ఇటువంటి వ్యాసాలు చదివినప్పుడు మనం స్పందించకుండా ఉండలేము. ఎందుకంటే ఇవి ఎప్పుడు ఒకే రకమైన భాషలో అసలు విషయానికి సంబంధమే లేని అనవసరమైన విషయాలను గురించి ప్రస్తావించడం ఒక అలవాటు గా మారింది ఈ రచయిత గారికి. ప్రపంచం లో ఎక్కడ ఎవరికీ ఏమి జరిగినా ఆ విషయాన్ని అగ్ర వర్ణాలకు, బ్రాహ్మణులకు ముడి పెట్టి వారిని తిడుతూ వ్యాసాలు రాయటం ఒక పని గా పెట్టుకున్నారు ఈ వ్యాసకర్త. ఇది చదివినాక నాకు కలిగిన కొన్ని అనుమానాలు, ఆలోచనలు నేను కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
ఆదిమానవుల రోజుల్లో మానవులు అంతా అనాగరికం గా ఉండేవాళ్ళు. వాళ్లకు రకరకాల దుస్తులు వేసుకోవటం, బాగా తయారు అవ్వటం తెలియదు. ఆ తర్వాత కాలం లో అభివృద్ధి చెందిన వారు, అభివృద్ధి చెందని వారు గా యుగాలు తయారు అయ్యాయి. ఇప్పటికీ పల్లెల నుండి రైతులు పట్టణాలకు ముతక పంచె, తలకట్టు, బుర్ర మీసాలు, చెప్పులు లేని కాళ్లతో వాస్తు ఉంటారు. పట్టణాలలోని వాళ్ళు పెద్ద మేధావులు అయినట్లు ఆ రైతులని పల్లెటూరి బైతు, తెలివి తక్కువ వాళ్ళు, వేలిముద్ర గాళ్ళు, ఎర్రబస్సు అని ఇలా రకరకాలుగా కులం తో పని లేకుండా పల్లెటూరి వారు అందరిని ఆట పట్టిస్తుంటారు. అంత మాత్రం చేత పల్లెల్లోని వారు అందరూ అలానే ఉంటారు అని గానీ, పట్టణం లోని వాళ్ళు అందరూ ఇటువంటి వాళ్ళే అని అనుకోవటం తప్పు .
అలానే ఒకప్పుడు పైకి ఎదగని కులాలు ఉన్న మాట నిజం. పూర్వపు రోజుల్లో శుభ్రత లేక, నాగరికత లేక, చదువు రాని వారిని గురించి ఈ" చండాలుడు" అనే పదం ఉపయోగించే వారు. అంతేగాని కులాన్ని గురించి ఉపయోగించలేదు. అదే కనుక నిజమైతే ఏదైనా బాగుండక పోతే ఛండాలంగా ఉంది అని అంటూ బాగున్నప్పుడు బ్రాహ్మణా అని వాడాలి కదా! మరి ఆ పదం వాడటం లేదు ఎందుకని? ఒక చిన్న పదాన్ని తీసుకుని ఆవువ్యాసం లాగా మళ్ళీ మళ్ళీ గడిచి పోయిన రోజులని గుర్తు తెస్తూ, కులాలు మతాల మధ్యన గొడవలు, బేధ భావాలు సృష్టించటం ఈ రచయిత గారి వంటి వారికి కాలక్షేపం అనుకుంటా! దీని వలన ఏమైనా ప్రయోజనం కలుగుతుందేమో వారే చెప్పాలి. నేను శుద్ధమైన వాడిని, నా బౌద్ధం గొప్పది అని పదేపదే చెప్పే రచయిత గారు కులం పేరుతో, మతం పేరుతో ఇతరులను విమర్శించటం ఎంతవరకు సబబు? హిందూమతం లోని పురాణాలు, గాధలు అన్నీ కల్పితాలు వీరి దృష్టి లో. ఆదిశంకరులు శివుడు కనిపించాడు అంటే అది కల్పితం ఈ రచయితకు. చండాలుడిని పూజించటం ఇష్టం లేక అగ్రవర్ణాలు కల్పించిన గాఢ అంటారు, మరి 8.వ శతాబ్దం లో పుట్టిన ఆదిశంకరుల అనుభవం కల్పితం అయితే, మరి క్రీస్తు పూర్వం ఎప్పుడో పుట్టిన బుద్ధుడు, బౌద్ధం, ఆయన కధలు నిజమని మనం ఎలా నమ్మాలి? అది మాత్రం కల్పితం ఎందుకు కాకూడదు?
