Pages

త్రిఫల చూర్ణం /మాత్రలు -- ఉపయోగాలు, కాల్షియమ్ part 1

ప్రశ్న. త్రిఫలను ఉదయమైన రాత్రి అయిన భోజనానికి ముందు తీసుకోవాలా  లేదా భోజనానoతరము తీసుకోవాలా  ?

జ : మూల రోగము, భగందర రోగము కడుపుకు సంబంధించిన రోగములు నయము చేసుకోవాలంటే రాత్రిపూట భోజనము చేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు పాలతోగాని వేడి నీళ్ళతో గాని తీసుకోవాలి.

ఇక ఉదయము తీసుకునేవారు అల్పాహారానికి ముందు ౪౫ నిమిషాలు ముందే త్రిఫల చూర్ణం తీసుకోవాలి. ఇప్పుడు మరొక విషయము తెలుసుకుoదాము. వాగ్భాతుడు చెప్పిన అత్యుత్తమైన పదార్థము త్రిఫల చూర్ణము దీనితోబాటుగా కొన్ని చెప్పుకున్నాము శొంఠీ. ఇంగువ జీలకర్ర వీటిలో మరొక గొప్ప ఔషధము మెంతులు. ఇవి వాత+కఫరోగాల్ని తగ్గిస్తాయ. కానీ పిత్తాన్ని పెంచుతాయి. పిత్త సంభంద రోగాలు,అసిడిటి, అల్సర్స్ పెప్టిక్ అల్సర్స్, నోటిలోకి నీరు రావడము భోజనము చేసిన రెండు గంటల తర్వాత కూడా నోటిలో రుచి ఉండటము. త్రెంపులు వెక్కిళ్ళు రావటం ఇవన్ని పైత్యరోగాలు. ఈ పిత్త సంభంద రోగాలు ఉన్నవారు తప్ప , వాత+కఫ రోగాలు ఉన్నవారు మాత్రము మెంతులు బాగా తీసుకోవచ్చు.

వాత రోగాలు అంటే, కీళ్ళ నొప్పులు, భుజాల నోప్పులు,మోకాళ్ళ,నడుము నొప్పులు లాంటివి ఉన్నవారు. మెంతులు ఉపయోగించే విధానము. రాత్రిపూట ఒక గ్లాసు గోరువేచ్చని లేదా వేడి నీటిలో గాని చెంచ మెంతులు నానబెట్టి ఉదయాన్నే బాగా నమలి నమిలి తినాలి. ఒకేసారి మింగి తినడము వల్ల అంత ప్రయోజనము ఉండదు. బాగా నమిలి తినడము వలన అది మీ లాలాజలము కలిసి లోనకి వెళ్లి మీకు ఎక్కువ మేలు చేస్తుoది. ఎక్కువుగా మనవాళ్ళు మెంతులు పచ్చళ్ళలో ఉపయోగిస్తారు. ఇలా మెంతులు వేసి ఉన్న ఏ పచ్చడి అయిన మీరు సంతోషముగా తినవచ్చు . కొన్ని పచ్చళ్ళలో వాము కూడా వేస్తారు. ఈ మెంతులు వాము వేసిన పచ్చ్ల్లలో ఔషధ గుణములు ఎక్కువుగా ఉంటాయి. నీటిలో నానిన మెంతులు కంటే నూనెలో నానిన మెంతుల ఔషధ గుణాల విలువలు చాల ఎక్కువ. కనుక మీరు ఇంగువ , వాము, మెంతులు ఉన్న పచ్చళ్ళు తీసుకోవటము మంచిది. ఔషధులు లేని పచ్చడి తీసుకోకూడదు.

మరొక విషయము, భోజనము చేసిన తరువాత సున్నము తో తమలపాకు వేసుకునే వారు జీవితములో వాతరోగల బారినపడరు. ఎప్పటికి మెంతులు కంటే సున్నము ఎక్కువ వాతనాశిని, ఆధునిక వైద్య శాస్త్రము ప్రకారము కూడా శరీరములో కాల్శియుం తగ్గితే 50 కిపైగా జబ్బులు వచ్చే అవకాశము యున్నది.. ఇవన్ని నొప్పుల రూపములోనే ఉంటాయి. ఎక్కువుగా ఎముకలకి సంభందించిన నెప్పులు ఇంకా రక్తానికి కఫానికి సంభందించిన రోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఎపుడు శరీరము లో కాల్షియమ్ తగ్గకుండా చూసుకోవాలి. శరీరములో కాల్షియమ్ అనీ పోష్టకాహారము యుండటము వలెనే మిగతా పోషకాలన్నీ ఉపయోగ పడతాయీ. ఇది ఎన్నో సంవత్సరాల ప్రయోగ ఫలితముగా చెప్పబడినది.


