Pages

సృష్టి లోని వైచిత్ర్యం

అక్షరాలూ అనుబంధం తో బంధం అవుతాయి
సుందరమైన వయ్యారాలతో మాయ చేస్తుంటాయి
అందాలను రంగరించి మూస పోస్తాయి
మనస్సున చొప్పించి శిల్పం చెక్కుతాయి
వయస్సు ను బంధించి పల్లకిలా మోయిస్తాయి .
మనసును దారం చేసి ఆశల కుసుమాలను గుచ్చేస్తాయి
శరీరాన్ని తేలిక చేసి ఆనందపు ఊయలలు ఊపుతాయి
కళ్ళలోని చూపులను పట్టి మత్తు ఎక్కిస్తాయి
ఎందమావుల్లా కావు , ఎడారి ఒయాసిస్సులా ప్రకాసిస్తాయి
కోర్కెల గుర్రాలపై వయస్సును సవారి చేయిస్తాయి 
 ఆశలు ప్రేమకై ఒక రూపం పోస్తాయి
ప్రేమ ఆ రూపం మేడలో ఆశల మాల వేస్తుంది
కనురెప్పల మధ్య ఆ రూపం ఉంది పోతుంది
కనుల కొలనులో ఆ అక్షరాల రూపం కలగా ఎదుగుతుంది
మనస్సు ఆర్ద్రత తో ఇంకో మనస్సును అతుకుతుంది
ప్రేమ గూటిలో రెండు శరీరాలు ఒకేపాట పాడతాయి
ఎనో కొత్త రాగాలు మధురమైన అనుబంధం గా జన్మిస్తాయి
జన్య జనక రాగాలు అనుభూతి గా మిగిలిపోతాయి .

some useful info. reg. potasium

       దేహం లో పొటాషియం లోపిస్తే హైపో కీలమియా అనే తీవ్రమైన పరిస్థితి కి దారి తీయవచ్చు.  దాని లక్షణాలు కండర్రాలు బలహీనత , కండరాలు పట్టేయటం , కడుపు ఉబ్బినట్లు ఉండటం , ఉన్నట్లుంది మల బద్ధకం , తల తిరిగి పడిపోవటం , అలసటగా అనిపించటం , దేహం లోని నీరు త్వర త్వరగా మూత్రం రూపం లో బయటకు వెళ్ళిపోవటం వంటివి కొన్ని .  పొటాషియం లోపం జీవ క్రియలపై ప్రభావం చూపుతుంది .  అయితే ఇది ఒకేసారిగా కూడా దాడి చేస్తుంది .

       ఈ పొటాషియం లోపాన్ని అధిగమించటానికి మనం కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవాలి .  బీన్స్ , పాలకూర , ఉడికించిన బంగాళదుంప , ఆప్రికాట్ , పెరుగు, పుట్టగొడుగులు , అవకాడో , అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది .  బంగాలదుంపలు , అరటి పండ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి .  కానీ అధిక బరువు భయం తో ఇవి తీసుకోక పోవటం కూడా ఈ లోపానికి కారణం .  కనుక మనం ఈ పదార్ధాలను కూడా ఉపయోగించాలి మన ఆహారం లో .

      డయాబెటిస్  ఉన్న వారు ఆలుగడ్డ అప్పుడప్పుడూ ఉడికించి తినవచ్చు .  దానిని గ్రీన్ సలాడ్  మొదలైన వాటితో కలిపి తినవచ్చు . 

