Pages

part ...10 నిరీక్షణ ......short story.. NIRIKSHNA. PAR T...10



ఎలాగో అలా  వాళ్ళ పిన్నిగారి ఇల్లు రాయలసీమ లో ఓ కు గ్రామ0 చేరుకుంది అరుణ ..ఏంటి తల్లి ..ఒక్కదానివే వచ్చావే ..మీ అమ్మ ..అన్న ఎవరూ రాలేదా ..కట్టు బట్టలతో వచ్చావా ..అస్సలు ఏమై0ది ..తల్లీ ..పిన్ని ..బాబాయు అంతా ఆవేదన గా అడిగారు ..లోపలికి పదండి ..అంతా వివరించి చెబుతాను ..అలా మొత్తం అక్కడ వాళ్ళ నాన్నగారు పోయన తరువాత వాళ్ళ బాబాయి ల పెత్తనం ...నాన్న గారి చెల్లెలు భర్త ..మామయ్య .ఆస్తి కోసం అంతా కట్నం గా వ్రాసి వాళ్ళ అబ్బాయిని పెళ్లిచేసుకోవాలంటూ రోజూ గోల ..నన్ను ..మా అమ్మని ఎటూ పోనీయకుండా ..మనుషులు కాపలా ..నేను ఎలానో అలా ముందు అక్కడ నుంచి బయట పడ్డాను ...అని అరుణ కొంచెము బాధ పడుతూ చెప్పింది .
మరి అమ్మ పరిస్థితి ఎట్లానే ..మీ అన్న పట్టించుకోడు ..పెళ్ళి చేసుకో డు ..మాతో మంచిగా ఏ విషయం చెప్పడు ..మీరు ఆ మూల ..మేము ..ఇటు ..ఎక్కడో ఈ మూల ...ఎలా రా భగవంతుడా ..అని రాగం పెట్టింది ..పిన్ని తులసి ..నువ్వు ఆగవే ..కొద్దిగా ఓపిక పట్టు ...అంతా ఎదో ఒక రూపేణా సరి చేద్దాం కొంచెము ఓదార్పు గా ఏదో చెప్ప బోతున్నాడు ..  ఆమె భర్త మనోహర్ ............
**                           **                         **                               **              
సాయంత్రం వేళ ..మేడ పైన మాట్లాడుకొంటూ నడుస్తూవున్నారు ..డాక్టర్ రమణ గారు ..కూతురు గీత ..చూడమ్మా ..నీకు మంచి సంబ0ధ0 చూసి పెళ్ళి చేయాలని అను కుంటున్నాను ..అయితే దానికి నిన్ను ఎందుకు ఆడుగుతున్నానం టే ..నువ్వు ఎవరినైనా ప్రేమించవా ..నీ మనస్సులో ఎవరైనా ఉన్నారా ..బాగా ఆలోచించి చెప్పమ్మా ..కొంచెము ప్రేమగా అడిగాడు డా . రమణ  ..ఏమో డాడీ అంతా మీ ఇష్టం ..అమ్మను ఒకసారి అడగండి ..లోలోపల సిగ్గు పడుతూ కొంచెము మౌనంగా.మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయి0ది గీత ..వాళ్ళ అమ్మకు ఏమైనా చెప్పిందా ఏమిటి ...అవునులే ఆడ పిల్లలు అంతేలే ..ఒక నిట్టూర్పు ..ఇంతలో తాను పీ.హెచ డి కోసంసెట్ చేసిన మొత్తం కాగితాలు కోసం ఒక పుస్తకం లా తెచ్చాడు ....సర్ మా గైడ్ మొత్తం అనుమతి ఇచ్చారు ...ఇవి ఇక సబిమిట్ చేసైమన్నారు ..అని వంగి కాళ్ళ కు నమస్కారం చేశాడు కిరణ్..ఇప్పుడు ఈ దండాలు ఎందుకయ్యా బాబు ..Ok నయ్యా ..చాలా సంతోషం ..అన్నాడు డా..రమణ ..సార్ మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే గా సార్ ..మీరు నా కు తొంభై శాతం సహాయము చేశారు ..మా ప్రొపెస్సర్ గారిది పది శాతం ..అని ఆనంద పడుతూ చెప్పాడు కిరణ్ ...చాలా బాగుంది ..కానీ మీ ప్రొఫెసర్ దే ఎక్కువ శాతం ఎందుకంటే ..వ్రాసింది అంతా ఓ కే చేస్తూ వచ్చారు ..ఆయన నాకు నచ్చటం లేదు ..వద్దు పో అంటే ....కాల యాపన చేస్తే ఎంత కష్ట0....అని రమణ చెబుతుంటే ..సరే సార్ ఈ స్వీట్ తీసుకోండి ...ఇంట్లో కూడా అందరికి పంచి వస్తాను ..అంటూ లోపలికి వెళ్ళాడు ..గీత ..మీకు ...అమ్మగారికి స్వీట్ ..ఇస్తూ ఈ
రోజు ...మీ అందరి ప్రోత్సాహం ..దయ వల్ల నా నోట్స్ మొత్తం ..ఆమోదం లభించడంతో ..డిజ్రటేషన్  ..గా తయారు చేశాను ....కిరణ్ చెబుతూవుంటే ..దయ   ..అనేకంటే ..ప్రోత్సాహం బాగుంటుందేమో ..గీత నవ్వుకుంటూ అనగానే ..మీ ఇష్టం ..ఎలా అయినా పర్వలేదు ..అన్నాడు కిరణ్ .
