Pages

chandra grahanam - some clarifications


ప్రియ మిత్రులారా ,

చంద్ర గ్రహణం 5 pm నుంచి అన్నప్పటికీ 6-15 నుంచి 7.77 వరకు ఎక్కువ ప్రభావం కలిగిస్తుంది.ఎక్కువ భయపడాల్సిన పని ఏమి లేదు .ఆ కాస్మటిక్ కిరణాలు ఆహార పదార్ధాల పైనా ,జీవుల బుద్ధి పైనా పడి వ్యతిరేక భావాలు కల్గుతాయని జాగ్రత్తలు తీసుకోమన్నారు ,అంతేకానీ మనలను ఏ రాక్షసులూ మి౦గరు.భగవంతుడు ఒక్కడే వివిధ రూపాలు ,వివిధ పేర్లు ,వివిధ రకాల మతాలూ కాబట్టి ఎవరైనాసరే  ఇష్ట దేవతా ప్రార్ధన చేసుకోవచ్చు ,ఒకసారి చేసిన ప్రార్ధనకు లక్షల రెట్లు ఫలితం అధికం గావుంటుంది .ఏది  రాకపోయునా ఓం నమ్హ;శివాయ   ,లేక ఓం నమో నారాయణాయ ,లేక హరే రామ హరే   రామ  రామ రామ హరే హరే అలానే హరే కృష్ణ ఏదైనా చదువుకోవచ్చు .స్త్రీలు విష్ణు సహస్ర నామావళి ,లలితసహస్ర నామావళి లాంటివి చదువుకోవచ్చు .గర్భిణుల ను కదలకుండా వుండ  మంటారు కారణం  చంద్రమా మనసో  జాతః  అ౦టు౦ది వేదం .కాబట్టి ఆకాశం నుంచీ వచ్చే  చంద్ర  కిరణాలు మనస్సు ,బుద్దిపై ప్రభావం చూపుతాయి తద్వారా లోపలి పిండం పై చర్య పడుతుంది అని మనవాళ్ళుముందు జాగ్రత్త చెప్పారు అంతే 


 దానికి నాస్తికులు ,హేతువాదులు  మేము ఆ   గ్రహన౦ సమయములో గర్భిణుల ను తిప్పాము ఎమీ కాలేదే అంటారు .అయుతే శాస్త్రం ముందు జాగ్రత్త చెప్పింది ,ఖచ్చితంగా జరగాలని ఏమి లేదు ,గర్భిణులు లేచి తిరిగినా ఏమి కాదు .ఒకవేళ ఎఫెక్ట్ పడుతుందేమో జాగ్రత్త అనిఅర్థం. వైద్యులు సిగరెట్టులు తాగితే జబ్బులు వచ్చి చస్తారు అంటారు .అంత మాత్రం చేత తాగని వారికి జబ్బులు రావడం లేదా ,త్రాగిన వారు కూడా ఎక్కువ కాలం బ్రతకడం లేదా ?కాబట్టి జరుగవచ్చు అని ముందు జాగ్రత్త  అలానే     ,పెళ్ళిళ్ళు ముహూర్తములు కూడా అంతే    ,ఏ   టైం లో అయునా చేసుకోవచ్చు ,ఎమీ కాదు   కాని   ఒకవేళ చెడు జరగా టానికి మన వైపు నుంచీ అవకాసం ఎందుకు ఇవ్వాలి అనేదే శాస్త్ర ఉద్దేశ్యం .


ఇక దానధర్మాలు ఇచ్చు కొనే శక్తి లేనివారు మరుసటి రోజు తలస్నానం చేసి శివాలయం కానీ ,ఆంజనేయ స్వామీ వారి ఆలయం  చుట్టూ కాని లేక ఏ   దేవాలయం అయునా సరే మీ వేసలుబాటు   పట్టి  కొన్ని ప్రదక్షిణాలు చేసి ఓ కొబ్బరికాయ కొట్టండి ,మీ గోత్ర నామాలతో పూజ చేయున్చుకోండి   .ముఖ్యముగా ఆశ్లేష ,పుష్యమి ,మఖ వారు జాగ్రత్తలు తీసుకోవాలి .కొద్దిగా శక్తి వున్నవారు తెల్ల పంచ కండువాలు సత్ బ్రాహ్మణులకు మీ గోత్ర నామాలు చెప్పి కాళ్ళు కడిగి  దానం ఇచ్చి ఆసేర్వాచనం  తీసుకోండి . ఇంకా కొద్ది శక్తి వున్నవారు బియ్యం,తెల్లవెండి  చంద్ర  ప్రతిమ ,వెండి పాము పడిగ  ఇలా కూడా దానాలు ఇవ్వవచ్చు .ఇక అన్నురాసులవారు ఎవరైనా తెల్ల బియ్యం దానము గా ఇవవచ్చు .ఇక రేవతి నక్షత్రం వారికి పంచమం లో ప్రభావం కాబట్టి వారు కూడా దానం ఇవ్వవచ్చు ,కాకపోతే సంతాన విషయం కాబట్టి రేవతి వారు సంతాన వేణు గోపాల స్వామీ ని గ్రహణ సమయములో ధ్యానం చేస్తే వారికి సంతానం కలగట ము లో ఆటంకములు తొలగిపోతాయి .ధైర్య౦ అన్నిటికి మంచి మందు అని తెలుసుకొని నడుచుకొంటే చాలా లాభం.

