Pages

Some names of Lord Surya narayana for good health

☀️🙏ఓం ఆదిత్యాయ నమః🙏🌞

మాఘమాసం రోజూ ఉదయం ఈ 70 నామాలు చదివి సూర్యుడు కి నమస్కారం చేయండి, ఈ మాఘమాసం సూర్యుని ఉపాసనా చాలా విశేష ఫలితం ఇస్తుంది.

సూర్యుడు ప్రత్యక్షంగా ఉన్న దైవం, ధూరంగా ఉన్న దంపతులు దగ్గర కావాలి అన్నా, మంచి ఆరోగ్యం కావాలి అన్నా, ట్రాన్సఫర్ కావాలి, ప్రమోషన్ రావాలి అన్నా ఉదయం స్నానం చేశాక సూర్యుడు ఎదురుగా నిలబడి భక్తిగా ఈ 70 నామాలు చదివి నమస్కారం చేయాలి...........

ఓం హంసాయ నమః
ఓం భానవే నమః
ఓం సహశ్రాంశవే నమః
ఓం తపనాయ నమః
ఓం తాపనాయ నమః
ఓం రవయే నమః
ఓం వికర్తనాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం విశ్వ కర్మణే నమః
ఓం విభావసవే నమః
ఓం విశ్వ రూపాయ నమః
ఓం విశ్వ కర్త్రే నమః
ఓం మార్తాండాయ నమః
ఓం మిహిరాయ నమః
ఓం అంశు మతే నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం ఉష్ణగవే నమః
ఓం సూర్యాయ నమః
ఓం ఆర్యంణే నమః
ఓం బ్రద్నాయ నమః
ఓం దివాకరాయ నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం సప్తహయాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం అహస్కరాయ నమః
ఓం ఖగాయ నమః
ఓం సూరాయ నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం లోక చక్షుషే నమః
ఓం గ్రహేస్వరాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం లోక సాక్షిణే నమః
ఓం తమోరయే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శుచయే నమః
ఓం గభస్తి హస్తాయ నమః
ఓం తీవ్రాంశయే నమః
ఓం తరణయే నమః
ఓం సుమహసే నమః
ఓం అరణయే నమః
ఓం ద్యుమణయే నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం అర్కాయ నమః
ఓం భానుమతే నమః
ఓం భయ నాశనాయ నమః
ఓం చందోశ్వాయ నమః
ఓం వేద వేద్యాయ నమః
ఓం భాస్వతే నమః
ఓం పూష్ణే నమః
ఓం వృషా కపయే నమః
ఓం ఏక చక్ర ధరాయ నమః
ఓం మిత్రాయ నమః
ఓం మందేహారయే నమః
ఓం తమిస్రఘ్నే నమః
ఓం దైత్యఘ్నే నమః
ఓం పాప హర్త్రే నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మ ప్రకాశకాయ నమః
ఓం హేలికాయ నమః
ఓం చిత్ర భానవే నమః
ఓం కలిఘ్నాయ నమః
ఓం తాక్ష్య వాహనాయ నమః
ఓం దిక్పతయే నమః
ఓం పద్మినీ నాధాయ నమః
ఓం కుశేశయ నమః
ఓం హరయే నమః
ఓం ఘర్మ రశ్మయే నమః
దుర్నిరీక్ష్యాయ నమః
ఓం చండాశవే నమః
ఓం కశ్యపాత్మజాయ నమః.........

ఇలా చదివి నమస్కారం చేసాక ms రామారావు గారు పాడిన సుందరకాండ పారాయనఁ రోజూ ఉదయం వినాలి...మీరు సూర్యుని కి నమస్కారం చేసే ముందు సుందరకాండ పారాయణ వినడానికి ముందు మీ కోరిక భక్తిగా మనసులోనే సంకల్పము చెప్పుకోవాలి..ఇలా ప్రతి రోజూ చేస్తుంటే.. మీ సంకల్పము నెరవేరుతుంది.

