Pages

ప్రేమ కు మరొక వైపు short story part - 6



           
సరేనమ్మా ఒక ముఖ్య విషయం చెప్పావు .దానిని బట్టి నేను ఏమి చేయాలో ఆలోచిస్తాను ,ఓకే రా వేళ్ళవస్తాను అంటూ లేచినిలబడ్డాడు శ్రీరామ్ .పరవా లేదురా నా సహాయం నీకు ఎప్పుదూ వుంటుంది . నువ్వు ఏమి చేయమన్నా నేను ఎప్పుడూ చేయటానికి సిద్దంగా వుంటాను .వర్రీ పడకు అంటూ బై చెప్పాడు లోకేష్ .
 

* *                                                           
రాత్రి వేల మేడ పైన కూర్చుని ఆలోచనల్లో పడ్డాడు శ్రీరామ్ నిండు జాబిలి ని దాటుకొంటూ నీలి నీలి మేఘాలు పరు గులు పెడుతున్నాయి .చక్కని చల్లని గాలి తెమ్మెరలు మెల మెల్ల గా తాకుతూ వున్నాయి .కీర్తి విషయములో ఇప్పుడు ఏ౦ చేస్తే బాగుంటుంది ?అనుకొంటూ ఆలోచిస్తూ వున్న శ్రీరామ్ ని వాళ్ళ అమ్మ గారు పిలుచుకుంటూ పైకి వచ్చింది .ఏరా నాన్నా ,మీ అత్త గారు వాళ్ళు ఫోన్ చేశార్రా ,కీర్తి ని కొద్ది రోజుల్లో తీసుకొచ్చి దింపు తాము ,మమ్మలిని క్షమించండి ఆలశ్యం అయునందుకు అని చెప్పారు ,నీకు కూడా విషయం చెప్పమన్నారు నాన్నా ,మన రంగారావు గారు లేరు ,వాళ్ళు పగలు మన ఇంటికి వచ్చారు ,కొద్దిసేపు కూర్చున్నారు ,నీ గురింఛి అడిగారు ,అవు ను వాళ్ళ నడుపుతున్న స్కూల్ అమ్మేస్తార ట ,మంచి వాళ్ళు ఎవరైనా వుంటే చెప్పమన్నారు ........ఏమిటమ్మా ....టౌన్ లో అదే …. పేట లో పెట్టిన స్కూల్ అమ్మేస్తారా ? ఏదో ఒక కొత్త ఆలోచన మైండ్ లో ఫ్ల్లాష్ అయుం ది శ్రీరామ్ కి ,అమ్మా మనం తీసుకొని నడుపుదాం అమ్మా ,మీ కోడలు కూడా చదువుకున్నది .కొంచం ఆత్రుత గా అడిగాడు శ్రీరామ్ .

ఏమో బాబు మీ నాన్నగారి ని అడుగు ,వారు ఎలా చెబితే అలా చేద్దాము .అన్నది తల్లి రాఘవమ్మ. రాత్రంతా తండ్రి వెంకట్రావు తో చర్చింఛి స్కూల్ కొనటానికి ఒప్పించాడు శ్రీరామ్ . ఇక కీర్తి కూడా కాస్తంత బిజీ అయుపోతుం ది .పైగా దగ్గర గా పట్టణం లో నివాసం ఉండచ్చు .ఇది విద్య ,చదువు కి సంభందించిన ది కాబట్టి తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది .ఇలా ఊహల్లో తేలిపోతూ చాలా వేగముగా పనులు చేసేస్తున్నాడు శ్రీరామ్ .స్కూల్ దానికి దగ్గరలో ఓ ఇల్లు కూడా తీసేసుకున్నాడు . ఇంతలో కీర్తి ని వెంట పెట్టుకొని వాళ్ళ అమ్మా ,నాన్నలు కూడా వచ్చారు .వాళ్ళ సమక్షం లో నే కొత్త స్కూల్ భాధ్యతలు అన్నీ కీర్తి కి అప్పచెప్పాడు .శ్రీరామ్ ....... మంచి పని చేశారు అల్లుడుగారు అని అత్తా మామలు పొగిడారు . అమ్మాయు కి అన్ని జాగ్రత్తలు చెప్పి . అలా కొద్ది రోజులు వుండి తిరిగి వాళ్ళ వూరు వెళ్ళిపోయారు .అత్తా మామలు. .స్కూల్ భాద్యతలు లో తల మునిగి వున్న ప్పటికి వాళ్ళ ఇంటి పైనే ,హైదరాబాద్ పైనే మనస్సు గుంజుతో౦ ది కీర్తికి .