దీని అర్ధము చూడoడి మీ శరీరములో ఏ విటమిన్ అయిన తెలియబడా లంటే? ముఖ్యంగా కాల్షియమ్ ఉండాలి. ఇది కూడా శరీరము 40 నుంచి 45 సంవత్సరాల వరుకు మనము స్వీకరిoచే ఆహారము లో నుంచి కాల్షియమ్ తయారు అవుతుంది. కాల్షియమ్ ఎక్కువుగా ఉండీ పదార్థాలు పాలు, పెరుగు ,మజ్జిగ,వెన్న, నెయ్యి వీటిలో కాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. మిగతావాటిలో అనగా నారింజ, కమల, బత్తాయి ద్రాక్ష వంటి పుల్లటి ఫలాలో కూడా కాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది, అలాగే మామిదిపండులో కూడా ఉంటుంది. పండ్ల అన్నిటిలో కాల్షియమ్ పుష్కలంగా ఉండే పండు అరటి పండు. అరటిపండు కాల్షియమ్ యొక్క బాoడాగారము. ఇది తేలిక గ కూడా అరుగుదల అవుతుంది . కనుక అరటిపండు తప్పకుండగా ప్రతిరోజు తీసుకోవాలి. ఈ పండ్లలోని కాల్షియమ్ మనకు 40 నుంచి 45 సంవత్సారాల వరకే తయారు అవుతుoది.


45 సంవత్సారాలు పూర్త్హి కాగానే స్త్రీలకూ నేలసరులు ఆగిపోయిన తరువాత, శరీరము కాల్షియమ్ తీసుకునే తయారుచేసుకొనే సామర్ధ్యము తగ్గిపోతుంది. ఎంతగా మీరు కాల్షియమ్ తీసుకున్నపటికి కాల్షియమ్ జీర్ణము చేసే గ్రంథులు, ఉత్పత్తి ఆగిపోతుoది. అప్పుడు కాల్షియమ్ జీర్ణము కావడము చాల కష్టమౌతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కాల్షియమ్ భయట నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే స్త్రీలందరు గుర్తు ఉంచుకోండి. 45 సంవత్సారాల తరువాత సున్నం తీసుకోవటము తప్పనిసరి పురుషులు కూడా తప్పకుండ 45 సంవత్సారాల తరువాత సున్నము తీసుకొనవలెను. అందుకే మన దేశము లో తాంబూలము తీసుకొనుట అలవాటు ఉన్నది, తమలపాకు ఎప్పుడు సున్నం తోనే వేసుకోవాలి, కాచు వాడకూడదు.            

few health tips

మత్తు పానీయాలు గుట్క మానాలoటే గో మూత్రము రోజు కొంచెంగా ౩ నెలలు తీసుకోవాలి లేదా కొంచెం అల్లం రసము కాని శొంటి రసము కాని బెల్లము కలిపి తాగించండి. ఇది కూడా మూడు నెలలు తీసుకోవాలి. గో మూత్రము కొంచెంగా తాగుతూ ఉంటె సిగరెట్ బందు చేస్తారు.

2. పెద్ద వయస్సు వారు మోకాలి నోప్పులతో బాధ పడుతూ ఉంటె సున్నము లోపలకి తీసుకోవాలి  ఇంకా భుజాల నెప్పులు మోచేతులు నెప్పులు ఉంటె నీటిని తీసుకునేటప్పుడు కుర్చుని చిన్నగా గుటక గుటక గ తాగటం అలవాటు చేసుకుని చుడండి.

౩. నిద్ర పట్టని వారు పడుకునేటప్పుడు ఆవు నెయ్యి చుక్కలు ముక్కులోవేసుకుంటే బాగా నిద్రపడుతుంది

4. స్త్రీలకూ ఎక్కువుగా వైట్ బ్లీడింగ్ అవుతుంటే ఆయుర్వేదము షాప్ లో దొరికే శతావరి చూర్ణము పాలల్లో వేసి మరిగించి తాగవలెను

5.నెలసరి సమస్య ఉన్నవారు వేడి వేడి నీళ్ళల్లో కొంచెం నెయ్యి కలిపి తీసుకుంటే మంచిది ఏ  నెయ్యి ఐన పర్వాలేదు.నెలసరి జరుగుతున్న రోజుల్లో రోజుకు రెండు మూడు సార్లు తాగవచ్చు స్త్రీలకు ఆసమయము లో వచ్చే సమస్యలు అన్ని తగ్గిపోతాయ్.

