Pages

Deities n grahas to worship on every week day - part - 2

        గోధుమలతో, బెల్లం కలిపి పాయసం త్రాగవచ్చు ,పిల్లలకు త్రాగించవచ్చు ,గోధుమలు సూర్యభగావానునికి  సంభందించిన ధాన్యం ,ఆదివారం రోజు పిల్లలకు త్రిఫ్హలాది చూర్ణం పిల్లలకు కొద్దిగా త్రాగిస్తే కూడా మంచిది .పిల్లలు వజ్రతుల్యం పొంది వాళ్లకు భవిష్యత్తులో ఏ రోగం రాకుండా వుంటారు .ఇక జిల్లేడు సూర్యభగవానుడి కి సంభందించిన యజ్ఞ౦ లో వాడే ప్రధాన సమిధ .దానితో యజ్ఞం చేస్తే పదవీ యోగం ,మంచి ఆరోగ్యం సిద్దిస్తాయి.సప్తమి తో వచ్చే ఆదివారం ను భాను సప్తమి అని పిలుస్తారు .ఆ రోజు ఆ జిల్లేడు లేక తెల్ల జిల్లేడు ఏదైనా సరే వుపయోగించి హోమం లేక యజ్ఞం చేస్తే చాలా విశేషమైన ఫలితం వుంటుంది .యజ్ఞం లో పూర్ణాహుతి మాత్రం సూర్యాస్తమయం లోగా  చేసేసుకోవాలి.

        సూర్యొదయంవేళల్లో తులసి కోటలో సూర్యుడు వైపు కి తిరిగి( రాగి చంబు)ఎలా అయునా   నీటి ని తర్పణం గా మూడు సార్లు వదిలితే మంచిది మీకు సూర్యుని నామాలు వస్తే చదవండి .నమస్కారప్రియుడు సూర్యభగవానుడు .  అందుకే ఏమి చేసినా ,చేయకపోయినా ఉదయమే కనీసం చేతులు ఎత్తి పలు సార్లు నమస్కారం చేసినా కూడా చాలా మంచిది .కొంతమంది రోజూ సూర్య నమస్కారములు యోగ పద్దతిలో చేస్తారు .అవి 11 రకాల నమస్కారములు మొత్తం ఉంటాయి .అవి నేర్చుకొని రోజూ ఉదయం వేళా చేస్తే శ రీరములో అన్నిరకాల అంగాలు మంచి ఆరోగ్యం పొందుతాయి .అనారోగ్యం తో బాధ పడే వారు చేస్తే ఆరోగ్యవంతులు అవుతారు .అలానే ఆదిత్య హృదయం రోజూ ఉదయం వేళా చదువుకొంటే పిల్లలకు ,పెద్దలకు చాలా మంచిది. కాకపొతే ,చదివే వాళ్ళు  ఆ  రోజు త్రాగటం ,మాంసం తినడం లాంటివి చేయకూడదు . 
 
        కొందరి పండితుల అభిప్రాయం ప్రకారం పూర్వ కాలములో ఆదివారం సెలవు లేదు .ఆదివారం మధువు, మాంసం తెచ్చుకొని  తినడం లేదు .ఆ ఆచారం పరాయు పాలన వచ్చిన తరువాత మన సమాజములో ప్రారంభం అయునది .( ఇక ఆయనకు సంభందిo చినవి:- గోధుమలు,ధాన్యం /బంగారం /ఎరుపు వస్త్రం ఇవి వీటిలో ఏదో ఒకటి లేదా ఇవన్ని మూట కట్టి దానం గా ఇస్తూ వుంటారు.  సిద్దాంతి జాతకం   చూసి చెప్పినప్పుడు )ఇక ఎవరైనా ఇది సూర్యుడిని చూస్తూ చదువుకోవచ్చు

.జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమో రీ౦  సర్వ పాపఘ్నం  ప్రణతోస్మి దివాకరం .

;ఇక ఇది మీ వీలు బట్టి చదువుకొని దండం పెట్టినా చాలు ఎన్నిసార్లు అయునా  చదువుకోవచ్చు .సూర్యభగవానుడి రత్నం పేరు కె౦పు (Ruby).మాణిక్యం ,పద్మరాగం సౌగంధికం .కురువిందము ,మంసగంధి ,నీలగ౦ధీ ,లాలుగంది  అని పేర్లు కలవు .ఎరుపు రంగు లో ఉండును .శ్రీలంక లో దొరుకు కెంపు చాలా విశిష్టమైనది.దీని ప్రభావం వల్ల ధైర్యం,సాహసం ,మేధాశక్తి ,వాగ్ధాటి ,మేధాశక్తి కలుగుతాయి .నేత్ర రోగములు తగ్గు ముఖం పడతాయి కోర్టు వ్యవహారముల్లో విజయం సిద్దిస్తుంది .వ్యాపారములో కూడా లాభాలు వస్తాయి    కష్టపడినా ఒకొక్కసారి కొందరు విద్యార్థులు .పరిక్షలు తప్పుతున్నప్పుడు వారు కూడా ఈ రత్నం ధరిస్తే విజయం వారికి లభిస్తుంది .సహజముగా సింహ రాసి ,లగ్నం వారు ,కృత్తిక నక్షత్రం వారు ,ఉత్తర నక్షత్రమున వారు ఉత్తరాషాడ  వారు దీనిని ధరిస్తూ వుంటారు .

         రత్నములు కంటే గూడా ఎదురుగా వున్న సూర్య భగవానుడికి స్తోత్రం చదువుకొని నీటి తో అర్ఘ్యం ఇచ్చి దండాలు పెడితే చాలు .స్తోత్రం ఏదీ రాకపోయునా చిన్న రాగి చెంబులో చిన్న బెల్లం ముక్క వేసి కల్పి సూర్య భగవానునికి చూపించి నమస్కారం చేసి ఓం నమో నారాయణా య అను కుంటూ ఆ తీర్థం త్రాగేయాలి అలా కొద్ది రోజులు చేసి చూడండి .   .సమస్య ఎక్కువగా ఉన్నాప్పుడు పండితుడి ని కల్సి జాతకం చూపించుకొని వారు సూచించిన రత్నం ధరించాలి ,   
 
 
 
 
 
 
 

