Pages

This side of Corona

.ఈ ప్రపంచం భగవంతుడు మనకు ఇచ్చిన ఓ అద్దెగృహం .

కరోనాకు ఈవల......--------------------------- భగవంతుడు మనకోసం ,అన్నీ కోణాలలో ఆలోచించి వసతి ,వనరులు ,అమాయక పసు పక్ష్యా దులను పుట్టించి ..మనలను హాయిగా ,సుఖం గా జీవించండి అని ఈ ప్రపంచములో పడేశాడు .మానవుల మైన మనకు కాస్తంత ఇంగిత జ్ఞానం ,జ్ఞానం ,విజ్ఞాన0 ,విచక్షణ ఇచ్చి ,నేర్పి ఇక్కడ పడవేశాడు .మనం ఏమి చేస్తున్నాము అద్దె ఇల్లు అనే విషయం మర్చిపోయాం ,పైగా ప్రపంచం ఉన్న నాళ్ళు బ్రతికి ఉంటాము అని అతి ఆశ పడుతూ ..జంతువులను, పసు పక్ష్యాదులను హింసిస్తూ ,బలహీనులను కొట్టి దోచుకుంటూ ..ఒకటికి నాలుగు ఇళ్ళు, ఒకటికి నాలుగు కార్లు అలా పది తరాలకు సరిపడా సంపా దించి..గొప్పవాళ్ళం అని విర్రవీగడం ,అమాయక ప్రాణులను ఘోరంగా మిషన్లు ద్వారా మాంసం, పచ్చిరక్తం త్రాగడం ,చేసే పాపాలు కు అంతు ,అదుపు,అడ్డూ లేకుండా పోయుంది... ఇప్పుడు ఇక ప్రకృతి కన్ను ఎర్ర చేసింది ...ఇక నైనా మారండి ..సేవ,ఉపకారం లాభం చేయక పోయినా పర్వాలేదు కానీ అపకారం, నష్టం అహింస చేయకుండా ఉంటే చాలు .అందరూ సమానులే పురుష .,స్త్రీలు ఇద్దరూ సమానమే ఎవరు ఎవరికి బానిసలు కారు ,కాకూడదు ...అయినా ప్రతిపనిని భగవత్ సేవ గా భావించి చేసుకుంటూ వెళ్ళాలి ..ఇతర జీవుల ,పశు పక్ష్యాదులను తోటి మానవులను భగవంతుడి రూపం గా భావించాలని హిందూ ధర్మం చెబుతుంది .కానీ నేటి భారతదేశం మొత్తం రూపు రేఖలు మార్చుకొని..... హింస ,దోపిడీ .....లాగేసుకొని తినేయడం ..ఇతరుల సంపదలు అవి ఏవైనా సరే బలవంతంగా లాగేసుకోవడం ..అత్యాచారాలు, అనాచారాలు ,ఒక పద్ధతి లేని జీవిత క్రమం జీవన విధానం నేడు ఎక్కడ చూసినా కనిపిస్తూన్నాయి.. ప్రజలు మాత్రమే కాదు ప్రభుత్త్వాలు కూడా అలానే ఉంటున్నాయి .యధా రాజా తదా ప్రజా ..అని కదా.

