Pages

Info reg Varahavatar of Vishnu


Deepavali


War with Narakasura - The reason behind Satya Bhama going along with Sri krishna

*నరక వధకు సత్యభామ ఎందుకు వెళ్ళింది?*
 
 
శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు ఎలా వచ్చారు? నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఎందుకు  సంహరించాడు? నరకుడితో యుద్ధం చేయబోతూ సత్యభామను ఎందుకు తీసుకువెళ్ళాడు? ఇటువంటి ప్రశ్నలకు ఆంధ్రవ్యాసులవారు ఆంధ్రీకరించిన విష్ణుపురాణంలో సమాధానాలు ఉన్నాయి. నేటి దీపావళినాడు వాటిని తెలుసుకుందాం.

ఒకరోజు స్వర్గం నుంచీ ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు కొలువై  ఉన్నాడా సమయంలో. ముందుగా శ్రీకృష్ణుని పూజించిన ఇంద్రుడు తాను వచ్చిన కారణం చెప్పాడు. ప్రాగ్జోతిషపురంలో నరకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు భూమి పుత్రుడు. ఈ రాక్షసుడు సృష్టిలోని అన్ని ప్రాణులకూ నాశనం కలిగిస్తున్నాడు. దేవసామ్రాజ్యాలు, సిద్ధ అసుర నర రాజ్యాలు కొల్లగొడుతున్నాడు. ఆ రాజ్యాలలోని మణులను కన్యామణులను కొల్లగొడుతున్నాడు. తన అంతఃపురంలో వారిని బంధీలుగా చేశాడు. వరుణునికి ఉన్న వర్షం స్రవించే గొడుగు (జలస్రావి) అపహరించాడు. మణి పర్వతం కాజేశాడు. మా అమ్మ అదితి కుండలాల నుంచీ అమృతం జనిస్తుంటుంది. వాటిని కాజేశాడు. ఇప్పుడు ఐరావతం కావాలంటున్నాడు. ఇవ్వకపోతే నా మీద కూడా యుద్ధం చేసి స్వర్గంతో సహా దాన్ని కూడా లాక్కుంటాడు. కనుక వాడు చేస్తున్న పనులన్నీ నీకు చెబుతున్నాను. నువ్వు ఏం చేయాలో నిర్ణయించుకుని అది చెయ్యి అన్నాడు.

ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఇంద్రుడు చెప్పిన చిట్టచివరి వాక్యం. నరకుడు చేస్తున్న అకృత్యాలు అన్నీ చెప్పాడు. కానీ వాడిని చంపేయి అని మాత్రం కొరలేదు. ఎందుకంటే నరకుడు భూమి పుత్రుడు. భూమి విష్ణుపత్ని, కనుక సొంత కుమారుడిని చంపమని ఎలా కోరతాడు? కనుక ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెయ్యి అన్ని మాత్రమే అన్నాడు.

శ్రీకృష్ణుడు ఇది వినడం ఏమిటి? గరుత్మంతుడిని తలచుకొన్నాడు. బొల్లిగెద్ద వచ్చేసింది. వెళుతూ వెళుతూ సత్యభామ మందిరం మీదుగా వెళుతూ ఆమెను కూడా గరుడవాహనం మీద తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. సత్యభామను ఎందుకు తీసుకువెళ్ళాడు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. దీనికి సమాధానాలు రెండు. మొదటిదానికి కారణం నారదుడు. నారదుడు రుక్మిణీ మందిరంలో కృష్ణుడు ఉండగా పారిజాతం ఇవ్వడం అది రుక్మిణికి ఆయన ఇవ్వడం అది చూసి సత్యభామ అలగడం చూసి నీకు ఏకంగా స్వర్గంలో ఉన్న పారిజాత చెట్టే ఇస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంద్రుడే స్వయంగా సాయం కోసం వచ్చాడు కనుక ఈమెను కూడా తీసుకువెళ్ళాడని హరివంశం చెబుతోంది. అలాగే భూదేవి అంశే సత్యభామ. భూదేవి పుత్రుడిని ఆమె అనుమతితోనే సంహరిస్తానని విష్ణువు ఆమెకు వరం ఇస్తాడు. కనుక సత్యభామను తీసుకొని వెళతాడు.

చాలామంది శ్రీకృష్ణుడు రథం మీద వెళ్ళాడు అని అంటారు. కానీ ఆయన గరుడవాహనం మీద ఎగురుకుంటూ వెళ్ళాడు. అలా ఎందుకు వెళ్ళాడో విష్ణుపురాణం చెబుతుంది. నరకుడి రాజధాని ప్రాగ్జోతిషపురం చుట్టూ వెయ్యి కిలోమీటర్ల మేర నేడు మందుపాతర్లు పెట్టినట్లు ఆనాడు వాడి కత్తులగొలుసులతో కంచెలు పాతాడు. కనుక కృష్ణుడు ఆకాశమార్గంలో యుద్ధానికి వెళ్ళి ముందుగా ఆ గొలుసు కంచెలు నరికాడు. తరువాత నరకునీ చక్రాయుధంతో చంపేశాడు.

కుమారుడు చనిపోయే సరికి  అదితి కుండలాలు భూదేవి తెచ్చి ఇచ్చి శ్రీకృష్ణుని స్తుతించింది.
 
