Pages

Some medicinal uses of cardamom

చిట్కా గృహ వైద్యం [యాలకులతో]
 
ఒక గ్లాసువేడి నీటిలో చిటెకెడు యాలకుల పొడి ,చిటికెడుమిరియాల పొడి ,కాస్తంతయండబెట్టిన అల్లం ,ఒక చెంచాతేనె కలిపి రొజూ తీసుకోవడం వల్ల ఆస్తమా .బ్రాంకైటిస్ నుంచి ఉపసెమనంపొందవచ్చు .

బోజనానికి ముందు ఒక యాలక్కాయ ,ఒక లవంగం నోటిలో వేసుకొని నమలడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.   అపానవాయువులు, గుండె మంట కూడా తగ్గు ముఖం పడతాయి .యాలకులు  ఒకటి ,అల్లం కొద్దిగా ,ఒక లవంగం కొంచం కొత్తిమిర రసం కలిపి తీసుకోవటం వల్ల అజీర్ణ సమస్యలు తగ్గిపోతాయి .అజీర్ణం వల్ల వచ్చే తలనొప్పి పోవాలంటే యాలకులు వేసి తయారు చేసిన టీ త్రాగితే మంచిఫలితం వుంటుంది .మానసిక వత్తిడి [స్ట్రెస్] నుంచి కూడా బైట పడవచ్చు.
 
 మంచి ఫలితం లభిస్తుంది ,కాని అతిగా యాలకుల పొడి వాడకూడదు.  గ్రీన్ టీ లో గాని ,బ్లాక్ టీ లో గాని ఒక చిటెకెడు యాలకుల పొడి వేసుకొని త్రాగటం వల్లరక్తం లో కేఫ్ఫిన్ తగ్గిపో యి మూత్రపిండాలు ,గాల్ బ్లాడర్ ని శుబ్రం చేస్తుంది
యాలకుల పొడిని అరటి ఆకు తో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ఉసిరి కాయ రసం లో కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవటం వల్లగనేరియా లాంటి సుఖ వ్యాధులు తగ్గి పోతాయి.
 
దాల్చిన చెక్క ను యలకులతో కలిపి కషాయం చేసి పుక్కిలించడం ,గొంతుకి తగిలేలా గాగులు చేయటం వల్ల గొంతు నొప్పి ,జలుబు తగ్గి పోతాయి .అలా 2 లేక 3 రోజు లు చేయాలి.  కప్పు నీళ్ళల్లోరెండు యాలకులు ,5 పుదీనా ఆకులు తో చేసిన కషాయం త్రాగితే వెక్కిళ్ళు తగ్గి పొతాయి. 

 ఏదైనామంచిది మంచి ఫలితం లభిస్తుంది కదా అని దానిని అతిగా వాడరాదు.  అప్పుడు అది వికటించి చెడు ఫలితం ఇస్తుంది.  అలానే అతిగా యాలకుల పొడి వాడకూడదు ,ఎక్కువసార్లు అదేపనిగా రొజూ త్రాగరాదు నపుంసకత్వంవచ్చే  ప్రమాదం వుంది .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online