some health tips about minerals n nuts

1.  ఆహారం లో ఉప్పు ఎక్కువగా తింటే శరీరం నుండి కాల్షియం బయటకు పోతుంది .
2.  జీడిపప్పు, పిస్తా , పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది .
3.  వాల్ నట్స్, అవిసె గింజల్లో ఒమేగా 3 ఫాటి యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి .  అవి శరీరం లో మంచి
     కొలెస్ట్రాల్ ను పెంచుతాయి .
4.  వేరుసెనగలు, బాదం పప్పు లలో పొటాషియం కూడా ఉంటుంది .  ఇది మూత్రం లో కాల్షియం
     బయటకు పోకుండా సహాయ పడుతుంది .
5.  50 సం,, వయస్సు దాటినా వారికి రోజుకు 1200mg. కాల్షియం అవసరం .  ఒక కప్పు పాలల్లో
     300mg. కాల్షియం ఉంటుంది .  పాలు, పెరుగు శరీరం లో కాల్షియం పెరుగుదలకు ఉపయోగ
     పడతాయి .
 

Mother's Day

మాతృ దేవో భవా
పిత్రు దేవో భవా
ఆచార్య దేవో భవా
అతిధి దేవో భవా
  ఇలా భారతీయ సంస్కృతి లో అందరికీ సముచిత స్థానం, గౌరవాన్ని ఇస్తూ కన్న తల్లికి మొదటి స్థానాన్ని ఇచ్చింది .  మొదటి సారిగా తల్లికి నమస్కారం చేస్తాము .  అందుకే దేవతలను ఉచ్చరించే టప్పుడు కూడా లక్ష్మీనారాయణులు , పార్వతీపరమేస్వరులు  సరస్వతీ బ్రహ్మలు  అని చెప్పుకుంటాము .  అలానే భారతమాత  అనీ , వేద మాత అనీ అంటాము .  ఇలా అన్ని విషయాలలో స్త్రీ కి పవిత్ర స్థానం ఇవ్వబడింది . యత్ర నార్యస్తు పూజ్యంతే  రమంతే తత్ర దేవతాః   ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో  అక్కడ దేవతలు కొలువై ఉంటారు " అని మనువు ధర్మ శాస్త్రం లో చెప్పాడు .  అటువంటి భారత దేశం లో ఈనాడు విచ్చల విడిగా విదేశీ నాగరికత , సంస్కృతి ప్రవేశించాయి .  o.k. మంచి ఎక్కడి నుండి అయినా తీసుకోవచ్చు .అసలు మంచి అంటే ఏమిటీ ?  పది మందికీ మేలు చేసి , సంతోషం కలిగించేదే మంచి . 
       విదేశీ సంస్కృతి లో కొన్ని దేశాలలో పిల్లలు యుక్త వయస్సులో అంటే 16 సంవత్సరాల  వయస్సులో తల్లిదండ్రులను , కుటుంబాన్ని వదిలి స్వతంత్రంగా ఎదగటానికి , జీవించటానికి ఇంటి నుండి బయటకు వెళ్లి పోతారు . (మన భాషలో రెక్కలు వచ్చి ఎగిరిపోవటం అంటారు )  అదే మన దేశం లో అయితే తల్లితండ్రుల నుండి , కుటుంబం నుండి బయటకు వెళ్ళటం ఉండదు .  పుట్టిన దగ్గరినుండి తల్లితండ్రులతో, అక్క చెల్లెళ్ళతో , అన్నదమ్ములతో అంతా కలిసి ఉంటారు .  ఉద్యోగరీత్యా మరొక వూరికి వెళ్ళవచ్చు.  అంతే గానీ మన బంధాలు మారిపోవు .