హిందూ మతం అనగానే కాషాయం, కాషాయీకరణ అంటూ తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ కొన్ని వాస్తవాలను మరిచి పోతుంటారు ఇటువంటి రచయితలు. అసలు విషయం ఏమిటంటే హిందూ మతం లోదే బౌద్ధం కూడా. అదీ కాషాయమే. కాషాయం అంటే హిందూ మతమే. కాకపోతే వారు హిందూ మతం లోని కొన్ని ఆచారాలను మూడాచారాలు అని అనుకోవటం వల్ల దాన్ని వ్యతిరేకించడం, అటువంటి వారు అందరు కలిసి వేరే విభాగం ఏర్పరచు కోవటం జరిగింది. అది సహజమే కదా ! కానీ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా ! అన్ని కులాల్లో, మతాల్లోనూ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు. అలానే మన సమాజం లో కూడా కాలానుగుణం గా మార్పులు జరుగుతూనే ఉంటాయి. మన ఆచార వ్యవహారాల్లో మార్పులు వచ్చాయి. మనం కూడా ఈ మార్పులను ప్రస్తావించ కుండా ఎప్పటికి ప్రతి దృశ్యం, ప్రతి సంఘటన ప్రతి విషయం అదే కోణం లో చూస్తూ సైకలాజికల్ గా ఇంఫిరియారిటీ కాంప్లెక్స్ తో బాధ పడుతూ బ్రతకటం ఎంత వరకు కరెక్ట్ ? ఈ వ్యాసకర్త వంటి వాళ్ళు హిందువులను, బ్రాహ్మణులను ఆచారాలను వ్యతిరేకిస్తూ వ్రాస్తే, వాళ్ళు గొప్ప వాళ్ళుగా చెలామణి అవుతారని కొందరి భావన.
కానీ ఈ మూడాచారాలు, అన్ని మతాల్లోనూ, కులాల్లోకూడా ఉన్నారు. ఆరోజుల్లో హిందూ మతం లో అటువంటి వారు ఉన్నారు. కానీ ఆ పాటించే వారికంటే ఎక్కువ మంది వాటిని వ్యతిరేకించిన బ్రాహ్మణులు సంఘ సంస్కర్తలు ఉన్నారు. చాలా మంది బ్రాహ్మణులు ఈ సంఘ సంస్కరణల కోసం భారీ విరాళాలు ఇచ్చారు. వారి వంశాలను గురించి కూడా లెక్క చెయ్యకుండా వారి సమస్త సంపదలను సమాజం కోసం, జనుల హితం కోసం త్యాగం చేశారు. వారు స్వయం గా ఈ ఆచార సంప్రదాయాలను వ్యతిరేకించి వీరు చెప్తున్నకులాల వారిని వివాహాలు చేసుకున్నారు. అందరికి విద్య, వైద్యం వంటి సదుపాయాలూ కల్పించడానికి కృషి చేశారు. రామకృష్ణ పరమహంస, గోరా, వినోబాభావే, మరింగంటి భట్టరాచార్యులు, వంటి వారు గ్రామ ఉద్దరణ, పారిశుద్ధ్యం అంటూ s.c., S.T. వారి బాత్రూం లు, మరుగుదొడ్లు శుభ్రం చేసి, అహంకారం అనేది ఉండకూడదు, భగవంతుని దగ్గర అందరు సమానులే, సేవకులే అనే ఉపదేశాన్ని ఆచరించి చూపించారు. వారు కూడా బ్రాహ్మణులే. శ్రీ రామానుజాచార్యుల వారిని గురించి చెప్పాలంటే ఆయన మనం ఇప్పుడు వినిపిస్తున్న socialist. సిద్ధాంతాలకు ఆద్యుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సమాజం లోని అన్ని కులాలు, వర్గాల వారికి సమాన స్థాయి ఇచ్చారు. భగవంతుని దృష్టి లో అందరు సమానులే అని త్రికరణ శుద్ధి గా నమ్మి, ఆ విషయాన్ని పాటించి చూపించారు. ఆయన శిష్యులైన ఆళ్ల్వారులలో ఇప్పుడు చెబుతున్న దళిత వర్గాల వారు కూడా ఉన్నారు. వారు కూడా మిగిలిన అగ్ర వర్ణాల వారితో సమానము గా పూజించ బడుతున్నారు. శ్రీ రామానుజులు అందరికి పరమ పావనమైన తిరుమంత్రాన్ని ఉపదేశం చేశారు బహిరంగం గా. మరి ఈనాటి రోజున ఎంత మంది ఆయనను పూజిస్తున్నారు ?
