Pages

is one life enough?

    నా చిన్ననాటి మిత్రుడు ఒకాయన వచ్చారు , "గురువా! నేను హిందూ మతం లో పుస్తకాలు అన్నీ చదివి అంతా తెలుసుకున్నాను.  దేవతలు అందర్నీ ఆరాధించాను.  కానీ నాకు క్రిస్టియన్ మతమే నాకు దారి అని అనిపించింది.  అందుకే ఆ మతం పుచ్చుకున్నాను .  నా నిర్ణయం ఎలా అనిపిస్తుంది మీకు ?" అని అడిగాడు.  దానికి నేను " సరే మీకు నచ్చింది మీరు చేసారు .  o.k. కానీ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు జవాబు చెప్పండి .  మీరు హిందూ మతం లో దేవుళ్ళు ఎవరిని ఆరాదించారు ?  అని అడిగాను .  దానికి ఆయన కొన్ని గ్రామ దేవతల పేర్లు చెప్పాడు .  గురువుగారూ ! నేను ఆ దేవతలను ఆరాధించాను.  కానీ నాకు ఈ మతమే కరెక్ట్ అనిపించింది అని చెప్పాడు .  అప్పుడు నేను ఆయన్ని అడిగా "మీరు హిందూ మత గ్రంధాలు చదివారా ?  అని  దానికి ఆయన లేదు గురువుగారూ ! నేను పెద్దగా చదవలేదు .  అయినా ఏమి ఉంది  వాటిలో ?  అన్నీ ఉత్త మాటలేగా! అంటూ కొంచం వ్యంగ్యంగా అన్నాడు .   దానికి నేను అతనితో అన్నాను , మీరు మొదటి మెట్టు లో నుంచే వెనక్కు వచ్చేసారు .  మరి ఇంకా ఈ మతాన్ని గురించి మాట్లాడటం అనవసరం  అని అన్నాను .

      అతనితో ఇంకా సంభాషించాలి అని  మనసుకి అనిపించలేదు .  ఆ తర్వాత నేను కూర్చుని హిందూ మత గ్రంధాలు  అవి ఏమిటి అంటే 4 వేదాలు, బ్రహ్మ సూత్రాలు, 18 పురాణాలు , 150 ఉపనిషత్తులు , భగవద్గీత, ఇంకా హిందూమతం లోనే 5 ముఖ్య మతాలు , వాటిపై త్రి మతాచార్యులు శంకర , రామానుజ , మధ్వాచార్యులు వ్రాసిన భాష్యాలు ఇవి అన్నీ ముఖ్యమైనవి.  ఇంకా ఇతర గ్రంధాలు ఇంకా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి .  వీటిని మనం పూర్తిగా చదివి అర్ధం చేసుకోటానికి ఒక జీవిత కాలం సరిపోదు మతం గురించి నాకు తెలిసిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవటం మొదలు పెట్టాను .
        హిందూ మతం లోని 5 మతాలను శంకరాచార్యులవారు చట్టబద్ధం చేసారు .   అవి ఏమిటంటే
1. సౌరం -- అంటే సూర్యుడిని కొలవటం .   2. గాణాపత్యం -- అంటే గణపతిని ఆరాధించటం . 3. అంబికాం -- అంటే శక్తీ మాత దుర్గ ను పూజించటం .  4. శ్రీవిష్ణుం --  అంటే విష్ణువు ను పూజించటం . 5.  మహేశ్వరం -- అంటే శివుని ఆరాధన .  ఈ 5 కాక ఆయన 6వ మతాన్ని ఒక దాన్ని స్థాపించారు   అది ఏమిటంటే ఈ పైన చెప్పిన 5గురు దేవతలలో మన ఇష్ట దైవాన్ని ఒకరిని మధ్యలో ఉంచి మొత్తం మిగిలిన వారిని చుట్టూ ఉంచి పూజించటం .  ఆయన ఈ సిద్ధాంతాన్ని నిరూపించి మిగిలిన 75 మతాల వారిని ఓదించి వాటిని తీసివేసారు .  అందువల్లనే ఆయన ను షన్మత స్తాపనాచార్య అనే పేరుతో పిలుస్తారు .  ఆది శంకరులు అద్వైతాన్ని స్థాపించారు .  అంటే భగవంతుడు, జీవుడు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పారు .  ద్వైతము కానిది అద్వైతము  అని ప్రతిపాదన చేసి భాష్యం వ్రాసారు .దానినే శంకర భాష్యం అని అంటారు .  ఆయన జగద్గురువు అని పేరు పొందారు .   ఆతర్వాత కాలం లో మళ్ళీ మూదాచారాలు తిరగాబెట్టినప్పుడు రామానుజులు వచ్చి విసిష్టాద్వైతాన్ని స్థాపించారు .  ఆయన సమాజం లోని రుగ్మతలు తొలగించటానికి పాటుపడ్డారు .  అన్ని కులాలు , మతాల వారిని తన దగ్గరకు ఆహ్వానించారు .  ఆయన మనుష్యులలో బేధాలు లేవు అంతా ఒక్కటే అని ప్రబోధించారు .  ఆయన సిద్దాంతం ప్రకారం పరమాత్మ +ప్రకృతి +జీవుడు అంటే ఎలెక్ట్రాన్+ప్రోటాన్ +న్యూట్రాన్ లాగా కలిస్తే ఈ సృష్టి అని ప్రతిపాదించారు .  అదే విశిష్టాద్వైతం .  ఈ ప్రతిపాదన తో వ్రాసినదే శ్రీభాష్యం . 
   ఇక మూడవ వారు మధ్వాచార్యులు.  వీరిది ద్వైతం .  అంటే పరమాత్మ +జీవుడు ఇద్దరు వేరు వేరు అని .  ఈయన కూడా ఈ మతానికి భాష్యం వ్రాసారు .
  ఇలా హిందూ మతం లో ఈ ముగ్గురు రచనలు చదవాల్సి ఉంటుంది .  ఇంకా తులసీదాసు , కబీరు వంటి గొప్పవారి రచనలు , ఆళ్వారుల గ్రంధాలు , రామాయణ భారతాలు ఇవి అన్నీ సాహిత్యమే .  అసలు ఇంత వరకు చదివి అర్ధం చేసుకోత్తనికే సమయం సరిపోదు .
   ఇంకా ఒక్క ఖురాన్ , లేదా బైబిల్ చదివితే మొత్తం మతం గురించి తెలియదు .  హిందూ మతంగురించి తెలుసుకోవటానికి , వేదాంత అనుభూతిని పొందటానికి ఒక్క జన్మ సరిపోదు .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online