lunar eclipse details

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం: ఏ రాశులవారిపై ఎలా?

ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేది సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.
సూర్య,చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని,కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ,కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.

జనవరి 31న చంద్రగ్రహణం
ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక,సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.

చంద్రగ్రహణం వేళలు ఇవీ...
సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం
సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం
రాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపు
రాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం )
గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు.
సంపూర్ణ సూర్య బింబ దర్షణ కాలం మొత్తం "76"నిమిషాలు.


ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది...
చంద్ర గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా ,యూరప్ ఈశాన్యప్రాంతం.ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,పసిఫిక్ మహాసముద్రం,హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.

గ్రహణ గోచారం ఇలా...
ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశి అవటం చేత ఈ రెండు రాశులవారు మరియు పుష్యమి,ఆశ్లేష,మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది.కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.

ఏ రాశివారిపై ఏ ప్రభావం
ధనస్సు-మేషం-కర్కాటక-సింహ రాశుల వారికి అధమ ఫలం.
వృశ్చిక-మకర-మీన-మిధున రాశుల వారికి మధ్యఫలం.
కన్య-తుల-కుంభ-వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.
గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.


చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ..
ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి.ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును,ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు.గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు,అది వాస్తవం కాదు యదావిధిగా మల,మూత్ర విసర్జన చేయవచ్చు.నిలువ ఉంచే పచ్చల్లు,పిండి వంటలు,ముఖ్యమైన ఎక్కువరోజులు నిలువ ఉంచే ఆహార పదార్ధాలపై గరిక పోసలను వేయాలి.దీనివలన ఆహార పదార్ధాలకు గ్రహణ ప్రభావము పడకుండా కాపాడబడతాయి.

ఆ వేళలో ఆహార పానీయ నియమాలు
అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు,భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు,జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విషస్వభావాన్ని కలిగి ఉంటాయి.అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు,పెద్దలు చెబుతుంటారు.

శాస్త్రీయ పద్ధతి అవసరం
గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి , జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు,తర్వాత పట్టు,విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భవవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలోఫలితం లభిస్తుంది. ముసలివారు, చిన్నపిల్లల్లు,గర్భినిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయకూడదు. చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి.

తర్వాత ఇలా చేయాలి.
గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి,విగ్రహాలు,యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.జంద్యం(గాయత్రి)వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.ఇంటిముందు,వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాలలు,కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా (గుమ్మడికాయ)పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి. మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు,పూజలు చేయించుకున్న తర్వత ఆవునకు తోటకూర,బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి,పెదలకు ఏదేని ఆహర,వస్త్ర,వస్తు రూపంలో ధానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు,గ్రహభాదలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది.


మనకి తెలిసిన విషయాలు ఇవి అయినా కూడా మనకి కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి.  అవి ఏమిటంటే గ్రహణం సమయం లో ఈ నియమాలు పాటించడం అవసరమా ??? ఇవి అన్ని సైంటిఫిక్ గానిజమేనా అని చాలా సందేహాలు ఉంటాయి.  ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అది ఏమిటంటే మనం ఏ పని చేసినా మనకి ధైర్యం ఉండాలి.  భయపడుతూ ఏ పని చెయ్య కూడదు.  మనకి మనసుకి ఏది నమ్మకం కలిగిస్తే ఆ పని మనం చెయ్యాలి.  కానీ ఒక్క విషయం ఏంటంటే మనం పూర్తిగా చాందసం గా ఉండనవసరం లేదు.  కాస్త మన విజ్ఞత ని ఉపయోగిస్తే చాలు. 



 

Madhura Meenakshi's Miraculous darshan to a British Officer

*Hindu goddess appeared before a British Collector!*

 It is not a story but happened really.
 