ఈ రచయిత వంటి వారు మరి ఇటువంటి విషయాలను ఎందుకు రాయరు ? ఎంత సేపు బౌద్ధం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు అది ఒక్కటే గొప్ప ధర్మం, అందరికి సమాన న్యాయం చేసిన ధర్మం అని చెప్తుంటారు. మన హిందూ మతం లోని త్రిమతాచార్యులు, వారి సిద్ధాంతాలు, ఇంకా మన పురాణాలు, గ్రంధాలు అన్నీ కల్పిత గాధలే అయితే అవి అన్నీ ఎపుడో అంతరించి పోవాలి కదా! అలా ఎందుకు జరగటం లేదు ? ఈనాటి రోజున దళితులు అందరూ బౌద్ధం స్వీకరించాలి కదా ! కానీ అందులో ఎంత మంది క్రింది కులాల వారు ఉన్నారు ? అంత జనామోదమైన మతానికి ఈ రోజున ఈ అవస్థ ఏమిటి ? ఈ మధ్య వెలుగులోకి వచ్చిన మతం సాయి మతం. షిర్డీ సాయి బ్రాహ్మణుడు అయ్యి, ముస్లిం గా పెరిగి అన్ని మతాల వారు ఆరాధించే దైవం అయ్యారు. అన్ని మతాలూ, కులాల వారు ఆయనను బాబా గా నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయన భౌతికం గా మన మధ్య లేక పోయినా ఆయన సిద్ధాంతం ఈనాటికీ విశ్వా వ్యాప్తం అవుతోంది. సాయి గుడి లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ బౌద్ధం ఎందుకు మన దేశం లో అంతరించి పోతోంది ? మన దేశం బయటకు వెళ్ళిపోతోంది. దాని తర్వాత వచ్చిన విదేశీ మతాలు కూడా మన దేశం లో గ్రామ గ్రామానా విస్తరించి జనాల ఆదరణ పొందుతుతే ఈ బౌద్ధం ఎందుకు అంత ఆదరణ పొందలేక పోతోంది ? ఇప్పుడు వీరు చెప్తున్నట్లుగా శంకరాచార్యులు లేరు కదా బౌద్ధం వ్యాప్తిని అడ్డుకోటానికి , మరి అది ఎందుకు వ్యాప్తి చెందటం లేదు? ఇటువంటి రచయితలు పని గట్టుకుని మరీ ప్రచార వ్యాసాలు రాస్తున్నా ప్రయోజనం కలగటం లేదు ఎందుకని?
అసలు మతతత్వ పార్టీ అని చెప్పే B.J.P. మరియు దాని అనుబంధ సంస్థ లైన RSS, VHP, లలో ఎక్కువ శాతం మంది BC,SC,ST, వారే ఉన్నారు, బ్రాహ్మణులు ఎప్పుడో తట్ట బుట్ట సర్దుకున్నారు. అంత దాకా ఎందుకు? Zee.తెలుగు లో బ్రతుకు జట్కా బండి అని, ఇంకా Maa. tv, Gemini.tv, వంటి వాటిలో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అందులో వస్తున్న జీవిత గాథల్లో ఎక్కువ మంది కధలు ఈ కులాల వారివే. అంటే వారి కులాల వారిని వారే వయసు భేదం, స్త్రీ పురుష భేదం లేకుండా వారే మోసం చేసుకుంటూ సంసారాలను బజారుకు లాగుతూ ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని కని వారి జీవితాలకు ఆధారం లేకుండా చేస్తున్నారు. ఇలా చెయ్యటం వలన ఎవరికీ నష్టం ఎక్కువగా కలుగుతుందో ఆలోచించాలి. దీని వల్ల వారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ కూడా వ్యర్థం అవుతున్నాయి. ఇటువంటి రచయితలు అటువంటి వారికి సరైన సామాజిక స్పృహ కలిగించి రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి. అప్పుడు వీరు అందరు అభివృద్ధి చెందుతారు.
