................🌹🙏.🌙🌘🌘🌘ఓం నమో వెంకటే శాయ ..🌹🙏
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🌷🌷🌷🌷మాఘపూర్ణిమ. Live svbc TTD now🌷🌷🌷
మాఘపూర్ణిమ ..ఉత్సవాలు ఇంట్లో ఉండి వీక్షించండి ..ఇప్పుడు లైవ్ svb c టీటీడీ channal లో చూదండీ
తరించండి ..ఓం నమో వేంకటేశాయ🌹🌹🌹
🌹🌹🌹రేపు మాఘ మాసపు పూర్ణిమ ...మాఘపూర్ణిమ అనిపిలుస్తారు🌹🌹🌹ఓం నమోవేంకటేశాయ🌹🌹
*_రేపు మాఘ పూర్ణిమ , మాఘ పూర్ణిమ ప్రత్యేకత_*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పండితులు ...ఈ రోజుల్లో అందరూ కూడా ఏదో ఒకటి వ్రాసి నింపేస్తున్నారు ...ఈ కాలంలో ఆచరించాలి అంటే చాలా కష్టం ..భక్తి అతిగా తలకు పిచ్చిగా ఎక్కించుకొని ..అదే పనిగా వెళ్ళి కష్ట పడకండి ..మీ ఇంట్లోవారిని కష్ట పెట్టడం నష్ట పెట్టడం చేయకండి ..ఇంట్లో స్నానం చేసి శ్రీవేంకటేశ్వర స్వామివారివద్ద దీపారాధన చేసుకోండి ...పూవులు తో చక్కగా అలంకారం చేయండి .. మీ ఇష్ట దైవం దగ్గర అయినా చేసుకోండి నేను ఎందుకు అన్నన0టే ..కలియుగదైవం కలియుగములో దైవం అంటే శ్రీవేంకటేశ్వర స్వామివారే ..అన్ని ఇతర దేవుళ్ళు ఆయన లో చేరివున్నారు ఇప్పడు ఈ యుగములో ..మీకు ఏదైనా స్తోత్రం వస్తే హాయిగా కూర్చొని చదువుకోండి ..ఏది రాకపోతే ఓం నమో వేం కటేశాయ.. లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ..మీఇష్టం ,..ఏడా...పెడా పిల్లలను పెద్దలను వేసుకొని నది స్నానం సముద్ర స్నానం అంటూ వెళ్లి బాధలు పడవద్దు ..భగవంతుడు అంతా నిండి వున్నాడు అని ప్రహ్లాదుడు మనలాంటి వారికోసమే
నిరూపించి చూపించి వున్నాడు మీ ఇంట్లో ఫోటో ఎదురుగా కూర్చొని మనస్సులో పది నిముషాలు నామ జపం చేయండి చాలు ..భక్తి ..మనస్సులో నిలుపుకోవడానికే ఈ కథలు ..ఈ ..ఆచారాలు .అంతే. కానీ ఊరికే వెర్రి పెంచుకోవద్దు .కాబట్టి మీకు ఎంత వీలు అయితే అంత చేయండి ...లేదా కొద్దిసేపు స్వామి నామం భజన చేయండి ..తప్పనిసరిగా అక్కడ కి దైవం వస్తాడు గీత లో అదే చెప్పారు ..పైగా కలియుగములో భక్తి విషయంలో భ జన ఉత్తమమైన మార్గం...కలౌ కీర్తనం కేశవమ్ అందుకే అలా చేయండి ..వచ్చే పుణ్యం భక్తి ఉంటే చాలు అదే వస్తుంది హాయిగా జీవిద్దాం అందరిని సంతోషంగా ఉంచుదాం ..వుండనిద్దాం ..మనం అందరం సంతోషంగా జీవిద్దాం ..అదే భగవంతుడు ..అదే భగవతత్త్వం
ఇదంతా పండుగ ప్రాశస్త్యం తెలియాలని ...మీరు ఎంత చేయగలరో అది కూడా ఆనందంగా హాయిగా చేసుకోండి ..వ్రాసినవి అన్ని చేయలేము ....గురువులని ..పితృదేవతలను ఒకసారి తలచుకొని నమ స్కారం చేసుకోండి ..చాలు
*మాఘ పౌర్ణమి*
హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 27న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుం.
ఉదయ తిథి ఫిబ్రవరి 27న ఉంది పూర్ణిమ తిథి ప్రధానంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున , నదులలో స్నానం చేయడం మెరిట్ ఇస్తుంది. పౌర్ణమిని ఉపవాసం పాటించేవారు. 2021 ఫిబ్రవరి 26న సత్య నారాయణ వత్రం చేయించాలి. అయితే పౌర్ణమి రోజు ఫిబ్రవరి 27న స్నానం చేయాలి.
చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.
కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి.
మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.
*"మా - అఘం''* అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.
*"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ*
*బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''*
*"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''* అని అర్థం.
అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.
