గుండె దడ గురించి తెలుసుకుందాం:-
*******************************అస్సలు గుండె దడ అనగానే పడుకుంటే చెవిలో రైలు పెట్టెల చప్పుడు ..వినిపిస్తుంది ..దుప్పటి కప్పుకుంటే కాలి వేళ్ళ కు దుప్పటి అంచులు తగిలే చోట టక్ ..టక మని కొడుతూన్నట్లు స్పర్స తెలుస్తూవున్నట్లు ఉంటుంది .చెస్ట్ కొంచెము బరువు అనిపించడం కూడా ఉంటుంది...అయితే దడ రాగానే భయపడతాం ...భయపడితే ఇంకాస్త పెరుగుతుంది అలా ..దడ ..కి
భయానికి సంబ0ధం ఉంది ..ముఖ్యంగా ముందుగా మనం తెలుసుకోవాల్సింది గుండె దడ అనేది ఒక రోగం కాదు ..మధ్య మధ్య ఒకసారి ఎవరికైనా అనుభవం లోకి వస్తూవుంటుంది ..దడ ..మనిషి భయాందోళనకు గురి అయినప్పుడు ..ఏదైనా ఉద్రిక్తతలు కు లోను అయునప్పుడు గుండె అదనపు వేగంతో ను...అదనపు శక్తి తో ను పనిచేయాల్సిన అవసరం ఉంటుంది .ఈ ప్రయత్నం లో ఎవరి గుండె చప్పుడు వాళ్లకు ..తెలుస్తుంది..ఇది తాత్కాలికమే కొంత కాలానికి ఇది సర్దుకుంటుంది ....సాధారణంగా వచ్చే జలుబులు ...చిన్న చిన్న ..ఇన్ఫెక్షన్లు ..టీ.. కాఫీలు అతిగా త్రాగడం ..అలానే మద్యం త్రాగడం ఇటువంటివి కూడా గుండె దడ కు కారణం అవుతూ ఉంటాయి ..అది తెలియక విపరీతమైన ఆందోళన ..అలజడి కి గురి అవుతూవుంటారు .ఆందోళనలు ఎక్కువగా వున్నప్పుడు గుండెదడ రావడం సహజం ..ఎప్పుడో ఎక్కడో ఒకటి..రెండు కేసులలో గుండె జబ్బులు ఉన్నవారికి కూడా గుండెదడ కనిపిస్తూవుంటుంది ...వైద్యులు ఈ సి జి నుంచి రక్త పరీక్షలు వరకు చేయుంచి ఆ ఫలితాలను బట్టి నిర్దారిస్తారు ...ఇక షుగర్..లేదా డయాబెటిక్ వాళ్ళు వాడుతున్న మందులు వల్ల ..ఒకొక్కసారి హై పవర్ ఇస్తారు .అలాంటప్పుడు కొన్ని విటమిన్లు ఖనిజాలు ..లోపం వల్ల ..కూడా దడ గా అనిపించి చెమటలు పోస్తాయి ..ముఖ్యంగా షుగర్ పేషేంట్ లకు ..బి విటమిన్ లోపం ..అలానే ఐరన్ లోపం తప్పకుండా వస్తాయి ..అందుకే వైద్యులు షుగర్ కంట్రోల్ మందులతో పాటు ..బలానికి మందులు కూడా ఇస్తారు ..ఇంకా అజీర్ణం ..తో గ్యాస్ సమస్యల తో బాధపడేవారు కూడా ఈ గుండె దడ తో సతమతం అవుతూవుంటారు ..అటువంటి వారికి ..వైద్యులు పరగడుపున ఒక గ్యాస్ టాబ్లెట్ రాస్తూ వుంటారు ..pantap 20..లేదా pantap40 కూడా ఇస్తూ వుంటారు ..ఆయుర్వేదంలో ..alsarex ..అని టాబ్లెట్స్ ఉంటాయి ..అది పరగడుపున రోజూ ఒకటి వేసుకోవాలి..ఇంకాస్త సమస్య ఎక్కువగా ఉంటే రాత్రి అన్నము ముందు ఒకటి తీసుకోవాలి ..ఇది ఆయుర్వేదంలో ..ఇక గృహ వైద్య0 లో జీలకర్ర ..వెయుంచి పొడి చేసుకొని ..