6. డ్రై ఫ్రూట్స్ ఏవైన మితo గా  తీసుకుంటూ ఉంటె వంటికి బలాన్ని ఇస్తుంది శరీర సౌష్టవము కలుగుతుంది. జీడిపప్పు తప్ప ఏ డ్రై ఫ్రూటు బరువుని పెంచవు.

7.సున్నము తింటే నాలుక పగులుతు ఉంటె నీళ్ళలో కలిపి లేదా పెరుగుతో కలిపి తీసుకోండి . తమలపాకు తో కూడా సున్నం కలిపి తీసుకోవచ్చు.. 

తలపుల తలుపులు

గుండెల్లో ఇల్లు కట్టావు,
ఆ ఇల్లు వదిలి వెళ్ళలేవు
 ఆ ధ్యాస నిన్ను వెళ్ళనివ్వదు
 శ్వాస శ్వాసకు మధ్య నీ  ధ్యాస
 నా వేడి ఊపిరిలు నీ చెవి లో గుసగుసలు
 కాలాన్ని పరుపులా వేసేస్తాను.
చూపుల గాలం లో నీ పరువాలని పట్టేసింది
. కౌగిలింతలో అందాలకు ఆర్థ్రత వస్తుంది.
 ప్రేమ ఊహలు అన్ని ఇక  ఊగే ఊయలలు.
 నీ పొడగాటి జడ నా భుజాలలో ఇరుక్కుని పోతుంది.
మల్లెల్లు అన్ని ఆశల దారం లో దోబూచులాదతాయి
 ఆ రాత్రివేళ  వెన్నెల కురుస్తు ఉంటుంది.
 చల్లని గాలులు నీ ప్రేమను నా పై అభిషేకిస్తాయి,
 నీ ఆధారాలు నా పై రంగులు అద్దుతాయి ,
 నీ ముంగురులు పాపిటి కుంకుమ
 నా పై జల్లిన  రహస్యాలు చూడాలని భానుడు ఉరికి వస్తాడు,
 తెల్లవారి నా మెడ నిండా నీ కుంకుమ  గుర్తులే
 గుండెల్లో ఇల్లు కాస్త పొదరిల్లు అవుతుంది
 ఆ పొదరిల్లు కి మనమిద్దరం రెండు తలుపులం
 ఎన్నో  తలపులకి ఇద్దరము బందీలము .

చిలిపి జల్లులు

వర్షం వయ్యారం గా పడుతోంది
భవనం పైనుంచి అందమైన దృశ్యం చూస్తున్నాను
రెండు గోరింకలు తడుస్తూ విహారం చేస్తున్నాయి
ఎదురు భవనం లో నుండి ఆమె నా వైపు చూస్తోంది
ఆమె విశాల నేత్రాలు నన్ను పలకరిస్తున్నాయి
నేను కొంటె నవ్వుల బాణాలు విసిరాను
ఆమె సిగ్గు పడుతూ చీర కొంగుతో ముఖం కప్పుకుంది
నేను బయటకు వచ్చాను , ఆమె నాకోసం వచ్చింది
నేను తడిసిపోతున్నాను ఆమెకు మాత్రం గొడుగు పట్టాను
ఇక వర్షం ..పెద్దగా పడుతోంది
ఇద్దరు తడిసి ముద్దయిపోతున్నాం
ఆ ఆశల చినుకుల్లో ఆ జంట గోరింకల్లాగా
వర్షం ఆగిపోయింది ......కళ్ళు తెరిచాను
ఆమె అక్కడ లేదు ......లోపలి వెళ్ళిపోయింది
వయసు మాటున మనసుకు వచ్చిన ఊహ అని నవ్వుకున్నాను