Sweet Gems for a Happy Life


Urine infections in men and women - Some remedies Part - 3

 


ఆడ--మగవారిలోయూరిన్ ఇన్ఫెక్షన్.. నివారణ --  part - 3



 ఇందులో వ్రాసిన చాలా విషయాలు మగవారి లోని ఇన్ఫెక్షన్. పోగొట్టుకోవడానికి పనికివస్తాయని గమనించగలరు .  ఆడ... మగ ఇద్దరిలో ని యూరినల్ సమస్యలు కు పరిష్కారాలు అని తెలుసుకోగలరు
సహజంగా ఆడవారిలో కూడాయూరినల్ ఇన్ఫెక్షన్ అనగానే ..ఎక్కువసార్లు యూరిన్ కి వెళ్ళాల్సి రావడం .మంట..దురద యూరిన్ స్మెల్ లాంటివి ఉంటూ ఉంటాయి .ఒక్కోక్కసారి నురుగు ..కూడా ఉంటుంది .రకరకాల కారణాలు ఉంటాయి .ముందు గా విటమిన్ లోపం కారణంగా నురుగు .ఇన్ఫెక్షన్ వస్తుంది.అందుకే వైద్యులు విటమిన్ సి గల టానిక్ ఇస్తూఉంటారు దానిపేరు citralka(Disodium Hydrogen citrate syrup ) అనే సిరప్ ఇస్తూఉంటారు .దానిని 3మూతలు సిరప్ దానికి సమాన భాగాలుగా వాటర్ కల్పి తీసుకోవచ్చు .ఏదైనా తిన్నతారువాత..ఇక కొంతమంది చూయుంగ్ సి టాబ్లెట్ చప్పరిస్తూ ఉంటారు .అవి కూడా మెడికల్ షాప్ లో దొరుకుతాయి. అయితే ఎక్కువ సిరప్ మాత్రమే ఇస్తారు వైద్యులు .అలానే ఒక టాబ్లెట్ యాంటీబైయోటిక్ కూడా వ్రాస్తూ ఉంటారు .అది ...redicate200mg కూడా మంచిదే ..షుగర్ వాళ్ళ కు వ్రాస్తూఉంటారు ..జెనరల్ గా అందరూ వాడవచ్చు ఓ పది టాబ్లెట్స్ ఇచ్చి ఉదయం ..సాయంత్రం ఒక 5 రోజులు వాడించి మానిపిస్తారు ఇక ఆడవారిలో ఎక్కువ బాధ కలిగించే ది ..తెల్లబట్ట ( white discharge) దీనివల్ల దురద ..ఫంగస్.. లాంటివి చెడు వాసనలు కూడా వచ్చి ఇబ్బంది పడుతుంటారు .సహజంగా ఇది ఈస్ట్ అనే బాక్టీరియా ఎక్కువ పుల్లని తత్త్వం గల ఓ పదార్ధాన్ని తయారుచేసి అక్కడ బ్రతుకుతుంటాయు ....ఈ ఇన్ఫెక్షన్. తో బాధపడుతున్నప్పుడు.అందుకే వైద్యులు ముఖ్యంగా ఆయిర్వేదం లో ..పులుపు ,కారం మసాలాలు తగ్గించి భోజనం చేయమని చెబుతారు .

