Pages

రేపు విశేషమైన శనివారం.. విశేషమైన రోజు

*రేపు ది.07-03-2020,శనివారం,*

*గోవిన్దద్వాదశి

*👉ఎన్నో వందల సంవత్సరాలకు కానీ లభించని గోవింద ద్వ‌ాదశి అనే అద్భుతమైన అలభ్యయోగం రేపు  సంభవిస్తున్నది.*

*ఈ గోవిన్ద ద్వాదశి యోగం అంటే?*

*బృహస్పతి ధనూరాశిలో,శని మకర రాశిలో,రవి కుంభరాశిలో ఉండగా ఫాల్గుణ శుద్ధ ద్వాదశి పుష్యమి నక్షత్రం,శుభయోగం, బవ,కరణం అన్ని కలసి గోవిందునికి ప్రీతికరమైన శనివారం కలసి రావడం బహు అరుదు.. ఇంకా విశేషం తిధి ద్వయం కూడా(ద్వాదశి+త్రయోదశి) ఇవన్నికలసినమహాపుణ్యదినం.. గోవిన్ద ద్వాదశి.*
*అత్యంత విశేషమైన ఈ రోజు మరలా కొన్ని వందల సంవత్సరాలకి కాని రాదు.ఇంకా ఈవిధంగా అన్ని కలవడం కూడా సాధ్యపడదు.అందుకే ఇది అలభ్య మహాయోగం*

*🕉👉ఈ విశేష పర్వదినాన అపూర్వ యోగమైన గోవిన్ద ద్వాదశి నాడు మానవ జన్మ సార్ధకతకు కనీసం ఆచరించాల్సిన విధులు.*
*ప్రాతఃకాలాన సముద్ర స్నానం,నదీ స్నానం,పుణ్యక్షేత్రాలలో పుష్కరిణీ స్నానం చేసి శ్రీ మహా విష్ణువును దర్శించినచో శత సంవత్సర గంగాస్నానేన గోదాన మహాపుణ్యఫలసిద్ది కలుగుతుంది.అత్యంత ప్రధానం అవకాశం ఉన్నవారికి తిరుమల పుష్కరిణి లో స్నానమాచరించి శ్రీవారిని దర్శించి కలియుగ వైకుంఠంలో నిద్ర చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది.

*🙏👉అవకాశం లేని వారు మీమీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సముద్రాల యందు,నదులయందు స్నానమాచరించి విష్ణాలాయాలను దర్శించిన మహాపుణ్యం కలుగుతుంది.సమస్త దోషాలు పరిహారమై,కార్యసిద్ధి కలుగును..*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*ఓం నమో గోవిందాయ నమః*
*ఓం నమో నారాయణాయ*
*ఓం నమో వేంకటేశాయ*

*👉రేపు ఉదయం నుండి రాత్రి లోపు పై నామాలను అవకాశం కలిగినపుడల్లా నామ స్మరణ చేయండి.*

*👉సంకల్ప మంత్రం(స్నానానికి)*
*కుమ్బస్థే భాస్కరే చాపి మకరే వాజ్ఞ్గిరాశ్శనిః ద్వాదశీ శుక్ల పక్షస్య పుష్యార్కే జాయతే యది గోవిన్ద ద్వాదశీ నామ మహా పాతక నాశిని!!*
*తస్యాం మహోదధి స్నానం దృష్ట్వాతు పురుషోత్తమం*
*యత్ఫలం ప్రాప్యతే సమ్యక్ శృణుశ్వావహితో నృప శత సంవత్సరం గంగా స్నాన పుణ్యమావాప్నోయాత్!*
*భానువారాభావేపి శిష్ట గ్రహ నక్షత్రాది యోగే గోవింద ద్వాదశీత్యనుకల్పః.
ఇంకా రేపు శనివారం... శని త్రయోదశి కూడా రావడం విశేషము ఉదయం వేళ నవగ్రహాలకు మనకు చేతనైనంత గా మనస్సులో నమస్కారం చేసుకొని ఆ తరువాత ఆంజనేయ స్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నితలుచుకొని ..ఒక 11 సార్లు నామ0 చదువుకున్నా చాలు
పైవన్నీ కుదరనివారు ఒకచోట ప్రశాంతంగా కూర్చుని ఆ దైవాన్ని స్మరించుకున్నా, భజన చేసుకున్నా అది చాలు అస్సలు కలియుగములో భజన ఉత్తమమైన మార్గం ...భగవంతుని దయ పొందటానికి అని శాస్త్రం.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online