cholestrol n its good n bad effects

            కోలేస్ట్రోల్ అనీ కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి మొదటిది మేలు చేసే కొవ్వులు హచ్ డి ఎల్ అంటారు ఇవి గుడ్డు తెల్లసొన లో ఉంటాయి. శరీరైనికి హానికారకమైనవి కోవులను ఎల్ డి ఎల్ అంటారు. చెడు కొలేస్ట్రోల్ వంటికోవ్వులు గుండె జబుఉలకు ఒక్కరిస్క్ ఫాక్టర్.. చెడు కొలేస్ట్రోల్ పాళ్ళు ఎక్కువుగా ఉండే ఆహారం తినీవరిలో ఫాస్ట్ ఫుడ్ తీసుకునేవారిలో ఉండే జబ్బులరిస్క్ ఎక్కువుగా ఉంటుంది. అయితే రక్తములో ఈ రెండు రకాల కొవ్వులని కలుపుకొని 2౦౦ లోపు ఉండాలి. ఎల్ డి ఎల్ 1౦౦లొపు, హెచ్ డి ఎల్ ౪౦పైన ఉండాలి అలాగే ట్రయ్గ్లిజరిడేస్ అనీ మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి ౧౫౦ లోపు ఉండాలి.
         కొలేస్ట్రోల్ మన శరీరములోకి రెండు రకములగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు ౭౦ మిల్లి గ్రా. కొలేస్ట్రోల్ ఉంటుంది. మెదడు నరాలు వ్యవస్థ కోసం. శిశువు ఎదగడానికి ఈ కొవ్వులు ఉపోయోగాపడతాయీ. ఆ తర్వాత వీటి అవసరము అంతగా ఉండదు. అయితే జన్యు తత్వాన్ని బట్టి ఈ కోవులు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్ళు బ్యాకరి పదార్థములు, కృత్రిమ నెయ్యి వంటివి తినే వారిలో ఈ కోవ్వు పేరుకుంటూఉంటుంది . ఇదీ గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రక్తములో కొలేస్ట్రోల్ పాళ్ళు ఎక్కువుగా ఉన్నవారిలో డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తూ ఉంటారు..ఈ తరహ మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మామ్సహారము పూర్తిగా మానేయలేకపోతే కొవ్వులు తక్కువుగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్ మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు మంచివి. కాబట్టి మాంసము తీసుకోవలనిపిస్తే చేపలు తీసుకోవటము మంచిది. అదీ కూడా ఉడికించినవి అయితేనే వేపుడు వద్దు.



 


          దీని నిర్దారణ కోసం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. నడుస్తూ ఉంటె ఆయాసంగ ఉంటె దీనికి ఒక కారణం కోలేస్ట్రోల్ అవుతుంది. ఇక ఈ కొలేస్ట్రోల్ ఎక్కువుగా ఉన్నవాళ్లు పెరుగు అన్నం ఎక్కువుగా తినకూడదు. ఉత్త పెరుగు అసలు తినకూడదు. అంటే పలుచని మజ్జిగ చేసుకుని భోజనం లో వాడితే మంచిది. పీచు పదార్థాలు ఉన్న భొజనం ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. అంటే ఒఅట్స్ ఎక్కువుగా వాడాలి స్వీట్స్, నెయ్యి తగ్గించి తినాలి. వేపుళ్ళు బేకరి పదార్థాలు ఆలుగడ్డ చిప్స్ తినరాదు. ఉడికించిన కూరలు వంటివి మంచివి నూనెలో, నేతి లో వేయించిన పదార్థాలు మంచివి కావు. ఆవిరి కుడుములు, ఇడ్లి మరియు పొట్టు మినపప్పు తో చేసినవి అయితే మంచివి . వ్యామము తప్పనిసరి స్పీడ్ గ వాకింగ్ చేయాలి. లివర్ ఆరోగ్యంగా ఉంటె అంతా బాగుంటుంది. కొలేస్ట్రోల్, షుగర్ లివర్ అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటాయి. ఇంకా యోగ,ప్రనయామములు చేస్తూ మానసిక ఆరోగ్యమము పెంచుకోవాల్సిన అవసరం చాల మంచిది. ధ్యానం చేస్తూ మనసను ప్రశాంత పరుచుకోవాలి. 

