🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻జంతువులకు జీవనోపాధి నరుని వలన జరుగనక్కరలేదు. ప్రకృతి యందు సహజముగా అన్న పానీయాదులు జరుగుచుండును. కనుక జంతువులు సూటిగా ఈశ్వరుడు కల్పించిన వృత్తి యందు జీవించుచుండును.
అట్టి జంతువులను హింసించువాడు అంధకూపము అనబడు నరకమున త్రోయబడును. అది ఒక చీకటితో నిండిన పెద్ద నూతి వంటి కన్నము. అందు వివిధములైన క్రూరజంతువులు, రాబందుల వంటి డేగల వంటి పక్షులు, సర్పములు, పెద్ద పెద్ద నల్లులు, దోమలు తన దేహమును కొరికి రక్తము త్రాగి మాంసము తినుచు హింసించును.
క్షణ కాలము నిద్రకు కూడా విరామము లేని జీవితమును అనుభవింపవలసి వచ్చును. ఇది చెడిపోయిన దేహమునందు జీవించుట తప్పనిసరియైన పరిస్థితిని కల్పించి, ఆ రూపమున అనుభవమగును. అప్పుడు అతడు చనిపోయిన వానితో సమానుడుగనే బ్రదుకును. అచ్చట హింసించు భయంకర జీవులన్నియు తాను పూర్వము హింసింపగా బాధపడిన జంతువులే.....✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-145.
0 comments:
Post a Comment