కొంతకాలం పాటు స్కూల్ ని ఎలా చేద్దాం ,కొత్త విద్యార్ధులను ఎలా ఆ కట్టుకొని తేవాలి విషయాలపై సిబ్బంది తో చర్చలు జరుపుతోంది . నువ్వు ఎమీ టెన్షన్ పడకు కీర్తి మనం వున్నవాళ్లలో బాగా చదివించి పనులు చేయుస్తున్నారు .కాలం వేగంగా గడిచి పోతుంది .సంక్రాంతి పండగ కి స్కూల్ కి సెలవులు ఇచ్చారు .శ్రీరామ్ మనం కూడా సంక్రాంతి కి మా అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్లి వద్దాం .ఎమ౦ టారు .మొహం అంతా నవ్వు పులుముకొని అడిగింది కీర్తి . ఆమె లో అంత సంతోషం ఈ మధ్య కాలములో చూడలేదు .శ్రీరామ్ కొంచం కోపం వచ్చినా పైకి కనపడకుండా మేనేజ్ చేశాడు .కాదు కీర్తి ఈ సంక్రాంతి పల్లెల పండుగ .ఇక్కడే వుండి చక్కగా అన్నీ ఎంజాయ్ చేయవచ్చుగా .శ్రీరామ్ కొద్ది గా చిరునవ్వు ఇస్తూ చెప్పాడు .కీర్తి మొహం ఒక్కసారిగా డల్ అయుపోయుంది . ఓకే సరే ఓకే నీవు అంతగా ఏమి వర్రే అవకు వెళ్దాం .

 రెండు రోజుల తరువాత శ్రీరామ్ వాళ్ళ అమ్మ ,నాన్న లను ఒప్పించి కీర్తి వాళ్ళ ఇంటికి బయలు దేరారు .చూడండి వదిన గారు మీరు ఊరు వెళ్ళిపోతే ఇక్కడ పండగ వేడుకలు ,చాల చాలా మిస్స్ అవుతారు ,సరే ఆనక మీ ఇష్టం ఇక నేను చెప్పేది ఏమిటంటే మా అన్నయ్య మీ కోసం అనే ఈ స్కూల్ తీసుకున్నాడు .అంతా మీ చేతులోనే వుంది మీ భవిష్యత్తు ,ఆలోచించుకొని మీ వూరు లో పండగ కాగానే బయలు దేరి వచ్చేయండి .మనం అంతా కల్సి కష్ట పడదాం ,తరువాత ఓ కాలేజీ కూడా ఒకటి పెడదాం .మీరు మాకు సహకరిస్తే చాలు అంతా గట్టిగా వివరించి చెప్పాడు శ్రీరామ్ దోస్త్ లోకేష్ . పండగకువాళ్ళ వూరు చేరుకోవడం ,అక్కడ కొన్ని రోజులు గడిపి వచ్చేశాడు శ్రీరా మ్ .కీర్తి మాత్రం తరువాత వస్తానం ది .మళ్ళీ రోజులు అలానే వేగంగా గడచిపోతున్నాయు ఒకరోజు శ్రీరామ్ మామ గారు హైదరాబాద్ నుంచీ షడ్ న్ గా దిగారు .ఏమిటి మామయ్య ఒక్కరే ఇంత అత్యవసరం గా వచ్చారు ,ఫోన్ లేదు కబురు లేదు .కొంచం నవ్వు కుంటూ అడిగాడు శ్రీరామ్ ఏమి లేదు బాబు మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ,దీనం గా కొంచం బాధ పడుతూ అన్నాడు మామగారు .ముందు లోపలికి పదండి అమ్మా .... హైదరాబాదు నుంచీ మామయ్య గారు వచ్చారు . క్షేమ సమాచారం మాట్లాడుకొని ,కొద్దిసేపు విశ్రాంతి తరువాత ఇక అస్సలు సంభాషణ మొదలుపెట్టాడు మామగారు .బాబు అల్లుడుగారు నేను మా అమ్మాయి వల్ల పెద్ద చిక్కులో పడ్డాను ,అంటూ మొదలు పెట్టేసరికి ఇంట్లో అందరు టెన్షన్ లో పడిపోయారు . ఇలా అడుగుతున్నందుకు మీరు అందరు ముందుగా నన్ను మన్నించాలి . అల్లుడు గారు మా వూరు వచ్చి కొంతకాలం మా ఇంట్లో వుండగలరా ? దీనంగా అడిగాడు మామగారు

.అస్సలు ఏం జరిగింది మామయ్యా ,వివరంగా చెప్పండి .కొంచం విసుగ్గా తల పట్టుకొని అడిగాడు శ్రీరామ్ . మా అమ్మాయి ఈ వూరు రాలేను అంటుంది .ఎంత చెప్పినా ఈ వూరు అంటే తనకు ఇష్టమే లేదు అంటూ వుంది .. ఓ సి ఇదేనా మామయ్యా నేను మాట్లాడి చూస్తాను అని శ్రీరామ్ అంటూ వుండగానే శ్రీరామ్ తండ్రి వెంకట్రావ్ మద్యలో కలిగించు కొని ఇవి చదువుకున్న వాళ్ళల్లో మామూలే ,దానిది ఏముంది కొంతకాలం అలవాటు పడిందాకా శ్రీరామ్ నువ్వే వెళ్లి అక్కడ వుండు .లోకేష్ ,పూజ వాళ్ళిద్దరూ కలిసి స్కూల్ చూసుకొంటారు .ఆర్డర్ వేస్తున్నట్లు గా చెప్పాడు శ్రీరామ్ తండ్రి వెంకట్రావ్ . సరే మామయ్యా నేను వీలు చూసుకొని మీ సిటీ కి వస్తాను .మీరు ముందు విశ్రాంతి తీసుకోండి అంటూ మాట్లాడి అక్కడ నుంచీ వెళ్లి పోయాడు శ్రీరామ్ .ఆ వక్క రోజు వున్న వాళ్ళ మామగారు మ ళ్ళీ మళ్ళీ తన రిక్వెస్ట్ చెప్పి వాళ్ళ వూరు తిరిగి వెళ్లి పోయారు .

