ఆమెది మా ఊరే
మా వీధి లో చివరి ఇల్లు ఆమెదే
అమ్మ చెప్పింది ఆమె మనకు చుట్టమే అని
ఇద్దరిదీ ఒకే పట్టణం లో ఉద్యోగం
ఎదురు పడింది కళ్ళతో విష్ చేసాను
ఒకే రైలు లో ప్రయాణం చేసాము
జీవితపు రైలు లో ఆమెతో ప్రయాణం చేయాలని
ఒక చిన్ని ఆశ రగులుతూనే ఉంది.
ఆమెతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను
మాటలు గుండె దాటి రావటం లేదు
స్టేషన్ వచ్చింది . వాళ్ళ వాళ్ళు వచ్చినట్లున్నారు
నా కనుల ముందే కదిలి వెళ్లారు
వెళ్తూ నా వైపు ఓ చూపు విసిరింది
నేను ఆమె కోసం మా వీధి లో
అటూ ఇటూ పచార్లు కొడుతూనే ఉన్నాను
మా వీధి లో చివరి ఇల్లు ఆమెదే
అమ్మ చెప్పింది ఆమె మనకు చుట్టమే అని
ఇద్దరిదీ ఒకే పట్టణం లో ఉద్యోగం
ఎదురు పడింది కళ్ళతో విష్ చేసాను
ఒకే రైలు లో ప్రయాణం చేసాము
జీవితపు రైలు లో ఆమెతో ప్రయాణం చేయాలని
ఒక చిన్ని ఆశ రగులుతూనే ఉంది.
ఆమెతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను
మాటలు గుండె దాటి రావటం లేదు
స్టేషన్ వచ్చింది . వాళ్ళ వాళ్ళు వచ్చినట్లున్నారు
నా కనుల ముందే కదిలి వెళ్లారు
వెళ్తూ నా వైపు ఓ చూపు విసిరింది
నేను ఆమె కోసం మా వీధి లో
అటూ ఇటూ పచార్లు కొడుతూనే ఉన్నాను
0 comments:
Post a Comment