*☘మాఘం అమోఘం :☘*
మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. *"మా'' అంటే మహాలక్షీ. "ధనుడు''* అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని *"శ్రీపంచమి''* అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.
*"శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే*
*శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*
మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ *"శ్రీపంచమి''* నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు *"అక్షరభ్యాసం''* జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి *"రథసప్తమి''* పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని *"శివరాత్రి''* పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి *"భీష్మ ఏకాదశి''* పర్వదినం చేశాడు.
త్రిమతాచార్యులలో ఒకరైన *"మధ్వాచార్యుడు''* ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని *"మధ్వనవమి''* గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని *"కేతువు''* పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు *"మఖ''* నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి *"మాఘమాసం"* అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం .
*☘పితృయజ్ఞానికి ప్రాధాన్యత :☘*
మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు *"పైతృకాలకు''* ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని *"అర్ధోదయ పుణ్యకాలం''* అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం.
*☘మాఘపూర్ణిమ - మహామాఘి :☘*
మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే *"మాఘమాసం''*. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం *"మాఘపూర్ణిమ''* నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను *"మహామాఘి''* అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ *"మాఘ పూర్ణిమ''* అత్యంత విశేషమైనది. ఈ *"మహామాఘి''* శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.
*☘సముద్ర స్నానం ఎందుకు చేయాలి?☘*
*"నదీనాం సాగరో గతి:''*
సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం.
అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.
సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా *"ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ''* లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. *"స్నానం''* అంటే *"షవర్ బాత్''* చేయడమో , *"స్విమ్మింగ్ పూల్''* లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.
సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి *"నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి"* అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో *"మాఘ పూర్ణిమ''* స్నానం ముఖ్యమైనది.
సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ *"గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి''* నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం.
*☘మాఘ పూర్ణిమ స్నానఫలం :☘
ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*
. *సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.
ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ *"అంత్యపుష్కరిణీ స్నానాలు''* అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది
*☘మాఘస్నానం చేస్తున్నప్పుడు :-☘*
*"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*
*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*
*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*
*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''*
అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే *"దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు''* అని అర్థం.
ఆ తరువాత ...
*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*
*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*
అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే *"ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక''* అని అర్థం.
ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబలములు (దుప్పటిలు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు *"నేతితో తిలహోమం''* చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.
*☘తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :☘*
నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.
శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే *"తిలలు''* ... అనగా నువ్వులు.
తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే , శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు , మూడువంతులు తిలలు కలిపి శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.
మాఘపూర్ణిమనాడు *"తిల పాత్రదానము''* చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి -
*"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం*
*బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే''* అని సంకల్పించి -
*దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద*
*తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''*
అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి.
*☘చివరగా ఓ మాట☘*
మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి *"పోటు''* ఎక్కువగా ఉంటుంది. *"పూర్ణిమ''* దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం.
జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.
*ఓం నమో భగవతే వాసుదేవయ* మంత్రాన్ని జపించడం మంచిది.
*☘️మాఘ పూర్ణిమ వ్రత కథ..☘️
పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒక రోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీక దేవిని 16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీక దేవిని 16 రోజుల ఆరాదించడంతో కాళికా దేవి వారికి కనిపించింది. తల్లి కాళీక దేవి బ్రాహ్మణ భార్యకు గర్భం పొందటానికి వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది.
ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్ల , పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయండంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికా దేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికా దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు , కాబట్టి కాళికా దేని ఏమి చేయలేకపోయను. అప్పటి నుండి , పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా , ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరతాయు
ఒక సామాన్యుడు ఎలా ఎనాల్సిస్ చేసి మొత్తంచెప్పేశాడు ...చూడండి commonman.. village background
నిజమే నేను అనుకొనే. ఆలోచన ..resarch చేసిన వాళ్ళం చాలా కష్టపడి డాక్టరేట్ లు పొందిన వాళ్ళం అక్కడ ఇక్కడ పార్ట్ టైం లు చేస్తూ పొట్ట పోసుకోవడం . ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఘోరం ..పిహెచ్డీ పట్టాలు ఉన్న విద్యావంతులు కొన్ని చోట్ల పనికి ఆహారపధకం కు వెళ్లి కూలి డబ్బులు బ్రతకటానికి తెచ్చుకున్న వాళ్ళు వున్నారు ..అదే ..govt వారు అధిక మొత్తం లో జీతం ఇస్తూ ప్రభుత్త్వ టీచర్లు ను పోషిస్తూ వున్నారు ..అదే జీతం లో నలుగురు పీహెచ్ .డి లకు అవకాశం ఇవ్వవచ్చు ..పోనీ ఇంత జీతాలు ఇస్తూవుంటే ..వాళ్ళు సంతృప్తి గా ఉన్నారా అంటే src లు ,జీత భత్యాలు పై కమిటీ లు ..ఇంకా జీతాలు పెంచండి ..కరువు భత్యం ta da .లు అలెవెన్సులు ఇంక్రిమెంట్ లు ఇలా హాస్పిటల్ నుంచి రీయింబర్స్ మెంట్ ఇలా కొన్ని ప్రభుత్త్వ సంస్థలు నుంచి అందినంతవరకు పుచ్చుకోవడమే ..ఒక ప్రభుత్త్వ స్కూల్ ఉంది అనుకొండి దానిలో ఒక 15 మంది పెద్దస్కూల్ సిటీస్ లో అయితే 20 మంది ఉంటే తలా 50వేలు వేసుకున్నా నెలకు 10 లక్షలు జీతాలు ఇవ్వాలి ..మరి ఆ స్కూల్ కి వచ్చే ఆదాయం ఎంత ?ఇలా ఎన్ని స్కూల్స్ మండల ,జిల్లా స్థాయిలో లెక్కించండి ..ఏమిటండి మీకు వాళ్ళ మీద అసూయ తో అంటువున్నారా ..అంటే ఇది నా మాట కాదు బైట పబ్లిక్ అంటువున్నారు ...పైగా అస్సలు సెలవు లు ఎక్కువ అందులో లాకడౌన్ ..పదినెలలుఖాళీ గా ఇంట్లో వుండి ..మళ్ళీ కరువు భత్యం అంటువున్నారు ..అని బయట జనం విసుర్లు ..నా అభిప్రాయం అధికానే కాదు ..నా వాదం ఉన్నత విద్యా వంతుల సేవలను వాడుకొని వాళ్ళకు టుంబాలకు అన్నం పెట్టండి ...అదే నేను చెప్పేది ఒక టీచరు కు ఇచ్చే జీతం లో నలుగురు నిరుద్యోగులు ..మేధావులు బ్రతుకుతారు ..ఒక చిన్న స్కూల్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ జీతం ఖమ్మం జిల్లా లో అక్షరాల 50 000 రు ఒక నెలకు ..అది 1 తరగటినుంచి 5 వ క్లాస్ వరకు ఉంటుంది ..ఇక కొన్ని. రేడియో దూరదర్శన్ లాంటి కేంద్ర ప్రభుత్త్వ సంస్థల్లో పార్ట్ టైం వ్యుద్యోగం చేశాను ..అక్కడ కూడా వాళ్ళ ..జీత్ భత్యాలు కాకుండా ఇంక్రిమెంట్లు ..అని డి .ఏ లని మాత్రమే కాకుండా కన్ను ఆపరేషన్ ఆయునా కూడా బిల్లులు పెట్టి ప్రభుత్త్వం నుంచి వసూల్ చేయడం ..ఒక వ్యుద్యోగి కి మాత్రమే కాదు వాళ్ళ కుటుంబం మొత్తానికి ...కూడా ఇదే ..మరి ప్రభుత్త్వరంగ సంస్థలు దివాలా తీయక ఇంకేముంటుంది చెప్ప0డి ..
అందుకే రేడియో దూర్ దర్శన్ లు కూడా మూత పడే పరిస్థితి వచ్చింది ..అలానే పీజీ పూర్తి కాగానే పార్ట్ టైం కాలేజీ లో చేరాను .ఎంత కాలం ఆయునా. చెప్పిన పీరియడ్స్ కి మాత్రమే డబ్బులు వచ్చేవి సెలవుల్లో ఏమి ఉండవు ..ఇక రీసెర్చ్ లో సీటు వస్తే సీనియర్ లెక్చరర్ లు వెళ్ళుఇది ఎక్కడికి పోదు అని అన్నారు. ..నేను వచ్చి రీసెర్చి లో వుండగానే కాలేజీలో పనిచెస్తున్నవారిని పర్మినెంట్ చేసి ..యూజీసీ వేతనాలు 70 to 80 వేలు ఇస్తూవున్నారు ...చివరికి ఇటు
పీ హెచ్.డి చేసిన కస్ట0 ఉత్తగనే పోయుంది ..ప్రభుత్త్వాలకు ..ఒక పద్ధతి లేదు కుర్చీ కోసం ఎంతకైనా దిగజారి పోతాయి ..ఒక పద్ధతి ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తే ఒక పద్ధతి ..పోనీ పార్ట్ టైం చేసిన వారికి కొన్ని గ్రేస్ మార్కులు ఇవ్వవచ్చు అంతే కాని ఓట్ల కోసం పరిమి నెంట్ చేస్తే పై చదువులు చదివి న వాళ్ళు ఏం కావాలి ....యూనివర్సిటీ లో ప్రొపెసర్ వ్యుద్యోగాలు అలానే ఉన్నాయి ..సామాన్యులకు అందుబాటులో లేవు ..అన్ని కులాలు వారి పరిస్థితి అలానే ఉంది అంగ బలం అర్థ బలం ఉన్నవాళ్లకే రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉన్నవారికి అవకాశాలు అయితే ప్రవైట్ రంగంలో మాత్రం ప్రతిభ ఉంటే పైకి ఎద గ వచ్చు...కాకపోతే ఎప్పటికప్పుడు కొత్త కొత్త జ్ఞాన ..విజ్ఞానం తో update అవుతూవుండాలి ..నిజమైన ప్రతిభావంతులు ..కష్ట పడే వారు ప్రవైట్ రంగంలోనే స్థిరపడాలని కోరుకుంటారు ..