ఈ దేహం కూడా భగవంతుడు నిర్మించినదే కదా . పంచ భూతము ల శివ నిర్మితం ఈ శరీరం ...దీని లోపల అంతర్యామి గా వడ్ల గింజ కొన అంత చిన్న రూపములో నీలం రంగు లో శ్రీమహావిష్ణువు వెలుగుతూ ఉంటాడు ..అదే. ...జీవ చైతన్యం అది ఉన్నంత సేపు ప్రతి జీవి ప్రాణం తో ఉండి ఒక మెరుపు ఉంటుంది .అది వెళ్ళి పోతే ఏ జీవి దేహం అయినా కంపు కొడుతుంది .కాబట్టి ..ఈ దేహం అంత శాస్వితం కాదు ..అని గుర్తుపెట్టుకోవాలి.పాంచ భౌతిక దేహం ఒక మిషన్ లాంటిది ఎప్పుడైనా పక్కకు పడిపోవచ్చు అనే జ్ఞానం ఉండాలి పడిపోగానే గాలి ..గాలి లో కాలసిపోతుంది ,అలా అన్ని మిగిలినపంచ భూతాలు దేనిలోకి అవి వెళ్లిపోతాయు .చివరికి దేహం నిప్పులోకి వెళ్ళిపోతుంది ..ఇక ఆత్మ ..దేహం చేసుకున్న పుణ్యపాపాలు వల్ల పైకి కానీ...క్రిందికి కానీ ప్రయాణం చేస్తోంది .మనిషి ..కానీ ఏ జీవి ఆయునా పట్టుకుపోయేది ఏమీ లేదు ..ఎందుకు మరి అంత మనిషి కి తాపత్రయం .అదే తెలుసుకొని నడుచుకోవాలి మనిషి తృప్తి పడాలి అప్పుడు ఆరోగ్యం దానంతట అదే వస్తుంది .పని చేయకుండా సోమరిపోతు లా వేదాంతం చెబుతూ అడుక్కొని తినమని కాదు ఇక్కడ అర్థం ..కష్ట పడుతూ ఉన్నంతలో తృప్తిపడుతూ ఇతర మానవులకు జీవులకు హాని ,కష్ట, నష్టాలు జరగకుండా మన బ్రతుకు ,మన కుటుంబం మనం చూసుకోవడం ..నీకు శక్తి మేరకు ఒక రూపాయి ని సమాజాసేవ కు ఉపయోగించు ...చాలు అదే పరమార్థం. అంతే కానీ గుళ్ళు, గోపురాలు తిరగడం ,పురాణములను చదవడం ,స్తోత్రాలు చదవడం పుణ్యక్షేత్రాలు అంటూ పరుగులు పెట్టి కాలుష్యం పెంచడం ఇవే చేయమని ..ఇదే పుణ్యంమార్గం ని చెప్పడం లేదు .ఒకవేళ చేస్తాను అన్నా తప్పులేదు ...కాకపోతే మంచిమనస్సు .మంచి గుణం లేకుండా ఎక్కడికి పరుగెత్తిన ఏమి ప్రయోజనం ఉండదు ...తల్లిదండ్రులు ఇద్దరికి వ్యుద్యోగాలు ..లక్షల్లో జీతం .భవనాలను కొని పడేసి అద్దెలకు ఇవ్వడం ,పోటీపడి పదిలక్షల కార్లు నుంచి. ..కోటి రూపాయల కారుల వరకు కొనడం ..పోరాగాళ్లకు ఇవ్వడం ..మళ్ళీ వాళ్ళు సంపాదించడం ..వాళ్ళు మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ లు కొనడం .ఇదే ఇక రొటీన్ ...ఓ పదితరాలకు సంపాదించి ఇవ్వడం ..వచ్చిన వాడు భోగాలకు అలవాటుపడి పాడుచేయడం .అందరిదీ కలిపి కాళ్లతో ,చేతులతో దగ్గరకు పోగేసుకోవడం ,ఉంటుందో ,పోతుందో అనే టెన్షన్ దానితో బి.పి లు షుగర్లు .రావడం ముసలితనం లో .... కన్నవాళ్లే వీళ్ళను తీసుకెళ్లి వృద్ధాఆశ్రమాల్లో పడవేయడం .ఇది జీవితచక్రం .అందుకే దేనికైనా ఒక లిమిట్ ఉండాలి ...ముందు సంపాదించుకొని మంచిగా తినండి ...కొద్దిగా పొదుపు చేసుకొండి.. ఒక చిన్న ఫ్లాట్.. ఒక చిన్న ది తక్కువలో ఒక వాహన0 కొనుక్కోవడం... పిల్లలకు మంచి మార్గం చెబుతూ చదివించుకోవడం చాలదా ?...కోట్ల ,లక్షల రూపాయల ఆడీ కార్లు అవసరమా?అవి లేకపోతే బ్రతకలేమా ..?మందిని..ప్రకృతిని ముంచి వ్యాపారం చేసి అవి కొని తిరిగితేనే గొప్పతనం అవుతుందా?..బ్యాంక్ లను మోసం చేసి కోట్లరూపాయలు కు స్కామ్ చేస్తే అదిగొప్పతనం అవుతుందా ?

