Pages

🌷 కొన్ని ముఖ్యమైన భక్తి సాహిత్యం లో విషయాలు..సే కరించ బడ్డాయు ..చదివి ఆనందించండి🌷

 మనసా,వాచా,కర్మణా అంటేఏమిటి?* 

ఒకసారి శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు...

గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట...

 _" నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షమించండి ” అని ప్రాధేయ పడ్డారు..._

*ఇది విన్న శిష్యులు “ ఆచార్యులవారు, ఏమి పాపములు చేశారో ప్రాయశ్చిత్తపడుతున్నారు ?” అని అనుకున్నారు...*

ఒక శిష్యుడు,ఏమిటిస్వామి ఆ పాపము నేను తెలుసుకోవాలి అనిఉంది, ఆచార్యుల వారిని అడిగాడు.

*దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు...*

1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను, సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను..."

అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను, అది  నేను చేసిన మొదటి దోషము అని సమాధానమిచ్చారు.

2. తైత్తిరీయ ఉపనిషత్తు లో          *"యతో వాచో నివర్తన్తే" అప్రాప్య మనసా సః* భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను.”ఇది నేను చేసిన  రెండవ తప్పు!

3. నిర్వాణ శతకం లో

*“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం*

*న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః*

*అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం “అని వ్రాశాను*

*అర్థము :*

నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు .మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము , భోజనము , భోక్త ( భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను , శివుడను ,శివుడను!


ఇంత వ్రాసికూడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను... అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. 

అందుకనే నేను చేసిన ఈ మూడవ తప్పు... 

ఈ తప్పులని మన్నించమని , ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు...

*నీతి :*

మన ఆలోచన , తీరు , మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి సంభాషణ మనకి తెలియజేస్తోంది...

బైట ప్రపంచం మన పని తీరుని మట్టుకె చూస్తుంది, భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.

*“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”*

ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధి తో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము.

చెప్పేది, చేసేది, ఆలోచించేది ఒక్కటే ఉండాలి దానినే త్రికరణ శుద్దిగా అంటారు...

 **************************************************************************************************

సామజవరగమన.. అంటే అర్ధం ఎంత మందికి తెలుసు 

_తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా, ఒక పాట హోరెత్తుతోంది. అదే  *సామజవరగమన !*_ 

_చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది. అలాగే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది.. కానీ చాలా మందికి "సామజవరగమన" అంటే ఏంటో తెలీదు.. *'సామజవరగమన' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది !*_ 

_'సామజ' అనగా "ఏనుగు" అని.. 'వరగమనా' అనగా "చక్కని నడక" అని అర్థం... అలాగే సామవేదం అనగా సంగీతం 

_మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం ! "సామజవరగమన" అంటే ఏనుగు లా గంభీరంగా, హుందాగా, ఠీవిగా నడిచేవారు అని అర్థం.. మరి అసలైన *"సామజవరగమన"* ఎవరు ??_

_అసలైన "సామజవరగమన.." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు... వాల్మీకి తన రామాయణంలో 'అరణ్యవాసం'లో ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను" డంటారు... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని... ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు.._

_చాలా మంది "సామజవరగమన" అంటూ పాడేస్తున్నారు... కానీ వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు.. దాని అర్థం ఏంటో తెలీదు... వారికి చెప్పేందుకైనా "సామజవరగమన" కీర్తన, దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం.._

_*సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥*_

_*సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥*_

_*వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।*_

_*స్వీకృత యాదవకులమురళీ !*_

_*గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥*_


_ఈ కీర్తన త్యాగరాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది.. ఈ కీర్తనలోని ప్రతి పదం శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది..._ 


_కీర్తన అర్థం... ఏనుగు నడకవంటి గంభీరమైన నడకతో, మునులు మానవుల హృదయాలను ఏలుతున్న ఓ శ్రీహరీ ! నువ్వు కాలంతో సంబంధం లేకుండా అందరిచే కొనియాడబడతావు.. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకు, దయకు ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి !_ 


_సామవేదము నుండి పుట్టిన సప్తస్వరముల వల్ల , ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానంతో అందరిని ఆనంద పరుస్తూ.. ఈ త్యాగరాజ వందనములను అందుకో ! .._

_ఇదీ 'సామజవరగమన'కు సంబంధించిన అసలు భావం ..

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online