నెలలు
☀️🌝🌞నా అనుభవం ...ఒక భావన గా వ్రాశాను ..కవిత లా వుందో లేదో కానీ ...భావన concept అనవచ్చు ☀️🌝🌞
💥వెలుగురేఖ 💥
************************లోకులు కాకులు... బంధువులు రాబందులు
నిన్ను నీ కుటుంబాన్ని. ..వెక్కిరిస్తుంటారు
లోటుపాట్లు వెతికి మరీ విమర్శకు దిగుతారు
కాలం వెమ్మటి పరుగులు పెడుతూనేవుంటాము
కావాల్సిందేదో అదే దక్కక అగచాట్లు పడుతూవుంటాం
భగవంతుడి దయ కోసం వెంపర్లాడుతూనేవుంటాం
కళ్ళముందే ..ఆ విమర్శకులు అందరూ గోప్పవాళ్ళైచక్రం తిప్పుతూవుంటారు
సిరులు అన్నీకలబోసిన కాలచక్రం వాళ్ళచెప్పు చేతల్లో ఉంటుంది
క్రింద పడ్డవాణ్ణి పరిహసిస్తారు కావాలనే పని కట్టుకొని వస్తారు
పడ్డవాడ్నిలేపరు ..వికట్టహాసంతో తొక్కుకుంటూవెళ్లిపోతారు
చుట్టూ .గాఢ మైన చీకటి ..మిణుకు మిణుకు మనే ఒక ఆశ
అది కూడా అరిపోతూవుంటే తెలియని దైవకటాక్షం ఏదో
తైలం లా పోసుకుంటాం ..మళ్ళీ రగుల్చుకుంటాం
ఎంతకాలం ?ఈ రగిలించుకోవడం, వెలిగించుకోవడం
విసుగుతో లాగుతున్నబండి పడేసి చతికీలబడతాము
కళ్ళు లోఎప్పుడూ నిండుకుండల్లాకన్నీళ్ళువుంటాయు
మనస్సులో దు:ఖం మంచుఅవిరిలా ఎప్పుడూకురుస్తూనేవుంటుంది
కళ్ళ ను దాటి రావు ..ఆబాధా సముద్రపునీటిచుక్కలు
బాధా సముద్రానికి చెలియకట్ట ఆ క0టిపాపలు
మనస్సు బండ రాయుగా మారిపోతుంది
దానిపై ఉలిడెబ్బలు పడుతూనే ఉంటాయి ఎన్నో గాయలుఅవుతూవుంటాయు
మనస్సు లోని మొలకెత్తినఆశలపై కన్నీటి చిలకరింతలు ..
చావకుండా బ్రతక్కుండా ..ఉన్న జీవశ్చవ ఆశయాలు ..ఆశలు
నువ్వే విత్తువై మొక్క వై చెట్టువై మహావృక్షమై ఎదగాలి ..తల ఎత్తుకు నిలబడాలి
అవసరం అయితే గడ్డిమొక్కలా వదిగివుండాలి .దిగివుండాలి
వచ్చే పోయే గాలి వానలు అప్పుడు నిన్ను ఏమీ చేయలేవు ...
కృషి కి పదును పెట్టు ..నీకష్టాన్ని నమ్ముకో ..స్వేదం తుడుచుకో
ఉలిదెబ్బలతరువాత అందమైన శిల్పం వస్తుంది
మిణుకు మిణుకు మనే ఆశ ల ను జ్వల గా రగిలించుకో
కన్నీళ్లు తుడుచుకో ..అవమానపు అనుభవాలు గుర్తుతెచ్చుకో
కసి...కసి గా.కృషితో ఋషి గా దీక్ష పట్టి ముందుకు నడువు
నీకులపో ళ్ళు ..నీ చుట్టాలు.. మేలు ఏదో చేస్తారని .ఆశపడకు
ఆశపడిభంగ పడకు ...పూర్వానుభవాలు మర్చిపోకు ..ముందుకు సాగిపో
చీకటి దారిలో నడుస్తూ నే ఉన్నావు ..అలా చాలదూరం నడిచావు ..
వెలుగురేఖ ఎక్కడో దూరంగా కొండలపై పరుచుకుంటూవస్తోంది ..
