


తెల్లవారి...లేలేత సూర్యకిరణాలు మీద పడుతుంటే ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు సాయిచంద్ర ...ఈ అమ్మాయి ఉందా ...కోపం వచ్చి ఏదైనా చేసుకోవడమో, ...ఎటైనా వెళ్లిపోవడమో చేసిందా? కంగారుగా లోపలికి వెళ్ళి అంతా వెతికి చూసాడు సాయిచంద్ర. బ్రష్ చేస్తూ ఫ్రెషవతుంది.. ఐశ్వర్య.... హమయ్య....బ్రతికిపోయాను ...తాను కూడా గబ గబా బ్రష్ చేసి వేగంగా కిచెన్ లోకి వెళ్ళాడు కాఫీ కలిపాడు .రెండు కప్పుల్లో..పోసుకొని ....హాలులో కి వెళ్ళాడు సాయిచంద్ర...మేడం ..కాఫీ .....టీ పాయ్ పై పెట్టాడు తలవంచి నిలుచున్నాడు .....ఏమిటి...నేను ఆడిగానా... మీకు ఎంత చెప్పినా సిగ్గు అనిపించడం లేదా ? రోషం గా మాట్లాడింది .ఐశ్వర్య... " చూడండి ..మేడం. మీరు నన్ను తిట్టినా పర్వాలేదు ,పోనీ నన్ను రెండు చెంప దెబ్బలు కొట్టి కసి తీర్చుకో0డి మేడం.. అంతే కానీ ..మీరు నాతో అలా మాట్లాడవద్దు ప్లీజ్ ..అయిపోయింది ఏదో అయిపోయింది .మనమిక మంచి ..దోస్త్ ల్లా ఉండి పోదాం.కాఫీ అందించాడు సాయిచంద్ర.


ఇక చాలు వినయ విధేయతలు .."దయచేసి కూర్చో0డి "....కాఫీ తీసుకుంటూ వ్య0గ్యం గా అన్నది..ఐశ్వర్య....మీరు నన్ను చెంప పై పెళ్లుమనికొట్టారు, ...తిరిగి ...నేను వాయుస్తే ....ఎలా ..ఉండేది ..కొంచం కళ్ళలో నీటి చార. ఉబికి వస్తుంటే బాధగా అన్నది ఐశ్వర్య. ...మేడం ....మీకు అప్పుడే సారీ చెప్పాను .మీరు కూడా కొట్టండి అన్నాను.కావాలంటే ఇప్పుడు కొట్టుకోండి ..మొహం. ఆమెకు ..దగ్గరగా తెచ్చాడు ....సాయిచంద్ర... నేను మరీ అంత సంస్కారం లేని దాన్ని కాదు ..నన్ను బ్రతికించాలని పట్టుదలలో, తొందరలో ఒక దెబ్బ పడింది అని అర్థం చేసుకున్నాను..... బుద్దిమంతురాలులాఐ శ్వర్య చెబుతుంటే .. ఆశ్చర్యంగా ..చూస్తూ థా0క్ .. గాడ్..అని ..నిట్టూర్పు విడిచాడు సాయిచంద్ర.
అయినా మీ లాంటి అందమైన అమ్మాయి అలా త్రాగడం ఏంటి మేడం... మీకు సూట్ కాదు ...అని సాయిచంద్ర చెప్పబోతుంటే ... కొంచం. లోలోపల...సిగ్గు పడుతూ ..మాట మార్చి. వేరే ...విషయం మాట్లాడుతూ ఉంది ఐశ్వర్య. మేడం....మీరు దయచేసి ..మాట మార్చవద్దు ..ఓకే... నా..చిలిపిగా అన్నాడుసాయిచంద్ర. సమస్యలు కు ,బాధలకు అందం,వయస్సు స్త్రీ,పురుష బేధం ఉంటాయా మాస్టారూ?..కొంచం కళ్ళు పెద్దవి చేసి ప్రశ్నించింది.. 


