Pages

Urine infections in men and women - Some remedies Part - 3

 


ఆడ--మగవారిలోయూరిన్ ఇన్ఫెక్షన్.. నివారణ --  part - 3



 ఇందులో వ్రాసిన చాలా విషయాలు మగవారి లోని ఇన్ఫెక్షన్. పోగొట్టుకోవడానికి పనికివస్తాయని గమనించగలరు .  ఆడ... మగ ఇద్దరిలో ని యూరినల్ సమస్యలు కు పరిష్కారాలు అని తెలుసుకోగలరు
సహజంగా ఆడవారిలో కూడాయూరినల్ ఇన్ఫెక్షన్ అనగానే ..ఎక్కువసార్లు యూరిన్ కి వెళ్ళాల్సి రావడం .మంట..దురద యూరిన్ స్మెల్ లాంటివి ఉంటూ ఉంటాయి .ఒక్కోక్కసారి నురుగు ..కూడా ఉంటుంది .రకరకాల కారణాలు ఉంటాయి .ముందు గా విటమిన్ లోపం కారణంగా నురుగు .ఇన్ఫెక్షన్ వస్తుంది.అందుకే వైద్యులు విటమిన్ సి గల టానిక్ ఇస్తూఉంటారు దానిపేరు citralka(Disodium Hydrogen citrate syrup ) అనే సిరప్ ఇస్తూఉంటారు .దానిని 3మూతలు సిరప్ దానికి సమాన భాగాలుగా వాటర్ కల్పి తీసుకోవచ్చు .ఏదైనా తిన్నతారువాత..ఇక కొంతమంది చూయుంగ్ సి టాబ్లెట్ చప్పరిస్తూ ఉంటారు .అవి కూడా మెడికల్ షాప్ లో దొరుకుతాయి. అయితే ఎక్కువ సిరప్ మాత్రమే ఇస్తారు వైద్యులు .అలానే ఒక టాబ్లెట్ యాంటీబైయోటిక్ కూడా వ్రాస్తూ ఉంటారు .అది ...redicate200mg కూడా మంచిదే ..షుగర్ వాళ్ళ కు వ్రాస్తూఉంటారు ..జెనరల్ గా అందరూ వాడవచ్చు ఓ పది టాబ్లెట్స్ ఇచ్చి ఉదయం ..సాయంత్రం ఒక 5 రోజులు వాడించి మానిపిస్తారు ఇక ఆడవారిలో ఎక్కువ బాధ కలిగించే ది ..తెల్లబట్ట ( white discharge) దీనివల్ల దురద ..ఫంగస్.. లాంటివి చెడు వాసనలు కూడా వచ్చి ఇబ్బంది పడుతుంటారు .సహజంగా ఇది ఈస్ట్ అనే బాక్టీరియా ఎక్కువ పుల్లని తత్త్వం గల ఓ పదార్ధాన్ని తయారుచేసి అక్కడ బ్రతుకుతుంటాయు ....ఈ ఇన్ఫెక్షన్. తో బాధపడుతున్నప్పుడు.అందుకే వైద్యులు ముఖ్యంగా ఆయిర్వేదం లో ..పులుపు ,కారం మసాలాలు తగ్గించి భోజనం చేయమని చెబుతారు .

కొంతమంది తెలీయక శుభ్రత అతిగా పాటించడం వల్ల కూడా బాధలు తెచ్చుకుంటారు ఉదాహరణకు ఎక్కువ డెట్టా ల్ లాంటి పవర్ఫుల్ సబ్బులతో పదే పదే జననాంగాలను శుభ్రం గా కడుగుతుంటారు .అది చాలా తప్పు అక్కడ వుండే మేలు చేసే మంచి బాక్టీరియా చచ్చిపోతుంది ..దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ లు వస్తాయి .అందుకే మామూలు సబ్బులు హమామ్...నెంబర్1 ..రెక్సోనా.. లాంటి సోప్ తో ఒక్కసారి ఉదయం... సాయంత్రం ఒక్కసారి శుభ్రం చేసుకుని చేతులు శుభ్రం గా కడుక్కుంటే చాలు. లేదా మాటి ..మాటికి కడుక్కునే అలవాటు ఉన్నవారు మామూలు నీటితో శుభ్రం చేసుకుంటూ చేతులు హ్యాండ్ వాష్ తో కడుక్కోవచ్చు .అలానే కొంతమంది ఆయుర్వేద నిపుణులు చెప్పినట్లు ఉసిరికాయ ల పొడి ( కాయలుగింజలుమొత్తం)కొద్దిసేపు నీటిలో నానబెట్టి ఆ నీటి తో రోజుకు రెండు సార్లు స్త్రీలు వారి రహస్యాంగాన్ని కడుక్కోవాలి ..దానివల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్లు పోతాయి ..పైగా లూజు గా సాగి బాధ పడుతున్నవాళ్లకు కూడా కొద్దిరోజులు చేస్తే బిగుతుగా దగ్గరకి వస్తుంది.ఉసిరికాయ పొడి ఆయుర్వేద షాప్ లో లభిస్తుంది .అస్సలు రావడానికి చాలా కారణాలు వున్నాయి. శుభ్రమైన అందరవేర్ స్ ధరించకపోవడం , ఒకరు వాడినవి ఇంకొకరు వాడటం ,టాయిలెట్స్ శుభ్రంగా వు 0చుకోకపోవడం , కొన్నిరకాల రోగాలకు కొన్ని మందులు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇలా ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది.. ఇంకా అంతా బావున్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకొక్కసారి ఇన్ఫెక్షన్లు వస్తూవుంటాయు.