అన్నం తినే ప్రారంభములో తొలిముద్దలో ఆ జీలకర్ర పొడిని కొద్దిగా ఆవునేయు వేసుకొని కొద్దిరోజులు కలుపుకొని అలా తింటే కూడా దడ తగ్గుతుంది .షుగర్ పేషంట్ లలో .కొంతమంది కి నోరుకూడా ఎండిపోతుంటుంది .వారు జాంబ వాసవది తానిక్కు ..ఆయుర్వేదంలో ఉంటుంది దానిని తెచ్చుకొని ఉదయం రెండు చెమ్చాలు +రెండుచెంచాలు నీటితో కలిపి ..మళ్ళీ సాయంత్రం కూడా అలానే చేస్తుంటే ..కూడా ఆ సమస్య లు నుంచీ బైటపడవచ్చు లేదా ఇవేమీ సిమటం లు లేక దడ ఉంటే అప్పుడు
అలాంటి గుండె దడ నివారణ కి ఆయుర్వేదంలో ..అశ్వగ0దారిష్ఠ ..అనే టానిక్కు దొరుకుతుంది ..దానిని తెచ్చుకొని ..ఉదయం.. సాయంత్రంరెండు రెండు చెంచాలు స మాన0గానీరు కలిపి తీసుకోవాలి ..ఇది బలాన్ని ఇస్తుంది అదే ఇంగ్లీష్ మందులలో బలానికి వైద్యులు . Nueroprime plus అనే క్యాప్సిల్ కూడా ఇస్తూవుంటారు ..ఇందులో అన్ని మినరల్స్ ఉంటాయి జింక్ ఇనుము ..మెగ్నీషియం ఇలా ఉంటాయి ..10 తెచ్చుకొని రోజూ ఒకటి బ్రేక్ పాస్ట్ ..లేదా డిన్నర్ తరువాత వేసుకోవాలి ..ఇవి ఏదైనా అంతే ..తిన్న తరువాతే ...కొంతమంది gas కంట్రోల్ కూడా ఒకటి కల్పి వేసుకుంటారు ..ఎందుకంటే ఖచ్చితంగా కొద్దిగా గ్యాస్ వస్తుంది అందుకే panta dec... pantajole .rantac150 ఇలా ఎదో ఒకటి కల్పి వేసుకుంటారు కొంతమంది ఇక కొద్దిలో అయితే ... .Nurokind 500 ..nurokind HR ...nurokind total ..లేదా Metucobal 500 mg.. లేదా mecofol. లాంటివి bevan బలానికి టానిక్కు ..ఇంకా B plex fort ..B కాంప్లెక్ ...బీకాసెల్స్ ..అంటే బి విటమిన్ విత్ సి
అన్నమాట ..jincovit ..లాంటివి ఎన్నో వున్నాయి ..వీటి అన్నింటిలో ..nurokind500 అనేది కొంచం తేలిగ్గా జీర్ణం అవుతుంది అనిపిస్తుంది gas అంత పెద్దగరాదు.. ఇంకోటి methucobal 500 కూడా అంతే .దీనిలో injection కూడా ఉంటుంది. షుగర్ పేషె0ట్లు నీరసంగా వున్నవాళ్లకు .....ఇంకానీరసంగబాధపడే ముసలివారికి కూడా వెనువెంటనే బలం రావడానికి కూడా ఈ ఇంజెక్షన్ చేస్తుంటారు వైద్యులు ఇది ఒకొక్కటి 100 rs ఉంటుంది ...అలానే పూర్వకాలంనుంచి నైరోబిన్ అనే ఇంజెక్షన్ లు కొని 3 రోజులకు ఒకటి చొప్పున ఒక 4 లేక 5 ఇంజెక్షన్ న్లు కోర్స్ కూడా వ్రాస్తూ వుంటారు వైద్యులు ..ఇక blood తక్కువగా ఉండటం వల్ల వచ్చే నీరసం ..దడ అప్పుడు hemaup jems అనే గోలీ ల సీసా లేదా టానిక్కు వ్రాస్తారు ..ఇది వెను వెంటనే బ్లడ్ ని శరిరం లో బ్లడ్ శాతాన్ని పెంచుతుంది ..