      అందువల్లనే మనకు మథర్స్ డే ,ఫాదర్స్ డే  అంటూ ఉండవు .  మనకు వారితో కలిసి ఉండటం రోజూ ఒక పండుగే .  రోజూ అంతా కలిసే ఉన్నప్పుడు ఈ ప్రత్యేక పండుగ అంటూ ఏమి ఉంటుంది ? విదేశాలలో చిన్న వయసు లోనే బాధ్యతలు తెలుసుకొని ఎవరిదారి వారు విడిపోతారు . చాలా మంది వృద్ధాప్యం లో కి వచ్చే సరికి అసలు భార్య , భర్త ఎవరో, ఏమిటో కూడా కొన్ని కుటుంబాలలో తెలియదు .  అసలు వారికి  వివాహ వ్యవస్థ పై కూడా నమ్మకం సన్నగిల్లింది .  అందుకే వారు తమ తల్లితండ్రులను వెతుక్కుంటూ వెళ్లి కృతజ్ఞతలు చెప్పుకోవటం , ప్రత్యేకం గా పండుగ చేసుకోవటం జరుగుతోంది . ofcourse. ఇప్పుడు మన దేశం లో కూడా చాలా విషయాల్లో విదేశీ బాట లో నడుస్తున్నారు యువత .  ముఖ్యం గా ప్రేమలు , పెళ్ళిళ్ళు , విడాకులు , హార్దిక సంబంధాల నుండి ఆర్ధిక సంబంధాల వరకు అలానే నడుస్తున్నాము .
     మన దేశం లో ఇంకా కుటుంబ వ్యవస్థ అన్ని మార్పులు చెందలేదు.  ఇంకా మనం తల్లితండ్రులతో కలిసి ఉండటం జరుగుతోంది .  మనం పండుగలు , ఆచార వ్యవహారాలూ అన్నీ కుటుంబం తో కలిసే జరుపుకుంటున్నాము .  అందువల్లనే ఇంకా మన దేశం లో ఈ ప్రత్యెక దినోత్సవాలూ, సత్కారాలు అవసర పడలేదు .  కానీ ఇప్పుడిప్పుడే మారుతున్న సమాజ పరిస్థితుల వల్ల న్యూక్లియర్ కుటుంబాలు వచ్చేసాయి.  పెళ్ళిళ్ళు కాగానే భార్యాభర్తలు విడిగా వెళ్ళిపోతున్నారు .  ఇంకాస్త ముందుకు వెళ్లి డేటింగ్ అంటూ పెళ్ళికి ముందే కలిసి తిరుగుతున్నారు .  ఇంకొన్ని ఆధునిక పోకడలు ముదిరి తల్లితండ్రులను వ్రుద్ధాస్రమాల్లొ చేర్పిస్తున్నారు .  అందువల్లనే మన దేశం లో కూడా ఈ మథర్స్ డే, ఫాదర్స్ డే జరుపుకోవటం ఆశ్చర్యం కాదు అని కొందరు సంప్రదాయ వాదులు పెదవి విరవటం సహజమే.      మరి ఈ విపరీత ధోరణుల వల్ల యువతీ యువకుల ఆలోచనలు మారుతున్నాయి .  దాని వల్ల మన భావి తరాలకు  మన కుటుంబ వ్యవ్యస్థ , పవిత్ర వివాహ వ్యవస్థ పై నమ్మకం సడలుతోంది .  ఈ వ్యవస్థలకు తూట్లు పడుతున్నాయి . 
  ఇంకా ఈ కొత్త పండుగలు వ్యాపార వర్గాలకు చాలా లాభం తెచ్చి పెడుతున్నాయి .  ఇంకా ప్రకటనలు , రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ , కానుకలు , వాటికి అంతే లేదు .  అందువల్ల వారు కూడా ఈ విషయాలను ప్రోత్సహిస్తున్నారు అని అనిపిస్తోంది .  కానీ ఇది  విపరీత ధోరణులకు దారి తీస్తోంది .
   మన సమాజం లో చాలా మార్పులు వస్తున్నాయి .  మనుషుల్లో సంబంధాలు , బంధాలు చేదిరిపోతున్నాయి .  ఇంట్లో అమ్మమ్మలూ , నాయనమ్మలో లేక పోవటం ఇంకా పిల్లలు ఒంటరితనం లో పెరగటం వల్ల కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆలోచనల్లో . 
    కానీ మనం కూడా బాధ్యత గా ఆలోచించి మన సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని నడవాలి .  మన కుటుంబ వ్యవస్థ ను సక్రమంగా కాపాడితే ఈ మథర్స్ డే, ఫాదర్స్ డే ప్రత్యేకం గా జరుపుకోవలసిన అవసరం లేదు .  మనం అందరం ఈ విషయాలను గురించి ఆలోచించ వలసిన అవసరం, అమలు చెయ్య వలసిన సందర్భం ఇదే !