కొందరు అనవచ్చు ..మాస్టారు మీరు అట్లానే అంటారు కోట్లు వస్తాయని అంటే మీరు మాత్రం ఎలా అంటే అలా చేయరా ?అని నా చదువుకు సరిపడా ఉద్యోగం ఇంతవరకు లభించలేదు ..అబ్రాడ్ లో అవకాశాలు ఎన్నో వచ్చా యు .కానీ మా తల్లిదండ్రులు కి ఇష్టం లేదు ..ఇక అలా అలా ఎదో ఒక టి బ్రతుకుతెరువు కోసం చూసుకొని జీవితం లాగాము ఇంతలో తల్లితండ్రులు పెద్దవాళ్ళు.. ఎదో వాళ్లకు సేవలు చేసి వాళ్ళను పంపింన తరువాతరువాత.మాకు ఒక మానసిక వికలాంగురాలు ఉంది ..ఆమెకు అన్నీ సేవలు చేయాలసిందే... ఇక ..ఈ లోపు బ్రతుకు పుస్తకం కొన్ని చాప్టర్..లు అయిపోతున్నాయి.అందరి లానే బియ్యం నుంచి ప్రతి వస్తువు కొనుక్కువాలసిందే వెనుకాల..ఏ ఒక్క స్థిరాస్తులు లేవు ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లాంటి చిన్న ఇల్లు వుంది.. లోను తీరిపోవడం..ఒక ఆనందం .ఒక టూ వీలర్ మాత్రం ఉంది ప్రస్తుతం చాలు తింటానికి కష్ట పడితే చాలు అనే భావనలో ఉన్నాము.సోమరితనం పనికిరాదు. కష్ట పడి.. సంపాదించుకొని తింటేనే జీవితానికి. ఆరోగ్యం..సంతోషంకూడా.

ఇక కొన్ని దేశాలు ఇంకాస్త ముందుకు పోయి జీవాయుధాలు పేరు తో రక రకాల వైరస్ లు సృష్టి స్తున్నాయి .స్వేచ్ఛగా ఎగరాల్సిన పక్షులు ,జంతువులు బందీ లు అయిపోయాయు. క్షణం క్షణం హింసకు గురి. చేస్తూ మాంసం, రక్తం ..పిండుకొని త్రాగేస్తున్నారు అక్కడ దేశం లోని జనం ..అలా పచ్చి రక్తం, మాంసం తింటే నిత్యం యవ్వనం గా ఉంటామని వాళ్ళందరి మూఢ నమ్మకం ప్రభుత్త్వాలది అదే దారి ...ఇంకా ప్రజలకు ఏం చెబుతుంది అందుకే అటువంటి జీవజాతుల కోసం ఏకంగా ఓ పెద్ద మార్కెట్ ఆ చైనా దేశం లో ఉంది ..అస్సలు అక్కడ ఉంచిన రకరకాల మాంసం తోనే ఎన్నో ఇన్ఫెక్షన్లు పు డుతున్నాయి..అని ఎందరో చెబుతున్నారు ...ప్రభుత్వం కూడా గబ్బిలం పాము ల డిఎన్ ఏ ల నుంచి ఒక కొత్త వైరస్ తయారు చేసిందని అదే ఇప్పుడు మనము భయపడే కరోన అని చెబుతున్నారు ..అస్సలు కరోన అన్నది పాత కాలంలోని పేరే ..అది ఒక రకమ్ ఫ్లూ వైరస్ ..దానిలోనుంచి ఇప్పటికి ఆరు ,ఏడు రకాల వైరస్ లు పుట్టి వచ్చి వెళ్లిపోయాయు ..కానీ ఇప్పుడు వచ్చిన ది న్యాచురల్ కాదు ..మానవ తప్పిదం ..అందుకే ఇంత పవర్ ఫుల్ గా దేశాల ను ముంచేస్తుంది.అదే ఫ్లూ వైరస్ కు పెట్టె పేరు కరోన అని పిలుస్తూవున్నారు ....ఆర్యభట్ట పేరు లాగా ..ఆర్యభట్ట అనేది పూర్వకాలంలో ఓ ఖగోళ గణిత శాస్త్రవేత్త పేరు ..దానిని నేటి కాలం లో ఉపగ్రహానికి పెట్టినట్లు అన్నమాట.