*పృథివీ కృతకృష్ణస్తుతి:*
యదాహముద్ధృతా నాథ త్వయా సూకరమూర్తినా!
త్వత్స్పర్శసంభవః పుత్రస్తదాయం మయ్యజాయత!!
సో2యం త్వయైవ దత్తో మే త్వయైవ వినిపాతితః!
గృహాణ కుణ్డలే చేమే పాలయాస్య చ సంతతిమ్!!
భారావతరణార్థాయ మమైవ భగవానిమమ్!
అంశేన లోకమాయాతః ప్రసాదసుముఖః ప్రభో!!
త్వం కర్తా చ వికర్తా చ సంహర్తా ప్రభవో2ప్యయః!
జగతాం త్వం జగద్రూపస్త్సూయతే2చ్చుత కిం తవ!!
వ్యాపీ వ్యాప్యం క్రియా కర్తా కార్యం చ భగవాన్ యథా!
సర్వభూతాత్మ భూతస్య స్తూయతే తవ కిం తధా!!
పరమాత్మా చ భూతాత్మా త్వమాత్మా చాప్యయో భవాన్!
యథా తథా స్తుతిర్నాథ కిమర్థం తే ప్రవర్తతే!!
ప్రసీద సర్వ భూతాత్మన్నరకేణ తు యత్కృతమ్!
తత్క్షమ్యాతామదోషాయ త్వత్సుతస్త్వన్నిపాతితః!!
 
 
దీని తరువాత శ్రీకృష్ణుడు నరకుడు పోగేసిన మణులు, 16,100 మంది కన్యామణులు చూశాడు. నాలుగు దంతాలు ఉండే ఏనుగులు ఆరువేలు, కాంభోజాశ్వాలు 21 లక్షలూ చూశాడు.  రాజ్యం గెలుచుకున్న తనకే అవన్నీ చెందుతాయి కనుక ద్వారకకు తీసుకువెళ్ళాడు. ఆవిధంగా 16,100  మందీ శ్రీకృష్ణుని భార్యలు అయ్యారు.

ఇంద్రుడి తల్లి అదితి కుండలాలు తన దగ్గర ఉన్నాయి కనుక ఆమెకు ఇవ్వడం కోసం స్వర్గం వెళ్ళాడు, సత్యభామతో సహా. సరే అక్కడ నుంచీ అందరికీ తెలిసిందే పారజాతాపహరణం జరిగింది.

ఇదీ అసలు సంగతి నరకుని వధలో సత్యభామ ఎందుకు వెళ్లింది అనేదానికి సమాధానం. ఇది అష్టాదశ మహాపురాణాల్లో ఒకటైన విష్ణుమహాపురాణంలో ఐదవ అంశంలో 29 వ అధ్యాయం

Things to do on Naraka chaturdasi n Deepavali

దీపావళి అనగానే మనకి అందరికి టపాసులు, పిండివంటలు, స్వీట్లు గుర్తుకు వస్తాయి .  ఇక్కడ ఈ క్రింద చెప్పిన విధం గా మన ఆచార సంప్రదాయాలు కూడా మనం తెలుసుకుంటే ఎంతో ఉపయోగం గా ఉంటుంది అని ఇక్కడ ఆ విషయాలు పొందు పరచటం జరిగింది.  మీరు అందరూ ఇవి అన్నీ పూర్తిగా పాటించ లేక పోయినా పరవాలేదు.  కనీసం ఆ నామాలు పద్యాలు చదివినా సరిపోతుంది .  భక్తి తో భగవంతుని ముందు దీపం వెలిగించడం ముఖ్యం .


మీ అందరికీ నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు.


🔥 *నరక చతుర్దశి నాడు ఏమి చేయాలి
దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను  ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి. ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది. “సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః” ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం.
నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తలపై పెట్టుకుని, పదునాలుగు నామాలతో, తిలలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి.

1. యమాయ నమః 2. మృత్యువేనమః 3. వైవస్వతాయనమః 4. సర్వభూతక్షయా నమః 5. బధ్ధ్నాయనమః                 6. పరమేష్టినే నమః 7. చిత్రాయ నమః 8. ధర్మరాజాయ నమః 9. అంతకాయ నమః 10. కాలాయ నమః  11. ఔదుంబరాయ నమః 12. నీలాయ నమః 13. వృకోదరాయ నమః 14. చిత్రగుప్తాయతే నమః -  అంటూ పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.

ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

యమ నామములనుచ్చరించుచూ మూడు మూడు దోసీళ్ళ నీళ్ళు తర్పణమివ్వవలెను.

 *దీపావళి రోజు ఆయుర్వృద్ధి కోసం యమ తర్పణం*
“చతుర్దశ్యాం తు యే దీపాన్‌, నరకాయ దదాతి చ |
తేషాం పితృగణా స్సర్వే నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

శ్లో|| యమాయ ధర్మరాజాయ మృత్యవే చాన్తకాయచ౹
 వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ౹౹

ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే౹
 వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః౹౹.


అంటూ చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పెద్దలు చెబుతారు
 

video about Saraswathi river

 
 
 
👆Saraswati river becomes guptagamini at this point.👆this is at Mana... Bhimpur in Badarinath where Vyasa wrote Mahabharata. He curses Saraswati river as she was making sound  & Ganesha was unable to hear him .
Sarasvati River vanishes inside Earth
The best part is u can see the water vanishing..
Very interesting to watch

video of one of the ancient statue of Shri Lakshmi Narasimha swami


Friends, one of my buddies sent me this video.  In this video we can c some of the ancient statues of Shri Lakshmi Narasimha Swami which r found in other countries which r several thousand yrs. old.  These r all proof that this religion is the oldest in the world.

what is Bhagavad Geeta???

*భగవద్గీత అంటే ఏమిటి?*
– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు  సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
*కాదు*
అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’*
సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి
*☆భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.*
*☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*
*☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*
*☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*
*☆ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.*
*☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?*
👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
👉-కర్తవ్యం గురించి చెబుతుంది.
👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
*అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.*
అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.
గీత చదువుకో.....
నీ రాత మార్చుకో.....
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online