ఇక దానికి కారణం మనశరీరం లోపల అనేక జీవ క్రియలు జరుగుతుంటాయి .అనగా జీర్ణక్రియ, పెరుగుదల ,శ్వాసక్రియ ,
రక్తప్రసరణ ,హార్మోన్ స్ విడుదల ,మొత్తం లోపల జరిగే యంత్రం లా విధులు జరుగుతూనే ఉంటాయి .అదిగో వాటివల్ల కొన్ని విసర్జకాలు ,పనికిరాని టాక్సిన్స్ విడుదల అవుతూ పల్స్ సెల్స్ అంటారు ..అవే ఇన్ఫెక్షన్లు గా మూత్రం లోకి వస్తాయి.
దానివల్ల దురద,నురుగు మూత్రంలో కనిపిస్తూ ఉంటాయి.కొంతమందికి అజీర్ణం వల్ల ,కొంతమందికి కిడ్నీ పనితీరు లో అసమతుల్యం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.ఇంకా ముఖ్యంగా లైఫ్ పార్టనర్ లో ఒకరికి వున్నా ఇంకొకరికి వస్తాయి .అందుకే కొన్నిసార్లు భార్యాభర్తలిద్దరకీ కూడా వైద్యులు టెస్ట్ లు చేయిస్తూ ఉంటారు ..అలానే పైన చెప్పుకున్నాము కదా కొన్ని మందులవల్ల అని ముఖ్యంగా కొలెస్ట్రాల్.. ట్రిగ్లిజరైస్ ..లాంటి కంట్రోల్ కి ఇచ్చిన వాటి మందుల
వల్ల కూడా మూత్రం నురుగు వస్తుంది .చెడు..కొలెస్ట్రాల్ బైటకు ..వెళ్లిపోతుండటం దానికి కారణం ..అప్పుడు కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తూవుంటాయు. ఇక షుగర్,బీపీ ఉన్నవాళ్లకు మధ్య ..మధ్య ఇన్ఫెక్షన్లు మూత్రంలో వస్తూనే ఉంటాయి. అందుకే ..అపుడపుడు..ఒకసారి టెస్ట్ చేయించు కొంటూ ఉండాలి .....ఇలా ఇన్ఫెక్షన్ ఎక్కువగా వున్నప్పుడు
అబ్రూమెన్ ..బైటకు పోతుంటుంది అది మామూలు విషయమే ఆలాంటప్పుడు ఇన్ఫెక్షన్ ని తగ్గించేసుకుంటే తరువాత వచ్చే వ్యాధులు రాకుండా ,కొంచెం వచ్చినా ముదరకుండా వుంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధివారు ఖచ్చితంగా షుగర్ ని అదుపులో ఉంచుకోవాలి .బి.పి కూడా అదుపులో ఉంచుకోవాలి ..జననాంగాలు స్త్రీలు.. ఆయునా పురుషులు ఆయునా శుభ్రంగా ఉంచు కోవాలి .పూర్వ కాలంలో ఆడ ఆయునా మగ అయినా కూడా యూరిన్ పాస్ చేయటానికి వెళ్ళేటప్పుడు చెంబుతో నీరు తీసుకొనివెళ్ళీ మూత్రం తరువాత శుభ్రం చేసుకుని వచ్చేవాళ్ళు . ఏది ఏమైనా శుభ్రం గా ఉంచుకోవడం ముఖ్యం అలానే తెలియని ,రద్దీ కల బాత్రూమ్ లోకి అంటే బస్టా0డ్ లాంటి ప్రదేశాలలో కి వెళ్ళినప్పుడు ముందుగా నీళ్ళు కొట్టి ..పనిచేసుకొని తరువాత కూడా నీరు కొట్టి రావడం ఉత్తమం ...ఇక ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నవారు ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకోవడం ..బార్లీ నీరు ..అంటే బార్లీ గింజలు లేదా మిక్సీ పట్టిన ఆ బార్లీ పొడి జావ కాచుకుని త్రాగడం ..పలుచని మజ్జిగ ,పుచ్చకాయరసం లాంటివి తీసుకోవడం ..అలానే తగ్గేంత వరకు అంటే కొంతకాలం పులుపు ..కారం ..ఉప్పు ..