Pages

Mother's Day

మాతృ దేవో భవా
పిత్రు దేవో భవా
ఆచార్య దేవో భవా
అతిధి దేవో భవా
  ఇలా భారతీయ సంస్కృతి లో అందరికీ సముచిత స్థానం, గౌరవాన్ని ఇస్తూ కన్న తల్లికి మొదటి స్థానాన్ని ఇచ్చింది .  మొదటి సారిగా తల్లికి నమస్కారం చేస్తాము .  అందుకే దేవతలను ఉచ్చరించే టప్పుడు కూడా లక్ష్మీనారాయణులు , పార్వతీపరమేస్వరులు  సరస్వతీ బ్రహ్మలు  అని చెప్పుకుంటాము .  అలానే భారతమాత  అనీ , వేద మాత అనీ అంటాము .  ఇలా అన్ని విషయాలలో స్త్రీ కి పవిత్ర స్థానం ఇవ్వబడింది . యత్ర నార్యస్తు పూజ్యంతే  రమంతే తత్ర దేవతాః   ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో  అక్కడ దేవతలు కొలువై ఉంటారు " అని మనువు ధర్మ శాస్త్రం లో చెప్పాడు .  అటువంటి భారత దేశం లో ఈనాడు విచ్చల విడిగా విదేశీ నాగరికత , సంస్కృతి ప్రవేశించాయి .  o.k. మంచి ఎక్కడి నుండి అయినా తీసుకోవచ్చు .అసలు మంచి అంటే ఏమిటీ ?  పది మందికీ మేలు చేసి , సంతోషం కలిగించేదే మంచి . 
       విదేశీ సంస్కృతి లో కొన్ని దేశాలలో పిల్లలు యుక్త వయస్సులో అంటే 16 సంవత్సరాల  వయస్సులో తల్లిదండ్రులను , కుటుంబాన్ని వదిలి స్వతంత్రంగా ఎదగటానికి , జీవించటానికి ఇంటి నుండి బయటకు వెళ్లి పోతారు . (మన భాషలో రెక్కలు వచ్చి ఎగిరిపోవటం అంటారు )  అదే మన దేశం లో అయితే తల్లితండ్రుల నుండి , కుటుంబం నుండి బయటకు వెళ్ళటం ఉండదు .  పుట్టిన దగ్గరినుండి తల్లితండ్రులతో, అక్క చెల్లెళ్ళతో , అన్నదమ్ములతో అంతా కలిసి ఉంటారు .  ఉద్యోగరీత్యా మరొక వూరికి వెళ్ళవచ్చు.  అంతే గానీ మన బంధాలు మారిపోవు .
      అందువల్లనే మనకు మథర్స్ డే ,ఫాదర్స్ డే  అంటూ ఉండవు .  మనకు వారితో కలిసి ఉండటం రోజూ ఒక పండుగే .  రోజూ అంతా కలిసే ఉన్నప్పుడు ఈ ప్రత్యేక పండుగ అంటూ ఏమి ఉంటుంది ? విదేశాలలో చిన్న వయసు లోనే బాధ్యతలు తెలుసుకొని ఎవరిదారి వారు విడిపోతారు . చాలా మంది వృద్ధాప్యం లో కి వచ్చే సరికి అసలు భార్య , భర్త ఎవరో, ఏమిటో కూడా కొన్ని కుటుంబాలలో తెలియదు .  అసలు వారికి  వివాహ వ్యవస్థ పై కూడా నమ్మకం సన్నగిల్లింది .  అందుకే వారు తమ తల్లితండ్రులను వెతుక్కుంటూ వెళ్లి కృతజ్ఞతలు చెప్పుకోవటం , ప్రత్యేకం గా పండుగ చేసుకోవటం జరుగుతోంది . ofcourse. ఇప్పుడు మన దేశం లో కూడా చాలా విషయాల్లో విదేశీ బాట లో నడుస్తున్నారు యువత .  ముఖ్యం గా ప్రేమలు , పెళ్ళిళ్ళు , విడాకులు , హార్దిక సంబంధాల నుండి ఆర్ధిక సంబంధాల వరకు అలానే నడుస్తున్నాము .
     మన దేశం లో ఇంకా కుటుంబ వ్యవస్థ అన్ని మార్పులు చెందలేదు.  ఇంకా మనం తల్లితండ్రులతో కలిసి ఉండటం జరుగుతోంది .  మనం పండుగలు , ఆచార వ్యవహారాలూ అన్నీ కుటుంబం తో కలిసే జరుపుకుంటున్నాము .  అందువల్లనే ఇంకా మన దేశం లో ఈ ప్రత్యెక దినోత్సవాలూ, సత్కారాలు అవసర పడలేదు .  కానీ ఇప్పుడిప్పుడే మారుతున్న సమాజ పరిస్థితుల వల్ల న్యూక్లియర్ కుటుంబాలు వచ్చేసాయి.  పెళ్ళిళ్ళు కాగానే భార్యాభర్తలు విడిగా వెళ్ళిపోతున్నారు .  ఇంకాస్త ముందుకు వెళ్లి డేటింగ్ అంటూ పెళ్ళికి ముందే కలిసి తిరుగుతున్నారు .  ఇంకొన్ని ఆధునిక పోకడలు ముదిరి తల్లితండ్రులను వ్రుద్ధాస్రమాల్లొ చేర్పిస్తున్నారు .  అందువల్లనే మన దేశం లో కూడా ఈ మథర్స్ డే, ఫాదర్స్ డే జరుపుకోవటం ఆశ్చర్యం కాదు అని కొందరు సంప్రదాయ వాదులు పెదవి విరవటం సహజమే.      మరి ఈ విపరీత ధోరణుల వల్ల యువతీ యువకుల ఆలోచనలు మారుతున్నాయి .  దాని వల్ల మన భావి తరాలకు  మన కుటుంబ వ్యవ్యస్థ , పవిత్ర వివాహ వ్యవస్థ పై నమ్మకం సడలుతోంది .  ఈ వ్యవస్థలకు తూట్లు పడుతున్నాయి . 
  ఇంకా ఈ కొత్త పండుగలు వ్యాపార వర్గాలకు చాలా లాభం తెచ్చి పెడుతున్నాయి .  ఇంకా ప్రకటనలు , రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ , కానుకలు , వాటికి అంతే లేదు .  అందువల్ల వారు కూడా ఈ విషయాలను ప్రోత్సహిస్తున్నారు అని అనిపిస్తోంది .  కానీ ఇది  విపరీత ధోరణులకు దారి తీస్తోంది .
   మన సమాజం లో చాలా మార్పులు వస్తున్నాయి .  మనుషుల్లో సంబంధాలు , బంధాలు చేదిరిపోతున్నాయి .  ఇంట్లో అమ్మమ్మలూ , నాయనమ్మలో లేక పోవటం ఇంకా పిల్లలు ఒంటరితనం లో పెరగటం వల్ల కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆలోచనల్లో . 
    కానీ మనం కూడా బాధ్యత గా ఆలోచించి మన సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని నడవాలి .  మన కుటుంబ వ్యవస్థ ను సక్రమంగా కాపాడితే ఈ మథర్స్ డే, ఫాదర్స్ డే ప్రత్యేకం గా జరుపుకోవలసిన అవసరం లేదు .  మనం అందరం ఈ విషయాలను గురించి ఆలోచించ వలసిన అవసరం, అమలు చెయ్య వలసిన సందర్భం ఇదే !

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online