       ఇక ఆయుర్వేదం లో హిమాలయ కంపెనీ వారి లశున కాప్సులేస్ రోజు ఒకటిలేదా రెండు వాడవచ్చును. తయారి లో వెల్లులి వాడకమున్న మంచిమందు మిశ్రమము. భోజనములో కూడా ఉల్లి వెల్లులి వాడుతూ ఉండటం మంచిది. కరక్కాయ చూరణము అన్ని ఆయుర్వేద దుకాణము లో దొరుకుతుంది. కరక్కాయ చూరణము మరియు తేనె రంగరించుకుని తీసుకుంటూ ఉంటె మంచిది. చెడు కొలేస్ట్రోల్ కరిగి పోతుంది. మనము వాడే వంట నూనెల్లొ కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అయితే మంచిది. కొంతమంది సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటారు. దీని వాళ్ళ శరీరములో ఉష్ణం పెరుగుతుంది అదీ కూడా మంచిదే.
       ఇక లిపిడ్ ప్రోఫైల్ టెస్ట్ లో కొలేస్ట్రోల్ తో పాటు ట్రయగ్లజారిడెస్ కూడా 100,౧౫౦ మించితే ప్రమాదం ఉంది కాబట్టి. ట్రయగ్లజారిడెస్ తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవి రాక్తనాళ్ళ లో ముద్దగా కడుతూ ఉంటాయి. వీటిని తొలగించుకోవాలి అంటే పచ్చి కూరగాయలు కార్రోట్స్, ఉల్లి, బీట్రూట్ వంటి కూరగాయలు తీసుకుంటూ ఉంటె మంచిది. కీర సలాడ్స్ వంటివి భోజనము కి ముందు తీసుకుంటూ ఉండటం మంచిది. ఫ్రూట్ సలాడ్స్ తరుచుగా తీసుకుంటూ ఉంటె మంచిది షుగర్ వాళ్లకి కూరగాయలతో చేసిన సలాడ్స్ అయితే నే మంచిది. ఇక ట్రయగ్లజారిడెస్ కు ఆయుర్వేదం లో APEX కంపెనీ వారి TRIGLIZE అనే కాప్సులేస్ ఉంటాయి. రోజుకి ఒకటి లేదా మూడు చొప్పున తీసుకుంటూ ఉంటె మంచిది. సమస్య కొంచెం తక్కువుగా వుంటే నలభై రోజులు వాడవచ్చును. జంక్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు ఐస్ క్రీమ్ వంటి ఆహరాలకి దూరంగా ఉండాలి.

మనం మానవత్వం మరిచిపోతున్నామా ?