Deities n grahas to worship on every week day - part-1

      మీకు తెలుసా;     జీవిత గమనములో సమస్యలు వస్తూవున్న ,లేక సమస్యలు అంటే భయం కలుగు తున్నా కనీసం రోజుకు ఒక్కసారి నవగ్రహాలు పేర్లు అయునా చదువుకోండి .ఆదిత్యాయ ,సోమాయ మంగళాయ  బుధాయచ గురు శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమః అని చదువుకోండి .తరువాత ఆంజనేయ స్వామీ వారిపై ,లేక శ్రీ వెంకటేశ్వర స్వామివారి పైన మీకు ఏవైనా స్తోత్రాలు వస్తే చదువుకోండి .వరుసపెట్టి ఓ పది దేవుళ్ళు స్తోత్రాలు చదివేయకండి .ఒకటీ .రెండు దేవుళ్ళ   స్తోత్రాలు చదువుకోండి చాలు .మిగతావి దేవుళ్ళ పేర్లు చెప్పుకొని నమస్కారం చేసుకోండి .ఒకవేళ శ్రీవేంకటేశ్వరస్వామివారి స్తోత్రం ,ఓ లక్ష్మి అమ్మవారి స్తోత్రం చదువుకోండి .మిగతా దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఆనంద పడవచ్చు నమస్కారం పెట్టుకోవచ్చు చాలు అయుతే .అన్నీదేవుళ్ళ స్తోత్రాలు  చదువు కుంటే  చదువుకోవచ్చు  కానీ దానివల్ల మనస్సు కి ఓవర్ డోస్ పడి ప్రశాంత త లేకుండా పోతుంది .అందుకే ఏదైనా అతి పనికి రాదు .ఇక ఏ స్తోత్రానికైనా గణేష్ ని లేదా విస్వక్సేను డి ని ప్రారంభములో తలచుకోవడం ,ఆ తరువాత ఒకసారి నవగ్రహాలను ఒకసారి పేర్లు చెప్పుకొని ,మన ఇష్ట దైవం స్తోత్రం లోకి వెళ్లిపోవచ్చు .ఇది ఏమీ కుదరని వాళ్లకు రెండు ,మూడు తులసి దళాలు శ్రీకృష్ణుడు పాదాలపై వుంచి మనో ఫలకం పై ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని  స్వామిరూపం దర్సించుకోండి ,మీ సమస్య ని దాటించమని ప్రార్ధించండి చాలు . కాని ఆయన పై పిచ్చి విశ్వాసం వుంచుకోవాలి


          .మీదగ్గర  శ్రీ  రాములవారు శ్రీ వేంకటేశ్వర ఎవరైనా పర్వాలేదు భక్తీ ప్రధానం .కాకపొతే కలౌ వేంకట నాయకః  అని చెబుతారు .కలియుగము లో అందరి రక్షణ భాధ్యత నాదే అని చెప్పివున్నారు అందుకే .ఇక కొంతమంది సద్గురు సాయినాదుడిని తలచుకొని నమస్కారం చేసుకొని ఇక ఇష్ట దైవాని వెళ్ళే వారు వున్నారు .అంటే సాయి ని సద్గురువు గా పెట్టుకొ౦టారన్నమాట .ఇంకా వారి వారి కి కుల గురువులు వుంటారు ఉదా; శ్రీవైష్ణవులు  శ్రీ లక్శ్మీనారాయ ణు లు ను ఆరాధిస్తారు .వాళ్ళు ప్రారంభములో శ్రీమతే రామానుజాయనమః  అని వాళ్ళ కుల ,లేక మత గురువుని తలచుకొని ,   విశ్వక్సేనుడి  ఆరాధన (అంటే వినాయకుడి పూజ లా )  చేస్తారు .అలా ఇతరులు అయుతే శంకరాచార్యులు వారిని స్మరించుకొని పూజ ప్రారంభం చేసుకుంటారు . ఏది ఏమైనా రోజూ ఏదో రకముగా కొద్ది సేపు భగవధ్యానం చేయండి మంత్రాలు ,శ్లోకాలు రావలసిన అవసరం లేదు .మనోఫలకం  పై మీ ఇష్ట దైవాన్ని కొద్ది సెకనులు నిల్పుకొని నమస్కారం చేసుకోండి చాలు .అన్నిపక్షి జంతు జాలాలులో .వృక్షాలలో ఆ దైవాన్ని దర్శించండి .మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి చాలు


.ఇక నవగ్రహాలు పట్టి ప్రతీ రోజు నడిచే వారములు ,అధిపతులు వారి మంచి దృష్టి మనపై ప్రసరించటానికి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకు౦ దాము .



