Pages

curry leaves - some useful info

    కరివేపాకు మనకు బాగా తెలిసిన ఒక ఆకు.  మన భారతీయ వంటకాలలో  ముఖ్యం గా దక్షిణాది వంటల్లో ఇది చాలా ముఖ్యమైనది.  ఇది లేకుండా మన వాళ్ళు వంట చెయ్యరు అంటే అతిశయోక్తి కాదు .  ముఖ్యం గా పప్పులు , సాంబారు, రసం, ఇంకా కొన్ని కూరల్లో , ఉప్మా వంటి కొన్ని అల్పాహారాల్లో, దీన్ని విరివిగా వాడతారు.  ఇది మన తాలింపు పదార్ధాల్లో చాల ముఖ్యమైనది.  పులిహోర , పకోడీ వంటి పిండి వంటల్లో కూడా దీన్ని వాడతారు .  ఇంకా పొడులు పచ్చళ్ళ లో కూడా వాడతారు .


   కరివేపాకు ను English లో కర్రీ లీవ్స్ అని , ఇంకా స్వీట్ నీం లీవ్స్ ఐ అంటారు .  ఇది ఎక్కువగా మన ఇండియా శ్రీలంక దేశాలలో  పండుతుంది .  మన దేశం లో చాలా ఇళ్లల్లో ఈ చెట్టు ఉంటుంది .

   ఇంక దీనిలోని ఔషధ గుణాలను గురించి చెప్పాలంటే ఇది వంట్లోని వేడిని బాగా తగ్గిస్తుంది.  అధిక చెమటను కూడా తగ్గిస్తుంది మలబద్ధకం, రక్త హీనత, అజీర్ణం, కడుపులో నులిపురుగులతో బాధ పడేవారు ఆహారం లో దీనిని ఎక్కువగా తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.  షుగర్ ,బి.పీ . తో బాధ పడేవారికి ఇది మంచి మందు.  ఉదయం నిద్ర లేవగానే రెండు రెమ్మలు లేత కరివేపాకు తింటూ ఉంటె షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.


    ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ ఫైబర్ , విటమిన్ A, విటమిన్ ఎక్కువగా ఉన్నాయి. దీనిని ఆయుర్వేద మందుల తయారీ లో వాడతారు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కరివేపాకు ను మనం తినే ఆహారం లో వేస్తే ఏరి పారెయ్యకుండా తినటం అలవాటు చేసుకోవటం ఆరోగ్యనికి మంచిది
    

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online