   పైన వఛ్చిన వార్త చాలా బాధాకరమైన విషయం.  " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః "  ఎచట స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు  అని పురాణాలు చెబుతున్నాయి. 
పూజించటం పోయి హింసపెట్టటం , చంపటం చాలా మాములు అయిపోయింది. 
  పట్టపగలు హత్య జరుగుతూ ఉంటే నిజం గా అక్కడ మనుష్యులు ఉన్నారా ?  మానవత్వం ఏమయిపోయింది ?  ప్రతిచోటా కూడా బజారులో కొట్టుకుంటూ ఉంటే, కత్తులు తీసుకుని రౌడీలు మనిషిని తరుముతూ ఉంటే, దాడులు చేస్తూ పోతుంటే , పశువులను రోడ్డు మధ్య లో బరువులు లాగటం లేదని హింసిస్తూ ఉంటే ఏ ఒక్కరూ మాట్లాడరు!   నోరు తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు . 
   ఈ అమ్మాయి స్వాతి హత్య జరిగిన ప్రదేశం రైల్వే స్టేషన్.  అది చాలా మంది జనం ఉన్న బహిరంగ ప్రదేశం.  కనీసం ఒక 50 - 60 మంది చుట్టూ చూస్తూ ఉన్న సమయం లో వాడు ఈ హత్య చేసి పారిపోయాడంటే మన సమాజం లో ఎంత గా చైతన్య రహితం గా మారింది అనేది తెలుస్తోంది .  అసలు గొడవలు, దాడులూ జరుగుతుంటే వాటిని ఆపటానికి ప్రయత్నించ కుండా ఏదో చోద్యం చూస్తూ నిలబడి ఆ తర్వాత కొవ్వొత లూ, దీపాలు పట్టుకుని రోడ్లపై తిరగటం, చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం అంటూ పువ్వులు పెట్టి ప్రార్ధనలు చెయ్యటం ఎంత వరకు సబబు ?     ఆరోజు రైల్వే స్టేషన్ లో ఈ హత్య జరిగినప్పుడు అక్కడ ఒక్క మగాడు కాదు అసలు ఒక్క మనిషి కూడా లేదా అని నాకు అడగాలి అనిపిస్తోంది.  అక్కడ ఉన్నవారిలో ఏ కొద్దీ మంది గట్టిగా ప్రయత్నించినా ఆ వ్యక్తి ని ఈ దారుణం చెయ్యకుండా ఆప గలిగే వాళ్ళు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడ గలిగే వాళ్ళు.  మనం సినిమా హీరోల్లాగా అందరితో ఫైట్లు చెయ్యక్కర్లేదు.  ఆ సందర్భానికి తగినట్లు మనం వ్యవహరించి మనకు చేతనైన మార్గం లో హింసని ఆపగలిగేతే అది చాలు . కానీ అంత మంది  లో ఏ ఒక్కరు గట్టిగా ఏయ్ ! ఎవడ్రా నువ్వు ? ఏంటి నువ్వు చేస్తున్న పని అని గట్టిగా అరిస్తే కూడా వాడు ఒక్కసారి ఆగిపోయేవాడు.  మిగిలిన జనం అందరూ కలిసి ప్రయత్నిస్తే వాడిని ఆపగలిగే వారు .  కానీ అలా ఎవరు చెయ్యలేదు.  అందరూ ఏదో సినిమా చూస్తున్నట్లు నిలబడి పోయారు .  ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే వాడు అలా ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యం గా పొడిచి వెళ్లిపోతుంటే ఎవరు పట్టుకోవటానికి ప్రయత్నించలేదు సరికదా ఆ అమ్మాయి నెత్తుటి మడుగులో మృత్యువు తో పోరాడుతూ ఉంటే ఏ ఒక్కరూ కూడా ఆమెను రక్షించటానికి కూడా ప్రయత్నించ లేదు దాదాపు 20 ని,, ఆమె అలానే ఉంది .  చివరికి ప్రాణాలు వదిలింది .  ఇది చాలా హృదయ విదారక మైన సంఘటన .  అక్కడ ఆ సమయం లో ఒక్క మగాడు లేడా? ఈ ప్రశ్నవిషయం తెలుసుకున్న ప్రతి వ్యక్తి మనసులో కలుగుతోంది .
   ఈ సంఘటన గురించి విన్నప్పుడు నాకు ఈమధ్య కాలం లో నా కళ్ళముందు జరిగిన రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి.  ఒకసారి  నేను ఇంకా కొంత మంది నా స్నేహితులు కలిసి బజారులో నడిచి వెళ్తున్నాము .  అక్కడ ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది కారణం ఏమిటా అని చూస్తున్నాము.  అక్కడఒక ఎడ్లబండి ఒక ఫ్లయ్ ఓవర్ కింద నుండి U-టర్న్ తీసుకుంటోంది.  కానీ ఎందుకో బండి ఒక్కసారిగా ఆగిపోయింది .  ముందుకు కదలడం లేదు. ఆ బండి వాడు ఆ ఎద్దుని ముందుకు కదలమని గట్టిగా కొడుతున్నాడు.  ఆ ఎద్దు ఎంత ప్రయత్నించినా ఆ బండి కదలటం లేదు.  బండి వాడు కొడ్తున్న దెబ్బలకి ఆ ఎద్దు చర్మం చిట్లి రక్తం కారుతోంది.కానీ చుట్టూ ఉన్న జనం వాళ్ళ దారిన వాళ్ళు వెళ్లిపోతున్నారు.  సూట్లు, బూట్లు వేసుకున్నవాళ్ళు , ఇంకా ఎందరో రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ.  కానీ ఎవరూ మాట్లాడటం లేదు .  ఆ బండి వాడిని ఆ ఎద్దుని కొట్టటం ఆపమని ఎవరూ చెప్పటం లేదు .  వాడు కూడా దాన్ని ఇంకా హింసిస్తున్నాడు .  పాపం ఆ ఎద్దు ఇంకా తన శక్తిని అంతా ఉపయోగించి బండిని లాగటానికి ప్రయత్నిస్తోంది .  అప్పుడు నేను ఇంకా నా స్నేహితులు ఒక విషయాన్ని గమనించాము .  అది ఏమిటంటే ఆ బడి లో ఉన్న ఇనుప కడ్డీలు ఆ వంతెన కింద ఉన్న పిల్లర్లలో ఇరుక్కున్నాయి.  అందువల్ల ఆ ఎద్దు బండిని లాగలేకపోతోంది.  నేను ఆ బండి వాడిని గట్టిగా ఆగమని అరిచాను .  దానికి వాడు ఆగి కిందికి దిగి వచ్చాడు.  అప్పుడు వాడికి ఈ విషయం చూపించి వాడిని గట్టిగా కేకలేసాను అసలు విషయం గమనించకుండా ఆ ఎద్దుని కొట్టినందుకు .  అప్పుడు వాడు సిగ్గుతో తల వంచుకున్నాడు.  ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ విషయం గమనించి ఆశ్చర్య పడ్డారు .  అప్పుడు అందరూ ఏదో నిద్ర నుండి మేల్కొన్నట్లు వఛ్చి సహాయం చేసి ఆ కడ్డీల్ని పక్కకి జరిపారు.  అప్పుడు బండిని ఎద్దు ముందుకు లాగ గలిగింది.  నేను , నా స్నేహితులు అక్కడ ఉన్న వారినీ, ఆ బండి వాడినీ కూడా గట్టిగా కేకలేశాము.అలానే ఇంకొక సారి మేము బైకులపై వెళ్తున్నాము ఆ ప్రదేశం ఊరికి బయట ప్రదేశం.  అప్పుడు మాకు కొన్ని అరుపులు వినబడ్డాయి.  మేము ఆ శబ్దం వస్తున్న వైపుకి వెళ్ళాము.  అక్కడ కొంత మంది వ్యక్తులు ఒక మనిషిని కలబడి కొడుతున్నారు.  ఆ వ్యక్తి ఆ దెబ్బలకి తట్టుకోలేక అరుస్తున్నాడు.  అది చూసిన మేము వాళ్ళ దగ్గరికి పరిగెత్తాము ఆపమని అరుస్తూ .  ఆ కొడుతున్న వ్యక్తులు మమ్మల్ని చూడగానే కొట్టటం ఆపివేసి పారిపోయారు.  మేము ఇతనిని తర్వాత హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాము.  అతను బాగానే ఉన్నాడు .ఇది ఎందుకు రాస్తున్నానంటే ఈ రెండు సంఘటనల్లో కూడా మేము ఆ హింసకు పాల్పడుతున్న వ్యక్తుల్ని ఆపటానికి ప్రయత్నించాము. మేము ఆపగలిగాము.
కానీ ఈ అమ్మాయిని ఒక వ్యక్తి అంత దారుణం గా హింసించి చంపుతుంటే అక్కడి వారు భయపడి అవతలకు వెళ్లిపోయారట.  వాడు ఒక్క మనిషి పైగా వాడి చేతిలో పెద్ద ఆయుధాలు ఏమి లేవు.  చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కలిసి గట్టిగా అడిగితే వాడు అప్పుడే పారిపోయేవాడు.  కానీ వారు ఆపని చేయలేదు.  ఇంకా దారుణమైన సంగతి ఏంటంటే వాడు వెళ్ళిపోయినాక కూడా ఆఅమ్మాయి నెత్తుటి మడుగులో కొట్టుకుంటుంటే ఏ ఒక్కరూ ఆమెకు సహాయం చెయ్యలేదు.  కళ్ళముందు మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకున్నారు .  ఇది మానవత్వం సిగ్గు పడవలసిన విషయం.మన సమాజం లో మనకు ఒక అలవాటు బాగా ఉంది.  అది ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తుంటాము మనల్ని నడిపించటానికి.  స్వతంత్ర పోరాటం లో గాంధీగారు వచ్చే వరకు మనకు ఐకమత్యం గా పోరాడాలి అని అనిపించలేదు.  ఇది అన్ని సందర్భాల్లో పనికిరాదు.  ఎవరికోసమో ఎదురు చూడకుండా మనుషులుగా మన కనీస బాధ్యత మనం నిర్వర్తిస్తే చాలు చాలా మంచి పనులు చెయ్యవచ్చు.  మనం కనీసం మనుషులుగా ప్రవర్తించి మానవత్వాన్ని కాపాడుదాం.