A British collector named Rose Peter who was appointed as collector of Madurai during 1812 to 1828. Though he was being a christian he gave more importance to Hinduism and gave honor to Local practices.
Historians recall that Rous Peter acquitted himself as the administrator of the temple with sincerity and respected the religious sentiments of people.
 
It is believed that Rous Peter respected and treated people of all faiths equally and this attitude towards the people earned him the popular nickname *‘Peter Pandian,’* says Ambai Manivannan, lecturer, Department of Tamil, Thiagarajar College.
 
Goddess Meenakshi Amman Temple was situated between Peter's residence and office. Everyday he used to go to office by his horse and when he crossing the temple, he get down from the horse by removing his hat and shoes and crossed whole path on his foot. *Through this he expressed his reverence towards Goddess!*
 
One day there was heavy downpour in the Madurai city. The collector was sleeping in house house, suddenly he was disturbed by the sound of anklets and he was leaving his bed to find from where the sound came. He saw a girl who was wearing precious ornaments and calling him as *'Peter come away'.* By obeying he came out and follows her, the running girl in the rain. Then he was shocked to see his residence- building which was destroyed within a second. He turned aback and looked at the girl and on the instant she disappeared by running. *On that second he saw that the girl ran without any shoes in her foot and with anklets.* He realized and believed that *Goddess Meenakshi* only saved his life.
 
A few days later, he wished to give a gift to Lord Meenakshi, which should be a thing which was not available in the temple. To get an idea, he discussed with the priest of that temple and he ordered to make *a pair of golden shoes for Goddess Meenakshi. It is thus that this Paadhukam consisting of 412 rubies, 72 emralds and 80 diamonds was made and donated to the temple. His name was sculpted as "peter" at the bottom of shoes. Till this day this Paadhukam is known as *'Peter Paadhukam'.*(photo attached)
 
Still they were safeguarding the shoes in the temple and every year at the time of 'chitra Festival', utsava moorthy of Lord Meenakshi wears that shoe. This is the real incidence happened for the respect given to the Hindu God by the collector.

There is a portrait of a Telugu scholar in German Govt. Office


The meaning n importance of Gayatri Mantra

*గాయత్రి మాత అనగా ఎవరు…..!!*

ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది.
వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు.

నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.

గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

శ్రీ గాయత్రీ మాత మహాత్యం

 వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
 భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్


 ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు.
 
అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం.
హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది.
నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.
 
ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు.
గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.

గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు.
శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది. 

 బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

* గాయత్రి మంత్రాక్షరాలు

 సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
 సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే


‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్

’గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు.  పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది.

పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు.

ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు.
వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు.
ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి.
గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
 

The things we do on Radhasapthami

 

Hi friends, as u all know tomorrow is Radhasapthami.  On this day we worship Surya Narayana Murthy (SUN GOD).  We have to read the above shloka while taking head bath/shower tomorrow.  In general we prepare payasam n do Surya Namaskarams n offer the sweet dish to God.  If u have enough time u pls. chant Aditya Hridayam sthothram also.  In this Magha masam, Surya namaskarams n worshiping Surya is very helpful for our Health.  If possible do these Surya Namaskarams n pray to him.  If u don't have time, don't know how to do the Namaskaras, after taking bath, stand in front of SUN n raise ur hands above ur head n join both palms in Namasthe posture n take his name OM SURYAYA NAMAHA n down the hands.  Do this for 12 times every day, u will get good health.

A cute but inspiring video


Sripuram Golden Temple


some life truths


25 things to do to reduce mental stress


*ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు*

1. ఒక రోజు సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో !
4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం విషాహారం అని తెలుసుకో !
5. కక్ష కన్నా క్షమ గొప్పది
 క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !
9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !
11.మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*  *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!
12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !
16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !
17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !
19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !
 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.

 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .


*ఇవి మానవ జీవితానికి కంప్లీట్ ఎగ్జామ్ పేపర్....
 

Makara Sankranthi subhakankshalu


Bhogi - Godaa kalyanam

మనం ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై పాశురాములు ప్రతి రోజు ఉదయం అన్ని వైష్ణవ ఆలయాలలో, మన ఇండ్లలో కూడా పారాయణ చేస్తాము.  అసలు ఈ పాశురము రచించిన గోదాదేవి ఎవరో, భోగి పండుగ నాడు ఆమెకు, శ్రీరంగనాథునికి కళ్యాణం ఎలా జరిగిందో తెలుసుకుందాము .