కొంతమంది తెలీయక శుభ్రత అతిగా పాటించడం వల్ల కూడా బాధలు తెచ్చుకుంటారు ఉదాహరణకు ఎక్కువ డెట్టా ల్ లాంటి పవర్ఫుల్ సబ్బులతో పదే పదే జననాంగాలను శుభ్రం గా కడుగుతుంటారు .అది చాలా తప్పు అక్కడ వుండే మేలు చేసే మంచి బాక్టీరియా చచ్చిపోతుంది ..దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ లు వస్తాయి .అందుకే మామూలు సబ్బులు హమామ్...నెంబర్1 ..రెక్సోనా.. లాంటి సోప్ తో ఒక్కసారి ఉదయం... సాయంత్రం ఒక్కసారి శుభ్రం చేసుకుని చేతులు శుభ్రం గా కడుక్కుంటే చాలు. లేదా మాటి ..మాటికి కడుక్కునే అలవాటు ఉన్నవారు మామూలు నీటితో శుభ్రం చేసుకుంటూ చేతులు హ్యాండ్ వాష్ తో కడుక్కోవచ్చు .అలానే కొంతమంది ఆయుర్వేద నిపుణులు చెప్పినట్లు ఉసిరికాయ ల పొడి ( కాయలుగింజలుమొత్తం)కొద్దిసేపు నీటిలో నానబెట్టి ఆ నీటి తో రోజుకు రెండు సార్లు స్త్రీలు వారి రహస్యాంగాన్ని కడుక్కోవాలి ..దానివల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్లు పోతాయి ..పైగా లూజు గా సాగి బాధ పడుతున్నవాళ్లకు కూడా కొద్దిరోజులు చేస్తే బిగుతుగా దగ్గరకి వస్తుంది.ఉసిరికాయ పొడి ఆయుర్వేద షాప్ లో లభిస్తుంది .అస్సలు రావడానికి చాలా కారణాలు వున్నాయి. శుభ్రమైన అందరవేర్ స్ ధరించకపోవడం , ఒకరు వాడినవి ఇంకొకరు వాడటం ,టాయిలెట్స్ శుభ్రంగా వు 0చుకోకపోవడం , కొన్నిరకాల రోగాలకు కొన్ని మందులు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇలా ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది.. ఇంకా అంతా బావున్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకొక్కసారి ఇన్ఫెక్షన్లు వస్తూవుంటాయు.

