Pages

☀️🌝🌞నా అనుభవం ...ఒక భావన గా వ్రాశాను ..కవిత లా వుందో లేదో కానీ ...భావన concept అనవచ్చు ☀️🌝🌞

                         💥వెలుగురేఖ 💥

                  ************************
లోకులు కాకులు... బంధువులు రాబందులు
నిన్ను నీ కుటుంబాన్ని. ..వెక్కిరిస్తుంటారు
లోటుపాట్లు వెతికి మరీ విమర్శకు దిగుతారు
కాలం వెమ్మటి పరుగులు పెడుతూనేవుంటాము
కావాల్సిందేదో అదే దక్కక అగచాట్లు పడుతూవుంటాం
భగవంతుడి దయ కోసం వెంపర్లాడుతూనేవుంటాం
కళ్ళముందే ..ఆ విమర్శకులు అందరూ గోప్పవాళ్ళైచక్రం తిప్పుతూవుంటారు
సిరులు అన్నీకలబోసిన కాలచక్రం వాళ్ళచెప్పు చేతల్లో ఉంటుంది
క్రింద పడ్డవాణ్ణి  పరిహసిస్తారు కావాలనే పని కట్టుకొని వస్తారు
పడ్డవాడ్నిలేపరు ..వికట్టహాసంతో తొక్కుకుంటూవెళ్లిపోతారు
చుట్టూ .గాఢ మైన చీకటి ..మిణుకు మిణుకు మనే ఒక ఆశ
అది కూడా అరిపోతూవుంటే తెలియని దైవకటాక్షం ఏదో
తైలం లా పోసుకుంటాం ..మళ్ళీ రగుల్చుకుంటాం
ఎంతకాలం ?ఈ రగిలించుకోవడం, వెలిగించుకోవడం
విసుగుతో లాగుతున్నబండి పడేసి చతికీలబడతాము
కళ్ళు లోఎప్పుడూ నిండుకుండల్లాకన్నీళ్ళువుంటాయు
మనస్సులో దు:ఖం మంచుఅవిరిలా ఎప్పుడూకురుస్తూనేవుంటుంది
కళ్ళ ను దాటి రావు ..ఆబాధా సముద్రపునీటిచుక్కలు
బాధా సముద్రానికి చెలియకట్ట ఆ క0టిపాపలు
మనస్సు బండ రాయుగా మారిపోతుంది
దానిపై ఉలిడెబ్బలు పడుతూనే ఉంటాయి ఎన్నో గాయలుఅవుతూవుంటాయు
మనస్సు లోని మొలకెత్తినఆశలపై కన్నీటి చిలకరింతలు ..
చావకుండా బ్రతక్కుండా ..ఉన్న జీవశ్చవ ఆశయాలు ..ఆశలు
నువ్వే విత్తువై మొక్క వై చెట్టువై మహావృక్షమై ఎదగాలి ..తల ఎత్తుకు నిలబడాలి
అవసరం అయితే గడ్డిమొక్కలా వదిగివుండాలి .దిగివుండాలి
వచ్చే పోయే గాలి వానలు అప్పుడు నిన్ను ఏమీ చేయలేవు ...
కృషి కి పదును పెట్టు ..నీకష్టాన్ని నమ్ముకో ..స్వేదం తుడుచుకో
ఉలిదెబ్బలతరువాత అందమైన శిల్పం వస్తుంది
మిణుకు మిణుకు మనే ఆశ ల ను జ్వల గా రగిలించుకో
కన్నీళ్లు తుడుచుకో ..అవమానపు అనుభవాలు గుర్తుతెచ్చుకో
కసి...కసి గా.కృషితో ఋషి గా దీక్ష పట్టి ముందుకు నడువు
నీకులపో ళ్ళు ..నీ చుట్టాలు.. మేలు ఏదో చేస్తారని .ఆశపడకు
ఆశపడిభంగ పడకు ...పూర్వానుభవాలు మర్చిపోకు ..ముందుకు సాగిపో
చీకటి దారిలో నడుస్తూ నే ఉన్నావు ..అలా చాలదూరం నడిచావు ..
వెలుగురేఖ ఎక్కడో దూరంగా కొండలపై పరుచుకుంటూవస్తోంది ..
💥🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴💥

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online