💥🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴💥
🥀🥀🥀🥀పీఠాధిపతి స్వామీజీ చెప్పిన విషయాలు వినండి జ్ఞానం ..భక్తి ..మోక్షం గురించి ఎంత బాగా చెప్పారో 🥀🥀🥀🥀
🌹🌹🙏శ్రీశివ భగవానుని నమక చమక మంత్రాలు అభిషేకం చూడండి కనీసం విన్నా ఎన్నో శుభాలు లాభాలు కలుగుతాయి 🌹🌹🙏
🌷🌷🌷 జయ శ్రీ మన్నారాయణ. ..జయ శ్రీ శివ నారాయణ జై సాయునారా యణా. 🌷🌷🌷
🌹🌹🌹 ,ఓం నమో వే0కటేశాయ🌹🌹🌹🙏 🌷🌷🌷🌷ఈ నాటి వేదపారాయణ0 చూడండి ..ఆ విజ్ఞానం తెలుసుకొని విని తరించండి🌷🌷🌷🌷🙏
🙏🙏 🌹🌹🌹🌹ఓం నమో వేంకటేశాయ🌹🌹🌹🌹🙏🙏
🌹🌹🌹నీవు ఒక్కడివే సర్వాధారం.... అనే శ్రీవేంకటేశ్వర స్వామి వారిగురించి న బ్రహ్మో త్సవ పాట ను వినండి తరించండి🌹🌹🌹
🌹🌹🌹🙏రథ సప్తమి నాడు ఏడుకొండల స్వామి కలియుగదైవం ఊరేగింపు ఉత్సవాలుచూడండి ...సకలశుభాలునుపొందండి🌹🌹🌹🙏
🌷🌷🌷🌷🌷🙏🙏🙏రథ సప్తమి శుభాకాంక్షలు🙏🙏🙏🌷🌷🌷🌷🌷
🌷🌷🌷🙏🙏🙏*రథసప్తమి: శుభాకాంక్షలు 🙏🙏🙏🌷🌷🌷
రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ.మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు.రథసప్తమి మహా తేజం.మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.
సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యే ష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు...ఆంజనేయస్వామి వారి కి సూర్యభగవానుడు గురువులు కూడా ..పైగా ఆయనగారి ని గురువుగా వుండమంటే ..అప్పుడు సూర్య భగవానుడు నేను పరుగులు పెడుతుంటాను ..నన్ను అందుకోగలిగితే నాతో పరుగులు పెడుతుంటేనే ..జ్ఞాన బోధ చేయగలను ..అని అనగానే ఆంజనేయ స్వామివారు ఆ దిక్కు కి ఒక కాలు ఈ దిక్కు కి ఒక కాలు పెట్టి సూర్య నారాయణ భగవంతుని వద్ద విద్య లు అభ్యసిస్తాడు హనుమంతులవారు
దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.
ఇందులో 30 శ్లోకాలున్నాయి.వీటి స్మరణ వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.
-ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
పూజ విదానం:- చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,ఒక్కొక్క దళం చొప్పున రవి,భాను, వివస్వత,భాస్కర, సవిత,అర్క,సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే.శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది
ఈ రథసప్తమి రోజు తరువాత నుంచే ఎండ వేడిమి పెరుగుతుంది అని పెద్దలు చెబుతారు.....సూర్య భగవానుడుఆరోగ్యప్రదాత ..అలానే కంటి సమస్యలు తోబాధ పడేవారు కూడా రోజూ ఉదయం సూర్య భగ వానునికి నమస్కారం చేస్తే చాలా లాభం కలుగుతుంది ..అలానే జోతిష్య0 ప్రకారం కూడా జాతకంలో సూర్యుడు మంచి స్థితిలో ఉంటేనే మంచి శా స్వ తమైన చక్కని ప్రభుత్త్వ కొలువు వస్తుంది అని చెబుతారు ..జీవులు అన్నీ కూడా అంత్యకాలములో ..సూర్యమండల0నుంచి ఉత్తమ గతులు చేరతాయని చెబుతారు ....సూర్యమండలనుంచి కురుస్తున్న అమృత బిందువులు లోకాలకు సర్వదేవతలకు ఆధారం అని .అక్కడనుంచి వచ్చే శక్తి అన్ని జీవులకు ప్రాణాధారం అని చెబుతారు ....బ్రహ్మ ..విష్ణు మహేశ్వర స్వరూపం ..అయిన శ్రీ సూర్య నారాయణుడు ని సదా స్మ రిస్తూ నమస్కారం చేసి ఆరోగ్యం పొందుదాం ..ఓం నమో నారాయణా య ..ఏడు రధాలను ఏడు కొండలుగా పెట్టుకొని పైన కూర్చొని 7+7లోకాలను పాలిస్తూ రక్షిస్తూ ఉన్న శ్రీమన్నారాయణుడు ..ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారు ..ఓం నమో వేంకటేశాయ🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
