Pages

చిలిపి ఊహలు

గాలి పరిమళం మోసుకువస్తోంది
పండు వెన్నెల పచ్చగా పరుచుకొని ఉంది
సన్నజాజి పందిరి నిండా తీగలు
తీగల నిండా గుత్తుల గుబురులు
ఇంటి ముందు మెట్ల పై కూర్చుని ఉన్నాను
మా ఇంటి గోడ అవతల ఇంట్లో ఆ అమ్మాయి
చక్రాల్లాంటి కళ్ళతో మా ఇంట్లోకి చూస్తోంది
వయ్యారం గా నిల్చుని జడ అల్లుకుంటోంది
ఆమె ను ఒకసారి పలుకరించాలి
ఆమె ఎంత అందంగా ఉందొ చెప్పాలని
ఎదురుచూస్తున్నా కాలం కలిసి వస్తుందని ....

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online