 భోగిపండగనాడే శ్రీ గోదారంగనాథుల కళ్యాణము జరుపటం ఆనవాయితీగా వస్తున్న ఆచారము. ధనుర్మాసం నెలరోజులూ వ్రతంలో భాగముగా అమ్మ అనుగ్రహించిన "తిరుప్పావై " ని అనుసంధించి ఆఖరున కల్యాణంతో ముగించి శ్రీ గోదారంగనాథుల కృపకు పాత్రులుకావటం మనందరకూ అత్యంత ఆవశ్యకం.

 శ్రీ విల్లి పుత్తూరంలో వేంచేసియున్న వటపత్ర శాయికి తులసీ దమనకాది పాత్రలను వివిధ రకాల పుష్పాలను మాలాలుగా కూర్చి స్వామికి సమర్పిస్తున్న శ్రీవిష్ణుచిత్తులకు శ్రీ భూదేవి అంశమున లభించిన గోదాదేవి దినదిన ప్రవర్డమానముగా పెరుగుతూ తండ్రియొక్క భక్తి జ్ఞాన తత్సార్యాలకు వారసురాలైనది. తండ్రిచే కూర్చబడిన తోమాలలను ముందుగా తానే ధరించి "స్వామికి తానెంతయు తగుదును" అని తన సౌందర్యమును నీటి బావిలో చూసుకుని మరల అ మాలలను బుట్టలో పెడుతూ ఉండేడిది. ఇది గమనించిన విష్ణుచిత్తులు ఆమెను మందలించి స్వామికి ఇట్టిమాలలు కై౦కర్యము చేయుట అపరాధమని తలచి మానివేసిరి . శ్రీస్వామి విష్ణుచిత్తులకు, స్వప్నమున సాక్షాత్కరించి ఆమె ధరించిన మాలలే మాకత్యంతప్రీతి __ అవియే మాకు సమర్పింపుడు అని ఆజ్ఞ చేసిరి . ఈమె సామాన్య మనవకాంత కాదనియు తన్నుద్దరించుటకు ఉద్భవించిన యే దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ స్వామి ఆజ్ఞ మేరకు మాలా కై౦కర్యమును చేయసాగిరి.


యుక్త వయస్సు రాలైన గోదాదేవిని చూసిన విష్ణు చిత్తులు ఆమెకు వివాహము చేయనెంచి అమ్మా! నీకు పెండ్లీడు వచ్చినది నీ వేవరిని వరింతువో చెప్పుము నీ కోరిక మేరకే వివాహము చేతును అనిరి. తండ్రి మాటలు వినిన గోదాదేవి లఙ్ఞావదనయై తమరు సర్వజ్ఞులు తమకు తెలియనిదేమున్నది అపురుషోత్తముని తప్ప నేనింకెవరినీ వరింపను ఇతరుల గూర్చి యోచింపను అని తన మనోభీష్టాన్ని తెలియజేసెను. అప్పుడు విష్ణుచిత్తులు "కొమడల్" అను లోకప్రసిద్ద గ్రంధము ననుసరించి ఆ వటపత్రశాయి వైభవముతో ప్రారంభించింది నూట ఎనిమిది దివ్య తిరుపతిలలో అర్చామూర్తులైయున్న పెరుమాళ్ళ వైభవాతిశయయులను వర్ణింపసాగిరి అ క్రమములో చివరకు "అజికియ మనవాళన్ అను శ్రీరంగనాథుల రూపరేఖా విలాసములను వర్ణింపగనే "జితాస్మి" అని, ఆమె హృదయమందంతటనుఆ రంగనాథుని దివ్య మంగళ స్వరూపమే నింపి యుంచుకొనినదై గగుర్పాటు పొందుచుండెను.

 ఆ స్థితిని గమనించిన విష్ణుచిత్తులు "అదెట్లు సాధ్యము" అని చింతాక్రాంతులై నిదురింప __ ఆ శ్రీరంగనాధులు స్వప్నమున  సాక్షాత్కరించి నీ పుత్రిక భూ జాత గోదను మాకు సమర్పింపుడు ఆమెను పాణిగ్రహణము చేసికొందును. వివాహ మహొత్సావానికి నా అజ్ఞమేరకు తగిన సామగ్రులు తీసుకుని పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో మిమ్ముల స్వాగతి౦చెదడు అని పలుకగా  విష్ణుచిత్తులు మేల్కోంచి అత్యంత ఆనందోత్సాహములతో తనజన్మ సార్ధకమైనదని పొంగి పోవుచూ _ సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీ రంగమునకు తోడ్కొని పోయిరి. అచట సమస్త జనులున్నా పాండ్యమహీభూపాలుడున్నా విష్ణు చిత్తులను _ ఆ సన్నివేశము దర్శించి ధనుల్వైరి.