 ఇక్కడి విషయాలు అన్నీ తెలుసుకున్న కీర్తి ఒకరోజు శ్రీరామ్ కి ఫోన్ చేసింది . నేను కీర్తి ని మాట్లాడుతున్నాను . చెప్పు కీర్తి ,నీ సమస్య మొత్తం మీ నాన్నగారు చెప్పారు .నేను నీకు కోపరేట్ చేస్తాను . నేను కొద్ది రోజుల్లో అన్ని పనులు చక్కబెట్టు కొని బయలు దేరి వస్తాను .ఓకే నా....... కొంచం ఆప్యాతను రంగరించి మాట్లాడాడు శ్రీరామ్ .అడికాదం డీ శ్రీరామ్ మీరు ఎంతో ప్రేమా ,అనురాగాలతో మీ అమ్మ నాన్నలను చూసుకొంటున్నారు ,మిమ్మల్ని విడదీసి నేను పాపం మూటకట్టుకోలేను ,ఇది ఒక నెల ,ఒక సంవత్సరం తో తీరే సమస్య కాదు ,ఇక నాకు అయుతే మన బంధం పట్ల ఇష్టం లేదు ,నేను కొనసాగించలేను . మీరు ఇక దీని గురించి ఆలోచించడం మానేయండి ,ఇక ఏ ప్రయత్నాలు దయచేసి చేయవద్దు సారీ ఇక వుంటాను .

 కీర్తీ ఫోన్ పెట్టకు .... నీకు ఏమైనా తిక్క ,ఇది ఏమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా ? మన ఇద్దరం పెద్దల సమక్షములో పెళ్లి చేసుకున్నాం . మరి నీకు ఇష్టం లేకపోతె అప్పుడే చెప్పక పోయావా ? బాగా ఆలోచించుకో ,మంచి కుటుంబ౦ చేతులారా కూల గొట్టుకోకు .నా వల్ల ,మా వాళ్ళ వల్ల తప్పులు వుంటే సరిదిద్దుకుంటాం .మరొక సారి ఆలోచించుకో ,తొందరపడకు ప్లీజ్ ఫోన్ పెట్టేసింది కీర్తి . ఒక్కసారిగా శ్రీరామ్ ఫోన్ పట్టుకొని కూలపడి పోయాడు .కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూన్న శ్రీరామ్ ని వెనక నుంచీ వచ్చిన వాళ్ళ అమ్మా ,నాన్న లు భుజం పట్టుకొని పైకి లేవదీసారు .అమ్మా చూడమ్మా ,ఎలా చేస్తుందో కీర్తి అంటూ కళ్ళు వత్తుకు౦టు న్నాడు శ్రీరామ్ .

మొత్తం విన్నాం నాన్నా శ్రీరామ్ .నువ్వు ఎందుకు నాన్నా భాధపడతావు .నిన్ను మిస్ అవుతున్నందుకు కీర్తి బాధ పడాలి .నచ్చ చెబుతున్నారు శ్రీరామ్ తల్లి తండ్రులు .కాదమ్మా బంధువులలో ,స్నేహితులలో పరువు పోతుంది కదమ్మా శ్రీరామ్ తల బాడుకొంటు న్నాడు . పరువు ఏమిట్రా అస్సలు ఈ కాలం లో అమ్మాయులు అంతా అట్లానే పెళ్లి అనే దానిని లైట్ గా తీసుకొ౦ టున్నారు ,ఇదివరలో అబ్బాయులు చేసిన పిచ్చిపనులు అన్నీ ఇప్పుడు అమ్మాయులు చేస్తున్నారు ఇక నేను వాళ్ళ తల్లి త౦డ్రు లను గట్టిగా అడిగేస్తాను .అంటూ శ్రీరామ్ ని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళారు రాఘవమ్మా ,వెంకట్రావు లు . ఇక తరువాత లోకేష్ ,పూజ లు కూడా చాలా ప్రయత్నాలు చేశారు .పెద్దవాళ్ళు అంతా కల్సి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించ లేదు .దానితో శ్రీరామ్ కూడా కొంతకాలం వేచి చూశాడు ,అయునా కీర్తి లో ఏ మార్పు రాలేదు .కీర్తి పై శ్రీరా మ్ కి బాగా కోపం వచ్చింది .కారణం లేకుండా నువ్వు వద్దనుకుంటూ వుంటే నేను ఏమైనా పిచ్చోడినా అనుకొంటూ ఆలోచనల్లోపడిన శ్రీరామ్ లాయరు ని కలిసి అన్ని విషయాలు చర్చించాడు . ఈ లోపుగా శ్రీరామ్ కి పోస్ట్ లో విడాకులు కావాలని లీగెల్ నోటీసులు పంపించింది కీర్తి . కొద్ది నెలలు కోర్టు చుట్టూ తిరిగి ఎట్టకేలకు విడాకులు తీసుకొని విడిపోయారు .స్కూల్ అంతా పూజ ,లోకేష్ లు చూసుకొంటున్నారు .కొంతకాలం మానసిక ప్రశా ౦ తత కోసం ఎటు అయునా వెళ్లి పోవాలని వెతుకులాడుతున్న సమయములో నాకు ఈ ఫేమస్ విద్యా సంస్థ లో జాబ్ గురించి నేను ఎంపి క అవడం మళ్ళీ ఈ గ్రేట్ మేడం శృతి ని కలుసుకోవడం ఇలా నా జీవితం పై సినిమా చూపించ డం .నవ్వుని పెదవుల పై తెప్పించు కొంటూ ,లోపల బాధ ని దాచుకొం టూ నటిస్తూన్నాడు శ్రీరామ్ .

