Pages

Think before writing

         కసూరి రచన పై భౌతిక దాడులకు దిగటం కొంత భాదాకరమే అంటూ వ్యాసకర్తలు ఎడాపెడా వ్రాసిపారేస్తున్నారు.  గతం లో తమిళనాడు లో మనువు వ్రాసిన మనుస్మృతి పుస్తకాలు తగులబెట్టారు .  బ్రాహ్మణులు రోడ్లపై వెళ్తుంటే బట్టలు విప్పి కొట్టారు ఇతర కులాల వారు.  ఇంతకీ ఆ పుస్తకం 2000స0;; కు పూర్వం ఉన్న పరిస్థితులకు అనుగుణం గా వ్రాసినది.  ఇంకా గట్టిగా చెప్పాలంటే అది ఈ కలియుగం లో అమలు లో ఉండదు.  హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇప్పుడు ఉండేది పరాశర సంహిత.  ఒక 1000స0;; తర్వాత అంబేద్కర్ వ్రాతలు పనికిరావని ఆ దారిన పొయ్యే వాళ్ళను కొడితే ఏమైనా అర్ధం ఉంటుందా ?  ఇదీ అంతే.
        పరమత సహనం అని ఈ రచయితలు రాస్తున్నారు.  ఈ సహనం విదేశాలకు పట్టదా ?  భారత దేశం పై ఎందరో దాడి చేసారు, సంపదలు దోచుకున్నారు .కానీ ఏనాడు మన దేశం ఇతర దేశాలపై ఉత్తుట్టిగానే అయినా దాడులకు వెళ్ళలేదు.  మన దేశపు సరిహద్దుల్లో మిలటరీ వాళ్ళు పడుతున్న కష్టాలు గురించి ఆలోచించండి .
        తప్పులు పాకిస్తాన్ వాళ్ళు చేస్తూ, మన దేశం వాళ్ళు చేస్తున్నారు అని అంతర్జాతీయ మీడియా లో బుకాయిస్తుంటే కనపడటం లేదా?ముషారఫ్ హయాం లో మన ఆర్మీ ఆఫీసర్స్ ని బంధింఛి చిత్ర హింసలకు గురి చేసి, వారి నాలుకలు కోసి, కళ్ళు పీకి, హింసలు పెట్టారు అప్పుడు మన దేశ భక్తులు ఏమి చేస్తున్నట్లు ?  తాగిన మైకం లో సరభ్ జిత్ సింగ్ పొరబాటుగా సరిహద్దు దాటి వెళ్ళిన నేరానికి అతడిని 30స0;;జైలు లో ఉంచారు.  చివరకు అక్కడే జైలు లో తోటి ఖైదీలతో రాళ్ళతో కొట్టించి చంపించారు.
         మనం చెప్పుకుంటూ పోతే ఇటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.  ఆ దేశం లో హిందువులు ఎలా బ్రతుకుతున్నారు ? ఈ దేశం లో ముస్లిం లు ఎలా జీవిస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే.  ఇన్ని జరిగినా కూడా మన దేశం అలాంటి ఒక గొప్ప దేశం పై స్నేహం చేయాలి అంటూ స్నేహ హస్తం ప్రతిసారీ అందిస్తూనే ఉండాలి వాళ్ళు ఎన్ని సార్లు వాతలు పెడుతున్న సరే అని వ్రాస్తున్న మన రచయితలను మనం గౌరవించాలి, సన్మానం చెయ్యాలి !! ఎందుకంటే వారిది చాలా విశాల హృదయం కదా మరి !!
           ఈ అవార్డులు, రివార్డులు తిరిగి ఇవ్వటానికి ముందు మన మేధావులు కొంచం ఈ విషయాలమీద ఆలోచించాలి.  ముందు దేశ ప్రజల మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో తెలుసుకోవాలి.  మనం పాకిస్తాన్ తో స్నేహం గా ఉండటం,వారి కళాకారులను గౌరవించటం ఇప్పటివరకూ జరుగుతూనే ఉంది.  కానీ వారు కూడా అదే గౌరవాన్ని మనకి ఇస్తున్నారా అని ఆలోచించాలి.
         అయినా మన దేశం లో పాకిస్తానీ కళాకారులు రావటం, ప్రదర్శనలు ఇవ్వటం, సినిమాలు, TV. లో నటించటం అన్నీ జరుగుతూనే ఉన్నాయి.  మరి ఇప్పుడు ఈ కులకర్ణి గారిని ఎందుకు వ్యతిరేకించారు అనేది ముందు అర్ధం చేసుకోవాలి .  మనం కసూరి ని ఒక రచయిత గా అంగీకరించ గలమా? అతను పాకిస్తాన్ మంత్రి  గా ఉండేవాడు.  రాజకీయ నాయకుడు.  మన దేశానికి వ్యతిరేకం గా పని చేసినవాడు.అటువంటి వాడిని మన మేధావులు గౌరవించాలి అని అనుకోవటం ఎంత వరకు సమంజసమో ఆలోచించండి .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online