ఏది ఏమైనా మానవుడికి సామ్రాజ్య విస్తరణ, కోరికలు ఎక్కువ అయిపోయాయి. మిగత అగ్ర దేశాల ఆర్థిక వ్యవస్థ ను సంపూర్తిగా దెబ్బ తీయాలని ,ఒకరిపై ఒకరు పట్టు సాధించుకోవాలని చేసే మాయల కుట్ర లు ఇవి ...అగ్ర రాజ్యాలు కొట్టుకొని మన దేశం లాంటి చిన్న దేశాలను బలి తీస్తున్నాయు ..ఇప్పటికైనా మన ప్రభుత్త్వాలు కుళ్ళు రాజకీయాలు మానుకొని ఇతర దేశాల వ్యుత్పత్తులు కు ధీటుగా మన దేశం లో ని బోలెడంత మ్యాన్ పవర్ ఉంది వారికి ఉద్యోగాలు కల్పించి మన ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేసుకోవాలి అప్పుడు ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు సంపాదిస్తారు .పిచ్చి పిచ్చి గా సోమరులను చేసే డబ్బులు పంచె రాజకీయ పార్టీల ఓట్ బాంక్ పథకాలు మానేసి వ్యుద్యోగ కల్పన ,వ్యవసాయరంగం ,చిరువ్యాపారులు ,కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలి ..పరిశోధనలకు పెద్దపీట వేయాలి
ఇక కుల మత ప్రోత్సహకాలు ను తీసి అవతల పడవేయాలి ..ఆర్ధికంగా వెనుకబడిన వారు ఎవరైనా సరే ,చిన్న వ్యాపారస్తులు ను తోపుడుబండ్ల వారికి ,కూలీలకు ఉచిత వైద్యం మందులు అందించాలి .
ముఖ్యంగా.. సామాన్య మనవులం మనము కొన్ని ఆయునా ఆచరించాలి ..

ఇప్పుడు వచ్చిన కరోన మహమ్మారి నుంచైనా కొన్ని తెలుసుకోవాలి ..ప్రపంచాన్ని ఎదో ఒక దైవ శక్తి లేదా సూపరుపౌవ రు ఉంది అని తెలుసుకొని మనం చేస్తున్న విచ్చలవిడి తనం తగ్గించుకోవాలి ...అంటే మూఢనమ్మకాలు పెంచుకోవడం కాదు ..ప్రతి జీవిని గౌరవించి ఆ జీవిలో పరమాత్మ ని చూసి ఆనంద పడదాం ..పంజరాలలో పక్షులు భంధించకండి... అన్ని జీవులు కు భగవంతుడు స్వేచ్చ ఇచ్చాడు ...మనలా అవి అంతా దోచేసుకొని ఇనుప బీరువాలలో దాచుకొని ,కాళ్ళతో ,చేతులతో దగ్గరకు పోగేసుకొనే చావు తెలివి తేటలు వాటికి లేవు ...అడవిలో వాటి స్థావరాలు దగ్గరకు మనమే వెళ్ళి ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి వాటి నివాసాలను చెడగొట్టి ..వాటిని హింసలు పెడుతున్నాము. చెట్లు అడవులు నరికేసి గనులు అంటూ అన్ని పురాతన ఔషధ మొక్కులు ను ,పర్వతాలు, కొండలు పెకిలించేసి అమ్ముకోవడం ,వ్యాపారం కోట్లు సంపాదన ,ప్రతీ ఒక చిన్న విషయం ఒక వ్యాపారం ...దాని చుట్టూ ఒక మాఫియా ..ఇసుక మాఫియా ఇలా పెత్తనం చేస్తూ బలహీనులను ,అడిగిన వాళ్ళను ఎత్తి ఆవల విసిరి పడేస్తున్నారు .ప్రతీ విషయం రాజకీయం ..ప్రతీ చోట ఒక కాంక్రీట్ జంగిల్ ..ఇలా వెళ్తున్న ప్రపంచం పై భగవత్ శక్తి తస్మాత్ జాగ్రత్త ..అని ఒకసారి హెచ్చరిక చేస్తోంది ...