  యు ఆర్ గ్రేట్ శ్రీరామ్ నిజం గానే నాకు సినిమా చూపించావు .ఇప్పటికి చాలా టైం అయుం ది మీ వాళ్ళు ఏం అనుకొంటున్నా రో టైం చూసుకొంటూ ఆన్నాడు శ్రీరామ్ .మా నాన్నగారు ఇంతక్రితం బైటకు వచ్చి చూశారు ,మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు .ఇక్కడే కూర్చుని మాట్లాడుతున్నాం కదా .పర్వాలేదు.చెప్పింది శృతి . సరే మేడం ఇది నా కు వున్న ఫ్లాష్ బ్యాక్ .మీరు చాలా కాలం నుంచీ నన్నే మనస్సులో వుంచు కొన్నారని మొత్తం మన నేస్తం లక్ష్మి నాకు చెప్పింది .నా తప్పు లేకుండా మొత్తం అంతా వివరించి చెప్పాను ,ఇక మీరు ఆలోచించు కొండి . మెల్లగా చెప్పాడు శ్రీరాంమ్ . మరి ఇంకో అమ్మాయిని మీరు మీ జీవితం లోకి ఆహ్వానించగలరా ? కొంచం గట్టిగా అడిగింది శృతి . నన్ను మనసార ఇష్టపడే అమ్మాయి ,నా పాత కధను మరపించే శక్తి వున్న అమ్మాయి కావాలి .నా కంటే మా తల్లి తండ్రుల మనస్సుకు స్వాంతన కలిగించడం అత్యవసరం . ఇంకా ఆలోచిస్తున్నారా శ్రీరామ్ .

  నేనే ఆ అమ్మా యుని అనుకొని అడగలేరా నన్ను ,అంటూ శ్రీరామ్ ని చుట్టేసుకుంది శృతి . శ్రీరామ్ మీరు నాకే దక్కాల్సి వుంది అందుకే మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు ,ఇక ఇస్సారి నేను మిమ్ములను జారవిడుచుకోను చిరునవ్వు లతో మెలికలు తిరిగిపోతూ .అయు లవ్ యు అంటూ చెవిలో చెప్పింది శృతి .నా ప్రేమ కు మరో వైపు ఏమిటో తెల్సి౦ది కాబట్టి ఇక మీ వూరు నేను వచ్చేస్తాను ,అత్తా ,మామలకు ,మీరు పెట్టిన కొత్త స్కూల్ కు , నా జీవితం అంతా మీ తోడునీడ గా నడచుకొంటాన ని ప్రమాణం చేస్తున్నాను .గుడిలో గంట పెద్దగా కొడుతున్న శబ్దం వినిపిస్తోంది .శ్రీరామ్ ,శృతి నవ్వుకొంటూ ఇద్దరూ బైటకు వస్తుంటే అది చూసిన మూర్తి గారు మా అమ్మాయు ఎప్పటికి ఇలానే సంతోషంగా వుండాలి అని దేవునికి దండం పెట్టుకుంటున్నాడు . శ్రీరామ్ వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు ,అమ్మా ,నీకు నాన్నగారికి ఓ శుభవార్త అంటూ ప్రారంభింఛి మొత్తం చెప్పేశాడు .వింటున్న మూర్తిగారు అమ్మాయి ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అంటూ ఆశీర్వదించాడు .
.. .......... శు భం THE END....................

A small beautiful story



*…గొప్ప నీతి కథ…*


పూర్వం ఇద్దరు రాజులు రధాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు..
'
ఒక రాజు రధం వెనక్కి వెళ్తేనే గానీ రెండో రధం ముందుకు వెళ్ళే వీలు లేదు..


రధసారధులిద్దరూ నీ రధం వెనక్కి తీసుకెళ్ళంటే నీదే తీసుకెళ్ళమని వాదించుకోడం‌మొదలెట్టారు.


ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు..
చివరికి ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు..


వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు.. ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు..


సరే మొదటి రధసారధి ఇలా అన్నాడు..


మా రాజ్యంలో *మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు.. గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారువందలమందికి వస్త్రదానం చేస్తారు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాలూ స్థాపించారు..*


రెండవ సారధి తలదించుకుని కంట నీరుపెట్టుకుని తన రధం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు..