ఐలయ్య గారి కొత్త కోణం -- కొన్ని చిన్న చిన్న సందేహాలు

ఈ మధ్య కాలం లో కంచె ఐలయ్య గారి వ్యాఖ్యలు విన్న తర్వాత కొన్నిసందేహాలు కలుగుతున్నాయి.  ఆయనను, ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలియటం లేదు.  ఎందుకంటే ఆయన మాటలు అంత లా అయోమయాన్ని కల్గిస్తున్నాయి .

1.  ఈ సమాజం లో 5% ఉన్న బ్రాహ్మణులపై దాడి ఎందుకు చేస్తున్నారో తెలియదు .  ఖచ్చితం గా ఈ అనవసర ప్రేలాపనలు , కాలక్షేపం వెనుక కొంత మంది ఇతర మతాలూ , కమ్యునిస్టులు ఉన్నారు అని కొంత మంది మేధావుల అభిప్రాయం . 

2.  స్వతంత్ర సమరం లో మొదటి కాంగ్రెస్ సభలో ఉన్నది ఎక్కువ మంది అందరూ బ్రాహ్మణులే ఒక్క గాంధీ గారు తప్ప .  వారంతా వారి ఆస్తులు అన్నీ ఇచ్చేసి ఉద్యమం కోసం అంకితం అయిపోయారు . 

3.  మరొక పక్క సంఘ సంస్కర్తలు రామకృష్ణ పరమహంస , దయానంద సరస్వతి , వినోభా భావే వంటి వారు చాల మంది బ్రాహ్మణులే .