నదులు..పచ్చని పంటపొలాలు సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాలు పాడు చేయకండి ....ఇదివరలో రొయ్యల చెరువుల పేరుతో మంచి మంచి నీటి సరస్సులు ఎప్పుడో తగల పెట్టేసారు ....ఇక ఇప్పుడు రైతుల దగ్గర నుంచి లాండ్ పుల్లింగ్ జీవో లు
వ్యవసాయ0 భ్రష్టు పట్టించి అపార్టుమెంట్లు కట్టి అక్కడి రైతులకు వాచ్ మాన్ ఉద్యోగం ఇవ్వడం ఇది నేటి ప్రభుత్త్వాలు చేస్తున్న నిర్వాకం .అడవులను కాపాడండి ,గిరిజనులు ని కాపాడండి .
ఏది ఏమైనా ప్రకృతి అందాలను చూసి ఆనందించండి ..మొక్కలు, అడవి ప్రతి జంతువుని చూసి ఆనంద పడటం నేర్చుకొండి, మొక్కలు, వృక్షాలను కూల్చేయకండి .ఇళ్లల్లో కుక్కలను బంధించి వాటితో ఇరవై నాలుగు గంటలు ఏడుపు రాగాలు పెట్టించకండి ...దేని స్వేచ్ఛను త్రుంచే..హక్కు ,చంపే హక్కు ఎవరికి లేదు ఇక అది మనుషులను దాడి చేసి చంపితే తప్ప ....

అలానే మాంసం తినే వారు తినవచ్చు తప్పులేదు కానీ ఒకేసారి చంపి తినండి ...అంతే కానీ కాలు ఒకసారి ,చేయు ఒకసారి ..పీక్కోని తింటూ హింస చేస్తూ పైశాచిక ఆనందం పొందకండి ...అలానే పశువు జాతులు ను బ్రతికి ఉండగానే ఆవులు,గేదెలు ,ఎద్దులు ను తిండి ,నీళ్లు వాటికి బంద్ చేసి ఒక చిన్న లారీ లో ఇరికించి ...పట్టకపోతే ఒక ఇనుప గొట్టం తో కాళ్ళు ,తోకలు నిర్దాక్షిణ్యంగా విరిచి ,పీకి ప్రాణం ఉండగానే వాటిని ఒక లారి లో వేసి తొక్కి తీసుకు పోతున్నారు... ఇక మిషన్లు లో వేసి తోలు,ఒకసారి, ఎముకలు ఒకసారి ఇలా మిషన్ ద్వారా హింసించడం..ఇదంతా మనుష్యులకు ఎవరిచ్చారు ఈ అధికారం ...తినండి కానీ జంతువుల ను హింస పెట్టకండి ..అది మహా పాపం అప్పుడే భగవంతుడు కరోనా రూపములో గుర్తు చేస్తున్నాడు .ఇకనైనా జాగ్రత్తగా ఉండండి ...ఉన్నదానిలో తృప్తి పడండి ...అలానే ఆశ పడండి ...ధర్మంగా కష్ట పడండి ....వేదాంతం వినడం ,చదవడం కాదు ఆచరించండి ...మానవ సేవ మాధవ సేవ గా బ్రతకండి ...అప్పుడు ఏ కరోనా ప్రకృతి విలయాలు మనల్ని ఏమీ చేయవు .

..అదే ధర్మో రక్షతి రక్షిత:.....కలియుగములో ఆయన నామం చదువుకుంటూ ..ధర్మం ఆచరించే వాళ్ళను ఆయనే తప్పక కాపాడతాడు ..కానీ పూర్తిగా నమ్మి ఆయన పాదాలను ఆశ్రయించాలి శ రణు జొచ్చాలి ....ప్రకృతి కి దాసోహం ఆయు ఆస్వాదించాలి ...మొత్తం భగవంతుడిదే మన సొత్తు ఇది ఏదీ కాదు అనే జ్ఞానం తో ఇంట. ..బయట ఎక్కడైనా అలా ఒక్కసారి ఆలోచించండి.. అప్పుడు చేయండి ...

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online