దానికి ఆరాజు గారిలా అడిగారు.. *ఏమయ్యా మీ రాజుకి దాన గుణం‌లేదా అలా ఏమీ చెప్పకుండా రధం వెనక్కి తిప్పుకుంటున్నావు..*


దానికా రెండో రధ సారధి వినయంగా ఇలా అన్నాడు..


హే రాజా *మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు.. మా రాజ్యం లో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడూ కనబడలేదు..‌ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు..‌ఇంక మారాజుగారికా అవకాశం ఎలా ఉంటుంది.. దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ* అని.


*వెంటనే మొదటి రధంలో రాజు రధం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తనరధం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు..*


వేల వృద్ధాశ్రమాలూ..రాయితీలు.సంక్షేమపధకాలూ.. ఉచితాలూ.. అభాగ్యులకు సేవలూ దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న  దేశమూ... ఆశించే పౌరులున్న  ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు..
అది సరైన పాలనా కాదు..


పాలకుల, పాలితుల దౌర్భాగ్యానికి చిహ్నం ఆ దేశం


ఈ మెసేజ్ పంపించిన మహానుభావునికి శత సహస్ర కోటి వందనాలు.
 ఇది పూర్తిగా నా మనసులో మాట.
ఏ దేశంలో రాయితీల అవసరం ఉండదో ఆ దేశం కంటే గొప్ప దేశం మరొకటి ఉండదు.


*రాయతీలు, హీన పరిస్థితికి అద్దాల వంటివి. కేజీ బియ్యం తక్కువ ధరకి యిచ్చే ప్రభుత్వం కంటే, ఎంత ధరకయినా కొనగలిగే ప్రజలుండే ప్రభుత్వం గొప్పది. ఈ విషయం ఎన్నో విధి విధానాలకు వర్తిసుంది.*


*ప్రజలు మేలుకొనేది ఎప్పుడు ?


 


 











 

A foreign analyst's opinion on Ayodhya


అయోధ్యపై కుహనా సెక్యులరిస్టుల వాదన వీగిపోతుంది – కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌తో ముఖాముఖి


 బెల్జియంకు చెందిన కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ ప్రాచీన హిందూ సంస్కృతి, భారతీయతలను ఎంతగానో గౌరవిస్తారు, అభిమానిస్తారు. వివిధ మతాల తులనాత్మక పరిశీలన, అధ్యయనం చేసే కోన్రాడ్‌ హిందూ-ముస్లిం సంబంధాలు, భారతీయ చరిత్రను కూడా పరిశీలించారు. లెవియన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయం నుంచి దర్శనశాస్త్రాలు, చైనా, భారత్‌, ఇరాన్‌ల గురించి అధ్యయనం చేసి పిహెచ్‌డి పట్టా పుచ్చుకున్నారు. స్వయంగా రోమన్‌ కాథలిక్‌ అయిన 58 ఏళ్ళ కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ కాథలిక్‌ మతాన్ని తిరస్కరిస్తారు. తననుతాను ‘మతం లేని మానవతావాది’గా చెప్పుకుంటారు. హిందుత్వాన్ని గురించి ఆయన అధ్యయనం చేశారు. 1988 నుండి 1992 వరకు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆయన భారత్‌లో మతపరమైన సమస్యలను పరిశీలించి తన మొదటి పుస్తకం రచించారు. ఆ పుస్తకంలో ఆయన ‘బాబ్రీ మసీదు ఎక్కడ ఉండేదో, అక్కడ మొదట్లో మందిరం ఉండేది’ అని స్పష్టం చేశారు.


తన ‘అయోధ్య అండ్‌ ఆఫ్టర్‌’ అనే పుస్తకంలో ఆయోధ్య రామమందిర ఉద్యమం వల్ల ఇక్కడి సమాజం, సంస్కృతులతో మమేకం అయ్యే అవకాశం భారతీయ ముస్లింలకు వచ్చిందని కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ అభిప్రాయపడ్డారు. నిజానికి ఆ ఉద్యమం జాతీయ సమైక్యత సాధనకు మంచి ముందడుగని అన్నారు. భారతీయ సంస్కృతి, అయోధ్య మొదలైన అంశాల గురించి కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ తన అభిప్రాయాల్ని ఈ ఇంటర్‌వ్యూలో తెలియజేశారు..


ప్రశ్న : మీ పేరు పలకడం కష్టమే. ఆ పేరుకు అర్థం ఏమిటి ?

సమాధానం : నిజమే. నా పేరు పలకడం కొద్దిగా కష్టమే. ‘ఎలాంటి భయం, ఉద్రేకం లేకుండా ఆలోచించే వాడు’ అని దాని అర్థం.


ప్రశ్న : కోర్టుల్లో సాగుతున్న అయోధ్య కేసు గురించి మీరేమంటారు ?