ఆదివారం ;/    ఆది వారం అనగానే సూర్యనారాయనుడి కి సంభందించినది అందరికి తెలుస్సు .భాను వాసరే అని  రవి వారం అని కూడా పిలుస్తారు . నవగ్రహాలుకు అధిపతి .మిగాతాగ్రహాలు అన్ని సూర్యుని చుట్టూ తిరగాల్సిందే .ఆయనకు రధానికి ఏడు గుర్రాలు ఉంటాయి .ఇవే సైన్సు లో ఏడు రంగులు  గా విబిజీయార్ అని చెబుతారు .మన ప్రాచీనులు ఏ టెలీస్కోప్ లు లేకుండానే అన్ని విషయాలు చెప్పేశారు .పూర్వములో అన్ని దేశాలలో సూర్యారాధన వుండేది .ప్రపంచములో  చాలా దేశాలలో సూర్యారాధన వున్నట్లు పురాతన దేవాలయాలు  చాలా బయలు పడినాయి .భాను ,ఉదయం 6 గంటలకు భానుడు ,9గంటలకు భాస్కరుడు మధ్యాహ్నం 12 గంటలకు మార్తాండ చండ ప్రచండ సాయంత్రం 6 గంటలకు దినకరుడు అలా పిలుస్తాము.అలా ఆరాధిస్తాము .సూర్యారాధన వల్ల ఆయురా రోగ్య ఐశ్వర్యములు, విజయం కీర్తి ,పుత్రసంతానం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది .జాతకములో సూర్యుడు మంచి స్తితిలో లేదా ఉచ్చ స్తితిలో వుంటే ప్రభుత్వ వుద్యోగం ఖాయం అని పండితులు చెబుతారు .ప్రవహించే నదిలో రాగి నాణెం వదిలితే కూడా సూర్యుని దయ కలిగి ఉద్యోగ లాభం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు .పిల్లలతో రోగులకు సేవ చేయుంచాలి . వాళ్ళ జీవితం .భవిష్యత్తు  బాగుంటా యి .అలానే పిల్లలతో గోధుమలతో తయారు చేసిన రొట్టెలు ,లేదా గోధుమలతో చేసిన ఏవైనా తినుబండారాలు కానీ పిల్లలు ,పెద్దలు అందరికి ,బిక్షువులకు కూడా పంచి పెడితే పిల్లలకు ధృడమైన శ రీరం .పెద్దలకు ఆరోగ్యం లభిస్తాయి .లేదా ఆదివారం గోశాలలకు లేదా దగ్గరలో గోవు లు లభిస్తే వాటికి దాణాపెడితే కూడా సూర్య దేవుని అనుగ్రహం కలుగుతుంది .అలానే అమ్మకి ,అమ్మమ్మ కి పాదసేవ చేయాలి .పిల్లలతో చేయుస్తే వాళ్ళు వున్నత మైన స్తితికి చేరుకుంటారు .ఏ రోజు అయనా కూడా పెద్దలకు కాళ్ళకు నూనె రాయటం ,పాదసేవ చేయడం ,వాళ్ళు మందులు వేసుకోవడం లో వాళ్ళ కు సహాయం చేయడం  లాంటివి ,పిల్లలకు అలవాటు చేయాలి .వాటివల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది .ప్రతి దేవత కు ఆ సంబంధ మైన గాయత్రి మంత్రం వుంటుంది కదా .ఇక్కడ కూడా సూర్యభగవానుడికి కూడా గాయత్రి వుంది , ;భాస్కరాయ విద్మహే మహ ద్వ్యుతి కరాయ ధీ మహీ తన్నో ఆదిత్య ప్రచోదయాత్;   ఇది సూర్య నారాయణుడి గాయత్రి ,దీనిని ఆదివారం రోజు చదువు కుంటే ఇంకా విశేషమైన ఫలితం వుంటుంది .ఇతర రోజుల్లో కూడా సూర్యోదయంవేళ చదువు కోవచ్చు . 
 
 
 
 
 

Brahmamokkate para brahmam okkate - 13

           నిజమైన సద్గురువులు అయితే అదే విషయం చెబుతారు .ఇక దొంగ గురువులు అయుతే ఇలా అంటారు . .నేను మొత్తం చక్రం తిప్పెస్తాను .నేను పిలిస్తే ఆ దేవుడు వచ్చి చేతులు కట్టుకొని ఇక్కడ నిలబడతాడు .ఇప్పుడు పాపం ఎక్కువ మొత్తములో కనపడుతుంది , అందుకే దేవతలు అంతా సమావేశం పెట్టుకొని నన్ను పిలిచి .వాళ్ళ శక్తి ,యుక్తులు అన్నీ నాకు కట్టబెట్టేసి నన్ను మొత్తం చూసుకోమన్నారు .ఇంకా ఆలస్యం ఎందుకు నా కాళ్ళకి మొక్కండి ,నేను మిమ్మల్ని అందరిని రక్షిస్తాను అని డాంబికాలు పోతారు .ఎలా నమ్మాలి స్వామీ అంటే ? నా చుట్టూ కొంత పవర్ ఓ కాంతి చక్రం లా కనపడుతుంది లీలగా అని హిప్నాటైస్ చేసేస్తారు .అది కనపడకపోతే ఏ మంటారో అని ఆ నిజమే కనపడింది అంటారు కొందరు .ఇక కొందరు మొండిగా నాకు ఎమీ కనిపించలేదండి అని వాదులాట పెట్టుకొంటే , నిజమే మీరు ఆ స్వామిజీ ఇచ్చే ముక్తి మార్గము మీకు అందటం లేదు .ఈ జన్మకు మిమ్మలిని ఆ స్వామీ ఒప్పుకోవడం లేదు ,మీకు అర్హత రాలేదు అని వారి భక్తులు మనలిని నెట్టేస్తారు .ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి నా అవతారం చాలా గొప్పది అయునది ప్రళయకాలము లో నేనే వస్తాను నా భక్తులను నేను చేరదీసి వారిని రక్షించి తీరతాను ,అప్పటి వరకు నా మార్గములో నడవండి .ప్రచారం చేయండి .నేను వచ్చినప్పుడు మీ మనస్సుల్లో దూరి చూస్తాను . నా వాళ్ళు అవునూ కాదో తెల్సిపోతుం ది .అందుకే వేరే వాళ్ళను ఎవరిని నమ్మకండి అని ఆ స్వామేజీ చెబుతారు.

         ఇక .ఇంకా కొంతమంది స్వామీజీలు దేవాలయాల్లోకి వెళ్ళకండి మన దగ్గర వున్న శక్తి ని ఆ విగ్రహాలు లాగేస్తాయి. అని కొంతమంది ధ్యాన గురువులు గట్టిగా చెబుతారు. ..కాస్తంత సాంప్రదాయ కుటుంబములో పుట్టినవాళ్ళు కాస్తంత ఆలోచించగలరు. .ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే వుంటున్నారు అనుకోండి ..ఇక కొంత కాలానికి మనలో ఓ సందేహం వస్తుంది మనుషుల్లాగే అన్నీ కోరికలు భాధలు రోగాలు తగ్గటానికి మందులు .రాగ ద్వేషములు అన్ని ఆ స్వామీజీ లో కనపడుతూ .వుంటే ఆయన భగవంతుడు ఎలా అనుకోవాలి ? అని మనం అడిగితె ఓరి పిచ్చి వాళ్ళారా శ్రీరాముడు ,శ్రీ కృష్ణుడు మనుషులు కారా ,లక్ష్మణుడు కి మూర్చ రాలేదా ఇలా ఎదు రు దాడికి దిగుతారు .అంతే కాని ఆ యుగము వేరు ,ఈ యుగము వేరు కొన్ని కోట్ల సంవత్సరాలు తేడా వుంది కదా ,పైగా ఆ రోజుల్లో నారదుడు ,ఋషులు భూలోకములో తిరుగాడుతూవుందేవారు ,ఆ రోజుల్లో దేవతలే మనుష్య రూపములో వచ్చారు అని పురాణములు చేబుతూవున్నా యి.

