Pages

వసంత శ్రీ పంచమి

        వసంత శ్రీ పంచమి సరస్వతీ దేవి జన్మ దినం గా భావించడం జరుగుతోంది .  కనుకనే సరస్వతీ దేవి ఆలయాలలో, క్షేత్రాలలో  వైభవం గా ఉత్సవాలు జరుపుకోవటం ఆచారంగా రూపుదాల్చింది.  ఇది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన ఆచారం.  ఇది స్వయం గా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన ఆచారం.  మాఘ శుక్ల పంచమి నాడు ఈ పూజ ప్రారంభిస్తే ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది .  సుఖ సంపదలను , సకల శుభాలను ఇచ్చే పంచమి కాబట్టి దీనిని శ్రీపంచమి అని తలుస్తూ ఉంటారు.
        శ్రీ దేవి భాగవతం లోను, శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం లోనూ శ్రీ సరస్వతి అమ్మవారి కవచము, యజ్ఞ్యవల్కుడు రచించిన వాణీ స్తవం ఉన్నాయి. సృష్టి ప్రక్రియ ను వివరించే సందర్భం లో సరస్వతీ ఆవిర్భావం గురించి చెప్పటం జరిగింది.  మూల ప్రకృతి, దుర్గ, రాధ, లక్ష్మి , సరస్వతి, సావిత్రి అనే పంచ దేవతలుగా ఆవిర్భవించింది .సరస్వతీ మాత ఆవిర్భావము గురించి దెవీ భాగవతములో వర్ణించ బడింది .  అమ్మవారిని మొట్టమొదట గా పూజించింది  శ్రీకృష్ణుడు .  ఆమె దయతో మూర్ఖుడు సైతం  పండితుడు , జ్ఞాని కాగలడు అని శ్రీకృష్ణుడు పలికాడు.  శ్రీకృష్ణుడు ఆమెకు కొన్ని వరాలు ఇచ్చాడు .  ఆరోజు మాఘ శుద్ధ పంచమి అయ్యుండవచ్చు అని కూడా కొందరు పండితుల అభిప్రాయం .  
        "ప్రతీ విశ్వము నందూ మాఘ శుద్ధ పంచమి నాడు గొప్ప గౌరవం తో విద్యారంభమున నిన్ను పూజింతురు.  ఎల్ల మానవులు, మనువులు , దేవతలు , మునీంద్రులు , మోక్షకాములు , వసువులు , యోగులు , సిద్ధ , నాగ , గంధర్వ రాక్షసులు నిన్ను పూజింతురు.ప్రతి కల్పమున చివరి వరకును భక్తి యుక్తి తో షోడసోపచారములతో చివరి వరకు ను కన్వశాఖా విధానం లో కాలసము నందు గానీ పుస్తకము నందు గానీ ఆవాహన చేసి పూజించి ధ్యానించెదరు.  ఇట్లు నీకు వారము ప్రసాదిస్తున్నాను అని వివరించాడు శ్రీకృష్ణుడు.  ఆయన స్వయంగా తానూ పూజించాడు కాబట్టి ఆ నాటి నుండి బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు , ఋషులు, సనక సనందనాదులు , సకల దేవతలు, రాజులు , నరులు , సర్వులూ సరస్వతీదేవిని ఆరాధించా సాగారు.  కన్వశాఖ లోని పధ్ధతి ప్రకారం  దేవిని పూజించే విధానం శ్రీమహావిష్ణువు నారదునికి తెలియజేసాడు .    
          మాఘ శుద్ధ పంచమి నాడు ఉదయమే సరస్వతీ అమ్మవారిని శుచిగా పూజించ టానికి సంకల్పించుకోవాలి.  నిత్య కృత్యాలు అయిన తర్వాత పూజకు సిద్ధం కావాలి.  భక్తి తో కలశ స్థాపన చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుని పూజించి కలశమున దేవిని ఆవాహన చేసుకోవాలి.  ఆ తరువాత వెన్న , పెరుగు , పాలు ,పేలాలు , నువ్వుండలు , చెరకు ముక్కలు ,బెల్లము ,పిండివంటలు , తేనె, పటికబెల్లము , తెల్లనివి అటుకులు గానీ అన్నము గానీ, గోధుమ పిండి నెయ్యి కలిపి చేసిన వంటకాలు, బాగా పండిన అరటిపండ్లు  లేక కొబ్బరికాయ కొట్టి పటికబెల్లం కలిపి  నైవేద్యము గా సమర్పించవచ్చు .  మంచి గంధం , తెల్లని పూలు , తెల్లని వస్త్రం , తెల్లని నగలు, శంఖం  సరస్వతీ అమ్మవారికి అర్పించ వచ్చు.