స : ఇంతకాలం సాక్ష్యాధారాలు చూపాలని బూటకపు సెక్యులరిస్టులు బుకాయిస్తూ ఉంటే, హిందువులు వారికి సాక్ష్యాధారాలు చూపించ డానికి, తాము చెప్పేది నిజమని నచ్చచెప్పడానికి తాపత్రయపడుతున్నారు. తమ సమయాన్ని ఇలా వృధా చేసుకుంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదం. సాక్ష్యాధారాలు ముస్లిముల వైపు నుంచి చూపించ డానికి ప్రయత్నాలేవీ జరగలేదు. బాబర్‌ గానీ, అతని సేనాపతి గానీ అక్కడ ‘మసీదు’ కట్టాడంటే ఆ భూమిని ఆక్రమించాడని అర్ధం. ఆ రోజుల్లో ఆ భూమిని బాబరు ఎవరి నుంచీ కొన్నట్లు గానీ, పొందినట్లు గానీ ఎలాంటి ఆధారాలూ లేవు. అలాగే అయోధ్య ఎప్పుడూ ముస్లిములకు పవిత్ర యాత్రా స్థలం కూడా కాదు. అక్కడ మసీదు ఉండేదని, వివాదం ఏర్పడిన తరువాత ముస్లింలు ఏనాడూ అక్కడ నమాజు చేయలేదని స్పష్టమవుతోంది. దీనినిబట్టి అక్కడ నమాజు చేయడంలో ముస్లిములకు ఎలాంటి ఆసక్తి లేదని తేలుతోంది. అయితే అయోధ్య హిందువులకు మాత్రం అత్యంత పవిత్రస్థలం, పుణ్యస్థలం అని చెప్పడానికి అనేక ఆధారాలున్నాయి. ఇక్కడే భగవాన్‌ శ్రీరాముడు జన్మించాడు. చారిత్రక ఆధారాల దృష్ట్యా చూసినా బూటకపు సెక్యులరిస్టుల వాదన అనేకసార్లు వీగిపోయింది.

కానీ విచిత్రమేమిటంటే సాక్ష్యాధారాలు చూపాల్సిన బాధ్యతను 70 ఏళ్ళుగా హిందువులే మోస్తున్నారు. పురాతత్వ ఆధారాలను చూస్తే ఒకప్పుడు అక్కడ రామమందిరం ఉండేదని స్పష్టమవు తోంది. ఇలా చారిత్రక, పురాతత్వ ఆధారాలు చూపాలంటూ గోలపెట్టిన వారు ఇప్పుడు కొత్త వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. ‘ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు గొడవపడడం అవసరమా ? వాటిని మరచిపోవచ్చును కదా. బాబర్‌ ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు ముస్లిములను దోషులుగా నిలబెట్టడం ఎంతవరకూ సబబు. కనుక అయోధ్యలో యథాతథ స్థితిని కొనసాగించాలి. రామమందిర నిర్మాణపు ఆలోచనను పక్కన పెట్టాలి’ అంటున్నారు. ప్రపంచంలో ఏ ముస్లిమైనా అయోధ్యకు తీర్థయాత్ర కోసం వస్తాడా ? లేదు. ఇక్కడకు రావాలని ఏ ముస్లిమూ అనుకోడు. కానీ భారత్‌లో ప్రభుత్వాలన్నీ ఈ సత్యాన్ని కప్పుపుచ్చుతూనే ఉంటాయి. ముస్లిం సంతుష్టీకరణ కోసం ఈ సమస్యను పొడిగిస్తూనే వచ్చాయి. అధికసంఖ్యాకుల మనోభావాలను పట్టించు కునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. అటు సెక్యులరిస్టులు, ఇటు ముస్లిం ముల్లాలు ఈ సమస్యను సాగదీయడానికే చూస్తున్నారు.


ప్రశ్న : అయితే ఇదంతా మరొక సామ్రాజ్యవాద ధోరణి అయిన ఇస్లామీకరణ అని చెప్పవచ్చునా ?

స : సరిగ్గా అదే. ప్రపంచం మొత్తాన్ని ఇస్లామీకరణ చేయాలన్న ప్రయత్నాలు జోరుగా సాగాయి. ప్రపంచాన్ని ఖిలాఫత్‌ లేదా ఖలీఫా పాలనలోకి తేవాలన్నదే ఈ ప్రయత్నాల ఉద్దేశ్యం. తమ ఆధీనంలో లేనివాటిని స్వాధీనం చేసుకోవాలని ముస్లిం పాలకులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే మనసత్త్వం ఇప్పటికీ కొనసాగుతోంది.


ప్రశ్న: హిందుత్వం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు?

స : హిందువులు చాలా సామాన్యమైన, నిరాడంబర మైన వారు. మరోవైపు క్రైస్తవులలో మూఢనమ్మకాలు ఎక్కువ. ఆ నమ్మకాలు ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి జన్మించి, శిలువపై వేళ్ళాడి, ఆ తరువాత మళ్ళీ బ్రతికి వచ్చి తమ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసేస్తాడని వాళ్ళు అనుకుంటారు. ఇక ముస్లిముల ధోరణి పూర్తిగా వేరు. తమ మతమే చిట్టచివరి వరకూ నిలిచి ఉంటుందని, ‘తీర్పు’ వచ్చే రోజు మానవాళి అంతా అల్లా ముందు నిలబడతారని, వాళ్ళవాళ్ళ కర్మలను అనుసరించి తీర్పు ఉంటుందని భావిస్తారు. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉండడం నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది
.
హిందువులు సాధారణమైన ఆలోచనలు, భావనలు కలిగినవారు. వాళ్ళు అందరితో కలిసి జీవించాలను కుంటారు. సర్వపంథ సమభావన వారి మౌలిక లక్షణం. అంటే పూజా పద్ధతి తమకంటే వేరైనప్పటికీ వారితో కలిసి జీవించడానికి హిందువులకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. హిందూ ధర్మంలో కూడా కొన్ని లోపాలున్నాయి. కానీ మొత్తంమీద చూస్తే హిందూ ధర్మంలో మానవత్వం ఎక్కువ.