        అంతదాకా ఎందుకు త్రి మతాచార్యులు అంటే శంకర , రామానుజ ,మధ్వ చాలా గొప్ప దేవుని ఉపాసకులు. సాక్షాత్తు శివ రూపం అని చెప్పుకొనే శంకరాచార్యులు వారు బిక్షాటన చేస్తూ ఓ పేద మహిళా ఇంటికి వెళతాడు . ఆమె యొక్క కటిక దారిద్ర్య౦ చూసి సంపదల తల్లి శ్రీ మహా లక్ష్మి ని ప్రార్ధించి ధనరాసులను కురిపిస్తాడు .అదే కనకధారా స్తవం . మరి గాలిలో సృష్టించి ధనం ఇవ్వవచ్చు కదా ,అలా ఎందుకు చేయలేదు ,మానవుడి రూపములో వున్నాడు ,మానవుడికి , అది ఆడ లేక మగ ఇంకా ఎవరైనా సరే భగవానుడి అద్భుతమైన శక్తులు తెలుసుకోవడమే చాలా కష్టం .అవి పొందడం అనేది చాలా అసాధ్యం. అందుకే శంకరాచార్యులు వారు అలా చేసారు . ఎప్పుడైనా ఇలా పీటాధిపతులు ధర్మం ఆచరిస్తూ భక్తిమార్గం లో నడిపిస్తారు కానీ .దొంగ బాబాలు ,మేమే దేవుళ్ళం అంటారు .వాళ్ళ పేరు జపించమని ,అదే భజన్ చేయమని ఆదేశిస్తారు , పీటాధిపతులు వేరు –బాబాలు వేరు .చాలా తేడా వుంది . అది మనం తెల్సుకోవాలి

          .పీటాధిపతుల ఆస్తులు కి ఓ ప్రభుత్త్వ చట్టపరముగా చారిటి వుంటుంది.లెక్కలు ఉంటాయి .దొంగ బాబా ల ఆస్తులకు లెక్కలు వుండవు . .శ్రీకృష్ణభగవానుడు అవతారం చాలించి వెళ్తూ వెళ్తూ ఆ యన పాండవులు కు ముఖ్యముగా ధర్మరాజు కు చెబుతాడు కలి ప్రవేశము తో ప్రపంచం , భూ లోకం ఎలా మారిపోతాయో మనుషుల్లో వచ్చే విపరీత పోకడలు ముఖ్యము గా అధర్మం తో మాటలు మార్చేయడం లాంటివి అన్నీ రాబోతున్నాయి అని కలియుగ సంకేతముగా చెప్పుతాడు . భాగవతములో పౌవు ౦ ద రీకుడు లాగా చాలామంది మేమే దేవుళ్ళం .మమ్మల్ని కొలవండి అంటూ పూజలు చేయుంచు కొంటున్నారు.కలియుగం లో మనపై కూడా కలి ప్రభావం పడుతూవుంటూ౦ ది .అందుకే దైవ నమ స్మరణ చేసుకొంటూ సంసార సాగరం దాటి వెళ్లి పోవాలి .చాలా తేలికైన మంత్రం ఓం నమో వే౦ కటేశ్వరాయనమః లేదా హరే రామ హరే రామ రామ రామ హరే హరే / హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే /లేదా .హరే వేంకటేశ హరే వేంకటేశ వేంకటేశ వేంకటేశ హరే హరే . .హరే శ్రీనివాస హరే శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస హరే హరే . లాంటివి మనస్సులో స్మరించుకుంటూ ధర్మ ౦ రక్షిస్తే చాలు అదే మనలను రక్షిస్తుంది .అది అంతా తేలిక కాదు ఈ యుగములో అడ్గు అడుగు నా , కలి పరీక్షలు, ఎదురుకోవాలి .అందుకే భగవత్ నామం స్మరిస్తూ వుండండి .



 

 

 

 


Best time to take food

  we all know that eating food at the correct time is good for our health.  Most of us didn't follow that.  We all have different work schedules n other things to complete every day.  Because of these unusual time schedules we r not able to take food at an appropriate time n ending up having different health problems.  So here r the correct timings for our breakfast, lunch n dinner.

Breakfast:-

breakfast is the most important meal of the day.  It gives the required energy to our body n helps the brain to function actively.  It is important to have a healthy n heavy breakfast.  We should take heavy breakfast, normal lunch n light supper to maintain our weight n even to reduce over weight.  The ideal time for breakfast is 7-00am to 8-00am.  At least have it before 10-00am.

Lunch:-

Lunch has to be a normal one like not too heavy r too light.  we should take lunch b/w 12-00 noon to 1-00pm  Its better to take it b4 3-00pm.  Lunch is ideally taken after 4 hrs. of breakfast to maintain blood glucose levels.

Dinner:-

We have to eat dinner 2hrs. b4 our sleep time to get good sleep n efficient use of calories.  we have to take light dinner.  Not heavy in calories.  Ideal time for dinner is 6-00pm to 8-00pm.  Its good to eat b4 9-00pm.

Even though it is difficult to maintain these timings daily, we have to atleast try n implement some of these to stay fit n healthy.

 