ఎందుకండి ..మా నాన్నగారి కి థాంక్స్ బాగుంది ..ఓకే ..మరి నాపేరు ..మా అమ్మ పేరు ఎందుకు చెప్పండి ..నో..నోనో.. కొంచం మొహం ముడిచింది గీత ...అలా అనకండి మేడమ్ ..నేను ఎన్ని సార్లు మీ ఇంట్లో అన్నం తిన్నానో ..ఎంతగా మీ ఇంట్లో తిరుగుతూ వున్నా ..నన్ను స్వంత వాళ్ళలా ....చూసుకొని గౌరవించారు .దానివల్ల నేను త్వరగా రీసెర్చ్ పూర్తిచేసుకోగలిగాను ..అలా అందరూ కలసి ..గల గలా మాట్లాడేస్సుకుంటూ వున్నారు........
**                              **                           **                        **                    **
శివ నారాయణ ఇంట్లో పరిస్థితులు ..మారిపోతున్నాయి ..దేవాలయాలు ని అరుణ కుటుంబం నుంచి ..వేరే వాళ్ళ బంధువులు లాగేసుకున్నారు ...ఏ ఉత్సవాలను మంచిగా జరిపించడం లేదు ..డబ్బులు ఇవ్వరు ..ఎవ్వరిని గౌరవించరు .ఇక. .. బ్యాంక్ లో కూడా ఇదివరలో లా లేదు ..రాజకీయాలు ..ప్రలోభాలు ఎక్కువగా ఉన్నాయి ..ఇక ఆ ఊర్లో పరిస్థితులు అక్కడ తనకు నచ్చక ..చెప్పుకోవడానికి ఎవరూ లేక ..పెద్ద వయసు వచ్చిన తల్లిదండ్రులు ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి స్థిర పడాలని నిర్ణయం తీసుకున్నాడు .హైదరాబాద్ చేరుకొని ..దేవాలయం ..లో కొంతకాలం ..రేడియో .పత్రికలు ..కాన్వెంట్ ల లో  పార్ట్ టైం చేస్తూ   అలా వ్యుద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు ...శివనారాయణ ..అతని ప్రతిభ కి తగ్గట్టు గా స్వదేశం లో అవకాశాలు లేవు ..ఇక్కడ స్వంత కులం వాళ్ళే ఈర్ష్య పడటం ..పైకి వస్తూన్న రానీ యక పోవడం .. .తో అనేక కష్టాలు పడాల్సివచ్చింది ..ప్రభుత్త్వ వ్యుద్యోగాలు కు మొదటిదశ లో ఎంపిక అయినా కూడా ..ఫైనల్ లో రిజర్వేషన్ కేటగిరి వారందరూ ..వాళ్ళ కోటా మాత్రమే కాకుండా ఓపెన్  ఓ.సీ కులాల కోటలో కూడా మెరిట్ అని వ్యుద్యోగాలు కొట్టేసేవారు ..ఎటుతిరిగి అక్కడ కూడా సున్నా ..దానితో విసిగి పోయి ఏదో చిన్నవ్యు ద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు ను పోషిస్తున్నాడు .. పరిశోధన వ్యాసాలు ..అంతర్జాతీయ పత్రికలలో వ్రాస్తూ ఉండేవాడు ..కొంతకాలం గడిచింది .
తన కొడుకు పెళ్ళి అవడం లేదని ..తల్లిదండ్రులు బాధ పడుతూ వెళ్ళిపోయారు .శివ నారాయణ ప్రతిభ గమనించి న ఒక ప్రవైట్ సంస్థ వారు కాస్తంత బ్యాంక్ లోన్ ఇప్పించారు ..దానితో విదేశం ఎగిరిపోయాడు ....