          ఈ క్రింది మంత్రాన్ని పటించాలి.  ఆ తరువాత కవచం పటించి దండ ప్రణామం చెయ్యాలి.

 
సరస్వతీం శుక్ల వర్ణాం సుస్మితాం సుమనోహరాం
కోటి సూర్య ప్రభా పుష్ప శ్రీ యుక్త విగ్రహాం
సుపూజితాం సుర గనైహ్ బ్రహ్మ విష్ణు సివాదిభిహి
వందే భక్త్యా వందితాం చ మునీంద్ర మను మానవైహ్ !!



       ఈ సరస్వతీ మంత్రం కల్ప వృక్షం వంటిది దయాళువైన నారాయణుడు ముందుగా వాల్మికి కి ఉపదేశించాడు .  ఆయన ఆది కవి గా ప్రసిద్ధి కి ఎక్కాడు .ఒకప్పుడు యాగ్న్యవల్క్య ముని గురు శాపం చేత సర్వ విద్యలు మరిచి పోయి బాధ పడుతూ సుర్యదేవుడ్ని ప్రార్ధించాడు.  అప్పుడు సుర్యదేవుడు ప్రత్యక్షమై  శ్రీ సరస్వతి అమ్మవారిని పైన ఇవ్వ బడిన స్తోత్ర మంత్రము తో ధ్యానం చేయమన్నాడు .  యజ్ఞ వల్క్య ముని అలా ధ్యానం చేయగా అమ్మవారు ప్రత్యక్షమై పండితుడు , సుకవి అయ్యే వరం ప్రసాదించింది. 
        వైభవోపేతం గా సరస్వతి అమ్మవారి పూజ పూర్తి చేసిన వారు , వారికి చేతనైనంత లో బీద పిల్లలను గణపతి రూపాలుగా భావించి వారికి పలకలు, బలపములు , పుస్తకములు , నూతన వస్త్రాలు బహుకరిస్తే దివ్యమైన ఫలం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి .
  దనం సంపూర్ణం గా ఉన్న వాడు కూడా జ్ఞానం లేకపోతె నష్ట పడతాడు .  విధ్యాధనమ్ లేకపోతే జ్ఞానం ఉండదు .  జ్ఞానం లేకుంటే మార్గం తెలియక సొమ్ము అంత విచ్చల విడిగా ఖర్చు చేసి పాడు చేస్తాడు .  చక్కని జ్ఞాన సిద్ధి ఉన్నవాడు ఆ దానం భగవంతుని చే ఇవ్వబడింది అని తెలుసుకొని దానిని మంచి పనులకు ఉపయోగిస్తాడు .  తద్వారా సుకీర్తి ని పొందుతాడు.  ఇది లౌకిక పరమైన జ్ఞానం.

        ఇక అలౌకిక మైన జ్ఞానం అయితే వేదాంత విద్యలు అభ్యసించి పరమాత్మ తత్వమూ తో నిండి ఉన్న ప్రపంచమును తన జ్ఞాన జ్యోతి ద్వారా తెలుసుకొని పరమాత్మను కనుగొని అందులోకి లీనమైపోతాడు .  అదే మోక్షము.  భారతీయ సంస్కృతి లో ప్రతివారు ఆశించేది అదే జ్ఞానం తో వచ్చే మోక్షము .  అందుకు అమ్మవారు ఇచ్చే జ్ఞాన బలం జీవులందరికీ చేరి వర్ధిల్లాలి అని శ్రీ సరస్వతి అమ్మవారిని ప్రార్ధిద్దాం ..

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online