ఇట్లు అండాళ్ తల్లి తాను చేసిన ధనుర్మాసు వ్రత కారణమున పరమాత్మను తానుపొంది మనలను ఉద్దరించుటకు మార్గదర్శినియై నిలచినది. శ్రీరంగనాధుడు, స్వయముగా అమెనే వరించి _ పాణిగ్రహణము చేసివాడు దీనినే మనము భోగిపండుగనాడు భోగ్యముగా జరుపుకొనుచున్నాము. శ్రీ గదా రంగనాథుల కళ్యాణము చూచినను చేయించినను, ఈ కథ వినినను __చదివిననూ సకల శుభములు చేకూరుననుటలో సందేహములేదు. గోదారంగనాథుల వారి కల్యాణి గీతాన్ని నిత్యమూ అలపిద్దాం లోకకల్యాణానికి పాటు పడదాం.


కల్యాణ గీతిక
(కాంభోజ రాగము _ త్రిపుట తాళము )
ప .. _ శ్రీ గోదారంగనాధుల కళ్యాణము గనరే
 అ..ప.. _ శ్రీ కల్యాణముగని _ శ్రీల భిల్లరే!
చ.. _ ఆకాశమే విరిసి _ పందిరి యైనది
 భూదేవియే మురిసి __ అరుగు వేసినది
 అష్టదిక్కులు మెరసి _ దివిటీలు నిలిపినవి
 అష్టైశ్వర్యములు తరలి __ నిలువెల్ల కురిసినవి....
చ ... విష్ణు చిత్తుని కన్య విష్ణువునే వలచినది
 నిష్టతో మార్గళి వ్రతము చేసినది
 ఇష్టసఖులను మేల్కోల్పి _ వెంటగోన్నది
 జిష్ణుని హితకరు కృష్ణుని చేబట్టినది
 చ .... జీవాత్మయే పరమాత్మకు అంశమ్మని చాటినది
 శేషి శేషభూతులు పరమార్ధము తెలిపినది
 దివ్య మంగళ విగ్రహ సాయుజ్యము నరశినది
 దివ్య ద్వయ మంత్రార్ధంబిలను __స్థాపించినది
 చ ... శ్రీ గోదా రంగనాథుల కల్యాణ గుణ విభవము
 శ్రీ ద్వయ మంత్ర రత్నమ్మున కన్వీయ మీజగము
 ఇదిగనిన అనుసంధి౦చిన శుభప్రదము
 మదినిపాడరె _ రంగనాథుని గీతము జయము జయము
 అండాళ్ దివ్య తిరుగడిగళే శరణమ్


 ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవస్వామివారికి స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికిf పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.

తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.

గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసం లో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు.  శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యద అనే కావ్యం కూడా ఈ ఆండాళ్ చరితమే.  ఈ విధం గా తన భక్తి తో ఆ భగవంతుడినే భర్త గా పొంది శ్రీవైష్ణవ సంప్రదాయం లో అతి ముఖ్యులైన 12. మంది ఆల్వారు  లలో ఆమె కూడా ఒకరు గా పూజించ బడుతోంది.  ఆమె యొక్క దివ్య చరితం వలన మనకు భగవద్భక్తి యొక్క విశిష్టత తెలుస్తోంది.  మనం కూడా భగవంతునికి భక్తి అనే పూదండలను సమర్పించి ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాము.
 

Save trees

Friends,

Today am so sad n unhappy. We all r celebrating one of the biggest festivals of our country which is celebrated in so many states across the country with different names n different styles. But basically this festival is all about our Nature, agriculture, animals n all things associated with Mother Nature n showing our gratitude to Mother Nature for providing us our livelihood n food n all to survive. But am really sorry to say that we r really loosing our connect with Nature.

We r not growing trees, destroying forests n all n building concrete jungles. Some r for infrastructural development n necessary. But some r really not needed. We can look for alternatives. U know to lay a six line Highway b/w Hyderabad n Vijayawada they cut thousands of trees n now that route is very hot n no shade at all for the travellers. Even though they now planted some plants again now, it takes a lot of years for them to grow n in the mean while the pollution n all the troubles for us increase. Now i learnt another same thing is going to happen in Mumbai also.

Did you know that 3500 trees in Aarey forest will be cut to build a metro car shed if we don't raise our voice!

JUST GIVE MISSED CALL 08030630959

to ask the CM & MD of Mumbai Metro Rail Corp to look for alternatives.
I called. It's legit! Please do it, & tell all your friends


The benefits of chanting Govinda Nama

Good Morning Respected Friends.


Remember that  it is GOVINDA  , who always  remain deep inside  every Person's  body and caresses the animal nature of  him / her  .

All those who prepare themselves to remain every minute in Integral Yoga will quickly get that help from Govinda .