🌷🌷🌷మాయ...లోనుంచి బైట పడితే అదే సత్య దర్శనం తెలుసుకొనేందుకు సేకరించబడినది ఒకసారి చదవండి🌷🌷🌷
🌹 ‘సత్యదర్శనం అంటే ఏది🌹
మాయలో ఉండబట్టే మానవులు సంసార జంజాటంలో పడి ఉంటున్నారని కూడా విజ్ఞులు చెబుతారు. కామం, క్రోధం, మోహం వంటివన్నీ మాయలో రకాలు. ఉన్నదానిని లేనట్టుగానూ లేని దానిని ఉన్నట్టుగానూ భ్రమించడ మూ మాయే. తాత్కాలికంగా ఆవిర్భవించి శాశ్వతమైనదన్న భ్రమను కలిగించేదే మాయ అని కొందరుపేర్కొంటారు. మాయను ఒక అయోమయావస్థగా కొందరు వర్ణించారు.భారత పురాణ కథలలో గ్రంధాలలో మాయ అనే పదం పలు మార్లు వస్తుంటుంది. ఈ మాయ అనేది విజ్ఞతను కప్పి వేస్తుంది. అయినప్పటికీ అదీ ఈశ్వర విభూతే. మాయ కూడా అమ్మవారి ఒక రూపమే. కొన్ని పురాణాలు వైష్ణవ గ్రంథాలు మాయను విష్ణువుకున్న తొమ్మిది శక్తులలో ఒకటని కూడా వర్ణిం చాయి. మాయ చాలాబలమైనదిఎందరో మహానుభావులుల కూడా దానికి లొంగి పోయారు. ఒక పర్యాయం చిరంజీవుడైన మార్కం డేయుడు విష్ణువుతో తాను మాయను అనుభూతి పొందాలని కోరినట్లు భాగవతంలో ఉంది. ఆ మేరకు విష్ణువు ప్రళయ కాలాన్ని సృష్టించాడు ఒక ఆకుపై వటపత్ర శాయిగా బాలుని రూపంలో దర్శనమిచ్చాడు. ఆ రూపంలో ఉన్నవిష్ణువు మార్కండేయుణ్ని మింగేశాడు. ఆ విష్ణువు ఉదరం లోపల మార్కండేయుడు ఎన్నో లోకాలు చూశాడు. దానిలో ఈ లోకంలోని తన ఆశ్రమం వంటివన్నీ కనిపించాయి. మళ్లిd బయటకు వచ్చిన మార్కండేయుడు ఈ వట పత్రంపై తేలుతున్న బాలుణ్ని చూశాడు. అతన్ని ఎత్త్తుకుందామనుకున్నాడు. మరుక్షణం అంతా మాయమై మార్కండేయుడు మళ్లిd తన కుటీరంలో ఉన్నాడు. ఒక జల ప్రళయ కాలంలోనే విష్ణువు మార్కండేయునికి ఈ మాయ అనుభూతిని కలిగించాడని మరో కథ. విష్ణు మాయ గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నారదుడు ఒక సందర్భంలో విష్ణు మాయకు లోనై ఒక్క నిమిషంలోనే సంసార బాధలన్నీ చవి చూశాడనేది మరో కథ.
ఇక మాయ రకరకాలుగా ఉంటుంది. యశోదకు తన ఉదరంలో బ్రహ్మాండాలన్నిటినీ చూపిన శ్రీకృష్ణుడు ఆమెను మళ్లిd మాయతో కప్పివేశాడు. లేని పక్షంలో తన కుమారు డు ఆ మహా విష్ణువు అనే స్పృహలో ఉంటే ఆమె కృష్ణుని తన కుమారునిగా చూసేది కాదు. ఆ బాలకృష్టుని చూసిన ఆనందం పొందేది కాదు. ఆ స్థానంలో భయ భక్తులు ప్రవేశించి ఉండేవి. మాయలో ఉండబట్టే మానవులు సంసార జంజాటంలో పడి ఉంటున్నారని కూడా విజ్ఞులు చెబుతారు. కామం, క్రోధం, మోహం వంటివన్నీ మాయలో రకాలు. ఉన్నదానిని లేనట్టుగానూ లేని దానిని ఉన్నట్టుగానూ భ్రమించడ మూ మాయే. తాత్కాలికంగా ఆవిర్భవించి శాశ్వతమైనదన్న భ్రమను కలిగించేదే మాయ అని కొందరు పేర్కొంటారు. మాయను ఒక అయోమయావస్థగా కొందరు వర్ణించారు.
ఇటువంటి మన ఊహకందని వాటినన్నిటినీ గుచ్చి ఒక తెలుగు సినీ కవి ఒక పాటలో ‘కలయో, నిజమో, వైష్ణవ మాయయొ, తెలిసీ తెలియని అయోమయ ములో … అని తన బాణీలో రాశాడు. ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. మాయ గురించి ఎన్నో పురాణ కథల్లో ఉంది. అటువంటి వాటిలో అంతగా
ప్రచారంలోలేని ఒక పురాణ కథ తెలుసుకుందాం.