4.  జగదీశ్చంద్ర బోస్ , ఎల్లాప్రగ్గడ సుబ్బారావు , మోక్షగుండం విశ్వేశ్వరయ్య , ప్రకాశం పంతులుగారు , కందుకూరి వీరేశలింగం , గురజాడ అప్పారావు పి .వి నరసింహారావు , ఇందిరా గాంధీ మన్మోహన్సింగ్ , బూర్గుల రామకృష్ణ రావు వంటి వారు ఎందరో బ్రాహ్మణులు మేధావులు ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారు .

5.  బ్రిటిష్ వారి కాలం లో భారత సైన్యాన్ని 3, మండలాలు గా విభజించారు.  కలకత్తా , ముంబై మరియు ఢిల్లీ.  ఈ సైన్యం లో ఎక్కువగా మూడు రకాల వారు ఉన్నారు బ్రాహ్మణులు , క్షత్రియులు మరియు ముస్లింలు.  ఇతర వర్ణాలు , మతాల వారు చాలా చాలా కొద్దీ మంది మాత్రమే ఉన్నారు .

6.  ఒక సారి ఈ ఐలయ్య గారు ఏమి రాశారంటే బ్రాహ్మణుల భూములను తెలంగాణ లో రెడ్డివారు , ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మ వారు , కాశ్మీరు లో ముస్లిమ్స్ తీసేసుకున్నారు అని .  అటువంటి  రెడ్డివారు , కమ్మవారు ఇతర కులాల వారు సినీరంగం లో, ఇంకా ఇతర వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్నారు .  మరి వారు ఇప్పుడు ఉత్పత్తి లో భాగం అవుతున్నారా ?  వారు ఎంత పండిస్తున్నారు వ్యవసాయం చేసి ?

7.  ఇక ఎంత మంది దళితులు వారి వారి కుల వృత్తులు చేస్తున్నారు?  వారు కూడా వారి వృత్తులు మాని చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు .  ఇంకా రాజకీయ నాయకులుగా కూడా ఉన్నారు .  మంత్రులు, ముఖ్యమంత్రులు , రాష్ట్రపతులు, ఇలా ఉన్నత పదవుల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. 

8.  అగ్ర వర్ణాల వారు అన్ని పన్నులు కట్టాలి , కడుతున్నారు కూడా.  మరి ఆ డబ్బును ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి ?  దళితులు ఇంకా సమాజం లో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధి చెయ్యటం కోసం ఉపయోగించటం లేదా ?  మరి అది సమాజ నిర్మాణం లో భాగం అవటం కాదా? 
 
9. ఇక ఇప్పటి రేజర్వేషన్స్ వలన వెనుకబడిన వర్గాల వారికి అంతా మంచి జరుగుతోంది . అగ్ర వర్ణాల వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. అన్ని రకాల పోటీ పరీక్షల్లోనూ వారికి అత్యుత్తమ ర్యాంకులు , మార్కులు వస్తేనే గానీ సీట్లు రావు. కానీ ఈ వెనుకబడిన వర్గాల వారికి ఈ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రాకున్నా సీట్లు , ఉద్యోగాలు వచ్చేస్తాయి . మరి ఇంకా వారిలో కొందరు మార్కులు వఛ్చిన వారు General-category లో కూడా సీట్లు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు . మరి ఇప్పుడు వారికి కలుగుతున్న కష్టం నష్టం ఏమిటో ఐలయ్య గారే వివరించాలి

10.  ఒక్క వ్యవసాయం చెయ్యటం అంటే particular,గా పొలం స్వయంగా దున్ని పంట పండిస్తేనే అది సమాజ నిర్మాణానికి మనవంతు గా చేసిన కృషి అని అంటే ఇంక మిగిలిన వారు అందరూ అన్ని వృత్తులు వారు , అన్ని వర్గాలవారు కూడా ఈ సమాజ నిర్మాణం లో ఏమి పాలుపంచుకోకుండా ఫలితాన్ని మాత్రమే అనుభవిస్తున్నారని ఐలయ్య గారి అభిప్రాయం అని మనం భావించాలా ?

  అదే కనుక నిజమైతే ఐలయ్య గారు ఇంకా ఆయన మద్దత్తు దారులు కూడా ఆ వర్గం లోకే వస్తారు కదా మరి ఇంకా ఈ బ్రాహ్మణులు మరియు అగ్రవర్ణాల వారిపై ఈ వ్యాఖ్యలకు అర్ధం ఏమిటి ?
 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online