ఇప్పుడున్న సమాజంలో ఈ కులం లో అయినా ఉన్నవి రెండే కులాలు ధనిక, పేద. పేద వారిని ధనికులు రానివ్వారు సంభందాలు కూడా ఒప్పుకోరు. కులం ఏది అయిన, మతం ఏది అయిన ధనికులు అందరు ఒక్కటే అవుతారు. అంతదాకా ఎందుకు ఎందరో ఇలా కథనాలు రాసే రచయతలు గుడిసెల్లో ఉన్నవాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి పట్టే మంచం పై కుర్చోపెట్టు కుంటారా ? లేదే! పనివాళ్ళని పనివాళ్ళ లాగ చూసి బయట నిలబెడతారు ఆ పనివాడు ఏ కులంవాడైన పెద్దగా పట్టించుకోరు రోజులు అల ఉన్నాయి అని తెలుసుకోవాలి. ప్రతి మనిషి ఇంకో మనిషిని దోచుకునేవాడు అని శ్రీ శ్రీ చెప్పారు. ఆస్తి కోసము అంతస్తూ కోసము ఒకే కుటుంబం లో ఒకర్ని ఇంకొకరు దొంగ దెబ్బ తీసి చంపుకుంటున్న రోజులు ఇవి. ఒకే కులంలో మేధావి ను అదీ కులంలో ఇతర మేధావులు కిందకి లాగి బురద చల్లుతున్నారు. ఇంటువంటి అనుభవాలు రచయత కి ఇంకా కలిగి ఉండక పొవచ్చు. అందుకే ఎంత సేపు తన కులం గొప్పవాళ్ళు కాలేదు ఇంకోకులం వాళ్ళు పైన ఉన్నారు అని ఈరోజుల్లో కూడా బ్రహ్మణ నులుని కులమే పేరు పెట్టి విమర్శిస్తున్నారు. మంచి కోణం లో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఎంతో మంచి పనులు కూడా చేసారు. ప్రతిసారి వారిలో తప్పుగా అన్వేషించటం స్వయం కృత అపరాధం
శరీరములో పురచేయి చేయవలసిన పని పురచేయే చేస్తుంది. అన్నం తినే పని కుడి చేయి చేస్తుంది. పొట్ట తిని కూర్చున్తుంది. అలా ఆలోచించి తినడం మానేసి చూడండి. ఏమీ అవుతుంది? మొత్తానికి శరీరమే పడిపోతుంది. ఇక్కడ ఒకటి అర్ధము చేసుకోవాలి. ఇవని శరీరములో భాగాలే. ఎవరికి అయిన ఏదైనా పెట్టె టప్పుడు కుడి చేత్తో ఇస్తాము. అలానే ఎడమ చేయ కుడిచేయి చేతులు రెండు కలిస్తేనే ఏ పని అయిన జరుగుతుంది. అలానే చేతి వేళ్ళలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. అర్ధం చేసుకుని ఒకల్ని ఒకళ్ళు గౌరవించుకుని బ్రతకాలి .ఎవర్ని కించపరచకూడదు ఎవరి మనోభావాలు దేబ్బతీయరాడు. పూర్వ కాలం విషయాలు మల్లి గుర్తుకు తీసుకువచ్చి ఏ కులం పై అయిన ఎత్తి వ్రాయకూడదు అన్న ఇంగిత జ్ఞానము కొందరు రచయతలు తెలుసుకోవాలి.
0 comments:
Post a Comment