జ్ఞాన సంపద

                     "కరాగ్రే వసతే లక్ష్మీ , కర మధ్యే సరస్వతీ
                      కర మూలే  స్థితే గౌరీ , ప్రభాతే కర దర్శనం "
  అని పురాణాలు  చెబుతున్నాయి .   సరస్వతి , లక్ష్మి , దుర్గ లు త్రి మాతృకలు .  ఈ సమస్త సృష్టి లో మానవులు అంతా స్మరించుకుంటారు .  సరస్వతి మాత జ్ఞానానికి ప్రతీక . లక్ష్మీ మాత సంపదకు, దుర్గామాత  అమితమైన శక్తి లేక బలానికి ఆధారం .  అయితే ఈ ముగ్గురు అమ్మలు కూడా జగదంబ అవతారాలు అని తెలుస్తోంది .

        కొందరు సరస్వతి మాత ఇష్టంగా ,ఇంకా కొందరు లక్ష్మీమాత ఇష్టం గా , మరి కొందరు దుర్గామాత ముఖ్యం అనుకోని ఆరాధించేవారు ఉన్నారు .  అష్టలక్ష్మి రూపం లో లక్ష్మి మాత ను 8 రకాలుగా ఆరాధిస్తూ ఉంటాము .  అలాగే దుర్గామాత ను , సరస్వతీ మాతను కూడా వివిధ రూపాలలో కొలుస్తూ ఉంటాము .  ఎవరు ఎలా ఆరాధించినా ఆ జగదంబ నే కదా !
       పార్వతీ పరమేశ్వరులు , లక్ష్మీ నారాయణులు , సరస్వతీ బ్రహ్మ లు గా చెప్పుకునే ముందు అసలు భగవంతుని తత్వం తెలుసుకోవాలి .  అసలు భగవంతుడు ఒక్కటిగానే ఉండెను .
 
     "ఎకోహ వై నారాయణ్  ఆసీత్
    న బ్రహ్మా నైసానహ  నే మేధ్యా వా పృధివీ
    న నక్షత్రాణి నాగ్నిర్న సూర్యో న చంద్రమాః
    స ఏకాకీ న రమతే ................"   

ఆ తరువాత  సృష్టి ప్రారంభములో రెండుగా విభజించుకొనెను అని ఉపనిషత్తులు ద్వారా తెలుస్తుంది .  అర్ధనారీస్వరులు, సగం శివుడు సగం అమ్మవారు , శ్రీ మహా విష్ణువు వక్షస్థలం పై లక్ష్మి . బ్రహ్మ నాలుకపై సరస్వతి అని తెలుస్తుంది .