.....ఓ.కె.మేడం. నేను బ్రేక్ పాస్ట్. ...ప్రిపేర్ చేస్తాను ..రండి ..కిచెన్. లోకి వెళ్లి మాట్లాడుకుందాం., ఎందుకంటే రాత్రి మన ఇద్దరం. అస్సలు భోజనమే చేయలేదు ,బాగా ఆకలిగాఉంది అన్నాడు సాయిచంద్ర.."నేను .వంట..చేస్తాను. సార్...పదండి..అంటూ కిచెన్ లోకి దారి తీస్తోంది. ఐశ్వర్య. ..మేడం...... మొన్న మీరు నాకు అరటిపూవు కూర తినిపించారు గా నాకు అర్ధం అయిపోయింది లేండి.... కొంచెం నవ్వుకుంటూ చెప్పాడు సాయిచంద్ర. మరి. అదే. సార్.. మమ్మల్ని ...తక్కువ చేసి మాట్లాడుతున్నారు.. ....లేదు ....మేడమ్ మీరే అన్నీ ఒప్పేసుకుంటున్నారు మొన్న కూర గురించి...అన్నాడు సాయిచంద్ర .........ఓకే మేడం. ...ఇద్దరం కలిసి చేద్దాం మేడం. బోత్ ...ఉయు ..ఆర్ ఈక్వల్.. అంటూ. కిచెన్ లోకి ప్రవేశించారు.


*....................* * ...................*..... * . *
చెన్నై లో. ఆ. రోజు. ఆదివారం ..సెలవు కాబట్టి ..అందరూ ఇంట్లో. వున్నారు ...దొరగారు కుటుంబం... కొడుకు, కోడలు కొడుకు మామ గారు ,అత్తగారు అందరూ కలిసి కూర్చున్నారు ....మీ తప్పు అంటే మీది తప్పు అని వాదించుకొంటున్నారు . అది కాదండి ...తాత.. నాయనమ్మ లను దగ్గరకు ఆ మనుమడు ని రానివ్వరు .వాడు. ప్రేమగా తాతయ్యా, నానీ... అనుకుంటూ రాగానే ...వెంటనే వచ్చి. రివ్వున తీసుకెళ్లిపోతుంది.... ఇది ఎక్కడి దౌర్భాగ్యం అండీ. 


[ ] వాళ్ళు ఏమైనా పరాయువాళ్ళు కాదు కదా ..కొద్దీ రోజులు ఉండి వెళ్లి పోతారు కదా ,ఎందుకు పెద్దవాళ్లను బాధపెట్టటం?నిలదీశాడు. దొరగారి బావమరిది. నేను చాలా సార్లు చెప్పాను నాన్నగారు.. ఇక వాళ్ళు మారరు.. విసుగ్గా చెప్పాడు కొడుకు చైతన్య. పెళ్ళి అ యు ఎంత కాలం అయి0ది. ఒక్కసారి ఎప్పుడో మమ్మల్ని చూడటానికి వచ్చారు ?కనీసం ఎలా ఉన్నామో ఫోన్ కూడా చేయరు...మేము చేస్తే కోడలు ఫోన్ తీయదు..అంతా మా కర్మ గాక పోతే ఏమిటి చెప్ప0డి .తలపై కొట్టుకొని విసుగ్గా మాట్లాడుతొంది ...."చైతన్య. ...తల్లి విమల. .అయ్యా ....అమ్మాయి.. తండ్రి గారు ..మీరు ఆయునా ...ఒక. పరిష్కారం చెప్పండి ..కొంచెం దీనంగాఅడిగాడు దొరగారు...ఏం చెప్పమంటారు ..మేము అందరం ..బ్రహ్మ0డ 0గా ,చక్కగా వున్నాము. నసిగినట్లు మాట్లాడాడు చైతన్య మామగారు... అంత. బాగుంటే ...మా అబ్బాయి ఆఫీసులో నే ఎందుకు పడుకుంటాడు .ఎదురు దాడి కి దిగాడు దొరగారు... అది ..మీ. అబ్బాయి నే అడగండి.. అంటూ ...లేచి వెళ్ళిపోయాడు చైతన్య మామగారు ....నాన్న గారు ...వాళ్ళు అలా. వినరు ..నేను. మనవూరు వచ్చేస్తాను ...తాను వస్తే స0తోషం,లేకపోతే ఇక తన జీవితం తన యిష్టం... కోపంగా. అరిచి లోపలికి వెళ్ళి పోయాడు చైతన్య.కొద్దిసేపు అంతా తలా పట్టుకొని కూర్చున్నారు 


