Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-5

      అస్సలు భగవంతుడు మానవుడి లా అంత తేలిగ్గా  మీసాలు పెంచో .నున్నగా షేవ్ చేసుకునో .ఆయుధాలు పట్టుకోనో .పక్కన పిల్లలను పట్టుకొనో కనిపిస్తారా అని కొంతమందికి సంశయం  .పండితులు అరిషడ్వర్గము లు[ అంటే కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యములు] మనలోని రాక్షసులు అంటూ .క్షీరసాగర మధనం అంటే మన మనస్సు ని తర్కించుకోవటంఅని ఒక్కోదానికి పోల్చి చూపిస్తూ వుంటారు .అయి తే ఈ బ్రమ్మాండం లో ఎన్నో జీవులు వున్నాయి .ప్రతి జీవిలో మళ్ళీ అదే బ్రహ్మ౦ డము కొద్దిరూపములో నిండి వుంటుంది.  బ్రమ్మాండ ౦ లో ఉన్నదే కొద్ది కొద్ది గా ప్రతీ జీవిలో సూక్ష్మ రూపములో చిన్న  చిన్న బిందువు ల్లగా వుంటుంది .ఉదాహరణకు బైట పురాణాల్లో రాక్షసులు ,వాళ్ళు చేసే అరాచకాలు వింటూ ఉంటాము .అది బైట ప్రపంచములో జరిగినది నిజమే .మనలో వున్న రాక్షసులూ నిజమే అదే ఇలా చెప్పారు అని పోల్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఉదాహరణకు దశావతారములు తీసుకున్నాము .బ్రహ్మ్మ౦ డము లో భగవంతుడు అలా అవతారములుగా వచ్చి ఉండవచ్చు అది బైట జరిగింది

     అలానే మానవుడి లేక జీవపరిణామం చేపలు,తాబేళ్లు పంది సగం మనిషి సగం జంతువు కోతులు పోట్టిమానవుడు తెల్విగల మానవుడు ,ఆ తరువాత  అలా జీవ పరిణామం జరుగుతూవచ్చింది .దీనినే విదేశీయులు డార్విన్ ,జీన్ బ్లాస్తిస్ లమార్క్ లాంటివాళ్ళు ఈ ఆధునిక కాలములో నిరూపించారు .కాబట్టి ఇక్కడభగవంతుడిలో మనం వున్నాము .మనలో భగవంతుడు వున్నాడు .కాబట్టి భగవంతుడికి మనకు బేధము లేదు అదే అద్వైతము .అంటే రెండు కాదు ఒక్కటే   భగవంతుడు ,,నేను అంటే జీవుడు ఇద్దరం ఒక్కటే అనే వాదం ఈ వాదాన్ని అద్వైతముఅంటారు దీనిని జగద్గురు శంకరాచార్యులవారు ఆవిష్కరించారు .

        ఇక జీవుడు ,భగవంతుడు ఒకటే ఎలా అవుతారు కాదు ఎప్పటికి అలా కాదు భగవంతుడు సర్వ శక్తిమంతుడు ఆయనచే సృష్టింప బడినవాడు జీవుడు ,అందుకే జీవుడు ఒకడు ,భగవంతుడు ఒకడు ఇద్దరు వేరు వేరు అని మద్వా చార్యులు వారు చెప్పారు ఆ సిద్దాంతాన్ని ద్వైతము అంటారు అయుతే మరి ప్రకృతివిషయం ఒక్కటి వుంది తెలుస్సా దానిని ఏమి చేద్దాము అన్నారుభగవద్  రామానుజాచార్యులువారు అప్పుడు వారు ఒకటి కాదు , రెండు కాదు మూడు అని చెప్పారు దానినే తత్త్వ త్రయం అంటారు అంటే మూడు తత్త్వాలు  ఈ సిద్దాంతాన్ని విశిష్టఅద్వైతము అంటారు ఇది చక్కగా అర్థం కావాలంటే ఓభార్యాభర్తలుకలసినడుచుకుంటూ వస్తూన్నారు ఆ ఇద్దరు చుస్తే వేరువేరు అంటే ద్వైతము . అలానే కొంతకాలానికి భార్యకు కడుపు వచ్చింది ఇప్పుడు ఆమె అద్వైతం రూపానికి ఉదాహరణ. ఇప్పుడు ఆమె లో రెండు తత్వాలు కాని పైకి కనబడేది ఒక్కటే ఇక కొంతకాలానికి ఆమెకు కొడుకు పుట్టాడు లేక సంతానం కలిగింది ఆ ముగ్గురు అంటే తల్లి తండ్రి  కొడుకు నడుచుకొంటూ వస్తూన్నారు  ఈ కనపడే రూపం  విశిస్టా ద్వైతం  ..ఈ 3 భగవంతుడు – జీవుడు – ప్రకృతి  ఆధునిక సైన్స్ లో మనం చెప్పుకొనే ఎలక్ట్రాన్ –ప్రోటాన్ –న్యూ ట్రా న్  .రామానుజలువారు ఏమి చెప్పారంటే ఈ మూడు కలసినట్టే, కలసి ఉన్నట్టే  చూస్తే మూడు వేరు వేరు     .అలానే   ఉదాహరణకు  మనం ,మన ప్రక్కన వున్న క్లోజ్ ఫ్రెండ్ లేక బంధువు ఇంటి తో సత్సం సంభందం పెట్టుకున్నాము అనుకోండి.పై పై ఆలోచనలు కలిసే ఉంటాయి .  పండుగలు పబ్బాలు కల్సి చేసుకుంటాము ,మాటలాడుకుంటామ్  కాని ఒకే కుటంబం కాదు ,ఇవి రెండు వేరు వేరు కుటుంబాలు అలాంటి సంభంధమే ఈ భగవంతుడు –జీవుడు –ప్రకృతి 

        జీవుడు  శేరీరం లో వున్నప్పుడు లోపల బైటా  తనప్రక్కన వున్నది భగవంతుడు , ,ప్రకృతి,  అందుకే ఆరు బైట కనిపించే   ప్రకృతి లో కనపడే తూఫానులు ,సుడిగుండాలు,వేడి ,శీతలం అలజడులు  ఆకాశం ,పంచభూతాలు అన్నీమనలో కూడా కనబడుతూ ఉంటాయి ప్రకృతి లో యూనివర్సల్ గా  ఒక్కటే అంతా నిండి వుంటుందిఅదే  .ప్రకృతి ధర్మం అంటాం ఉదాహరణకు ఆవు తన దూడను ప్రేమిస్తుంది .విత్తనాలను మొక్కలు నలుదిసెలా ప్రేమతో ఇష్టం తో వెదజల్లుతాయి .ఇక్కడ ఒక విషయం ఆవు తన దూడనే ప్రేమించు కుంటుంది ఇంకో దాని దూడ విషయం దానికి అనవసరం .అలానే మొక్కలు ,జంతువులు,మనుషులు ఇప్పుడు మనం ప్రకృతి గురించి చర్చిస్తున్నాము .ఒకవేళ మీ మనస్సు లో మీకు అనిపించవచ్చు .కొన్ని జంతువులు .మనుష్యులు ఇతరుల పై శ్రద్ద చూపిస్తూవుంటా యి  మరి అది ఏమిటి అని అడగవచ్చు . ఇక అది ప్రేమ ,అనుభందం  యూనివర్సల్ ప్రేమ   అది భగవతత్త్వం .ప్రకృతి విషయములో బైట ప్రకృతి ,మనలోపల ప్రకృతి గురించి చర్చిస్తున్నాము కదా

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online