    ఈ ఆధునిక యుగం లో కూడా జెనెటిక్స్ వారు చెప్పేది కూడా మనిషి లో స్త్రీ పురుష లక్షణాలు రెండు ఉంటాయి .  ఏ సంబంధమైన  జన్యువులు , హార్మోన్లు ఎక్కువగా ఉంటె ఆ లింగ రూపం లో మనిషి స్వరూప ,స్వభావాలు ఉంటాయి  అని , వారు ఆ రూపం లో వ్యవహరిస్తారు అనీ .  ఇంకో విధం గా చూస్తె ఈ భూ మండలం పై ఉన్న మానవులంతా ఒకే రకమైన శరీర నిర్మాణం , అవయవాల అమరిక విధానం ఉంది .  అంటే మానవత్వ సంబంధ మైన తత్వం ఒకటే . దేశ సంస్కృతి , సంప్రదాయాలు , ఆచారాలు వేరుగా ఉన్నా మానవులు అంతా ఒక్కటే కదా ! అందుకే ఒక చోట వైద్య శాస్త్రం అభ్యసించిన వాడు ప్రపంచం లో ఎక్కడైనా , ఏ దేశం లోనైనా వైద్యుడి గానే పని చేస్తాడు , అధ్యయన పద్ధతుల్లో మాత్రమే తేడాలు ఉంటాయి .       అలానే అమ్మవారి రూపం అయినా, అయ్యవారి రూపం అయినా, ప్రతి మనిషి లో, ప్రతి ప్రాణిలో, ప్రతీ వస్తువు లో గోచరం అవుతూ ఉంటాయి .  దానినే ఆది శంకరులు అద్వైతం గా చెప్పారు .  శ్రీ రామానుజులు  విశిష్టాద్వైతం గా చెప్పి తత్వ త్రయాన్ని చూపించారు .  అవే ప్రకృతి , పరమేశ్వరుడు , జీవుడు  అని మూడు రూపాలు అని చెప్పారు .  దానినే ఆధునికులు ఎలెక్ట్రాన్, ప్రోటాన్, మరియు న్యూట్రాన్ గా చెబుతున్నారు .

        ఉదా ,,కు ఒక మోటారు సైకిల్ తీసుకుందాము .  మోటారు సైకిల్ కనిపెట్టటం విజ్ఞానం అంటే జ్ఞానానికి సంబంధించినది  అంటే సరస్వతీ మాత .  అలానే ఆ మోటారు సైకిల్ తయారు చేయటం ఖర్చు తో కూడుకున్నది , ఆ పెట్టుబడి లక్ష్మి అమ్మవారు.  ఇక ఆ తరువాత ఆ మోటారు లో ఉద్భవించే శక్తీ , పరుగులు తీసే c.c.లు , హార్స్ పవర్ లు అంతా శక్తీ మాత అంటే దుర్గా దేవి .ఇలా మోటారు సైకిల్ కి అన్వయించుకుంటే త్రి మాతఅలానే  ఓ టేప్ రికార్డర్ లో క్యాసెట్ వుంటుంది , దానిలోనుంచి  పాటలు వినిపిస్తు ఉంటాయి.  అ  పాటలు కానీ  అ క్యాసెట్ కానీ అ యంత్రం కానీ తయారు చేసిన  విదానం అంతా సరస్వతిమాత  ఇక  ఆ ఖర్చు ఆ నిర్వహణ అంతా లక్ష్మిమాత  ఇక ఆ యంత్రం  విద్యుత్ కానీ బ్యాటరీ కానీ ఉంటేనే నడుస్తుంది. లేకపోతే పని చేయదు .  అంటే శక్తీ మాత కావాలి .  ఆ దుర్గామాత అంశఆ విద్యుత్, పవర్  అని పిలుస్తాము కదా. ఒక్కొక్క విషయం లో ఒక్కో మాత రూపం ఎక్కువగా భాసిల్లుతూ ఉంటుంది . 

       విద్య వఛ్చిన వాళ్ళ దగ్గర ధనం ఉండదు అనీ, ధనం ఉన్న వాళ్ళ దగ్గర విద్యలు ఉండవు అనీ, లక్ష్మీ సరస్వతులు అత్తా కోడళ్ళు అనీ, వారి ఇద్దరికీ మధ్య వైరం అనీ అంటుండే వారు పూర్వులు .ఇక సరస్వతీ మాత భక్తులు జ్ఞాన సరస్వతీ అని కొలుస్తూ ఉంటారు .  అష్ట సరస్వతులలో ఆమె ఒక రూపం గా కొలుస్తుంటారు భక్తులు.