Always same things


కంచ ఐయులయ్య్య గారు వ్రాసిన “ పాదవందనాలు ప్రమాణములు “    అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో బ్రాహ్మిణిజం ,బ్రాహ్మణులపై వ్రాశారు.అలా అనేదానికంటే మరోసారి వారి పంధాలో విషాన్ని కక్కారు అనిచెప్పవచ్చు .ప్రతికులములో ,ప్రతి మతములో కొన్ని అవకతవకలు ఉండొచ్చు ,అంతమాత్రం చేత ఇక అస్తమానం అదే కాకిగోల .బ్రాహ్మణ కులం ,హిందూ మతం తప్ప ఆయనకు ఇంకా ఏమి కనిపించవు ,ఇతర కులాల ,మతాల జోలికి వెళ్ళే దమ్ము ,ధైర్యం లేవు .బాపనోళ్ళ  పై ఏమి వ్రాసిన ఏమి కాదు .వాళ్లకు ఐకమత్యం ఎలాగు వుండదు .రాజకీయ పక్షాలకు కూడా    అదే  ఇష్టం అని అర్థం .ఆ రోజుల్లో నాగరికత అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మొదట్లో చదువుకున్న వాళ్ళు .అన్ని విషయాలలో అన్నీ తెల్సిన వాళ్ళు ఈ కులం వారే వుండేవారు .జ్ఞానం కోసం జీవితాలని అంకితం చేయటం లో ను .ఆహార ,విహార విలాసాదులను  భంధి౦ఛి తపస్సులు కావించి తే కానీ గణితం నుంచీ వైద్యం  వరకు ,వైద్యం నుంచి అర్చన ,నాట్యం సాహిత్యం లాంటి అనేక రకాల కళ లవరకు ఋషుల రూపములో ,మునుల రూపములో వాళ్ళు సృష్టించినవే .ఈ కాలములో దొంగ బాబా లు పెరుగుతున్నారు .వాళ్ళు ఆస్తులు ,అంతస్తులు కూడపెడుతున్నారు .కానీ వాళ్ళంతా బ్రాహ్మణులు  కారు .రక రకా లైన కులాల వారు ,మతాలవారు వస్తూన్నారు .ఒక్క షిర్డీ సాయి బాబా వారు మాత్రం బ్రాహ్మణుల పిల్లవాడిగా పుట్టి ముస్లిమ్స్ వారి ఇంట్లో పెరిగాడు .పీటాధిపతులు వేరు ,వారు కి ఒక ధర్మం ,వుంటుంది వారు సంపాదించే కానుకలు వాళ్ళకు చట్టప్రకారం వ్రాసుకున్న చారిటి కి వెళ్ళిపోతా యి .బ్రాహ్మణ అంటే అర్థం జ్ఞానం ,పదిమందికి ఆ జ్ఞానం పంచేవాడు .పోగుచేయటం ,పరిశోధన చేయటం ,రానున్న తరాలకు దాచి ఇవ్వటం ఇవన్నీ బ్రాహ్మణుడి భాధ్యత .అంతేకాదు పూర్వకాలం నుంచే దేశరక్షణ కోసం సైనిక శక్తి లో కూడా ప్రధాన భూమిక పోషించారు .చాలామంది చనిపోయారు .అలానే దేశ స్వాతంత్ర వుధ్యములో చాలామంది బ్రాహ్మణులు వురికంబముల పై వ్రేలాడారు .ఉత్తర భారతదేశం లో రికార్డుల్లోకి చాలా నమోదు అయ్యాయి.ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే బ్రాహ్మణుడు అంటే అతను గురించి మొత్తం తెలియాలి కదా ,అప్పుడు నమస్కారం చేసే అర్హత ,ఆశీస్సులు ఇచ్చే అర్హత ఉన్నాయు అని తేల్చగలము. ఇప్పుడు సమాజములో ఎలా వుంది అంటే పూర్వ కాలములో సంఘటనలు అయున ,ఈ కాలములో సంఘటనలు అయునా అన్నిటికి బ్రాహ్మణులే అని తిట్టిపోయటం అలవాటుఅయుపోయంది .దానికి మీడీయా కూడా వంత పాడుతోంది. ఇంత చెప్పిన నాస్తికులు ,కమ్యునిస్టులు ఏమంటారు .బ్రాహ్మణులే ఇవన్ని వ్రాసుకున్నారు అని , మరి  ఇవన్నీ బ్రాహ్మణులు కూడా ఆచరిస్తూన్నారుగా వాళ్ళు ఉపవాసాలు ,ఉపదేశాలు పూజలు అభిషేకాలు ,దానధర్మాలు మొత్తం  వాళ్లకు ఏమి చెబుతున్నారో అది మొత్తం ఆచరిస్తూన్నారు కదా  ఇక . .కనీసం బ్రాహ్మణ కులములో ఎవరైనా ఐకాన్ గురించి వ్రాసేటప్పుడు అగ్రకులం లేక మధ్యతరగతి కుటుంబం అని వ్రాస్తూ వుంటారు .బ్రాహ్మణ కులములో అని వ్రాయరు . .ఎందుకు మీడియా కు వివక్ష ? ఈ మధ్య నిర్మలా సీతరామన్ కి రక్షణ మంత్రి ఇచ్చి నప్పుడు ఆమె గురించి అలానే వ్రాశారు ,ముఖ్యముగా సాక్షి లో అలానే వచ్చింది .మీడియా లో అం   తా కమ్యునిస్టు భావజాలం ఎక్కువగా వుండటం కారణం .అన్నిమతాల్లోను ,అన్నిదేశాలలోను పురాతన కాలములో ఆయా మతపెద్దలు పాలనలో కొంత మార్గదర్స్ కత్త్వం చేసేవారు. రాజులు ,మంత్రులు .పాలనాధికారులు  సైతం వారికి నమస్కారం లేదా పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకొనేవారు .ఈ దేశములో బ్రాహ్మణులు    వేదములు  ,అనేక దైవ స్తోత్రములు  చదువుతూవుంటారు కాబట్టి ,ఓనిష్టతో నీయమ బద్ద జీవితం గడుపుతారు కాబట్టి వాళ్ళ నోటితో నాలుగు మంచి మాటలు అన్పించుకొని ,వాళ్ళ పాదాలను తాకి ఆశీర్వచనం తీసుకుంటారు .అంతేకాదు వాళ్ళు  సమాజానికి చేస్తున్నసేవ ,దానికోసం వారి తపన ,దానికోసం వారి అనుసరించే దీక్ష.