Pages

Vasistamuni rachimchina siva Linga stotram

వశిష్ఠ కృత శివ లింగ స్తుతి (అగ్నిపురాణం)

నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః
నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః
నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః
నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః
నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః
నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే
నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే
నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః
నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః
నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే
నమః పురుష లింగాయ భావ లింగాయ వై నమః
నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః
నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే
నమః అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః
నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః
నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః
నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః
నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే
దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా
బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో
అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కనక లింగమునకు నమస్కారము, వేదలింగమునకు, పరమ లింగమునకు, ఆకాశ లింగమునకు,
సహస్ర లింగమునకు, వహ్ని లింగమునకు, పురాణ లింగమునకు, వేద లింగమునకు,
పాతాళ లింగమునకు, బ్రహ్మ లింగమునకు, సప్తద్వీపోర్థ్వ లింగమునకు, సర్వాత్మ
లింగమునకు, సర్వలోక లింగమునకు, అవ్యక్త లింగమునకు, బుద్ధి లింగమునకు,
అహంకార లింగమునకు,  భూత లింగమునకు, ఇంద్రియ లింగమునకు, తన్మాత్ర
లింగమునకు, పురుష లింగమునకు, భావ లింగమునకు, రజోర్ధ్వ లింగమునకు, సత్త్వ
లింగమునకు, భవ లింగమునకు, త్రైగుణ్య లింగమునకు, అనాగత లింగమునకు, తేజో
లింగమునకు, వాయూర్ధ్వ లింగమునకు, శ్రుతి లింగమునకు, అథర్వ లింగమునకు, సామ
లింగమునకు, యజ్ఙాంగ లింగమునకు, యజ్ఙ లింగమునకు, తత్త్వ లింగమునకు,
దైవతానుగత లింగ స్వరూపము అగు శివునికి పునః పునః నమస్కారము! ప్రభూ నాకు
పరమయోగమును ఉపదేశించుము, నాతో సమానుడైన పుత్రుడనిమ్ము, నాకు అవినాశి యగు
పరబ్రహ్మవైన నీ యొక్క ప్రాప్తిని కలిగించుము, పరమ శాంతినిమ్ము, నావంశము ఎన్నటికీ క్షీణము కాకుండుగాక, నా బుద్ధి సర్వదా ధర్మముపై లగ్నమైఉండుగాక.🍃🌿🙏

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online