    ఏది ఏమైనా ధనం కావాలా ? జ్ఞానం కావాలా అంటే ఎక్కువ శాతం మనుష్యులు కోరుకునేది ధనమే అంటారు.  అయితే ధనానికి ఎంత విలువ ఉందొ జ్ఞానానికి అంతే విలువ ఉంది.  లు ఎలా నిక్షిప్తమై ఉంటారో తెలుస్తుంది .  అందుకే వాహనం ఇనుపది అయినా విజయ దశమి నాడు దానికి పూజలు చేస్తుంటాము .
డబ్బు సంపాదించాలంటే జ్ఞానం కావాలి, ఆ డబ్బు నిలుపుకోవాలంటే కూడా జ్ఞానం ఉండాలి.  ఆ జ్ఞానం లేని వాడు తాగుడు - తందనాలకు, విలాసాలకు తగలేసి ఆ తరువాత తన అజ్ఞానానికి చాలా బాధ పడతాడు .  డబ్బు తో చదువు కొనేవాళ్ళు ఉన్నారు.  చదివుతో డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు .  అది ఏ రకమైనా పదిమంది మానవులకు ఉపకారం చేస్తే ఆ చదువూ , ఆ జ్ఞానం పారమార్ధికం అవుతుంది .

        ఇక అసలు జ్ఞానం లోకి వెళితే అసలు ఈ చదువులు , డిగ్రీ లు , ఈ ఉద్యోగాలు  సంగతి కాదు, అసలు వేదాంత జ్ఞానం  మో
క్షానికి  ఉద్దేశించ బడినది అసలైన జ్ఞానం అనీ, బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు , వేదం , పరమాత్మ గురించిన జ్ఞానం అని చెప్పారు మన పూర్వులు .

     అందుకే ఉత్తర భారత దేశం లో భక్తి శాఖ, జ్ఞాన శాఖ  అని రెండు విధములైన భక్తి మార్గాలు బయలుదేరాయి .  ప్రపంచం అంతటా నిండి ఉన్న దేవుడ్ని వివిధ ప్రాణులూ , జీవుల్లో , వివిధ వస్తువుల్లో , ప్రకృతి లోనూ చూడటం , తెలుసుకోవటం జ్ఞానం అని ఒకరు అంటే , మరొకరు ఆ భగవంతుడ్ని గొప్పగా ఊహించి, ఆడీ  పాడీ , భజించి , అలంకరించి, పూజించి, ఆరాధించి  ఆనందించడమే భక్తీ అని ఇంకొక శాఖ వారు చెప్పారు .  కానీ ఈ రెండు శాఖల వారి ధ్యేయం మాత్రం మోక్షం అని తెలుస్తుంది .       మరి జ్ఞానం లో కూడా హేతువాదం అయినా, నాస్తిక వాదం అయినా కూడా  భాగాలే .  అవి కూడా మానవ సమాజానికి అవసరం .  అవి లేక పోతే అజ్ఞానం లోపడి అవస్థలు పడుతూ ప్రతీ మూఢ నమ్మకానికీ  అవుతూ ఉంటారు మానవులు .  కాబట్టి జ్ఞానం అనేది ఒక వెలుగు , ఓ జ్యోతి , అంధకారం నుండి జీవన బాట చూపేది.  అందుకే బుద్ధుడు "భగవంతుని కంటే జ్ఞానం గొప్పది" అని చెప్పాడు. 

     ఇంత ప్రపంచం, ఇన్ని సుఖాలు , ఇన్ని సౌకర్యాలు ఇచ్చి జీవుడు ఎలా నడుచుకోవాలో , ఎలా ఉంటె మోక్షాన్ని పొందుతాడో చెప్పినది అంతా జ్ఞానమే.  ఉదాహరణకు డబ్బు పుష్కలం గా ఉన్న వాళ్లకు సమస్యలు, కష్టాలు  ఉండవు అని కొందరు అనుకోవచ్చు .  కానీ చాలా సంవత్సరాలు అందరి అనుభవాలు , అందరి జీవితాలు పరిశీలిస్తే ఎవరికీ ఉన్నంతలో వారి కష్టాలు, సమస్యలు ఉంటాయి అని అర్ధం అవుతుంది .  ఉన్నవాడికి ఆ డబ్బు దాచుకోవటానికి నానా ప్రయాసలు పడతాడు .  లేని వాడు డబ్బు కూడబెట్టటానికి అవస్థలు పడతాడు .  ఉన్నవాడికి తింటే పడదు .  లేని వాడికి తినాలంటే ఉండదు .  ఇది అంతా కూడా మనిషి ఆలోచనల ఫలితమే .