దీనికి గృహ వైద్యం లో క్యారెట్ ,బీట్రూట్ ..కలిపి రోజూ జ్యూస్ లా త్రాగితే కూడా బ్లడ్ శాతం పెరుగుతుంది ..అప్పుడు ఆయాసం గుండెదడ చెమటలు నీరసం ఇలా అన్ని తగ్గిపోతాయి ..ఇక కొంతమంది కి కొత్తగా బీపీ షుగర్ వచ్చిన మొదటి నెలల్లో ఆ పేషేంట్స్ లో నిద్ర లో అర్దరాత్రి బీకారంగా గుండె వేగంగా కొట్టుకొని లేచి కూర్చుంటూ ఉంటాం ..మళ్ళీ. తగ్గగానే పడుకుంటాం మళ్ళీ రెండు ...మూడు గంటలు తరువాత అంతే ..అలానే దడ లావస్తూవుంటుంది ......వాళ్ళు .బీపీ ..ఇంకా ఇతర మందులు ఏవీ అపకుండానే .ప్రభాకర వటి అనే ఆయుర్వేదం. టాబ్లెట్స్ దొరుకుతాయి ..అవి తెచ్చుకొని ..ప్రతి రోజూ పడుకొనే ముందు రాత్రి పూట వేసుకొని పడుకోవాలి అలా చేస్తూ ఉంటే ఆ దడ తగ్గిపోతుంది ....
కాబట్టి ముందుగాదడ దేనివల్ల వస్తుంది తెలుసుకోండి ..గ్యాస్..అజీర్ణం అయితే దానికి ముందు ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకొని చూడండి ..ఆ స
మస్య ఎక్కువగా ఉంటే పరగడుపున pantap 20 ...బాగా ఉంటే pantab40 కొద్దిరోజులు వేసుకోండి ..ముఖ్య0గా 40 స0 లు వయస్సు దాటిన తరువాత వేళ దాటి భోజనం చేస్తే కూడా కడుపు ఉబ్బరం.. దడ ఎక్కువగా ఉంటాయి ..అందుకే వేళకు భోజనం చేయండి ..బాగుంది కదా అని పొట్టని0డా కుమ్మేయకండి ..కొంచం తక్కువగా తినడం వల్ల కూడా దడ ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంది ..అజీర్ణం ..గ్యాస్ వల్ల వచ్చే దడ ఎలా ఉంటుంది అంటే చెస్ట్ లో మధ్యలో పై నుంచి క్రిందికి బండ రాళ్లు డొల్లిస్తున్నట్లు ..లోపల ఏదో తెలిపోతున్నట్లు ..భయ భయం గా అనిపిస్తూవుంటుంది. అప్పుడు వైద్యులు దానికి cremalphin అనేసిరప్ కూడా వ్రాస్తూవుంటారు .అలానే మరో ముఖ్య విషయం మాల విసర్జన బాగా జరుగుతుందా ..సాఫీగా.జరుగుతుందా .లేదా చూసుకోవాలి ..అలా గుండె దడ ఎందుకు వస్తుందో ముందు మనమే ..మనపై రీసెర్చి చేసుకోవాలి ..మానసిక కారణమా ..శారీరక కారణమా ..తెలుసుకోవాలి ..అప్పుడు చికిత్స చేసుకోవచ్చు .మానసిక ము అయితే ..సమస్యల నుంచి బైట పడాలి ..తప్పు చేస్తే దైవం ఎదుట కూర్చొని ఇక ముందు ఎప్పుడూ ఇలాంటివి చేయను అని చెప్పుకొని మంచి రూట్ లోకి వెళ్ళాలి ..అంతే కానీ దానినే బట్టుకొని ఏడిస్తే ఏమి లాభం ఉండదు .....ఇక పైన సూచించిన మందులు అపాయం చేసేవి కావు ..సాధారణ మైనవే ..వాడవచ్చు ...అయితే .కిడ్నీ,,లివర్ ఇతర పెద్ద సమస్యలు ఉన్నవారు మాత్రం ఏది వేసుకోవలన్నా వైద్యులను సంప్రదించాలి ..