ఇంతలో ...దొరగారికీ ఇంటివైపు ధ్యాస మళ్లీ0ది.... వెంటనే ఫోన్ చేశాడు.. ఏ0....బాబు. ఎలా ఉన్నారు..?మేము త్వరలో బయలు దేరతాం..మీరు ఏమి అనుకోవద్దు బాబు?.....ఏం.... పర్వాలేదు సార్. ...మీ పని పూర్తి చేసుకొని రండి మీ ఇంటి కాపలా విషయం పూచి నాది... ఇక మీ అమ్మాయి గారు కూడా హ్యాపీ ...ఒకే నా...?.ఆన0ద0గా చెప్పాడు...సాయిచంద్ర.. 


[ ] * * * * *
కొన్ని కాగితాలు ,కొన్ని బుక్స్ తీసుకొని. పొలం వైపుకు బయలు దేరుటున్నాడు సాయిచంద్ర ..ఐశ్వర్య గారు మీరు టి. వి చూస్తూ ఉండండి .కొద్దిగా నా రీసెర్చ్ వర్క్ చూసుకొని వస్తాను .కాగితలన్నీ ..వరుస లో పెట్టుకుంటూ చెప్పాడు సాయిచంద్ర. ..చూడండి సార్ ఐశ్వర్య గారు అని ఏం పిలవక్కరలేదు ,ఐశ్వర్య ..అంటే చాలు ..కొంచెం చిలిపిగా నవ్వుతూ చెప్పింది .....ఏమో. ..అమ్మాయి గారు ..మీ ఊళ్ళో వాళ్ళంతా ఇలా పిలుస్తు0టే.. నేను అలా పిలిచాను అనుకొండి ...సినిమాస్టార్ రజనీకాంత్ అభిమానుల్లా నా పై పడి .. నా భరతం పడితే .లేదా. మీ నాన్నగారి దగ్గర కూడా ఇలానే పిలిచాను అనుకొండి ...అప్పుడు మీ నాన్నగారు అదే మా దొరగారు ఏమయ్యా ..ఏదో. తెల్సిన వాళ్ళ అబ్బాయి అని చనువు ఇస్తే ...ఇలా చేస్తావా ఏం పిచ్చ పిచ్చ గా ఉందా అని రావు గోపాల్ రావు లా ..కర్ర ఎత్తితే "..కొంచెము నటిస్తున్నట్లు గా ..చెపుతుంటే .....మధ్యలో ..అడ్డ0 వచ్చి......అబ్బా. ..మీ. మిమిక్రీ. ..ఇక ఆపండి .చాలా బాగుంది ..కొంటెగా చెప్పింది ఐ శ్వర్య...."ఓకే.... మేడం ..మీరు చెప్పిందే ఖాయం.... సరే ..ఇంతకీ..నేను కొద్దిసేపు ...పని చూసుకొని వస్తాను......బైటకు నడుస్తున్నాడు సాయిచంద్ర... ఏమి. మాస్టారు మేము రాకూడదా ....కొద్దిగా నవ్వుతూ. అడిగింది .......వై. నాట్. మీరు కూడా వస్తానంటే చాలా సంతోషం..ఇద్దరు నడుస్తూ ..మాట్లాడుకొంటున్నారు ." మేడం ...మీకు టీ షర్ట్ స్,జీన్స్ బాగా ..సూట్ అవుతాయి మేడం ..కొంచెం ఆనందంగా చెప్పాడు సాయిచంద్ర . రియల్లీ .....? థాంక్స్ ఆనేసింది ...ఐశ్వర్య ..