**                       **                  **                     **                                 **
డాక్టర్ రమణ దంపతులు ..గీత పెండ్లిసంభ0ధం గురించి మాట్లాడుకొంటువున్నారు
నేను చెప్పేది కాస్తంత ఆలోచించు ..గీత కు ..కిరణ్ తో  పెండ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది ..కొంచం మెల్లగా మాట్లాడాడు ..డాక్టర్ ..ఏమిటండి ..మన అమ్మాయి గురించే మాట్లాడుతున్నారా ..కొంచెము గట్టిగా అడిగింది  డాక్టర్ భార్య ..తల ఊపాడు డాక్టర్ ..చూడండి ..ఇద్దరు డాక్టరు లు ఆయు ఏదో ఒక హాస్పిటల్ పెట్టుకుంటారు ..కాని ఇదేమి చోద్యం ..నాకు ఎందుకో సబబు గాలేదు అయి నా వాళ్ళ పెద్దవాళ్ళు కి ఏమనుకుంటున్నారో ...అస్సలు ఆ అబ్బాయి కి నచ్చిందో లేదో
మన అమ్మాయి కి ఇష్టమో కాదో చాలా తతంగం ఉంది ..కదండి దీర్ఘం తీసింది ..
అది ఓకే ..అమ్మాయి ని పిలిచి అడిగాను ..నీకు పెండ్లి చేద్దాం అనుకుంటున్నాని
అప్పుడు అమ్మాయి అమ్మ ని అడగండి ..నాకు ఏం తెలియదు అని వెళ్ళిపోయి0ది ..అందుకే నీ తో ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా ?అడిగాడు డాక్టర్ లేదండి ..నాకు ఏమి చెప్పలేదు ...సరే ..ఇంతకూ నీ అభిప్రాయం ఏమిటి ..అబ్బాయి మీద ..మళ్ళీ గట్టిగా అడిగాడు డాక్టర్ ....అబ్బాయి మంచివాడ0డి .....అయితే మీకు ఎందుకు అంత లా అనిపించింది ..సూటిగా అడిగింది డాక్టర్ భార్య ..నీకు నా భావన చెబుతా మొత్తం విను ..ఇప్పుడు అమ్మాయి ని బైట కూడా కొంతమంది డాక్టర్ పెళ్ళి కొడుకులుకూడా  అడుగుతూవున్నారు ..కానీ వాళ్ళ0దరికి అమెరికా వెళ్ళాలని గట్టి పట్టుదల తో ఉన్న వాళ్ళే వున్నారు ..నాకు అది ఇష్టం లేదు .మన కళ్ళముందు ..వాళ్ళు తిరుగాడుతూ ఉంటే ఎంతో సంతోషం ..ఉన్నది ఒక్క సంతానం .మనకూ వయస్సు మీద పడుతుంది కదా ..మన ఇంట్లో ఉండాలి ..నా క్లినిక్ లో ఇద్దరూ వైద్యం పెట్టుకుంటారు ..పైసా ఖర్చు కూడా అవసరం లేదు.ఎంతో ఆశ గా చెప్పుకుంటూ పోతున్నాడు డాక్టర్ రమణ ..మీరు భలేవారండి ...అస్సలు అమ్మయు ని అడగలేదు ..అబ్బాయి ని  అడగలేదు ..వాళ్ళు  ఇక్కడ  ప్రాక్టీస్ చేసుకుంటారో లేదో ..ఏమి తెలియదు ...ఎలా అండీ ..మరోసారి దీర్ఘం తీస్తోంది డాక్టర్ భార్య ..అదే .. ముందు ..తమరి అభిప్రాయం చెబితే  మిగతా పని నేను  చేసుకుబోతాను ..కొంచెము విసుగ్గా అన్నాడు డాక్టర్ రమణ ..అది కాదండిమన బంధువులలో ఇంతకాలం అనుకుంటారు గా గొప్ప సంబ0ధము..ఏదో చేస్తామని ఊహిస్తారు గా..ఇలా ష డ న్ గా ..తేలిక పాటి సంబ0ధము చేసేస్తే ..కొంచెము సందేహంగా  ముఖము పెట్టింది డాక్టర్ భార్య ..ఎవరు బంధువులు ..నాకు నువ్వు అమ్మాయి ..అల్లుడు ఇంకెవరు ..ఎవరికి ఎవరు ..అన్నట్లు ఉన్నాయి రోజులు ..డబ్బు ఉంటే బంధుత్త్వం ..లేకపోతే లేదు అలా ఉన్నాయి బంధువులు కాదు రాబందులు ....నాకు ఎంతోమంది స్నేహితులు వున్నారు ..అందులో కొద్దిమంది ప్రాణ స్నేహితుల0 ఉన్నాము ..వాళ్ళు ..మనకు చాలు ...బంధువులు నన్ను ఎంత గా అవమానం చేశారో నా చిన్న తనం నుంచి అనుభవం ఉంది ...అలా ఆవేశ0గాచెప్పుకు పోతున్నాడు డాక్టర్ రమణ ..అబ్బాయి ..వైపు నా వైపు క్లియర్ ..ఇక అమ్మాయి ని అడిగి చెప్పు ..అంటూ మేడ పైకి వెళ్ళిపోయాడు ..డాక్టర్ ....

                                                                         (ఇంకా ఉంది ..to be continued.......... 


0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online