బాగా తగ్గించి తినాలి ...సహజంగా ఆయుర్వేదంలో ..చంద్రప్రభావటి. మాత్రలు ఉదయం..1 ..రాత్రి...1 , అలానే గోక్షురాది గుగ్గులు మాత్రలు కూడా ఉదయం..1 ..రాత్రి..1 ..వాడాలి చంద నాసవ ద్రావకం నాలుగు చంచాలు ..దానికి సమానం గా నీళ్ళు కలిపి రోజూ రెండుపూటలా త్రాగాలి .సి విటమిన్ గలవి జామ కాయ లాంటివి తినాలి ..ఇలా ఒక నెల వాడితే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ..యూరిన్ ఇన్ఫెక్షన్ ఏవైనా పోతాయి .ఈ మందులు ..ఆడ ..మగ ...షుగర్ వాళ్ళు అయినా, బి.పి ..వాళ్ళు అయినా వాడవచ్చు ..సైడ్ఎఫెట్ లేని మందులు అవి .
ఇక మూత్రం లో మంట కొద్దిగా వస్తూవుంటే ..బాడీ లో వేడి ఎక్కువ అయినప్పుడు అలా వస్తుంది .అందుకే కొంచెము నిమ్మకాయ షేర్బాత్ కానీ కొద్దిగా పంచదార కలిపిన నీళ్లు కాని ..కొబ్బరి నీళ్లు కానీ త్రాగితే మూత్రం లో మంట పోతుంది .అయితే షుగర్ వాళ్లకు మాత్రం ఒక్క కొబ్బరి నీళ్లే తీసుకోవాలి ..లేదా కొద్దీ పెరుగు లో కొంచెం పంచదార చల్లుకుని కలిపి తింటే కూడా మంట తగ్గిపోతుంది .
అరచెమ్చా అతిమధురం పొడి,మరియు అరచంచా జీలకర్ర పొడి అరచంచా తాటికలకండ ,,పావు చెంచా నెయ్యి మొత్తం లో నీళ్లు కొంచెం కలిపి కషాయం కాచి. చల్లారిన తరువాత త్రాగితే కూడా ..మూత్రంలో మంట గా చుక్కలు చుక్కల గా వచ్చి భగ్గుమనే మంట పోతాయి .....ఇదే కషాయం లో కొద్దిగా పాలు కలుపుకొని త్రాగితే కూడా మంచిదే ..ఈ కషాయం షుగర్ రోగులకు చాలా మంచిది .రక్తం లో చక్కెర ను కూడా .కరిగిస్తుంది . ఇంకా ఈ కషాయం అల్సర్ తో బాధ పడే వాళ్లకు
ఛాతిలో వచ్చే మంట ,మూత్ర పిండాలలో ఇన్ఫెక్షన్లు కు కూడా చాలా మంచిది .
అతిమధురం పొడి పావు చెంచా 1గ్లాసు మజ్జిగ లో కలుపుకొని త్రాగితే ఎండ వేడిమి వల్ల వచ్చే కళ్ళ మంటలు ,శరీరం లో కలిగిన వేడి తగ్గిపోతాయి.. ఇందు లో ఆస్త్రీజాసన్ అనే కెమికల్ ఉంటుంది ఇది శరీరం లో ఈ స్ట్రోజెన్ ను బాగా పని చేయిస్తుంది రోజుకు 4 గ్రాముల పొడి లోపలికి తీసుకుంటే ఆడవారిలో ఋతుక్రమాన్ని సరిగా జరిగెటట్లు గా ప్రోత్సహిస్తుంది .స్త్రీలకు మూత్రంలో మ0ట ,ఇన్ఫెక్షన్లు ,స్త్రీ సమస్యలు ను నివారిస్తుంది .రక్తపోటు ను తగ్గించి ..ఉత్సాహం ని ఇస్తుంది... ఇలా ఇంకా చాలా చెప్పవచ్చు ఆయుర్వేదంలో .ఇంకా ఆయుర్వేదం లో ఏదైనా ఒక మూలిక ఒక రోగానికే పరిమితం అని చెప్పలేము .ఒక రోగానికి ఇచ్చిన మందు ఇంకా అనేక రకాల సమస్యలకు కూడా మంచి మందు అవుతూ ఉంటుంది ..............అందుకే ఇది సహజమైంది ఆయుషు పెంచే వేదం కాబట్టి ఆయిర్వేదం అయ్యింది అని తెలుసుకోగలరు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online