ఏదైనా. మేడమ్. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో కానీ వాడి పని ....ఇక వర్ణించ తరం కాదు. కావాలని కవ్విస్తూన్నాడు. .ఆమె ఎందుకు సెటలవడంలేదు ..పెళ్ళి. ఎందుకు చేసుకోవడం లేదు. ...విషయం ...బైటకు లాగలని రెచ్చగొట్టడం ప్రారంభించాడు సాయిచంద్ర. .అక్కర్లేదు లేండి... నేను అస్సలు మగ జాతినే. నమ్మను..నేను ఇక పెళ్ళి చేసుకోను.మోహము లో రంగులు మార్రి పోతుంటే చెపుతోంది ఐ శ్వర్య ...ఓ...మరి ..నేను మగజాతే. గా మేడమ్....?..కొంచం సన్నగా ...గొణిగాడు... సాయిచంద్ర. .. అందుకే. ....మిమ్మలిని కూడా సగమే ...నమ్మాను.. కోపంగా చెప్పింది. ....అవును మేడం. ....స్త్రీ రూపం. సగమే కదా ,మిగతాదంతా పురుషరూపం కదా ...ఏదొ జోక్ లా. మాట్లాడాడు సాయిచంద్ర. ఆ మాత్రం. చచ్చు తెలివితేటలు మాకూ ఉన్నాయి ..అంతాఎక్కడ? సగం పోతే. సగం మీది. అదే గా. అర్ధ నారీశ్వరుడు, కోపంగా చెప్పింది ఐ శ్వర్య. అది. కాదం డి లక్ష్మీనారాయణు లు. చూడండి. హృదయం లో మాత్రమే కదా. మిగతాదంతా. మావోడిదే. కదా....ఏదో చెప్పబోయాడు సాయిచంద్ర .....ఏమిటి హృదయం. మొత్తం ...ఆమే. అక్రమి0చుకొనికూర్చు0ది ,ముఖ్య మైనదే అది.ఇంకా ఎవరికి ప్లేస్ ఉండదు .వివరిస్తూ దబాయిస్తుంది ........అందుకే మేడం. ... బ్రహ్మ గారు. తెలివి గా నాలుక పై పెట్టుకున్నాడు .... ఛాలెంజ్ గా చెప్పాడు సాయిచంద్ర. అబ్బా. ...నాలుక పై ఎందుకు కూర్చుందో తెలుస్సా?.....ఇంకెవరికి ఐ లవ్ యూ ...అని చెప్పనీయకుండా అంటూకొద్దిగా నవ్వి0ది ఐ శ్వర్య.... మేడం ...మీతో. మాట్లాడాలంటే కొంచం కష్టమే మేడం ల"....కళ్ళు. నేలపై. వాల్చి సణిగాడు.. సాయిచంద్ర.....సరే. మేడం ....ఈ. ప్లేస్ ..నాకు. బాగా నచ్చి0ది.....కొద్దిసేపు.కూర్చున్నామా. ..మొన్న ...మీ నాన్నగారు....నేను ...కూర్చుని. మొత్తం పరిశోధన ,వరివంగడం ..గురించే మాట్లాడుకున్నాము ..ఓకే. .

Navagraha puja - benefits


*నవగ్రహ పూజలు...వాటి ఫలితాలు.....*

హిందువుల జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మానవుల స్థితిగతులు భవిష్యత్తు వ్యవహారాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ భూప్రపంచంలో దేవతలతో సమానంగా నవగ్రహాలకి కూడా ప్రాధాన్యం ఇవ్వబడింది. మానవులు చేసిన కర్మలను అనుసరించే వారికి శుభాశుభ ఫలితాల్ని నవగ్రహాలు అందిస్తుంటాయి. 