The Spiritual seekers repeatedly utter loudly GOVINDA... Govinda..
and ask all of us to do so .

Medical Scientists  observed that  the doors of SUSHMNA NADI opened whenever one utters  GOVINDA....

 
 
 

menustrual problems - some remedies

నెలసరి సమస్యలు:

నెలసరి మొదలైందంటే ఆడవారికి సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా అప్పుడే రజస్వల అయిన ఆడపిల్లలకు మరీ సమస్యగా ఉంటుంది. వారి ఆరోగ్యం పాడవుతుందనే టెన్షన్ ప్రతి తల్లికీ ఉంటుంది. అయితే  ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు రక్తాన్ని మళ్ళీ భర్తీ చేయలి కాబట్టి నెత్తురు రక్తాన్ని మళ్ళీ భర్తీ చేయలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించమంటారు వాళ్ళూ వీళ్ళూ. ఆ మాట ఎంతవరకూ నిజం? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితి నెలకొని సతమతమవుతుంటే ఈ కథనం చదవండి.
1. కొత్తగా రుతుస్రావం మొదలైన వారికి కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి కాస్తంత పరిమితి పాటిస్తే మంచిది.
2. నెయ్యికి బదులు వెన్న వాడాలి. ఎందుకంటే వెన్న కాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. అందుకే ఒక స్టెప్ ముందుగానే వాటిని తీసుకుంటే కొవ్వులో జీర్ణమయ్యే విటమిన్లను ఒంటబట్టించుకునేందుకు వెన్న దోహదం చేస్తుంది.

ఎక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు

1. మీరు శాకాహారులైతే… మీ రోజువారీ ఆహారం తోపాటు తాజాగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీళ్లు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే పల్లీపట్టీ కూడా మంచివే), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండేలా చూడండి.
2. మీరు మాంసాహారులైతే… మీ రోజువారీ ఆహారాన్నే తీసుకోండి. దాంతోపాటు మీ ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తో పాటు… మాంసాహారంలో లివర్‌ను ప్రత్యేకంగా ఇవ్వండి.
3. అదే మాంసాహారులైనా, శాకాహారులైనా… కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ ఇవ్వండి. కోడిగుడ్డులో పచ్చసొన వద్దనే అపోహను తొలగించుకుని, దాన్ని అమ్మాయికి తప్పక ఇవ్వండి. ఎందుకంటే ఈ వయసులో వారు అది తీసుకోవడం వల్ల పచ్చసొన కారణంగా వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, ఒకవేళ వారు గుడ్డు తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ.
4. మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉన్నప్పటికీ మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే… అది తిన్నవెంటనే ఒంటికి పడుతుంది. అదే శాకాహార పదార్థాల్లోని నాన్ హీమ్ ఐరన్ మన ఒంటికి పట్టాలంటే, అదనంగా విటమిన్-సి కావాలి. కాబట్టి ఐరన్ ఉండే శాకాహార పదార్థాలతో పాటు విటమిన్-సి ఉండే తాజా పండ్లు… జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
5. రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం పుష్కలంగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే.

పరిమితంగా మాత్రమే తీసుకోవలసిన పదార్థాలు:

1. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటివాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
2. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా పరిమితంగా తీసుకోవాలి.

అస్సలు తీసుకోకూడనివి పదార్థాలు:

బేకరీ ఐటమ్స్ అయిన చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాల వంటి జంక్‌ఫుడ్‌తో పాటు కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు.
ప్రతినెలా రక్తం కోల్పోతుండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది. అందుకే రక్తహీనత రాకుండా ఐరన్‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఉండటం వల్ల పై ఆహారాన్ని  తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తారు
  

A shloka similar to Kaaryeshu daasi but for Husbands

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం
చెప్పింది..కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు
 
           కార్యేషు యోగీ, కరణేషు దక్షః
         రూపేచ కృష్ణః క్షమయా తు రామః
         భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం
         షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
 
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ  పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు

మంగళ సూత్రం - విశిష్టత

తాళిబొట్టు / మాంగల్యం మన భారతీయ సంస్కృతి లో, వివాహ వ్యవస్థ లో మంగళ సూత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది .  అన్ని రాష్ట్రాల వారు ఒకే సంప్రదాయాన్ని పాటించక పోయినా మన హిందూ వివాహ వ్యవస్థ లో మాంగళ్య ధారణ అనేది అందరు పాటించే ఆచారం.

 కానీ ప్రస్తుతం మన దౌర్భాగ్య పరిస్తితి ఏమిటంటే మన హిందూ సోదరీమణులు నవీనత పరాకాష్ట కి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం. సినిమాలు టీవీ ల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. ఎక్కువ శాతం కనిపిస్తున్న లేదా మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్ర గణాల నుండి వచ్చే వాట్శాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటో లు అన్ని ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాల అరిష్టం.