పవిత్రమైన జీవనం వీటి అన్నింటికి కృతజ్ఞతలు కోసం కూడా పాదాభి వందనం చేస్తారు .శ్రీరాములవారు ,శ్రీకృష్ణభగవానుడి దగ్గరనుంచి వస్తూవున్న ఆచారం .ఇక ఆధునిక కాలములో ఏ పెద్దలు నుంచి అయునా ,తల్లితండ్రులు,ఇంట్లో ,కుటుంబములో  తనకంటే పెద్దలు ఆడ మగ ఎవరికైనా పాద నమస్కారం చేయవచ్చు .ఇక స్వంత ఇంట్లో వాళ్ళు అయునా సరే ఓ సత్ బ్రాహ్మణుడు కనపడితే వెళ్లి నమస్కారం పెట్టుకోమని పంపిస్తారు . కుల మత భేదం లేకుండా వయస్సులోవున్న పెద్దవారి అందరి ఆశీర్వచనం విలువైనదే  కాని బ్రాహ్మణ ఆశీర్వచనం  అత్యంత  విలువైనది .ఎందుకంటే వాళ్ళు అంతా సప్త ఋషుల సంతానం ,అంటే సాక్షాత్తు భగవంతుడు, ఆయన అవతారములు తో సంభ౦ ధములు వున్న ఋషుల సంతానం అని ఈ నాటి వరకు ప్రతి హిందూవులు అయున భారతీయులకు ఓ గట్టి నమ్మకం .అది కూడా దొంగ బాబా లు కు వర్తించదు . ఒకసారి అప్పటి రాష్ట్రపతి  బాబు రాజేంద్రప్రసాద్ కాశి వెళ్ళారు .అక్కడ శివుడి ప్రత్యేక పూజలలో పాలుగొని వచ్చారు .అప్పటి ప్రధాని నెహ్రు ఆయనను వివరణ అడిగారు .నేను రాష్ట్రపతి అయునంత మాత్రాన నా సెంటిమెంట్లు.నా పూజలు ,వ్యక్తిగత అభిప్రాయాలు నావి నాకు ఉంటాయి .అవి మానుకోవాల్సిన అవసరం నాకు లేదు .నేను ఒక మనిషి గా ,ఓభక్తునిగా మందిరానికి వెళ్లాను .ఇది నేనుఎవరి నెత్తినా రుద్దలేదు .ఇది అందరూ చేయండి అని నేను ఎక్కడా ఉపన్యాసం ఇవ్వలేదు .కాబట్టి నేను ఎవరికి వివరణ ,సంజాయుషి ఇవ్వనవసరం లేదు .అని గట్టి గా చెప్పారు .అలానే ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్  రాష్ట్రపతి హోదాలో రష్యా వెళ్ళారు .అక్కడ అధ్యక్షుడు ఈయనను కలవటం కోసం వేచి వున్నారు .తెల్లటి వస్త్రాలు లో వుండి ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు .ఒక్కసారి గా రాధాకృష్ణన్ ని చూసి అక్కడే నమస్కారం చేస్తూ మౌనముగా నిలబడిపోయాడు  ఆ రష్యా అధ్యక్షుడు .  ఆ తరువాత ఆయనలో ఏదో మహత్తరమైన తేజస్సు వుంది అని  అక్కడ ఉన్నవారితో ,రాధాకృష్ణన్  గారితో కూడా చెప్పారట .ఇక బ్రిటిష్ వాళ్ళ టైం లో చాలామంది బ్రాహ్మణ జమిందారులు ఎక్కువ శాతం కరణాలు విదేశం వెళ్లి ఇంగ్లీష్ చదువులు చదువుకొని వచ్చే వారు .సూట్ బూట్లతో తిరిగే వారు .ఇంగ్లిష్ మాట్లాడుతూ నోట్లో పైప్   పెట్టుకొంటూ వేష ,భాషలు మార్చివేసేశారు. మరి అటువంటి డ్రెస్సులు కంచ ఐలయ్యా గారు ఎందుకు వేసుకుంటున్నారు .షెప్పర్డ్ పేరు పెట్టుకొని ఆ రకమైన డ్రెస్   వేసుకోకుండా వుంటే వాళ్ళని అవమానించినట్లు కాదా .బ్రాహ్మణుల్లా వేష ,భాషలూ నేర్చుకొని  పంతులు ,బోధన   విషయాలు  లో వుండి మళ్ళీ బ్రాహ్మణులు పై అక్కసు ఎందుకు .మనం అనేక సీరియల్స్ లో సంభాషణలు  ఎప్పట్నించో వింటూ ఉన్నాము .అవి ఎక్కువ శాతం బ్రాహ్మణ రచయు త లు ను౦చీ వచ్చినవే .సభ్యత ను ,సంస్కారం చెప్పేవిగా ఉంటాయి .వెర్రిపప్పా, నీకు ఛాదస్తం ,పైత్యమా,తలతిరుగుతుందా ,లాంటివి ఎన్నో మాటలు వింటూవుంటారు ఇప్పుడు కూడా ఆ సీరియల్ వింటూ పరికించం డి ,మీకే తెలుస్తుంది .దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటే అదేదో తప్పుజరిగిపో యునట్టు కులాల కుళ్ళు పట్టుకొచ్చి పెరుతెచ్చుకోవదం వారి నైజం కి నిదర్సనం .మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కి చెప్పి చూడండి వారు ఇవి విని ఆచరిస్తారా చూడండి .ముందు ఇల్లు గెలవండి .అన్ని హిందూ మతగ్రంధాలు చదవగలరు  ,ముందు మీరు వెంటనే చేయాల్సిన పని మీకు వాటిలో జ్ఞానం సున్నా అని అందరికి తెలుస్సు .ప్రపంచం అంతా బ్రాహ్మణులు నిండి వున్నారు .మీరు పాకిస్తాన్, వెళ్ళితే ఈబ్రాహ్మనిజం,కనిపించడు ,ఇది ఏమైనా   అధ్యాపక.ఆచార్య ప౦తులు ఉద్యోగములో వున్నప్పుడు ఆ వుధ్యోగం.ఆ డ్రెస్ ఆ చదువు త,ఆయన వయస్సు తగ్గట్టుగా ,హుందాగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది .చాలామంది phd లు ఉద్యోగాలు లేక రోడ్ల పై తిరుగుతూవున్నాం .మీ వుద్యోగం మీ అదృష్టమే నిజముగా .