ఇక దానికి కారణం మనశరీరం లోపల అనేక జీవ క్రియలు జరుగుతుంటాయి .అనగా జీర్ణక్రియ, పెరుగుదల ,శ్వాసక్రియ ,
రక్తప్రసరణ ,హార్మోన్ స్ విడుదల ,మొత్తం లోపల జరిగే యంత్రం లా విధులు జరుగుతూనే ఉంటాయి .అదిగో వాటివల్ల కొన్ని విసర్జకాలు ,పనికిరాని టాక్సిన్స్ విడుదల అవుతూ పల్స్ సెల్స్ అంటారు ..అవే ఇన్ఫెక్షన్లు గా మూత్రం లోకి వస్తాయి.
దానివల్ల దురద,నురుగు మూత్రంలో కనిపిస్తూ ఉంటాయి.కొంతమందికి అజీర్ణం వల్ల ,కొంతమందికి కిడ్నీ పనితీరు లో అసమతుల్యం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.ఇంకా ముఖ్యంగా లైఫ్ పార్టనర్ లో ఒకరికి వున్నా ఇంకొకరికి వస్తాయి .అందుకే కొన్నిసార్లు భార్యాభర్తలిద్దరకీ కూడా వైద్యులు టెస్ట్ లు చేయిస్తూ ఉంటారు ..అలానే పైన చెప్పుకున్నాము కదా కొన్ని మందులవల్ల అని ముఖ్యంగా కొలెస్ట్రాల్.. ట్రిగ్లిజరైస్ ..లాంటి కంట్రోల్ కి ఇచ్చిన వాటి మందుల
వల్ల కూడా మూత్రం నురుగు వస్తుంది .చెడు..కొలెస్ట్రాల్ బైటకు ..వెళ్లిపోతుండటం దానికి కారణం ..అప్పుడు కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తూవుంటాయు. ఇక షుగర్,బీపీ ఉన్నవాళ్లకు మధ్య ..మధ్య ఇన్ఫెక్షన్లు మూత్రంలో వస్తూనే ఉంటాయి. అందుకే ..అపుడపుడు..ఒకసారి టెస్ట్ చేయించు కొంటూ ఉండాలి .....ఇలా ఇన్ఫెక్షన్ ఎక్కువగా వున్నప్పుడు
అబ్రూమెన్ ..బైటకు పోతుంటుంది అది మామూలు విషయమే ఆలాంటప్పుడు ఇన్ఫెక్షన్ ని తగ్గించేసుకుంటే తరువాత వచ్చే వ్యాధులు రాకుండా ,కొంచెం వచ్చినా ముదరకుండా వుంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధివారు ఖచ్చితంగా షుగర్ ని అదుపులో ఉంచుకోవాలి .బి.పి కూడా అదుపులో ఉంచుకోవాలి ..జననాంగాలు స్త్రీలు.. ఆయునా పురుషులు ఆయునా శుభ్రంగా ఉంచు కోవాలి .పూర్వ కాలంలో ఆడ ఆయునా మగ అయినా కూడా యూరిన్ పాస్ చేయటానికి వెళ్ళేటప్పుడు చెంబుతో నీరు తీసుకొనివెళ్ళీ మూత్రం తరువాత శుభ్రం చేసుకుని వచ్చేవాళ్ళు . ఏది ఏమైనా శుభ్రం గా ఉంచుకోవడం ముఖ్యం అలానే తెలియని ,రద్దీ కల బాత్రూమ్ లోకి అంటే బస్టా0డ్ లాంటి ప్రదేశాలలో కి వెళ్ళినప్పుడు ముందుగా నీళ్ళు కొట్టి ..పనిచేసుకొని తరువాత కూడా నీరు కొట్టి రావడం ఉత్తమం ...ఇక ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నవారు ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకోవడం ..బార్లీ నీరు ..అంటే బార్లీ గింజలు లేదా మిక్సీ పట్టిన ఆ బార్లీ పొడి జావ కాచుకుని త్రాగడం ..పలుచని మజ్జిగ ,పుచ్చకాయరసం లాంటివి తీసుకోవడం ..అలానే తగ్గేంత వరకు అంటే కొంతకాలం పులుపు ..