అలానే దడ తో పాటు పల్స్ ఎక్కువ గా ఉంటుంది కొంతమందికి ..అంటే 120/80బి.పి ....ఇక పల్స్ నాడి 72 సార్లు ఒక నిమషానికి గుండె కొట్టుకోవడం నార్మల్ ..అది 72కి మించి 100 కి వెళ్లిపోవడం అలా దాటి ఇంకా ఎక్కువ వెళ్లిపోవడం ...అలా జరుగుతున్న ప్పుడు ..వైద్యులు సెలైన్ ..డిప్ బలానికి పెడతారు ..ముఖ్యంగా ఇది పెద్ద వయస్సులో వారికి జరుగుతూవుంటుంది ...... అలానే అస్సలు తినకుండా ..ఉపవాసాలు వుండే పెద్దవాళ్లకు కూడా ఇలా అవుతూ ఉంటుంది ..
తగ్గించుకునేందుకు సూచనలు :-ముఖ్యంగా దడ గా వున్నప్పుడు వెన్నుపము కి అంటే వీపు పై నుంచి క్రింది వరకు వెన్నుపాము కి ప్రాముఖ్యం ఇస్తూ మొత్తం కొబ్బరి నూనె .రాఁయుంచు కోండి ..మామూలు గా పులిమితే..కొద్దిగా మర్ధ న చేస్తే ఏ వయస్సు వారికైనా దడ తగ్గిపోతుంది ..చేసి చూడండి *******************..ఒక్కోసారి కమ్మని మజ్జిగ తో అన్నం పిసికి పలుచగా చేసుకొని త్రాగి చూడండీ...పుల్లని మజ్జిగ వద్దు ..
***************************
గుండె దడ ఎక్కువగా వున్నప్పుడు మరీ వేడిగా వుండే పదార్థాలను తినగూడదు ..కషాయం.,.చేదు,కారం ,రుచులను తగ్గించుకోవాలి ఎక్కువగా తినడం ,లేదా తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు .
మల మూత్ర విసర్జన లు ఆపుకోకూడదు..పైగా సాఫీగా ..మంచిగా ఆ విసర్జనలు జరిగేలా చూసుకోవాలి .
కాఫీ లు టీ లు కూల్ డ్రింక్స్ వాడటం తగ్గించాలి ..అలానే.ఒక్కొక్కసారి టీ కంటే కాఫీ వల్లనే దడ పెరిగే అవకాశాలు ఉన్నాయి
పొగ త్రాగడం మనివేస్తే మంచిది .
మానసిక0గా ..ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి ...ప్రాణాయామం చేయండి
మెల్లగా మాట్లాడాలి ..బిగ్గరగా అరిచి ఆవేశంగా మాట్లాడితే కూడా దడ పెరుగుతుంది ..
ముఖ్యంగా కొవ్వు లు ,నూనెలు పదార్ధాల వాడకాలు తగ్గించుకోవాలి
ఇక మరీ గుండె దడ ఎక్కువగా వున్నప్పుడు ..ప్రధమ చికిత్స గా ఐ స్ గడ్డలని నల్లగ్గొట్టి ..ఒక బ్యాగ్ లో వేసి ఛాతి పై పెట్టుకుంటే ..కూడా దడ తగ్గిపోతుంది ..
కాబట్టి ముందు మీ అలవాట్లు ..భోజన వేళలు ..సరిచూసుకోండి ..ఆతరువాత బలం కోసం మంచి ఆహారం తీసుకోండి ...కనీసం 6...లేక 7 గంటలు మంచి నిద్ర పోవటానికి ప్రయత్ని0చాలి...అనవసరమైన విషయాలు జోలికి పోకుండా ఉన్నదానితో సంతృప్తి చెందుతూ మీ ఇష్ట దైవం ని ప్రార్ధన చేసుకోండి ..మంచి ఆకుపచ్చనిచెట్లు ప్రకృతి గల ..ప్రదేశములో కొద్దిసేపు గడపండి ..జై శ్రీధన్వంతరీ నారాయణాభ్యా నమ:🙏🌷🌹🌴🌴
0 comments:
Post a Comment