పూర్వం గజాసురుడనే రాక్షసుడుండేవాడు. ఈ రాక్షసుని ప్రస్తావన వినాయక చవితి కథలో కూడా ఉంటుంది. అయితే ఈ కథ వినాయక చవితి వ్రతక ల్పంలోని కథకు భిన్నంగా ఉంటుంది. దానికి కల్ప భేదం కారణమని ఒక్కో సంఘటన ఒక్కో కల్పంలో ఒక్కో విధం గా జరిగి ఉంటుందనేదే దీనికి విజ్ఞులు ఇచ్చే సమాధానం. గజాసురుడు చాలా కాలం దేవతలతో పోరాడేవాడు. అతను ఒక పర్యాయం శివునితో పోరాడడానికి బయలుదేరుతూ తనకు యుద్ధంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు విఘ్నాధిపతి అయిన వినాయకుని పూజించాలని నిర్ణయించాడు. ఇది శివునికి తెలిసింది. అసురుడు గణపతిని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించి తీరుతాడని భయపడ్డాడు. తన కుమారుడేమో భక్తితో పూజించిన వారిని అనుగ్రహించి తీరాలి. అం దువల్ల్ల తనకు సాయం చేయాలని ఆయన జగన్మాతను కోరాడు. నీవు నీ మాయారూపం పొంది ఆ రాక్షసుని మదిలో ప్రవేశించి అతను యుద్ధానికి ముందు గణేశ పూజ చేయకుండా అపమని కోరాడు. ఆమె అందుకు అంగీకరించి అతనిని కమ్మేసింది. గజాననుడు ఉదయాన్నే నదీ స్నానం చేసి గణేశారాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. నదికి వెళ్లాడు. నీటిలోతన ప్రతిబింబం చూసుకున్నాడు. ‘ఆహా ఏమి నా రూపం. నేను కదిలితే భూమి కంపిస్తుంది. నేను కొడితే పర్వతాలు సైతం పిండి అవుతాయి. నేను తలెత్తి నిలబడితే మేఘాలు చిందర వందర అవుతాయి. త్రిలోకాలు నన్ను చూసి గడ గడలాడతాయి. అటువంటి నేను ఒక గజముఖుడైన దేవుణ్ని అర్చించడం ఏమిటి అని గణేశ పూజమానేశాడు. అహంకారంతో విర్ర వీగుతూ యుద్ధానికి సిద్ధపడ్డాడు.శివుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుని సంహరించాడు. అయితే ఈ విషయం విన్న గణే శు డు వచ్చి మాయా దేవితో తల్లిd! నీవు నా భక్తుడు ఒకరు నాకు పూజ చేయకుండా మనసు మార్చావు కనుక నీవు ఇకపై అజ్ఞానుల మనసుల్లో ఉండిపోవాలని శపించాడు. దానితో అజ్ఞానులను మాయ కప్పేస్తుంటుంది. విజ్ఞానులను ఆవరించినా వారు దాని నుంచి బయటపడాలి. అజ్ఞానం, మాయ అంటే ఏమిటో కాదు క్రోధం, లోభం, మదం, వ్యామోహం వంటివన్నీ వాటి ప్రభావాలే. అజ్ఞానానికి మాయకు గురై కోపం వంటి వాటికి ఒక క్షణం వశమైనా మనలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొలిపి బయటపడాలి.మార్క0డేయుడు కూడా శ్రీమహావిష్ణువు ని కోరిన విధముగా ఆయన పొట్టలో కి వెళ్ళాడు ..అక్కడ ఉన్న పదునాలుగు భువన భా0డములు ను సందర్శించుకొని ఆ అనుభూతి తో ఒక స్తోత్రం రచించాడు ..అదే మనం చదువుకొనేది లేక వినేది అయిన మార్క0డేయకృత శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం .. .ఓం నమో వే0కటేశాయ ..ఓం నమోనారా యణాయ .🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌷 కొన్ని ముఖ్యమైన భక్తి సాహిత్యం లో విషయాలు..సే కరించ బడ్డాయు ..చదివి ఆనందించండి🌷
మనసా,వాచా,కర్మణా అంటేఏమిటి?*
ఒకసారి శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు...
గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట...
_" నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షమించండి ” అని ప్రాధేయ పడ్డారు..._
*ఇది విన్న శిష్యులు “ ఆచార్యులవారు, ఏమి పాపములు చేశారో ప్రాయశ్చిత్తపడుతున్నారు ?” అని అనుకున్నారు...*
ఒక శిష్యుడు,ఏమిటిస్వామి ఆ పాపము నేను తెలుసుకోవాలి అనిఉంది, ఆచార్యుల వారిని అడిగాడు.
*దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు...*
1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను, సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను..."
అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను, అది నేను చేసిన మొదటి దోషము అని సమాధానమిచ్చారు.
2. తైత్తిరీయ ఉపనిషత్తు లో *"యతో వాచో నివర్తన్తే" అప్రాప్య మనసా సః* భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను.”ఇది నేను చేసిన రెండవ తప్పు!
3. నిర్వాణ శతకం లో
*“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం*
*న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః*
*అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం “అని వ్రాశాను*
*అర్థము :*
నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు .మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము , భోజనము , భోక్త ( భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను , శివుడను ,శివుడను!