ప్రశ్న : నేటి ప్రపంచంలో మతపరమైన ద్వేషం పెచ్చుమీరిపోతోంది. కొన్ని మతాలు తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో హిందూమతం ఇలాంటి విద్వేషపూరిత మతాలపై ఎలా విజయం సాధించగలదు ?

స : హిందువులు మొట్టమొదట చేయవలసినది ఏమిటంటే తమపై తాము నమ్మకాన్ని పెంచుకోవడం. తమ ధర్మం, జీవన విధానం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండడం. తమ గతాన్ని మరచిపోకూడదు. ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు అమలు చేసిన కుట్రల్ని గుర్తుంచుకోవాలి. క్రైస్తవ మిషనరీలు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళు మతమార్పిడులకు పాల్పడుతున్నారు. కత్తితో ఇస్లాం చేసిన పనినే డబ్బు, ప్రలోభాల ద్వారా క్రైస్తవం చేస్తోంది. అందువల్ల వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. కానీ దురదృష్ట వశాత్తు మిషనరీలు ఈ దేశంలో సాగించిన అమానుష కాండను హిందువులు మరచిపోతున్నారు. హిందువులు తమ ధర్మాన్ని మరచిపోవడంకంటే ఇలా గతంలో తమకు ఎంతో అన్యాయం చేసిన క్రైస్తవ మిషనరీల అకృత్యాలను మరచిపోవడం మరింత ప్రమాదకరం. దేశ సరిహద్దుల రక్షణతో పాటు పెద్దఎత్తున జరుగుతున్న సాంస్కృతిక దాడిని కూడా హిందువులు పట్టించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం మానుకోవాలి.


ప్రశ్న : ఈ మధ్యకాలంలో ప్రాచీన, సహనశీల హిందూ ధర్మం వేరు; పిడివాద, రాజకీయ హిందుత్వం వేరంటూ ఒక కొత్త వాదన తెర పైకి వచ్చింది. హిందుత్వాన్ని, హిందూ జాతీయవాదాన్ని గురించి మీరేమనుకుంటున్నారు ?

స : హిందూ జాతీయవాదం గురించి ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది. గాంధీ తరహా పిరికి, అసమర్థ హిందుత్వాన్ని ఈ దేశంలో అమలు చేయాలని కాంగ్రెస్‌ చాలా ప్రయత్నించింది. ఇస్లాం, క్రైస్తవాలను ప్రశంసించడం, తమ ధర్మంలో లోపాలు వెతకడం, ఇతరు లతో కలిసుండాలంటూ అవసరానికి మించి సర్దుకోవడం వంటివి ఈ ధోరణిలో కనిపిస్తాయి. భారతదేశంలో తమను తాము సెక్యులరిస్టులమని చెప్పుకునే వర్గం ఒకటుంది. ఆ వర్గం ఎప్పుడూ హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కానీ వాళ్ళకి అప్పుడప్పుడు తమ పేరులోని హిందుత్వం జ్ఞాపకం వస్తుంటుంది. వెంటనే తాము కూడా హిందువులమేనంటూ గొంతు చించుకుంటారు. అయితే వాళ్ళని నేను హిందువులుగా పరిగణించను. ఉదాహరణకు శశిథరూర్‌, రాహుల్‌ గాంధీలనే తీసుకోండి. ఒకాయన హఠాత్తుగా హిందుత్వం, హిందువు అంటే ఏమిటో నిర్వచనాలు ఇవ్వడం మొదలుపెడితే, మరొకాయనకు తాను జంధ్యం ధరించిన హిందువునని ఈ మధ్యనే గుర్తుకొచ్చింది. కానీ వీళ్ళిద్దరూ చేసే పనులు మాత్రం పూర్తిగా హిందూ వ్యతిరేకమైనవని ఎవరికైనా తెలుస్తుంది. పైకి మాత్రం తాము హిందువులమని చెప్పుకుంటారంతే.


ప్రశ్న : హిందువులు తమ ధోరణిని మార్చుకో వలసిన అవసరం ఉందని మీరనుకుంటున్నారా ?

స : హిందూ ఆచారాలు, పద్ధతుల వెనుక ఉన్న సైద్ధాంతిక భూమిక, సకారాత్మక ధోరణిని తెలుసుకుని ఆచరిస్తే చాలు. అలాగే వాటి గురించి ఎలాంటి తక్కువ భావం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే హిందుత్వానికి నష్టం చేయడానికి, అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నవారి ఆటలు కడతాయి.