మంగళ సూత్రం - విశిష్టత

“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!”
పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం”
ఓ! సుభగా నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు అంటే పుణ్యస్త్రీగా ముత్తయిదువు గా జీవించు అని స్పష్టము గా తెలుస్తున్నది.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, ధగ్గులు వంటి కిరాత జాతులవారు వలసవచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు తను వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.
మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు అంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజ గ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున
 కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.


భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వసాధారణమైపోయింది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు.

కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభఫలితాలు సమకూర్చగలవు.
పాశ్చాత్య, అనుకరణ వెర్రి లో ఊగుతున్న మన ఆడ కూతర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం.

వ్యక్తపరిచిన విషయాలు పాటెల్ నారాయణ రెడ్డి గారు రాసిన ఆచారాలు సంప్రదాయాలు, కంచి పరమాచార్య పధం పుస్తకాల నుండి కొంత  గ్రహించి రాసినవి.


 

some very interesting things about India

Dear Friends, one of my friends shared this in our whatsapp group.  They r interesting.  Read them n know some things about our country.


Indian అనే ప్రతి ఒక్కరు చదవాల్సిందే

900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి


మరీ భారత దేశం వయసు ఎంత?

ప్రపంచంలో  ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు  అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం

ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే

 వైదిక  సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి"  కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు  " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు

 ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు

ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
 "నా దేశం-భారత దేశం"

ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
 "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"


ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది

మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...


 "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం

 మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !


మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
 ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
 ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి


ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని  విమర్శిస్తారు.
జై భారత్.




 

The meaning of Hare Rama Hare Krishna Mantra

*హరే కృష్ణ మంత్రమునకు భాష్యము


ఈ దివ్య శబ్దము యొక్క ఉచ్ఛారణ *హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.


మన కృష్ణ చైతన్యమును పునరుద్ధరించు కొనుటకు గల అద్భుతమైన పద్ధతి, సులభ మార్గము. జీవాత్మల మగుట చేత నిజానికి మన మందరమూ కృష్ణ చైతన్యము కలవారమే, కానీ అనాది కాలంగా ఈ భౌతిక పదార్థంతో గల సాంగత్యం వలన, మన చైతన్యం ఇప్పుడు భౌతిక వాతావరణం చేత కలుషిత మైనది. ఇటువంటి కలుషితమైన జీవన విధానంలో మనమందరమూ భౌతిక పకృతి యొక్క సంపదను స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకొనుటకు ప్రయత్నిస్తున్నాము, కానీ నిజానికి మనం మరింతగా భౌతిక ప్రకృతి యొక్క ఉచ్చులో చిక్కుకుపోతున్నాము. ఈ భ్రమను మాయ అని పిలుస్తారు లేదా ఉనికి కోసము చాల కష్ట పడటము, భౌతిక ప్రకృతి యొక్క కఠిన నియమాల కోరల్లో చిక్కుకుని ఉన్నప్పటికినీ మనమందరం ఈ భౌతిక పకృతిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకొనుట. భౌతిక ప్రకృతిపై మనం చేస్తున్న ఈ మిథ్యా ప్రయత్నము ఒక్కసారిగా ఆగిపోవును మన కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుకోవడం ద్వారా.కృష్ణచైతన్యము మనస్సుపై విధించబడే కృత్రిమ మార్గము కాదు.


 ఈ చైతన్యం అనేది జీవాత్మ యొక్క సహజ శక్తి. మనము ఈ దివ్య శబ్దమును శ్రద్ధగా వినినప్పుడే ఈ చైతన్యము పునరుద్ధరించబడుతుంది. ఈ యుగమునకు ఈ పద్ధతి ప్రామాణికులచే సూచించబడినది. ఆచరణాత్మక అనుభవం ద్వారా, మనము ఈ మహా మంత్రాన్ని ఉచ్చరించుట ద్వారా మనము తెలుసుకొనవచ్చు, లేదా ఈ మహా విముక్తి మంత్రమును ఉచ్చరించి తద్వారా స్వయముగా ఆధ్యాత్మిక జగత్తు నుండి వచ్చు దివ్యానంద పారవశ్యమును పొందవచ్చును. ఒక వ్యక్తి వాస్తవానికి ఆధ్యాత్మిక అవగాహన స్థితిలో ఉన్నప్పుడు. ఇది దిగువ స్థాయి ఇంద్రియ, మానసిక ,బుద్ధి మరియు అహంకార స్థితులను అధిగమించి, వారు ఆధ్యాత్మిక సహజానంద స్థితిలో నిలిచిపోతారు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ దివ్య ఉచ్ఛారణ, నేరుగా ఆధ్యాత్మిక స్థితి నుండే జరుపబడును. అది ఇంద్రియాలకు, మానసిక మరియు బుద్ధికి సంబంధించిన అన్ని తక్కువ స్థితి చైతన్యాలను అధిగమించును. మంత్రం యొక్క అర్థమును తెలుసుకోవలసిన అవసరం లేదు, మానసిక కల్పనలను చేయనవసరం లేదు.