ఇంత వ్రాసికూడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను... అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు.
అందుకనే నేను చేసిన ఈ మూడవ తప్పు...
ఈ తప్పులని మన్నించమని , ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు...
*నీతి :*
మన ఆలోచన , తీరు , మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి సంభాషణ మనకి తెలియజేస్తోంది...
బైట ప్రపంచం మన పని తీరుని మట్టుకె చూస్తుంది, భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.
*“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”*
ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధి తో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము.
చెప్పేది, చేసేది, ఆలోచించేది ఒక్కటే ఉండాలి దానినే త్రికరణ శుద్దిగా అంటారు...
**************************************************************************************************
సామజవరగమన.. అంటే అర్ధం ఎంత మందికి తెలుసు
_తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా, ఒక పాట హోరెత్తుతోంది. అదే *సామజవరగమన !*_
_చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది. అలాగే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది.. కానీ చాలా మందికి "సామజవరగమన" అంటే ఏంటో తెలీదు.. *'సామజవరగమన' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది !*_
_'సామజ' అనగా "ఏనుగు" అని.. 'వరగమనా' అనగా "చక్కని నడక" అని అర్థం... అలాగే సామవేదం అనగా సంగీతం
_మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం ! "సామజవరగమన" అంటే ఏనుగు లా గంభీరంగా, హుందాగా, ఠీవిగా నడిచేవారు అని అర్థం.. మరి అసలైన *"సామజవరగమన"* ఎవరు ??_
_అసలైన "సామజవరగమన.." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు... వాల్మీకి తన రామాయణంలో 'అరణ్యవాసం'లో ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను" డంటారు... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని... ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు.._
_చాలా మంది "సామజవరగమన" అంటూ పాడేస్తున్నారు... కానీ వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు.. దాని అర్థం ఏంటో తెలీదు... వారికి చెప్పేందుకైనా "సామజవరగమన" కీర్తన, దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం.._
_*సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥*_
_*సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥*_
_*వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।*_
_*స్వీకృత యాదవకులమురళీ !*_
_*గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥*_
_ఈ కీర్తన త్యాగరాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది.. ఈ కీర్తనలోని ప్రతి పదం శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది..._
_కీర్తన అర్థం... ఏనుగు నడకవంటి గంభీరమైన నడకతో, మునులు మానవుల హృదయాలను ఏలుతున్న ఓ శ్రీహరీ ! నువ్వు కాలంతో సంబంధం లేకుండా అందరిచే కొనియాడబడతావు.. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకు, దయకు ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి !_
_సామవేదము నుండి పుట్టిన సప్తస్వరముల వల్ల , ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానంతో అందరిని ఆనంద పరుస్తూ.. ఈ త్యాగరాజ వందనములను అందుకో ! .._
_ఇదీ 'సామజవరగమన'కు సంబంధించిన అసలు భావం ..
Blog Archive
-
▼
2021
(189)
-
▼
February
(14)
- మా🌙🌘ఘపూర్ణిమ svbc TTD వారి శ్రీవేంకటేశ్వర స్వామి...
- 🌷🌷🌷🌷మాఘపూర్ణిమ. Live svbc TTD now🌷🌷🌷
- 🌹🌹🌹రేపు మాఘ మాసపు పూర్ణిమ ...మాఘపూర్ణిమ అనిపిలు...
- ఒక సామాన్యుడు ఎలా ఎనాల్సిస్ చేసి మొత్తంచెప్పేశాడు ...
- ☀️🌝🌞నా అనుభవం ...ఒక భావన గా వ్రాశాను ..కవిత లా వ...
- 🥀🥀🥀🥀పీఠాధిపతి స్వామీజీ చెప్పిన విషయాలు వినండి ...
- 🌹🌹🙏శ్రీశివ భగవానుని నమక చమక మంత్రాలు అభిషేకం చూ...
- 🙏 🌷🌷🌷🌷ఈ నాటి వేదపారాయణ0 చూడండి ..ఆ విజ్ఞానం ...
- 🌹🌹🌹నీవు ఒక్కడివే సర్వాధారం.... అనే శ్రీవేంకటేశ్...
- 🌹🌹🌹🙏రథ సప్తమి నాడు ఏడుకొండల స్వామి కలియుగదైవం ...
- 🙏🌷🌷🌷🌷 సరస్వతీ అమ్మవారిగురించి విశేషాలు తెలుసు...
- 🌷🌷🌷🌷🌷🙏🙏🙏రథ సప్తమి శుభాకాంక్షలు🙏🙏🙏🌷🌷🌷...
- 🌷🌷🌷మాయ...లోనుంచి బైట పడితే అదే సత్య దర్శనం తెలు...
- 🌷 కొన్ని ముఖ్యమైన భక్తి సాహిత్యం లో విషయాలు..సే క...
-
▼
February
(14)
Followers
About Me
- Dr.M muralikrishna