ప్రశ్న : వహాబీ ఉద్యమం వల్ల ముప్పు ఉంటుందా ? దీనికి విరుగుడు ఏమిటి ?

స : వహాబీ ఉద్యమం వ్యాప్తి చెందుతుండడం నిజంగా పెద్ద సమస్యే. అయితే ఈ వహాబీ ప్రభావం నాకు పెద్దగా అనుభవంలోకి రాలేదు. కానీ ప్రపంచం లోని కొన్ని దేశాల్లో ఇది బాగా వ్యాప్తి చెందింది. ఈ వహాబీవాదం త్వరలోనే అంతమవుతుందని మాత్రం చెప్పవచ్చును. నా చిన్నప్పుడు చాలామంది చర్చ్‌కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా చర్చ్‌కు వెళ్ళేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. చర్చీలు ఖాళీగానే ఉంటున్నాయి. వాటిల్లో ఇప్పుడు దుకాణాలు, పబ్‌లు వెలుస్తున్నాయి. అలాగే ఇస్లాం ఎంత పెద్ద సమస్య, అది భావితరాలను ఎంతగా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని నేను కచ్చితంగా చెప్పలేను. ఇస్లామేతరుల ముందున్న మార్గం ఒక్కటే. వాళ్ళు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి పట్ల పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇతరులను అనుకరించరాదు.


ప్రశ్న : భారత్‌లో సెక్యులర్‌ రాజకీయాలు, బిజెపి రాజకీయాలను మీరు ఎలా చూస్తారు ?

స : బిజెపి రాజకీయాలు అని వేరుగా ఉన్నాయని నేను అనుకోను. ఇక్కడ అమెరికా లేదా బ్రిటన్‌కు చెందిన వర్గం ఆధిపత్యం చెలాయిస్తోంది. అది ఈ దేశానికి మంచిది కాదు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఈ దేశంలో ప్రజలు కష్టపడి పనిచేయడం కనిపించింది. ఆయన సమర్థత, కార్యదక్షత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. కానీ ఇప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడానికి, దిగలాగేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళను గుర్తించడం చాలా అవసరం. అలాగే యోగి ఆదిత్యనాధ్‌ పనితీరు కూడా నాకు బాగా నచ్చింది. నేను మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు, ఆయన వ్యవహారశైలిని గమనించినప్పుడు భారతదేశంలో పెద్దమార్పు వచ్చిందనిపించింది. ఆయన యోగి. ఆత్మసంయమనం ఆయన లక్షణం. అలాంటి వ్యక్తి రాజకీయాలలోకి రావడమంటేనే అది గొప్ప మార్పు. ఏ దేశంలోనైనా మాతృభాష ద్వారానే ప్రగతి సాధ్యపడుతుంది. చైనా, జపాన్‌, జర్మనీ మొదలైన దేశాలే ఇందుకు ఉదాహరణ. భారత్‌ కూడా అదే మార్గంలో పయనించాలి.


ప్రశ్న : బిజెపి పట్ల దేశంలో ఎలాంటి వాతావరణం ఉందనుకుంటున్నారు ?

స : బిజెపి అనుసరించే విధానాలు ఎలా ఉన్నా, ఆ పార్టీ పట్ల ప్రజల్లో అసత్యాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారం కాంగ్రెస్‌, వామపక్షాలు చేస్తున్నాయి. చారిత్రక విషయాల్ని వక్రీకరించడం, అసత్యాలను ప్రచారం చేయడం, అన్నిటికీ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలను దోషులుగా నిలబెట్టడం వంటి పద్ధతులు అవి అనుసరిస్తున్నాయి.


ప్రశ్న : హిందువులకు మీరిచ్చే సందేశం ఏమిటి?

స : ఈసారి కూడా బిజెపి తన సొంత బలంతోనే పూర్తి మెజారిటీ సాధిస్తుందని ఆశిస్తాను. ఇప్పటి వరకూ చేయకుండా మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేస్తుందనుకుంటాను. అభివృద్ధి గురించి అందరూ మాట్లాడతారు. కానీ ప్రజలు బిజెపినే ఎందుకు ఎన్నుకున్నారు ? ఈ సమాజాన్ని జాగృతం చేయడానికి, దేశానికి అత్యంత ముఖ్యమైన పనులను పూర్తిచేయడానికి బిజెపి ప్రయత్నించాలి. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే విద్యావ్యవస్థను పూర్తిగా మార్చాలి. రాజ్యాంగం అందించిన చట్టాలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలి. ఉదాహరణకు ఉమ్మడి పౌరస్మృతి. ఇప్పటివరకూ అల్పసంఖ్యాక వర్గపు హక్కుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇక అధిక సంఖ్యాకుల గురించి పట్టించుకో వాలి. నెహ్రూ, ఇందిరాగాంధీల ఆలోచనా ధోరణిని పక్కకు పెట్టి అధిక సంఖ్యాకుల కోసం ఈ ప్రభుత్వం ఏదైనా చేయగలిగితే అదే చాలా గొప్ప పని అని నేను భావిస్తాను.
(పాంచజన్య నుంచి)
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online