     ఏది ఏమైనా జ్ఞానం ఎంత గొప్పదీ అంటే మనిషి కి జీవ పరిణామాన్ని తెలియజేసేది అదే కదా .      నేటి ప్రపంచం లో చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి .  ఉదాహరణకు ఇంతకు ముందు చెరువుల్లో స్నానాలు , బట్టలు ఉతకటం వంటి పనులు చేసేవారు .  కానీ నేడు ఎక్కువ మంది ప్రజలు అలా చేయటం లేదు.  టాయిలెట్స్ వంటివి వాడుతున్నారు . 

      మనకు జ్ఞానం తెలియటం వాళ్ళ మన సంపదను, తెలివి తేటలను సద్వినియోగం చేసుకోవచ్చు సమాజ సేవ ద్వారా .  ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్మి కటాక్షం పెరిగిపోతుంది కానీ జ్ఞానం లేక స్వార్ధం పెరిగి పోతోంది సమాజం లో .  అందుకే మనం, మన ఇల్లూ బాగుంటే చాలు మిగతా వారు ఎలా ఉన్న ఫరవాలేదు అని ఆలోచిస్తున్నారు ఎక్కువ మంది .  కానీ మన సంస్కృతి లో అది చాలా తప్పు .  "సర్వే జనాః  సుఖినో భవంతు " అని మన భారతీయ సంస్కృతి చెబుతుంది .

   జ్ఞానం చెబుతూ సంస్కరణలు చేసిన మహాత్ములూ , సంఘ సంస్కర్తలూ ఇంకా చెప్పాలంటే కొన్ని అవతారాలు కూడా సరస్వతీమాత యొక్క జ్ఞాన రూపం అయితే  వారిని పోషిస్తూ , వారి బాటన నడుస్తూ , వారి జ్ఞాన బోధను ఆచరిస్తూ , ప్రపంచం నుమూలలా ప్రచారం చేస్తూ పాటుపడిన చక్రవర్తులు  లక్ష్మీ రూపం అని అనుకోవచ్చు .

   కనుక మనిషికి ఈ మూడు సంపదలూ కావలసినవే .  డబ్బు లేనివాడు అది సంపాదించటానికి కాస్త పడాలి అని తెలుసుకుని శ్రమ చేసి బ్రతుకుతాడు . డబ్బు ఉన్నవాడు జ్ఞానం తో తెలివిగా ఉపయోగించుకొని పది మందికీ ఉపయోగపడే పనులు చేస్తాడు.  ఆ జ్ఞానం వల్లనే మనిషి యుగ యుగాల నాగరికతలు ప్రపంచం లో జరిగిన , జరుగుతున్న మార్పులు తెలుసుకో గలుగుతున్నాడు . ఈ రకం గా ఇద్దరూ ప్రపంచాన్ని శక్తీ తో నడిపిస్తారు.

    ధన రూపం లో లక్ష్మీమాత ప్రపంచాన్ని పోషిస్తుంది.  జ్ఞాన రూపం లో సరస్వతీ మాత ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుంది .  శక్తీ రూపం లో దుర్గామాత ప్రపంచాన్ని నడిపిస్తుంది .  కనుక ఈ ముగ్గురూ వేరువేరు రూపాల్లో కనిపించినా అంతా ఒక్కటే.  అదే అందరికీ ఆ జగన్మాత .
 
 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online