బ్రతుకున బ్రతుకై

పొలం దున్ని విత్తనాలు జల్లాను.
పొలాలు అన్నీ పచ్చగా లేచాయి
మనస్సు లోకి ఆమె తొంగి చూసింది
ఆమె ఎంతో చదివింది, నా చదువు మధ్యలో ఆగింది
చిన్నతనం లో ఇద్దరం ఎన్నో చిలిపి ఆటలు ఆడుకున్నాం
ఇప్పుడు ఆమె షర్టు లతో ఫ్యాషన్ గా ఉంది
ఎప్పుడూ నన్ను కవ్వించే ఆమె చిరునవ్వుల జల్లు
ఆమె ఇంటి పక్కనే నా ఇల్లు
ఆమె ఒక చిరునవ్వు నా మనస్సు ని చుట్టి కట్ట కట్టేస్తుంది
బావా అన్న పిలుపు చాలు ఆమె కోసం యుగ యుగాలు పడి ఉంటాను
ఆమె కోసం ఒక్క చెడు అలవాటు నా దగ్గరకు రానీయలేదు
పెళ్ళివారు వస్తున్నారట!  ఆమె కు పెళ్లిచూపులు
నా కళ్ళల్లో నీళ్లు రావు ఆమె కు మంచి జరగాలని
పొలాల్లో నీళ్లు లేవు పచ్చని చేలు ఎండినాయి
ఇంకేం మిగిలింది ? మిగిలింది అప్పులే
ఈ జన్మ కు , రానున్న జన్మలకు మిగులు ఈ బంధాలు
పొలానికి వెళ్ళాడు .. చెట్టుకు వేసాడు ఒక తాడు
తాడుపై వేలాడి .... ఇక వెళ్లిపోవాలని
ఏ పక్షి పలకని , కాపాడని వైనం ... కొద్దీ సేపు మౌనం
బావా ...బావా .. పెద్దగా పిలుపు   తాడు తప్పించింది
 ఆమె ఎద పై నేను ... నా కళ్ళ నీళ్లు తుడుస్తూ ఆమె
పంట లేకపోతేనేం బావా !  నా కంట నీవు లేవా ?
జీవితం అంతా ఉందాము ..  ఒకరికి ఒకరం తోడుగా
ఆమె కళ్ళలో ఆర్ద్రతగా!  అది  ఒకరికి ఒకరం భద్రత అని  

social networking sites n their perils

       ఈనాటి రోజులలో సోషల్ నెట్వర్క్ బాగా పెరిగిపోయి౦ ది .  ప్రతి మనిషి ముఖ్యముగా యువకులు,  అంతా చేతిలో సేలఫోన్   లేకపోతే  నెట్ కి అతుక్కుపోవటం సాధారణ దినచర్య అ యుపో యింది .ముఖ్యముగా నెట్ లో యు ట్యూబ్ లో రక రకాల సమాచారం ,వింత .వింత గా చోధ్యం చూపిస్తూ వున్నాయి .ఆ సినిమా హీరోయున్ డ్రెస్ ఖరీద్ తెలుస్సా ?ఆ హీరో ఆస్తి అంతస్తులు ఎంతో తెలుస్సా ,ఆ హీరో కొడుకు పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలుస్సా? ఇవన్ని నెట్ ని౦డాహాల్ చల్ చేస్తు౦ టాయి .ఒక్కసారి ఆలోచించు కుందాము ?  ఏమిటి అవి అన్ని చదివి బట్టీ పట్టి చర్చి౦ చు కొంటూ టైం పాస్ చేసుకొంటూ వుంటే వచ్చే లాభం  ఏమిటో నాకు ఎమీ అర్థం కాలేదు ,ఓ .కే ఏదో కాస్త అలసిపోయినజీవితానికి ఊరట అనుకోవచ్చు ,కానీ రోజుల తరబడి ,గంటల తరబడి నెట్ కి అతుక్కొని పోయి కూర్చోవటం అటు శారీరిక  ఇటు మానసిక ఆరోగ్యానికి అమితమైన నష్టాన్ని తెచ్చి పెడుతుంది .

        అంతేకాదు కొన్ని యు .ట్యూబ్  అంశాలు అయుతే  వాస్తు ,జ్యోతిష్యం ,లక్కీ నంబర్స్ ,ఇంట్లో సంపదలు పెరగాలంటే ఇలా మనిషి లోని బలహీనత ను క్యాష్ చేసుకుంటున్నారు .కొంతకాలం ఆలోవెరా మట్టలు ఇంటి ముందు కట్టమన్నారు ,మరికొంతకాలం తరువాత మనీప్లాంట్ ,ఆ తరువాత తెల్లజిల్లేడు మండలు,లేక పువ్వులు ,ఇక కొంతమంది కర్పూరం కడ్డీలను ఇంటిముందు కట్టమనడం.కొన్ని యంత్రాలు ,కొన్ని దిష్టి యంత్రాలు కట్టమని అమ్ముకోవటం ,నలుగురు నాలుగు రకాలుగా మనలిని   మనస్సు స్థిరత్త్వం  లేకుండా చేసేస్తున్నారు .కష్టపడటం ,వచ్చిన దానిని జాగ్రత్తగా నిలుపుకోవటం ,అందుకోసం మనం చెడు వ్యసనాలకు బానిసలం కాకుండా వుండాలి .ప్రతీదానిని గుడ్డిగా నమ్మి దాని వెనుక బడి పరుగెత్తకండి .భక్తీమార్గములో నడవండి ,జ్ఞానం పెంచుకోండి ,కాని మూఢనమ్మకాలు ను కనిపెట్టి వాటి నుంచి దూరముగా ఉండండి

        .రోజు మొత్తములో సోషల్ మీడియా ని ఒక్క గంట కంటే ఎక్కువ చూడటం శారీ రక ,మానసిక ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలుసుకోండి .అనుమానాలు ,వాస్తు భయాలు వుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ధైర్యము గా వుండండి .ఇష్టదైవం ముందు  ధ్యానములో కూర్చొని మీ బాధ ఆ దేవునికి చెప్పుకోండి .తప్పులు చేయకండి .అంటే ఒకరికి బాధ కలిగించేది ,ఒక జీవికి కష్టం కలిగించేది  పాపం.అది చేయకుండా ఉండండి   .సహజము గానే ధైర్యం ,సంతోషం  కల్గుతాయి .మనకు లభి౦చే దానితో తృప్తి బడటం నేర్చుకోవాలి .ఆశ పడొచ్చు దానికి ,మన అర్హత కూడా ఆలోచించి  కష్టపడాలి .కాని అతి ఆశ పడటం మాత్రం ఎప్పటికి మంచిది కాదు   దక్కేది ఎలాగు దక్కుతుంది  . దక్కనిది ఎలాగు దక్కదు . కొంచం అనుభవం తో అది తెలుసుకొని   జీవితాన్ని కాపాడుకోవాలి  అత్యంత  విలువైన సమయం ,గడచి పోయి నది ఇక తిరిగిరాదు ఇకనైనా వున్న జీవితాన్ని సద్వి నియోగం   చేసుకోవాలి అంతేకాని అనేకమందిని జ్యోతిష్యులను కలవడం ,అనేక మంది వాస్తు పండితులను కలవడం వాళ్ళు వచ్చి తలోకడు ఏదో ఒక గోడ పడేసి పోవడం చివరికి కొంప పాడుచేసుకొని చేతిలో డబ్బులు వాళ్ళకు వాళ్ళ ఫీజు లు కట్టటం .కొంప మారి అప్పుడు దేవుడిని ఆశ్రెయిస్తాము.
       