కారం ..ఉప్పు ..బాగా తగ్గించి తినాలి ...సహజంగా ఆయుర్వేదంలో ..చంద్రప్రభావటి. మాత్రలు ఉదయం..1 ..రాత్రి...1 , అలానే గోక్షురాది గుగ్గులు మాత్రలు కూడా ఉదయం..1 ..రాత్రి..1 ..వాడాలి చంద నాసవ ద్రావకం నాలుగు చంచాలు ..దానికి సమానం గా నీళ్ళు కలిపి రోజూ రెండుపూటలా త్రాగాలి .సి విటమిన్ గలవి జామ కాయ లాంటివి తినాలి ..ఇలా ఒక నెల వాడితే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ..యూరిన్ ఇన్ఫెక్షన్ ఏవైనా పోతాయి .ఈ మందులు ..ఆడ ..మగ ...షుగర్ వాళ్ళు అయినా, బి.పి ..వాళ్ళు అయినా వాడవచ్చు ..సైడ్ఎఫెట్ లేని మందులు అవి .
ఇక మూత్రం లో మంట కొద్దిగా వస్తూవుంటే ..బాడీ లో వేడి ఎక్కువ అయినప్పుడు అలా వస్తుంది .అందుకే కొంచెము నిమ్మకాయ షేర్బాత్ కానీ కొద్దిగా పంచదార కలిపిన నీళ్లు కాని ..కొబ్బరి నీళ్లు కానీ త్రాగితే మూత్రం లో మంట పోతుంది .అయితే షుగర్ వాళ్లకు మాత్రం ఒక్క కొబ్బరి నీళ్లే తీసుకోవాలి ..లేదా కొద్దీ పెరుగు లో కొంచెం పంచదార చల్లుకుని కలిపి తింటే కూడా మంట తగ్గిపోతుంది .
అరచెమ్చా అతిమధురం పొడి,మరియు అరచంచా జీలకర్ర పొడి అరచంచా తాటికలకండ ,,పావు చెంచా నెయ్యి మొత్తం లో నీళ్లు కొంచెం కలిపి కషాయం కాచి. చల్లారిన తరువాత త్రాగితే కూడా ..మూత్రంలో మంట గా చుక్కలు చుక్కల గా వచ్చి భగ్గుమనే మంట పోతాయి .....ఇదే కషాయం లో కొద్దిగా పాలు కలుపుకొని త్రాగితే కూడా మంచిదే ..ఈ కషాయం షుగర్ రోగులకు చాలా మంచిది .రక్తం లో చక్కెర ను కూడా .కరిగిస్తుంది . ఇంకా ఈ కషాయం అల్సర్ తో బాధ పడే వాళ్లకు
ఛాతిలో వచ్చే మంట ,మూత్ర పిండాలలో ఇన్ఫెక్షన్లు కు కూడా చాలా మంచిది .
అతిమధురం పొడి పావు చెంచా 1గ్లాసు మజ్జిగ లో కలుపుకొని త్రాగితే ఎండ వేడిమి వల్ల వచ్చే కళ్ళ మంటలు ,శరీరం లో కలిగిన వేడి తగ్గిపోతాయి.. ఇందు లో ఆస్త్రీజాసన్ అనే కెమికల్ ఉంటుంది ఇది శరీరం లో ఈ స్ట్రోజెన్ ను బాగా పని చేయిస్తుంది రోజుకు 4 గ్రాముల పొడి లోపలికి తీసుకుంటే ఆడవారిలో ఋతుక్రమాన్ని సరిగా జరిగెటట్లు గా ప్రోత్సహిస్తుంది .స్త్రీలకు మూత్రంలో మ0ట ,ఇన్ఫెక్షన్లు ,స్త్రీ సమస్యలు ను నివారిస్తుంది .రక్తపోటు ను తగ్గించి ..ఉత్సాహం ని ఇస్తుంది... ఇలా ఇంకా చాలా చెప్పవచ్చు ఆయుర్వేదంలో .ఇంకా ఆయుర్వేదం లో ఏదైనా ఒక మూలిక ఒక రోగానికే పరిమితం అని చెప్పలేము .ఒక రోగానికి ఇచ్చిన మందు ఇంకా అనేక రకాల సమస్యలకు కూడా మంచి మందు అవుతూ ఉంటుంది ..............అందుకే ఇది సహజమైంది ఆయుషు పెంచే వేదం కాబట్టి ఆయిర్వేదం అయ్యింది అని తెలుసుకోగలరు.