 ఈ మహా మంత్రాన్ని కీర్తన జపము చేయడం కోసం బుద్ధి సంబంధమైన ఇతర సర్దుబాట్లను చేసుకోవలసిన అవసరం లేదు. ఇది సహజముగా ఆధ్యాత్మిక స్థితి నుండి ఉద్భవించింది మరియు ఎవరైనా ఆధ్యాత్మిక శబ్ద కీర్తనలో పాల్గొనవచ్చును ఏ మునుపటి అర్హత లేకుండా,ఈ కీర్తనలో పారవశ్యంతో నృత్యం చేయ వచ్చును
మనము ఆచరణాత్మకంగా చూశాము. ఒక పిల్లవాడు కూడా ఈ కీర్తనలో పాల్గొనవచ్చును ఇలా ఒక కుక్క కూడా పాల్గొన వచ్చును ఈ మహా మంత్రము భగవత్ ప్రేమ కలిగిన శుద్ధ భక్తుడు ఉచ్ఛరించినప్పుడు అప్పుడు వెంటనే ప్రభావం పొందవచ్చును అలాగే వీలైనంత వరకూ అభక్తుని నోటి నుండి ఈ మహా మంత్రమును వినరాదు అది సర్పం యొక్క పెదవులతో తాకబడిన పాలవలే విష ప్రభావమును కలిగి ఉండును.
హరా అను పదము భగవంతుని అంతరంగ శక్తికి సంబోధిస్తుంది. కృష్ణ మరియు రామ పదములు భగవంతుని నేరుగా సంబోధిస్తుస్తున్నాయి కృష్ణ లేదా రామ అనగా పరమానందము శాశ్వతమైన, హరా అనగా భగవంతుని యొక్క మహోన్నతమైన ఆనంద శక్తి. ఈ శక్తిని, హరే అని సంభోధించినప్పుడు మనకు భగవంతుని చేరుకొనుటకు సహాయపడును


మాయ అనబడు భౌతిక శక్తి కూడా భగవంతుని విభిన్న శక్తులలో ఒకటి మనము కూడా భగవంతుని యొక్క తటస్థ శక్తికి చెందిన వారము. జీవాత్మలు భౌతిక శక్తి కంటే ఉన్నతమైనవిగా వర్ణించబడినవి ఎప్పుడైతే ఉన్నత శక్తి అధమ శక్తి సాంగత్యం లోకి వస్తుందో అప్పుడు అసంగత పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఉన్నతమైన తటస్థ శక్తి, ఆధ్యాత్మిక ఉన్నత శక్తి హరా తో సంబంధమును ఏర్పరచుకున్నచో జీవాత్మ సహజ ఆనందమయ స్థితిలో నెలకొనును


హరా, కృష్ణ మరియు రామ మూడు పదములు ఆధ్యాత్మిక బీజములు మంత్రోచ్ఛారణ అనేది ఆధ్యాత్మిక పిలుపు వంటిది భగవంతుని మరియు అతని అంతరంగిక శక్తి, హరా కోసం బద్ధజీవాత్మకు రక్షణ కల్పించటం కోసcc ం ఈ జపము తల్లి కొరకు బిడ్డ చేయు సహజ రోదన వంటిది తల్లి హరా తండ్రి హరి లేదా శ్రీకృష్ణుని కృపను పొందుటకు భక్తునికి సహాయం చేయను నిజమైన భక్తునికి భగవంతుడే స్వయంగా ప్రకటిత మగును.
ఆత్మ సాక్షాత్కారానికి ఈ యుగంలో దీనికి మించిన మరొక మార్గం ప్రభావవంతముగా లేదు మహా మంత్ర ఉచ్ఛారణ వలె


*హరే కృష్ణ హరే కృష్ణకృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామరామ రామ హరే హరే



 


 






















 

New Year Wishes

WISH U ALL A HAPPY N PROSPEROUS NEW YEAR

MAY THE NEW YEAR BRING ALONG

HAPPINESS N GLAD TIDINGS

THAT U CHERISH LIFELONG.
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online