          మనుష్యులను నమ్ముకోవటం ,ఆస్తులు పాడుచేసుకోవడం కాదు .భగవంతుడిని నమ్ముకోండి ప్రతివాళ్ళకు చేయు.ఇంటివాస్తూ రెండూ చూపగూడదు .ఏ ఇద్దరి పండితుల అభిప్రాయాలు కలవవు .మన లోw eekness  కనిపెట్టి ఆఫీస్ కు రమ్మంటాడు. ఒక చెట్టు తెచ్చి ఇంట్లో కట్టమంటాడు .అది శ్రీశైలం అడవుల్లో దొరుకుతుంది అంటాడు .నేను వెళ్ళలేను ,వెళ్ళినా ఆ మొక్కను కనిపెట్టలేము.అప్పుడు ఆ జ్యోతిష్యుడు లేక వాస్తు ఆయన ఏమంటాడు నేను తెప్పిస్తాను వేల రూపాయలు అడుగుతాడు , ఆ మత్తులో వున్న మనం ఎగేసుకు౦ టూఇస్తాము .ఏదో ఒకటి మొక్క చేతిలో పెడతాడు .ఇలా చాలా మంది Uట్యూబ్ లో వ్యాపారాలు చేస్తూ దోచుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త .  .

          ఒకవేళ అంతా మంచిగా  వున్నా ఏవో సమస్యలు వస్తున్నాయి.   అప్పడు ఇలా చేసుకోండి .సూర్యోదయముముందే లేవండి .మీదగ్గ్రర లో ఆంజనేయ స్వామీ గుడికి రోజూ వెళ్ళండి ,ఓ 11 ప్రదక్షిణాలుచేయండి నవగ్రహాలు వుంటే వాటికి నమస్కారం చేసుకోండి మీకుఆంజనేయ స్వామీ పై .లేక శ్రీరాముడి పై మంత్రం వస్తే చదవండి .రాకపోతే శ్రీరామదూత హనుమ  ఈ పదం ఆంజనేయస్వామివారికి ఎంతో ఇష్టం .ఇది  అనుకొంటూ ప్రదక్షిణాలు చేయండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ,స్వామీ వారి సింధూరం బొట్టుపెట్టుకోండి .పూజారిగారిని అడిగి కొంచం ఇంటికి తెచ్చి అందరూ పెట్టుకోండి .  సమస్య తీవ్రముగా వుంటే శని వారం కాని మంగళ వారం కాని ఆకు పూజ స్వామికి  చేయుంచుకోండి .అదికూడా చేసుకోలేక పొతే స్వామీ వారి కి  మీ సమస్య చెప్పుకొని  చుట్టూ 111 ప్రదక్షిణాలు చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టండి చాలు .లేదా నువ్వులు నూనె కొని స్వామీ వారి గుళ్ళో దీపారాధనకు ఇవ్వండి చాలు . లేదా అప్పాలదండ స్వామీ వారికి మొక్కుకోండి .ఇంట్లో చిరాకులు వుంటే ఇంట్లో సుందరకాండ పారాయణం పెట్టించుకొని ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టండి

          .ఇక సాయి భక్తులు  అయితే  సాయి పటం పూవులతో అలంకరించి ఓ కొబ్బరికాయ కొట్టి మీ సమస్య చెప్పుకొని రొజూ కొన్ని పే జీ లు చదవండి .రోజూ రొట్టెలు ఆరగి౦ పు చేయటం అవి కుక్కలకు ,ఆవులకు బిచ్చగాండ్ లకు పంచటం మంచిది .నల్లజంతువులకు పెడితే గ్రహబాధలు పోతాయి .ఆవు దూడ చుట్టూ  ప్రదక్షిణం చేస్తే చాలా వాటికి మంచిది .వెనుకభాగంలక్ష్మి స్వరూపం అక్కడే నమస్కారం చేసుకోవాలి .ఏదిఎంత చేసినా ఒక ముఖ్య విషయం గుర్తు పెట్టుకోవాలి .అలరడి మన క్యాసెట్ రికార్డు అయు మనతో మనం అనుభవించాల్సిన ఫైల్ వచ్చే సింది .ఇక దానిలో ఏ మార్పులు వుండవు .ఇప్పుడు చేసే మంచి చెడ్డ వచ్చే జన్మకోసం .మరి పైన పరిహారాలు చెప్పారు కదా అని అనుకోవచ్చు .ఇక అదేమిటి అంటే భగవంతుడు మనం చేసే జపాలతో ప్లీజ్ చేసుకొంటే ఆయనకు దయ కలిగి గొడ్డలి తో పోయే ప్రమాదం గోరు తో చేసి శిక్షతగ్గిస్తాడు .తరువాత ఏదైనా ఉపద్రవాలకు తట్టుకొని నిలబడే శక్తి ని ఇస్తాడు .

           ఇక ఆరోగ్యం లేనివారికి రోజు సూర్యునికి నమస్కారం  చేసుకోవాలి  ప్రదక్షిణ౦ లు చేసుకొని పుష్పమాల ధరించిన ఆ స్వామిని దర్శనంచేసుకోవాలి .పుష్పమాల స్వామీ ధరించి ఉండకపోతే మీరు మీ శక్తి మేరకు కొని లేక అల్లించి వేయుంచి దర్శనం చేసుకోవాలి .నోటికి వచ్చిన లేక క్యాసెట్ లో విన్నా లక్శ్మీనరసి౦హ కరావలంబ స్తోత్రం  పాదుకొన్నా చాలా వుపసేమ నం కలుగుతుంది. ఇక కలియుగానికి భాద్య్యత నాది అని కలవ్ వే ౦ కటనాయకః అని కదా ఇంటిలో తులసీ దళములతో స్వామీ వారి 108 నామాలు చదివి పూజ చేసుకోండి .మీ సమస్య చెప్పుకొని స్వామికి మొక్కు లేక ముడుపు కట్టుకోండి .ఇక విపరీతముగా మోత పెడుతూ మనలను సందేహ ములో పడేసేవి .బుర్ర పిచ్చి ఎక్కించేవి చూడటం మానేయండి మానసిక శారీరక ఆరోగ్యం కాపాడుకోండి .ఇంకా సమస్యలు పరిహారాలు తరువాయి భాగములో వివరించి చెబుతాను .
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online