Some herbs help in fighting pollution

  

Recently those living in Delhi and surrounding areas are living under the terrible burden of the toxic air enveloping their lungs as well as day-to-day life in general. The air quality index calls it hazardous, with some apps even calling it the worst we have ever seen - an ‘apocalypse’ of sorts. So what do we do, apart from panicking? Apart from limiting your exposure to the hazardous outdoor air and installing home air purifiers, there are some Ayurveda backed ways that you can prepare your body to fight air pollution hazards.

Some Ayurveda  herbs that will help you combat the ill effects of air pollution.

Amla

The Vitamin C present in Amla is a powerful anti-oxidant which helps build resistance against air pollutants. Not only does Vitamin C provide essential shields from hazardous environments, it also helps in regenerating the Vitamin E levels in our bloodstream. With the degrading air quality, it is important to be thoughtful towards building our immunity to be stable and strong, and Amla helps boost immunity naturally. Ripe, golden yellow Amlas are much more nutritious and rich in vitamins as compared to the normally used raw, green Amlas. Therefore, when choosing an Amla product, make sure you check this.

Tulsi and Giloy

The wondrous benefits of Tulsi are not unknown, however, Giloy is a relatively lesser known ingredient, effective nonetheless. This fortifying combination is an effective anti-allergen that helps look after the ailments arising due to the air pollution. Not only does Tulsi protect our respiratory tract but its anti-inflammatory and anti-bacterial properties help minimise the effect of air pollution on the environment as well.
A combination of these two herbs helps protect the internal organs and tissues against the chemical stress of industrial pollution. A shot of this juice twice a day is good for boosting immunity and overall well being.

Turmeric and Aloe vera

Turmeric or Haldi has been used since the beginning of time as an all-round tonic for almost every health ailment, be it open wounds or common colds. It wins as a superherb to combat all pollution related hazards. Turmeric helps ward off the toxic effects of inhaling polluted air and therefore, is a great choice if looking to cleanse your respiratory tract. Consuming a drink with a mixture of turmeric with another fortifying herb like Aloe Vera is the natural answer you must seek in this polluted environment.

A mixture of two potent herbs, a shot of this combination drink in the morning would help neutralize the harmful effects of the smog that is weighing you down


Vaikunta Ekadasi

🌸ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత ఏమిటి..?🌸

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే 'హరివాసరమ'ని, 'హరిదినమ'ని, 'వైకుంఠ దినమ'ని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం.

 దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును.

 ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.

ఇక ఈ ఆచారాలు ఏమీ చేయలేని వారు ,సమయం లేనివారు ,వృద్ధులు వీరు ఎవరైనా సరే ఓం నమో నారాయణాయ అనే జపం చేసుకోవచ్చు .. శ్రీమన్నారాయణుడి ఫోటో పై ఒక్క నిమిషం మనస్సు అనే తెరపై కళ్ళు మూసుకొని ..మ నస్సు లో కూడా ధ్యానం చేసుకోవచ్చు ..మనస్సు పెట్టకుండా ఆడంబరత్త్వం కాదు ..స్వామి పై భక్తి తో ఒక్క నిమిషం ధ్యానించినా చాలు .శ్రీరాములు వారో ,శ్రీకృష్ణభగవానుడో ..నరసింహస్వామివారో ,హైయగ్రీవుడో...ఏదో ఒక రూపం తో ధ్యానం చేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్లగలిగితే ..ఇంకా మంచిది అక్కడ కూర్చొని కూడా స్వామిరూపాన్ని మనసులోకి తెచ్చుకొని కొద్దిసేపు ధ్యానం చేసినా చాలు .,విష్ణుసహస్రనామాలు వింటూ ఒక్కోక్క పువ్వు లేక తులసీ దళం స్వామి వారి ఫోటో పై వేస్తూ ..చివరలో ఒక పండు లేక ఒక బెల్లం ముక్క స్వామికి అర్పించి ..హారతి ఇవ్వండి చాలు .


.ఏదో ఒక రకంగా భగవంతుని కి దగ్గరగా ,భగవంతుని తో ,ఉన్నాము అనే భావన ఈ పవిత్రమైన పండుగల పరమార్ధం ..ఏమి గుర్తుకు రాకపోతే ఓం నమో వేం కటేశాయా..అని జపం చేసుకోవచ్చు.. గోవిందనామాలు చదువుకోవచ్చు ,శ్రీమద్ భాగవతం పద్యాలు లు చదువుకొని కూడా ఆ శ్రీ మహా విష్ణువును తలుచుకొని ఆనందా మృతం లో మునగవచ్చు ......ఇక జాగారాలు ...ఉపవాసాలు ..ఏకాగ్రత కోసం ఏర్పాటు చేయబడినవి .ఎవరికి ఎంత ఓపిక ,శక్తీ   ఉంటే దానిని బట్టి ఎంతైనా చేసుకోవచ్చు ..

An interesting thing about Coffee


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online