సూర్యుడికి అధిపతి అగ్ని చంద్రుడికి అధిపతి వరుణుడు కుజుడికి అధిపతి కుమారస్వామి బుధుడికి అధిపతి విష్ణువు గురువుకు అధిపతి ఇంద్రుడు శుక్రుడికి అధిపతి శచీదేవి శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి చంద్రుడు లవణానికి కుజుడు చేదుకు బుధుడు షడ్రుచులకు గురువు తీపికి శుక్రుడు పులుపుకు వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు చంద్రుడు క్షణానికి కుజుడు ఋతువుకు బుధుడు మాసానికి గురువు పక్షానికి శుక్రుడు సంవత్సరాలకు అధిపతులు.నవగ్రహాల ద్వారానే ఈ భూమండలం మొత్తం నడుస్తుంది. స్తావర జంగమములు ఏర్పడినవి ఈ గ్రహాల వల్లే. త్రిమూర్తులు త్రిదేవినులు కొలువైనది ఈ గ్రహల్లోనే. గ్రహరూపి జనార్దన , గ్రహరూపి మహేశ్వర అనే వచనం ప్రకారం హరిహరులు గ్రహ రూపంలో కొలువై ఉన్నారు. అటువంటి గ్రహాలనురెండు వర్గములుగా సృష్టి ఆదిలోనే విభజించారు. అవి 
గురుపాలితములు: రవి చంద్ర కుజ గురు కేతుశనిపాలితములు: శని బుధ శుక్ర రాహుపాపపుణ్యములు వీరిలోనే ఉన్నవి. గ్రహశాంతి అంటే జాతకునికి ఏ గ్రహం పాపగ్రహమో , ఏది ఎక్కువ బాధిస్తుందో తెలుసుకొని ఆయా గ్రహాలకు వారి ప్రీతికరమైన ధాన్యం వస్త్రాలను సంకల్పయుతంగా దానమిచ్చిన ఆ గ్రహ పీడా నివారణ జరిగి కొంత ఉపశమనం కలుగుతుంది.నవ గ్రహాల్లో ప్రతీ గ్రహమూ శుభాన్ని - అశుభాన్ని రెండింటినీ కలిగిస్తుంది. ఈ శుభాశుభాలనేవి ఆ జాతకుడి గ్రహస్థితిని బట్టి ఉంటుంది. మరి నవగ్రహాల ద్వారా కలిగే అశుభాల్ని నివారించుకోవటానికి మార్గం లేదా అంటే ఉంది. అది నవగ్రహాలని నిత్యం స్తుతిస్తూ పూజిస్తూ వుండడం. ఆయా గ్రహ మంత్రాల్ని జపం చేయటం లేదా చేయించుకోవటం. ఈ కార్యక్రమాల ద్వారా నవగ్రహ శాంతిని పొందచ్చు. ఈ నవగ్రహ పూజ జప దానాల వల్ల పూర్తిగా దోషం నుంచి తప్పించుకోలేకపోయినా ఆ దోషం ద్వారా కలుగబోయే పెద్ద ప్రమాదం నుంచి సులభంగా బయటపడవచ్చు.నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానం చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శతృ బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.శుక్రుని పూజలో అలచందల దానం చేయాలి. వజ్రం పగడము ధరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. 

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక.. దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతర కష్టాలు కూడా తొలగిపోతాయి.నవగ్రహాలు సంతృప్తి చెంది మానవులకు సుఖశాంతుల్ని ప్రసాదించాలంటే వాటిని దేవతల్లా భావించి ఆరాధించాలి, పూజించాలి అని చెపుతారు.

Skanda Shashti (Subrahmannya Shashti)

2-Dec-2019 సోమవారం

"శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"*

 దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగాతెలుసుకుందాము.

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.


ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. 

అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.
ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

పండుగ విశేషాలు

ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహి
తుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.

 "సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి" అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.
అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్య మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో, షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.
తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. 

ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.

సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది.

ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.  సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పుజలందుకోవటం జరుగుతుంది.... 

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online